April 27, 2023

శ్రీ లలితా సహస్ర నామ గీతమాలిక

శ్రీ లలితా సహస్ర నామ గీతమాలిక

1 శ్రీమాతా



శ్రీమాతా శ్రీలలితా
లలితలలిత పద కవితా కలితా

మునిజన మానస సంచరిత
ఆగమాది వినుతా శివమోహిత

ఇచ్ఛా జ్ఞానశక్తి సమన్విత
భక్తపాలిత నవావరణ పూజిత


శ్రీచక్రాంకిత మంత్రారాధిత
శివానందభరిత సుచరిత 

2 శ్రీ మహారాజ్ఞి



శ్రీ మహారాజ్ఞి శ్రీ చక్రవాసిని
కరుణారస వాహిని మోహినీ చక్రిణీ


సంగీత సాహిత్య సంతోషిణీ
చతుష్షష్ఠి కళామయి చిద్విలాసినీ
సమరోత్సాహిని శంభుమోహిని
కల్యాణకారిణి ప్రణవ స్వరూపిణి


మంగళ శోభినీ కామరూపిణి
సర్వవేదచారిణీ పాప హారిణి
సర్వలోకమయి సర్వశక్తిమయి
ఆదిశక్తి మహిషాసురమర్ధిని


3 శ్రీమత్ సింహాసనేశ్వరి



శ్రీమత్ సింహాసనేశ్వరి
సింహవాహినీ వారాహీ

సర్వసృష్టికి మూలము నీవే
త్రిపురసుందరీ శ్రీ లలితా
ఆనందామృత వర్షిణివే
మణిమయ సింహాసనాసీనవే

సర్వ సముద్భవకారిణివే
మల్లికాకుసుమ కోమలి శంకరి

4 చిదగ్నికుండ సంభూతా

చిదగ్నికుండసంభూత సర్వభూతహిత
దానవ నిర్జిత హిమగిరి సంజాత


శంకర మోహిత సర్వాంగభూషిత
శ్రీచక్రాంకిత సలలిత శ్రీలలిత

కదంబ వనవాసిని సర్వజగతికి సాక్షి
కాశీ విశాలాక్షి చిద్రూపిణి కామాక్షి

మల్లికా కుసుమ గానవిలోలిని
భక్తజనప్రియ హృదయవాసిని

5 దేవతాకార్య సముద్యత 

దేవతాకార్య సముద్యతా సర్వదేవతా పూజిత 
విలాసినీ బృంద విలాసయుక్తా 

కోటి యోగినీగణ సేవిత
షట్కోణ మధ్యస్థా మందస్మితముఖా
శరణాగతవత్సలా జగదంబిక 
మదఘూర్ణిత లోచనా సరసీరుహాసనా 

కనకాంగద కేయుర కిరీట పరిశోభిత
బీజాక్షర శోభిత శ్రీలలిత 
చిత్కాలామయీ చిత్తరంజనీ
శంకర పీఠ నివాసిని హాసినీ

6 ఉద్యద్భాను సహస్రాభా 

ఉద్యద్భాను సహస్రాభా షట్చక్ర సముద్భవ 
అరుణకిరణ శోభా శ్వేతరక్త మిశ్రప్రభ 

చంద్ర కళావతంసి త్రైలోక్యవరసుందరి 
 చండముండ వినాశిని విద్యుత్కోటి సమప్రభా 

త్రిమూర్తి సంసేవితా దీప శిఖాత్మికా 
సహస్రకర సంయుతా శ్రీ లాలితాంబికా

7 చతుర్భాహు సమన్వితా 

చతుర్భాహు సమన్వితా చతుర్వర్గ ప్రదాయినీ
చతురాగమ విలసితా చతురాయుధోపేతా 
చతుష్షష్ఠి  యోగినీపరిసేవితా శ్రీలలిత 
చతుష్షష్ఠి కళామయి చతుర్వర్ణ విధాయినీ 
చతురాసన పూజితా చతురాసన శోభనా 

మహా కుండలినీ భవసాగరతారిణీ 
ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానాశక్తి రూపిణీ

8 రాగ స్వరూప పాశాఢ్యా 

రాగ స్వరూప పాశాఢ్యా శ్రీచక్రపురవాసిని 
అనురాగ రంజితా కరుణారసవాహినీ 

క్రోధరాగ విమోహినీ కామపాశనాశినీ
అంధకార వినాశిని కామేశ్వరి కాత్యాయని 

శిష్టరక్షిణి దుష్టశిక్షణి దాక్షాయిణి రాగిణి 
క్షిప్రప్రసాదిని కైవల్యపదదాయిని 
పాశాంకుశధారిణి సురసేవిత కల్యాణి 
మల్లికాకుసుమ శోభితవేణీ

9 క్రోధాకారాంకుశోజ్వలా

 క్రోధాకారాంకుశోజ్వలా
హ్రీంకార మంత్రోశోజ్వలా

మదనాంతక మనోజ్వలా
శ్రీవైష్ణవి జ్వాలాంబ

అరుణ మాల్య భూషోజ్వలా
అర్కకోటి రూపోజ్వలా 
విద్యుల్లేఖా తనూజ్వలా 
ఉజ్వల రసోజ్వలా

మహిషాసుర మర్ధని రౌద్రిని క్రోధిని
దానవ సంహార సమరోత్సాహిని 
మల్లికా కుసుమగాన మకరందోజ్వలా 
శివకామేశ్వర హృదయోజ్వలా

10 మనోరూపేక్షుకోదండా

మనోరూపేక్షుకోదండా సర్వదేవ నమస్కృతా
పాశాంకుశేక్షు దండధరా శ్రీలలితా పరదేవత

పూర్ణసుధారసార్థ్రా గంగాధరాలింగితా 
కమలాసనార్చితా  శ్రీలలితా పరదేవత

మదనాంతక హృదయా శ్రీచక్రరాజనిలయా 
కామితఫలప్రదా శ్రీలలితా పరదేవత 
మల్లికా కుసుమ పూజిత చరణాంబుజా 
యోగవిద్యాపరా శ్రీలలితా పరదేవత

11 పంచతన్మాత్రసాయికా 

పంచతన్మాత్రసాయికా పంచబాణస్తుతా
 పంచాక్షరీమంత్ర జపసాధకే 

పంచదశాక్షరి పంచభూత 
పరమాత్మక స్వరూపిణి
పంచశతపీఠరూపిణి 
పంచకృత్యవిధాత్రి గాయత్రీ

పంచకోశాంతర వాసిని పంచవర్ణరూపిణి 
శబ్ద స్పర్శ రూప రసగంధ ధారిణి 
మల్లికా కుసుమ సౌరభ ధారిణి 
పంచబ్రహ్మాసనా సారస్వతోల్లాసినీ

12 నిజారుణప్రభాపూర్ణ మాజ్జత్ప్రబ్రహ్మాండమండలా

నిజారుణప్రభాపూర్ణ మాజ్జత్ప్రబ్రహ్మాండమండలా
విశ్వవ్యాప్తిని స్వయం ప్రకాశిని రాజరాజేశ్వరి

అరుణారుణ తేజస్విని 
సృష్టి స్థితి లయ కారిణి 
సర్వాభీష్ట ప్రదాయిని 
సచ్చిదానంద రూపిణి 

త్రైలోక్యమోహినిరాశి స్వరూపిణి 
కోటిప్రభాకర తనూవిలాసిని
మల్లికా కుసుమ గాన విలోలిని 
ప్రేమామృత పరిపూర హృదయిని

13 చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా 

చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా 
సురుచిరసుందరవేణీ శర్వాణీ వాణీ 

కబరీబంధ విలాసిని
కర్మబంధ విమోచని
మల్లికా కుసుమ గంధ 
పంకాంకితవేణీ 

కుందమందార చూళికా
కస్తూరికాఫాలికా
కుటిలకుంతల యోగినీ 
మనసిజారి సమ్మోహినీ

14 కురువిందమణిశ్రేణీ కనత్కోటీర మండితా: 

కురువిందమణిశ్రేణీ కనత్కోటీర మండితా
కుంకుమాన్విత హరి బ్రహ్మేంద్ర సేవితా 

హిమాచల కులోత్తంసకలికా ప్రవల్లికా 
హ్రీంకారాంబుజ భృంగికా భ్రమరాంబికా

బాలాదిత్య నిభాననా నవపల్లవాంఘ్రి యుగళా
శ్రీంకార మంత్ర సర్వస్విని జ్వాలామాలిని

15 అష్టమీచంద్రవిభ్రాజా దళికస్థల శోభితా: 

అష్టమీచంద్రవిభ్రాజా దళికస్థల శోభితా
సమయోచిత పాలితా విభుదజన సన్నుతా 

చంద్రహాసిని చంద్రచూడా
చంద్రకళ పరిశోభితా
రాగవాసి రాగరహిత 
రాగమోహిత సురనుతా 

తాటంక నాసికాభరణ సమంచిత 
అఘటిత ఘటనా చాతుర్య సంకలిత 
కామేశ్వరి భగమాలిని శివదూతి కులసుందరి 
జ్వాలామాలినీ నిత్య త్వరిత కళావిభ్రాజిత

16 ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకాః

ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా
దశ తత్వాత్మికా జగదంబికా లింగాంబికా 

నిర్వికార గుణశాలిని నిర్మలకరధృత శూలినీ 
ఢమరునాదపరితోషిణి కళ్యాణాచలవాసినీ 

మాద్వీరసానందినీ కామినీ 
వేదండకుంభస్తనీ విజయనీ 
మల్లికా కుసుమ పూజిత వదనీ 
మల్లికా హృదయ వాసినీ శివానీ

17 వదనస్వరమాంగళ్య గృహతోరణచిల్లికా

వదనస్వరమాంగళ్య గృహతోరణచిల్లికా
ఈశ్వరార్థశరీరిణీ కపాలిప్రాణనాయికా

లకార రూపలలితా 
లలాట నాయనార్చిత 
హరిద్రాకుంకుమోపేతా 
హానివృద్ధి వివర్జితా 

ఓంకారపంజరశుకీ 
హ్రీంకార తరుశారికా
తుహీనాద్రి శిఖరవాసిని
మల్లికాకుసుమమస్తకా

18 వక్త్రలక్ష్మీ పరీవాహచలన్మీనాభ లోచనా

వక్త్రలక్ష్మీ పరీవాహచలన్మీనాభ లోచనా
సుజనహృత్సదన కుందసమవదనా 

ఆపదోద్ధరణ మానితగుణగణ 
దీనజనాశ్రిత  బృందచందనా
సర్వ విమోహిని భక్త జనావనా 
సర్వ సాక్షిణీ సత్యసనాతన 

సద్గతిదాయినీ హంసవాహనా 
పాశవిమోచన పరమపావనా 
ప్రాలేమాచల వంశ పావనా
మల్లికా కుసుమ పూజిత వదనా

19 నవపంచక పుష్పాభనాసాదండవిరాజితా

నవపంచక పుష్పాభనాసాదండవిరాజితా 
కుబేరతేజోవిలసిత సౌందర్యనాసికా 

ఏకభక్తిమదర్చితా ఏషణారహిత ధృతా
అనురాగవిమోహిత నిగమాంతసంచరిత

ముక్తాహారసుశోభితా సకలాగమసంస్తుతా 
మల్లికా కుసుమ గాననుత గీర్వాణవందితా

20 తారాకాంతితిరస్కారి నాసాభరణభాసురా

తారాకాంతితిరస్కారి నాసాభరణభాసురా
సకల సురసేవ్యమాన నిరుపమవిభవా

ఎర్రని కాంతుల పగడము 
తెల్లని కాంతులు ముత్యము
ముక్కెరగా ధరియించు తల్లి
భక్తుల పాలిట కల్పవల్లి

భువనాంధకారములు తొలగించే
ప్రాణతార్తు హారుని రాణి శివానీ 
కామకోటి పీఠవాసి కనకశైల విహరిణీ
మల్లికా కుసుమ గాన కారిణీ

21. కదంబ మంజరీక్లప్త కర్ణపూర మనోహరా

ప. కదంబమంజరీక్షప్త కర్ణపూర మనోహరా 
అ.ప. శృంగారవేషాఢ్యా శంకరమనోల్లాసినీ 
చ.1. 
నీవదనము వికసితకమలము 
నీకన్నులు పద్మపత్రవిశాలము 
కడిమిపూలతో కర్ణసౌరభము 
నీసౌందర్యము కుసుమకోమలము ॥ 
చ. 2. 
నీరూపము ఊహాతీతము 
షోడశకళలకు అదినిలయము 
నీవినీలవేణీ కుంతలము 
మల్లికాకుసుమ సుగంధభరితము ||

22. తాటంకయుగళీభూత తపనోడుపమండలా

ప. తాటంకయుగళీభూత తపనోడుపమండలా 
అ.ప. మందస్మితసుందర వదనారవింద మంగళా॥ 
చ. 1. 
నీకర్ణములనున్న తాటంకములకాంతి 
భువనాంధకారములను తొలగించునే॥ 
జయదేవి జగన్మాత జయకామ కళాత్మికే 
జయజయనారాయణి శ్రీ కంఠదయితే
 చ. 2. 
ప్రణతార్తు హరురాణి బ్రహ్మాండమండలా 
చండముండభండదైత్య ఖండనా ఖండలా ॥ 
మల్లికాసుమగాన జ్ఞానదాయిని 
తుహినాచలేశుని వంశపావని

23. పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూః

ప. పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూః 
అ.ప. పద్మరాగములకాంతి ప్రతిఫలించు కపోలము 
రంజితము రాగరంజితము 
చ. 1. 
పరమేశానురాగ సింజితము 
నీసౌందర్యము లోకాతీతము 
అనుపమానము అనుభవైకవేద్యము 
సకలజన పరితాప ప్రతిహతము రాగ రంజితము ॥
చ. 2 
మదనాంతక హృదయాంతిక రంజితము 
భావనాతీతభక్తి భావనాసంచితము 
మల్లికాసుమగాన సమంచితము 
రంజితము రాగ రంజితము ||

24. నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్చదా
 
ప. నవవిద్రుమబింబశ్రీ న్యక్కారిదశనచ్చదా 
అ.ప. సర్వశృంగారవేషాఢ్యా మోక్షదా కామదా ॥ 
చ.1. 
తాంబూలారుణ పల్లవాధరా సిద్ధిదా దృశ్యాదృశ్యస్వరూపిణీ 
శర్మదా సర్వకామప్రదాశుద్ధా సద్గుణా సకలేష్టదా 
చ. 2. 
హ్రీంకారమంత్రసర్వస్వా హ్రీంకారపరసౌఖ్యదా 
కామేశ్వరసుఖప్రదా మల్లికాసుమగాననిలయా ॥

25. శుద్ధవిద్యాంకురాకారా ద్విజపంక్తిద్వయోజ్వలా 

ప. శుద్ధవిద్యాంకురాకారా ద్విజపంక్తిద్వయోజ్వలా 
అ.ప. శుద్ధస్పటిక సంకాశా శుద్ధవిద్యానవోజ్వలా 
చ.1. 
సుధాసాగరమధ్యస్థా పరాపశ్యంతిరూపిణీ 
పశుపాశవిమోచని బ్రాహ్మణి మనోన్మనీ 
చ. 2. 
సర్వజ్ఞానమయీ విమలే నవకల్పకవల్లరీ 
త్రికోణరూపిణీ శక్తి పరబ్రహ్మస్వరూపిణీ 
కవీంద్రహృదయచరీ వాగధీశ్వరీ 
మల్లికాకుసుమగాన రాగమంజరీ 

26. కర్పూరవీటి కామోదసమాకర్షద్ధిగంతరా

ప. కర్పూరవీటికామోదసమాకర్షద్ధిగంతరా 
అ.ప. ఆపదోద్ధరణ మానితగుణగణావరా|| 
చ.1. 
చంద్రకళాధరి వైఖరీ శరణాగతీ 
చిదానందమయి ఈశ్వరీ భగవతీ || 
చ. 2. 
తాంబూలపూరితముఖీ పక్వబింబాధరీ ముక్తాహార సమూహశోభితా 
నీలాకార సుకేశినీ విలసితా మల్లికాకుసుమ శోభితకుంతల॥

27. నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సితకచ్చపీ: 

ప. నిజసల్లాప మాధుర్యవినిర్భర్త్సితకచ్చపీ 
అ.ప. మృదుమధువాక్సుధ మణిమయధారిణి|| 
చ. 1. 
అమృతాకర్షిణి సర్వవశంకరి వీణాగానవినోదిని 
విద్యాధరి రాగ తాళ లయ రస స్వరూపిణి 
సరససంగీత నాదవిలోలిని | 
చ. 2. 
మధుర మధుర గాన రసాహ్లాదిని 
మల్లికాకుసుమగాన వికాసిని॥

28.మందస్మితప్రభాపూర మజ్జత్కామేశ మానసా: 

ప. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానసా 
అ.ప. బిందునాద కళాతీతా భక్తమానస హంసికా
చ.1. 
పరాత్పరీ శివశంకరీ కామేశ్వర ప్రియమోహిని 
మదనాంతక హృదిరంజని మందస్మితవదనీ॥ 
చ. 2. 
అరుణారుణపదపల్లవి లలితాపరమేశ్వరీ 
మల్లికాసుమగానదా చిద్రూపిణి కామేశ్వరి॥

29. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా

ప. అనాక లితసాదృశ్య చుబుకశ్రీ విరాజితా 
అ.ప. నీలకంఠసమాశ్రయా శక్తిత్రయ సమన్వితా| 
చ.1. 
నందనోద్యాననిలయా ధర్మవేదవిశారదా।। 
ఐహికాముష్మిక ప్రదా అవ్యాజ కరుణామృతా॥ 
చ. 2. 
ఇక్షుకోదండ సంయుక్తా కలశోద్భవ సంస్తుతా 
మల్లికాకుసుమగంధ పరిపూరిత శ్రీలలితా॥

30. కామేశబద్ధమాంగల్య సూత్రశోభితకంధరా:

ప. కామేశబద్ధమాంగల్య సూత్రశోభితకంధరా 
అ.ప. చింతామణి ద్వీపవాసిని శంభుమోహినిశంకరీ॥ 
చ.1. 
అమరేంద్రవంద్యా అభిమతఫలదా 
సర్వశక్తిస్వరూపిణి సంగీతరసధుని 
తుహినాచలేశుకోరి ఘోరతాపసివైతివి 
అంగజమదసంహారునే చిరునవ్వులగెలిచితివి || 
చ. 2. 
నీ కంఠసీమలో రాజిల్లు వళిత్రయము 
మృదుమధురరాగాలనిలయమై 
మల్లికాసుమగాన భరితమై 
గాత్రత్రయములై శోభిల్లునే 11

31. కనకాంగదకేయూర కమనీయభుజాన్వితా:

ప. కనకాంగదకేయూర కమనీయ భుజాన్వితా 
అ.ప. సనకాదిమునిసన్నుత చతుర్భాహుసమన్వితా| 
చ. 1. 
రత్నకంకణ నిస్వనస్వన రమ్యచరితామానితా 
రత్నకాంతినాగవలయ కేయూరాంగదముద్రితా 
ఈశతాండవ సాక్షిణీసద్గుణా సకలేష్టదా 
సుమేరుమధ్యనిలయా కాంచీదామ విభూషితా। 
చ. 2. 
ప్రేమామృత పరిపూరిత పరాశక్తి జగన్నుతా 
శ్రీ చక్ర పీఠేశ్వరి మల్లికాకుసుమవందితా॥

32. రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా:

ప. రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా 
అ.ప. రత్నఖచితాభరణ భూషిత శివహృదిరంజితా|| 
చ. 1. 
కమనీయకపోలసహిత సర్వవిద్యాసుపోషిత 
ఆపాదమస్తకాభరణ సర్వమంగళహాసిని 
బాలాత్రిపురాదిశక్తి నాదబిందు కళామయీ 
కార్యకారణరూపిణీ కామకోటి విలాసిని | 
చ. 2. 
నందనందనసోదరీ నవమోహనాంగి శాంకరీ 
నవచంపకవల్లరీ మల్లికాసుమనోహరీ॥

33. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిఫణస్తనీ

ప. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిఫణస్తనీ 
అ.ప. చరాచరజగన్మాత విశ్వమోహనమోహినీ ॥ 
చ.1. 
జగన్మోహన లావణ్య సర్వలక్షణ సంవృతా 
సకలలోకనిర్మాణచతురా అభయప్రదా 
దివ్యాంబరధారిణీ సర్వశక్తి సమన్వితా 
దివ్యమాలసమాయుక్త అద్వితీయస్వరూపిణి||
చ. 2. 
కామజారిమనోహరి కంబుకందరిభ్రామరీ 
ఈతిబాధవినాశినీ మల్లికాసుమగానమోహినీ||

34. నాభ్యాలవాలరోమాళి లతాఫలకుచద్వయీ
 
ప. నాభ్యాలవాలరోమాళి లతాఫలకుచద్వయీ 
అ.ప. నిజభర్తృముఖాంభోజచింతనామహేశ్వరీ|| 
చ1. 
కామేశ్వరప్రణయినీ కల్పవల్లీ సమభుజ
హారహారికుచాభోగా కస్తూరితిలకోజ్వలా ॥ 
చ2. 
భూతేశాలింగనానందాత మాలకుసుమకాంతి
దుర్గాసుర సంహారిణ మల్లికాసుమ జ్ఞానదాయినీ ॥

35. లక్ష్యరోమలతాధార తాసమున్నేయమధ్యమా 

ప. లక్ష్యరోమలతాధార తాసమున్నేయమధ్యమా!
అ.ప. జగన్మోహన లావణ్యా నవరత్నకాంచీదామా|| 
చ1. 
త్రివిక్రమపదాక్రాంత త్రికాలజ్ఞానసంపన్నా 
తంత్రమంత్రవిశేషజ్ఞా ఋషిదేవసమస్కృతా 
చ2. 
కోటిసూర్యప్రతీకాశ అవస్తాత్రయసాక్షిణ్ 
అర్ధమాత్రార్దభూత మల్లికాసుమ రాగవల్లరి॥

 36. స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా

ప. స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయా 
అ.ప. తరుణాదిత్యసంకాశా నిర్గుణాత్రిగుణాత్మికా | 
చ.1. 
చక్రవాకస్తనీజ్వాలా సర్వశాస్త్రవిశారదా
డుండివిఘ్నేశ జననీ జ్వలన్మాణిక్యకుండలా 
చ. 2. 
సౌందర్య ధారాసర్వస్వ త్రివళీ చారువిలాసినీ 
గుణత్రయవిభావితా మల్లికాకుసుమమాలినీ 

37. అరుణారుణకౌస్తుంభవస్త్రభాస్వత్కటీ తటీ సుభ 

అరుణారుణకౌస్తుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ 
అ.ప. దివ్యసుందరమల్లికాకుసుమ మాలికాభరణా!
చ. 1. 
మదనాంతక హృదయాంతిక జ్వాలాముఖీ వైష్ణవీ 
అనిర్వ్యాజ కరుణామయి సూర్యమండలవాసినీ ॥ 
చ. 2. 
రక్తనయనా చారువదనా పీతవస్త్రదయాన్వితా 
రక్తమాల్యాంబర ధారిణి శివానీ పరాత్పరీ ॥ 

38. రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా

ప. రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా 
అ.ప. కనకాంగద కేయూర కిరీట పరిశోభితా 
చ.1. 
చంద్రకాంత మణికాంతసన్నిభా రత్నకింకిణీ 
కంకణస్వనా ఉదయరవిబింబ నాసికాభరణ కస్తూరిఫాలఫలికే॥ 
చ. 2
 ఝుంఝుంఝుణితపద నూపురచరణా
బాలశశికళాభరణ మల్లికాసుమగాన విహరణ ॥


39. కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా 

ప. కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా 
అ.ప. లావణ్య లాలిత్య చారులక్షణ లక్షితా 
చ. 1. 
భువనమోహనసౌందర్య ఈశ్వరానుగ్రహకారిణీ 
పంచమాత్రాత్మికావిద్యా ఫణిమండలమండితా 
బిందునాదకళాతీతా కేతకీకుసుమప్రియా 
సుధాసాగరమధ్యస్థా సకలదేవతారూపిణి ॥
చ. 2. 
కరవీరసువాసినీ కాళీ జగదంబికా 
దివ్యదరహాసభాస మల్లికాకుసుమగాన దా॥

40. మాణిక్యమకుటాకార జానుద్వయవిరాజితా 

ప. మాణిక్యమకుటాకార జానుద్వయవిరాజితా 
అ.ప. ఇంద్రాదిదేవతాపూజ్య సకలాగమపూజిత 
చ. 1. 
సోమసూర్యాగ్నినేత్ర శివ శివావామాంకస్థిత 
వహ్నిమండలవాసినీ యోగినీపరివేష్టిత॥ 
చ. 2. 
సకలగుణభరితశ్రీచక్రస్థిత
మల్లికాకుసుమగానసమంచిత॥ 

41. ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా 

ప. ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా 
అ.ప. ప్రసన్నవదనేక్షణంసకలదేవతారూపిణం 
చ. 1. 
స్వప్రకాశశివమూర్తిరేకికం సకలశీత రశ్మిప్రభం 
వరాభయకరాంభుజం విమలగంధ మాల్యాంబరం||
చ. 2. 
ద్వందాతీతం గగనసదృశం 
బ్రహ్మానందం పరమసుఖదం 
ఇంద్రగోపంవిమలమచలం 
త్రిగుణరహితం మల్లికాసుమగానం॥

42. గూఢగుల్ఫా

ప. పద్మాసనాసేనా గూఢగుల్ఫా
అ.ప. నవార్ణమంత్రరహస్య పావనసుభగుణా 
చ. 1. 
నీమహిమలుపొగడవశమె
శివశంకరికల్పవల్లి 
అభయమిచ్చికరుణింపుము 
భావజారి హృదయేశ్వరి ॥
చ. 2. 
కుమారజననీశర్వాణీ నీ
సమానమెవరేగీర్వాణీ 
పన్నగభూషణుని రాణి 
మల్లికాకుసుమ విహారిణి||

43. కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా

ప. కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా 
అ.ప. మందారద్రుమ మాల్యభూషితా॥ 
చ.1.
పరమేశ్వరి నీ ప్రపదములే  
భక్తజనాశ్రయ విహితములే 
ఆర్తత్రాణ పరాయణి
చతుర్దశభువనరక్షణి ॥ 
చ. 2. 
ప్రసన్నవదనీ నానాదాసీపరివృతా 
నీపదములనే నమ్మితిమమ్మా 
మల్లికాకుసుమములు మాలలుగాజేసి
నీచరణములకు అర్పింతునమ్మా ॥

44. నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా

ప. నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా 
అ.ప. శ్రీహరిబ్రహ్మేంద్రపూజితచరణా ॥ 
చ. 1.
నిరుపమానగుణసర్వాభరణా 
హ్రీంకారలక్షణ హరిణేక్షణా 
సౌవర్ణాంబరధారిణీ ప్రసన్నవీక్షణా 
కామితదాయిని కామరూపిణీ ॥ 
చ.2. 
మణిపూరనిలయిని 
సూక్ష్మరూపిణీ లీలావినోదినీ
సర్వవిమోహిని తంత్రమంత్ర విశేషజ్ఞ 
నిర్గుణా కర్మనిర్మూలనకారిణి ఓంకారిణీ ॥

 45. పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా

ప. పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా 
అ.ప. రత్నభూషణయుత లోచనాంబురుహ 
చ. 1. 
లలితలావణ్యరూప లలితచరణారవిందజ 
అవాజ్ఞానసగోచర దివ్యరూపకలితా ॥ 
దివ్యతేజసముద్భవ మోహాంధకారనాశిని 
వేదనాదాలంకృత పాదపద్మశోభితా 
చ. 2. 
భయదాఖిలరూపిణీ నిఖిలలోకసంరక్షిణి 
నియమవ్రత సంచారిణి శశిధరుని రాణీ ॥

46. శింజానమణిమంజీరమండిత

ప. శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా 
అ.ప. సదమల దివ్యతేజ కమనీయవదనాంబుజా 
చ. 1. 
నిరుపమానలావణ్య రక్తచందనధారణా 
రత్నకింకిణినాదలోలమహాశక్తిపరాంబికా ॥ 
సకలదేవముని పూజిత సర్వదాసంపత్కరీ 
మల్లికాకుసుమార్చితపాదపద్మయుగళీ ॥
 చ. 2. 
నిత్యానందవికాసిని నిర్మలహృదయవికాసిని 
భక్తహృదయోల్లాసినిశంకరార్ధ శరీరిణీ 

47. మరాళీ మందగమనా

ప. మరాళీమందగమనా 
అ.ప. సౌందర్యదీప అగణితగుణగణ | 

చ. 1. 
సుమనస వందన స్వప్రకాశగుణ 
సకలవేదమంత్రాక్షరధారణ 
సుందరవదనా వందితచరణా 
ఉదయభానుబింబ నాశికాభరణ॥
 
చ. 2. 
చంద్రకాంత మణికాంత సన్నిభ 
అరుణోదయ కిరణోదయ సమశోభ॥

48. మహాలావణ్యశేవధిః

ప. మహాలావణ్యశేవధీః 
అ.ప. ఊహాతీత సౌందర్యకళానిధి 

చ. 1. 
కరుణారస వాహిని సేవకజన పాలినీ 
సర్వభూతసృష్ఠి ఆరణి తురీయ పదగామినీ 
సుకుమార సౌందర్య సమ్మోహినీ 
శివమోహిని కాత్యాయినీ||

 చ. 2. 
నిరుపమానలావణ్య వారధి 
సర్వజ్ఞవల్లభ హృదయాంబుధీ 
సదావాంచితపరమేశ సన్నిధి 
మల్లికాసుమ సంగీత కళానిధి॥

49. సర్వారుణా

ప. సర్వారుణా దయాశీలా 
అ.ప. అరుణారుణ కాంతిరూపిణీ 

చ.1. 
సకలజీవులను చల్లగచూచే 
కరుణారసవాహిని 
మోహినీ జపాకుసుమ సంకాశిని 
ఆనందామృతవర్షిణి ॥ 

చ. 2. 
కారుణ్యాలయ మహామేధా నగరాజనందినీ 
మహామోహా బాలసూర్యనిభవర్ణ శరీరిణి 
మల్లికాకుసుమ సుందరవేణీ ॥

50. అనవద్యాంగీ

ప. మంగళకారిణి అనవద్యాంగి 
అ.ప. సర్వలక్షణ లక్షితాంగి 

చ.1. 
సర్వమంత్రాలయ దివ్య తత్వాలయ 
కాయజవైరీప్రాణకాంత ఈశ్వరీసర్వేశ్వరీ 
హృదయదేవి శిరోదేవి శిఖదేవి కవచదేవి 
నేత్రదేవి అస్త్రదేవి అంగదేవతారూపిణి 

చ. 2. 
సలలితసుగుణాసాగరి
పరశివనామస్మరణ విధాయిని 
అశేషజనమోహిని నవదుర్గాస్వరూపిణి।।

51. సర్వాభరణ భూషితా

ప. సర్వాభరణ భూషితా శ్రీ లలితా 
అ.ప. సర్వాకర్షిణి సర్వదేవమయి 

చ.1. 
సకలలోక నిర్మాణచతురా సర్వశాస్త్రస్వరూప 
సర్వసురాలయ కనకాంగద కేయూర 
కిరీటపరిశోభితా  పంచకృత్య విధాత్రి 
కాంచీదామవిరాజితా || 

చ. 2. 
సౌభాగ్యాభరణ సర్వకారణ కారిణీ 
దివ్యసుందర మల్లికాకుసుమచరణీ॥

52. శివ కామేశ్వరాంకస్థా

ప. శివకామేశ్వరాంకస్థా సుప్రతిష్టా

అ.ప. పరశివనాయకి శివకామేశ్వరి

చ.1

పర్వత రాజకుమారి గర్వ నివారిణి

సోమశేఖరు రాణి సుగుణమణి ॥

చ. 2.

