Sri Ramanavami In America అమెరికాలో రామ మందిరంలో శ్రీరామనవమి
February 27, 2014
మహాశివరాత్రి జాగరణ
మహాశివరాత్రి జాగరణ
జాగరణ అంటే నిద్రని మాని(వదిలేసి) మెలకువగా ఉండటం అని అర్థం. తప్పులు అనేవి శారీరకంగా, మానసికంగా చేయకుండా ఉండటాన్ని మెలకువ అని అంటారు. మెలకువగా ఉన్నవారు, ప్రమాదాలు లేకుండా,(చేయకుండా) వారి గమ్యాన్ని చేరుకున్నట్టుగా ..... మానసికంగా మెలకువగా ఉన్నవారు, ఎటువంటి దోషము చేయకుండా - జీవనగమ్యాన్ని చేరుకుంటారు. కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి ఉంటే, శారీరకంగా మెలకువని ఇవ్వవు, జాగరణ చేయనియ్యవు. అదేవిధంగా మానసికంగా ఉన్న తమకం - గర్వం మొదలైనవి మానవునికి మానసికంగా మెలకువని ఇవ్వవు. కనుక శరీరానికి మెలకువని ఇచ్చుటకు ఉపవాసం మరియు భగవంతుని సాన్నిధ్యం చాలా అవసరం అని పెద్దలు చెప్పారు. ఆ విధంగా ఉంటే మానసికంగా మెలకువ - గర్వము లేకుండా ఉండటం - వినయంగా ఉండటం అలవడతాయి. అందుకే జన్మనికి ఒక రాత్రి అయినా శారీరిక వికారాలని, మానసిక వికారాలని, అదుపులో ఉంచుకుంటూ, స్వచ్ఛతని పొందితే.....శివము - శుభము కలిగే రాత్రిని 'శివరాత్రి' అని అంటారు. అంటే మానవుడు తన జీవితంలో సంవత్సరానికి ఒకసారైన మాఘమాసంలో ...మాఘవ్రతాన్ని చేసి, ఒక శివరాత్రి ఐనా ఉపవాసం - జాగరణ ఉండి, పూజ చేసినట్లయితే త్రికరణాల పరిశుద్ధత కలిగి, తరిస్తాడు అని అంటారు. ఆ విధంగా చేయకపోతే శరీరానికి బాధ, శ్రమ తప్పించి మరేమీ లభించదు. మనం ఈ లోకాన్ని - ముఖ్యం (పగలు) అనుకొని అనుకోకుండా కొన్ని కొన్ని తప్పులను చేస్తాము. ధర్మాన్ని - జ్ఞానాన్ని (రాత్రిని) నిర్లక్ష్యం చేస్తాం. అశాంతికి గురి అవుతాము. కానీ ధార్మికులు జ్ఞానాన్ని (పగలు) ముఖ్యం అనుకొని .... ఈలోకధర్మాలని (రాత్రి) అనుకొని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ధర్మం -జ్ఞానం ముఖ్యం అనుకోవటం వలన శాంతిని పొందుతున్నారు. అజ్ఞానులు పగలు అనుకునేది విలువైనది ఇహలోకసుఖం --- రాత్రి అనుకునేది జ్ఞానం. జ్ఞానం జ్ఞానులకు పగలుగా - ఇహలోకం రాత్రిగా ఉంటుంది.
మహాశివరాత్రి నోము కథ
మహాశివరాత్రి నోము కథ
పూర్వకాలంలో ఒకానొక దేశంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతడు ఎంతటి విద్యాసంపన్నుడో, అంతటి దారిద్ర్యము అతడ్ని వెంటాడుతుండేది. ఎంత ప్రయత్నించినా అతని చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు, దానికి తోడు అతని ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉండేది. ఇటువంటి పరిస్థితులలో మరొకరిని ఇబ్బంది పెట్టటం దేనికి అని, వివాహం చేసుకోవటం మానేసాడు. నా అని చెప్పుకోవటానికి ఎవ్వరూ లేక, సేవలు చేయటానికి భార్య లేక, నరకయాతనలు పడుతూండేవాడు. క్రమంగా కొద్దిరొజులకి అతనికి జీవితం మీద విరక్తి వచ్చి, ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. కానీ ప్రాణాలు తీసుకోవటం శాస్త్రసమ్మతం కాదని, నారుపోసినవాడే నీరుపోస్తాడు అని కాలాన్ని వెళ్ళదీస్తూ ఉన్నాడు. కానీ, మరికొద్దిరోజులకి అతనిలో సహనం నశించి, ఇక ప్రాణత్యాగం తప్పనిసరి అని గట్టి నిర్ణయం తీసుకొని, నీటిలో పడాలా ? అగ్నిలో దూకాలా ? కత్తులతో పొడుచుకోవాలా ? విషాన్ని మింగాలా ? అని రకరకాలుగా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. అతనికి కలలో సాక్షాత్తు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి "ప్రాణాలు తీసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు ? సదాశివుని కంటే దయామయుడు వేరే ఎవరు లేరు కదా ? అతనిని పూజించి, కీర్తించి, అతని కరుణా - కటాక్షాలు నీవు పొంది, నీ జన్మని సార్థకం చేసుకో" అని చెప్పి అంతర్థానమయ్యెను.
