10. తొమ్మిది రోజుల శ్రీ చక్ర పూజ అనంతరం నీరాజనం
నీరాజనం పాట
ఆదితాళం రాగం: సురటి
ప. శ్రీ చక్రసంచారిణి రాజరాజేశ్వరి
త్రిగుణాత్మికా నీకు శుభమంగళం
అ.ప. శ్రీ మాతా శ్రీ లలితా శ్రీ మహారాజ్ఞిరో
జయమంగళం నిత్య శుభమంగళం॥
చ.1.
సరోజ దళనేత్రి సద్గుణ చారిత్రి
జగదేక జనయిత్రి జయమంగళం
శివుని పర్యంకమున కాదంబ వనమున
రాజిల్లు కామేశ్వరి జయమంగళం॥
చ.2.
స్వర్ణ మణిమయతేజ మంటపమునందున
జ్ఞానస్వరూపిణీ జయమంగళం
ధనధాన్యములనిచ్చి సౌభాగ్యములనొసగు
శక్తిస్వరూపిణీ శుభమంగళం॥
చ.3.
నవకోటి యోగినీ గణసేవితా
సర్వమంగళ నిత్య శుభమంగళం
నవమల్లికాకుసుమ పూజలందేతల్లి
భువనేశ్వరీ నిత్య శుభమంగళం
జయమంగళం నిత్య శుభమంగళం
No comments:
Post a Comment