త్రిజగతీ రక్షైక చింతామణీ

కలబిందు కల్పలతికా కామినీ

మల్లికా సుమ భూషిత సుందరవేణీ

పరమేశ్వరాలింగిత పల్లవ పాణీ ॥


53. శివా

ప. శివా సర్వమంగళ

అ.ప. శివనారీ చిద్రూపిణి ॥ 

చ.1. 

కైలాస వాసిని కేదారేశ్వరి 

మంగళదాయిని శివశక్తి  మహేశ్వరి ॥ 

చ. 2. 

ధరాధర నందినీ పూర్ణచంద్ర వదనీ 

గర్వాప హారిణీ గుణదాయినీ

మహాశక్తి  కమలాంబికా మదనారి మనోహరి

మల్లికా కుసుమ గాన ముక్తి ప్రదాయిని॥


54. స్వాధీనవల్లభా

ప. సర్వ తంత్రేసీ స్వాధీన వల్లభా 

అ.ప. సర్వభూత శుభప్రదా సర్వమంగళా ॥ 

చ. 1. 

ఘోరతపసు చేసి శివుని మెప్పించి 

కామహరుని పెండ్లాడిన కామేశ్వరీ ॥ 

చ. 2. 

ఆదినాధునికే అర్ధాంగివై శ్రీ మహాగణపతికి తల్లివైతివీ 

జగములను పోషించు అన్నపూర్ణవే మల్లికా సుమగాన జగన్మాతవే


55. సుమేరుశృంగ మధ్యస్థా

ప. సుమేరుశృంగ  మధ్యస్థా రజతాచల నివాసినీ 

అ.ప. తప్తకాంచన సన్నిభ  త్రిలోక వాసినీ 

చ.1. 

తపోలోక తపస్విని విష్ణులోక యశస్వనీ 

బ్రహ్మలోక సరస్వతీ రుద్రలోక మహేశ్వరీ 

చ. 2. 

ఇచ్చాశక్తి  జ్ఞానశక్తి  క్రియాశక్తి  సమన్వితా 

ఓఢ్యాణ పీఠవాసి ఫణిమండల మండితా 

పంచభక్ష్య ప్రియాచారా బాణాసన సతిసతీ 

పశుపాశ వినుర్ముక్తా పంచపాతక నాశనీ 


56. శ్రీ మన్నగర నాయికా

ప. శ్రీ మన్నగర నాయికా శుభప్రదా 

అ.ప. నితాంతారుణ నవయౌవ్వనా 

చ. 1. 

సౌభాగ్యదాయినీ మణిద్వీప వాసినీ 

ఇందు కళాధరీ అపార కృపానిధీ 

హకార రూపా హంసవాహనా

మేరుపర్వత నిలయా భువనేశ్వరీ 

చ. 2. 

గర్వాపహారిణి అలి నీలవేణీ

ఖండేందు తిలకా కరుణాపాంగీ 

ఆనందదాయిని అనంతరూపిణీ 

మల్లికా సుమగాన అంతరాత్మికా 


57. చింతామణి గృహాంతస్థా 

ప. చింతామణి గృహాంతస్థా శ్రీచక్రసంస్థితా 

అ.ప. మహావిద్యా వేదమాతా వాంచితార్ధ ప్రదాయిని

చ.1. 

క్షీరాబ్ధి నిలయినీ సిద్ధిప్రదే 

మాంపాహీ మహాలక్ష్మి రూపిణీ 

నిరుపమాన తేజశ్వినీ 

ఘోరదనుజ సంహారిణి 

చ. 2. 

సంతోషకారిణి సర్వాధికే 

జన్మజదుఃఖ నివారిణీ 

బ్రహ్మచారిణి భ్రమనివారిణి 

మల్లికా సుమగాన చింతామణి 


58 పంచ బ్రహ్మాసనస్థితా

ప. సంతత శివ పర్యంకస్థా పంచ బ్రహ్మాసన స్థితా 

అ.ప. హ్రీంకార రూపనిలయా ఓంకార బీజాక్షరీ 

చ.1. 

బ్రహ్మ విష్ణు మహేంద్ర రుద్రులు నీ పీఠానికి కోళ్ళు కాగా 

శివమంచాధి శాయినివై వెలసిన తుర్యాతీత స్వరూపిణి ॥ 

చ. 2. 

అర్ధమాత్రార్ధభూత ధర్మశాస్త్ర ప్రకాశినీ 

జగత్కారణ శక్తి బాలా త్రిపుర సుందరి 


59. మహాపద్మాటవీసంస్థా:

ప. మహా పద్మాటవీ సంస్థా సహస్రార మధోముఖా 

అ.ప నిత్యానందమయీ సదా శివపురీ సంస్థా 

చ.1. 

తటిల్లేఖాతన్వి సూర్యమండల వాసినీ 

ధర్మ వేద విశారదా అనితా అపరాజితా

చ. 2. 

సగుణోపాసనా పూజ్యా నిర్గుణా సుగుణాలయా 

సద్యోజాతాది మంత్ర సంజ్ఞిత జితక్రోధా


60. కదంబ వనవాసినీ

ప. కదంబ వనవాసినీ కాత్యాయనీ 

అ.ప. నీలాకార సుకేశినీ వేదండ కుంభస్తనీ

చ. 1. 

చింతామణి గృహమునందున 

రత్నమండలమధ్యమునందున 

మణిమయ సింహాసమున కొలువుతీరిన శ్రీమాతా

చ. 2. 

పరుల నుతింపను నిను మది మరువను

నీ పదాంబుజములే సదా భజింతును

మల్లికా సుమగాన విలాసిని 


61. సుధా సాగర మధ్యస్థా

ప. సుధాసాగరమధ్యస్థాసుప్రసన్నసువర్చలా 

అ.ప. చంద్రసహోదరి హేమమాలినీ అరవింద నిభేక్షణ కమనీయగుణా॥ 

చ. 1. 

ఉషోదయమునబాలవై అరుణారుణకాంతివై 

మధ్యందినమున యువతివై సూర్యప్రభలవెలుగుమాతా ॥ 

చ.2. 

సాయం సంధ్యల వృద్ధవై కృష్ణవర్ణపు వంపుతో 

వెలుగులను చిందించు తల్లీ క్షీరసాగర కన్యకా॥

62. కామాక్షీ 
ఎంతపిలచినా మనసుకరుగదు 
నేరమేమిటే నానేరమేమిటే 
అ.ప. 
అన్నిభయములు తీర్చగరావె 
అభయమీయవె త్రిపురసుందరీ ॥ 
చ.1. 
కాత్యాయని కమలలోచని వరదాయని సర్వమంగళా 
నీవేదిక్కని నమ్మియుంటిమి కరుణచూపవే కామాక్షీ ॥ 
చ. 2. 
బొజ్జగణపతికి కన్నతల్లివి మైధిలీ వరపూజితా శరణు శరణనుచు 
అండజేరితిమి కాపాడగదే శర్వాణీ  

63. కామదాయిని 
కామదాయిని నీవుకామేశ్వరివి నీవు 
కరుణచూపగరావె శ్రీ శర్మదా 
చ. 1. 
ఏజన్మభాగ్యమో ఏపూర్వపుణ్యమో సుకవినై నిన్నునే స్తుతించగా 
ఏపూజవరమో ఏభక్తిఫలమో నాకవనఝరిలోన నిలచినావమ్మా 
చ. 2. 
ఇహములో పరములో ననుమరువకమ్మా 
కరుణనాపైచూపి దరిజేర్చవమ్మా  
మల్లికాకుసుమమై నీపూజలోచేరి 
నీచరణములచెంత పడియుందునమ్మా 

64. దేవర్షిగణసంఘాత స్తూయమానాత్మవైభవా 
ప. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా 
అ.ప. నారదాది దేవర్షి పూజిత పాదపద్మయుగళా 
చ.1. 
రాక్షసగణ సంహారిణి ఇందుశేఖరుని రాణి 
కాశీనివాసిని ఘన మృదు భాషిణి ॥ 
చ. 2. 
శీతాంశుమౌళి రాణి చిన్మయ రూపిణి 
కారుణ్యసదనా దోషోపహారిణి 
నిగమగోచరిబాలా కిసలయారుణ చరణ
చూపు నాపైకరుణా మల్లికా కుసుమాభరణ॥

65. భండాసుర వధోద్యుక్తా శక్తిసేనా సమన్వితా 
ప. భండాసురవధోద్యుక్తా శక్తిసేనాసమన్వితా 
అ.ప. అనిర్వచనీయశక్తివిలాసాసర్వ సర్వదా || 
చ.1. 
సకలలోక నిర్మాణచతురా 
సర్వ సమ భావ సంశ్రయా 
దుష్టభీతి మహాభీతి భంజనీ 
అరిషడ్వర్గనాశినీ ॥ 
చ. 2. 
మాయాశబలవిగ్రహ  
వారాహీ రూపధారిణీ 
చండ ముండ భండాసుర సంహారకారిణి 
చరాచర జగన్మాత సర్వాస్త్రస్వరూపిణీ ॥

66. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితా
ప. సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా 
అ.ప. సర్వసురాలయ కరుణాసమేత ॥ 
చ. 1. 
సర్వసిద్ధిప్రద షట్కాలాతీత 
సర్వసంపత్కరీ విజ్ఞానదీపికా 
కోటికోటి మాతంగ తురంగ సేవితా 
సర్వ సమ్మోహినీ బహుశోభమాన॥ 
చ. 2. 
కమనీయ మనోహర దివ్యనేత్ర 
కరుణాంతరంగిత సదోదిత 
వాత్సల్య మృదుమధుర భావాంచిత 
మల్లికా సుమగాన సిద్ధిప్రదా॥


67.అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా 
ప. అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటిభిరావృతా 
అ.ప. అశ్వమధ్య రధామధ్యా విలసితా పరాజితా ॥ 
చ. 1. 
త్రయోదశాక్షరీమంత్ర శ్రీవజ్రేశ్వరి 
నిత్య ప్రసన్నాదేవీ త్రినేత్రాభిరామా 
అనవద్యా శశికళాధరా వరదాయిని 
తంత్ర ప్రసిద్ధా శ్రీ చక్రపురసుందరీ॥ 
చ. 2. 
ఇంద్రియాతీత రూపిణి ఆత్మానాత్మవిచారిణి 
సర్వవ్యాపిని కమలా మనోహరి 
భక్త సంరక్షణా తత్పరీ 
మల్లికా సుమబాల శీతాంశు మకుటా ॥

68. చక్రరాజ రధారూఢ సర్వాయుధ పరిష్కృతా
ప. చక్రరాజ రధారూఢ సర్వాయుధ పరిష్కృతా 
అ.ప. అష్టమాతృకా సేవిత అష్టసిద్ధి దాయిని 
చ.1. 
దేదీప్యమాన ఆనందధ్వజచక్రేశ్వరీ 
చక్రరాజపూజిత చక్రాయుధవైష్ణవీ  
బ్రహ్మాండ ఆకారా పంచభూతాత్మికా 
తన్మాత్రసాయికా సర్వార్ధసాధకా ॥ 
చ. 2. 
సర్వాంశా పరిపూరక త్రైలోక్యమోహిని 
కోటికోటి యోగినీ పరివారపూజితా 
కామకలాస్వరూప శివశక్యైకరూపికా 
మల్లికాకుసుమ గాన కారకా ॥ 

69. గేయచక్రరధారూఢ మంత్రిణీ పరిసేవితా
ప. గేయచక్రరధారూఢ మంత్రిణీ పరిసేవితా 
అ.ప. శ్యామలా రాజమాతంగేశ్వరదేవతా 
చ. 1. 
సర్వరాజ వశంకరీ 
సర్వసత్వశాంతోదరీ 
సర్వజనమనోహరిణీ 
సర్వతోముఖరంజనీ ॥ 
చ.2. 
మాతంగీ మధుశాలినీ 
మదఘూర్ణిత మీనాక్షీ 
సప్తస్వర సంగీత రసాహ్లాదినీ 
మల్లికాకుసుమగేయ మోహినీ ॥

70. కిరిచక్రరధారూఢ దండనాధ్ పురస్కృతా
ప. కిరిచక్రరధారూఢా దండనాధా పురస్కృతా 
అ.ప. రక్తాంబుజా ప్రేతవరాసనస్థా 
చ.1. 
పంచపర్య సమాశ్రయా 
ప్రాజ్ఞా వారాహీపరదేవతా
బృహద్వారాహిదేవతా 
నమోభగవతీ వార్తాళీ|| 
చ.2. 
అఖిలయోగినీబృందా భీకరవికటాట్టహాసా 
హిమాంశు రేఖావిలసిత ముఖారవిందా 
ఘోరదంష్ట్రా ప్రవాళకర్ణాభరణా 
వారాహిముఖీ అంధినీ ఝుంభినీ ॥

71. జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకారమధ్యగా 
ప. జ్వాలా మాలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా 
అ.ప. షోడశ కళారూపిణి సచ్చిదానందమయీ 
చ.1. 
జ్వలామాలిని నిత్యామహాత్రిపురసుందరి
సర్వభూత సంహార కారికే దేవదేవి నమోస్తుతే॥ 
చ. 2. 
అగ్నిజ్వాలా సమాభాక్షీ జ్వాలాప్రాకార మధ్యగా 
నీల నీరద సంకాశా నీలకేశీ తనూదరీ 
సింహపృష్ఠ సమారూఢా భగవతీ త్రైలోక్యసుభదే 
వహ్నిప్రాకార మధ్యమా మల్లికా సుమగానపోషా॥
 
72. భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా

ప. భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా 
అ.ప. అరిషడ్వర్ధనాశని దేవకార్యసముద్యతా । 
చ.1. 
చాముండీఇంద్రాణీపరిపూజితా
దుష్టభీతిమహాభీతి భంజనా 
సర్వాధిష్టానరూపా చరాచర 
జగన్మాతా దనుజసమ్మర్దినీధర్మసంవర్ధనీ॥

చ.2. 
కర్మజ్ఞాన విధాయిని కాంక్షితార్ధ ప్రదాయినీ 
శంఖచక్రశూలపాణీ భక్తజనసంతాపహారిణి 
సదార్తిభంజనశీలా శ్రీ చక్రపురవాసిని 
మరాళగామిని మల్లికాసుమగానశుభదా. 

73. నిత్యాపరాక్రమాటోప నిరీక్షణసముత్సుకా

ప. నిత్యాపరాక్రమాటోప నిరీక్షణసముత్సుకా 
అ.ప. షోడశకళాపూర్ణ పూర్ణామృతరత్న కళాచికా 
చ. 1. 
నామరూపరహిత నిశ్చల నిర్గుణమూర్తి 
సామీప్య సాయుజ్య ముక్తిప్రదాయిని 
పంచదశీమహామంత్రబీజమయీ జగత్తారిణీ
కామేశ్వరి వహ్నివాసిని నిత్యదేవతా ॥ 
చ.2. 
మధుర మనోహర సుందర సుస్వరమోహినీ 
మల్లికాసుమమధురగానవిలోలిని ॥

74. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా

ప. భండపుత్రవధోద్యుక్త బాలావిక్రమనందితా 
అ.ప. కల్హారనివాసిని బాలా నిత్యకల్యాణశీలా ॥ 
చ.1. 
కుమారీ త్రిమూర్తి కళ్యాణీ రోహిణీ 
కాళీ చండికా శాంభవీ దుర్గా 
నవరాత్రిపూజితా శివానీ త్రిపురాంబికా 
త్రిపురసుందరి సౌభాగ్యవతీ క్లీంకారీ సర్వమంగళా ॥ 
చ.2. 
సుభగా సుందరీ సౌమ్యా సుషుమ్నా 
సుఖదాయినీ మనోజ్ఞా సుమనోరమ్యా మల్లికాసుమగాన శోభనా॥

75. మంత్రిణ్యంబావిరచిత విషంగవధతోషితా

ప. మంత్రిణ్యంబావిరచిత విషంగవధతోషితా 
అ.ప. ఘోరరాక్షససంహారిని యంత్రరాజోపరిస్థితా॥ 
చ. 1. 
అరివీరభయంకరీ అభీష్ట ఫలదాయినీ 
దుప్తభీతిమహాభీతి భంజనీ శివరంజనీ॥ 
చ. 2. 
అలౌకిక తేజోమయ రూపవిలసితశాంకరీ 
కారుణ్యామృత వర్షిణీ మల్లికాదామభూషితా।

76. విశుక్ర ప్రాణహరణవారాహీవీర్యనందితా

ప. విశుక్ర ప్రాణహరణా వారాహీవీర్యనందితా 
అ.ప.బాలభాను ప్రభాకరా బిల్వపత్ర తలస్థితా 
చ. 1. 
వారాహీ సప్తకాంచన భూషణా 
బ్రహ్మాండ బహిరంతస్థా జ్ఞానాంబికా 
పరమార్థిక గోచరా పున్నాగవనమధ్యస్థా 
కలిదోషనివారిణీ శ్రీవిద్యా దాయినీ 
చ. 2. 
భవవిధ్వంసినీ సద్గతిదాయినీ 
దనుజనిరోషిణి దుర్మదసోషిణీ 
కైవల్యపదదాయినీ దివ్యమంగళ విగ్రహా శైవాగమ
విచారిణీ మల్లికాసుమధారిణీ ॥

77. కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా

ప. కామేశ్వర ముఖాలోక కల్పితశ్రీ గణేశ్వరా 
అ.ప. పరమేశ్వరానుశాయని పరమపతివ్రతా॥ 
చ.1. 
గౌరీనందనుని మూషికవాహనుని
వక్రతుండమహాకాయ సూర్యకోటిసమానునీ 
విశ్వోత్పత్తి విపత్తి సంస్థితి కర 
విఘ్నేశుని కన్నతల్లి పరమేశ్వరి మమతామయి || 
చ. 2. 
మంగళకరునీ మోదకప్రియుని
వాత్సల్య మృదుమధుర భావములతో 
ప్రేమామృత పరిపూరిత హృదయమ్ముతో 
లాలించిపెంచిన మల్లికాసుమగాన వైభవీ

78. మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్ర ప్రహర్షితా

ప. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా 
చ.1. 
ఆమోద ప్రమోద సుముఖ గణేశుల దుర్ముఖ 
అవిఘ్న విఘ్న కర్త గణేశుల 
నీసంకల్పమాత్రమున సృష్టించెను 
విఘేశుడు అసురుల దమియించి నిన్నేమెప్పించెను ॥ 
చ. 2. 
అలసత్వము నీచత్వము దీనత్వము తొలగగా 
విఘ్నములు కలుగకుండా పూజలు చేసేను 
మీసంకల్పముతో ప్రభవించినగణేశుడు 
లోకపాలకుడైమల్లికాసుమ గానమొసగు ॥

79. భండాసురేంద్రనిర్ముక్త శస్త్రప్రత్యస్త్ర వర్షిణీ 

ప. భండాసురేంద్రనిర్ముక్త శస్త్రప్రత్యస్త్ర వర్షిణీ 
అ.ప. అపర్ణే దురితాపహే త్రిశూలవరదాయినీ 
చ.1. 
శంఖినీ చాపినీ బాణభుశుండీ పరిఘాయుధా 
జ్వాజ్వల్యమాన తేజ తామసీ తత్రవేధసా 
వారుణా సురవాజినా చండికే వ్యాధినాశినీ ॥ 
ఇంద్రగజ సమారూఢా వారాహీమహిషాసనా 
చ. 2. 
దైత్యదర్ప నిషూధినీ మహాఘోర పరాక్రమా
మనోవృత్తానుసారిణీ మల్లికాసుమగాయినీ।।

80. కరాంగుళినఖోత్పన్ననారాయణ దశాకృతిః 

ప. దశాకృతిః కరాంగుళినఖోత్పన్న నారాయణ 
అ.ప. అఖిలాండేశ్వరి ఆత్మస్వరూపిణి ॥ 
చ. 1. 
జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియాతీత 
స్వరూపిణి సృష్టిస్థితిలయ తిరోధాన దుష్టాసుర వినాశినీ 
చ. 2. 
నారాయణుని దశావతారములు నీకరాంగుళుల 
సృష్టివిలాసమే కళ్యాణ గుణసంపన్నా 
మల్లికాసుమగాన కుశలా॥ 

81. మహాపాశుపతాస్త్రాగ్నినిర్ధగ్ధాసురసైనికా
 
ప. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసురసైనికా 
అ.ప. అజ్ఞాన అసురీభావ విధ్వంసిని 
చ.1. 
కౄరాంధక ధ్వంసిని కోమలాంగి 
షడంగదేవీ పరివార గుప్తా షడ్చక్రసంస్థా 
షడ్భావరూపా షడంగయుక్తా కమళాయతాక్షి ॥ 
చ. 2. 
సర్వజ్ఞ విజ్ఞాత పదారవిందా సర్వస్యలోకస్య 
సవిత్రీ కామేశి వజ్రేసి భగేశిరూపా
మల్లికాకుసుమ గంధశేఖరీ ॥

82. కామేశ్వరాస్త్రనిర్ధగ్ధసభండాసురశూన్యకా

ప. కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధసభండాసురశూన్యకా 
అ.ప. ప్రేమామృతవర్షిణీ విజ్ఞాన దీపకళికా ॥ 
చ. 1. 
మధుపాన విభ్రమనేత్ర కదంబమాలికాభరణ 
కుంకుమ విలిప్త గాత్రీ జగద్దాత్రీ లోకనేత్రీ 
చ. 2. 
శుంభ నిశుంభ దళనీ రక్తబీజ వినాశినీ 
మహాఘోరపరాక్రమా మహాభయ నాశినీ 
మహాదేవీమహామోహా మహోత్సాహే 
మహాబలే మల్లికాసుమగానవర్షిణీ మహాశక్తి మహేశ్వరీ

83. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుతవైభవా

ప. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుతవైభవా 
అ.ప.వాగ్భవారాధన ప్రీతే పరమే కరుణాలయే॥ 
చ.1. 
సర్వవేదప్రశంసితే సర్వ యోగ సమన్వితే 
ఇంద్రాణీపతి సద్భావ పూజితే॥
చ.2. 
సదా సద్వాఖిలాత్మికే తామసే తత్వవేధసే సావిత్రీ దేవజననీమల్లికాసుమభూషావృతే ॥

 84. హరనేత్రాగ్నిసందిగ్ధకామసంజీవనౌషధిః 

ప. హరనేత్రాగ్ని సందిగ్ధకామసంజీవనౌషధీ
అ.ప. సర్వ శృంగార వేషాఢ్యా కామేశ్వరమనోల్లాసినీ 
చ.1. 
నిరర్గళప్రేమగమ్యా మణిద్వీప నివాసినీ 
ఇష్ట కామేశ్వరీదేవీ రతిసౌభాగ్యదాయినీ 
చ.2. 
షోడశేందు కళామయీ శంకరీ భువనేశ్వరీ 
సర్వకామ సమృద్ధినీ మల్లికాసుమ గీతాలాపిని 

85. శ్రీమద్భాగవకూటైక స్వరూపముఖపంకజా

ప. శ్రీమద్భాగవకూటైక స్వరూపముఖపంకజా 
అ ప.మణిమయసుందరభాసితసర్వాంగభూషావృతా! 
చ. 1. 
నవకోటి మూర్తిసహితా శీతాంశుతుల్యప్రభా
త్రికాలజ్ఞానసంపన్నా ఋగ్యజుర్వేద రూపిణీ 
సద్యోజాతాది మంత్రసంజ్ఞిత సోమార్ధదారిణీ 
మనోవృత్తానుసారిణి గాయత్రీ భవ తారిణీ॥ 
చ. 2. 
సురవందితాంఘియుగళే దానవాంతకరూపిణి
వాగ్దేవీ వైజయంతి మల్లికాసుమ గానభూషిణీ।

86. కంఠాదఃకటిపర్యంత మధ్యకూటస్వరూపిణి

ప. కంఠాదకటి పర్యంత మధ్యకూటస్వరూపిణి 
అ.ప. ప్రాజ్ఞా వికచాననా కూటస్థాకుల యోగినీ 
చ.1. 
కోటి కందర్ప సుందర విజయావిశ్వతేజసే 
బ్రాహ్మీ హంససమారూఢా నానారత్నోప శోభితే 
సురాసుర శిరోరత్న నిఘృష్ట చరణాంబికే 
సృష్టి స్థితి లయ కారిణి కామరాజ బీజాక్షరి 
చ.2. 
కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య నాశనీ 
మల్లికాకుసుమ గీతానందిని హంసినీ | 

87. శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ

ప. శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ 
అ.ప.విద్యా కవితావితానలహరీ కల్లోలినీ దీపకే|| 
చ. 1. 
నవరాగ కళారూపా ఏకాదశీ తిధిప్రియా 
పంచాధిక దశీవిద్యా షోడశేందు కళాధరీ॥ 
చ.2. 
బ్రహ్మ జ్ఞాన దాయనీ శంఖినీ ప్రాణ వాహినీ 
సామ్యావస్గా రూపిణీ మల్లికాసుమ గాన వాహినీ ॥

88. మూలమంత్రాత్మికా

ప. మూలమంత్రాత్మికా ఆత్మస్వరూపా 
అ.ప. మంత్రస్వరూపిణీ శ్రీవిద్యా 
చ. 1. 
పీతాంబరధారిణీ తేజోరూపా హ్రీంకార వహేదేవీ 
మహారూపా ప్రాణరూపా వరదా 
భూతరూపా పృధ్వీరూపా పరాదయారూపా || 
చ. 2. 
విశ్వమూర్తీ జ్ఞానమూర్తీ దేవమూర్తి 
మల్లికాసుమగానమూర్తీ ధర్మమూర్తీ ॥ 

89. మూలకూటత్రయకళేబరా

ప. మూలకూటత్రయ కళేబరా. 
అ.ప. సౌభాగ్య విద్యేశ్వరీ ॥ 
చ.1. 
పంచదశీ మంత్రరూపిణీ కామకలా విలాసినీ
శివశక్త్యాత్మక రూపిణీ ఈశ్వరీ పరమేశ్వరీ ॥ 
చ. 2. 
ఆయుష్యకరము పుష్టికరము విద్యాప్రదము 
భోగప్రదము కీర్తికారకము సర్వసంపత్కరము 
నీశుభనామమే మల్లికాసుమ భరితము ॥

90. కులామృతైకరసికా

ప. కులా మృతైకరసికా అమృతస్వరూపిణీ 
అ.ప. తుష్టి పుష్టి కీర్తి కాంతి మోక్షరూపిణీ 
చ.1. 
సృష్టి స్థితి లయాత్మికా విశ్వాతీతా మహనీయా 
బ్రహ్మరంధ్ర సమాశ్రితా జ్ఞాన రూపీ మహారాధ్యా ॥ 
చ. 2. 
సహస్రదళకమలేశక్తి శివేన సహమోదతే 
పరబ్రహ్మస్వరూపిణీ మల్లికాసుమ గానోత్తమా ॥ 

91. కులసంకేత పాలినీ

ప. కులసంకేతపాలినీ కౌళినీ 
అ.ప. మంత్రసంకేత పూజాసంకేత పాలినీ ॥ 
చ. 1. 
సర్వమంగళరూపిణీ ఈశ్వరతోషిణీ 
కారుణ్య స్వరూపిణీ ఆనందామృత వర్షిణీ 
అనంత కోటి బ్రహ్మాండ నాయకీ జగదంబికా 
సర్వజననీ సర్వేశ్వరీ పంచభూతేశ్వరీ ॥ 
చ. 2. 
మూలాధార కుండలినీ బిందుమాలినీ 
శిఖామధ్యాసననీ మనోన్మని 
మహాసంపత్తిదాయినీ హ్రీంకార నిలయినీ 
నవ మల్లికాకుసుమ మాలాభరణీ ॥

92. కులాంగనా

కులాంగనా శాంభవీ శృంగారవేషా 
అ.ప. సర్వాంగసుందరీ హిమశైల భూషా 
చ. 1. 
కపాలి ప్రాణనాయికా కామితార్ధప్రదాయినీ 
కామసంజీవనీ కల్పవల్లీ సమభుజా 
సర్వకర్రీ సర్వ ధాత్రీ సర్వమంగళా 
సర్వమాతా సర్వ శక్తీ హర్షిణీ హరిసోదరీ 
చ.2. 
కామేశ్వర ప్రణయినీ కామేశ్వర విలసినీ 
కామకోటి పీఠవాసినీ మల్లికాసుమధారిణీ

93. కులాంతస్థా

ప. కులాంతస్థా త్రికోణబిందు మధ్యస్థా 
అ.ప.దివ్యసౌభాగ్య సుప్రభా
చ.1. 
జపాకుసుమసంకాశిని
మదఘూర్ణిత లోచనీ సప్తర్షి 
ప్రీతికారిణీ వరేణ్య వరవర్ణినీ వరిష్టా గరిష్టా 
చ. 2. 
ఈప్సితార్ధప్రదాయినీ ఈశ్వరత్వ విధాయినీ 
విశ్వ సంహారిణీ భైరవీ మల్లికాసుమ గాన ప్రేరణీ ॥

94. కౌళిణీ

ప. కౌళిణీ శివయోగినీ 
అ.ప. శివశంకరీ అభయంకరీ 
చ.1. 
శితికంఠ కుటుంబినీ శ్రీకరీ ధూమ్రలోచని
శుభకరీ విజ్ఞాన దీపాంకురీ శ్రీ రాజ రాజేశ్వరి 
కోటికందర్ప సుందరి కామారి హృదయేశ్వరీ 
చ.2. 
కాళీ భవానీ సుందరేశ్వరి 
పంచదశాక్షర మంత్ర విభావరి 
మహా సంపత్తి దాయిని ఈశ్వరీ 
శ్రీ యోగపీఠేశ్వరి మల్లికాసుమమంజరీ

95. కులయోగినీ

ప. కులయోగినీ పరదేవతాస్వరూపిణీ 
అ.ప. పతివ్రతాశిరోమణీ కులపావనీ మోహినీ 
చ.1. 
నిగమగోచరినిరంజనీ నగకులేశుని 
నందినీ మల్లికార్జునగేహినీ భక్తమానస హంసినీ 
చ. 2. 
చిత్రానంద విధాయినీ కూటత్రయ కారిణీ 
చక్రాంత సంచారిణి సద్భక్త చింతామణీ