దేవి ప్రత్యక్షమయ్యినందుకు సంతోషించి, నిద్ర మేల్కొని, ఉదయాన్నే ఒక పండితుని వద్దకు వెళ్ళి, తను పడుతున్న బాధలని, తనకు వచ్చిన స్వప్నాన్ని వివరించి, తనేమి చెయ్యాలని అడుగగా, ఆ పండితుడు "నీకు స్వప్నంలో దేవి దర్శనం అవ్వటం చాలా అదృష్టం. ఆమె ప్రత్యక్షమయ్యి ఆ సదాశివుని ప్రార్థించమని నీకు తెలియచేసింది, నీవు ధన్యుడవయ్యావు. ఇక శివుని పూజించే విధానం అంటే, ప్రతీమాసంలో ఆఖరి మూడవరోజు (అంటే అమావాస్య ముందు వచ్చే త్రయోదశి)ని మాసశివరాత్రి అంటారు. ఆ రోజు నదీస్నానం చేసి, ఉపవాసం ఉండి, ఆ రాత్రంతా శివనామార్చనతో జాగారణతో గడిపి, సూర్యోదయ సమయంలో శివలింగాన్ని పూజించాలి. ఈవిధంగా మహాశివరాత్రి వరకు చెయ్యు, ఆరోజు నీకు కలిగినంతలో ఎవరికైనా ఒక ఫలమో, తృణమో ఇచ్చుకొని, వారి ఆశీర్వాదం పొందితే, నీకున్న ఈతిబాధలన్నీ తొలగిపోతాయి, నీకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది." ఆ బ్రాహ్మణుడు పండితుడు చెప్పిన విధంగానే భక్తి - శ్రద్ధలతో శివరాత్రి నోము నోచుకొని, సుఖసంతోషాలతో జీవితం గడిపాడు.
ఉద్యాపన
ప్రతీ మాసశివరాత్రికి శివలింగార్చన చేసి, ఉపవాసం, జాగరణ చెయ్యాలి. ఈవిధంగా సంవత్సర కాలం ప్రతీమాసశివరాత్రినాడు చేస్తూ, ఆ మరుసటిరోజున ఒక నిరుపేదకు మనకు కలిగినంతలో అన్నదానం చెయ్యాలి. మహాశివరాత్రి రోజున సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, శివాక్షరిని జపిస్తూ, శివునికి అర్చన చెయ్యాలి. పండితుల ఆశీర్వచనం తీసుకోవాలి.
శివోహం...... హరహర మహాదేవ శంభో శంకర
February 26, 2014
మహాశివరాత్రి
మహాశివరాత్రి
ప్రతీనెలా అమావాస్య ముందు వచ్చే చతుర్ధశిని శివునికి ఇష్టమైన శివరాత్రిగా చెబుతూంటారు. ఇలా ప్రతీనెలా వచ్చే శివరాత్రిని 'మాసశివరాత్రి' అంటారు. మాఘమాసంలో వచ్చే శివరాత్రిని "మహాశివరాత్రి" అంటారు. శివరాత్రి అంటే శివునిరాత్రి. శివమైన(శుభప్రదమైన) రాత్రి. అర్థరాత్రి వరకు చతుర్థశి తిథి ఉన్న రోజునే 'శివరాత్రి' గా అంటుంటారు. ఉపవాసము - అభిషేకాలు, పూజలు - జాగరణము ...... ఈ 3 శివరాత్రి రోజున ముఖ్యంగా మనం చేయవలసిన పనులు.
