శ్రీ చక్ర నవావరణమాలిక
సర్వమంగళకారిణీ! పాపహరిణీ పావనీ
శంభుమోహినికామదా! హారతిని గైకొనుము తల్లీ॥
బిందుమండలవాసినీ! మాణిక్యసింహాసనీ
సర్వదాయిని శంకరీ!హారతిని గైకొనుము తల్లీ॥
కమలవాసినికామాక్షి!పరాశక్తివైఖరీ
శర్మదాయిని శర్మదా! హారతిని గైకొనుము తల్లీ॥
సృష్టి స్థితి లయ కారిణి! చంద్రశేఖరి శ్రీధరీ
మల్లికా సుమ మోహిని! హారతిని గైకొనుము తల్లీ॥
నిత్య హాసిని భ్రామరీ భక్త హృదయ నివాసినీ
శ్రీమాతా శ్రీలలితా హారతిని గైకొనుము తల్లీ॥
1. (ప్రథమావరణం) - త్రైలోక్యమోహనచక్రము (త్రిపుర)
ఆదితాళము రాగం:—బౌళి
పల్లవి. త్రైలోక్యమోహన శ్రీ చక్రవాసిని సూర్య తేజోభాసినీ శ్రీ లలిత॥
అ.ప. నిత్య సుందరహాసినీ భక్త మనోల్లాసినీ
తాంబులపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా॥
చ.1
వారాహి వైష్ణవి కౌమారి మహాలక్ష్మి
పరివార దేవతలు కొలువుతీరంగా
సర్వవశంకరీ సర్వాకర్షిణి
సర్వయోగినులు నిన్ను కొలువంగా |త్రైలోక్య|
చ.2
పంచ ప్రణవాధరీ వరదా భయకరీ
శ్రీ సౌభాగ్య విద్యేశ్వరీ శ్రీకరీ
ముక్తా మాణిక్యాభ త్రైలోక్యమోహినీ
దేవీ త్రిపుర శృంగార రసధునీ |త్రైలోక్య
No comments:
Post a Comment