8. (అష్టమ ఆవరణం) - సర్వసిద్ధి ప్రద చక్రము
ఆదితాళము రాగం : వరాళి
ప. శ్రీ లలితాంబ త్రిపురాంబ
జగదాంబ కమలాంబ
అ.ప. తేజో రూపిణి సంపదకారిణి
కరుణా నిలయిని మాలిని శూలిని |శ్రీ|
చ.1.
శూలధారిణీ పరశివకామిని
సర్వసిద్ధి ప్రద చక్రనివాసిని
విజయప్రసాదిని విశ్వవినోదిని
కల్మషమోచని ఆశ్రితరక్షకి |శ్రీ|
చ.2.
పరమదయాకరి పరమహంసిని
కామేశ్వర వామాంకనిలయిని
కుందమల్లికా కుసుమశోభిని
నతవరదాయకి శ్రీ మహేశ్వరీ|శ్రీ|
No comments:
Post a Comment