October 4, 2018

ద్వారక యాత్రా విశేషాలు - Dwaraka Tour Details.... Day 7

Day - 7

10/9/18 ఉదయాన్నే 6 గంటలకి ఆలయద్వారం తెరిచే సమయానికి వెళ్ళి కృష్ణయ్యని సుప్రభాత దర్శనాన్ని చేసుకొని, గోమతి ఘాట్ చూసాము.


ఘాట్ ఒడ్డునుండి నడుచుకుంటూ వెళ్ళి సంగమ నారాయణుని దర్శించుకున్నాము. (గోమతీనది సాగరంలో కలిసే ప్రాంతంలో ఉన్న నారాయణుని సంగమ నారాయణుడు అని వ్యవహరిస్తారంట.)

అనంతరం ఇస్కాన్ కృష్ణ మందిరాన్ని చూసి 10 గంటలకి రూమ్స్ కి చేరుకున్నాము.

అప్పటికి నదిలో నీరు ఉంది.


నదిలో నీటిని చూసి, నదీ స్నానం చేసి రూమ్స్ కి చేరుకొని బట్టలు మార్చుకొని సుధామాసేతు(Sudhama Jhulaa)ని చూడటానికి బయలుదేరాము. (ఝూలాని ఎక్కడానికి Rs.10 టిక్కెట్టు)


ఝూలా దాటి ఆవలి ఒడ్డుకి చేరుకుంటే అక్కడ గరుడగామి శ్రీలక్ష్మీనారాయణ మందిరం ఉన్నది.

అందులో శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుక్మoతునిపై ఉన్న విగ్రహాన్ని మనం దర్శించవచ్చును.  




ఇక్కడ పంచపాండవులు తవ్వించిన 5 బావులు ఉన్నాయి. ఈ 5 బావుల్లో నీరు 5 రకాల రుచుల్లో ఉంటాయి. ఉప్పగా, తియ్యగా చప్పగా అలా వివిధ రుచుల్లో ఉన్నాయి. మేము టేస్ట్ చూసాము.

పాండవులు తమ సర్వస్వాన్ని కోల్పోయిన  తరువాత ఇక్కడికి  వచ్చినపుడు తమ  తపశ్శక్తితో ఈ 5 బావులు  పాండవులు తవ్వారని చెబుతుంటారు, ఒక్కో బావిలో రుచి ఒక్కోరకంగా వుంది.   ఆ పంచ బావులు 5 నదులకి  ప్రతీకలు అని చెప్పారు.

ధర్మ రాజు బావిలోని నీరు లక్ష్మణ నీరు అనీ,  భీమ కుండ్ లో జాంబవతి నది, అర్జునుడి కుండ్ లో గోమతి, నకులుడు ఉషావతి నది, సహదేవ్ కుండ్ లో చంద్రభాగ నది అని,  పిల్లుస్తారు. ఆ 5 నదులు ఎలా ఉన్నాయో ఈ క్రింది వీడియోలో చూడండి.



మధ్యాహ్నం భోజనాల అనంతరం ద్వారకకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న  బాడకేశ్వర్ మహాదేవ్ మందిరాన్ని చూడటానికి బస్సులో అందరం బయలుదేరి వెళ్ళాము. ఇది సముద్రం ఒడ్డున  గుట్ట మీద ఉన్న చిన్న శివాలయం. ఈ శివాలయాన్ని దర్శించాలన్నా కొంతసమయం వేచి ఉండాలి. సముద్రం వెనకకి వెళ్ళిన తరవాతనే స్వామిని దర్శించుకోగలం.


మేము వెళ్ళేసరికి వర్షం పడటం ఆరంభమయ్యింది. పూర్తిగా స్వామిని దర్శించకుండానే బయటకి వచ్చేసి అక్కడికి దగ్గర్లో ఉన్న లైట్ హౌస్ ని దూరం నుండే చూసి వచ్చి బస్సు ఎక్కి రూమ్ కి చేరుకున్నాము.

మళ్ళీ 6 గంటలకి వెళ్ళి  ద్వారకాధీశుడిని దర్శించి. రాత్రి హారతి వరకు ఉండి, హారతి చూసుకొని, 10 గంటలకి రూమ్ కి వచ్చి ఫలహారాలు చేసి పడుకొన్నాము. 

No comments:

Post a Comment