March 24, 2022

Lord Rama Songs

 Lord Rama Songs

దశరథ తనయా--79

పల్లవి:
దశరధ తనయా దాశరధీ......
కావగరావా...ఈ..జగతీ....!!దశరధ!!
అనుపల్లవి:
కరుణామయుడనందురే నిను
కరుణ జూపగ రావేలా....!!దశరధ!!
చరణం:
శరణనలేదా...శరణనుట కై వేచేవా
శతృమిత్రభేధమే లేక సకలజగమును బ్రోవుమయా
రామా.......కౌసల్యాతనయా...కనరావా....
.తాటకినేపరిమార్చితివే రామా.....!!దశరధ!!
చరణం :
శబరిని గుహుని బ్రోచితివే....
రాతిని నాతి గ చేసితివే.....!!2!!
వనముల తిరిగి వనములను..
కాననముల జీవులనుద్ధరించితివే రామా...!!దశరధ!!
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే...........
సహస్ర నామ తత్తుల్యం శ్రీ రామ నామ వరాననే.....
రచన:శ్రీకృష్ణ మాధవి
11--3--2020.....10A.M

భక్తి గీతము:
శ్రీరామా...........రామా ....యని పలుమారులు వేడగా దయగొంటివా ....భద్రాద్రిరామా.......
!!శ్రీ రామా..!!
నీదు ఆనతని తలదాల్చి....అ...అ.....నీదు ఆనతని తలదాల్చితి రామా.........రామా!!శ్రీ రామా....!!
నీదు నామమే నాదు నామమై.....
నీవు వినా మరి ఎవరు లేరని తలచి తలచి నీదు సేవచేయతలచి చేకొంటినీ కార్యము ....శబరి పోలు వనిత కోరిక విని మేని పులకరించ చేకొంటినీ ...రామా...రామా...!!శ్రీ రామా...!!
భద్రాద్రి రామయ్య ఆర్తిబాపితివి
మా ఆర్తి బాపి వరమీయ వచ్చావు రామ
ధన్యతనొందితి రామా ఈ జన్మకిది చాలు
రామా....వేరు కోరికలే లేవు రామా.....!!శ్రీ రామా...!!
భద్రాద్రి కొండన భద్రముగ నీవున్న
చాలు చాలు రామా...నీ దయనే
కరగనీ...కరగనీ...కరగనీకు తరగనీకు
నీ కొండనీ....నీ కొండనీ......రామా..రామా..!!శ్రీ రామా..!!
పలు వేడుకలు రంగ రంగ వైభవము న
జరగాలనీ సీతమ్మ కు నీకు నిత్య కల్యాణమే జరగాలనీ శ్రీరామా..నిత్యము
సత్యముగ నీవే పాలింపుమయ్యా రామా...రామా.....!!శ్రీ రామా....!!
రచన:శ్రీ కృష్ణ మాధవి

ఓర్చితి ఓర్చితి ఓ....రామా...
ఓరిమితో.....కూరిమి లేనీలోకమునా......ఓర్చితి......
నిజపతివి నీవని.....నా........నిజ
పతివి నీవని నమ్మితినిక్కముగ......
దరిచేర్చుకొనగ రారా రామా.......
నిలువనీయదేలనో నా.....మనమిక....!!ఓర్చితి!!
నీపదములవీడి
మనలేను రా రామా.....రామరామ
యను పిలుపు వినా మార్గమేదిరా
మరివేరు దారి వలదురా శ్రీరామా
గొనిపోవ రావేలరా... నీవే దిక్కురా ...!!ఓర్చితి!!
రచన:శ్రీకృష్ణ మాధవి
13--2--2022

