August 1, 2020

సుమతీ శతకం 61 నుండి 70 Poems

సుమతీ శతకం 61 నుండి 70 Poems 
61
పగవల దెవ్వరితోడను,
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,
దెగనాడవలదు సభలను
మగువకు మన సియ్యవలదు మహిలో సుమతీ !
62
పతికడకు తను గూర్చిన
సతికడకును వెల్పుకడకు సద్గురు కడకున్
సుతుకడకును రిత్తచేతుల
మతిమంతులు చనరు నీతి మార్గము సుమతీ !
63
పరనారీ సోదరుడై
పరధనముల కాసపడక పరులకు హితుడై
పరులు దను బొగడ నెగడక
పరు లలిగిన నలుగ నతడు పరముడు సుమతీ !
64
పరసతి కూటమి గోరకు
పరధనముల కాసపడకు పరునెంచకుమీ
సరిగాని గోష్టి చేయకు
సిరిచెడి చుట్టంబుకడకు జేరకు సుమతీ !
65
పాలను గలసిన జలమును
బాలవిధంబుననె యుండు బరికింపంగా
బాలచవి జెరుచు గావున
బాలసుడగువాని పొందు వలదుర సుమతీ !
66
పాలసునకైన యాపద
జాలింపడి తీర్చదగదు సర్వజ్ఞువకున్
దే లగ్ని బడగ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ !
67
పిలువని పనులకు బోవుట
గలయని సతి రతియు రాజు గానని కొలువున్
బిలువని పేరంటంబును
వలువని చెలిమియును జేయ వలదుర సుమతీ !
68
పురికిని ప్రాణము గోమటి
వరికిని ప్రాణంబు నీరు వసుమతి లోనన్
గరికిని ప్రాణము తొండము
సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతీ !
69
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా
పుత్రుని గనుకొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ !
70
పులిపాలు దెచ్చియిచ్చిన
నలవడగా గుండెగోసి యరచే నిడినన్
దలపొడుగు ధనముబోసిన
వెలయాలికిగూర్మిలేదు వినరా సుమతీ !

No comments:

Post a Comment