April 27, 2023

శివానందలహరి పాటలు ప్రార్థనా గీతం 03

 శివానందలహరి పాటలు ప్రార్థనా గీతం 03


అర్ధనారీశుని భజియించరే 

ఆ ఉమా మహేశులను సేవించరే 

శివశక్తిమయమైచిచ్చక్తి నిలయమౌ

చ 1

వాలుకన్నులతూపులు సోయగములు చిలుక 

బేసికన్నుల చూపులు కారుణ్యములొలుక 

హేమంపు కలువల భూషణములు మెరయ 

క్రూరంపు చిలువల పూత్కారము కురిసె 

శివశక్తిమయమై చిచ్చక్తి నిలయమౌ ॥

చ 2.

మెరిసేటిపట్టు పీతంబరములొకవంక 

బిరిసైన గజచర్మాంబరములొకవంక 

స్తనభరములొకవంక కరకుటురమొకవంక

నెలవంక ఒక వంక సూర్యవంక ఇటువంక 

శివశక్తిమయమై చిచ్ఛక్తి నిలయమౌ ||

చ 3

ఇటుగంధపుసేతలు అటుబూడిదపూతలు 

ఇటుముత్యాలసౌరు అటు రుద్రాక్షపేరు 

ఒకవంకనల్లనై ఒకవంకతెల్లనై 

శివశక్తిమయమై చిచ్చక్తి నిలయమౌ ||


No comments:

Post a Comment