96. అకులా

ప. సుధా సాగర మధ్యస్థా సహస్రదళ పద్మస్థితా 
అ.ప. జ్ఞాన స్వరూపిణి అకులా పరమేశ్వరి ॥ 
చ.1. 
కాదంబ కాంతార వాసప్రియా సర్వమంత్రాత్మికా 
కాళికా బాలభాను ప్రభాకరీ పూర్ణచంద్రికా శీతలా ॥ 
చ. 2. 
మత్తమాతంగ కన్యా సమూహాన్వితా 
శతకోటి యోగినీ సంసేవితా 
విశ్వజనప్రియ శంకర తోషితా 
మల్లికాసుమగాన పరితోషితా ॥ 

97. సమయాంతస్థా

ప. సమయాంతస్థా శ్రీ చక్రసంస్థితా 
అ.ప. పంచకోశాంతరస్థా పంచతత్త్వప్రకీర్తితా ॥ 
చ. 1. 
దయాక్షమాజ్ఞానపుష్ప అర్చితాపరమేశ్వరీ 
ఇష్టదేవతాస్వరూపిణి నిత్యయౌవ్వనా కళ్యాణీ। 
చ. 2. 
వేదసంహితమహిమా వేదవేద్యచరితా 
ఇహపరసాధనాకలితా శివరంజని 
సవితా వాసవాదిమునిరంజిత 
గంగాధరాలింగితా కస్తూరికాచర్చితా
మల్లికాసుమగానార్చితా ॥

98. సమయాచార తత్పరా

ప. సమయాచార తత్పరా పరాత్పరా 
అ.ప. దక్షిణామూర్తి రూపిణి శివశక్తి సమన్వితా 
చ. 1. 
కోటిచంద్ర ప్రతీకాశ నానారూప ధరాత్మికా 
పుస్తక వీణాధారిణి పరబ్రహ్మ స్వరూపిణి ॥ 
చ. 2. 
పూర్ణచంద్రప్రభా సదా చంచల లోచనా 
కుండలినీ శక్తిస్వరూప పావక తేజసా 
గౌతమవ్యాస పింగళ మునిపూజితా 
మల్లికా సుమ గానాన్విత ॥

99. మూలాధారైకనిలయా

ప. మూలాధారైకనిలయా ఏకరూపమహామయా 
అ.ప. ఘంటాస్వనవిమోహితా చతురంగబలాన్వితా 
చ.1. 
రక్తవర్ణారక్తనేత్రా మదఘూర్ణితలోచనా భైరవీ 
భైరవప్రియా మనోవృత్తానుసారిణీ 
చ.2. 
కనకప్రభాసా కమలాసనస్థా
హ్రీంకార ప్రణవాత్మికా
అఖండాం అనన్యాం అచిత్యాం అలక్ష్యాం 
అమేయం అనంతం అనూహ్యం అమోఘం॥

100. బ్రహ్మగ్రంధి విభేదినీ

ప. బ్రహ్మగ్రంధి విభేదినీ 
అ.ప. అరుణారుణ కౌసుంబిని 
చ.1. 
చిద్రోపద్రవబేధిని గుహ్యమండలవర్తినీ 
జగత్రయ హితైషిణి జయంతీ జితేంద్రియా ॥ 
చ.2. 
తరుణాదిత్య సంకాశా తంత్రమంత్ర విశేషణా 
జ్ఞానధాతు మయీవిద్యా మల్లికాసుమగానజగన్మయీ ॥
సంతతపతితోద్ధారిణి శిష్టజనావన పోషిణి

101. మణిపూరాంతరుదితా

ప. మణిపూరాంతరుదిత చతుర్భుజా 
అ.ప. పుస్తకధారిణీ కర్పూర కుందోజ్వలా 
చ.1. 
పుష్పబాణహస్తే చంద్రకళావతంసే 
ఆదిత్యమండలవర్తీ సమవర్తీ సవిత్రీ॥ 
చ.2. 
హంసవాహినీ షడధ్వాతీతరూపిణీ 
సదాపూర్ణకుంభా ప్రపుణ్యావలంబా 
సదాసామరూపా సాహిత్యవంద్యా
నవమల్లికాకుసుమ గానావలంబా॥

102. విష్ణుగ్రంధివిభేదినీ

ప. విష్ణుగ్రంధివిభేదినీ 
అ.ప. ఆదిశక్తి మహేశ్వరీ
చ.1. 
నవచక్రిణి మణివాసిని తరుణ ద్యుతికిరణే 
కవితారస కరుణారస నిలయినే విలయినే॥
చ. 2. 
పరమాద్భుత పరమేశ్వరి సవితే 
భవసాక్షిణి నిలయసాక్షిణి 
పరమే ఇంద్రమకుట మణిరాజిత చరణే 
జ్యోతిరూపీ శివాఖ్యే సకలజయకరీబాలే॥

103. ఆజ్ఞాచక్రాంతరాళస్థా

ప. ఆజ్ఞా చక్రాంతరాళస్థా ఓఢ్యాణ పీఠనిలయా 
అ.ప. పాజ్ఞాత్మికాద్విదళ పద్మగతా 
చ.1. 
కర్ణావతంసకలికా కమళాయతాక్షీ స్పటికమణిమయీ 
నాదఓంకారయోగీ వేదవేదాంతరూపీ త్రినేత్రీ 
త్రిలోచన కుటుంబినీ కనక వల్లకీ ధారిణీ 
చ. 2. 
ఇడాపింగళరూపిణీ ఐహికాముష్మిక ప్రదా 
అంతరాకాశ రూపక
మల్లికాకుసుమగానమహితా

104. రుద్రగ్రంధివిభేదినీ

రుద్రగ్రంధి విభేదినీ 
అ.ప.కుమారీ కాలభుజగీ ॥ 
చ. 1. 
కామరాజ మంత్రాంకిత శ్రీ బీజసమన్వితా 
షోడశాక్షరీ విద్యా శ్రీవిద్యా 
ప్రకీర్తితా దహరాకాశ కమలా సుఖాసీనా 
సదాశివ సమేతా హ్రీంకార కుండలా ॥ 
చ. 2. 
ఊర్ధ్వకేశీ ఆంతరధ్వాంతనాశినీ 
మల్లికా సుమగాన ఋషిమండల చారిణీ॥

105. సహస్రాంబుజారూఢా

ప. సహస్రాంబుజారూఢ శ్రీచక్రినీ 
అ.ప.ఉపాసనాఫలప్రదా అకారాది స్వరవర్ణినీ ॥
చ. 1. 
మందార సువాసినీ కమనీయ గుణాలయా 
కురువింద దళాకార కేతకీ కుసుమప్రియా ॥
చ. 2. 
మూలాధారకుండలినీ బిందుమాలినీ
మల్లికాసుమదామ ధారిణీ 
సహస్రదళ పద్మినీ 
కమలే కమలాలయే ॥

106 . సుధాసారాభివర్షిణీ

ప. సుధాసారాభివర్షిణీ సూక్ష్మతేజ స్వరూపిణీ 
అ.ప. గ్రంధి త్రయ విభేదినీ బిసతంతునిభాశుభా 
చ.1. 
కుమారీ ఫణిమండలే తరుణీ పతివ్రతా 
భుజంగాకార రూపేణ మూలాధారా సమాశ్రితా 
చ.2. 
యోగినీ శృంగాటకాకార జ్ఞానేశ్వరి 
నిత్యయౌవ్వనా ఉర్వారుక ఫలాననా 
ఉడునిభా ఉడు మధ్యగా

107. తటిల్లతా సమరుచిః

ప. తటిల్లతా సమరుచీ దివ్యవిగ్రహా 
అ.ప. నీలతోయదమధ్యస్థా ఈహావిరహితా ॥ 
చ.1. 
వైశ్వానరమయీ పరమాహ్లాద లహరీ 
జ్వలత్పావక సంకాశ జ్వలన్ మాణిక్య కుండలా॥ 
చ.2. 
తంత్ర మంత్ర విశేషజ్ఞా 
త్రికాల జ్ఞాన సంపన్నా 
చారుచందన లిప్తాంగీ
చంచచ్చామర వీజితా |

108. షట్చక్రోపరిసంస్థితా

ప. షట్చక్రోపరిసంస్థితా పంచబ్రహ్మాసనస్థితా 
అ.ప. పరబ్రహ్మస్వరూపిణీ ఇందీవరనిభేక్షణా॥ 
చ. 1. 
ఇంద్రాణీ ఇంద్రరూపిణి ఇక్షుకోదండ సంయుక్తా 
శృంగార హాస విలాసినీ భర్గ దేవీ బ్రాహ్మణీ చ. 
2. 
మహోజ్వల మణిద్వీపవాసిని పరమహంసినీ
మల్లికా కుసుమగంధ పరిపూరిత సుందరాంగీ ॥

109. మహాసక్తి

ప మహాసక్తి - మహాశక్తి 
అ.ప. మహావిద్యారూపిణి జ్ఞానశక్తితేజోమయీ|| 
చ1. 
జన్మోధారవిరక్షిణి సద్వాక్యసంచారిణి 
ఆదిదేవుని దేవదేవీ మాహాద్యుతీ ॥ 
పరమ మంగళ శోభినీ
చ.2. 
అశేష జన మోహిని
అభినవ కుల సుందరీ మల్లికా సుమదాయినీ।

110. మహాద్యుతీ

భుజగాకార కుండలినీ  
అ ప.తేజోరూపా అగ్ని తేజశా ॥ 
చ.1. 
కుండలినీ మహాద్యుతీ కుటిలాంగీ అరుంధతీ 
కుండలీశక్తీ ఈశ్వరీ 
భుజంగీ సప్తనామ ప్రకీర్తితా 
మల్లికా సుమశోభితా ॥ 
చ.2. 
పంచదశీ మంత్ర వాగ్బీజా 
ఆదిదేవ వనితాగౌరీ శివార్కమండల 
అమృతమయీ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదాయనీ ॥ ||

111. బిసతంతుతనీయసీ

ప. బిసతంతుతనీయసీ
అ ప. శక్తికుండలినీనామ బిసతంతు నిభాశుభా 
చ.1. 
నీవార సూకవత్తన్వి పీతవర్ణా సుప్రసన్నా 
సంతత కల్యాణీ శివానీ పల్లవపాణీ ॥ 
చ. 2. 
జలజేక్షణ నీచరణాబ్జములను 
నిరతము సదమల మదితో కొలతును 
ముదమలరగ శశిధరునితో గూడి
అనవరతము నా మదిలో నుండుము ॥

112. భవానీ

ప. భవానీ అభవుని రాణి 
అ.ప. సౌభాగ్యదాయిని భవనాశినీ ॥ 
చ. 1. 
మహాకాలాతీత బిందుస్వరూపిణీ 
భవభయహారిణీ త్రైలోక్యశుభదా ॥ 
చ. 2. 
దుష్ట సంహారిణీ కళ్యాణకారిణీ 
మల్లికాహృదయినీ దుర్గాశివానీ ॥

113. భావనాగమ్య

ప. భవానీ భావనాగమ్య 
అ.ప. భవబంధ నిర్మూలినీ శూలినీ ॥ 
చ.1. 
ఏభావముతో నిను పూజించిన ఆరూపముతో సాక్షాత్కరించే 
కరుణామయివే కామేశ్వరీ నిన్నేమేము శరణంటిమమ్మా ॥ 
చ. 2. 
స్థూలభావనా తామ సరూపిణీ 
సూక్ష్మభావనా రాజస రూపిణీ 
కారణభావనా సాత్వికరూపిణీ 
కరుణచూపవే విశ్వరూపిణీ ॥

114. భవారణ్య కుఠారికా

ప. భవారణ్య కుఠారికా 
అ.ప.భక్తిభావనా సంచితా మహేశ్వరీ ॥ 
చ.1. 
భవబంధ వినుర్ముక్తా బ్రహ్మండనాయికా 
అజ్ఞానము తొలగించే విజ్ఞానదాయినీ।। 
చ. 2. 
సర్వావగుణవర్ణిత శ్రీమాతా భవుని రాణి 
భూతప్రేత భయనాశినీ పాశినీ ॥

115. భద్రప్రియా

ప. భద్రప్రియా మంగళప్రదా 
అ.ప. భ్రహ్మప్రియా బ్రహ్మేశ్వరీ|| 
చ.1. 
సర్వజన శుభకరీ వీరభద్ర పూజితా 
హరిద్రా కుంకుమోపేతా సర్వమంగళా॥ 
చ. 2. 
ముద్రప్రియే దేవీ దేదీప్యమానా 
సంసార లీలాకరీ సంక్షోభిణీ 
సర్వజ్ఞ విజ్ఞత పాదారవిందా 
సర్వాధికా వరప్రదా సిద్ధిప్రదా॥

116. భద్రమూర్తి

ప. భద్రమూర్తి పరబ్రహ్మ మూర్తి 
అ.ప. బుధతోషక ఉద్దీపతభద్రమూర్తి|| 
చ. 1. 
శివలింగముల యందు ముత్యముల యందు 
శంఖములయందున రతనాలయందు 
స్త్రీలపాపిటయందు పద్మమునందు 
మంగళకరమైన విశ్వవ్యాపకమూర్తి॥ 
చ.2. 
సుధీజన రక్షణవర్తి చిదానందఘన 
భద్రమూర్తి నిత్యనూతనమూర్తి 
సత్యశోధనమూర్తి 
మల్లికాసుమగానమూర్తి త్రిమూర్తి॥

117. భక్త సౌభాగ్య దాయినీ

ప. భక్తసౌభాగ్య దాయినీ సర్వమయీ 
అ.ప.సారసలొచని సరగున బ్రోవవే ॥ 
చ.1. 
మా హృదయ కమలమున నిన్నే నిలిపి 
సతతము పూజింతుము భువనేశ్వరీ|| 
చ.2. 
పసుపుకుంకుమలిచ్చి ఐశ్వర్యములనిచ్చి 
సకలసౌభగ్యములిచ్చు భాగ్యాబ్ది చంద్రిక 
జరామృత్యు భయహారిణీ సకలోపద్రవహారిణీ 
సకలవేద సంచారిణీ మల్లికాసుమరూపిణి॥

118. భక్తప్రియా

ప. భక్తప్రియా భక్త పోషిణీ 
అ.ప. శాంత్యతీత కళాత్మికా ॥ 
చ.1. 
ఈవిశ్వమునకు సృప్తికర్తవు 
దీనులపాలిటి ఏకైకమాతవు 
ఆశ్రితభక్తజనావన పాలిని 
ఆదిశక్తిశివతాండవ లోలిని॥ 
చ. 2. 
తపములెరుగను జపములెరుగను 
పాపమెరుగనే పుణ్యమెరుగను 
అపరాధిని నేనమ్మా శంకరీ 
కపట చిత్తజన ఖండవ శంకరీ||

119. భక్తిగమ్యా

ప. భక్తిగమ్యా కమలాలయా 
అ.ప. భక్తజనసంరక్షణీ దాక్షాయణీ॥ 
చ.1. 
శివమానసోల్లాసినీ లలితా పరమేశ్వరీ 
అవాజ్ఞ్మనసగోచరా తరుణాదిత్యపాటలా॥ 
చ. 2. 
విష్నుమహీశ ఇంద్ర సదాశివకారణభూత 
హారకేయూర ముకుటాలంకృత ॥

120. భక్తివశ్యా

ప. మ్రొక్కెదనీపాదములకు భక్తివశ్యా 
అ.ప.దిక్కునీవేనని మనమున నమ్మి| 
చ1. 
నీలకంఠ శృంగారనాయికా ఉత్పలనయనా 
కనక శలాకా మణిద్వీపవాసిని 
సింహాసనేశ్వరీ విలాసహాస కపాలితోషిత॥ 
చ. 2. 
నతజనసులభా నవనీతపాటలా 
మల్లికాసుమగాన సంతోషనేత్ర॥

121. భయాపహా

ప. భయాపహా సకలవాంఛప్రద 
అ.ప.సంసారారణి సర్వకారిణి 
చ1
యోగగమ్యా సర్వగా సర్వదా 
తుష్టినీవే పుష్టినీవే కాంతినీవే 
శాంతినీవే సర్వ చరాచర జగన్మాతవు నీవే 
ధూమ్రాక్ష మర్దినీ దురితాపహే 
చ.2. 
రాగ వివర్ధిని దుర్గతి నాశినీ 
తాపనివారిణి సద్గుణ వర్షిణి 
భవభయహారిణి పాపవిమోచని 
లోకహితైషిణి కైలాసవాసినీ

122. శాంభవి

ప. భక్తి సంపద నియవే శాంభవీ 
అ.ప. నవవిధమ్ముల భక్తిమార్గముల సేవింప ॥ 
చ. 1. 
నీమహిమలే వినుచు నీ స్మరణ చేయుచూ 
మల్లికా కుసుమముల నిను కీర్తించేటి 
నీ పాదసేవయే మాకు ఇహము పరము 
నిన్నుఅర్చించుటే మాజీవితాశయము॥ 
చ.2. 
వందనములర్పించి నీకుదాస్యముచేసి 
సతతమ్ము మదిలోన నీసఖ్యతను పొంద 
ఆత్మనివేదనయే నీకునైవేద్యమై 
ఆత్మానుభూతినే అనుభవింపగ జేసి ॥

123. శారదారాధ్యా

ప. శారదారాధ్యా రమాసేవితా 
అ.ప. సామవేదవిలసితా నవరాత్రిపూజితా| 
చ. 1. 
సుధాపూర్ణాకుంభా ప్రసాదావలంబా 
సదాస్యేందుబింబా భజేశారదాంబా 
మంజులవీణాగానవినోదిని 
మల్లికాకుసుమగానమోహిని॥ 
చ.2. 
వైష్ణవీ వారాహి వాగ్దేవీ వైఖరీ 
జ్ఞానానందమయి మహామహేశ్వరీ ॥

124. శర్వాణీ

ప. పాలింపవమ్మా శర్వాణీ 
అ.ప. వరములొసగుమని నిన్నువేడితిని ॥ 
చ.1. 
శరణాగతివని సదానమ్మితిని 
నీవేగతియని స్తుతిసలిపితిని 
నీకుభారమా మామొరవినుమా 
దురిత విదారిణి మృడానీ శివానీ ॥ 
చ.2. 
త్రిలోక జననీ తామస మేలనే 
కామకామ్యదా నన్నుకావవే 
ఆదిశక్తి ననుపరాకుచేయకు 
మల్లికాకుసుమగాన మంగళా॥

125. శర్మదాయిని

ప. శర్మదాయినీ పాహిపాహిమాం. 
అ.ప.చండముండ నిశుంభినీ పాహిపాహిమాం|| 
చ. 1. 
నవరాత్రిసంచారిణి శూలాయుధధారిణీ 
శంభాసుర సంహారిణి జ్వాలా జ్వాలా మాలిని|| 
చ. 2. 
మంత్రాత్మికా ఆగమశాస్త్రార్ధకా 
హ్రీంకారాత్మికా విమలాత్మికా చాముండీ 
ఇంద్రాక్షీ వారాహీ వనదుర్గా 
మల్లికాకుసుమగాన కామేశ్వరీ॥

126. శాంకరీ

ప. శాంకరీ మహేశ్వరి 
అ.ప.దయాకరీ యశస్కరీ | 
చ.1. 
నీదయమాకున్నచో శుభములు చేకూరునే 
నీచల్లనిచూపుతో సుఖశాంతులుకూడునే 
పూజించినవారికి అభయమిచ్చుమాతవే 
నెఱనమ్మినవారికి వరములిచ్చుదాతవే|| 
చ.2. 
నీకన్నుల కాంతిలో సకల జగము వెలుగునే 
నీచిరునవ్వులలో మాఉనికిని మరతుమే 
దురితములను బాపెదవని నమ్మితినమ్మా 
కరుణించుదాక నీపాదము విడువనమ్మ||

127. శ్రీకరీ

ప. శ్రీకరీ జయకరీ శుభములొసగవే 
అ.ప. శ్రీరంగధామేశ్వరి పరమశుభకరీ|| 
చ.1. 
ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి 
సంతానమునొసగే సంతానలక్ష్మి 
విజయలక్ష్మి గజలక్ష్మి విద్యాలక్ష్మి 
అప్లైశ్వర్యములొసగే ధనలక్ష్మి॥ 
చ.2.
 త్రైలోక్య కుటుంబినీ ముకుందప్రియా కాళీ 
జగదంబికా కమలాలయా॥

128. సాధ్వీ

ప. సాధ్వీ - సాద్వీ నీచరణములే శరణము 
అ.ప. నీవే జగతికి మూలకారణము 
చ.1. 
నినుచేపట్టిన గరళకంఠుడు 
మంగళకరుడై లోకపూజితుడై 
త్రిలోకవంద్యుడై అర్ధనారీశుడై 
శరణాగతుడై కరుణామయుడాయె|| 
చ. 2. 
పాతకములను దరిజేరనీయక 
మము బ్రోవు మమ్మా 
గిరిజాకుమారి మగువలపాలిటి మంగళ గౌరి 
పరమపతివ్రత సాధ్వీమతల్లీ॥

129. శరచ్చంద్ర నిభాననా

ప. శరచ్చంద్ర నిభాననా నాకాధిరాజస్తుతా
అ.ప. సుమేరు నిలయినీ కమలాంబికా 
చ. 1. 
చారుచంద్రకళాధరీ కుమారజననీ 
బిందుత్రయసమన్వితా సర్వమాతృకా॥ 
చ. 2. 
పద్మాసనాసీనా అంభోరుహలోచనా 
సత్యానంద రూపిణి నిత్యానంద 
విధాయిని యశోదేహి ధనందేహి దేహిమే శివశంకరీ 
మల్లికాసుమగానసులభా సుందరీ త్రిపురేశ్వరీ॥

130 శాతోదరి

ప. శాతోదరి 
అ.ప. శతోదరునిపుత్రీ కాళీ హైమవతీశ్వరి 
చ.1. 
సామ్రాజ్యలక్ష్మీకరి శాతోదరి ఉత్తమసాముద్రికా 
లక్షణాలంకృతా సదాచారసంపన్నా 
కరుణామృతసాగరి భద్రరాజగమనా రాజరాజేశ్వరీ|| 
చ.2. 
విజ్ఞానదీపాంకురీ సుందరేశ హృదయేశ్వరి 
అరుణమాల్య భూషాంబరి లకులేశ్వరి 
చంద్రాంశు బింబాధరి ధర్మైకనిష్టాకరి 
మల్లికాకుసుమ పూజిత మల్లేశురాణి॥

131. శాంతిమతి

ప. కొలువుతీరెను కనరే 
అ.ప. మనశాంతిమతి కోర్కెలివ్వగనేడు 
చ.1. 
ప్రజ్ఞాన రూపిణి అఖిలాండనాయకి 
హ్రీంకారరూపిణి భవుని పట్టపురాణి 
తప్పులనుక్షమియించి వరములిచ్చేతల్లి 
చిత్శాంతినొసగేటి చిద్రూపి కల్యాణి 
చ.2. 
అందాలకన్నులు కరుణామృతము చిలుక 
వరదాభయహస్తముల సంపదలొసగే తల్లి॥

132. నిరాధారా

ప. నిరాధారా సర్వాధారా
అ.ప. అద్వితీయా అవ్యయా ॥ 
చ.1. 
సకలభువనాధార నిలయా కృపాలయా 
సకలాధిష్టానరూపా అజేయా అనంతా ॥ 
చ. 2. 
మునిబృంద హితాకార 
వందారుజనవంద్యా భక్తజనమందార 
బృందారకా లీలాకల్పిత బ్రహ్మాండ మండలా
అనాహతపద్మమందిరా ఇందిరా||

133. నిరంజనా

నిరంజనా నిరుపమసుఖదా 
అ.ప. భావయామి పరదేవతా| 
చ.1. 
లీలామానుషవిగ్రహా బ్రహ్మ విష్ణు శివాత్మికా 
అవ్యాజకరుణాపూరిత స్వధానారీమధ్యగతా॥ 
చ. 2. 
మల్లికాసురభిసౌరభా 
భుక్తిముక్తి ఫలదా మండలాంత మణిదీపికా 
మహిషాసుర భంజనా నిరంజనా॥

134. నిర్లేపా

ప. నిర్లేపా పధగామిని 
అ ప. భవబంధవిమోచని 
చ. 1. 
వేదవేద్య సంగరహితా శూలహస్తామందస్మిత 
మాయాతీత స్వరూపిణి బాలా భవభయహారిణీ॥ 
చ. 2. 
భక్తహృదయాంభోజనిలయా 
నిత్యా పరమానందా క్షేమంకరి 
మహాశక్తి బ్రాహ్మీ దుర్లభ రూపిణి||

135. నిర్మలా

ప. నిర్మలా సునాదవిలోలా 
అ.ప.బాలా నీలసమానకుంతలా | 
చ.1. 
ఆనందనీలాకృతి మాణిక్యమౌళిద్యుతి 
శీతాంశుగిరిసుతా పశుపతీసతీ సతీ॥ 
చ. 2. 
దురితవర్గధ్వంసినీ భగవతీ 
మల్లికాసుమపూజిత హైమవతీ 
కామేశ్వరమోహినీ సద్గతిదాయిని 
హిమాంశువర్ణవర్ణినీ భాస్వతీ ॥

136. నిత్యా

ప. నిత్యా నిత్యస్వరూపిణి నిత్యయౌవ్వన శాలిని 
అ.ప. నిత్యసౌభాగ్యదాయిని నిత్యకళ్యాణి ॥ 
చ. 1. 
జన్మజన్మాంతర దుఃఖభంజని 
హ్రీంకారోద్యానకేకినీ 
కుంకుమకస్తూరీ తిలకఫాలా 
మహాశక్తిమణిద్వీపనివాసిని॥ 
చ. 2. 
అష్టసిద్ధి నవనిధిదాయినీ కామితదాయిని హంసవాహినీ 
సంగీతమాతృకా వైష్ణవీ పరమశాంత స్వరూపిణి నిత్యా॥

137. నిరాకారా

ప. నిరాకారా నిర్వికారా 
అ.ప. ఇంద్రనీలమణిమయ ప్రాకారా ॥ 
చ.1 
లలితా బాలా శ్యామలాకృతి 
గంగాభవాని గాయత్రీరూపిణి ॥ 
చ.2 
సృష్టి అంతయు నీచిద్విలాసమే 
అణువణువున విరిసె నీవిలాసమే 
దురితములనుబాపు నీదరహాసమే 
ఆనందామృత వర్షిణి హర్షిణీ||

138. నిరాకులా

ప. నిర్వ్యాకుల భావ నిరాకులా 
అ.ప. భావనామాత్రసంతుష్ట హృదయా 
చ.1. 
పాప తాప దారిద్యనాశినీ 
కల్పవృక్షసముదాయభాసినీ 
రమ్యకపర్దిని శ్రీచక్రవాసిని 
సర్వరంజని కౌళిని పాశినీ॥ 
చ. 2. 
సర్వకాల సర్వావస్థా సమస్థిత 
బ్రాహ్మీ వైష్ణవి వారాహి వందిత 
సర్వమోహినీ పూజిత చరితా 
మల్లికాకుసుమ మాలికాపూజితా ॥

139. నిర్గుణా

ప. సర్వలక్షణాతీత నిర్గుణా 
అ.ప. సుస్థిరచిత్తా చిత్స్వరూపిణీ। 
చ.1. 
భక్తుల బ్రోచే భారమునీదే 
దీనులపాలిటి దైవమునీవే ॥ 
నిర్గుణోపాసకులు నారదా తుంబురులు 
సనకాది మునులు నిత్యము తలచే ॥ 
చ. 2. 
మము దయచూడవే కంజలోచని 
పావనచరితా గుణాతీతా 
వ్యాకుల భావాలు భావవికారాలు
మనసునకంటని శుద్ధమానస॥

140. నిష్కలా

ప. నిష్కళచిత్తా నిష్కలా 
అ.ప. నిరాధారా నిరాకారా | 
చ. 1. 
జీవకోటికి జీవమునీవే 
సకలవేదముల భావము నీవే 
మమ్ములబ్రోచే భారము నీదే 
హిమవన్నగకులేశుని నందినీ ॥ 
చ.2. 
మహాశక్తి మణిద్వీప నివాసిని 
రాజిత శుభగుణశాలినీ 
దాక్షాయణి రౌద్రిణీత్రినయనీ 
మల్లికాకుసుమగానవిలోలినీ ॥

141. శాంతా

ప. శాంతస్వరూపిణి పరదేవతా శాంతా 
అ.ప. చిత్శాంతి కలిగించు కాంతిశివకాంత॥ 
చ.1. 
పసిడి వెన్నెల కాంతి పట్టు వస్త్రములు 
మల్లికా కుసుమాలు ధరియించుతల్లీ 
శుద్ధ మందస్మిత వదనారవింద 
పరమ శాంతి స్వరూప పార్వతీమాత ॥ 
చ. 2. 
పంచదశాక్షరి మంత్రాధినేత 
కార్తికేయునిమాత శ్వేతగిరిదేవతా 
సర్వేశగేహిని భవసింధుపోతా 
రాజరాజేశ్వరి కారుణ్యకలిత||

142. నిష్కామా

ప. నిష్కామరూపిణి నిర్మోహిని 
అ.ప. కోర్కెలను తీర్చేటి కామేశ్వరీ|| 
చ.1. 
మదనారికే నీవు మనోహరివైనావు 
అశుతోషుమెప్పించి అర్ధాంగివైనావు 
మంత్రాధిదేవతగా మనసునందున నిలచి 
సిరి సంపదలనిచ్చు మహలక్ష్మివే నీవు ॥ 
చ. 2. 
హంస వాహనారూఢ వేదమాతవై వచ్చి 
జ్ఞాన జ్యోతులు నింపు జ్ఞానదాతవు నీవు 
శంకర పీఠమున శారదాంబవై నిలచిన 
ఆదిశంకరపూజిత సౌందర్యలహరి ॥ 

143. నిరుపప్లవా

ప. ఓసర్వలోకేశి నిరుపప్లవా 
అ.ప.దీవింపరావమ్మ భవ్యచరితా॥ 
చ. 1. 
సర్వదేవతరూపనిరుపమానంద 
మమ్ములనుకరుణించు సర్వేశురాణి 
సకలమనోరధ పూరణకారిణి 
చీనాంబర శ్వేతాంబరధారిణీ|| 
చ.2. 
సకలాగమ నిగమమ్ముల 
సృజనకారిణీ జ్ఞానదాయి 
సుఖదాయిని మోక్షదాయిని॥

144. నిత్యముక్తా

ప. నిత్యముక్తా భవబంధ నిర్మూలినీ 
అ.ప. నిరాకార నిర్వికారస్వరూప 
అరిషడ్వర్గముల హరియించుతల్లీ॥ 
చ. 1. 
మాకర్మలనుంచి ఐహికబంధములు 
క్రియలనుంచేకదా పాపపుణ్యములు 
నేచేయుపూజలకు ఎంతెంతఫలమో 
అంతంతనిచ్చేటి సౌభాగ్యజననీ ॥ 
చ. 2. 
విబుధగణార్చిత పరశివలలితే 
నవమల్లికాకుసుమ గానమోహితే ||

