October 6, 2022

6. (షష్టమీ ఆవరణం) - సర్వ రక్షాకర చక్రము (త్రిపురమాలిని)

 6. (షష్టమీ ఆవరణం) - సర్వ రక్షాకర చక్రము (త్రిపురమాలిని)

ఆదితాళము రాగం :- మోహన


ప.శ్రీచక్రాంకిత వాసినీ

దుర్వాసార్చిత గుప్తయోగినీ

అ.ప. చంద్రసహోదరి రాశిస్వరూపిణి

సుందరవదనీ కమలనిలయినీ

చ.1.

కామకాళాధరి పంచదశాక్షరి

సర్వరక్షాకరి శివంకరీ

సర్వవిద్యామయి ఐశ్వర్యమయీ

సర్వ శక్తిమయీ త్రిపురమాలిని

చ.2.

దశకోణార్చిత క్రోధినిరౌద్రిని

రత్న సింహాసినీ రాక్షసదమనీ

శక్తి యుక్తిగుణ కర్మ విధాయిని

అణిమాగరిమాది సిద్ధి ప్రదాయిని

No comments:

Post a Comment