August 17, 2013

కనకధారా స్తోత్రం .......... శ్రీ ఆదిశంకరాచార్య విరచితము

కనకధారా స్తోత్రం .......... శ్రీ ఆదిశంకరాచార్య విరచితము




అంగం హరేః పులక భూషణ మాశ్రయన్తీ బృంగాంగనేవ ముఖళాభరణం తమాలమ్! అంగీకృతాఖిల విభూతి రసంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః !!

మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ (చెట్టు) ను ఆడుతుమ్మెద వలె గగుర్పాటుతో ఉన్న విష్ణుదేవుని నాశ్రయించినదియు, సకలైశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి నాకు శుభములను ఇచ్చుగాక.  

ముగ్దా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్ర పాప్రిణి హితాని గతా గతాని !
మాలాదృశోర్మధు కరీవ మహోత్ప లేయా సామే శ్రియం దిశతు సాగర సంభావా యాః !!

పెద్ద నల్లకలువపై నుండు ఆడు తుమ్మెద వలె శ్రీహరి ముఖమునందు ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్నఆ లక్ష్మీదేవి దృష్టి  నాకు సంపదను ప్రసాదించుగాక.  

3
విశ్వా మరేంద్ర పదవిభ్రమదానదక్ష మానంద హేతురదికం మురవిద్విషోపి. ఈషన్నీషీదతుమయి క్షణ మీక్షణార్థ మిందీవరోదర సహోదర మిందియా యాః !!

సకల దేవేంద్ర పదవి నీయగలదియు, విష్ణువు సంతోషమునకు కారణమైనదియు, నల్లకలువలను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము క్షణకాలం నాపై నిలిచియుండును గాక. 

4
అమీలితాక్ష మధిగ్యమ ముదా ముకుంద మానంద కంద మనిషేష మనంగ తంత్రం!
అకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవన్మమ భుజంగ శయాంగనాయాః !!

మూసికొన్న కన్నులు గలవాడును, ఆనందమునకు కారణభూతుడయిన మురారిని సంతోషముతో గూడుటచే, ఱెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, ఱెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి దృష్టి  నాకు సంపద నొసంగునుగాక. 

5
బాహ్వంతరే మధుజితశ్శ్రిత కౌస్తు భేయా హారావళీవ మరి నిలమయీ విభాతి !
కామ ప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణ మావహతుమే కమలాల యామాః !!

మణిగల శ్రీహరిని వక్షస్థలమందలి నీలమణి కౌస్తుభము హారములాగ ప్రకాశించునదియు, భగవంతునికే కోర్కెలను ఇచ్చునట్టిదియు  అగు లక్ష్మీదేవి యొక్క కటాక్ష పరంపర నాకు శుభమును చేకూర్చుగాక.  

6
కాలాంబు దాళి లలితో రసి కైటభారేః ర్దారాధరే స్ఫురతి యా తటిదంగనేవ !
మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః !!

కారుమబ్బులయందు మెరుపుతీగవలె, మేఘశ్యాముడగు విష్ణువు వక్షస్థలమందు ప్రకాశించుచున్న,  లోకమాత ఐనట్టి  లక్ష్మీదేవి నాకు శుభముల నిచ్చుగాక. 

7
ప్రాప్తం పదం ప్రథమతఃఖలు యత్ప్రభావాత్ మాంగల్య భాజి మధుమాథిని మన్మథేన!! మయ్యపతే త్తదిహ మంథర మీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయాః !

ఏ దేవి దృష్టి మహిమవలన శుభమును పొందిన విష్ణునందు  మన్మధుడు నిలిచెనో అట్టి క్షీరాబ్ధి కన్యక అగు లక్ష్మీదేవి యొక్క మందమగు దృష్టి  నాయందు ప్రసరించునుగాక.  

8
దద్యాద్దయాను పవనోద్రవిణాంబు ధారా మస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే !!
దుష్మర్మ ఘర్మమపనీయ చిర్టయదూరం నారాయణ ప్రణయనీ నయనాంబువహః !

శ్రీమన్నారాయణుని శ్రీదేవి అనెడి మేఘము పేదవాడననెడి విచారము పొందిన చాతకపక్షినగు నా యందు చాలాకాలముగా ఉన్న దుష్కర్మమనెడి తాపమును తొలగించి, నాపై ధనవర్ష ధారను కురిపించునుగాక.  

9
ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టప పదం సులభం లభంతే !
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తి రిష్టాం పుష్టి కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః !!

హితులగు జ్ఞానులు ఎవరి దయాదృష్టిచే సులభముగా ఇంద్రపదవిని పొందుచున్నారో పద్మములోని భాగము వలె ప్రకాశించు అట్టి పద్మాసన(లక్ష్మీ) దృష్టి నేను కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక.

10
గీర్ధవ తేతి గరుడద్వజ సుందరీతి శాకంభరీతి శశశేఖర వల్లభేతి !
సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై !!

సృష్టి స్థితి ప్రళయ కార్యములందు గీర్దేవత(సరస్వతి) అనియు, విష్ణుపత్ని అనియు శాకాంభరి అనియు శివకళత్రము అనియు ఏ దేవత పిలువబడుచున్నదో అట్టి విష్ణుపత్ని అగు లక్ష్మీకి నమస్కరిస్తున్నాను.  

11
శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రశూత్యే రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై !
శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై !!