145. నిర్వికారా

ప. నిర్వికారా నిష్కలంక 
అ.ప. నిర్గుణమూర్తి నిరంజనీ ॥ 
చ.1. 
శృతిసార గమ్యా సుస్థిరతేజా 
సంసారదహన సన్నుతచరణా 
దీనశరణ్యా భాసురతేజ 
దీనరక్షణి పరాత్పరీ॥ 
చ. 2. 
ముక్తిదాయిని సిద్ధిప్రదాయిని 
ధర్మధారిణీ పరమహంత్రి 
మల్లికాసుమగానదాయిని 
మనోవిత్తానుసారిణి।।

146. నిష్ప్రపంచా

ప నిష్ప్రపంచా నిరామయా 
అ.ప. ఆదిశక్తి కరుణామయి॥ 
చ. 1. 
లోకములన్నీ కుక్షిలోనుంచుకొని 
జగములనేలే జగదీశ్వరీ 
కార్యకారణభూత సకలగుణోపేత 
శరణన్నవారిని కరుణించు శ్రీలలితః। 
చ.2. 
సకలజీవులకు సంజీవనివై 
ఘోరాసురులకు రాక్షసదమనివై 
పదునాల్గులోకాలు చల్లగకాచే 
లోకపాలకుని మానసవిహారిణి॥

147. నిరాశ్రయా

ప. నిరామయకరీనిరాశ్రయా॥ 
అ.ప. భక్తాభీష్టకరీ సురనుతా॥ 
చ.1. 
చంద్రకళాధరి మహాదేవతా 
సుందరచరణా శాస్త్రసన్నుతా 
అంబా శాంభవీ అసమానబలా 
చంద్రహాసోజ్వలా అమితప్రజ్వలా॥ 
చ. 2. 
కలిదోషహరాకంజలోచనా 
సర్వశుభంకరి పాహిమహేశ్వరి 
శంకరతోషిణి చాపిని బాణిని 
మల్లికాకుసుమ గానప్రజ్వలా॥

148. నిత్యశుద్ధా

ప. నిత్యశుద్ధ నిర్మలదేహ|| 
అ.ప. నిశుంభఘ్నీ నిరుపమసుఖదా|| 
చ.1. 
ప్రియభాషిణి ప్రణతార్తినాశినీ 
పరమోదారా మాతా పార్వతీ 
ప్రవాళశోభా ప్రణవాగతి 
పావకద్యుతి ధృతపదాధృతీ|| 
చ.2. 
పుణ్యశీలా దిగ్విమోహినీ దీనవత్సలా 
నిత్యాతామశీ పాటలాక్షీ పరాశక్తీ 
మల్లికాకుసుమ గానాత్మికా॥

149. నిత్యబుద్ధా

ప. నిత్యబుద్ధా నిర్మలాత్మికా॥ 
అ.ప. బృందహితాకార బిందుదర్పణా|| 
చ. 1. 
భూసురార్చితాభర్గాత్మికా 
భూతధాత్రి జగద్ధాత్రి|| 
చ. 2. 
బుద్ధివివర్ధన కారణశక్తి 
సర్వసమభావ సమాశ్రయా 
ప్రేమామృత పరిపూరితహృదయా 
మల్లికాకుసుమ గానసదయా ॥

150. నిరవద్యా

ప. నిరవద్యా జ్ఞానరూపిణి।। 
అ.ప. నిరంజనా దోషరహితా। 
చ.1. 
కాలపాశ తత్కాలనివారిణీ 
అద్భుతసుందరకేళి పరాయణి 
అండజేరితిని బ్రోవుముజననీ 
అగణితగుణగణ నామవిలాసిని॥ 
చ. 2. 
పాపవిమోచని దుర్జనశాసని 
మల్లికాకుసుమ సుందరవదనీ

151. నిరంతరా

ప. నిరంతరా కరుణాంతరంగా॥
అ.ప. జ్ఞానసముద్రా సురాసుర నమస్కృతా॥ 
చ.1. 
తాపత్రయోపశమనా అప్రాకృతరూపా 
జగద్వందితా ఆశ్రితవరదా 
అనితరసాధ్యా అగణితగుణగణ 
నవమల్లికా కుసుమోపేత
చ. 2. 
కుటిలవర్జితా అమలచరితా 
విజ్ఞానరూపిణి సర్వాధారా సర్వసుభగా

152. నిష్కారణా

ప. నిష్కారణా నిర్మలసదనా॥ 
అ.ప. నీరజలోచన సన్నుతచరణా॥ 
చ. 1. 
దివ్యతనూభవ దీనరక్షణా 
సుస్థిరతేజ కార్యకారణా|| 
చ.2. 
శత్రునాశనీ పరమదయామయీ 
సర్వకళాధీశ్వరీ బ్రహ్మేశ్వరీ 
బ్రహ్మాత్మికా కామేశ్వర కాంతా 
కామేశి వజ్రేశి భగేశిరూపా||

153. నిష్కలంకా

ప. నిష్కలంకా నిర్మలా 
అ.ప. నిత్యకళా షోడశికా ॥ 
చ. 1. 
నిరాటంకదయా ప్రపంచికా 
నీలాలకశ్రేణి సంభావితా 
దేదీప్యమాన హతారివర్గా 
సర్వస్యలోకస్య సవిత్రీదేవీ ॥ 
చ. 2. 
సద్గతిదాయినీ సకలోత్తమసంస్తుతా 
సనకాదిముని వందిత సౌభాగ్యదాయినీ।

154. నిరుపాధిః

ప. నిరుపాధిః నిర్వికల్ప 
అ.ప. నిర్మలాంతః కరణ మనోహరి ॥ 
చ.1. 
మహదైశ్వర్య నిరవధిక సుఖదా 
యోగదా నిరుపమగుణ 
నిర్వికారా నిర్మలానంద నిఖిలాహ్లాదకా ॥ 
చ. 2. 
శుభఫలవర్షిణీ దుర్ధర దర్శిని 
మల్లికాకుసుమగాన వర్షిణీ ॥

155. నిరీశ్వరీ

ప. నిరీశ్వరీ రాగరహితా 
అ.ప. నరచిత్త ప్రమోదిని ॥ 
చ. 1. సుఖదుఃఖవిదారిత భవసాగర నౌరసంగా 
సర్వావగుణవర్జితా భోగినీ కులయోగినీ ॥ 
చ. 2. 
సంసారసాగరతార్ణవకారిణి 
అద్వైతామృతవర్షిణీ 
మల్లికాకుసుమరాగ విభావరి 
త్రిపురసుందరి శ్రీకామేశ్వరి॥

156. నీరాగా

ప. నీరాగా పరబ్రహ్మస్వరూపిణి
అ.ప. భక్తహృదయవిహారిణి దురితాపహారిణి ॥ 
చ.1. 
తాపత్రయహారిణి రాగవివర్ధిని 
చతుర్దశభువన సంచారిణి || 
బ్రాహ్మీదుర్లభ రూపిణి 
శంకరహృదయ విలాసిని 
చ. 2. 
సగుణనిర్గుణాత్మిక చిద్విలాసరూపిణి 
మల్లికాకుసుమసహజ పరిమళ కేశిని ॥

157. రాగమధనీ

ప. రాగమధనీ ఆగమశోభినీ।। 
అ.ప.వేద జననీ జగదోద్ధారిణి| 
చ. 1. 
రాగధ్వంసిని భవరోగనాశనీ 
భక్తమానస హంసినీ సద్గతిదాయిని 
కామేశ్వరకామినీ కాళికా 
అఖిల బ్రహ్మాండనాయకి॥
చ. 2. 
సరసిజనయనీ సర్వదుఃఖహరి 
దానవఘాతిని మాధవేశ్వరీ 
బ్రహ్మచారిణీ సజ్జనపోషిణీ 
మల్లికాసుమ మాలికావలయిని ॥

158. నిర్మదా

ప. నిర్మదా నిశ్చయాత్మికా 
అ.ప. శ్రీమత్ సభా నాయికా ॥
చ.1. 
జ్ఞానస్వరూపీ ఓంకారయోగీ
కష్టనివారిణి ఇష్టవిధాయిని 
భ్రాంతినాశిని ముక్తిగేహినీ 
సర్వవిమోహిని మోహిని ॥
చ.2 
అఖిల కోటి బ్రహ్మాండనాయికా 
ముక్తి సర్వరూపిణి మహామాయా 
నియతాచారా నిగమలయా
నవమల్లికా కుసుమాంచితమస్తకా

159. మదనాశనీ

ప. మదనాశనీ రాగద్వేషాతీత రూపిణీ! 
అ.ప. సురగుణపూజిత సాధుజనాశ్రిత॥
చ.1.
భవ భవ విదారిణీ కామదేవు దేవేశ్వరి 
భుక్తిముక్తి ప్రదాయిని భవద్వేషిణిభగవతీ ||
చ.2 
మదమత్తమహిష దానవ సంహారిణీ 
శిష్టజనసంరక్షణి 
శంకర తోషిణీ పావనశుభగాత్రి సావిత్రీ
మల్లికాసుమగాన విమలనేత్రీ ||

160. నిశ్చింతా 
ప. మా చింతలుతీర్చుమాతల్లి నిశ్చింతా॥ 
అ.ప. చింతామణి గృహవాసిని శ్రీ మాతా || 
చ.1. 
మాకోర్కెలను తీర్చి పాపాలనుబాపి 
మాదుఃఖముతొలగించి సౌఖ్యమునిచ్చేతల్లి
చ. 2. 
మధుకైటభ ప్రహరిణీ జగన్మోహినీ 
సన్మార్గబోధినీ హంసినీ శోభినీ 
మాంగల్యదాయినీ నారాయణి 
నిత్యసుమంగళీ తల్లీ కళ్యాణీ!

161. నిరహంకారా

ప. నిరహంకారానిరాలసా॥ 
అ.ప. నీలసంకాశా పరా॥ 
చ.1. 
కోటి సూర్యభాసమాన పరమేశుని భాగ్యరాశి 
కైలాస శిఖరవాసి దేవీ నిరుపమగౌరీ | 
చ. 2. 
సృష్టి వినాశ పాలనకరీ నిరామయకరీ శుభకరీ 
లీలానాటకసూత్రధారిణి మల్లికాకుసుమగానలోలిని |

162. నిర్మోహా

ప. నిర్మోహా సర్వవిమోహినీ।। 
అ.ప. సర్వావగుణవర్జితా| 
చ. 1. 
పాపశమనీ ప్రాభవశాలినీ అభినవకుళ సుందరీ
మందహాస వీక్షణీ అశేషజనమోహినీ ॥
చ. 2. 
ఈప్సితార్ధ ప్రదాయిని సాధ్వీసద్గతి దాయిని 
మల్లికాకుసుమరాగవిభావరి సంసారసాగర తార్ణవకారిణి||

163. మోహనాశినీ

ప. మోహనాశినీ భ్రాంతినాశినీ।। 
అ.ప. ఈతిబాధావినాశినీ।।
చ. 1. 
హతదానవా హంసవాహనా హయమేధ 
సమర్చితా మైధిలీవర వందితా సకలోత్తమ సంస్తుతా ॥
చ. 2. 
కామేశ్వరవిలాసినీ కామేశ్వర విమోహిని
కామేశ్వర మనః ప్రియా మల్లికాసుమ సుఖప్రదా॥

164. నిర్మమా 

ప. నిర్మమా దేవీఉమా 
అ.ప. లబ్దాహంకార దుర్గమా॥ 
చ.1. 
ఇల్లునాది దేహమునాది 
ధనమునాది దర్పమునాది 
నాది నాదియను మమకారమును
దూరము చేయవే సర్వవ్యాపిని॥
చ.2. 
అహంకారమును దూరముచేసి 
సద్గతినీయవే సర్వమంగళా 
హ్రీంకారాంకిత మంగళచరణా 
మల్లికా సుమగాన భావుకా ॥

165. మమతా హన్రీ 

ప. మమతాహన్రీ దుఃఖహన్రీ 
అ.ప. నరకార్ణవ తారిణీ |
చ. 1. 
వదనకపాలిని ఫాలవిలోచని 
దుఃఖవినాశిని ఈశ్వరీ నారాయణి 
రమణీయగుణార్ణవ 
కుంకుమశోభిత శుభప్రదా ॥ 
చ. 2. 
లోకశోక వినాశిని శంకరీ
తాపత్రయ నివారిణి మధుకరి 
త్రిభువన భూతకరీ శ్రీకరీ 
మల్లికాకుసుమగానలాహిరీ॥

166. నిష్పాపా

ప. నిష్పాపా పుణ్యఫలప్రద 
అ.ప. మహాపాతకనాశనీ ॥ 
చ. 1. 
పురాణాగమా ప్రకృతి రూపిణి 
సర్వోపద్రవ నివారిణి 
అనంతగుణరూపిణి భవానీ 
భక్తజన పోషిణి శివానీ॥ 
చ. 2. 
బ్రహ్మహత్యాది పాపశమనీ 
దుర్జనాశేష దుష్ట శిక్షాకృతీ 
అగణితగుణగణ్య పుణ్యాకృతీ 
మల్లికాకుసుమగానాకృతీ

167. పాప నాశినీ

ప. పాపనాశిని సుహాసిని
అ.ప. నందకందళిత అపరాజిత॥ 
చ.1. 
రాగాదిదోషరహిత స్వజనానురాగ 
ఘోరపాపనాశిని పతితోద్ధారిణి 
కర్ణకుండలభూషిణి ఘోరాసురదమని 
కాశికాపురవాసినీ త్రిభువనసంచారిణి ॥ 
చ.. 2. 
పరమేశ్వరహృదయవిహారిణి ధారుణి 
నవమల్లికాకుసుమగానవిహరిణి ॥

168. నిషోధా 

ప. నిష్కోధా శాంతస్వరూపా॥ 
అ.ప. మోహనహాసవిలాసభావ॥ 
చ. 1. 
జనన మరణ భయ శోకనివారిణి 
సకలవేద నిగమాగమ రూపిణి॥ 
చ. 2. 
కైలాసాచల శోభన కారిణి 
నగకులేశుని నందినీ 
ఓంకారనాదాను సంధాయినీ
మల్లికాకుసుమగానమోహినీ।।

169, క్రోధశమని

ప. ఆగమశోభినీ క్రోధశమనీ 
అ.ప. వేదజననీ జగదోద్ధారిణీ ॥ 
చ. 1. 
సర్వదుఃఖహరి సరసిజనయనీ 
సద్ధతిదాయిని కామేశ్వరకామిని 
మాధవేశ్వరీ దానవఘాతిని 
బ్రహ్మచారిణీ సజ్జనశోభినీ ॥ 
చ. 2. 
శివానీ అఖిల బ్రహ్మాండనాయికా 
రక్త బింబాధరీ కాళికా దైత్యదళనీ త్రిపురాంబికా
మల్లికాకుసుమ మాలికావలయిని ॥

170. నిర్లోభా

ప. దయచూపవే శాంభవీ నిర్లోభా
అ.ప. నందనోద్యాననిలయా ॥ 
చ. 1. 
నాహృదయమేపొంగి కవితలైవెలిగి 
మల్లికాకుసుమ గానమై విరిసి 
నీదయామృతము ధారలైకురియ 
నీదుమహిమలే పాడి మెప్పింతు॥
చ. 2. 
పరమలోభులగు జనులమనములకు
నీదు స్మరణమే మేలుకూర్చగా తామసహారిణి ధూమ్రలోచని
వేడుకొందునిను పరిపరి విధములు॥

171. లోభనాశిని 

ప. సర్వలోకాశ్రితా లోభనాశినీ
అ.ప. నానార్ధ తత్త్వాత్మికా ॥
చ.1. 
పంచపాపముల అరిషడ్వర్గముల నిగ్రహించగల 
దాక్షిణ్యలోలా రూపములేని 
పాపములేని లోభములేని సర్వవిమోహితా ॥ 
చ. 2. 
మంగళచరితా ఆగమసన్నుతా 
సకలవేదవేదాంగ సంకాశితా శాశ్వతానంద 
సంధాయిని మల్లికాసుమగాన వినోదినీ॥

172. నిస్సంశయా

ప. నిరవధి సుఖదా నిస్సంశయా ॥ 
అ.ప. నిర్వోపద్రవ కారిణీ 
చ.1. 
అన్నికావ్యముల సారమునీవే సర్వకళలకు 
నిలయమునీవే వేదములన్నీ 
నీటురూపమే ఉపనిషత్తులూ నీబోధనలే॥ 
చ. 2. 
నీవే జగతికి సర్వాధారము
సకల చరాచర మూలకారణము 
భవభయహరణము నీదుచరణము 
మల్లికాకుసుమ గాన ప్రేరణము॥

173. సంశయఘ్నీ 

ప. సంశయఘ్నీ సనాతనీ 
అ.ప. నరచిత్త ప్రమోదినీ ॥ 
చ. 1. 
సంశయములుతీర్చి 
అజ్ఞానభావనలు తొలగించి 
జ్ఞానము కలిగించు సత్యసనాతని వైష్ణవీ ॥
చ. 2. 
సర్వగుణాధార సర్వగణపూజిత 
సంసారతారిణీ అనంతగుణరూపిణీ 
సకలవేద నిగమాగమరూపిణీ
మల్లికాకుసుమ పూజితచరణీ ॥

174. నిర్భవా

ప. నిర్భవా భవతారిణీ ॥
అ.ప. సుఖదాయిని కలుషనివారిణి॥
చ.1. 
ఇంద్రమకుట మణిరాజితచరణే 
సుఖదే శుభదే భృత్యు శరణ్యే।
చ. 2. 
కాలాతీతే కళాతీతే మాయాతీతే 
విశ్వమాతే మహా మాయే మహోత్సాహే 
స్మితభాసితే నిత్యహసితే॥

175. భవనాశినీ 

ప. భవానీ భవనాశిని ॥ 
అ.ప. అభవుని రాణీ వేదచారిణి 11 
చ.1. 
ఆశ్రిత భవబంధ నిర్మూలినీ నిర్వాణ సుఖదాయినీ। 
చ. 2. 
సర్వానంద చక్రస్వామినీ 
శంఖినీ చాపినీ దురితభంజనీ 
వీణాగానవినోదమోహినీ
మల్లికాకుసుమ మాలికాభరణీ।

176. నిర్వికల్పా 

ప. భవార్ణవతారిణి॥ 
అ.ప. ఊహాతీతస్వరూపిణీ II 
చ. 1. 
సుమనసాది మునిజనవందిత
సంసార సాగరోద్ధారిణీ విశ్వజననీ 
విశ్వప్రళయకారిణీ 
కోమలాంగీ కృపాపయోనిధి॥ 
చ.2. 
మోక్షకారిణీ నిరామయకరీ 
లోకకటాక్షవీక్షలలితా నిర్వికల్ప 
మహాసిద్ధిదాయినీ జయజననీ 
మల్లికాసుమశోభితా||

177. నిరాబాధా

ప. నిరాబాధా నిరామయీ 
అ.ప. మహేశీ భవవల్లభా ॥ 
చ. 1. 
దేహబాధలను ఈతిబాధలను 
అజ్ఞానమనే అంధకారమును 
దూరముచేయవే కనికరముంచవే 
శక్తిదాయినీ కారుణ్యవిగ్రహా॥
చ. 2. 
సర్వావగుణ వర్జితా సర్వానవద్యా 
సద్గుణా సకలాధిష్టానరూపా సంగహీనా 
సర్వబాధా ప్రశమనీ త్రిపురా॥

178. నిర్భేదా 

ప. నిర్భేదా పరమాశక్తి 
చ.1. 
సర్వభేద వినిర్ముక్తా సర్వభేదవినాశినీ 
వరదాయినీ కామేశ్వరి
అ.ప. అనంతా పరమేష్టినీ।
సకలాభీష్ట వరప్రదా॥ 
చ. 2. 
హానివృద్ధి గుణాధిక్య రహితా వాణీరమా సేవితా
షోడశాక్షరీ మంత్రగతా సుమబాణేక్షు కోదండమండితా॥

179. భేదనాశిని

ప. భేదనాశిని శ్రీశాంభవీ శ్రీపదే 
అ.ప. సర్వకార్య విధాయినీ శ్రీ శివే॥ 
చ.1. 
తామ్రాంభోజ నివాసినీ భగవతీ 
మహాతిమిరనాశిని ఆర్యా భక్త కల్పలతికే 
మాతా జయజయ దుర్గాశ్రీపదే|| 
చ.2. 
హిరణ్యాక్షీ విరూపాక్షీ ధూమ్రాక్షీ 
చంద్రాదిత్య వివర్దినీ దేవేశీ భవగేహినీ 
కామేశ్వర వల్లభా జయజయ జాహ్నవి శ్రీపదే II

180. నిర్నాశా

ప. నిర్నాశా ఆదిమధ్యాంత రహితా 
అ.ప. సహస్ర నయనోజ్వలా ॥ 
చ.1. 
ఐంకారీ సృష్టిరూపా హ్రీంకారీ 
ప్రతిపాలికా వాగధీశ్వరీ మంత్రరూపిణి 
సర్వభూతోపకారిణీ భ్రామరీ ॥ 
చ. 2. 
సర్వభూతేషు చేతనామయీ 
జగత్రయ హితైషిణీ అఖిలాత్మికా 
గజరాజోపరిస్థితా విశ్వార్తి హరిణీ 
మల్లికాసుమ పూజిత దరహాసినీ।।

181. మృత్యుమధనీ

ప. మృత్యుమధనీ కరుణాంతరంగా 
అ.ప. సర్వాంతర్యామినీ సర్వవ్యాపినీ ॥ 
చ. 1. 
నిత్యసంతోషిణీ సూక్ష్మార్ధపరా 
కారణ విగ్రహా కళంక రహితా 
గంభీరవదనా పద్మలోచనీ 
ఆత్మానందదాయినీ భార్గవీ II
చ.2. 
శుభదాయినీ జగజ్జననీ 
ధర్మనిలయినీ వ్యోమాకారిణీ 
కాలతాపనమయీ విశ్రాంతిదాయినీ 
మల్లికాకుసుమ గానశక్తినీ ॥

182. నిష్క్రియా 

ప. క్రియాస్వరూపిణి నిష్క్రియా 
అ.ప. కార్యకారణ విముక్తా సులభా 
చ. 1. 
భూసురార్చితా భర్గాత్మికా ధర్మవేదవిశారదా 
పాటలాక్షీ ప్రవాళశోభా పారిజాతసుమప్రియా ॥ 
చ. 2. 
బీజరూపిణీ బృందారకా ధనాద్యక్షా దిగ్విమోహినీ 
నీహావిరహితా హ్రీంకారాంచితా మల్లికాకుసుమగానవిరచితా ॥

183. నిష్పరిగ్రహా

ప. దివ్యవిగ్రహా నిష్పరిగ్రహా 
అ.ప. భూనుతచరితా శ్రీ లలితా ॥ 
చ. 1. 
సుఖదుఃఖాతీతా క్లేశవిమోచనీ 
కేదారేశ్వరి జననీ హాటకాంబరీ
మధురాధరబింబా అంబా మదంబా 
కలకంఠి ఈశ్వరీ గౌరీమనోహరీ॥ 
చ. 2. 
జ్ఞాన కర్మాధికా సత్యరూపా మోక్షదాయినీ 
చిత్స్వరూపా బ్రహ్మానంద శివానందరూపా
మల్లికాసుమగానస్వరూపా

184. నిస్తులా

ప. ఎంతదయామయివమ్మా నిస్తులా 
అ.ప. అమ్మా...........అమ్మా...11 
చ. 1. 
నీచూపులలో కరుణారసము 
నీపెదవులపై మందహాసము 
నీచేతులలో పాశాంకుశము 
చూచినచాలును పరవశము॥ 
చ. 2. 
కరుణామయివని వాసికెక్కితివి 
నీవేదిక్కని నమ్మితినమ్మా 
దుర్గతినాశిని సద్గతిదాయినీ 
మల్లికాకుసుమ గానహాసినీ॥

185. నీలచికురా

ప. నీలచికురా నిత్య యౌవ్వన సంపన్నా 
అ.ప. కులాచలతనూజా శృంగారనాయికా॥ 
చ.1. 
విలాస దరహాసముఖీ 
సురుచిర సుందరవేణీ 
పూర్ణేందు బింబవదనా 
మాణిక్యమకుట రమ్యా॥
చ. 2. 
కురువిందతరణినిలయా
భక్తహృదయాను రంజనా
తాటంకమండిత కపోలా
మల్లికాకుసుమాభరణా॥

186. నిరపాయా

ప. నిరపాయా సురరాజపూజితా
అ.ప. త్రిజగద్వంద్యా అకలంకా । 
చ. 1. 
సదసద్రూపముతో జగమునుపాలించు 
సర్వేశ్వరీ మము కాపాడవే 
దుఃఖములనుబాపు తేజోమూర్తి 
చ. 2. 
పరతంత్రా చిరతర సులభా 
మల్లికాకుసుమగానవల్లభా॥
మణికాంచన కాంచీదామ ధారిణీ।

187.నిరత్యయా నిరామయా ॥ 

ప. సర్వవ్యాపిని నిరత్యయా 
అ.ప. మేరుశృంగనిలయా 
చ. 1. 
దేవాసుర పరాయణీ శృంగిణీ
బ్రహ్మవర్చసీ సర్వదేవమయీ 
సర్వలక్షణా రక్షణశీలా 
సర్వసుగంధ సుఖావహ సుహృదే ॥ 
చ. 2. 
నియమాశ్రితా నిత్యనర్తకీ 
మల్లికా కుసుమ మాలామస్తకీ ॥

188. దుర్లభా

ప. దుర్లభా జయ పరాత్పరీ 
అ.ప. దృశ్యాదృశ్యస్వరూపిణీ | 
చ.1. 
కనులారగనిన్ను కాంచగాలేను 
చెవులారనీకీర్తి నేవినగలేను 
మనసారనీపూజ నేచేయలేను 
నీనామగానాలు కీర్తించలేను ॥ 
చ. 2. 
పరమయోగులకు అతిదుర్లభమైన 
నీరూపమునునేను చూడగాలేను 
పగవారముకాము నీవారమమ్మా 
మల్లికాసుమగానము అందుకోవమ్మా॥

189. దుర్గమా 

ప దుర్గమా అమృతంగమా 
అ.ప పాహిపాహి నీచరణాంబుజము ॥ 
చ.1
మాకన్నులతోనినుకనలేము 
నీదర్శనమే దుర్లభము 
నిను సేవించుటే మాభాగ్యము 
దుర్గమమైనది నీసాంగత్యము । 
చ.2 
ఘోరాసురుల దర్పమునణచి 
సుజనులబ్రోచి కుజనుల దునిమే 
కర్మవిధాయిని నిశుంభాపహే 
మల్లికాకుసుమగానప్రవాహే ॥

190. దుర్గా

ప. ఇంద్రకీలావాసి జయ కనకదుర్గా 
అ.ప. నవనిధిసంధాయిని నవదుర్గా ప్రకీర్తితా॥ 
చ. 1. 
బ్రహ్మచారిణి శైలపుత్రీ చంద్రఘంట కూష్మాండా
స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి ॥
చ. 2 
సిద్ధమాతా శ్రీ దుర్గా చండముండ వినాశిని 
చరాచరాది కల్పనా చిదానంద పూర్ణఘనా ॥

191. దుఃఖహంత్రీ 

ప. పరమార్తి హంత్రి దుఃఖహంత్రీ 
అ.ప. భవసాగర తారిణీ జయజయదుర్గే ॥ 
చ.1. 
తాపత్రయాది భేదనా ధురీణ 
హతరిపువర్గా కృతరణసర్గా ॥ 
చ2. 
కమలానగర విహారిణి
ఖలసమూహ సంహారిణి ॥ 
నిర్విశేషచైతన్యరూపిణి 
మల్లికాసుమ గానదాయిని॥

192. సుఖప్రదా

ప. శాశ్వతానందా సుఖప్రదా 
అ.ప. హిమగిరికన్యకా ఆశ్రితఫలదా 
చ.1 
నీకడగంటి చూపులే చాలునమ్మా 
ఆనందసిద్ధియే కలుగునమ్మా॥ 
అన్నిటమాకు విజయము నిమ్మా 
జయజయ శంకరీ మాయమ్మా 
చ.2 
అంగరహితుడగు ఆమన్మధుడే 
సదమలమదితో ఆరాదించి 
సర్వజగములను జయించెకాదా 11
మల్లికా కుసుమ గానమోక్షదా॥

193. దుష్టదూరా 

ప. దుష్టదూరా భువనార్చితా 
అ.ప. నతజనశరణా శుభచరణా ॥ 
చ.1 
దోషపూరితుల దురహంకారుల 
దుర్జనులను పాపాత్ములను వర్ణించునదీ 
నిర్జించునదీ సుజనాఘమోచని నీవేనమ్మా ॥ 
చ.2 
ఘనశోభన గుణజాలినీ 
సుధామధుర వాగ్విలాసినీ 
మునిజన మానసలోలినీ
భువనత్రయ పరిపాలినీ||

194. దురాచారశమనీ

ప దురాచారశమనీ సంచిత పాపవిమోచనీ
అ.ప విశ్వేశ వంద్యా విశ్వార్తి హరిణీ। 
చ.1 
అతిరౌద్రా శీతాంశుతుల్యప్రభా
అతిసౌమ్యా దుర్గాదేవీ సర్వస్వరూపా 
ఖడ్గనీ శూలినీ చక్రిణీ శంఖిణీ చండికా 
అంబికా దుష్టదైత్య నిబర్హిణీ|| 
చ.2 
మాతంగీ కరాళవదనీ శిరోమాలా 
విభూషిణీ కిరీటినీ 
మల్లికాసుమగాన నయనోజ్వలా ॥

195. దోషవర్జితా

ప. ప్రణత జనతాపవర్గా దోషవర్జితా 
అ.ప. దీనార్తిభంజనా వాచామగోచరా॥ 
చ.1 
భక్తమానసవిరాజితా శ్రితజన విశ్వాసినీ 
సువర్ణమయసింహాసినీ వహ్నివాసినీ। 
చ.2 
మందస్మితమహాదేవ మనోల్లాసినీ 
మంగళప్రదాయినీచిద్రూపవిలాసిని ||

196. సర్వజ్ఞా 

ప. సర్వజ్ఞా అఖండైకరసపూర్ణా 
అ.ప కమలాపురసదనా కమనీయరదనా ॥ 
చ.1 
వజ్రధారిణీ ఊర్ధ్వకేశినీ సింహవాహినీ 
మకుటేశ్వరీ నిశుంభాసురఘాతినీ 
మంత్రరూపిణీ దూరీకృత పాతక నిర్మూలినీ మాలినీ॥ 
చ. 2 
దీనమానవ హర్షదాయినీ దురంతశోకశమనీ
మల్లికాసుమగాన చంద్రరేఖావిభూషిణీ||

