September 28, 2022

తృతీయ ఆవరణం - సర్వసంక్షోభణ చక్రం

 3. (తృతీయ ఆవరణం) - సర్వసంక్షోభణ చక్రం

ఆదితాళం రాగం :- బేహాగ్



ప. శ్రీరాజ రాజేశ్వరిపాహిపాహిమాం అణిమాది సిద్దేశ్వరి సదారక్షమా

అ.ప. సర్వశాస్త్ర వర్ణితా సకలదేవ సురసనుతా శ్రీ చక్ర సంస్థితా మల్లికా సుమశోభిత |శ్రీ|

చ.1. 

అష్టదళపద్మవాసి అష్టాక్షరి

అష్టైశ్వర్య ప్రదాయిని త్రిపురసుందరి

సర్వసంక్షోభణ చక్రస్వామిని

జపాకుసుమ సంకాశిని సుప్రకాశిని |శ్రీ|

చ.2. 

అనంగకుసుమా అనంగమేఖలా

అనంగమదనా అనంగాంకుశాది

పరివారదేవతా పూజితచరణ

అకలంక రూపవర్ణ అపర్ణా సువర్ణా |శ్రీ|


September 27, 2022

2. (ద్వితీయావరణం) - సర్వాశా పరిపూరక చక్రం

 2. (ద్వితీయావరణం) - సర్వాశా పరిపూరక చక్రం


పల్లవి.  శ్రీ లలితా అమేయకృపాన్విత 
శంకరార్ధ శరీర విలసిత

అ.ప. సర్వలోకహిత మునిజనసన్నుత దివ్యకళామయ రూపశోభిత |శ్రీ|

చ.1.

షోడశదళనివాసినీ షోడశాక్షరీ

సర్వాంశాపరిపూరక చక్రవాసినీ

వాంచితార్ధ ప్రదాయినీ కామిని

మల్లికాకుసుమ గంధ సురుచిరవేణీ |శ్రీ|

చ.2.

నవరాత్రి సంచారిణి నవయవ్వనశాలిని

నవావరణ పూజితనవనిధి సంధాయినీ

శరశ్చంద్ర నిభాననా త్రిపురేశీ వజ్రినీ

యంత్రమంత్రస్వరూపిణి భవసాగరతారిణీ |శ్రీ|

శ్రీ చక్ర నవావరణమాలిక 01

 శ్రీ చక్ర నవావరణమాలిక


మొదటి ఆవరణ త్రైలోక్య మోహన చక్రం

రచన శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి గారు



హారతిపాట (ఆదితాళము)

సర్వమంగళకారిణీ! పాపహరిణీ పావనీ

శంభుమోహినికామదా! హారతిని గైకొనుము తల్లీ॥


బిందుమండలవాసినీ! మాణిక్యసింహాసనీ

సర్వదాయిని శంకరీ!హారతిని గైకొనుము తల్లీ॥


కమలవాసినికామాక్షి!పరాశక్తివైఖరీ

శర్మదాయిని శర్మదా! హారతిని గైకొనుము తల్లీ॥


సృష్టి స్థితి లయ కారిణి! చంద్రశేఖరి శ్రీధరీ

మల్లికా సుమ మోహిని! హారతిని గైకొనుము తల్లీ॥


నిత్య హాసిని భ్రామరీ భక్త హృదయ నివాసినీ

శ్రీమాతా శ్రీలలితా హారతిని గైకొనుము తల్లీ॥


1. (ప్రథమావరణం) - త్రైలోక్యమోహనచక్రము (త్రిపుర)

ఆదితాళము రాగం:—బౌళి


పల్లవి. త్రైలోక్యమోహన శ్రీ చక్రవాసిని సూర్య తేజోభాసినీ శ్రీ లలిత॥

అ.ప. నిత్య సుందరహాసినీ భక్త మనోల్లాసినీ

తాంబులపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా॥

చ.1 

వారాహి వైష్ణవి కౌమారి మహాలక్ష్మి

పరివార దేవతలు కొలువుతీరంగా

సర్వవశంకరీ సర్వాకర్షిణి

సర్వయోగినులు నిన్ను కొలువంగా |త్రైలోక్య|

చ.2 

పంచ ప్రణవాధరీ వరదా భయకరీ

శ్రీ సౌభాగ్య విద్యేశ్వరీ శ్రీకరీ

ముక్తా మాణిక్యాభ త్రైలోక్యమోహినీ

దేవీ త్రిపుర శృంగార రసధునీ |త్రైలోక్య


September 25, 2022

కాశీ క్షేత్రంలో 56 గణపతులు

 కాశీ క్షేత్రంలో 56 గణపతులు ఎక్కడ ఉన్నారు వారి పేర్లు & క్షేత్ర వైశిష్ట్యం


కాశీలో 56 గణపతులు ఉన్న ఆవరణాల చిత్రం


Abhaya Vinayaka

Arka Vinayaka

Asha Vinayaka

Bhimachandi Vinayaka

Avimukta Vinayaka

Chaturdanta Vinayaka

Chintamani Vinayaka

Chitraghanta Vinayaka

Dantahasta Vinayaka

Delhi Vinayaka

Durga Vinayaka

Durmukha Vinayaka

Dwara Vinayaka

Dwimukha Vinayaka

Ekadanta Vinayaka

Gaja Vinayaka

Gajakarna Vinayaka

Gananatha Vinayaka

Gyanan Vinayaka 

Heramba Vinayaka

Jyesta Vinayaka

Kaala Vinayaka 

Kali Priya Vinayaka

karva Vinayaka

Koonitaksha Vinayaka

Kooshmanda Vinayaka

Kshipra parasada Vinayaka

Kutadanda Vinayaka

Lambodara Vinayaka 

Mangala Vinayaka

Manikarnika Vinayaka

Mitra Vinayaka

Moda Vinayaka

Modakapriya Vinayaka

Munda Vinayaka

Nagesha Vinayaka

Paasapani Vinayaka

Panchasya Vinayaka

Pichandila Vinayaka

Pramoda Vinayaka

Pranava Vinayaka

Rajaputra Vinayaka

Shalakanta Vinayaka

Sristi Vinayaka

Siddhi Vinayaka

Simhatunda Vinayaka

Sthulajangha Vinayaka

Sthooladanta Vinayaka

Sumukha Vinayaka

Trimukha Vinayaka

Uddandamunda Vinayaka

Uddhanda Vinayaka

Vakratunda Vinayaka

Varada Vinayaka

Vughnaraja Vinayaka

Vikatadwaja Vinayaka

Yaksha Vinayaka