పురాణకథనం:--
పూర్వము బ్రహ్మ, విష్ణువులకు ఇద్దరికీ ---- తమలో ఎవరు ఎక్కువ అనే విషయంలో వాదోపవాదాలు జరిగి, క్రమేణా వాదన పెరిగింది. ఈ స్థితిలో ఒక అపూర్వమైన శివలింగం ఆద్యంతాలు తెలియని విధంగా సాక్షాత్కరించి పెరుగుతూ ఉంది. బ్రహ్మ, విష్ణువులు దానిని చూసి, ఆశ్చర్యపడ్డారు. "మీఇద్దరిలో - దీని మొదలు, చివర ఎవరు తెలుసుకుంటారో వారు, రెండవవాని కంటే గొప్పవారు" అని వారిరువురికి ఒక అశరీరవాణి యొక్క మాటలు వినిపించాయి. వెంటనే హంస వాహనాన్ని ఎక్కి బ్రహ్మదేముడు ..... ఆ లింగం చివరి భాగం (పైభాగాన్ని) వెదుకుతూ పైకి, క్రిందిభాగం (అంటే లింగము ఆది భాగం) వెదుకుతూ విష్ణువు క్రిందికి (క్రిందభాగంకి) పయనమయ్యారు.
ఎంతసేపు ప్రయాణం చేసినా వారిద్దరికీ వారి - వారి గమ్యాలు కనిపించలేదు. పైకి వెళుతున్న బ్రహ్మకి లింగభాగంపైనుండి క్రిందికి పడుతున్న ఒక మొగలిపువ్వు కనిపిస్తే, "నీవు ఎక్కడి నుండి క్రిందికి వస్తున్నావు?" అని అడుగగా " లింగం పైనుండి క్రిందకు చాలాకాలం నుండి వస్తున్నాను" అని చెప్పగా బ్రహ్మ మొగలిపూవుతో "నేను ఈ లింగపైభాగం చూసినట్లుగా సాక్ష్యం చెప్పు" అని బలవంతం చేయగా, సృష్టికర్త అయిన బ్రహ్మకు ఎదురుచెప్పలేక, భయపడి మొగలిపూవు ఒప్పుకుంది. లింగాగ్రమునకు క్షీరాభిషేకం చేసి క్రిందకి వస్తున్న కామధేనువు కనిపించగా, ఆ ధేనువుని కూడా తాను లింగాగ్రమును చూసినట్టు సాక్ష్యం చెప్పమని బలవంతంగా అంగీకరింపచేసెను. ఆ ఇద్దరి సాక్షులతో బ్రహ్మ - పైనుండి క్రిందకు వచ్చెను. లింగ ఆదిభాగం వెదుకుతూ వెళ్ళిన విష్ణువుకు మొదలు వెదకలేక, తాను వేదుకుటలో అశక్తుడిని అని తలచి, పైకి వచ్చేసి, "నేను లింగము యొక్క ఆది(క్రిందిభాగం) గుర్తించలేకపోయెను" అని, అప్పటికే అక్కడకు వచ్చిన బ్రహ్మకు చెప్పగా, "నేను నీకంటే అధికుడిని" అని గర్వంగా చెబుతూ, తాను తీసుకువచ్చిన ఇద్దరి సాక్షులను చూపెను. అంతట విష్ణువు "నీ ఆధిక్యమును నేను అంగీకరిస్తున్నాను". అని పలుకగా, భయంకర ధ్వనులతో మహాశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యి, అసత్యము చెప్పిన బ్రహ్మ అయిదు శిరస్సులలో, ఒక శిరస్సును ఖండించెను. అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖుడయ్యెను. బ్రహ్మ సిగ్గుచెంది, తన తప్పిదమును అంగీకరించెను.శివుని శాపం వలన అతనికి లోకములలో ఎక్కడా పూజ లేకుండా పోయింది. తప్పుడు సాక్ష్యం చెప్పినందువల్ల, మొగలిపూవుకు పూజార్హత లేకుండా పోయింది, ప్రతీరోజూ ఉదయమునే నిద్రలేచి గోముఖమును చూస్తే పాపములు కలిగేటట్లుగా కామధేనువుకు శాపము ఇచ్చెను. అందుకే గోముఖము కంటే పృష్టభాగమును దర్శిస్తే మంచిది. సత్యము పలికిన విష్ణువును, నీవు నాతొ సమానమగ పూజించబడుతావు, అని చెప్పి, అతనికి ఎక్కువ వరములను ఇచ్చెను. సత్యమునకు ప్రశంస, అసత్యమునకు శిక్ష జరిగిన ఈ రాత్రి అంటే మహాశివునికి పరమప్రీతికరము. ప్రతీ మాసశివరాత్రి శివునికి ప్రీతికరమే. అందున మాఘమాస శివరాత్రి మహాశివరాత్రి అగుట చేత, శివునికి మరింత ప్రీతికరమయ్యెను.