నడచినది నడచినది సీతమ్మ
రామునివెంట శ్రీ రామునివెంట
నడవక విడువక నిదురన...
కలత నిదురన తలచెను నాధుని
ఊర్మిళ....తన నాధుని సేవలను
తలచినది ఊర్మిళ..భాగ్యశాలియని....!!నడచినది!!
అడవినందు మున్ముందు నడచి
రాలనుఏరి కంటకములనేరి
దారి సరిచూసి రాదారి చేసి సౌఖ్యమే
కలిగించుసీతారాములకి నానాధుడు
జలముతెచ్చి ఫలముతెచ్చి సత్ఫలము
నొందు సధ్భాగ్యశాలి నా నాధుడు .........!!నడచినది!!
సౌఖ్యమొసగని శయ్యపైన నిదురన్ననిదురా
దినదినము యుగమయినను సీతారాముల
తలచి రామునెడబాయని నాధుని కి రక్ష
శ్రీరామరక్ష నెటులనో ఓర్చెదనీఎడబాటు
తడబడనీక కునుకు తీయుచు గడిపెద
కష్టకాలమ్మనెంచక సీతారామధ్యానమ్మునా
నాధుని స్మరియించి నాధునికై తపియించి.....!!నడచినది!!
ఊహల ఊయలలో మాగన్ను నిదురనా
తాపముసహియించి తనువు మనసులకు
జోలపాడే ఊర్మిళ ఎంతటి సుగుణాలరాశి వో
పతి మనసెరిగిన మమతల జాబిలివో ....
శ్రీ రామదయారసపానవో ఏమనిపొగడుదు
నీదు త్యాగశీలతను ఉత్తమసంజాత ఊర్మిళా.........!!నడచినది!!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
2--2--2021


స్వాంతన నీయవా రామా.....
జలలతలనెగయు మనసులకీ.....!!స్వాంతన!!
జననము సత్యము
మరణము తథ్యము
నడుమవిషయ లో
లతల నలుగు మనసులకీ......!!.స్వాంతన!!
ఋణానుబంధ రూపేణ
పశు పత్ని సుతాలయా.......
తత్త్వమరసీ దిగులేలనో
తెలియగలేనిమనసులకు.......!!స్వాంతన!!
భవబంధమోహములతగిలి
తనరారు వారిమి...రామా...
శ్రీ రామా...జనకుని తీరున
మనలేము ఏలన రామా.......!!స్వాంతన!!
ఇచ్చునదినీవే సర్వమిచ్చునది
నీవే.......పుచ్చుకొనునది నీవే
రామా......జీవులపయనము
నీదరికేనని తెలిసీ ఏలనయా
మరి ఏలనయా ఈ దిగులు రామా...!!స్వాంతన!!
స్వస్తిప్రజాభ్యాః పరిపాలయన్తాం
న్యాయేనమార్గేణమహీమహీశాం
గోబ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం
లోకాసమస్తా సుఖినోభవంతు!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
9---1--2021.
జలలత:అల

పల్లవి :
దారువులమైతిమేల రామా.....చేతనత్వమిడి కందళింప చేయబ్రోవరావయా..రామా....శ్రీ రామా!!దారువులమైతిమేల! !
అనుపల్లవి :
భువనంబులన్ని నీవే ..
భువనమంతట నీవే..స్రష్ట వు ద్రష్టవు నీవే...రామా....రామా !!దారువులమైతిమేల! !
చరణం:
పాశబద్ధులము..పాశములనిచ్చినది నీవే..
నీవే.....సర్వ విదుండవు.......కోదండరామా...వెన్నుదన్నుగ బ్రోవరావయా...దివ్య తేజోన్మయా...సద్గుణసంపన్నా...రామా. ..!!దారువులమైతిమేల! !
చరణం:
చిత్తమందు ఏకాంతమందు హృద్భాషల పరవశమున బ్రోచుభారము నీదే గా రామా....రామా..మారుభాషణము లేమి లేక నీదులీలలు భాషణములే ప్రియమవ్వగ ..రామా.. సకలగుణాభిరామా....!!దారువులమైతిమేల! !
దారువు: కఱ్ఱ
కందళింప : చివురించ
స్రష్ట : సృష్టి కర్త
ద్రష్ట: నైపుణ్యం ,నిపుణత
రచన : శ్రీ కృష్ణ మాధవి
26-11--2019
10.30A.M