197. సాంద్రకరుణా

ప. సాంద్రకరుణా దయాస్వరూపిణి 
అ.ప.దాంపత్యసుఖదాయిని సర్వేశగేహిని|| 
చ.1 
అభయప్రదాయిని దుర్లభరూపిణీ 
సౌభాగ్యవర్ధని కల్యాణజనని 
రత్నకంచుకధారి శశిధరునిరాణి 
తాటంకభూషిణి గౌరీ నారాయణి।। 
చ.2 
తల్లిని తలవని పిల్లలుందురుగాని 
పిల్లలనుద్వేషించుతల్లికలదా 
కరుణించవేమమ్ము శాశ్వతానందా 
మల్లికాసుమగాన రసాహ్లాదిని ॥

198. సమానాధికవర్జితా

ప. సమానాధికవర్జితా శ్రీమాతా 
అ.ప. నీతోసమానమెవరమ్మా ॥ 
చ.1 
నిను సేవించిన నినుధ్యానించిన 
నినుప్రార్ధించిన వందనముచేసిన 
నీదుమూర్తిని కనిన నీగాధలనువినిన 
మోక్షము కలుగును కాదాదేవి || 
చ.2 
దివ్యసుందరమూర్తీ శ్యామలాంగీ 
దుష్టభీతి భంజనీ జయదుర్గా 
బాలేందురేఖా వికసితమకుటా 
మల్లికాసుమగాన సంస్థితా శ్రీ లలితా ||

199. సర్వశక్తిమయి 

ప. సర్వశక్తిమయీ సర్వాత్మికా 
అ.ప. దేవజననీ శివాత్మికా 
చ.1 
స్వాహా కారము నీవేదేవి 
స్వధాకారము నీవేగౌరీ 
వషట్కారము ఓంకారనాదము 
నీవే నీవే సర్వమంగళా ॥ 
చ.2 
సప్తమాతృకలు అష్టసిద్ధులు సప్తకోటి 
మహామంత్రములు నీవే నీవే శ్రీచక్రేశ్వరి |
మల్లికాకుసుమగానమాలికలు

200. సర్వమంగళా 
ప. 
చిదానందరసికా సర్వమంగళా 
అ.ప. 
సామరస్యవిభవా శివానందహృదయా ॥ 
చ.1 
మంగళకారిణీ మంగళరూపిణీ 
పరమ మంగళ శోభినీ జయమంగళగౌరీ 
రమణీయకుందరదనీ రక్షితభువనీ 
పాలితశ్రితశ్రేణీ ఫాలాక్షుని రాణీ ॥ 
చ.2 
నీమంగళసూత్రమును ఎంతమదినమ్మినావో 
విషముమింగుమని శివునకు 
ఆనతిచ్చినావు సౌభాగ్యములనిచ్చి బ్రోవవే 
జననీ మల్లికాసుమగాన మాలికా భూషిణీ ॥

201. సద్గతిప్రదా
ప. సద్గతిప్రదా నమోభగవతీ 
అ.ప నీపదాబ్జ పరాగమును యిసుమంతగొనుచు 
అబ్జాసనుండే జగములను సృజియించు ॥ 
చ.1 
ఘనశౌరి ఆరజము ఒకింతతలదాల్చి 
వేయితలలశేషుడై జగమునే భరియించు 
నీపాదధూళినే హరుడువిభూతిగా 
ధరియించెనమ్మా మైపూతగా॥ 
చ2. 
నీపదధూళియె సంపదకరము 
సృష్టిస్థితి లయ కారకము 
నీపదాబ్జములే భవతారకము 
నీపదసేవయే పాపహరణము॥

202. సర్వేశ్వరీ
ప సర్వకళామయి సర్వేశ్వరీ
అ.ప సుకవిత్వప్రదాయికా సకలలోకనాయికా ॥ 
చ.1 
ఆద్యంతరహితా అనాదిశివసహితా 
ఆమోదరసభరిత ఆదిశక్తి లలితా|| 
చ.2 
అమితభూషణాలంకృత కులశైలసుతా 
సలలిత లావణ్యలతా సదాశివార్చితా 
ఆశపాశరహిత దివిజేంద్రనుతా 
అకలంకచిత్తవృత్త శివారాధితా॥

203. సర్వమయీ
ప. సర్వమయీ చరాచరమయీ 
అ.ప ఆనందమయీ అద్భుతమయీ ॥ 
చ.1 
శబ్దాత్మికమయీసర్వాశ్రయమయీ 
సర్వభూతమయీ గుణాశ్రయమయీ 
సర్వమంగళమయీ మహామాయామయీ 
సుమనోహరమయీ సర్వభూషణమయీ ॥ 
చ.2 
సర్వమంత్రమయీ సర్వశక్తిమయీ 
సర్వవిద్యామయీ సర్వశాస్త్రమయీ 
సర్వతీర్ధమయీ సర్వదేవమయీ 
ఓంకారమయీ శివశక్తిమయీ ॥

204. సర్వమంత్రస్వరూపిణీ
ప. సర్వమంత్రస్వరూపిణీ 
అ.ప శర్వాణీ భవగేహినీ ॥ 
చ.1 
ఏకాక్షర పిండమంత్రము 
మూడక్షరముల కర్తరు మంత్రము 
నవాక్షర బీజమంత్రము 
దశాక్షర మంత్రరాజము ॥ 
చ.2 
పంచదశాక్షరముల మూలమంత్రము 
సప్తకోటి మహామంత్రస్వరూపిణి 
కాత్యాయని మందారవాసినీ 
భువనత్రయ పరిపాలిని శూలిని ॥

205. సర్వయంత్రాత్మికా 
ప. సర్వయంత్రాత్మికా సర్వతంత్రాత్మికా 
అ. ప సర్వమంత్రాత్మికా త్రిగుణాత్మికా || 
చ.1 
కామాకర్షిణ్యాది రంజనీ 
భవభయభంజనీ శ్రీరంజని 
సువర్ణమయవిగ్రహ శివరంజనీ 
చిద్రూపవిలాసిని నిరంజనీ II 
చ.2 
హిరణ్యమణిమయ శోభాసదనీ 
హ్రీంకార శ్రీకార శృంగారవదనీ 
వాచామగోచర మాహిమావిలాసిని 
మల్లికాసుమగానాశ్రిత భువనీ ॥

206. సర్వతంత్రరూపా
ప. సర్వతంత్రరూపా మోక్షప్రదా 
అ.ప. సకలఫలప్రదాయక కనకాద్రి సదనా 
చ.1 
తాపత్రయాది భేధనా ధురీణా 
పంకజసంభవసన్నుత రాకాశశివదనా 
నిగ్రహానుగ్రహ కర్తా పరమేశానీ 
పరాదివాగ్దేవతా రూపవశినీ || 
చ.2 
అణిమాది సిద్ధేశ్వరి సర్వతంత్రేశీ 
మతంగగజగామినీ కృపాకందళీ 
నిగమాగమ పురాణాది సంవేదినీ 
మల్లికాకుసుమగాన సమ్మోదినీ || 

207. మనోన్మనీ
ప ఈశ్వరీ మనోన్మనీ 
అ.. నిర్వికల్పనిరంజనీ ॥ 
చ.1 
సంకల్పవికల్పసూన్య 
సుమనామనోన్మనీ 
చింతామణి వాసినీ 
మణిమయసింహాసిని 
చ.2 
అతిమధురతరవాణీ 
పాకారినుతచరణీ 
మల్లికాకుసుమగాన 
మృదులసుధావాహినీ ॥ 

208. మహేశ్వరీ
ప. మహేశ్వరీ మహిమాన్వితా 
అ. ప సర్వార్ధసాధకా గౌరీ స్వర్గాప వర్గదా ॥ 
చ.1 
జయంతీ మంగళాకాళీ 
సర్వోపద్రవనాశిని 
అచింత్యరూపచరితా 
శత్రుభీతివినాశిని || 
చ.2 
హిమాలయసుతాగౌరీ చతుర్వర్గఫలప్రదే 
చిత్తమాలిన్యనాశినీ చాముండీ మనోరమే 
దుర్గాక్షమా శివాధాత్రీ స్వాహా స్వధా కపాలినీ 
మల్లికాసుమగంధినీ దేవసౌభాగ్యదాయిని ॥

209. మహాదేవీ
ప మహాసత్వా మహాదేవీ చండికే వ్యాధినాశినీ 
అ.ప హిమాచలసుతానాధ పూజితే పరమేశ్వరీ ॥ 
చ.1 
సురాసుర శిరోరత్నవిలసిత చరణాంబికే 
ఇంద్రాణీపతి సద్భావపూజితే కాత్యాయనీ ॥ 
చ.2 
అఖిలదేవమహర్షి పూజ్య భక్తజన చింతామణి 
గృహాణవరదాయిని త్రిపురసుందరి శ్రీ పదే 
మహాతిమిర నాశిని శివకామినీ శ్రీశాంభవీ 
మల్లికాకుసుమగానప్రియ గౌరీ గిరినందినీ ॥ 

210. మహాలక్ష్మీ
ప కొల్హాపురవాసినీ శ్రీ మహాలక్ష్మి 
అ..ప సర్వమనోహరి శ్యామలా త్రిగుణాత్మికా || 
చ.1 
శంఖచక్రగదాహస్తలక్ష్మీ సురపూజితా 
డోలాసురభయంకరీ రత్నకుండలమండితా ॥ 
చ.2 
క్షీరసాగర కన్యకా నవనిధి దాయికా 
సుందరాంగద బాహుకా లావణ్యభూమికా 
విష్ణువక్షస్థలీ చంద్రసహోదరీ 
మల్లికాకుసుమగాన మధుకరీ ॥

211. మృడప్రియా
ప మృడప్రియా దక్షకన్యకా 
అ.ప. దక్షిణాచారనిరతా సదాశివపతివ్రతా || 
చ.1 
శాశ్వతానందకవితా దేవగణతోషితా 
అభయవరదాన రసికా కమలాంబికా ॥ 
చ.2 
బిందుస్థితే కామప్రదే 
చిత్రాంబరే మోక్షప్రదే 
సర్వకళాధీశ్వరీ బ్రహ్మాత్మికే 
మల్లికాకుసుమగానలోలినీ శూలినీ ॥

212. మహారూపా
ప. మహారూపాశంకరీ 
అ.ప అభయంకరీ కరుణాకరీ ॥ 
చ.1 
కృపాకరీ యశస్కరీ 
సర్వగర్వ విమర్ధినీ 
శాంభవీ చంద్రార్ధ మస్తకా 
భ్రామరీ నారాయణి ॥ 
చ. 2 
నిర్వికారా నిరాకారా 
నిర్గుణా సగుణాలయా 
మల్లికాకుసుమగాన మనోహరి 
అంగజారిహృదయేశ్వరి ||

213. మహాపూజ్యా
ప 
మహాపూజ్యా మంగళకారిణీ 
అ.ప షోడశపూజలను చేకొనుము తల్లీ ॥ 
చ.. 
సురుచిరనవరత్న పీటస్థితే 
మంజీరమేఖలాదామ భూషితే 
మత్తమాతంగకన్యాసమూహాన్వితే 
నవమల్లికాకుసుమ గాననుతే | 
చ.2 
పలురకములైన కుసుమములతో 
పసుపు కుంకుమ గంధ అక్షింతలతో 
భక్తితోపూజలుచేసేము తల్లీ 
కామితార్ధములిచ్చు కళ్యాణ శుభగాత్రి ॥

214. మహాపాతకనాశినీ
ప 
మహాపాతకనాశినీ పరాశక్తి శంకరీ ॥ 
అ.ప అభయమునీయవే జయమునీయవే ॥ 
చ.1 
కరుణామయివని నిన్నువేడితిమి 
మముబ్రోవగ ఇంత జాగేలనమ్మ 
తెలిసిచేసినగాని తెలియకచేసిన 
అన్నిపాపముల తొలగజేయుముతల్లీ 
చ.2 
పాతకములను పారద్రోలెడితల్లి 
భగవతీనామమును ధరియించినావు 
ఆయురారోగ్యముల ఐశ్వర్యమిచ్చి 
భక్తులను బ్రోచేటి శ్రీ కల్పవల్లి ॥

215. మహామాయా
ప 
మహావేదసారా మహామాయా 
అ.ప మహాలయ క్షేత్రవాసిని 
చ.1 
అజ్ఞానముతొలగించి అహంకారమణగించి 
జ్ఞానజ్యోతివెలిగించుము జ్ఞానమయీచిన్మయీ ॥ 
చ.2 
విరూపాక్షపీఠవాసిని మాయామయీ 
కామ క్రోధమదమోహ లోభములు 
మాత్సర్యములనురూపుమాపవే 
మల్లికాసుమగానమయీ ॥

216. మహాసత్వా
ప 
మహాసత్వా మహాదేవి మందారవాసినీ 
అ.ప 
బాలేందుదివాకరాక్షి సౌందర్యరాశీ ॥ 
చ.1 
మహామోక్షధాత్రీ శాంతిప్రదాత్రి 
కైవల్యసంధాయినీ రసమయీ 
భక్తచింతామణి లోకరక్షామణీ 
గణేశజననీ ఆనందసంవర్ధనీ ॥ 
చ.2 
శిఖిపింఛధ్వజధరీ తారణీ 
వరవర్ణినీ మహాదేవప్రియా
నిత్య శుంభ నిశుంభ నాశనీ ॥

217. మహాశక్తిః

ప. మహాశక్తిః మహేశ్వరి 
అ. పసృష్టి స్థితి లయశక్తి స్వరూపిణీ ॥ 
చ.1 
సహస్రనయనోజ్వలా 
హతదైత్యమహాబలా 
మహావిద్యా మహారాత్రి 
మహాకాళీ అంబికా || 
చ.2 
దశవిద్యా స్వరూపిణి 
ద్వేష రాగవివర్జితా 
కలాధరకుటుంబినీ 
శివశక్తి నమోస్తుతే ||

218. మహారతిః

ప. మహారతే ఆమోదరసభరితే 
అ.ప విజితాద్రిసుతే సాధుజన సేవితే 
చ.1 
మహాపంచాక్షరీ మంత్రమూర్తే 
భరితకృపారసపరిపాలితే 
ఆపన్నరక్షణ ప్రవృత్తే 
మునిబృందవందితే ॥ 
చ.2 
నళినాయతనేత్రే 
ధరణీధర పుత్రా 
మల్లికాకుసుమగానరంజితే 
కపాలిమనోరంజితే |

219. మహాభోగా

ప మహాభోగా పరమాత్మికా 
అ.ప. నిజభక్త సంరక్షణా తత్పరా 
చ.1 
మందహాస మనోజ్ఞ 
పీతాంబరధారిణి వజ్రధారిణీ 
సర్వభూషణా చికురవిజితనీలఘనా 
రణకింకిణిమేఖలా భాస్వరీ॥ 
చ.2 
సువర్ణమయసింహాసిని
జ్వాజ్వల్యమానతేజ 
భోగినీ యోగినీ శ్రీశివే 
మల్లికాకుసుమ మాలాలంకృత ॥

220. మహైశ్వర్యా

ప మహైశ్వర్యా సర్వకర్మవిమోచనీ 
అ.ప యశోదేహీ ధనందేహీ కళ్యాణీ నమోనమో 
చ.1 
అఖిలదేవ మహర్షిపూజ్యా 
శరణాగతత్రాణపరాయణి 
సృష్టి స్థితిలయకారిణి 
నారాయణీ నమోనమో !! 
చ.2 
లోకత్రయాహ్లాదిని శాంతస్వరూపిణీ 
ముఖకమల విలాసలోలవేణీ భవానీ ॥

221. మహావీర్యా

ప మహావీర్యా మహాపరక్రమోపేత 
అ.ప. గర్విత భండాసురభంజనీ ॥ 
చ.1 
మధురిపుసోదరీ 
ముక్తిదాననిపుణా 
శుంభనిశుంభదళనీ 
రక్తబీజవినాశినీ ॥ 
చ.2 శంఖదుంధుభినిస్వనీ 
దేవదేవ విలాసినీ 
దక్షయజ్ఞవినాశినీ 
సాధుజన పరిపాలినీ ॥

222. మహాబలా

మహాబలా కాళీకరాళవదనా 
అ.ప ధీనార్తిభంజనా త్రిశూలధారిణీ ॥ 
చ.1 
సురగణబహుమాన్యచరితా 
ఆశాపాశరహిత దివ్యచరితా 
కౄరదైత్యాది బృందమర్దనీ 
అఖిలజగత్పరిపాలిని దేవవైరినాశిని 
చ.2 
మహిషోన్మూలిని 
దైత్యదర్ప నిషూదినీ 
మహాబలా మహోత్సాహా 
చతురంగబలాన్వితా ॥

223. మహాబుద్ధిః

ప మహాబుద్ధీ శ్యామలాంగి 
అ.ప. మహాయోగా మహాసిద్ధి ॥ 
చ. 1 
మహాపాశా మహాకార 
మహాభద్రా మహావిద్యా 
మహాశక్తి మహాదేవీ 
సిద్ధిబుద్ధి ప్రదాయినీ | 
చ.2 
ద్యుతి మతి ధీమతీ' 
దుర్జయ దుర్భర శక్తిభృతి 
ధీరమృదంగ నినాద రతీ 
భువనపాలినీ పశ్యంతీ ॥

224. మహాసిద్ధిః

ప. మహాసిద్ధి హేమాద్రిజా 
అ.ప సాధుసజ్జనపాలినీ ఈశ్వరహృత్కేలినీ ॥ 
చ.1 
పంచోపచారపూజలతో 
షోడశోపచారములతో 
యంత్రతంత్ర నియమముతో 
పూజింతుము చక్రేశ్వరి
చ.2 
అణిమా గరిమాది సిద్ధేశ్వరి 
పురుషార్ధప్రదాయినీ శుభకరి 
అజ్ఞానతిమిరనాశనీ 
మల్లికాసుమగాన శ్రీకరీ ॥

225. మహాయోగీశ్వరేశ్వరీ 

ప మహాయోగీ శ్వరేశ్వరీ 
అ.ప భక్తకర్మజ్ఞానదాయిని ॥ 
చ.1 
మేఘలాత్రయ విహారిణీ 
భూపురత్రయ వాసినీ
దశారయుగ్మరూపిణి
స్థూలసూక్ష్మ శరీరిణీ ॥ 
చ.2 
నవరసదరహాసినీ 
దురితాదినివారిణీ 
అఖిలజగత్పరిపాలిని 
మల్లికాసుమగానవ్యాపినీ II

226. మహాతంత్రా 

ప. మహాతంత్రా శ్రీ విద్యా ఆపస్తంభ సేవితా 
అ. ప కులార్ణవ రూపిణి వేదజ్ఞాన బోధినీ 
చ.1 
నవావరణపూజిత 
వామాచారపరాయణి 
పరతత్వప్రకాశినీ 
నానార్ధ తత్వాత్మికా పరమేశ్వరి ॥ 
చ. 2 
వైష్ణవ శైవ శాక్తేయ తంత్రముల 
పూజలందుకొను అధిష్టాత్రి... అభినేత్రి ॥ 
సర్వజనప్రియ ఆనందాకృతి 
మల్లికాకుసుమగాన సుగాత్రి ॥

227 మహామంత్రా

ప మహామంత్ర బింధురూపిణి 
అ.ప సర్వమంత్రస్వరూప బాలా బగళా ॥ 
చ.1 
సప్తకోటిమహామంత్రముల 
బీజాక్షర సమామ్నాయముల 
అర్ధమునీవే పరమార్దమునీవే 
శక్తివినీవే విశ్వవ్యాపినీ ॥ 
చ.2 
శ్రీ వాగ్భవకూటజాత చతుర్వేదరూపిణి 
ఓంకారిణి హ్రీంకారిణి శ్రీకారిణి భాస్వరీ ॥

228. మహాయంత్రా

ప. మహాయంత్రా మహాతేజ 
అ.ప విద్యా మహామంత్రా సర్వోత్తమసిద్ధివ్రజః| 
చ.1 
సర్వయంత్రస్వరూపిణీ సర్వమంత్రవిహారిణీ 
సర్వయంత్రపహర్షితా ఆరాధ్యాపరమాశక్తి 
చ.2 
త్రికోణ యంత్ర మధ్యస్థా 
అకచటతపాదివర్ణరూపిణి 
ఏకాంతభక్తిగమ్యా అజ్ఞానతిమిర నాశిని 
స్వాధిష్టానరూపా మల్లికాసుమగాననిధీ ॥

229. మహాసనా

 ప. మహాసనా మహాపద్మాసనా సీన 
అ.ప కారుణ్యభావేన రక్షరక్ష 
చ.1 
కోటిసూర్యప్రతీకాశ సర్వేశ్వరీ 
రాకాచంద్రముఖీ శ్రీపతివినుతే 
పంచ ప్రణవాధరీ పంచాసనా సీనా 
శ్రితకల్పవాటికే కమలాంబికే I 
చ. 2 
గుప్తతరయోగినీగణ సేవితే 
పంకజసంభవసన్నుత చిన్మాత్రే 
సర్వాభీష్ట ఫల ప్రదాన నిపుణే 
మల్లికాసుమగాన ప్రీతే॥

230. మహాయాగ క్రమారాధ్యా

ప మహాయాగ క్రమారాధ్యా 
అ.ప పరబ్రహ్మ మహిషీ శివేసానుకంపే || 
చ.1 
దక్షయాగవినాశినీ జననీభవానీ 
మల్లికాకుసుమగాన నాట్యవినోదిని ॥ 
చ.2 
నానాశస్త్రాస్త్ర ధారిణీ 
మధుమాంసోపహారిణీ 
చిదగ్నికుండ సంభూతా 
శుంభాసుర నిషూధినీ ॥

231. మహాభైరవపూజితా

ప. మహాభైరవపూజితా 
అ.ప మహేశ్వరీ కౌమారిసహితా|| 
చ.1 
ఆదిత్యమండలాంతర్వర్తి 
బ్రహ్మస్వరూపుడే నారాయణమూర్తి 
జపమాలధరియించి ఆశంభుమూర్తి 
మల్లికాసుమములపూజింతురే ॥ 
చ.2 
రుద్రాణి విద్రుమమయీ 
కాళీ పరాపరమయీ 
వాగ్వాదినీ భైరవీ 
ప్రేతాసనా ధ్యాసినీ ।

232. మహేశ్వరమహాకల్ప మహాతాండవ సాక్షిణీ 

ప. మహేశ్వరమహాకల్ప మహాతాండవ సాక్షిణీ 
చ.1 
విఘ్నేశుడే ఘీంకార మొనరింప 
నందీశుడే హూంకారమును చేయ 
మందహాసమనోజ్ఞ పులకాంగియై 
సాక్షియైనిలుచు సర్వలోకైక సాక్షి II 
చ.2 
గతిగమక రూపైకనిపుణా 
శ్రుతి తాళ లయ రాగ గరిమా 
మల్లికాకుసుమగాన సంగీతరసికా 
మంజీరనాదాను సందాయినీ ॥

233. మహాకామేశమహిషి 

ప. మహాకామేశమహిషి కామేశ్వరి 
అ.ప. సుమనసారాధితా హృత్కమల వాసినీ ॥ 
చ.1 
హ్రీంకారవిపిన హరిణీ 
శివక్షేత్రనివాసినీ 
మహాపాపప్రశమనీ 
కాంచనమయభూషిణీ || 
చ.2 
లోకత్రయాహ్లాదిని 
దశప్రాణ స్వరూపిణీ 
మహాదేవవిధాయినీ 
మల్లికాకుసుమగానదాయిని

234. మహాత్రిపురసుందరి

ప. మహాత్రిపిరసుందరి దేవీ బిందురూపిణీ 
అ.ప ప్రేమామృతసాగరమున ఓలలాడించవే ॥ 
చ.1 
నీవుచేపట్టిన దిగంబరుడే 
లోకేశ్వరుడై పరమేశుడాయెను 
నువుచేసినఆపిండిబొమ్మయే 
గణేశ్వరుడై విఘ్నేశుడాయెను ॥ 
చ. 2 
నీవు లాలించిన ఆ శరవణుడే 
సేనాపతియై లోకములేలెను 
నీకనుచూపే మాకు చాలును 
మల్లికాకుసుమ గానవిలాస||

235. చతుష్షష్ట్యపచారాఢ్యా 

ప చతుష్షష్ట్యుపచారాఢ్యా శ్రీరాజరాజేశ్వరీ| 
అ.ప. కుక్కుటేశ హృదయేశ్వరి పీఠికాపురాధీశ్వరీ 
చ.1 
కర్పూరకాంతివిరాజితా 
ధన ధాన్య సుతాన్వితా 
ఆనందోల్లాస విలాసహాసితా 
నృత్తవిరాజిత కామారి మోహితా ॥ 
చ.2 రతిసహాయ కామాన్వితా 
అనంగకుసుమాది పరివృతా 
యామినీనాధ రేఖాలంకృత 
మల్లికాకుసుమ మాలాలంకృత ॥

236. చతుష్షష్టి కళామయీ

ప. చతుష్షష్టి కళామయి భువనత్రయసుందరీ 
అ.ప. చతుర్విద్యలు చతుర్వేదములు నీరూపమే ॥ 
చ.1 
వేదవేదాంగములు నారదీయములు 
సరిగమపదనీ సప్తస్వరములు 
వ్యాకరణములు జ్యోతిష్యములు
న్యాయశాస్త్రములు నీదురూపమే ॥ 
చ.2 
షోడశేందు కళామయీ 
మల్లికార్జున గేహినీ 
హేమసన్నిభ దేహినీ 
మల్లికాకుసుమమోహినీ।।.

237. మహాచతుష్షష్టికోటియోగినీగణసేవితా 

ప. మహాచతుష్షష్టికోటి యోగినీగణ సేవితా 
అ.ప. అష్ట భైరవ పూజితా అష్టమాతృకా వందితా ॥ 
చ.1 
దక్షిణాచార నిరతాసర్వసంగ వివర్జితా 
శ్రీవాగ్భవకూటజాతా ఐం హ్రీం శ్రీం మంత్రతోషితా। 
చ.2 
భ్రమరీగణపరివృతా మల్లికాకుసుమమాలావిరాజితా 
విచిత్రవస్త్ర విభూషితా శివాకారమంచస్థితా ॥

238. మనువిద్యా

ప. మనువిద్యా పంచదశీ మంత్రనివాసి' 
అ.ప మునిమానసహంసినీ ॥
చ.1 
సర్వకారణభూత రాజీవనయనా 
నిరుపమశుభకరి కులశైలసుతా ॥ 
చ.2 
శివ హృదయాబ్జ భృంగ కరుణాంత 
అగ్నిసోమాత్మకా సోమసిరసి స్థితా ||

239. చంద్రవిద్యా

ప. చంద్రవిద్యా రూపిణీ 
అ.ప దక్షిణామూర్తి పూజిత కుంకుమవిలేపిత 
చ.1 
చారుసుందరరూప మారహరునిచాప 
సువర్ణరజితస్రజా సహస్రకమలార్చిత 
చ.2 
విశుద్ధజ్ఞానదేహ సోమార్ధదారిణీ 
దివ్యభూషణరంజితా మల్లికాసుమగానార్చితా॥ 
శంకరార్థశరీరిణీ దాంపత్యసుఖదాయిని 
మల్లికాసుమగానదాయిని

240. చంద్రమండలమధ్యగా.

ప. చంద్రమండల మధ్యగా. 
అ.ప. పరమశివ హృదయాబ్జ భృంగా॥ 
చ.1 
శ్రీచక్రమధ్యనివాసిని షోడశదళవాసినీ 
శివశక్తిరూపిణి నయనానందదాయిని ॥ 
చ.2 
అజ్ఞానతిమిరనాశిని నృత్యగాన వినోదిని 
షోడశ కళామాలిని చిదంబరశరీరిణీ 
నీపదపంకజములు స్థిరమని నమ్మితి 
దయచూడవమ్మా హిమగిరీశు పుత్రీ ॥

241. చారురూపా

ప. చారురూపా రూపలావణ్యసుందరీ 
అ.ప కందర్ప జనకాపాంగవీక్షణీ ॥ 
చ.1 
శిశిరాకారా విలసితవదనీ 
లయవినోదిని పద్మమాలినీ 
దయాపయోనిధి లోకపావనీ 
హేమసన్నిభదేహా రూపవిలాసినీ 
చ.2 
నవమోహినీ సహిత శ్రీచక్రనివాసినీ 
సువర్ణమయ విగ్రహ ప్రకాశినీ 
నవమాణిక్య వల్లకీ వాదిని 
మల్లికాకుసుమ గానవినోదినీ ॥ 

242. చారుహాసా

ప. చారుహాసా కర్పూరకుందోజ్వలా 
అ.ప మనోహర దరహాసచంద్రికా ॥ 
చ.1 
తరుణమండల మధ్యవర్తీ 
భక్తజన మానస రాజహంసి 
శివపదార్చన చాతురీ శార్వరీ 
మంజు మంజీరసింజిత మనోహరీ ॥ 
చ.2 
ఆపీనతుంగస్తనీ త్రినయనీ 
నిరవధిగుణా నీతినిపుణా 
అచింత్యరూప మల్లికాకుసుమగాన 
కవితాశక్తి దాయిని సుహాసినీ ॥

243. చారుచంద్ర కళాధరా

ప. చారుచంద్ర కళాధరా 
అ.ప పరిపూర్ణ చంద్ర బింబానుకారి|| 
చ.1 
కనకోత్తమ కాంతి కాంతా 
అద్భుతచరణాంబురుహా 
స్కందహుతాశన వందిత 
శరదిందుశుభ్రామనోజ్ఞా ॥ 
చ.2 
వాసవాదిముని భావితమూర్తీ 
మహాపంచాక్షరీ మంత్రమూర్తీ 
నిఖిలనిగమాంత స్తుతిపదా 
మల్లికాకుసుమగాన మహిమా॥

244. చరాచర జగన్నాధా

ప చరాచర జగన్నాధా సకల కళానాధా 
అ.ప అనంతకోటి నాయికా రమావాణీసంసేవితా| 
చ.1 
అభయ శుభప్రదహస్తే మామవమానితకీర్తే 
మృదుతరసుధామాధుర్యమోదహృదయే ॥ 
చ.2 
ఆశాపాశరహితే ఆజన్మపాపహరతే 
ఆశ్రితకల్పలతికే మల్లికాసుమగాన నిరతే॥

245. చక్రరాజనికేతనా 

ప చక్రరాజనికేతనా సనాతనా 
అ.ప త్రైలోక్య మోహనాది నవచక్రనికేతనా ॥ 
చ.1 
అభయవరదాన్నైక రసికా 
కామేశ్వర సమన్వితా 
అభినవకులసుందరీ 
హ్రీంకార సుశరీరిణీ॥ 
చ.2 
విపులకటి తటీ పద్మాసనాసీ న 
కళ్యాణగుణశాలిని కలిదోషహరిణీ 
ఈప్సితార్ధప్రదాయినీ నవకల్పకవల్లరీ 
మల్లికాకుసుమగాన సుధారస దాయినీ ॥

246. పార్వతీ

ప పార్వతీకొనుమమ్మా హారతీ 
అ.ప సదాశివార్చితమనోహరీ॥ 
చ.1 
నిరుపమశుభకరీ శివానందలహరీ 
శ్రితజనాభీష్టప్రదాత్రీ ధీరగుణరమ్యా || 
చ.2 
భక్తపాలన తత్పరీ హిమవంతుపుత్రీ 
మల్లికాసుమగానమాధురీ శంకరీ కృపాకరీ II

247. పద్మనయనా

ప. పద్మనయనా నళినాయతాక్షీ 
అ.ప సోమశేఖరురాణి కమలాక్షి। 
చ.1 
పాలాక్షుని రాణి కరుణాకటాక్షి 
ఏకామ్రపతి హృదయ 
శ్రీ కామాక్షి విశ్వసాక్షిణీ కాశీవిశాలాక్షి 
నిన్నునమ్మితినమ్మా మధురమీనాక్షి॥ 
చ.2 
మూడులోకాలకు మూలమేనీవు 
పసుపు కుంకుమ లిచ్చు గౌరివేనీవు 
నీపాదపంకజములే శరణమమ్మా 
మల్లికాకుసుమగానమే తరుణమమ్మా ॥

248. పద్మరాగసమప్రభా

ప పద్మరాగసమప్రభా 
అ.ప కమనీయవదనాంబుజా|| 
చ.1 
చతుర్విధ పురుషార్ధప్రదాయక 
కామితార్ధసంధాయిని 
నిరుపమ తేజప్రతాప 
పరమశివాభిన్నరూప॥ 
చ.2 
మోహార్ణవసంతారక 
సర్వలక్షణసంపన్నా 
సర్వాలంకృత వైభవోపేత 
కమనీయ మనోహర దివ్యనేత్ర ||

249. పంచప్రేతాసనాసీనా 
 
ప. పంచప్రేతాసనాసీనా 
అ.ప పంచకృత్య పరాయణీ॥ 
చ.1 
పరబ్రహ్మస్వరూపిణీ 
బ్రహ్మాండనాయకామణి 
జ్ఞానామృతమును అందచేయుమా 
ఆనందామృతవర్షిణి హర్షిణి ॥ 
చ. 2 
పరిపూర్ణకటాక్షవీక్షణా లహరి 
ఆర్తత్రాణపరాయణీ 
సర్వదేవతా స్వరూపిణి భక్తపోషిణి 
మల్లికాకుసుమగాన మహేశ్వరి|| 

250. పంచబ్రహ్మ స్వరూపిణి

ప పంచబ్రహ్మ స్వరూపిణీ ఈశ్వరతోషిణీ 
అ.ప. నిరుపమాన లావణ్యనీరధి ॥ 
చ.1 
మోహాంధకారనాశిని 
పతితజనార్తి భంజని 
స్వధర్మ పారీణ సులభా 
వరదాయిని శివరంజని ॥ 
చ.2 
నిర్మల సుమనోహారిణి విమలా 
కదంబవన విహారిణి అమలా 
సౌభాగ్యాభరణ ధారిణి కమలా 
మల్లికాసుమగాన విహారిణి బాలా॥

251. చిన్మయీ

ప చిత్స్వరూపిణీ చిన్మయీ 
అ.ప శ్రీమన్మహాచిత్కళా ॥ 
చ.1 
చైతన్య రూపిణీ జ్ఞానరూపిణీ 
నిర్వికార ఆనందరూపిణీ 
నిర్గుణరూపిణీ సగుణరూపిణీ 
శివకళామయీ తేజోరూపిణి || 
చ.2 
చతుర్భీజ చతుర్బిందు చతుర్భుజా 
షోడశకళా పూర్ణచంద్రమండలాకార 
నిష్కళానిరుపమసుఖదా  
మల్లికాకుసుమగాన వరప్రదా!