క్షీరసాగరమథనములో పుట్టిన హాలాహలమను గరళమును శివుడు కంఠమున నిలుపుకొన్న రాత్రినే 'మహాశివరాత్రి' అని అందురు. ఈ మహాశివరాత్రి రోజున ఉపదేశము పొందినవారు, శివపంచాక్షరిని యథాశక్తి జపిస్తే, అమోఘమైన ఫలితాలను పొందవచ్చును.
"ఓం నమఃశ్శివాయ"
Smt.Pullabhatla Eswarammagaru ....... శ్రీమతి పుల్లాభట్ల ఈశ్వరమ్మగారు
Smt.Pullabhatla Eswarammagaru ....... శ్రీమతి పుల్లాభట్ల ఈశ్వరమ్మగారు
మన విశాఖ మహాసాగరంలో ప్రతిభ ఉన్నవారు, పైకి రాలేక, ఎందరెందరో మరుగున పడిపోతున్నారు. ఈమె ఈశ్వరమ్మగారు. నాకు మాపిన్నిగారిద్వారా పరిచయమయ్యారు. ఈమె 3 సంవత్సరముల వయసు నుండే సంగీతం పట్ల అభిమానం చూపుతూ, వింటూ, రామాయణ, మహాభారత, భాగవతాలు మొదలైన పురాణగ్రంధాలను బాగా చదువుతూ, అన్నిటినీ ఆకళింపు చేసుకొని, కేవలం ఆధ్యాత్మిక కీర్తనలు అవలీలగా ఆశువుగా పాడటం, రాయటం మొదలుపెట్టారు. ఆవిధంగా ఎన్నో కీర్తనలు రచించి, స్వరపరచి, ఆలపించారు. ఈ కీర్తనకి ఆమె చాలా కష్టపడ్డారు. ఆమెకున్న పాండిత్యమంతా రంగరించి రాసి, స్వరపరచి, ఆలపించారు. ఆమె ప్రతిభని, ఆమె కుమార్తె వర్ణించారు. ఈశ్వరమ్మగారి కీర్తనని, ఆమె స్వరంలోనే మీరు స్వయంగా విని ఆనందించండి.
February 18, 2014
శ్రీ సూర్యభగవానుడు....
శ్రీ సూర్యభగవానుడు....
ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఏడు గుర్రాల రథంలో గగన వీధిన పయనిస్తాడు. ఏడు గుర్రాలు ఇంద్ర ధనుస్సు లోని ఏడు రంగులకు, వారంలోని ఏడు రోజులకు ప్రతీకలు. సూర్యుని రథ సారథి అరుణుడు. సూర్యోదయానికి ముందు వచ్చే అరుణకాంతి భానుని ఆగమనానినికి గుర్తు. అరుణుడు కశ్యప మహర్షి-వినత ల పుత్రుడు. తల్లి తొందరపాటు వలన అర్ధదేహం తో జన్మించాడు. ఊరువులు (తొడలు) లేనివాడు గనుక అరుణుడిని 'అనూరుడు' అని కూడా అంటారు.
February 14, 2014
February 11, 2014
February 10, 2014
Sree Vishnusahasra Nama Stotram ......... శ్రీ విష్ణుసహస్ర నామస్తోత్రం
Sree Vishnusahasra Nama Stotram ......... శ్రీ విష్ణుసహస్ర నామస్తోత్రం
February 7, 2014
February 6, 2014
అరసవల్లి శ్రీ సూర్యభగవానుని క్షేత్రమహాత్మ్యం
అరసవల్లి శ్రీ సూర్యభగవానుని క్షేత్రమహాత్మ్యం
లోకములను ప్రకాశింపజేయు సూర్యునియందైన తేజస్సు నాదేయని "జ్యోతిషాం రవి రంశుమాన్" నేనే సూర్యభగవానుడను అని చెప్పినాడు. అందువల్ల సూర్యుడే ఈ క్షేత్రంలో యాత్రికులకు, భక్తులకు దర్శనమిస్తున్నాడు. వారి పాపాలను పోగొట్టి, పుణ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. పంచాయతన పూజలో సూర్యభగవానునికే ప్రథమ స్థానం.
