నేపాల్ యాత్రా విశేషాలు Part 2 (నేపాల్ బోర్డర్ నుండి పోఖరా వరకు)
Day 3 - బోర్డర్ నుండి పోఖరా ప్రయాణం
తెల్లవారాక 6.00 లకి బస్సు వచ్చి మా హోటల్ ముందు నిలిచింది. అందరం మా లగేజీ తీసుకొని స్నానాలు ముగించి, టిఫిన్ తిని, మన ఇండియా కరెన్సీని - నేపాలి కరెన్సీ లోకి మార్చుకున్నాము. మన మనీ 1,000 ఇస్తే, వాళ్ళ మనీ 1,600 ఇచ్చారు. అక్కడ ఎండ, వేడి తక్కువే ఉన్నాయి, కానీ చెమటలు ఎక్కువగా ఉన్నాయి. 11 గంటలకి బస్సులో అందరం పోఖరాకి బయలుదేరాం. నేపాల్ దేశం అంతా కొండలమయమే.
అక్కడ రోడ్డులన్ని ఘాట్ రోడ్డులే. దారి అంతా పచ్చని కొండలు, గుట్టలు, పెద్దపెద్ద పర్వతాలు, లోయలు చూడటానికి మనస్సుకి చాలా ఆహ్లాదంగా అనిపించింది.
పోఖరా చేరేసరికి రాత్రి 7.45 అయ్యింది. అంతవరకూ బస్సులో మా ప్రయాణం సాగుతూనే ఉంది. మధ్యలో బస్సుని 2సార్లు ఆపి, కాఫీ, టిఫిన్లు, భోజనాలు చేసాము. నేపాలులో ఎక్కడా కూడా బియ్యం దొరకవని తెలిసే, మా గ్రూపులో ఇద్దరు Electrical Rice Cooker & 1 rise bag తీసుకువచ్చారు, కొంతమంది ఊరగాయలు తెచ్చారు. ఉదయాన్నే హోటల్ రూములో కుక్కర్లో అన్నం వండి తెచ్చుకోవటంతో ఆ మధ్యాహ్నం అందరూ ఊరగాయలతోనే పచ్చని చెట్ల మధ్య వనభోజనాలు చేసాం. రాత్రికి పోఖరాలో హోటల్ లో నిద్రచేసాము. పోఖరాలో కూడా వాతావరణం చాలా వేడిగానే ఉంది.
No comments:
Post a Comment