March 24, 2022

Lord Sri Krishna Songs

Lord Krishna Songs 

భక్తి గీతం:

ఆనందమనిన ఇదియేగా నందనందనా ఆనందనందనా...!!ఆనందమనిన!!
పుట్టగోచీకట్టి ఎనలేని సౌఖ్యమున నిదురించినావురా.....!!ఆనందమనిన!!
నీలభవర్ణా.....దివ్య తేజా...నీలాకాశమే....సిగ్గు వడెరా......
నిను చూసి.....నీ దయ తెలిసీ....మేని నిగారము నే గనీ.......!!ఆనందమనిన!!
కొలువైనదీ...నెలవైనదీ...రూపమున.....శాంతి.....శాంతి కాముక శ్రీకృష్ణ......
ఉరళించు దేహమే దేవాలయం....
ఉలకక పలకక నిదురించు నీవే....
నా వద్ద నిదురించు నీ రూపమే....
ఎంత చూసినా తనివే తీరని
నా మధురస్వరూపం........!!2!!
కృష్ణా........యశోదాకృష్ణగా నిలిచిపోరా.....
యుగయుగాలు.........!!ఆనందమనిన!!
రచన: శ్రీకృష్ణ మాధవి

మాణిక్కంఙ్గట్టి--5
పల్లవి:
అలకలెరుగని వాడ
ఆటలలసిన వాడ
కునుకు తీయరా నాన్నా
లాలీ జో లాలీ లాలి కన్నా!!అలక!!
అనుపల్లవి:
నిదురవోతే నీఉల్లముల్లాసమందురా.....
బజ్జో ర బుజ్జి కన్నయ్యా లా...లీ.....లా....లీ....!!అలక!!
చరణం:
గగనాల నిలిచేవో....చేరి కొలిచేరురా......
చేరువైనావనీ.....అవనీ...నా..ధుడవని......
చెలిమిచూపేరురా....గగనవాసులు
సద్దుసేయక బజ్జో ర నాన్నా...లా...లీ.....జో...!!అలక!!
చరణం:
కనులెదుట నుండి కనుమరుగుకాక....!!2!!
ఆగడము సేయక నను ఆగడము సే....యక...
డోలికలనూగుచూ నిదురించరా.....
నా ....కన్నతండ్రీ.....ఇరుగుపొరుగు ల
ఊసులే వలదయ్య...వరదయ్య...
జో....జో.....జోజో.....జో లా.....లీ...!!అలక!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
6--3--2020
11.30A.M

మాణిక్కంకట్టి--8
పల్లవి: మఱు సంజె దాటే....హిమఝటిమే ..తొంగి చూసే....
వెచ్చగా...హాయిగా.....బజ్జుకొనరా. ...........!!మఱుసంజె!!
అనుపల్లవి: నీలి పంకమే... వీచుచుండె.......వినరా...
మా నీలధరా..........నీలాల లాలీ.....లా......లీ...!!మఱుసంజె!!
చరణం:పూతనా పాలుగ్రోలి నిదురించవేమిరా.......
చిచ్చరపిడుగు ఓలే.....అల్లరే వలదురా....
శ్రీదేవి భూదేవి పూజలే చేతురు...నీ....కొరకే....
నిరుపమానా తేజా నిదురపోమా....!!మఱుసంజె!!
చరణం:దృష్టి దోషమ్ములు తగులనీక రక్షనిడెదరా.....
నా తండ్రి బంగరు కొండడికి రక్ష రక్ష......
జగములనేలు వానికే సర్వరక్షా.......జో....జో....
జో......లా.....లీ......జోజో లా....లీ .......!!మఱుసంజె!!
రచన:శ్రీకృష్ణ మాధవి
మఱుసంజె:అసురసంధ్య
హిమఝటికము:పొగమంచు
నీలిపంకము: చల్లని మంచు గాలి
10--3--2020
11.30A.M

