మన హిందూ సంస్కృతీ సంప్రదాయాలు
ఏకార్యక్రమం చేసే ముందు ఐనా మనం కొన్ని విషయాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది.
ఏశుభకార్యక్రమైనా చేసే ముందు దంపతులు పీటలు మీద కూర్చొని కార్యక్రమం చేయటం ఆనవాయితీ కదా !
ఆ దంపతులు పీటలు మీద కూర్చోవటానికి ముందు వారి చేతికి తాంబూలం ఇచ్చి మనం కూర్చుండబెట్టాలి. ఆ తాంబూలం(ఆకు,వక్క,పండ్లు)లో 2 పండ్లు(ఏ విధమైన పండ్లయినా సరే) ఉంచాలి.
హారతి ఇచ్చే పళ్ళెంలో దీపారాధన చేయటానికి కుంది,(వెండి, ఇత్తడి ,రాగి ఏదైనా వాడవచ్చు. స్టీలు కుంది వాడకూడదు) వత్తులు, నూనె, తాంబూలం, అక్షింతలు, అగ్గిపెట్టె, పసుపు- కుంకుమ ఉంచాలి.
ఏ సందర్భంలోనైనా దంపతులకి బట్టలు పెట్టవలసి వస్తే ఆ బట్టలలో నలుపు రంగు లేకుండా చూసుకోవాలి.
శుభకార్యాలప్పుడు, పండుగ రోజుల్లో స్త్రీలకి (ఆడవాళ్ళు పిల్లలైనా, పెద్దలైనా ముత్తైదువులకి) ముఖానికి కుంకుమ బొట్టు పెట్టి, కంఠానికి గంధం పూసాకనే కాళ్ళకు పసుపు రాసి తాంబూలం ఇవ్వాలి. (కాళ్ళకి పసుపు రాసిన తరవాత ముఖానికి బొట్టు పెట్టకూడదు.... క్రింది నుండి పైకి రాకూడదు. పైనుండి క్రిందికి రావాలి.)
ఏ సందర్భంలోనైనా హారతి ఇచ్చే ముందు దేవునికి హారతి అద్దిన తరవాతనే పెద్దలకైనా, పిల్లలకైనా అద్దాలి.
ఎవ్వరైనా తమ జీవితంలో ఒక్కరికైనా కన్యాదానం చేస్తే చాలా మంచిది. (ఆడపిల్లలు లేనివారు తమ కులంలోనైనా, వేరే కులంలో అమ్మాయికైనా సరే కన్యాదానం చేయవచ్చును.)
ఎవరికైనా ఏ సందర్భంలోనైనా తాంబూలం ఇచ్చేటప్పుడు ఆకుకి, పండుకి కూడా తొడిమలు మనవైపు ఉంచుకొని, కొసలు పుచ్చుకునే వారివైపు ఉండేటట్టు చూసుకోవాలి.
ఇంట్లో చూలింత(గర్భం ధరించిన స్త్రీ) ఉన్నప్పుడు మంచి గుమ్మిడికాయ ఆ ఇంట్లో పగలగొట్టకూడదు.
No comments:
Post a Comment