ప్రత్యక్షదైవమగు శ్రీసూర్యభగవానుని దేవాలయము దక్షిణ భారతదేశంలో ఒక్కటి మాత్రమే ఉన్నది. అంధులు, అంటువ్యాధిగ్రస్తులు, కుష్ఠురోగులు, క్షయవ్యాధి కలవారు, బొల్లిమచ్చలు కలవారు మొదలగు వ్యాధిగ్రస్తులు ఇక్కడకు వచ్చి, 'త్వమేవ శరణం మమ' అని సూర్యభగవానుని స్తుతించి, పూజలు, అభిషేకములు, సూర్యనమస్కారములు జరిపించుకొని, తమకోర్కెలు ఫలించగా హర్షభరితులై, సంపూర్ణ ఆరోగ్యవంతులై, సూర్యనుగ్రహం పొందినందులకు సంతోషించి, వారి ఇండ్లకు ఆనందంతో తిరిగి వెళుతుంటారు. కనుక ఈ క్షేత్రమును 'హర్షవల్లి' గ మారినది. కాలక్రమేణా 'అరసవల్లి' గ మారినది.
సూర్యుని వేయి కిరణాలలో ముఖ్యమైన ఏడుకిరణాలే గ్రహాలు. అందువల్ల గ్రహపతి అయిన సూర్యుని అనుగ్రహం వలన భక్తులకు సర్వగ్రహశాంతి కలుగుతుంది. భాస్కరుడు త్రిమూర్తి స్వరూపుడు - వేదస్వరూపుడు కనుక, త్రయీమూర్తి - సర్వదేవాత్మకుడు మరియు కర్మసాక్షి అయిన ఇతను ఈ క్షేత్రంలో సాకారుడై భక్తులను అనుగ్రహించుచున్నాడు. ప్రత్యక్షదైవమై తన కిరణాలతో లోకములను రక్షించుచున్నాడు.
పురాణకథనం:--
శ్రీమహావిష్ణువు యొక్క అవతారమగు బలరాముడు ద్వాపరయుగంలో జీవులను ఉద్ధరించుటకు తన నాగలితో నాగావళీ నదిని తెసుకొనివచ్చి ఆ నదీ తీరమున దేవాలయమును ప్రతిష్టించెను. అప్పుడే శ్రీకాకుళమున శ్రీఉమారుద్రకోటేశ్వరస్వామి ప్రతిష్టింపబడెను. ఆవింతను చూచుటకు స్వర్గమును వదిలి దేవతలంతా భూలోకమునకు వచ్చి, ఆస్వామిని దర్శించి, అర్చించి, ఆనందించి వెళ్ళిరి.
అనంతరం ఇంద్రుడు రాత్రి సమయంలో దేవదేవుని దర్శించుటకు దేవాలయమునకు వచ్చెను. ద్వారపాలకులైన నంది - మహాకాళులు అతనిని చూసి, ఉమారుద్రుల కేళీ సమయంలో మహేంద్రుడు వచ్చినందుకు అడ్డగించిరి. తనకు కలిగిన ఉత్సాహభంగమును సహింపలేక సురసార్వభౌముడు సాహసింపచూసెను. అంతట ఉగ్రుడైన నందీశ్వరుడు హూంకరించి, ఒక్కతన్ను తన్నగా, దేవేంద్రుడు తూరుపు దిక్కునకు పోయి పడెను. అంతట శక్తిలేని ఇంద్రుడు సూర్యుని స్మరించెను. వెంటనే ఆటను స్వస్థశరీరుడై ..... సహస్రరశ్మిని సర్వవిధముల స్తుతించి, ప్రసన్నునిగావించెను. ఈవిధంగా సూర్యునివలన సుఖము పొందిన దేవేంద్రుడు, సర్వజీవులు సూర్యభగవానుని సేవించి, తనవలె దుఃఖము నుండి సౌఖ్యము పొందాలని సంకల్పించి, సూర్యుని చూసి, నమస్కరించి, "ఓ ఛాయాపతి ! అందరికి నీవే గతివి. నిన్ను స్మరించగానే నాకు బాధలు తొలగి, సుఖమునొందాను. నిన్ను ఎల్లప్పుడూ దర్శించుచు, సకల జనులు వారి బాధలు తొలగి, సుఖసౌఖ్యములతో ఉండుటకు నీవు ఇక్కడే ఉషాపద్మినీ దేవేరులతో నిత్యమూ కొలువుండుస్వామీ !" అని కోరెను. అతని నిస్వార్థమగు కోరికకు సంతోషించి, సూర్యుడు "తథాస్తు" అని పలికి అదృస్యమయ్యెను.