నీరాట్టమ్
పల్లవి: లాల పోసెద రారా....మా రాము సేయక.....
మా చిన్ని కన్నయ్యా....రా...రా....!!లాల!!
అనుపల్లవి:తిరిగి తిరిగి.... ఆడిపాడి .......
అలసిన మేనుకి ......!!లాల!!
చరణం: దుమ్ము ధూళి గొల్ల చల్లలు కలగలసి....
మేను అంతయు వింతగ మారె....
నిదురేల పట్టు నురా....జోలలెన్ని పాడినా!!2!!లాల!!
చరణం:దుడుకు దుందుడుకు పనులేలరా...
రా...రా...లా...లలకు....రా..రా...లా....ల..లకు
ఉసిరినీరు కాచి పెట్టితి....శీకాయ పన్నీరు తెచ్చితిరా
రా....రా......లా...ల..లకు రా..రా...!!లాల!!
చరణం: అప్పమె చేసితి.....వెన్నచేసితి నీకై
త్వరపడి రా..రా...జలకములాడగ.....
నవ్విపోదురందరూ....జిడ్డు వాడవనీ.....
పసుపు గంధముల పరిమళింతువు రా....రా...!!లాల!!
చరణం: వత్సుడను పడగొట్టి నట్టి....నా...
కుట్టికృష్ణా......కాళీయుని మదమడచిన.....!!2!!
ఘనశ్యామా..........గారాబమా.....
ఇంతగా.....వలదురా.....రా....రా....!!లాల!!
చరణం:నీలరత్న దేహా....వజ్రదేహా....
మా..నారాయణా....జలజశయనా......
పుట్టినరోజని...గదరా.....నిత్య సత్యా....
ముదు ముద్దు గ పిలిచే అమ్మ ని రా ......రా..రా..!!లాల!!
పెరియాళ్వారు ల నీరాట్టఘట్టము పాడిన వారికి మరి లేదు మరు జన్మ....హే కృష్ణా.....కృపజూపితివి పెరియభట్టరుల నొసగీ....
పెరియాళ్వారు దివ్యతిరువడిగళే శరణమ్
రచన:శ్రీ కృష్ణ మాధవి
3.30A.M
14--3--2020


ఏమియా అందము ఎంత ఆనందము
ఆనంద సాగర నంద నందనా కుందరవదనారవింద కమలలోచనా.....!!ఏమియా!!
జీవులన్ని నిను చేరి కొలిచేను ఆర్తితోడ....
జీవులన్ని నిను చేరి కొలిచేను ఆర్తితోడ...
తమలోని వ్యధలన్ని మరిచి నీఅండన
నీవు నేను భేధమొ దిలి నీ లోన కలిసేము...!!ఏమియా అందము!!
నీ నగుమోమే చాలయా
చింతలన్నిదీరి
నీ చెంతచేరి....ఆడిపాడ
భక్తి ప్రేమ పొంగి పొరలి పొదువుకొనచూతుము
నిను పొదువుకొన చూతుము...!!ఏమియా అందము!!
రచన:శ్రీకృష్ణ మాధవి
19--2--2022

