October 6, 2022

9. (నవావరణం) సర్వానందమయ చక్రము (మహాత్రిపుర సుందరి)

 9. (నవావరణం) సర్వానందమయ చక్రము (మహాత్రిపుర సుందరి)

ఆదితాళము రాగం : ద్విరాగామేళనం


ప. శ్రీ లలితాంబికే విమలాత్మికే

శ్రీ చక్రశోభితే పరదేవతే

చ.1.

సర్వ యంత్రాత్మికే సర్వమంత్రశోభితే

సర్వ దేవసంస్తుతే సర్వతంత్రరూపే

నవావరణపూజితే మణిమంటపసదనే

సకుంకుమవిలేపితే సర్వసౌభాగ్యదే |శ్రీ|

చ.2.

హేమాంబుజ పీఠికే రమణీయగుణార్ణవే

కామేశ్వరాంకస్ధే స్వాధీనవల్లభే

ధనుర్భాణధరకరే పరశివాలింగితే

భాగ్యాబ్దిచంద్రికే నిర్వాణసుఖదే |శ్రీ|

చ.3. 

 కర్పూరవీటికే కాదంబవాటికే

శరణాగతవత్సలే హృత్కమలవాసితే

సర్వానందమయే షోడశికారూపే

నవమల్లికాకుసుమ పూజితచరణే |శ్రీ|

No comments:

Post a Comment