5. (పంచమ ఆవరణం) - సర్వార్ధ సాధక చక్రము (త్రిపురాశ్రీ)
ఆదితాళము రాగం :- మధ్యమావతి
ప. శ్రీ భువనేశ్వరి త్రిపురాశ్రీ సర్వార్థ సాధక చక్రవాసిని
అ.ప. కామరూపిణి విశ్వధారిణి సంధ్యారుణ వర్ణినీ చక్రినీ॥
చ.1.
ప్రణవవాసినీ ప్రణవరూపిణి
ప్రళయకారిణి ప్రాణదాయినీ
సత్యసనాతని దైత్యశమనీ
అఖిలాండేశ్వరి భువనవశంకరీ॥
చ.2.
కోటిప్రభాకర తేజోరాసి
కోటిసుధాకర కళావతంసి
మల్లికా కుసుమ శోభిత చరణీ
పరమదయాకరీ పరమపావనీ॥
No comments:
Post a Comment