252. పరమానందా

ప పరమానందా చిద్బింబా 
అ.పశృంగారరస కదంబా || 
చ.1 
లక్ష్మీ వాణీ సంసేవిత 
ఆగమ నిగమాది సంసేవిత 
మల్లికాసుమగాన సమ్మోహిత 
శైలరాజసుత సదా శివార్చిత ॥ 
చ.2 
సర్వకామపూరణి నిత్యానందినీ 
కలిదోషనివారిణి సుప్రసన్న వదనీ II 

253. ప్రజ్ఞాన ఘన రూపిణీ

ప ప్రజ్ఞాన ఘనరూపిణి విజ్ఞానకారిణి 
అ.ప వేదచారిణి వాగేశ్వరీ ॥ 
చ.1 
కపాలశూలా కరకమలా 
సకలవేదనుత శ్రీలలితా 
విదితాఖిల శాస్త్రసారా 
ప్రచండ దైత్య నిర్మూలిని ॥ 
చ.2 
నామరూపవిమర్శిని 
కామకళాప్రదర్శిని 
సామరస్య నిదర్శిని 
బ్రహ్మమయ ప్రకాశిని||

254. ధ్యానధాతృధ్యేయరూపా

ప ధ్యానధాతృధ్యేయరూపా శ్రీవిద్యా 
అ.ప. ఉపాసనా మూలరూపా శ్రీపదా॥ 
చ.1 
నీరూపమునే మదిలోనిలిపి 
సతతమునిన్నే ధ్యానముచేయుచు 
నినుపూజించుచు నీకధలేవినుచు 
నినుసేవించిన జన్మమే జన్మము 
చ.2 
మల్లికాకుసుమ గీతముపాడుచు 
నినుకీర్తించే బ్రతుకేధన్యము 
నీదయపొందిన జీవులేపుణ్యులు 
జీవన్ముక్తులు పరమపావనులు ॥

255. ధర్మాధర్మ వివర్జితా 

ప. ధర్మాధర్మ వివర్జితా శివశక్తిస్వరూపా 
అ.ప ధర్మసంవర్ధనీ భాగ్యచంద్రికా || 
చ1 
నీదాసురాలనుననుబ్రోవవలెనే 
నాతప్పు లెంచగా నీకున్యాయమా 
కన్నతల్లినీవే నిరాదరించగా 
ఏదైవము ననుకాచిబ్రోచునే ॥ 
చ.2 
సచ్చిదానంద లక్షణా హేమాద్రిజా 
నిజభక్తలోక కల్పతానుపాయినీ 
విఘ్నరాజజననీ గంగాధర కుటుంబినీ 
కరుణచూపవే కాత్యాయనీ ॥

256. విశ్వరూపా

ప విశ్వరూపా విశ్వసాక్షిణీ 
అ.ప విశ్వమోహినీ శివమోహినీ ॥ 
చ.1 
విశ్వకారిణీ విశ్వవిలాసినీ 
విశ్వకర్తవు విశ్వ వినోదిని 
చ.2 
విశ్వాంబరధారిణీ విశ్వేశురాణీ 
విశ్వకళ్యాణీ విశ్వంభరీ 
విశ్వవందిత విశ్వాత్మికా 
విశ్వార్తి హరిణీ విశ్వతోముఖీ

257. జాగరిణీ

ప జాగరిణీ అద్వితీయ అజేయ 
అ.ప ఆనందదాయినీ అవ్యయా ॥ 
చ.1 
అనిర్వచనీయశక్తివిలాసా 
అఖిలార్ధప్రద అక్షయా || 
చ.2 
నాహృదయమున నీదివ్యరూపము 
నానాలుకపై నీభవ్యనామము 
మల్లికాసుమరా దివ్యమాలికల 
పూజించెదనే శ్రీదేవీ ॥

258. స్వపంతీ

ప. యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
చ.1 
నిద్రరూపమున సూక్ష్మరూపివై 
జీవులయందున నెలకొనియుందువు 
స్వాప్నిక జగతికి సాక్షీభూతా 
స్వపంతీ సర్వమోహితా || 
చ.2 
స్వప్నమునీవే జాగృతినీవే 
ఇంద్రియజ్ఞానముల అనుభూతివినీవే 
అఖండాకార చైతన్యరూపిణీ 
మల్లికాకుసుమగానమునీవే ॥

259. తైజసాత్మికా

ప అనన్యరూపా తైజసాత్మికా 
అ.ప స్నిగ్ధ ప్రలోభా లోకినీ కర్మసాక్షిణీ ॥
చ.1 
విద్యాధరబృంద వందితపదా 
నియమపర చిత్రైకనిలయా 
బందూక ప్రసవారుణాంబర ధారిణీ 
యామినీ నాధరేఖాలంకృత కుంతలా॥
చ.2 
గాఢసుషుప్తీ కారణరూపిణీ 
ఆర్తరక్షణీ తామసహారిణీ 
మహాదేవీ త్రిగుణాతీతా
మల్లికాకుసుమ గానామృతా ॥

260. సుప్తా

ప సుప్తా సుఖజ్ఞానాత్మికా 
అ.ప ధర్మార్ధ మోక్షప్రదా | 
చ.1 
క్షిప్ర ప్రసాదినీ యోగాత్మికా 
ఆశ్రితజనాభీష్ట ప్రదా 
గాఢసుషుప్తీ సూక్ష్మ రూపిణీ 
నిర్వికారస్వరూప మాయావిని ॥ 
చ.2 
ఆత్మజ్ఞాన విశుద్ధ సత్వా 
నిద్రాసమాధిస్థితి కారిణీ 
పరేశమహిషీ శబలా 
మల్లికాకుసుమ గానాంబుధీ ॥

261. ప్రాజ్ఞాత్మికా 

ప. ప్రాజ్ఞాత్మికా సత్యధర్మిణీ
అ.ప భక్తవత్సలా పరమనిష్టా ॥ 
చ.1 
దుస్వప్ననాశినీ సుహృదే 
సుగుణ గుణ విశేషిణి
అనంతాత్మ శాంతి పరాయిణీ
 బహుజన్మాంతర జ్ఞానాత్మికా॥ 
చ. 2 
చేతనాచేతనా చైతన్యరూపా 
భావనామాత్రసంతుష్టహృదయా 
స్వప్నసుషుప్తీ సాక్షీభూతా 
మల్లికాసుమగాన కారణభూతా ॥

262. తుర్యా

ప తత్వమయీ తుర్యా 
అ.ప. దుర్లభ రూపిణీ శ్రీపాదుకే ॥ 
చ.1 
స్వాధిష్టాన చక్ర సమాశ్రయా 
యోగధారిణీ యోగిగమ్యా 
తురీయపథగామినీ యోగినీ 
శుభానంద గుణార్ణవా ఆర్యా ॥ 
చ.2 
కైవల్యపదకారిణీ సత్యరూపా 
సర్వవేదాంత సచ్చిదానందరూపిణీ 
లయస్థితిఉద్భవేశ్వరీ హాకినీ 
మల్లికాకుసుమగాన వాంఛితా ॥

263. సర్వావస్థావివర్జితా 

ప సర్వావస్థా వివర్జితా సర్వవిమోహితా 
అ.ప తురీయాతీతస్వరూపిణీ ॥ 
చ.1 
గుణత్రయవివర్జితా 
సువిలోచనా వేదాంతవేద్యా 
అనాదినిధనా దేవదేవీ సర్వధర్మజ్ఞా 
సంసారబంధ విచ్చేదినీ త్రిపురా ॥ 
చ.2 
అణిమాది సిద్ధిగణ సేవ్యమానా 
ఆజ్ఞాచక్రాబ్జ ఆధ్యాత్మ తేజా 
లీలాకల్పిత సురమౌళి 
మల్లికాకుసుమగాన శృతిరూపిణీ u

264. సృష్టికర్త్రీ

ప సృష్టికర్త్రీ విశ్వధాత్రీ 
అ.ప సరసవినోదినీ సర్వధాత్రీ 
చ.1 
కాలభైరవవినుత భవజలధి పోతా 
నిత్యవితరణశీల శివలోకసదనా 
కనకమణిమయపీఠ అమరపూజితపదా 
జయయోగకారిణీ వీణావినోదినీ || 
చ.2 
విశ్వాంతరంగిణీ సృష్టిపాలనకరీ 
సమరవినోదినీ సర్వశుభ సంధాత్రి 
కుంకుమార్చనప్రీత సౌభాగ్యదాయినీ 
మల్లికాసుమ గాన సంతుష్టవదనీ ॥

265. బ్రహ్మరూపా

ప బ్రహ్మరూపా బ్రాహ్మణీ 
అ.ప బ్రహ్మాదిసురనాయక పూజనీయా ॥ 
చ.1 
సురుచిరాంగ సత్కళావిశారదా 
నవ్యదివ్య మణిమయ భూషణా 
మందహాస భువనేశ్వరి వరదా 
ఇందువదన సుందరాంగి శారదా ॥ 
చ. 2 
మహాబ్రహ్మమయీ త్రైలోక్యపావనీ 
సుఖబోధ సుధాస్వరూపా సవిత్రీ 
బ్రహ్మానందమయేశ్వరి బ్రాహ్మీ 
మల్లికాకుసుమ ఆనందదాయినీ।।

266. గోప్త్రీ

ప గోప్త్రీ దివ్యవైభవీ 
అ.ప సర్వసంపత్ప్రదా చిన్మయీ || 
చ.1 :
సర్వభూతజాలములను పాలించి 
రక్షించు సత్యలోక సవిత్రీ 
శ్రీవిద్య సేవకులకే 
కనిపించు సత్పుణ్య చారిత్రి || 
చ.2 
శ్రీవిద్యామంత్రరహస్య 
సకలలోకసామరస్య 
ప్రాణికోటి జీవరహస్య 
మల్లికాసుమగాన మనస్య ॥
 
267. గోవిందరూపిణీ

ప గోవిందరూపిణీ పరమానందదాయినీ 
అ.ప అఖిలవేదసార హరీశవిధాత్రే ॥ 
చ.1 
విష్నుమాయా విలాసినీ 
నారాయణి వేదాంతవిదుషి 
పాశాంకుశ కోదండపాణీ 
అతిమధురతరవాణీ ॥ 
చ.2 
అంబురుహా ఆతపత్ర సుభగా 
ముగ్ధప్రలోభాలోకినీ శ్యామలా 
కలేకాలక్షయే విజయేజయే 
మల్లికాకుసుమగాన ప్రియే ॥

268. సంహారిణి

ప సంహారిణీ రుద్రరూపిణీ 
అ.ప మహిషాసురమర్దని జగదంబికే ॥ 
చ.1 
లోకకంటకులైన దుష్టులను ఖండించి 
ధర్మమును రక్షించు కరుణానవద్యా 
చండముండ నిశుంభాది రాక్షససంహారి 
భవబంధమోచనీ దుర్గమా దుర్గా ॥ 
చ.2 
క్లీంకార ప్రీతిదాయిని మందస్మితా 
అహంకారనిర్మూలిని విమలసౌఖ్యదా  
ప్రళయకారిణీ అనంతపుణ్యఫలదా 
మల్లికాకుసుమ గానదా మోక్షదా ॥

269. రుద్రరూపా

ప రుద్రరూపా రుద్రాణీ 
అ.ప ఆజన్మదుఃఖ వినాశిని || 
చ.1 
విలయస్థితి హేతుభూత 
విశ్వసృష్టివిధాయిని 
కనకప్రభాసిని మహాయోగిని 
రౌద్రావతారిణి దనుజ మర్దిని ॥ 
చ.2 
లీలావిలాసిని బాలాసువాసినీ 
విలాసగమనీ వరదాయినీ 
దండినీ చక్రినీ కాళీ కరాళీ 
మల్లికాసుమ గానమాలినీ ॥

270. తిరోధానకరీ

ప. తిరోధానకరీ మోహాపహారి ॥ 
అ.ప ఘోరరాక్షస సంహారిణి 
చ.1 
వామమార్గ ప్రియంకరి శ్రీకరీ 
సర్వసిద్ధికృతే భాస్వరీ 
సుజన పాలనతత్పరీ లయకరీ 
సౌభాగ్యమహేశ్వరీ శ్రీధరీ || 
చ. 2. 
జగత్ పోషణి విలయంకరీ 
సర్వపాటలా త్రిపురసుందరీ 
కైటభారి హృదయేశ్వరీ 
మల్లికాకుసుమగాన వశకరీ॥

271. ఈశ్వరీ

ప. ఈశ్వరీ మహేశ్వరీ 
అ.ప జగదీశ్వరీ పరమేశ్వరీ॥ 
చ.1 
నన్నుబ్రోచేదైవమని 
నేనమ్మితినే శరణాగతి 
పాలముంచిన నీటముంచిన 
నీదేభారము శివసతీ ॥ 
చ.2 
నీతోసరిఎవ్వరమ్మా మమ్ము ఆదరించవే 
మామనవిని ఆలకించి క్రీగంటనుచూడవే 
నీనామము తలచినంత పాపములే తొలగునే 
సౌభాగ్యములిచ్చిమమ్ము దీవింపవె సర్వేశ్వరీ

272. సదాశివా

ప సదాశివా మంగళకారిణీ 
అ.ప శుభములీయవే జయమంగళా |॥ 
చ.1 
నీపదయుగము మదిలోనిలిపి 
నీవేగతియని సతతముతలచి 
స్తుతిసలిపితినే మదనరిపుసతి 
కరుణచూపరావే సన్మంగళా || 
చ.2 
జపములెరుగను తపములెరుగను 
చపలచిత్తను నీకృపకుపాత్రను 
సకలసుజనపరితాపహారిణి 
మన్నింపగదే అఖిలాండేశ్వరి ॥

273. అనుగ్రహదా

ప అనుగ్రహదా భక్తానుగ్రహదా 
అ.ప సర్వశోభాతిసుందరీ
చ.1 
భక్తకామవరప్రదా 
సదాచారప్రవర్తినీ 
మంత్రారాధితచరణీ
సత్త్వెకగుణప్రదా | 
చ.2 
మహాపర్వతనందినీ శ్రితపంకజ మాలినీ 
నియమవ్రత భూరిజలన్మణివలయిని 
భయదాఖిల రూపిణి శశిధరునిరాణి 
నిఖిలలోకసంరక్షిణి మల్లికాకుసుమవేణీ ॥

274. పంచకృత్యపరాయణా

ప పంచకృత్యపరాయణా 
అ.ప సృష్టిస్థితి లయ కారణా || 
చ.1 
అనుగ్రహసిద్ధిదాయినీ 
పంచాశత్పీరరూపిణీ 
భూత భౌతిక భావ నియమ 
సత్వ రజస్తమో గుణాలయా || 
చ.2 
బ్రహ్మవిష్ణు మహేశ్వరస్తుత 
ముకుళిత కరోత్తంసమకుటా 
మహేశమహిషీత్రిగుణాత్మికా 
మల్లికాకుసుమగాన దీపికా ॥ 

275. భానుమండలమధ్యస్థా 

ప. భానుమండల మధ్యస్థా 
అ.ప. దేవీత్రిపురసుందరీ II 
చ.1 
హృదయాగ్రభాగమున 
సూక్ష్మ కమలమున అగ్నిశిఖవలె 
మెరయుచుందువే అశేషవేదాత్మకా 
అనఘా పరమయోగిజన పూజితచరణా ॥ 
చ.2 
పరమశివ పర్యంకనిలయా 
త్రిలోకహేతు పరమేష్టీ 
పరమానందనందితా 
మల్లికాకుసుమగాన తేజసా ||

276. భైరవీ

ప భైరవీ భైరవాత్మికా 
అ.ప నటభైరవీరాగ మోహినీ II 
చ.1 
కపాల భైరవీ కాలభైరవీ 
సంహారభైరవీ భీషణభైరవీ 
హఠయోగినీ పరివేష్టితా 
సతేజసాపూరిత లోకా ॥ 
చ.2 
ద్వాదశదళపద్మస్థా 
ద్వాదశవర్ష కన్యారూపా 
అష్టభైరవరూపిణీ 
మల్లికాసుమగాన భైరవీ ॥

277. భగమాలినీ

ప భగమాలినీ కల్యాణగుణశాలినీ 
అ.ప. మాలినీ జ్వాలామాలినీ ॥ 
చ.1 
సర్వలోకజనయిత్రీ 
సర్వధర్మకారయిత్రీ 
బ్రహ్మజ్ఞాన ప్రసవిత్రీ 
షడ్గుణ ఐశ్వర్య ప్రదాత్రీ ॥ 
చ.2 
అనాహత పద్మమధ్య 
ద్వాదశాదిత్య పూజిత 
ద్వాదశసూర్యకళాధరీ 
మల్లికాసుమగానమాలినీ ॥

278. పద్మాసనా

ప పద్మాసనా యోగాసనా 
అ.ప జ్ఞాననిరతాహ్రీంకారిణీ II 
చ.1 
విపులకటితటీ పద్మపత్రవిశాలాక్షీ 
పద్మాసురసంహారిణి భగవతీ 
అష్టసిద్ధి నవనిధిదాయిని 
బిందుమండలవాసినీ తేజోవతీ ॥ 
చ.2 
వృక్షలతా కుసుమగంధ 
పరిపూరిత వనవాసినీ 
వెండి బల ధూపదీపితమనోజ్వలా 
మల్లికాసుమగానోజ్వలా ॥ 

279. భగవతీ

ప భగవతీ ఓం నమోభగవతీ 
అ.ప గ్రామరీ కళాధరీ పరాశక్తివైఖరీ॥ 
చ.1 
సర్వలోకశుభంకరీ 
ఆశ్రితరక్షాకరీ 
వింధ్యగిరివాసనిరతా 
శృతినుతా గుణాంచితా || 
చ.2 
నీ అడుగులకు నేమ్రొక్కితిని 
అష్టసంపదలీయవే 
శ్రితజనాభీష్టప్రదా 
మల్లికాసుమగానప్రదా ॥

280. పద్మనాభసహోదరీ

ప పద్మనాభసహోదరీ నారాయణీ 
అ.ప శ్రీపురవాసినీ హితజనావనీ ॥ 
చ.1 
కాంచీక్షేత్ర పురనివాసినీ 
పద్మాసనీ నటరాజపత్నీ 
మంజు మంజీర సింజిత మనోహరీ 
మధుకైటభ దైత్యదళనీ ॥ 
చ.2 
పరాశక్తివని నెరనమ్మితిని 
దయనుచూడవే కమల దళాక్షీ `
అభయమీయవేలోకరక్షకీ 
మల్లికా కుసుమ గాన శిక్షకీ ॥

281. ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః 

ప ఉన్మేష నిమిషోత్పన్నా విపన్నభువనావళీః 
చ.1 
నీకనురేప్పలు మూయకమ్మా 
ఈజగతిని ప్రళయములో ముంచకమ్మా 
యాగపూర్ణవరదా సూర్యచంద్రనయనీ 
నవకోటిశక్తి సహితా జగదీశ్వరీ || 
చ.2 
ధాన్య హేమ వర మందిర దాయినీ 
సమరవినోదిని సారసనయనీ 
జరామరణ ఋణరోగ నివారిణి 
మల్లికాకుసుమ నాదవినోదిని II

282. సహర్షశీర్షవదనా

ప. సహస్రశీర్షవదనా సహస్రనయనా ॥ 
అ.ప సహస్రపాదపంకజా సహస్రనామకీర్తనా॥ 
చ.1 
అణువులోన నీవే 
బ్రహ్మాండ మందునీవే 
సర్వజీవరాసులకు 
కారణభూతి నీవే ॥ 
చ.2 
సకుంకుమాది విలేపనా 
శుద్ధబ్రహ్మ స్వరూపిణీ 
దేవదేవ సుఖావహా 
మల్లికా సుమగాన సహిత ॥

283. సహస్రాక్షీ

ప సహస్రాక్షీ సకలభువన సాక్షీ 
చ.1 
శివకంచి కామాక్షీ కాశీవిశాలాక్షీ 
మధుర మధురతర మీనాక్షీ 
కరుణా నవద్యా త్రైలోకసాక్షి 
భవసింధుపోతా కరుణాకటాక్షీ ॥ 
చ.2 
సుధాంభోది మధ్యస్థితా 
ప్రకృతి సరళా మందహసితా 
ఆకర్ణదీర్ఘనయనా శృతినుతా 
మల్లికాకుసుమ గానప్రదాతా ॥

284. సహస్రపాత్

ప భైరవీ సహస్రపాత్ 
అ.ప సహస్రకరసంయుతా విరాట్ రూపిణీ | 
చ.1 
నీపాదస్పర్శను కోరేటి 
దేవతల కిరీట కాంతులతో 
నీపాదనఖములు రత్నకాంతులతో కెంపులవలె తోచు || 
ఆపద ద్వయమునకు శతకోటి వందనము 
చ.2 
నీఅడుగు తామరలు 
పూజించుభాగ్యము చపలచిత్తులకు లభియింపబోదు 
మంగళకరమైన నీపదయుగళము 
సిరిసంపదలిచ్చు శాంతిసౌరభము ॥

285. అబ్రహ్మకీటజననీ
ప 
ఆబ్రహ్మకీటజననీ బ్రహ్మజ్ఞానదాయినీ ॥ 
చ.1 
బ్రహ్మములోనీవు చీమలోనీవు 
సకలజీవులను సృజియించినదినీవు 
సర్వలోకములకు కారణమునీవు 
శంభులోకనిలయా శర్వప్రియా || 
చ.2 
శుభానందగుణార్ణవీ ఆశ్రితవరదా 
మల్లికాకుసుమ అలంకృతమూర్తీ 
అకళంకరూపిణి పరమమంగళా 
పన్నగశయనాది సన్నుతచరణా ||

286. వర్ణాశ్రమవిధాయినీ 
ప 
వర్ణాశ్రమవిధాయినీ జీవకోటి సన్మార్గ బోధినీ 
అ.ప 
మల్లికాకుసుమగానబోధినీ II 
చ.1 
జ్ఞానేంద్రియములకు లొంగనిది 
కర్మేంద్రియముల విషయముకాని 
పంచభూతముల కారణమైన బ్రహ్మతత్వమును
ఆత్మతత్వమును బోధించే 
చ.2 
చతుర్వర్ణములు చతురాశ్రమములు 
నియమనిష్ఠలు ఆచారములు 
ధర్మము యజ్ఞము శాంతిని నిలిపే 
సకల విషయణి పరమాత్మికా ॥

287. నిజాజ్ఞారూపనిగమా 
ప. 
నిజాజ్ఞగ్రూపనిగమా వేదసంజ్ఞా పురాతనీ 
అ.ప 
మల్లికాకుసుమగాననాదమయీ॥ .
1  
విష్ణువులు నీఆజ్ఞలచే 
సృష్టి స్థితులను నెలకొల్పుదురే 
గురుతరమైన నీదు ఆజ్ఞచే 
కాలరుద్రుడులయము చేయునే II 
చ.
'ఓ ఎదాలు యజ్ఞాలు నీదురూపమే 
నిగమాగమములు నీవరమే 
నీఆజ్ఞపాలించి తిరుగును 
కాలము నీఆజ్ఞతలదాల్చు ముల్లోకములు ॥

288. పుణ్యాపుణ్యఫలప్రదా
ప 
పుణ్యాపుణ్యఫలప్రదా సకలవేదసుధాప్రమోదా 
అ.ప 
మల్లికాకుసుమగానమోదా॥ 
చ.1 
సమస్తలోకముల నేలెడు జ్యోతీ 
సమస్త జీవులను సాకెడు జాణ 
సమస్త దుర్గతుల బాపెడుదిట్ట 
మల్లికాకుసుమగాన సుధానిధి ॥ 
చ.2 
కోరినవారికి కొంగుబంగారము 
కొలచినవారికి కల్పవృక్షము 
నమ్మినవారికి దివ్యచింతామణి 
శరణన్నవారికి భవ్యకృపానిధి॥

289. శృతిసీమంతసింధూరీకృతపాదాబ్జధూళికా
 
ప శృతిసీమంతసింధూరీకృత పాదాబ్జధూళికా 
చ.1 
చతుర్వేదములు నీశిరస్సు 
ఉపనిషత్తులే నీపాపిటబొట్టు 
సర్వాగమార్ధ వాగ్భూషిణీ 
శాశ్వత పరబ్రహ్మస్వరూపిణి॥ 
ఛ.2 
సర్వజీవులకు కన్నతల్లివి 
విశ్వమెల్ల వెలయు గాయత్రివి 
నీవేసత్యము సుందరము 
మల్లికాసుమగాన శోభితము |

290. సకలాగమసందోహ శుక్తిసంపుటమౌక్తికా 
ప. 
సకలాగమసందోహ శుక్తిసంపుటమౌక్తికా 
చ.1 
సకలవేదసారము నీరూపమే పరమేశ్వరి 
కామరాజ యంత్రా శ్రీ బీజ సమన్వితా| 
చ.2 
షోడశాక్షరీమంత్రా శ్రీ విద్యా ప్రకీర్తితా 
పంచగశీమంత్ర పంచప్రణవాధిదేవతా 
మహాషోడశిమంత్రా బ్రహ్మవిద్యాస్వరూప 
మల్లికాకుసుమగాన కారణా ॥

291. పురుషార్ధప్రదా 
ప 
పురుషార్ధ ప్రదా కామకోటికా 
అ.ప 
సమయసంకేత పాలినీ వార్తాళీ 
చ.1 
సర్వామ్నాయ నివాసినీ పురారాణి 
పట్టమహిషి వరదాయినీ
చ.2 
ధర్మార్ధ కామమోక్ష ప్రదాయినీ 
త్రయంబకవల్లభా కులకమలినీ 
దనుజదళిని అవినాశిని 
మల్లికాకుసుమగాన యోగినీ।।

292. పూర్ణా 
ప. 
పూర్ణాపరమేశ్వరి 
అ.ప 
పరబ్రహ్మ స్వరూపిణి
చ.1 
జననమరణములేని వృద్ధిక్షయములు లేని 
అనంతరూపిణి సకలైశ్వర్య ప్రదాయిని 
ఏకాదశీతిధి పూజాభిలాషిణి. 
ప్రణవామృత రసపూర్ణా అపర్ణా 
॥ చ.2 
కాశీనివాసిని విశ్వేశ్వరహృది వాసిని 
మాతా అన్నపూర్ణ విజ్ఞానసుధాపూర్ణా 
సౌందర్యమకరంద ఆనందపూర్ణా 
మల్లికాకుసుమగాన పరిపూర్ణా ॥

293. భోగినీ
ప 
భోగినీ శివయోగినీ 
అ.ప 
పరబ్రహ్మాభిధేయినీ || 
చ.1 
మంత్ర విగ్రహా మోహనాత్మికా 
విశ్వవందితా వీతరాగా 
అఖిలసురారాధ్యా కామదా 
నందితాశేష విష్టు |
చ.2 
విజ్ఞానదీప్తి కలితా లోకసంహార రసికా 
జగదానందప్రదాయిని 
సచివేశానీ కామేశ్వర ప్రణయరంజిత 
మల్లికాకుసుమగాన శ్రవణోల్లాసినీ ॥

294. భువనేశ్వరీ
ప 
భువనేశ్వరి జగదీశ్వరి కామేశ్వరి మహేశ్వరి 
మల్లికాసుమగాన రాజరాజేశ్వరి భువ 
అ.ప 
ఓంకారి హ్రీంకారి త్రిపురేశ్వరి
శివశక్తి మాంపాహి పరమేశ్వరి భువ
చ.1 
ఇలలోన నీకన్న దిక్కెవరే 
కరుణించికాపాడు కాత్యాయని 
భక్తులనుబ్రోచేటిశ్రీభ్రామరీ 
కాశీపురాధీశ్వరిసర్వేశ్వరి 
చ.2 
పరమేశు గెలిచావునీతపముతో 
సంసారిచేశావునీరూపుతో 
అర్ధాంగివైనావునీవలపుతో 
ననుబ్రోవమనిచెప్పునీప్రాపుతో