అంత సంతసించిన దేవేంద్రుడు తన వజ్రాయుధముతో అక్కడే త్రవ్వగా, ఇప్పటికీ అతని పేరుమీదుగా 'ఇంద్రపుష్కరిణి' గ అక్కడ తటాకము పిలువబడుచున్నది. యాత్రికులు ఆ పుష్కరిణిలో స్నానం చేసి దేవదేవుని దర్శించుకుంటారు. అంతట విశ్వకర్మ తన అపూర్వమగు అద్భుతమగు, శిల్పకళా చాతుర్యముతో ఆదిత్యునికి దేవాలయం నిర్మించెను. అందు పింగళమాఠరులు ద్వారపాలకులుగా, అసూరుడు ఏకచక్రరథసారథిగా ప్రత్యక్షమయ్యిరి. వెనువెంటనే ముక్కోటిదేవతల జయజయధ్వానాలు పలికిరి. సనకసనందాదులు చత్రచామరులతో దేవుని సేవించవచ్చిరి. నారదాది బృందగానము స్తోత్రపేయమయ్యెను. ఈవిధంగా అరసవల్లిలో ప్రత్యక్షనారాయణుడు అయిన సూర్యభగవానుడు మనకు దర్శనమిచ్చుచున్నాడు.
చారిత్రిక కథనం;--
ఏడవ శతాబ్దిలో మనదేశమున గంగారాజులలో దేవేంద్రవర్మ పరిపాలిస్తూఉండేవాడు. ఆటను ఈ అరసవల్లి దేవాలయంపై ఎక్కువ ఆదరమును జూపెను. నిత్య భోగ, ధూప, దీపములు, విశేష పూజలు, కళ్యాణోత్సవాలు మొదలగు వణికి భూరి విరాళములు ఇచ్చెను.
16 వ శతాబ్దంలో మతావేశపరులు అగు దుండగులు దేవాలయ పరిసర ప్రాంతములు ధ్వంసంచేసిరి. తరువాత క్రీ.శ. 1788 లో శ్రీ యెలమంచిలి పుల్లజీ పంతులుగారు ఆలయ పునరుద్ధరణ గావించిరి. శ్రీకాకుళం జిల్లా అలుదు గ్రామవాస్తవ్యులు శ్రీవరుదు బాబ్జీ దంపతులచే 1999 లో ఆలయ పునఃనిర్మాణం జరిగింది. అదే సమయంలో 250 మంది ఋత్వికులచే మహాకుంభాభిషేకంతో పాటుగా మహాసౌరయాగము కూడా జరిపించబడినది. ఇదే విధంగా ఎందఱో పుణ్యాత్ములు ఈ దేవాలయ అభివృద్ధికి పాటుపడి ధన్యులయ్యిరి.
మహారాజులు సూర్యానుగ్రహము వలన విజయములు పొందిరి అని మనకు పురాణాలలో ఉన్నవి. శ్రీరాముడు రావణుని వధించుటకై ఆదిత్యహృదయమును ఉపదేశించి, దానిని మూడుసార్లు చదివి, యుద్ధమునకు వెళితే, రావణుని జయిస్తావు అని అగస్త్య మహర్షి చెప్పగా ..... శ్రీరాముడు అదే విధంగా చేసి విజయమును పొందెను.
శ్రీమద్భాగవతంలో సత్రాజిత్తు సూర్యునుని ఆరాధించి వారి అనుగ్రహముతో శ్యమంతకమణిని పొందెనని సూర్య మహిమ వర్ణింపబడినది. సాంబపురాణంలో ...... దుర్వాసుని శాపము వలన ప్రాప్తించిన కుష్టురోగమును సాంబుడు సూర్యోపాసన పోగొట్టుకొనెను అని తెలియచేస్తుంది.