శ్రీ రాముడు వచ్చు నని విరులు విరిసే
సెలయేఱు లే .గల గలా ప్రవహించే ...!!.శ్రీ రాముడు!!
హరిత వర్ణమే స్వాగతమనే
పలకరించే చల్లని గాలులు
పులకరించి మనమున సీతతో
యడుగిడే యా వనమునా.
...అనుసరించె రామానుజుడు
.....!!శ్రీ రాముడు!!
ముని వాటికలే ఆమని వాటికలై
ఆదరమున సాదరమున పాడిరి
ఆహ్వాన గీతికలు రామాగమమున
స్వాంతననందిరసురుల భీతినొదిలి....!!శ్రీ రాముడు!!...
రచన: శ్రీ కృష్ణ మాధవి
25--7--2021


జయ జయ శ్రీరామ పావననామా....కాననవాసా
జయజయ శ్రీ రామా.....జయజయ రఘురామా.!!.(2)
ప్రసన్నవదనా...సత్యవాక్పాలకా..
ధర్మ విగ్రహ నిగ్రహ.. సంగ్రహావలోకనా !!(2)
జయజయ శ్రీరామ... శుభకర శ్రీరామ
సంగ్రామ ధీర ధీరోదాత్త ఉదాత్తరూపా
తాటక హంతక కౌశికయాగ (సం)రక్షకా..!(2)
జయ జయ శ్రీరామ పావననామా....కాననవాసా
జయజయ శ్రీ రామా.....జయజయ రఘురామా.!!
శతృభీకర.. మిత్ర ప్రియకర...
రాకేందు వదన మునిజన హితకర.. (2)
జయజయ శ్రీరామ శుభకర శ్రీ రామా
శౌర్య వీర పరాక్రమ తేజోజ్వల
శమ దమాది.. గుణోజ్వల.. ఇందీవర శ్యామా..(2)
జయజయ శ్రీరామ పావన నామా...కాననావాసా!!
జయజయ రఘురామా జయజయ శ్రీరామ.. !!.
రచన:శ్రీకృష్ణ మాధవి
22-7-2021

వేదనకనలేదా రామా సీతమ్మ
వేదనకనలేదా...........రామా.....వేదన
రావణచెరనబడిన సీతమ్మ
ఆవేదన......తోడుగ నెవరు
లేక......నెనరు లేక ....భీతిల్లి
భీకర రక్కసుల నడుమ నలిగిన
సీతమ్మ ఆవేదన కనలేదా....రామ
రామ యను నామమే తోడుగాగ....రామా...!!.వేదన!!
అనుజుని ప్రియ వచనముల
రామానుజుని ప్రియవచనముల
కపివరుల స్వాంతనమున
వనసౌందర్య వీక్షణముల
సీతమ్మ స్మృతులతో .....
కరిగె కాలము నీకు రామా...!!.వేదన!!
రచన: శ్రీ కృష్ణ మాధవి
25--5--2021
4.30A.M


సద్గతి నీయరా రామా
రామ రామ యనినంతనే.......!!.సద్గతి!!
సజ్జనసాంగత్యమునిడి
సన్మార్గపు త్రోవ జూపి
సత్యమిలను నిలప
సద్గుణ సాకార రామ.....!!సద్గతి!!
సృజనాత్మక రామా
స్మరణ మాస్మరణనీవే
సర్వకాలముల నీనామమే
సర్వపాపహరము రామ రామ...!!సద్గతి!!
రచన:శ్రీకృష్ణ మాధవి
9--5--2021

శ్రీ రామ నామమే మధురం
శ్రీ రాముని తలపే మధురం ....!!.శ్రీ రామ!!
కరుణాస్పద నేత్రద్వయమే మధురం
శ్రీ రాముని నగవే మధురాతిమధురం
ప్రేమాస్పద వాక్కు లే అతి మధురం......
బాల్య క్రీడలే బహు మధురం..........!!.శ్రీ రామ!!
శ్రీ రాముని తోడి చెలిమి మధురం
పంపాసరోవర విహారమే మధురం
శ్రీ రాముని విరహమే మధురం
శ్రీ రామ రాజ్య శోభలే మహామధురం.....!!శ్రీ రామ!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
30--4--2021