జయశ్రీ కృష్ణ శబ్ధము
జయశ్రీ కృష్ణా.........జయ జయ కృష్ణ! రాధాకృష్ణా...
మాధవకృష్ణ....అచ్యుత అనంత గోవర్ధనోద్ధార గోవింద గోవింద కృష్ణ... !!జయశ్రీ!!
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ మురళీ కృష్ణ...మోహనకృష్ణ...నందగోపుని
ఆనంద కృష్ణ హరే హరే హరే హరే హరే.........హరే..!!జయశ్రీ!!
రేపల్లె కృష్ణ ..మధురా కృష్ణ....యశోద కృష్ణ..
దేవకి కృష్ణ......తాండవకృష్ణ...తారక కృష్ణ
కృష్ణ..కృష్ణ...కృష్ణ...కృష్ణ....హరే...హరే హరే హరే !!!జయశ్రీ!!
నాదము కృష్ణ వేదము కృష్ణ.....గానము కృష్ణ......శృతి శ్రీకృష్ణ...
స్ధితి శ్రీ కృష్ణ......గతి శ్రీ కృష్ణ....కృష్ణ....కృష్ణ..హరే..హరే..హరే!!జయశ్రీ!!
సత్యము కృష్ణ.....ధర్మము కృష్ణ...యఙ్ఞము కృష్ణ....కాలము కృష్ణ....కృష్ణ....కృష్ణ....కృష్ణ...కృష్ణ..
హరే...హరే...హరే..హరే...హరే....!!జయశ్రీ!!
భావము కృష్ణ....భాగ్యము కృష్ణ...భోగము కృష్ణ....
యోగము కృష్ణ...త్యాగము కృష్ణ..యాగమే కృష్ణ...
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ...హరే..హరే..హరే..హరే హరే!!జయశ్రీ!!
జీవము కృష్ణ.....జీవిక కృష్ణ....భూమిక కృష్ణ..పాలక కృష్ణ...
అహమే కృష్ణ...ఇహమే కృష్ణ...పరమే కృష్ణ..కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే హరే హరే హరే హరే!!జయశ్రీ!!
జలమూ కృష్ణ...ఫలము కృష్ణ....విరులే కృష్ణ...తరులేకృష్ణ...
గిరులే కృష్ణ ....సురలే కృష్ణ...రసమే కృష్ణ..తృష్ణా....కృష్ణా కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే హరే హరే హరే హరే!!జయశ్రీ!!
ఆదియు కృష్ణ....అన్తము..కృష్ణ....సర్వము కృష్ణ సకలము కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే హరే హరే హరే హరే హరే !!జయశ్రీ!!
!!గోవింద గోవింద గోపాల కృష్ణ గోవింద గోవింద గోపాల కృష్ణ!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
12--2--2020
రచనాసమయం: 9.30P.M

భానుడు--51
పల్లవి: సంధ్యాకాలపు వేళలో........భానుడస్తమించె..........
చంద్రుడు ఉదయించే...............!!సంధ్యా!!
అనుపల్లవి: చీకటి ముసిరే సమయాన....వెండి వెన్నెల విరబూసే.......విరబోసే........... !!సంధ్యా!!
చరణం:జగము ఊయలలు ఊగే
ఆనంద డోలికలూగే...........పరవశమందే.....
ఈరేయినా.......రసరాసకేళిజరిపే...రాధాకృష్ణులే...
విహరించి... విహరించి ...బృందావనిలో...
కనిపించినటుల అనిపించి.....మనసేపులకించే.....!!సంధ్యా!!
చరణం: నీటిలోన నీలి రంగు అలుముకొనే....
ఆనీలిరంగు నడుమ బంగరువన్నెలే.....తేలెనే..
బంగరు వన్నెలు తేలెనే.........నీలిరంగు నీవేకృష్ణా..
బంగరువన్నె రాధమ్మ........రాధమ్మా.........
రాధాకృష్ణుల సరాగాల... సలిలల స్నానమేచేసే.....!!సంధ్యా!!
రచన:శ్రీకృష్ణ మాధవి
12-1--2020
ర.సమయం: 6.50P.M.