మహాభారతంలో ధర్మరాజు అరణ్యవాసము సమయంలో దారిద్ర్యం అనుభవిస్తూ ఉండి, ఆదిత్యుని ఉపాసించి వాణి అనుగ్రహం వాళ్ళ అక్షయపాత్రను పొంది .... అతిధి సత్కారము చేసి, సూర్యుని కృపకు పాత్రుడయ్యెను.
అంధుడగు అమర మహాకవి తన అంధత్వమును సూర్యస్తుతి అగు మయూర శతకమును విరచించి, పోగొట్టుకొనెను.
ఆదిదేవుడు అగు ఇతని అనుగ్రహమునకై ధర్మశాస్త్రము ఆదివారమున ఏకభుక్తమును విధించెను. ఆదివర నియమములు పాటించు భక్తులు శోకదారిద్ర్యములు, అధివ్యాధులు లేక, సుఖజీవితము గడుపుదురు అని, మరణానంతరము సూర్యలోకమును పొందుదురు అని, అందురు.
రథసప్తమి రోజున ...... అక్టోబర్ 1,2,3,4 తేదీల్లోనూ, స్వామివారి మూలవిగ్రహంపై ఆదిత్యుని తొలికిరణాలు ప్రసరించే దృశ్యాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు అరసవల్లి ఆలయానికి తరలివస్తుంటారు. స్వామివారి పాదాల మీదుగా మొదలై, శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే ఆ మనోహరమైన దృశ్యం అద్భుతం, అపురూపమని భక్తులు అంటూ ఉంటారు.
పురాణ ప్రసిద్ధమైన ఈ క్షేత్రమును దర్శించి, ప్రత్యక్షదైవమైన సూర్యభగవానుని అనుగ్రహం పొందండి.
ఆయురారోగ్య ఐస్వర్యాభివృద్ధిరస్తూ
February 5, 2014
February 3, 2014
Vinayaka Nee Murthy ke Na Modati Pranam... వినాయక నీమూర్తికే నా మొదటి ప్రణామం
Vinayaka Nee Murthy ke Na Modati Pranam... వినాయక నీమూర్తికే నా మొదటి ప్రణామం
February 2, 2014
పుత్తడి బొమ్మా! పూర్ణమ్మా!
పుత్తడి బొమ్మా! పూర్ణమ్మా!
రచన -- గురజాడ అప్పారావుగారు
మేలిమి బంగరు మెలతల్లారా
కలవల కన్నుల కన్నెల్లారా
తల్లులగన్న పిల్లల్లారా
విన్నారమ్మా ఈ కథనూ.
ఆటల పాటల పేటికలారా
కమ్మనిమాటల కొమ్మల్లారా
అమ్మలగన్న అమ్మల్లారా
విన్నారమ్మా మీరీ కథనూ.
కొండలనడుమన కోనొకటుంది
కోనకి నడుమా కొలనొకటుంది
కొలనిగట్టున కోవెల లోపల
వెలసెను బంగరు దుర్గమ్మ.
పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
అన్నల తమ్ముల కనుగై దుర్గకు
పూజకు పూవులు కొసేది.
ఏయే వేళల పూసే పువ్వుల
ఆయా వేళల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.
ఏయే ఋతువుల పండే పళ్ళను
ఆయా ఋతువుల అందించి
బంగరుదుర్గను భక్తితొ కొలిచెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.
పళ్ళను మీరిన తీపుల నడలును
పువ్వుల మీరిన పోడుములన్
అంగములందున అమరెను పూర్ణకు
సౌరులు మించెను నానాటన్.
కాసుకులోనై తల్లితండ్రీ
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను
ఒక ముదుసలి మొగుడుకి ముడివేసిరి.
ఆమని రాగా దుర్గాకొలనులో
కలకల నవ్వెను తామరులు
ఆమని రాగా దుర్గవనములో
కిలకిల పలికెను కీరములు.
ముద్దు నగవులూ మురిపెములూ మరి
పెనిమిటి గాంచిన నిమిషమున
బాసెను కన్నియ ముఖ కమలమ్మున
కన్నుల గ్రమ్మెను కన్నీరు.
ఆటల పాటల తోటి కన్నియలు
మొగుడు తాతయని కేలించ,
ఆటలపాటల కలియక పూర్ణమ్మ
దుర్గనుచేరి దు:ఖ్ఖించే.
