4. (చతుర్ధ ఆవరణం) - సర్వ సౌభాగ్య చక్రము (త్రిపురవాసిని )
ఆదితాళము రాగం:- భీం ప్లాస్
ప. ఓంకారరూపిణి శ్రీకామేశ్వరి సర్వసౌభాగ్య చక్రస్వామిని
అ.ప. ఓ జగజ్జననీ మంగళకారిణీ అభయ మీయవే శ్రీ మాతా
చ.1.
దాడిమీ కుసుమ కాంతి వర్ణిని
భాగ్యాబ్ధి చంద్రికా భాగ్యఫలప్రదా
సర్వాహ్లాదిని సర్వమోహినీ
సర్వ మంత్రమయీ పరివార పూజితా॥
చ.2.
చింతామణి గృహవాసిని హంసిని
శివశివాత్మికే త్రిపుర వాసిని
చతుర్డశ భువన మండల విహారిణి
హ్రీంకారాంకిత మంగళచరణీ॥
No comments:
Post a Comment