గొల్లవారిమి కృష్ణా.......గొల్ల
భూముల చేరి మా గొల్ల భూమిన
చేరి చేసిన కొంటెపనుల చేర్చితివి
మము చేర్చితివి జతగ మాపుణ్యమే...!!.గొల్ల వారిమి!!
కల్లకపటములెరుగని వారిమని
ఎరిగి దయచూపితివో దయాశీలి
ఎల్లలెరుగని వాడ ఎల్లెడలచూచు
ఎరుకగలిగిన వాడ వినుమామొర......!!గొల్ల వారిమి!!
సూదంటురాయివొలె లాగినావు
నీదెస లాగినావు లీలాగ్రేసర రమా
వినోదా..ఎన్నడు పొమ్మనక మము
నీలోన పొదువుకొనరావయ్య రాధాలోల....!!గొల్లవారిమి!!
రచన:శ్రీకృష్ణ మాధవి

కంసుని చెరశాలన జనియించి......
చేరితివి నందుని గృహమునకు.......
పెరిగితివి యశోద గారము న.....
నందకిశోరా....వ్రేపల్లె వాడలా.........!!.కంసుని!!
పల్లెలో వ్రేపల్లె లో వినిపించిన ఆ.....
మోహన మురళీగా.....నం...............
ఎద ఎద లో పొద పొద లో సవ్వడులా....
అలరించిన మోహనకృష్ణా .....రా...వే....లా.....!!.కంసుని!!
సంపద భక్తిసంపద పెం..పొం...ద
చేసితిమి నీకై వ్రతము సిరివ్రతము
ఆశ్రితవత్సల... ఆనందకారకా......
ఆగక రావోయీ....ఆగమోద్ధారకా.........!!కంసుని!!
రచన:శ్రీకృష్ణ మాధవి

భువనమ్ము ల తిరుగు భూరిదేవర
నీ చరణ యుగళికి మంగళమ్........
అభయమిచ్చు అభయమూర్తికి ....
ఆపన్నహస్తుని కరములకు మంగళమ్.........!!భువనమ్ముల!!
గోవర్ధనునికి గోవత్సలునికి
గోపబాలునికి జయమంగళమ్
శకటాసురభంజనునికి అసుర
వైరిహరికి...జయ మంగళమ్..........!!భువనమ్ముల!!
ఘనునికి అఘహరుణునికి
అనుపమానునికి మంగళమ్
అసమానశౌర్యగుణాధిపునికి
అగణితగుణశీలునకు మంగళమ్........!!భువనమ్ముల!!
రచన:శ్రీకృష్ణ మాధవి

మృగరాజు గమనమున
రావయ్యా శౌరిసింగమా......!!మృగరాజు!!
దర్పమొలకించుచూ కోటి
సూర్యకాంతుల వేంచేయుమా
మాధవాసీనుడవుకమ్ము మా
హృదయసింహాసనమిదే కేశవా.....!!మృగరాజు!!
నిగమరూపా శృతులనుతుల
జేతుము తమితీరగా మాతమి
తీర పన్నగశయన పరమపురుషా
వలయునది నీవే వనమాలీ.............!!మృగరాజు!!
వినుమయ్య మా మొరలను
కనుమయ్య మా యాశలను
గొనుమయ్య మా సేవలను పర
వశతనొనరించినామీవ్రతమునీకై........!!మృగరాజు!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
6--1--2021.

సింగమా మేలుకొనుమా....నర
సింగమా.....శంఖుచక్రధారుడా.....
ఠీవి తోడ నీ దర్పమంతయు చూపి
వేగరావయ్యా..... శౌరి సింగమా............!!సింగమా!!
వినవయ్య మా విన్నపములు.....
కనులార నీ రూపు కాంచి విన్న
వించెదము మా విన్న పములు
నోరార నీ సంకీర్తనములు చేసెదము .....!!..సింగమా!!
నాలుగు నెలల వ్రతమాయె.......
వర్ష ఋతువే వెడలే............
ఏల ఇంకను గుహ నీకు....
నారసింహా......వెడలి రావయ్యా..........!!.సింగమా!!
శ్రీవ్రతదీక్షచేబూని యాచరణన
వున్న గోపికావారసులము....
సుంతైన దయబూని చూడరా......
ఇంతులమని కావగ రారా......... !!సింగమా!!
రచన:శ్రీకృష్ణ మాధవి