సారించె వింటి సౌజన్య సీతగాంచి
ఛేధించే ధనువు........ భళా భళా యని
శ్లాఘించెల్ల
దేవతలు కురిపించె సుమములు
ఆహోఁ........శ్రీరామ....!!సారించె!!
సోగకనుల సీత క్రీగంట చూసే
శ్రీ రాముని హృదయమే ఉప్పొంగె
కమలజాక్షి కనులకాంతుల మనసు
పంచుకొనే చల్లని చూపుల హరి
చందన శోభలు వెల్లివిరియగా........!!సారించె!!
సాఫల్యతనందె కౌశికముని
మానసము
తరియించె జగము
పులకించె వసుధ తన్మయమున
తనయ సౌభాగ్యసంపద కు........!!సారించె!!
ఆనందలహరులు నింగి నేలను తాక
ఏకమాయె జానకి రామచంద్రులు.....
లోకములకు ఎల్ల లోకములకు కల్యాణం....
కమనీయం మోహనకల్యాణ గానం.............
వసంత విపంచి మలయమారుత రాగం.........
రచన:శ్రీ కృష్ణ మాధవి
23--4--2021


హైలెస్సా హైలెస్సా తెడ్డు వేయరే
గోదారి ఒడీలోపడవ నడపరే .....!!.హైలెస్సా!!
ఒరవడి గా పరుగిడు నదిలో
వడి వడిగా నడపరే నావలు
సంబరంగ చూద్దాము సంబరాలు
రాములోరి సంబరాలు.............!!హైలెస్సా!!
పిల్లా పెద్దా కొట్టండోయ్ తప్పెటలు
వేయండోయ్ తాళాలు ఊదరే బూరాలు
సీతమ్మ వచ్చేను గజ్జెల గలగలల
సందడి చేయంగ ఓణీలరెపరెపల
గాజుల గలగల లా
ఆడండోయ్ నడపండోయ్ పడవలు...
హైలెస్సా ఒహోహో హో
.!!హైలెస్సా!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
20--4--2021

దిక్కు తోచదాయె--96
పల్లవి: దిక్కు తోచదాయె రామా....
దిక్కు తోచదాయె రామా...శ్రీ రామా...!!దిక్కు!!
అనుపల్లవి: అన్నిదిక్కులనీవే......
మరి నా దిక్కు నీవే రామా....శ్రీ రామా!!దిక్కు!!
చరణం: మూగపోయిన ది మనసు ఎందులకు రామా
మూగపోయినది మనసు ఎందులకు శ్రీ రామా..
తెలియజేయలేదు రామా మనసు అందలేదా...
నా పిలుపు నిను చేరలేదా రామా.....శ్రీ రామా!!దిక్కు!!
చరణం: పెంచుకున్న పంచుకున్న ప్రేమలన్ని....
.మృగతృష్ణయాయే రామా....
ప్రేమయనునది మిధ్యా...మనసు అనునది మిధ్యా
మమతలే ఆవిరాయే నేడేలనో రామా....!!దిక్కు!!
చరణం: సంసారసంద్రమే వీడమని సంకేతమా రామా
సంసార సంద్రమే వీడమని సంకేతమా రామా
అందించు నీచేయి అందుకొని రానా రామా
అందాలపాన్పో ముళ్ళదారో భారము నీవె రామా
నా భారము నీదె రామా....శ్రీ రామా.....!!దిక్కు!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
18--4--2020
5A.M