295. అంబికా
ప 
అంబికా జగదంబికా 
అ.ప 
బురుహాతపత్ర శుభగా ॥ 
చ.1 
నీదివ్యచరితము చిత్రాతిచిత్రము 
నీదివ్యలీలలుఅపురూపము 
నినుకీర్తించేభాగ్యమేభాగ్యము 
మల్లికాకుసుమగానమేవరము॥ 
చ.2 
అఖిలజగమునకు ఆదిహేతువు 
అఖిలప్రాణులకు ఆదిదైవము 
అఖిలవిద్యలకు కారణభూతవు 
సురవిద్యాధర వందితా ॥

296. అనాదినిధనా
ప 
అనాదినిధనా విశ్వసృష్టి పరాధీనా 
అ.ప 
చక్రరాజరధోత్తమా అనుత్తమా॥ 
చ.1 
చిదగ్నికుండ సముద్భవా 
సద్గుణా శ్రితజనప్రియా లబ్ధవాంఛితా 
మహాతిశయలావణ్యా 
లబ్ధశక్తి కుంకుమపంకిల దేహా పురాతన ॥ 
చ.2 
అరాళకుంతలా కామేశీ 
చిత్రజీవధనుర్ధారి కంబుకంఠి 
సనకాది మునివందిత లకులేశ్వరి
మల్లికాకుసుమగాన లక్షితా ఈశ్వరీ ||

297. హరిబ్రహ్మేంద్రసేవితా
ప 
హరిబ్రహ్మేంద్రసేవితా మంగళము జయమంగళము
అ.ప 
మంగళమూర్తికి చిదనమూర్తికి 
అద్భుతమూర్తికిమంగళము॥ 
చ.1 
అనయముభక్తుల చల్లగచూచే కరుణామూర్తికి మంగళము 
సకలజగములను పాలించే ఆసద్గుణమూర్తికి మంగళము ॥ 
చ. 2 
సత్యముశివముసుందరమైన 
ఆనందమూర్తికి మంగళము 
మల్లికాకుసుమపూజిత చరణకు 
మంగళముజయమంగళము ॥

298. నారాయణీ
ప 
శ్యామలాంగీ నారాయణీ 
అ.ప 
ఆర్తత్రాణ పరాయణీ। 
చ.1 
ఫుల్లారవిందా సకలవిషయిణీ 
శంఖచక్రగదాసి చక్రవర్తిణీ 
సంపత్కరీ దేవి పరానందచిదనా 
బ్రహ్మానందాభిదాయిని జయకామకళాత్మికే॥ 
చ.2 
సరసిజనాభసోదరీ శంకరార్ధశరీరిణీ 
ఉర్వీ తత్వాది రూపిణి రమావాణీ సేవిత 
నీతోసరి ఎవరమ్మా నాకాధీశనుతా 
నవమల్లికాకుసుమ రాగవినుతా ॥

299. నాదరూపా
ప నాదరూపా అనాదిమధ్యే 
అ.ప ఓంకారనాదాను సంధీకృతే | 
చ.1 
బ్రహ్మానందరసాత్మికే లలితే 
లోకసంరక్షణా రసికే మంగళే 
లోకరచనాక్రీడ తన్మయానందే 
సిద్ధసురవరనుతే అర్చితే ॥ 
చ.2 
వల్లకీవాద్య నాదప్రియే సుప్రియే 
సంసారభీత్యాపహే సామరస్యవిభవే 
వాసవాది ముని పూజిత చరణే 
మల్లికాకుసుమ గానపూరణే ॥


300. నామరూపవివర్జితా
ప. నామరూపవివర్జితా శ్రీ లలితా 
అ.ప. అంతటనీవే జగదీశ్వరీ|| 
చ.1 
అండమందుననీవే బ్రహ్మాండమందుననీవే 
అణువణువుననీవే భువనేశ్వరీ ॥ 
చ.2 
చక్రతాటంక వికసితవదనా 
అగ్రబిందు పరికల్పితాననా 
సతతమభయదావరదహస్తా 
మల్లికాకుసుమగానప్రశస్తా ॥

301. హ్రీంకారి
ప. మందారపూవంటి హ్రీంకారరూపిణి 
అ.ప మముబ్రోచుటకు వేగ తరలి వచ్చినది ॥ 
చ.1 
బింబాధరముపైన దరహాసచంద్రికలు 
కన్నులలో కురిసేటి కరుణామృతములు 
వరములను యిచ్చేటి వరదహస్తములు 
సాయుజ్యమొసగేటి పాదపద్మములు | 
ఛ.2 
సన్నంపు నడుముపై గజ్జెలొడ్డాణంబు 
బంగారుజిలుగుల కంఠహారములు 
గలగల మని మ్రోగు కరకంకణములతో 
ఘల్లుఘల్లునమ్రోగు మంజీరములతో ॥

302. హ్రీమతీ
ప. హ్రీమతీ లజ్జారూపిణీ 
అ.ప. తుష్టి పుష్టి నమోనమో 
చ.1 
నాదబిందుభరితా జ్ఞానాకృతీ ॥ 
బ్రహ్మానంద ఘనోదరీ జ్ఞానేశ్వరి 
గంధర్వసేఎతా జ్ఞానదా 
మహీంగతవతీ మాననీయా ॥ 
చ.2 
స్థూలసూక్ష్మ కారణా సౌఖ్యదా 
భువనేశానీ ప్రణవాత్మికే 
వేదాంతసంసిద్ధే హ్రీంకారమూర్తయే 
మల్లికాసుమగాన కారణస్వరూపే ॥

303. హృద్యా
ప. మనోహరరూపిణీ హృద్యా 
అ.ప సకలోపాసక హృదయ నివాసిని || 
చ.1 
త్రిశూలచంద్రాహి ధరా 
వీణావేణు మృదంగ వాద్య రసికా 
పద్మకింజల్క సంకాశా 
కోటిసూర్య సమప్రభా ॥ 
చ.2 
హ్రీంకార జపసుప్రీతా 
హ్రీంకారార్ణవ కౌస్తుభా 
సుమనోహరి అతులతేజసా 
మల్లికాకుసుమ గానసుధార్ణవ॥

304. హేయోపాదేయవర్ణితా 
ప హేయోపాదేయవర్జితా కాంచీదామవిరాజితా 
అ.ప భువనేశ్వర వామాంకనిలయినీ ॥ 
చ.1 
వైడూర్యములు పొదిగిన కడియములు 
నవరత్నముల మణిమయహారములు 
శ్రీచక్రాకార తాటంకములతో 
పాపహరము నీసుందర వదనము ॥ 
చ.2 
ఇష్టాయిష్టములు ఏమీలేనిది 
నింద్యా నింద్యములు అంటనిది 
కుల మత సంపద భేదము లేనిది 
మల్లికా కుసుమ గానవిలయినీ ॥

305. రాజరాజార్చితా
ప రాజరాజార్చితా శ్రీ కదంబవనవాసినీ 
అ.ప భూనుతచరిత గణేశపూజిత 
అగణితగుణగణ శ్రీలలిత | 
చ.1 
కాలిగజ్జెలు ఘల్లుఘల్లుమని 
ముల్లోకములు మురిపింప 
బాలచంద్రధరురాణిమహేశ్వరి 
జాలమేటికిక వరమిమ్మా ॥ 
చ.2 
మల్లికాకుసుమగానమాలికలు 
స్వీకరింతువని నమ్మితినే 
జాగుచేయక కృపనుచూడవే 
చంద్రకళాధరి శ్రీ లలితా ॥

306. రాష్ట్ర
ప. రాష్ట్రీ శ్రీమహారాష్ట్రీ 
అ.ప శివ వామాంకస్థితా || 
చ.1 
సురాసుర శిరోరత్న నిఘృష్టచరణాంబికే 
నవ రాగ కళారూపా త్రయోదశ గణప్రియా 
చ.2 
ద్వాదశాదిత్య సంపూజ్యా 
ఏకాదశి తిధిప్రియా సదయా 
త్రిపురాది చక్రేశ్వరి సచ్చిదానందా 
మల్లికాసుమగాన సిద్ధిదా పుణ్యదా ॥

307. రమ్యా
ప మనోహర లావణ్య శ్రీరమ్యా 
అ.ప ఉమా హైమవతీ బహుశోభనా ॥ 
చ.1 
హిరణ్యవర్ణా సువర్ణ రజతశోభినీ 
తుహినగిరి కన్యా సౌందర్య రాశీ 
చ.2 
నీసౌందర్యము లోకోత్తరము 
బ్రహ్మవిష్ణువులైన వర్ణించలేరు 
కర్మాది సాక్షిణీ కామేశ్వరీ 
మల్లికాకుసుమగాన హితైషిణీ ॥

308. రాజీవలోచనా
ప రాజీవలోచనా రాజరాజేశ్వరీ 
అ.ప రావమ్మా మాయింటికి 
చ.1 
చెవులతాటంకములు తళ తళ మని మెరయ 
అందాలచెక్కిళ్ళు సింగారమొలుకంగా 
నుదుటిపై కుంకుమ రవిబింబమై మెరయ 
ఘల్లుఘల్లున పాద గజ్జలే మ్రోగంగా 
చ.2 
అందాలకన్నుల్లో కరుణామృతముకురియ 
అభయహస్తముతో అనందము వెల్లివిరియ 
మల్లికాసుమరాగ గానములో నీవుమురియ 
రావమ్మా మాయింటికి... రావమ్మామాయింటికి।।

309. రంజనీ 
ప. రంజనీ ప శివరంజనీ రంజనీ
అ.ప భక్తలోకహృదయాను రంజనీ ॥ 
చ.1 
నీఉనికి తెలియను నీపేరు యెరుగను 
నిన్నుతలచగలేను నిన్నుపిలువగలేను 
షోడశపూజలుచేయ నేనెరుంగను 
మదిలో నిన్నే నిలుపగలేను ॥ 
చ. 2 
స్తుతుల స్తోత్రముల నిను పొగడగ లేను 
సంసారబంధాల చిక్కుపడితిని 
చేయూతనిచ్చి నీదరిజేర్చవే 
మల్లికాసుమగాన పరమావధి ॥

310. రమణీ
ప. రమణీ సూక్ష్మామృతా 
అ.ప భక్తజనానంద సంధాయినీ 
చ.1 
కాంచీదామ విరాజితా పరమాహ్లాద కారిణీ 
పంచభక్ష్య ప్రియాచారా పుణ్యతీర్ల నిషేవితా 
చ.2 
బహుకర్ణావతంసికా భవానీ భాగ ధేయినీ 
జగజ్జనానందకరీ మల్లికాకుసుమ గంధినీ

311. రస్యా
ప. రస్యా ఆనందరసరూప మహామహేశ్వరీ 
అ.ప అభయప్రదా భాగ్యదా ॥ 
చ.1 
మహాశక్తీ మహారాష్ట్రీ 
మాహేశ్వరి మహానందా
మహాగుప్తా మహాజ్ఞాన 
మహాస్కంద మహాశయా ॥
చ.2 
రత్న తాటంక రమ్యా 
అరుణిమ వసనా ఈశ్వరీ 
పరాత్పర కళాత్రిపురా 
మల్లికాసుమగాన నిపుణా ॥

312. రణత్కింకిణిమేఖలా
ప. రణత్కింకిణిమేఖలా శ్రీకళా 
అ.ప కాంచీ దామ విభూషితా ॥ 
చ.1 
ఉన్నతమైన కుచకుంభములచే 
ఇంచుకవంగిన తనుమధ్యమా 
పూర్ణచంద్రునివంటి నీనగుమోము
కాంచినచాలును తాపహరణము ॥ 
చ.2 
ఇక్షు పాశాంకుశము పుష్పబాణములు 
నాల్గుచేతులను పరగధరించిన 
త్రిపురాసుర సంహారిణి ప్రణయిని
మల్లికాకుసుమగాన భగవతీ ॥

313. రమా
ప. రమా త్రిశక్తి రూపిణీ 
అ.ప లక్ష్మీ వాగాది రూపనర్తకీ ॥ 
చ.1 
అనన్యరూపా శరదిందుశుభ్రా 
ప్రవాళవదనా స్తన హార శోభా 
ముక్తావిభూషణవతీ వాత్సల్య హృదయా 
శ్రీ బీజశక్తీ నారాయణీ 
చ. 2 
పుష్ప ప్రభా భాసురా 
శర్వరీ లక్ష్మీ ప్రదాయినీ 
నిఖిలలోక రక్షాకరీ 
మల్లికాకుసుమ గాన ప్రదా॥

314 రాకేందు వదనా
ప. రాకేందు వదనా రమణీయ సదనా 
అ.ప బిందుమండలరూప కుందరదనా ॥ 
చ.1 
త్రిగుణాతీతము మాయా తీతము 
బ్రహ్మాతీతము నీదురూపము 
ఊహాతీతము భావాతీతము 
మధురాతి మధురము నీనామము || 
చ.2 
మృదుతర సుధామాధుర్య మోదహృదయా 
సర్వశాస్త్ర కోవిద సంసేవితా సలలితా
రత్నభూషణాలంకృత విచిత్రమాల్యాభరణ 
దివ్యహారప్రలంభినీ మల్లికాసుమగానతన్మయీ||

315. రతిరూప
ప. రతిరూపా మహామాయా
అ.ప జగన్మోహన రూపిణీ కామేశ్వరప్రణయినీ 
చ.1 
కళ్యాణ గుణశాలినీ అనంతసౌందర్యరాశీ
అరుణా అతిశయకరుణా
ఈశ్వరోత్సంగ నిలయా 
లక్షణోజ్వల దివ్యాంగీ || 
చ.2 
సకలాధిష్టానరూపా లబ్దయౌవన శాలినీ 
కకారిణీ కావ్యలోలా మల్లికాకుసుమప్రియా॥

316. రతిప్రియా
ప. రతిప్రియా గిరిజా 
అ. ప లలితాపరమేశ్వరీ 
చ.1 
పరమశివునికై తపసును చేసి 
కైలాసనాధునే భర్తగాపొందితివి 
ముక్కంటి చూపునకు భస్మమైన కంతుని 
బ్రతికించి రతికి సౌభాగ్యమొసగితివి || 
చ.2 
కామేశ్వరుని అర్ధనారివై 
కామితములుతీర్చు కామాక్షీ 
కాంచీపురవాసి కల్యాణదాయినీ 
మల్లికాకుసుమ గానప్రదాయినీ ॥

317. రక్షాకరీ 
ప రక్షాకరీ శ్రీ నకులేశ్వరీ 
అ.ప శ్రీలలిత నీపదము నెరనమ్మితీ॥ 
చ.1 
పూజలెన్నోచేసి వ్రతములను సలిపి 
ఉపవాసములు చేసి జాగరణసలిపి 
నినునమ్మియున్నాను నానేరమా 
దయచూపకున్నావు నేనీకు భారమా॥ 
చ.2 
ఎందరున్నను ఏమిలాభమే నువులేక 
నువ్వువుంటేచాలు అదినాకు పదివేలు 
అణువణువులోఉండి అన్నినీవైయుండి 
కనిపింపకున్నావు కనికరములేదేల ॥

318. రాక్షసఘ్నీ 
ప రాక్షసఘ్నీ శ్రీ కాళికా నమోనమో
అ. ప లోకసంహార రసికే భద్రకాళికే ॥
చ.1 
బాణభుశుండీ పరిఘాయుధ ధారిణీ 
సర్వభూతవశంకరీ వృతాసుర నిబర్హిణీ 
మధుకైటభాది అసురదళనీ 
శుంభ నిశుంభాది దైత్యమర్దినీ ॥ 
చ.2 
రక్తబీజవధేదేవీ త్రైలోక్య సుభదే 
అంతశ్శత్రువులైన అరిషడ్వర్గముల 
దమియించుదేవీ త్రిపురాంబికే 
మల్లికాసుమగాన సంగీతభావుకే ॥

 319. రామా
ప రామా సురామే రమే 
అ.ప కందర్పజనకాపాంగ వీక్షణే || 
చ.1 
గజముఖ షణ్ముఖ రంజిత పార్శ్వే 
కోమలకాంతి కళాకలితే లలితే 
చందనాగరు కర్పూర కుంకుమ పాలికే 
రజనీకర వదన విలాస విలసితే ॥ 
చ.2 
ముద్రాం అభయవరదానైకరసికే 
మల్లికాకుసుమ సంగీతరసికే॥

320. రమణలంపటా
ప రమణలంపటా పతిభక్తి పరాయణా 
అ. ప కామేశ్వరాలింగితాంగీ శుభాంగీ 
చ.1 
నిజభర్తృ ముఖాంభోజ చింతనా 
కపాలిప్రాణనాయికా కామసంజీవనీ 
కారుణ్యవిగ్రహా సర్వసౌఖ్య విధాత్రి 
పతివ్రతాంగనాభీష్ట ఫలదా ॥ 
చ. 2 
సచీముఖ్యామర సేవితా 
సంసార జలనిధి తోషణా 
సదాశివకుటుంబినీ శాంభవీ 
మల్లికాకుసుమగానవైభవీ ॥

321. కామ్యా 
ప. కామ్యా కళారూపిణీ 
అ.ప కృష్ణపక్ష ద్వాదశితిధి రూపిణీ 
చ.1 
సృష్టిపాలనకరీ చిత్వశ్రామాలినీ 
కటాక్షవీక్ష లలితా పరమేశ్వరీ శ్రీ కరీ॥ 
చ.2 
అనంతగుణరూపా సర్వభూత హితప్రదా 
త్రికాలజ్ఞాన సంపన్నా భక్తపోషణవినోదినీ 
శ్రీనాధ సోదరీ భక్తార్తి భంజనీ 
మల్లికాసుమగాన వాసినీ శంకరతోషిణీ ॥

322. కామకళారూపా
ప. ప్రకృతిస్వరూపా కామకళారూపా 
అ.ప బిందునాద కళాతీతా అదృశ్యా మోహనాత్మికా॥ 
చ.1 
శ్రీకంఠ దయితే.కామేశీ 
కామకళాధరి కళ్యాణనిలయే 
పాశాంకుశధారిణీ విశేష గుణాత్మికా ॥
చ.2 
చిన్ముద్రాలంకృతకర 
శంభుప్రియేశాంకరీ
కాలచక్రాశ్రయోపేతా 
మల్లికాకుసుమధారిణీ ॥

323. కదంబకుసుమప్రియా
ప కదంబకుసుమప్రియా కాదంబవనవాసినీ 
అ.ప శ్రీచక్రస్థిత బిందుమధ్యనిలయా ॥ 
చ.1 
హ్రీంకార మంత్రోజ్వలా సమందహసితేక్షణా 
అష్టాదశపీఠవాసినీ మందారసుమాలి ॥
చ. 2 
కామేశ ముఖాంభోజ చింతనా 
సర్వమంత్రఫలదాయినీ దాక్షాయిణీ 
మల్లీకాసుమగాన రసాహ్లాదినీ 
మారారాతిప్రియ అర్ధాంగినీ శోభినీ॥

324 కళ్యాణీ 
ప మాతృకా బీజరూపిణీ కళ్యాణీ 
అ.ప పంచభూతాత్మికా జనరంజనీ ॥ 
చ.1 
దీనజనకల్పవల్లి అగణితగుణశ్రీవల్లీ 
శివధ్యానైకనిరత సౌభాగ్యమాహేశ్వరి ॥ 
చ.2 
శరణాగతవత్సలా నినునమ్మితి శ్రీశివే 
శిరీషకుసుమశోభినీ శివసతీ 
ముఖకమలవిలాసినీ శర్వాణీ 
మల్లికాసుమ గానలోలినీ కళ్యాణి

325. జగతీకందా 
ప జగతీకందాసర్వకామదా 
అ. ప సకలసురనుతా సతతమభయదా ॥
చ.1 
కరుణారసార్ణవమయీ మాయాస్వరూపిణీ 
అఖిలాండకొటి బ్రహ్మాడనాయికా 
భావనామాత్రసంతుష్ట హృదయా 
స్థితి సంహారకారిణి దాక్షాయిణీ | 
చ.2 
సుధాంశుబింబవదనా మాధవేశ్వరీ 
శంకర ప్రియవల్లభ పుణ్యరూపిణీ 
శివాంశరూప కార్తికేయజననీ
మల్లికాసుమగాన సుధావాహినీ ॥

326. కరుణారససాగరా
ప. కరుణారససాగరా ఆశ్రితవత్సలా 
అ.ప కమలాలయా సౌభాగ్యనిలయా ॥ 
చ.1 
ఇంద్రాదిపూజితా బ్రహ్మాదిసేవితా 
మాంగల్యదాయినీ మహిమాన్వితా 
సుప్రసన్నవదనా ప్రియభాషణా 
చంద్రాగ్ని నయనా బాలాత్రినయనా॥ 
చ.2 
ప్రణవార్ధస్వరూపిణీ భానుకోటి సమద్యుతి 
కంబుకందరురాణి శివతేజస్విని 
పూర్ణచంద్ర నిభాంశుకా భువనేశ్వరి 
మల్లికాసుమ మోహినీ కమలాంబికా ॥

327. కళావతీ
ప. కళావతీ చతుష్షష్టి కళాత్మికా 
అ.ప. శాంత్యతీత కళామయీశ్రీకళా 
చ.1 
రుద్ర ఈశ్వర సదాశివకళలు 
వేదవేదాంగములు నీనిర్మితములే 
సర్వకళామయతేజో విలసిత 
సద్యోజాతాది మంత్రవిరాజిత ॥
చ.2 
కరధృతవీణా రసాస్వాదినీ 
నృత్య గాన కవితా శక్తి దాయిని 
లలితలావణ్య లతా మహితాకృతి 
మల్లికాకుసుమ గానకళానిధి ॥

328. కలాలాపా
ప. కలాలాపా కంబుకంఠీ
అ.ప కల్పవల్లీ కామితార్ధదా II 
చ.1 
కస్తూరీ తిలకోజ్వలా కారుణ్య విగ్రహా 
మృదుమధుర సామగాన నాదవినోదిని ॥ 
చ.2 
మంజులభాషిణి గానవిలాసిని 
శృతి లయ స్వర రాగ విధాయిని 
సకల కళావాహినీ వాగ్దేవీ 
మల్లికాకుసుమగాన వాగ్రూపిణీ॥

329. కాంతా
ప కాంతా.... కాంతా
అ. ప సదాశివమనోకాంతా
చ.1 
పరమమనోహర రూపలావణ్య 
అందాలరాశి కుసుమకోమలి 
లలిత లలిత లావణ్య లతాంగీ 
ఉన్నతోన్నత కుచభార శోభిత ॥ 
చ.2 
పుష్పమాలాలంకృత గాత్రి 
మల్లికాకుసుమ మాలాలంకృత వేణి 
అద్వితీయ సౌందర్య స్వరూపిణి 
నీలాలకశ్రేణి దేదీప్యమాన

330. కాదంబరీప్రియా
ప కాదంబరీప్రియా కమలాలయాకామకోటినిలయా 
అ. ప ధనుర్భాణ ధరకరయా దయాసుధ సాగరయా॥ 
చ.1 
స్వర్గలోక తేజోనిధి 
మహర్లోక మహాసిద్ధి 
సజ్జన లోక జనయిత్రి 
లోకపాలినీ కపాలినీ ॥ 
చ.2. 
తపోలోక తపస్విని సత్యలోకసత్యవాణి 
బ్రహ్మలోకగాయత్రీ శిఖాగ్ర భాగ మనోన్మనీ 
బ్రహ్మవిద్యా బ్రాహ్మణిదేవ దేవమహానంద 
కాదంబరీమధుపానమత్త మల్లికాసుమలోలినీ।।

331. వరదా
ప. వరదా వరదా కామితఫలదా 
అ.ప బ్రహ్మానందా పరమసుఖదా !! 
చ.1 
నాకన్నీటితో పాదములేకడిగి 
నాహృదయమేనీకు పీఠముచేసి 
ప్రేమామృతములో స్నానమాడించి 
శ్రద్ధాంబరమే నీకుకట్టెదనే II 
చ.2 
సంచితజ్ఞానమను దీపమువెలిగించి 
నాభక్తినేనీకు నైవేద్యముగ చేతు 
మల్లికాకుసుమముల నృత్యగానము చేసి 
నవవిధహారతులను అందింతునమ్మా! 

332. వామనయనా
ప వామనయనా చూపుము కరుణా 
అ.ప సుందరలోచన సన్నుత చరణా 
చ.1 
నీకంటి చూపులేముక్తిదాయకము 
నీదీవెనలే శాంతిసౌఖ్యము 
నీనామమె మాహృదయానందము 
కమనీయము నీకీర్తి గానము ॥ 
చ. 2. 
శ్రితజనవత్సల మోక్షప్రదాయక 
హరిచందన కుంకుమ పంకయుతా 
బహురత్నమనోహర కాంతియుతా 
మల్లికాకుసుమగాన బోధితా॥

333 వారుణీమదవిహ్వలా 
ప వారుణీమదవిహ్వలా 
అప స్థితా నాడీ సర్వగామినీ ॥ 
చ.1 
నీ అనుగ్రహముతో శ్రీమహావిష్ణువు 
ఊర్ధ్వలోకములేలు శింశుమారుడై 
నీకరుణతోనే ఆదిశేషుడు 
అధోలోకములు మోయకలుగునే॥ 
చ.2 
నీదయతోనే ఆమన్మధుడు 
యోగులనైనా గెలువకలుగునే 
వారుణీ మదము పానముచేసి 
బ్రహ్మానందము నొందు యోగినీ ॥

334. విశ్వాధికా
ప విశ్వాధికా విశ్వరూపా 
అ.ప. విశ్వవినోదిని విశ్వజననీ ॥ 
చ.1 
నిత్యనిరామయ దీనదయామయ 
సత్యసనాతన విశ్వహితే 
సేవకవత్సల దుర్గతి భంజన 
సత్వగుణాకర విశ్వనుతే || 
చ.2 
చందనచర్చిత కుండలమండిత 
సజ్జనరంజని విశ్వభృతే 
మల్లికాకుసుమ గాననిలయిని 
విశ్వమోహినీ విశ్వకృతే ॥

335. వేదవేద్యా
ప వేడవేద్యా పర దేవతా 
అ.ప జ్ఞాన దాయిని జ్ఞాన ప్రసూనాంబా || 
చ.1 
ఋగ్వేదము నీపూర్వద్వారము 
యజుర్వేదమే నీదక్షిణద్వారము 
అధర్వణమే పశ్చిమద్వారము 
సామ వేదము ఉత్తరద్వారము ॥ 
చ.2 
చింతామణి గృహ వాసిని హాసినీ 
వేదసారములు ఉపనిషత్తులు 
మల్లికాకుసుమ గానము నీవే 
పరమేశ్వరి పరబ్రహ్మ స్వరూపిణి ॥

336. వింధ్యాచలనివాసినీ
ప వింధ్యాచలవాసినీ నరకార్ణవ తారణీ 
అ.ప సహస్రార నివాసినీ 
చ.1 
బాలేందుదివాకరాక్షీ 
శుంభ నిశుంభులను దునుమాడిన 
మహామాయా రూపిణీ జయవైష్ణవీ 
సకలామ్నాయ జననీ జయశివానీ
చ. 2 
పుల్లకుసుమిత సుమకలితా 
యశోదాగర్భాన జన్మించినమాయా 
చండికా చండదుర్దండలీలా 
మల్లికాకుసుమ గాన సునందా॥

337. విధాత్రీ 
ప విధాత్రీ కళ్యాణ సంధాత్రీ 
అ.ప లోకత్రాణపరా విశ్వమాతృకా ॥ 
చ.1 
లక్ష్మీ ప్రదానసమయే నవవిదృమాభా 
విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రా 
శత్రుసంహారసమయే తమాలనీలా 
త్రిలోకజననీ విశ్వవిలాసే II 
చ.2 
సారాసార వివేకదృష్టి విదితా 
జగద్రక్షణ తత్పరా వరదంబికా 
చంద్రకోటి మనోహరా 
మల్లికాసుమ గానమహితా

338. వేదజననీ
ప. వేదజననీ వాగ్దాయనీ 
అ.ప మధురస్మితా అరుణనయనా ॥ 
చ.1 
చంద్రావతంసినీ బ్రహ్మచారిణీ 
సకలవేద మంత్రాక్షర ధారిణి|| 
చ.2 
దుర్గతి దురిత దుఃఖనివారిణీ 
నిజతనుశోభిత నీల మణికుండల  
సమస్త వేదగత నిశ్చలతత్వా 
మల్లికాకుసుమ గాన పరచిత్తా ॥

339. విష్ణుమాయా 
ప విష్ణు మాయా అఖిలాఖిలాయై 
అ.ప విష్ణువిలాసిని అక్షయకామనాయై ॥ 
చ.1 
ఆదిత్యవర్ణాయై సర్వజ్ఞాయై 
జ్ఞానకర్మాధికాయై వరారోహాయై ॥ 
చ.2 
పంచబ్రహ్మాత్మికాయై చక్రధారిన్యై 
విశ్వంబర ధరాయై వేదగర్భాయై 
శక్తిబీజాత్మికాయై వైష్ణవీరూపిణ్యై 
నవమల్లికాకుసుమ గానసంస్థుతాయై

340. విలాసినీ
ప. విలాసినీ యోగమార్గనియంత్రిణీ 
అ.ప. బ్రహ్మరంధ్ర రహస్యరూపిణీ II 
చ.1 
కమనీయమనోహర దివ్యనేత్రీ విధాత్రీ 
గర్వాపహరణదక్షా సర్వలోక పరిరక్షా॥ 
చ.2 
సప్తకోటి మహామంత్రాభరణా 
త్రయోదశాక్షర మంత్రనిలయినీ 
శీతల పీయూష వర్షిణీ సంకర్షిణీ 
మల్లికాకుసుమ గానవర్షిణీ

341. క్షేత్రస్వరూపా
ప. క్షేత్రస్వరూపా త్రిపురాంతక వల్లభా 
అ.ప దివ్యక్షేత్రనివాసిని కపాలి తోషిణి శూలిని ॥ 
చ.1 
కాశీ అన్నపూర్ణ గయలోమంగళగౌరీ 
మాధవేశ్వరీ భువనేశ్వరీ 
విజయవాడ కనకదుర్గా జ్ఞానప్రసూనాంబికా 
దివ్యక్షేత్రజ్ఞ పాలినీ మాణిక్యాంబా ॥ 
చ. 2. 
మరకతవాణీ శ్రీశైలబ్రమరాంబా 
సుందరేశహృదయేశ్వరి జయ మీనాక్షి 
అంతకాంతకుడు క్షేత్రజ్ఞుడైవెలిగే 
మల్లికాసుమగాన క్షేత్ర స్వరూపిణీ