అభిమానము కరిగి కరిగి
ఆత్మాభిమానము వీడి నీనీడ
చేరవచ్చితిమి చేరరా మాధవా.......!!అభిమానము!!
మాతోడు గా నీవే నిలువు దేవరా
రాజీవనేత్రా......నేత్రానందముగ
వీక్షించి ధన్యత పొందు ఆశనా....
నిలిచితిమిచట నిర్మలవదనా......!!అభిమానమువీడి!!
నను నేను మరచి నేనన్నది విడచి
చేరితిమిచట పఱయే ఇత్తువో ఏమే
మిత్తువో నడిపింతువో నీ దారిన మము
వదలనే వదలక వరదరాజా వేడితిమి.....!!అభిమానమువీడి!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
6--1---2021

పరవళ్ళ ఉరవళ్ళ యమునా.......
రా రమ్మనె...రా రమ్మనె ...
నీ అడుగులు నాలోన....ఆ....ఆ....
పులకింతలిడగా స్వాగతమిదే.....
దామోదర.......స్వాగతమిడె.......!!పరవళ్ళ!!
రేపల్లె బాలుడా గోపాలుడనీ....
గోవుల్లు కాచువాడా బాలుడనీ
మన్ను వెన్న భేధమరయక....
మురిపించు వానికి నందదీపునికి .....!!పరవళ్ళ!!
ఇంటింట వెలుగొందు వానికి.....
సందిట నిలువనే నిలువని వానికి
గో గోప బాలుర చేరి యాడువానికి..
గోపకాంతల మనముదోచు వానికి.......!!పరవళ్ళ!!
రచన:శ్రీకృష్ణ మాధవి

నల్లని కాటుక మబ్బుల ఉరుముల
మెరుపుల జలజల జలసిరులుకురియా......
కాలువలు వెల్లువలా చెరువులు కుంటలు
నదీనదములు నిండగా........ఆనందముగా....
వరిసిరులు నిండుగ మెండుగ పండగా...............!!.నల్లని!!
శంఖనాదముల గణగణ గుడి గంటల
సుస్వర నాద విపంచికల మనసూయలూగా
కిలకిల లా గలగల లా పక్షి గణములస్వనముల
పులకరించు పచ్చని వనముల సందడి కై రావోయీ....!!నల్లని!!
వరుణా...చూపుము కరుణా.....హరే
జయ గోవింద హరే....హరే....హరే...
నారాయణా..నమోనారాయణా......
భవ జలధి దాటింపుమా...నారాయణా.....
గోవింద హరే..గోపాల హరే.....

రచన:శ్రీకృష్ణ మాధవి

కారుమబ్బు పట్టి తళతళ
మెరుపులు మెరిసే..నీనగవులా.....కృష్ణా....!!.కారుమబ్బు!!
ఉరుములు ఉరిమే ఘంభీరముగా
పాంచజన్య..ధ్వనియా........కృష్ణా........!!కారుమబ్బు!!
ఎడతెగని ధారలా వర్షించే
మేఘుడు నీ బాణవర్షమా.....!!2!!
నీ దయావర్షమా దామోదరా....
ఎంతెంత నీ దయగోపాలబాలా......!!కారుమబ్బు!!
వనములన్నీ ఘనముగా
శోభించే .......లతలు తరులు
పుష్పించే నీ ప్రేమ వర్షమున
మధూళి నింపుకొనే మధు
వ్రతలకై కృష్ణ రసమే యనీ..........!!కారుమబ్బు!!
కృష్ణ కృష్ణ హరే హరే
జయజయకృష్ణ నీలమేఘకృష్ణ
జయహో జయహో జయహో
రచన:శ్రీ కృష్ణ మాధవి
19--12--2020