పుణ్యకార్యములు ఫలము నొసగు శ్రుతిరూపిణియు, సౌందర్య గుణసముద్ర యగు రతిరూపిణియును, పద్మనివాసిని అగు శక్తి రూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము.

12
నమోస్తు నాళిక నిభాననాయై నమోస్తు దుగ్దోదధి జన్మభూమ్యై !
నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై !!

పద్మమును బోలిన ముఖము గలదియు, క్షీరసముద్రమునందు జన్మించినదియు, చంద్రునికి, అమృతమునకు తోబుట్టువును, నారాయణుని పత్ని అగు లక్ష్మీదేవికి నమస్కారము.  

13 
నమోస్తు హేమాంభుజ పీఠికాయై  నమోస్తు భూమణ్డల నాయికాయై 
నమోస్తు దేవాది దయాపరాయై నమోస్తు శార్ఙ్ఙాయుధ వల్లభాయై !!

భావం 
బంగారు పద్మము పీఠముగా గలదియు, భూమండలమునకు నాయిక అయినదియు, దేవతలలో దయయే ముఖ్యముగా గలదియు, విష్ణువునకు ప్రియురాలు  అయిన లక్ష్మీదేవికి నమస్కారము. 

14 
నమోస్తు దేవ్యై భృగు నందనాయై నమోస్తు విష్ణోరురసి స్థితాయై 
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై !!

భావం 
భృగుమహర్షి పుత్రికయును, దేవియు, విష్ణువక్షస్థలవాసినియు, పద్మనివాసినియు విష్ణువుకు ప్రియురాలు అయిన లక్ష్మీదేవికి నమస్కారము.  

15 
నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై !!

భావం 
తామరపువ్వు వంటి కన్నులు గలదియు, ప్రకాశించునదియు లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలు అగు లక్ష్మీదేవికి నమస్కారము.  

16
సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి !
త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే !!

పద్మములవంటి కన్నులు గల పూజ్యురాలవగు నోయమ్మా, సంపదను కల్గించునవియు, ఇంద్రియములను సంతోషమును కలిగించునవి, చక్రవర్తిత్వము నొసగగలవియు, పాపములను తొలగించునవియు అగు నీకు చేయు వందనములు ఎల్లపుడును నన్నే కృతార్థునిజేయుగాక.

17
యత్కటాక్ష సముపాసనావిధిః సేవకస్య సకలర్థ సంపదః !
సంతనోతి వచనాంగ మానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే !!

ఏ నీ కడగంటి చూపును సేవించుట సేవకునికి సకల సంపదలను కూర్చుచున్నదో అట్టి విష్ణుపత్నివగు నిన్ను మనోవాక్కాయములనెడి  త్రికరణములతో సేవించుచున్నాను.  

18
సరసిజనిలయే ! సరొజహస్తే ! దవళత మాంశుక గందమాల్య శోభే !
భగవతి ! హరివల్లభే ! మనోజ్ఞే ! త్రిభువన భూతకరీ ! ప్రసీద మహ్యం !!

కమలములవంటి కన్నులు గలదానా! చేతియందు పద్మముగలదానా! తెల్లని వస్త్రగంధ పుష్పమాలికలచే ప్రకాశించుదానా! షడ్గుణములు గలదానా!  అందమైనదానా! ముల్లోకములకు ఐశ్వర్యము  కలిగించుదానా! ఓ విష్ణుపత్నీ! నన్ననుగ్రహింపుము.  

19
దిగ్ఘస్తభిః కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగిం !
ప్రాత ర్న మామి జగతాం జననీ మశేష లోకధినాథ గృహిణీ మమృతాబ్ది పుత్రిం !!

దిగ్గజములచే బంగారు కుండలనుండి పోయబడిన నిర్మలములుగు ఆకాశ జలములచే తడుపబడిన శరీరము కలదియు, లోకములకు జననియు, లోకాధిపతికి భార్యయు, క్షీరసాగర పుత్రియు అగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరించుచున్నాను. 

20
కమలే ! కమలాక్ష వల్లభే !త్వం కరుణాపూర తరంగితై రపాంగైః !
అవలోకయ మా మకించనానం ప్రథమం పాత్ర మకృతిమం దయాయాః !!

నారాయణునికి ప్రియురాలవగునో లక్ష్మీ! దరిద్రులలో ప్రధముడను, నీ దయకు యథార్థముగా తగిన వాడనగు నన్ను నీ కరుణాకటాక్షములతో చూడుముతల్లీ. 

21
స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం త్రయీ మయీం త్రిభువనమాత్రం రమాం !
గుణాధికా గురుతుర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః !!

ఎవరీ స్తోత్రములచే ప్రతిరోజు వేదరూపిణియు, త్రిలోకమాతయు అగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు గుణవంతులుగను మంచి భాగ్యవంతులలో గొప్ప భాగ్యవంతులుగను బుధులచే కొనియాడబడెడి  వారుగను అగుచున్నారు. 


సువర్ణధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ 
!!

శంకరాచార్యులచే రచింపబడిన కనకధారాస్తోత్రమును ఎవరు నిత్యమూ త్రికాలములయందు పఠించునో వారు కుబేరునితో సమానులగుదురు.  

__/\__ ఇతి శ్రీ శంకర భగవత్పాద విరచితం కనకధారాస్తోత్రం సంపూర్ణం.__/\__     




No comments:

Post a Comment