కొన్నాళ్ళకు పతి కొనిపోవొచ్చెను
పుత్తడిబొమ్మను పూర్ణమ్మను
చీరలు సొమ్ములు చాలగదెచ్చెను
పుత్తడిబొమ్మకు పూర్ణమ్మకు.
పసుపు రాసిరి బంగారు మేనికి
జలకములాడెను పూర్ణమ్మ
వదినెలు పూర్ణకు పరిపరి విధముల
నేర్పులు మెరసీ కైచేస్రీ..
పెద్దలకప్పుడు మ్రొక్కెను పూర్ణమ్మ
తల్లిదండ్రి దీవించ్రి
దీవెన వింటూ పక్కున నవ్వెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.
చిన్నలనందర కౌగిట చేర్చుకు
కంటనుబెట్టెను కన్నీరు
అన్నల తమ్ముల నప్పుడు పలికెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.
"అన్నల్లారా! తమ్ముల్లారా!
అమ్మను అయ్యను కానండి
బంగరు దుర్గను భక్తితొ
కొలవండమ్మలకమ్మ దుర్గమ్మ.
ఆయా వేళల పూసే పువ్వుల
ఆయా ఋతువుల పళ్ళన్నీ
భక్తిని తెచ్చీ శక్తికి ఇవ్వం
డమ్మలకమ్మా దుర్గమ్మ.
నలుగురు కూర్చుని నవ్వేవేళల
నాపేరొకపరి తలవండి
మీమీ కన్నబిడ్డలనొకతెకు
ప్రేమను నాపేరివ్వండి."
బలబల కన్నుల కన్నీరొలికెను
పుత్తడిబొమ్మకు పూర్ణమ్మకు
కన్నులుతుడుచుకు కలకల నవ్వెను
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.
వగచిరి వదినెలు వగచిరి తమ్ములు
తల్లియు కంటను తడిబెట్టెన్
కాసుకులోనై అల్లుని చూసుకు
ఆనందించెను అయ్యొకడే!
ఎప్పటియట్టుల సాయంత్రమ్మున
ఏరిన పూవ్వులు సరికూర్చి
సంతోషమ్మున దుర్గను కొలువను
ఒంటిగబోయెను పూర్ణమ్మ.
ఆవులు పెయ్యలు మందలుజేరెను
పిట్టలు చెట్లను గుమిగూడెన్
మింటను చుక్కలు మెరయుచు పొడమెను
పూర్ణమ్మ ఇంటికిరాదాయె.
చీకటి నిండెను కొండల కోనల
మేతకు మెకములు మెసల జనెన్
దుర్గకు మెడలో హారము లమరెను
పూర్ణమ్మ ఇంటికి రాదాయె.
కన్నులకాంతులు కలవలచేరెను
మేలిమిజేరెను మేని పసల్
హంసలజేరెను నడకల బెడగులు
దుర్గనుజేరెను పూర్ణమ్మ
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.
మాఘమాస వ్రతఫలితం
మాఘమాస వ్రతఫలితం
మాఘమాసో మహాన్ మానః నీరంనారాయణాత్మకం
ప్రాతఃస్నానంచపూజాచ భుక్తి ముక్తి ప్రదేశుభే
తస్మాన్ముముక్షవోజీవా యతధ్వంముక్తి వృత్తయే
భజధ్వం కేశవందేవం శివంవానిటలేక్షణమ్ ll
భావం
మాఘమాసము మహత్తరమైన - సర్వోత్తమమైన మాసము. జలము నారాయణాత్మకము. ఈ మాసమున ప్రాతఃకాలంలో స్నానము చేసి ఇష్ట దైవమును పూజించితే భుక్తిని - ఇహలోక సుఖానుభవమును మోక్షమును ఇచ్చును. కనుక భయంకరము, బాధాకరము అయిన సంసారబంధము నుండి మోక్షమును కోరేవారు ..... భుక్తిని - విముక్తిని ప్రసాదించు మాఘమాస ప్రవృత్తికై ప్రయత్నించండి. సర్వదేవతాస్వరూపుడైన శ్రీమన్నారాయణుని కానీ, నుదుటన కన్నుగల శివుడుని కానీ పూజించి, మాఘమాస వ్రతము ఆచరించి, సేవించి, తరించండి.
Subscribe to:
Posts (Atom)