పల్లవి : పీయూష వర్ష హర్షిత మురారే. ..
పీతాంబరధారే....హరే.....!!పీయూష! !
అనుపల్లవి : కల్లోలజలధినా....నావికా విహారే....
నారీజనహృత్కమలవికాసే........!!పీయూష! !
చరణం : వత్సవాటజా.......పులకిత వనసంచారే...
కుంజరః రక్షితా......ఙ్ఞానక్షీర ప్రవాళ....ప్రహేళా.!!2!!
హరే....హరే...హాస పరిపూరిత ముఖారవింద.
ప్రసన్న....ప్రపన్న........హరే...హరే..!!పీయూష! !
చరణం: నీ ఒసపరితనమునకుత్కంఠతో.......చంగలించు చంచరీకలమే..........!!2!!
షట్ స్వర మిళిత కదనకుతూహల.రాగ...బిందువులుగా మారి....శ్రీ హర్ష వర్షమై........ముంచెత్త సమకట్టి. ...!!పీయూష! !
చంగలించు : చలించు
చమరీకము: తుమ్మెద
పీయూషము: అమృతము
ప్రవాళము: వీణావరదండ పాణిని, పగడపు రంగు
ప్రహేళ: నగవు
ఒసపరితనము: సౌందర్యము
కదనకుతూహల : కర్నాటక సంగీతం లో రాగం పేరు
రచన: శ్రీ కృష్ణ మాధవి
22-11-2019
రచనాసమయం : 11.30A.M

మాణిక్కంఙ్గట్టి--6
పల్లవి: అమ్మనిచూసి నవ్వులొలకబోసేవు....కన్నయ్యా
కమ్మగా నిదురపో.....జోజో లాలీ జో జో జో!!అమ్మ ని!!
అనుపల్లవి:దో..బూచి...దోదో..బూచి..ఆటలెన్నొ ఆడేవు
ఆడి ఆడి నీవు నిదురించరా.....జోజో జోజో!!అమ్మ న!!
చరణం:ముత్యాల ఊయలేసేనురా .....పగడాల ఊయలవేసేనురా....పండంటి పాపడవు..పదిలంగా
నిదురపో......మింట వరుణుడే వున్నాడురా...
జోజో.... జోజో..... జోజో..... జోజో .....!!అమ్మ ని!!
చరణం: నలనల్లని ముంగురుల వాడా
అల్లనమెల్లనా నిదురోరా.....!!2!!
బూచివానిరానీక రక్షకట్టానురా ......భయమువలదుకన్నా
అమ్మ నే వున్నా..........జో .....లా.......లీ..
జోజో లా.....లీ.........జోజో......జో.......!!అమ్మ ని!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
6--3--2020
10.30A.M

మాణిక్కంఙ్గట్టి--5
పల్లవి: అలకలెరుగని వాడ
ఆటలలసిన వాడ
కునుకు తీయరా నాన్నా
లాలీ జో లాలీ లాలి కన్నా!!అలక!!
అనుపల్లవి: నిదురవోతే నీఉల్లముల్లాసమందురా.....
బజ్జో ర బుజ్జి కన్నయ్యా లా...లీ.....లా....లీ....!!అలక!!
చరణం: గగనాల నిలిచేవో....చేరి కొలిచేరురా......
చేరువైనావనీ.....అవనీ...నా..ధుడవని......
చెలిమిచూపేరురా....గగనవాసులు
సద్దుసేయక బజ్జో ర నాన్నా...లా...లీ.....జో...!!అలక!!
చరణం: కనులెదుట నుండి కనుమరుగుకాక....!!2!!
ఆగడము సేయక నను ఆగడము సే....యక...
డోలికలనూగుచూ నిదురించరా.....
నా ....కన్నతండ్రీ.....ఇరుగుపొరుగు ల
ఊసులే వలదయ్య...వరదయ్య...
జో....జో.....జోజో.....జో లా.....లీ...!!అలక!!
రచన:శ్రీ కృష్ణ మాధవి
6--3--2020
11.30A.M





No comments:

Post a Comment