అచ్చట్లు .......ముచ్చట్లు
అచ్చట్లు ................ ....... ముచ్చట్లు
అచ్చట్లు ................ ....... ముచ్చట్లు
మనుమరాలిగా పుట్టినందుకు మరమరాలు(మూరీలు)
ముద్దుగా ఉన్నావని ముద్దకోవా
చిరునవ్వులు చిప్స్
అల్లరి చేస్తుంటే చిల్లర
గోలచేస్తుంటే గోరుమిట్లు
దూకుడికి దువ్వెన్నలు
కేకలకు కేకులు
కేరింతలకి ఈలలు
చలాకీకి చాక్లేట్లు
బిజీగా ఉంటే బిస్కెట్లు
పళ్ళువస్తే పటికబెల్లం
అడుగులకు అరిసెలు
పేచీలు పెడితే పెన్నులు
బొంగరంలా తిరుగుతుంటే బొంగరాలు
బుడిబుడినాడకలకి బూరెలు
ఆడుకుంటుంటే అటుకులు
సైగలు చేస్తుంటే సైకిలు
కూర్చోవటం వస్తే కుర్చీలు
మాట్లాడటం వస్తే మణుగుబూరెలు
కబుర్లు చెబుతుంటే కజ్జికాయలు
గడపదాటితే గారెలు
కోరపళ్ళు వస్తే కొబ్బరుండలు
పాకుతున్నప్పుడు పాలకోవాలు
మారాంచేస్తుంటే మామిడిపళ్ళు
No comments:
Post a Comment