శ్రీ సీతారాముల కల్యాణవైభవము
ముదావహమెల్లజనులకు..........
!! శ్రీ సీతారాముల!!
ధనుర్భంగముచేసే...
శివధనుర్భంగం చేసే
ఫెళ ఫెళ రావముల
ఫెఠీల్ ఫెఠీల్మని విరుగగా
సందడి నెలకొనె కల్యాణ
వీణియ లు మ్రోగే మారుమ్రోగే.....!!శ్రీ సీతారాముల!!
రమ్యమైన లలనామయి రమ
రమ్యభాషిణి రమ్యవర్తిని రాము
ని శ్రీ రాముని క్రీగంట చూసి రమ్యత
ని పొందె రమా సౌశీల్యగుణశాలిని........!!శ్రీ సీతారాముల!!
నీలవర్ణశ్యాముడు ఇంద్రనీల వర్ణ
శ్రీ థాముడు ధీరుడు వీరుడు
ధర్మవర్తనుడు ధశరధాఙ్ఞానువర్తి
శ్రీ రాముడు వీక్షించె కనుగంట
కమలనేత్రిని ప్రేమాతిశయమునా.......!!శ్రీ సీతారాముల!!
పచ్చని పందిరులు చక్కని లోగిళ్ళు
తీయని మధుర రసములు
కన్నియల పరిహాసోక్తుల వేదమంత్ర
సహిత మిధిలాయోధ్యాపురములు
కిలకిలల కలకలలా థళ థళ మెరిసే .....!!.శ్రీ సీతారాముల!!
వీనులవిందుగ నాదములు
కన్నులపండుగ జంటలు
ఆనందమే జగతికి బ్రహ్మనందమే
జైజైరామ జానకి రామా జయ
జానకి రామా మంగళమ్ జయ
మంగళమ్ జయమంగళమ్
రచన:శ్రీ కృష్ణ మాధవి
7--3--2021


ఎంతని పొగడుదు రామా నీదయ
ఎంతెంతని పొగుడుదు రామా శ్రీ రామా.....!!ఎంతని!!
ఆలనపాలన నీదేగా
ఆలనపాలన నీదేగా
ఆశ్రిత మందారా ముద
మారగ కొలుతుము నిను రామా...!!.ఎంతని!!
విత్త భ్రాంతులకు
చిత్త భ్రాంతులకు
ఔషధము నీనామమే
దివ్యౌషధము నీనామమే రామా....!!ఎంతని!!
మత్సరమున మునుగు
జనుల బారినకాపాడు
నీనామమే రామబాణము
కైవల్యదాయకము రామా.....!!ఎంతని!!
ధర్మరూప సాధుసజ్జన
రక్షక వికృత మానస
శిక్షక శ్రీ రామ నీ నామమే
సద్గతుల తోవ శ్రీ రామా.......!!ఎంతని!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
17--3--2021

భక్తి గీతము:
శ్రీరామా...........రామా ....యని పలుమారులు వేడగా దయగొంటివా ....భద్రాద్రిరామా.......
!!శ్రీ రామా..!!
నీదు ఆనతని తలదాల్చి....అ...అ.....నీదు ఆనతని తలదాల్చితి రామా.........రామా!!శ్రీ రామా....!!
నీదు నామమే నాదు నామమై.....
నీవు వినా మరి ఎవరు లేరని తలచి తలచి నీదు సేవచేయతలచి చేకొంటినీ కార్యము ....శబరి పోలు వనిత కోరిక విని మేని పులకరించ చేకొంటినీ ...రామా...రామా...!!శ్రీ రామా...!!
భద్రాద్రి రామయ్య ఆర్తిబాపితివి
మా ఆర్తి బాపి వరమీయ వచ్చావు రామ
ధన్యతనొందితి రామా ఈ జన్మకిది చాలు
రామా....వేరు కోరికలే లేవు రామా.....!!శ్రీ రామా...!!
భద్రాద్రి కొండన భద్రముగ నీవున్న
చాలు చాలు రామా...నీ దయనే
కరగనీ...కరగనీ...కరగనీకు తరగనీకు
నీ కొండనీ....నీ కొండనీ......రామా..రామా..!!శ్రీ రామా..!!
పలు వేడుకలు రంగ రంగ వైభవము న
జరగాలనీ సీతమ్మ కు నీకు నిత్య కల్యాణమే జరగాలనీ శ్రీరామా..నిత్యము
సత్యముగ నీవే పాలింపుమయ్యా రామా...రామా.....!!శ్రీ రామా....!!
రచన:శ్రీ కృష్ణ మాధవి

No comments:

Post a Comment