11. లాలి పాట
అసురుల వధ అనంతరం అలసిన అమ్మవారికి పవళింపు పాట
లాలి లాలి లాలి లాలమ్మ లాలి లాలి
లాలి లాలి లాలి లాలమ్మ లాలి లాలి
హిమశైలపుత్రి లావణ్య గాత్రి
జగదేక జనయిత్రి లాలి లాలి
చ.1
శ్రీలక్ష్మి పూవుల పాన్పు వేయంగా
శ్రీవాణి నీకు వీవెన విసరంగా
ముక్కోటి దేవతలు ఊయలలూపంగా
మేము పాడెదమమ్మ మురిపెంపు జోల |లాలి|
చ.2
గాజుల గలగలతో ఊయలలూపేము
లాలి లాలి యంచు జోలపాడేము
అసురుల వధియించి అలసిపోయితివేమో
నిదురించవే కొమ్మ బంగారుబొమ్మా | లాలి
No comments:
Post a Comment