September 28, 2022

తృతీయ ఆవరణం - సర్వసంక్షోభణ చక్రం

 3. (తృతీయ ఆవరణం) - సర్వసంక్షోభణ చక్రం

ఆదితాళం రాగం :- బేహాగ్



ప. శ్రీరాజ రాజేశ్వరిపాహిపాహిమాం అణిమాది సిద్దేశ్వరి సదారక్షమా

అ.ప. సర్వశాస్త్ర వర్ణితా సకలదేవ సురసనుతా శ్రీ చక్ర సంస్థితా మల్లికా సుమశోభిత |శ్రీ|

చ.1. 

అష్టదళపద్మవాసి అష్టాక్షరి

అష్టైశ్వర్య ప్రదాయిని త్రిపురసుందరి

సర్వసంక్షోభణ చక్రస్వామిని

జపాకుసుమ సంకాశిని సుప్రకాశిని |శ్రీ|

చ.2. 

అనంగకుసుమా అనంగమేఖలా

అనంగమదనా అనంగాంకుశాది

పరివారదేవతా పూజితచరణ

అకలంక రూపవర్ణ అపర్ణా సువర్ణా |శ్రీ|


No comments:

Post a Comment