October 8, 2015

విజయనగరం పైడితల్లమ్మ

విజయనగరంలో వెలసిన పైడితల్లమ్మ అమ్మవారి కోవెల 


ఈనెల(అక్టోబర్) 8వ తేదీన నేను, మా స్నేహితురాలు హేమమాలిని కలిసి విజయనగరంలో ఉన్న కొన్ని ముఖ్య ప్రదేశాలు చూసి వద్దామని వెళ్ళాము. అక్కడ మేము చూసినవి - పైడితల్లమ్మవారి కోవెల, గురజాడ అప్పారావుగారి స్వగృహం, కోట, కోటలో ఉన్న స్కూల్స్ & కాలేజీలు, సంగీత కళాశాల చూసి హేమమాలినిగారి అక్కయ్య భాగ్యశ్రీ (ప్రముఖ కథా రచయిత) గారి ఇంటికి వెళ్ళి, ఒక కప్పు జున్ను తిని, కొన్ని కబుర్లు చెప్పుకొని ఇంటికి తిరిగివచ్చాం. 
            
విజయనగరం బస్సుస్టాండ్ లేదా రైల్వేస్టేషన్ వద్ద దిగి, ఆటో ఐనా, రిక్షా ఐనా ఎక్కి మూడు లాంతర్లు జంక్షన్ వద్ద దిగి ఎడమచేతి వైపు వెళితే పైడితల్లమ్మవారి కోవెల ఉంటుంది. 

పైడితల్లమ్మ కోవెల ముఖద్వారం, గాలిగోపురం  


కోవెల ఎదురుగా ఉన్న సిరిమాను ఉత్సవ ఆహ్వానపత్రిక(Banner)  

పైడితల్లమ్మ కోవెలలో ఉన్న అమ్మవారి మూలవిగ్రహం 




క్రిందటి సంవత్సరం సిరిమాను ఉత్సవం చిత్రాలు 




No comments:

Post a Comment