7. (సప్తమావరణం) - సర్వరోగ హర చక్రము (త్రిపుర సిద్ధి)
ఆదితాళము రాగం :- మలయమారుతం
ప. బిందు మండల వాసినీ శ్రీం హ్రీం కామేశ్వరి
సర్వరోగహరిణీ త్రిపురసుందరీ పాహిమాం
అ.ప. శివధ్యానలగ్నా నవీనార్క వర్ణా
మహా బిందుమధ్యా మహాదేవి పాహి॥
చ.1.
దివ్య భూషణ భూషితా సర్వ లక్షణ లక్షితా
దివ్య చందన చర్చితా మహాదేవ ప్రమోదితా
చ.2.
మాతృకా వర్ణరూపిణీ సోమసూర్యాగ్ని లోచనీ
యోగినీ గణ సేవితా త్రిపురసిద్ధి—పాహిమాం॥
No comments:
Post a Comment