February 2, 2014

మాఘమాస వ్రతఫలితం

మాఘమాస వ్రతఫలితం

మాఘమాసో మహాన్ మానః నీరంనారాయణాత్మకం 
ప్రాతఃస్నానంచపూజాచ భుక్తి ముక్తి ప్రదేశుభే 
తస్మాన్ముముక్షవోజీవా యతధ్వంముక్తి వృత్తయే 
భజధ్వం కేశవందేవం శివంవానిటలేక్షణమ్ ll 

భావం 
మాఘమాసము మహత్తరమైన - సర్వోత్తమమైన మాసము. జలము నారాయణాత్మకము. ఈ మాసమున ప్రాతఃకాలంలో స్నానము చేసి ఇష్ట దైవమును పూజించితే భుక్తిని - ఇహలోక సుఖానుభవమును మోక్షమును ఇచ్చును. కనుక భయంకరము, బాధాకరము అయిన సంసారబంధము నుండి మోక్షమును కోరేవారు ..... భుక్తిని - విముక్తిని ప్రసాదించు మాఘమాస ప్రవృత్తికై ప్రయత్నించండి. సర్వదేవతాస్వరూపుడైన శ్రీమన్నారాయణుని కానీ, నుదుటన కన్నుగల శివుడుని కానీ పూజించి, మాఘమాస వ్రతము ఆచరించి, సేవించి, తరించండి.    


  

No comments:

Post a Comment