342. క్షేత్రేశీ 
ప. క్షేత్రేశీ ప్రకృతి పరిపాలినీ 
అ.ప చిదానందరసమయీ జ్యోతిర్మయీ 
చ.1 
స్థూల సూక్ష్మ దేహమందు 
ప్రజ్వరిల్లు పరమేశ్వరి 
అష్టాదశ పీఠములలో 
విరాజిల్లు హరాంకవాసి | 
చ.2 
విష్ణు పీఠములయందు 
పూజలుకొను శ్రీవైష్ణవి 
కామకోటి పీఠవాసి 
మల్లికాగుసుమ గానరాశి ॥ 

343. క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ 
ప క్షేత్ర క్షేత్రజ్ఞపాలినీ పంచభూతేశ్వరీ 
అ.ప కలి సోషహరా కర్మాదిసాక్షిణీ II
చ.1 
దశేంద్రియములు సుఖదుఃఖవికారములు 
చతుర్వింశతి తత్వములు అన్నీ నీవిలాసములే|| 
చ.2 
అద్భుత చారిత్రీ దృశ్యా దృశ్యరూపిణి 
అనాదిమధ్యాం అపాంచభౌతికాం 
అదృష్టిగోచరాం ఆనందమఖిలం 
మల్లికాకుసుమ గానసుందరం ॥

344. క్షయవృద్ధివినిర్ముక్తా 
ప క్షయవృద్ధి వినిర్ముక్తా 
అ ప నీ దాసురాలి నమ్మా భవానీ ॥ 
చ 1 
నిర్వికార నిరామయా 
నవనీత పాటలా 
తపనీయాంశుక భాసితా 
పురాహితాంక నిలయా || 
చ 2 
సకల దేవతల రత్నకిరీటములు 
తలవంచి పూజించు నీపద పద్మములు 
సేవించెడి వరమిమ్మా శాశ్వతి 
మల్లికాకుసుమ గాన కరుణాన్వితా ॥

345. క్షేత్ర పాల సమర్చితా 
ప క్షేత్ర పాల సమర్చితా 
అ ప మార్దవ గుణభరిత శ్రీ లలితా 
చ 1 
శ్రీకామేశ మానస కందళిత 
ఘనకుచసంపద సంభరిత ॥ 
చ 2 
పరాశక్తి నిగమాగమ గోచరి 
నిరుపమాన లావణ్య నీరధి 
దుష్టశక్తి సంహారిణి భాస్వరి 
మల్లికా కుసుమ గానవిభావరి ॥

346. విజయా
ప విజయా అపరాజితా 
అ ప రాక్షస సంహారిణి విజయ దశమి పూజిత ॥ 
చ 1 
మృదు మధుర భాషణా చతురా 
బిందు కళాధరి ఇందుముఖీ 
చిదానంద రసమయీ జ్యోతిర్మయీ 
శివ హృదయ కమల నివాసిని ॥ 
చ 2 
జయశ్రీ విజయేదేవీ జయదా సమృద్ధిదా 
జయబ్రహ్మమయేదేవీ జయదేవీ పరాత్పరి 
శ్రీకంఠదయితే జగదంబికే 
మల్లికాకుసుమ సంగీత నిలయే ॥

347. విమలా
ప విమలా శుద్ధ జ్ఞానరూపిణీ 
అ ప షోడశీమంత్ర స్వరూపిణి ॥ 
చ 1 
త్రిజగద్వందిత త్రివిలోచనీ 
శ్రీశివ హృదయాబ్జ భృంగిణీ 
కావ్యకళా సంగీత లోలినీ 
తకధిమి తకధిమి నాట్యవిలాసినీ ॥ 
చ 2 
జగన్మంగళకారిణీ వినీలసరస్వతి 
మాలతీకుసుమ మాలాలంకృత 
నిత్యకళ్యాణమూర్తి శ్రీశక్తీ 
మల్లికాకుసుమ గానశాంభవీ ॥

348. వంద్యా 
ప వంద్యా త్రిలోకవంద్యా 
అ.ప నీపద సరోజములే వందనీయములమ్మా ॥ 
చ 1 
లత్తుక రసముచే తడిసిమెరయుచున్న 
నీ అడుగుతామరకు వందనములమ్మా 
సమయాచారపరులైన భక్తులకు 
సిరిసంపదలనిచ్చు నీపాదపద్మములు ॥ 
చ 2 
నీకాలి స్పర్శను కోరేటి ఈశ్వరుడు 
ప్రమదోద్యానమున అశోకతరువుపై 
అసూయచెందునని వినియుంటినమ్మా 
ఆపదద్వయమునకు వందనములమ్మా ॥

349. వందారు జనవత్సలా 
ప వందారు జనవత్సలా 
అ.ప ప్రణత సౌభాగ్య జనని ॥ 
చ 1 
శ్రీమహావిష్ణువే నిన్ను ధ్యానించి 
చక్రరూపిణివైన నిన్ను పూజించి 
జగమును మోహించు రూపముపొంది 
త్రిపురసంహారునికే మోహమునుకలిగించే 
చ 2 
పరమశాంభవివైన నిన్ను అర్చించి 
సౌందర్యనిధియైన కామదేవుడు 
జితేంద్రియులైన మునిగణములకే 
మోహము రగిలించి లోకవిజితుడాయే ॥

350. వాగ్వాదినీ
ప వాగ్వాదినీ శాస్త్ర వేదినీ 
అ.ప మధుర గీతాలాపినీ
చ 1 
శివశంకరుని విజయగాధలు 
ఆనందముతోనీవుపాడగా 
వీణతంత్రుల నాదమువలనే 
సర్వలోకములు తన్మయతను చెందెను ॥ 
చ 2 
వాణి వీణా తంత్రులమీటుట 
సంతోషముతో మరచిపోవునట 
మల్లికాకుసుమగానము చేసి 
సమ్మోహితులను చేయుముతల్లీ

351. వామకేశీ
ప. నామకేశీ సుకేశినీ 
అ.ప వామకేశ్వరువామభాగినీ ॥ 
చ 1 
కుటిలకబరీభరీ 
సురుచిరబంభరవేణీ 
మల్లికాకుసుమ మాలికాగంధ 
పంకాంకిత నీలవేణీ ॥ 
చ 2 
వామమార్గ ప్రియకరీ నవయోగినీ 
వాగ్దేవతారాధితే వామక్షీ 
భ్రమరీగణ పరివృత ఝుంకారములే 
హ్రీంకారములై నిను పూజించును |

352 వహ్నిమండలవాసినీ 
ప వహ్నిమండలవాసినీ మాణిక్యసింహాసినీ 
అ.ప నిర్గుణరూపిణీ సంగీతయోగినీ। 
చ 1 
అగ్నిస్వరూపిణీ జ్వాలామాలినీ 
బ్రహ్మాండమండల వ్యాప్తికేశినీ 
సుమధురభాషిణీ శక్తిస్వరూపిణీ 
మహిషోన్మూలినీ పరశివరంజనీ ॥ 
చ 2 
త్రికోణగేహిణి సింహవాహినీ 
పూర్ణచంద్ర ప్రభా సదాచంచలలోచనీ 
నవయవ్వన సంపన్నా సౌభాగ్యజననీ 
మల్లికాకుసుమ సంగీతమోహినీ ॥

353. భక్తిమత్కల్పలతికా 
ప. భక్తిమత్కల్పలతికా ఇహపరసుఖదా 
అ.ప. యంత్రమంత్రకళాత్మికా మూలప్రకృతిసంజ్ఞకా|| 
చ 1 
జ్ఞానులను జిజ్ఞాసులను 
వ్యాధిపీడితుల అర్ధార్డులను 
సతతముబ్రోచే కల్పవల్లీ 
కొర్కెలుతీర్చేటి కరుణాలవల్లీ ॥ 
చ 2 
పంచీకృత మహభూత 
సూక్ష్మభూత స్వరూపిణీ 
సర్వజీవమయీ చిత్కళాత్మికా 
మల్లికాకుసుమ గానకళాత్మికా॥

354. పశుపాశ విమోచనీ 
ప పశుపాశ విమోచనీ నిత్య కామేశ్వరీ 
అ ప జగత్తారిణీ త్రాహిదుర్గే॥ 
చ 1 
సరస్వతీ మహాకాళీ అమోఘస్వరూపే 
చండికా చండ దుర్దండలీలా ప్రచండా 
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణా 
రుద్రాణి తారణీ కరాళీ భవగేహినీ ॥ 
చ 2 
గణేశ జననీమాతా గుహవంశవిలాసినీ 
మహేశ శక్తి విశ్వేశీ హిమపర్వత నందినీ 
హిరణ్యాక్షీ విరూపాక్షీ ధూమ్రాక్షి జననీ 
మల్లికాకుసుమ గానశుభాంగీ||

355. సంహృతాశేష పాషండా 
ప సంహృతాశేష పాషండా సత్యలోకపరిరక్షా. 
అ.ప వేదనాదాలంకృత సర్వవేదప్రశంసిత  
చ.1 వేదదూరులను వేదబాహ్యులను
శిక్షించే వేదవారిణి
నీతిబాహ్యులనుపాషండులను 
సంహరించేధర్మధారిణీ 
చ. 2. 
ధర్మశాస్త్రముల న్యాయ మీమాంసల 
జ్యోతిషశాస్త్రముల పురాణముల 
ఆగమాదిధర్మాది విధులను 
రక్షణచేసే వేద బ్రహ్మమయి 

356. సదాచారప్రవర్తికా 
ప. సదాచారప్రవర్తికా 
అ.ప. కౌశికీ పీఠవాసినీ
చ.1 
ఉమాశాకంబరీ శ్వేతవేదమాతా 
సావిత్రీ భగవతీ స్కంద మాతా 
భువనమోహినీ కృష్ణపింగళ 
ముండమాలా విభూషణా| 
చ.2 
వసుయుక్తా వసుప్రదా ఆనంద సంవర్ధిని  
దేవకీదేవ పూజితా సరోజస్థితా 
మల్లికాసుమ గాన రూపా ప్రవాళ ప్రభా 
దుర్గే శివే భీమనాధే పాహిశ్రీ లతే 

357. తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికా 
ప తాపత్రయాగ్ని సంతప్తసమాహ్లాదనచంద్రికా 
అ.ప జగత్ కళ్యాణ కారిణీ చల్లనితల్లీ ఆత్యేశ్వరీ 
చ.1 
ఆధ్యాత్మిక అది భౌతిక 
ఆదిదైవికా తాపములన్నీ 
భిన్నముచేసి సంతస మొసగే 
చంద్ర చంద్రికాడంబరమూర్తీ ॥ 
చ.2 
పాపములను కడతేర్చుము 
కోరికలను ఈడేర్చుము 
కరుణతో మమ్ము దరిచేర్చుము 
మల్లికాకుసుమ గాన దీపికా ॥

358. తరుణీ
ప తరుణీ నిత్య యౌవన సంపన్నా 
అ.ప షోడశవరీయా నిత్యానందస్వరూపిణి 
చ.1 
శృంగారరసపూర్ణా కనకమండలోపస్థితా 
కలాధరకుటుంబినీ అనలాత్మికా 
బ్రహ్మాండ భాండోధరి విశ్వరచనాతన్మయీ 
మహామోక్షధాత్రీ సమ్మోహయిత్రీ 
చ. 2 
హంస బ్రహ్మస్వరూపిణీ త్రిజగన్మోహినీ 
మరాళమందగమనీ రాజీవపత్రేక్షణా 
రాజాధిరాజేశ్వరి లోకత్రయా హ్లాదినీ 
మల్లికాకుసుమగీత స్వరమాధురీ ॥

359. తాపసారాధ్యా
ప తాపసాగాధ్యా తాపత్రయనివారిణి 
అ.ప సంసారబంధనా భేదనా చతురా 
చ.1 
పరమయాతన నివారణ యోగినీ మనోల్లాసిని
సకలమునిబృందారక సర్వబాధా ప్రశమనీ
చ.2 
అణిమ గరిమాది సిద్ధిదా యోగదా
లోచనత్రయభూషిత సర్వలోకపరిపాలిని
ఆర్యావర్త జనస్తుతా బ్రహ్మకైవల్యసాధనా
మల్లికాకుసుమగాన సాధనా॥

360. తనుమధ్యా
ప తనుమధ్యా తటిల్లతా 
అ.ప బిల్వేశ్వర కాంతా నీవాతీరనివాసినీ 
చ.1 
శ్రీ చక్రబిందుమధ్యమాశుభ సౌందర్య లక్షణా 
కాంచీ పురనివాసినీ కామాక్షీ కామకోటికా ॥ 
చ. 2 
సర్వసంపత్కరీదేవి అభినవసింధూరాభా
కపాలితోషిత మనాంసి లలితాపరమేశాని
వింధ్యావాసిని విమలరూపిణి
మల్లికాకుసుమ గానలక్షణా

361. తమోపహా
ప తమోపహా మహాజ్ఞాన ప్రకాశిని 
అ.ప అజ్ఞానాంధకార నిర్మూలినీ 
చ.1 
నీలీలలు తెలియతరమా కరుణాలవాలా ||
నీదయచూపించలేవా బ్రహ్మమయ ప్రకాశిని||
చ.2 
నిన్నుపొగడనాతరమా అనంతతేజోనిధీ 
చీకటినిండినమామనసులలో 
నిర్మలకాంతినినింపి సుఖమునీయవే
మల్లికాసుమగానచతురా ॥

362 చితిః
ప చిత్ స్వరూపిణీ బ్రహ్మానందబోధిని 
అ.ప జ్ఞానబిందు సంచయకారిణి ॥ 
చ.1 
చిత్తానంద ప్రసన్నాక్షి నయనానందిని 
ఆనందకందళిత హృదయారవింద I 
చ.2 
అజ్ఞాన తిమిరనాసిని
జ్ఞానానంద సంధాయిని
యోగానందా అమృతవర్షిణి 
మల్లికాకుసుమ గానానందిని ॥

363. తత్పద లక్ష్యార్థా 
ప. తత్పద లక్ష్యార్గా అప్పరోగణసేవితా 
అ.ప సర్వకామగుణావహా కలిబంధవిమోచనా ॥
చ.1 
జీవాత్మనీవే పరమాత్మనీవే 
విశ్వానికి మూలమైన పరబ్రహ్మనీవే 
తుష్టి నీవే పుష్టినీవే కరుణాత్మనీవే 
ధాత్రినీవే దీప్తినీవే వేదసంధాత్రి నీవే ॥
చ.2 
శక్తి నీవే, యుక్తినీవే పరాశక్తినీవే 
కాంతినీవే శాంతినీవే విశ్రాంతినీవె 
చిత్తాహంకార నిర్మూలినినీవే 
మల్లికాకుసుమగాన ప్రేరణనీవే ॥

364. చిదేకరస రూపిణీ
ప. శ్రీరాజరాజేశ్వరి చిదేకరస రూపిణి 
అ.ప కావగరావేకరుణామయి || 
చ.1 
నీఅడుగు తామరలు చిందించు పుప్పొడి 
అజ్ఞానము రూపుమాపి జ్ఞానకాంతివెలిగించును 
నీపాదపంకజము అందించేమకరందము 
అమృతఝరియై నాకవితలోన ప్రవహించును 
చ.2 
నీపదపారాణీ వేదనతో కృంగిపోవు పారాణి 
దరిద్రులకు కోర్కె తీర్చు చింతామణి
నీపాదధూళియే ఘోర సంసారార్ణవ తారకమౌ 
మల్లికాసుమగాన సుధారసము ॥

365. స్వాత్మానందల భూత బ్రహ్మాద్యానందసంతతిః 
ప. స్వాత్మానందలవీ భూత బ్రహ్మాద్యానందసంతతిః 
చ.1 
లోకములోని దేవతలందరు 
వరముద్రలను అభయముద్రలను 
పరగధరించి భక్తులబ్రోవగ 
నీమందహాసమే మాకుచాలుకదా ॥ 
చ.2 
నీభక్తుల భవభయములు తీర్చగ 
నీపాదయుగళేచాలునమ్మా 
వాంచాధిక ఫలము చేకూరునమ్మా 
మల్లికాకుసుమగాన వినోదా ॥

366. పరా
ప. పరాపరమయీ 
అ.ప పరాబ్రహ్మ వాగీశ్వరి ॥ 
చ.1 
పరాపరనాదమయీ పరాశక్తి వాఙ్మయీ 
భక్తలోక కల్పతానుపాయినీ సుభగా 
పరానందసంధాయిని హ్రీంకారనిలయినీ 
మణిమయమందిరభాసిత యోగినీ ॥ 
చ.2 
నిత్యసత్యపురాతనీ ముక్తినిలయిని 
బుధజన మానసహంసిని గిరాదేవీ 
శాశ్వతీ చిద్రూపిణి పరాత్పరీ 
మల్లికాకుసుమగాన పరమహంసినీ ॥

367. ప్రత్యక్చి తీరూపా 
ప ప్రత్యక్చతీరూప చారువిలాసినీ 
అ.ప. ఉపాసన ఫలప్రదా క్రమరూపానుపాయినీ 
చ.1 
కరుణా పాంగీ కాలరూపిణి 
కర్పూరలేపనా గానలోలుపా 
జ్ఞానధాతుమయీ చంద్రచూడా 
చిదానందమయి వాగేశ్వరీ ॥ 
చ.2. 
చిచ్చక్తి నిలయిని చిద్విలాసినీ 
చైతన్య రూపిణి జగదానందా 
మాయాశబల మంగళవిగ్రహ 
మల్లికాకుసుమ గానదాయిని ॥

368. పశ్యంతీ
ప. పశ్యంతీ కంబుకంఠి 
అ.ప. సర్వానవద్యా కావ్యలో ॥ 
చ1 
వాగ్రూపిణీ సర్వమాతా హరప్రియా 
లాస్యా దర్శనసంతుష్ఠా సకలోత్తమ సంస్తుతా 
సనకాది మునిధ్యేయా సర్వాంగసౌందర్యా 
శ్రీవిద్యాచక్రవేదినీ సుకవిత్వ ప్రదాయినీ ।। 
చ2 
మల్లికాసుమగాన రసాస్వాదనమయీ 
సంధ్యారుణచేలా లలితా మహేశీ ॥

369. పరదేవతా
ప. పరదేవతా వేద శాస్త్రమయీ 
అ.ప. హిమాంశుఖండమకుటా ॥ 
చ1 
అమ్లానపంకజ మాలాధరివారుణీ 
సారభూత చైతన్యరూప పావకతేజసా 
జ్వాలా వ్యాప్త దిగంతర విశ్వంభరా 
దేవీ భక్త జనోద్దామ సంసారార్ణవ తారిణీ | 
చ2 
మహాదేవీ మహాసురీ అజ్ఞాన తిమిర ధ్వంసిని 
విజ్ఞానదాయినీ గుణత్రయవిభావినీ 
ప్రత్యాధిదేవతా నిత్యేనిశుంభాపహే 
మల్లికాకుసుమ గానకలాపే ॥

370. మధ్యమా 
ప. మధ్యమా వాగ్దేవతా 
అ.ప. స్ఫుటతర నిఖిలావయవ మధ్యమా ॥ 
చ1 
అంతస్సంకల్పరూపా 
స్థూల సూక్ష్మ జ్ఞానరూపీ 
అక్షర సమామ్నాయసార గుళికా 
మల్లికాకుసుమ గాన మాతృకా ॥ 
చ2 
త్రిదశ వినుత చరిత్రా 
ముక్తా విరచితగాత్రా 
శ్యామల కంచుక విలసితా 
అనాహతాబ్జ నిలయినీ ||

371. వైఖరీరూపా 
ప. వైఖరీరూప వాగధీశ్వరీ 
అ.ప. స్వతంత్రరూపిణీ సరస్వతీ  
చ1 
కకారాది క్షకారాది వర్ణాక్షరరూపిణీ 
శివశక్తిమయీ శబ్దార్థ ప్రతిపాదకా 
వీణావదనలోలినీ పుస్తకపాణీ 
కర్పూరకుందప్రభా హంసవాహినీ ॥ 
చ2 
వేదవిజ్ఞానదీప్తికలిక ప్రవళికా 
సాహిత్య సంగీత ప్రేరణకారిణీ 
మందస్మితాంచితముఖీ వాచకరీ 
మల్లికాకునుమ సంకీర్తనా భాసురీ 

372. భక్తమానస హంసికా 
ప. భక్తమానస హంసికా ప్రణవాత్మికా 
అ.ప. అష్టవర్ణాత్మికా దుర్గాంబికా | 
చ1. 
మణిగృహాధీశ్వరీ పావకమయీ 
చంద్రావతంసినీ క్షోణీమయీ 
పరశివోత్సంగ తూగుపర్యంకా 
కుంకుమపరాగ శోణమదాలసా ॥ 
చ2. 
మందారవాటికావాసినీ 
దివ్యకుసుమగంధవిలేపిని 
యోగీజన మానస వికాసినీ 
మల్లికాకుసుమ గానశోభినీ ।।

373 కామేశ్వర ప్రాణ నాడీ
ప. కామేశ్వర ప్రాణనాడీ కల్యాణీ 
అ.ప. సౌభాగ్యజననీ జయమంగళా || 
చ1 
మణిమయతాటంకమండితకపోలా 
పానపరిభ్రాంతలోచనా సులోచనా 
జరామృత్యు భయహారిణీ 
మరకతసౌధ మనోజ్ఞసుందరీ|| 
చ2 
మూలప్రకృతి సంజ్ఞకా హరాంకవాసినీ 
కనకకిరీటధారినీ గౌరీ ప్రహసితముఖీ 
కామేశ్వరముభావలోకిని త్రిపుర 
మల్లికాకుసుమ గావవినోదిని।।

374 కృతజ్ఞా
ప. కృతజ్ఞా సప్తావరణ మనోజ్ఞా 
అ.ప. లలిత సుగుణ సుందర మూర్తి ॥ 
చ1 
పత్రపుష్పముల అర్చించువారికి 
ఫలముతోయములు అర్పించువారికి 
పసుపుకుంకుమల అర్చించువారికి 
పుణ్యఫలములను కలుగజేతువే తల్లీ ॥ 
చ2 
సర్వకర్మలకు సాక్షీభూతవు 
సకలలోకముల నేలెడు నేతవు  
భక్తుల చల్లగ చూచేమాతవు 
మల్లికాసుమగాన శ్రోతాగిరిసుతా ॥

375. కామపూజితా
ప. కామపూజితా కామేశ్వరాలింగితా 
అ.ప. కామగిరిపీఠవాసిని కామసంజ్ఞకా ॥ 
చ1 
బ్రహ్మత్మశక్తి సహితా 
సర్వసిద్ధి ప్రదాయకా 
ఆధారచక్రనిలయా 
అరుణా కరుణాకరీ ॥ 
చ2 
అనంగపూజితా త్రికోణసంస్థితా 
పంచాకృత్య పరాయణప్రియ 
కామేశ్వరగృహేశ్వరీ 
మల్లికాకుసుమ గానశోభినీ ॥

376. శృంగారరససంపూర్ణా 
ప. శృంగార రసపూర్ణా నవరస సంపూర్ణా 
అ.ప ఆనందఘనరూపిణి పూర్ణగిరిపీఠ వాసిని ॥ 
చ.1 
విశ్వాత్మశక్తి మహాలక్ష్మి మోహినీ 
లోకైక దీపాంకురీ త్రైలోక్యకుటుంబినీ II 
చ.2 
శ్రీచక్రపురవాసిని అవినాశిని 
వృక్షలతాకుసుమగంధ 
పరిపూరిత వన సదయా
మల్లికాసుమగాన వలయా శ్రీనిలయా ॥

377. జయా
ప. జయాజయాహారతి త్రిపురాంబాజయజయా 
అ.ప. మంగళహారతి గైకొనవే జయమాతా ॥ 
చ.1 
మూడులోకాలకు మూలమునీవే 
సౌభాగ్యములిచ్చే జయగౌరివినీవే 
సకల శుభములొసగే జయలక్ష్మి వినీవే 
నీస్మరణేమాకుతరుణోపాయము || 
చ.2 
హిమవంతుని పట్టీ పరమేశుని చేపట్టి 
జగములన్ని కరుణతో పాలించేజయదుర్గ 
సంగీత సాహిత్య చతురాననా 
మల్లికాసుమగాన పరిమళాఘనా ॥

378. జాలంధరస్థితా 
ప. జాలంధరస్థితా ఆధారచక్రనిలయా 
అ.ప జాలంధర పీఠవాసి ఆర్యా జయవిష్ణుముఖి॥ 
చ.1 
తరుణార్కబింబరుచిరా అగ్నిప్రభ వాగ్బీజా 
ఇంద్రగోపకనిభా భక్తహృదయ సంస్థితా 
చ.2 
హేమప్రభా భాసురా 
రుద్రాత్మక శక్తి గౌరి 
యోగిజనబృందపూజితా
మల్లికాసుమగానవిజిత॥

379. ఓఢ్యాణపీఠ నిలయా
ప. ఓఢ్యాణ పీఠనిలయా 
అ.ప రక్తవర్ణిణి అంబికా || 
చ.1 
రూపాతీతా రక్తనయనా రక్తదంతచ్చదా 
రక్తమాల్యాంబరధారిణీ గిరిజాగిరినందిని ॥ 
చ. 2 
ఆనంద మందహాస అలౌకికతేజోమయ 
కుంకుమ కస్తూరీ తిలక సౌభాగ్యదివ్యప్రభ 
కమలదళ సమసుందర దివ్యనేత్ర చంచలిత 
మల్లికాకుసుమగాన సమ్మోహితశ్రీ మాత |

380. బిందుమండలవాసినీ 
ప. బిందుమండలవాసినీ శ్రీ మాతా 
అ.ప సర్వానందసుధామయీ శ్రీ రాజరాజేశ్వరీ ॥ 
చ.1 
ముక్తారత్న విచిత్ర కాంతి కలితా 
కేయూరాంగద బాహుదండవలయా 
హస్తాంగుళీ భూషణా చంద్రవదనా 
అమృతకళాధరీ రాజ మాతంగేశ్వరీ ॥ 
చ.2 
కందర్పదర్పుని మానసోల్లాసినీ 
అష్టాదశ పీఠవాసి శ్రీచక్రేశ్వరీ 
సుందరమై సుస్వరమై మధురమనోహరమైన 
నవమల్లికా కుసుమ సంగీతాలాపినీ ॥

381. రహోయాగ క్రమారాధ్యా 
ప. రహోయాగక్రమారాధ్యా కుండలినీ కులయోగినీ 
అ.ప. శ్రీ చక్రపూజితా యోగినీపరివేష్టితా || 
చ.1 
మనసునందు నిన్నుతలచి 
వాక్కుతోనిను కీర్తించి 
కర్మణానిను పూజచేసి 
ముక్తినొందెదమే || 
చ.2 
ప్రతిఫలాపేక్ష కోరనివారమై 
బాహ్యపూజలను అతి భక్తితోచేసి 
అంతరారాధనా సహితమతులమై  
నిన్ను చేరెదమే మోక్షదాయిని ॥

382. రహస్తర్పణతర్పితా 
ప. రహస్తర్పణతర్పితా 
అ.ప శ్రీ విద్యా పరదేవతా || 
చ.1 
అణువణువులోన నీరూపమేనిండి 
ప్రతిజీవిపైన నీచూపులేనిలిచి 
పాపకర్మములన్ని జ్ఞానాగ్నిలోనుండి 
మాకోర్కెలీడేరు మాజీవితముపండి | 
చ.2 
మాపుణ్యపాపాలు ధర్మా ధర్మాలు 
నేచేయుకర్మలు అన్ని నీకే నమ్మ 
మాజన్మబంధాలు సడలించవమ్మా 
మల్లికాసుమగాన ప్రాణమేనీవమ్మ ॥

383. సద్యః ప్రసాదినీ
ప. సద్యః ప్రసాదినీ అమృతవర్షిణీ 
చ.1 
పరమేశుని రూపముతో జీవాత్మనీవే 
పరమేష్టిరూపముతో పరమాత్మనీవే 
జీవాత్మపరమాత్మ సంధానమేచేసి 
అమృతమునుకురిపించె ఆనందవర్షిణి ॥ 
చ.2 
కన్నులకేకనుపించని నీరూపము 
హృదయమందున జ్యోతియై నిండియుండునే 
అనిర్వచనీయమైన బ్రహ్మానందము 
మల్లికాసుమగాన దివ్యానుభూతి ॥

384. విశ్వసాక్షిణీ
ప. విశ్వసాక్షిణీ విశ్వమోహినీ 
అ.ప వాచామగోచరీ ఆశ్రితపాలనకరీ ॥ 
చ.1 
పంచభూతములే నీవదనములు 
సూర్యచంద్రులే నీదివ్యచక్షులు 
సకలదేవతలు నీఅనుయాయులు 
విశ్వకర్మణి విశ్వవిలాసిని ॥ 
చ.2 
విశ్వధర్మపోషిణి విశ్వంభరా 
విశ్వనాధునిరాణి శ్రీ విశాలాక్షి 
సర్వలోక పరిరక్షా దాక్షాయణిమాతే 
మల్లికాకుసుమగాన నవలతాలలితే ॥

385. సాక్షివర్జితా 
ప. సాక్షివర్జితా శంకరనాయికా 
అ.ప నీతోసమానమెవరమ్మా 
చ.1 
నీ అండకోరితిమి గుండెలోనిలిపితిమి 
తోడునీడగనిలచి ఆపదలనెడబాపు 
మాపాలిదైవమా మామనవి ఆలించు 
నీవుబ్రోవకయున్న ఇంకెవరు బ్రోచెదరే 
చ.2 
సాధు సజ్జనశీల సుగుణాలవాలా 
అఖిలవిశ్వవ్యాప్త విశ్వవిఖ్యాతా 
హ్రీంకారాసని నిర్మలహృదయంగమా 
మల్లికాసుమగాన మకరందమధుపమా ॥

386. షడంగదేవతాయుక్తా 
ప. షడంగదేవతాయుక్తా శ్రీలలితాపరమేశ్వరీ 
అ.ప శృతిస్వరూపిణి వేదవేదాంగమయీ ॥ 
చ.1 
హృదయదేవీ శిరోదేవీ 
శిఖాదేవి కవచదేవి 
నేత్రదేవి అస్త్రదేవి 
షడంగదేవతా పరివేష్టితా 
చ.2 
శిక్షాకల్పాది అంగదేవతా 
పరివారదేవతా నిత్యాదేవతా 
ఆవరణదేవతా పరిపూజితా 
మల్లికాసుమగాన సంసేవితా ॥ I

387. షాడ్గుణ్యపరిపూరితా 
ప. షాడ్గుణ్య పరిపూరితా శ్రీమాతా 
అ.ప మల్లికాసుమగాన సంసేవితా ॥ 
చ.1 
ఐశ్వర్యమును వీరత్వమును 
యశోసంపదను భాగ్యమును 
జ్ఞాన వైరాగ్యాది సద్గుణములను 
భక్తులకొసగే సద్గుణచరితా ॥ 
చ.2 
కామక్రోధమను శత్రువులనణచి 
తామసాదులను దూరముచేసి 
దుష్టరాక్షస గణములత్రుంచి 
సుజనులబ్రోచే సర్వవశంకరి ॥

388. నిత్యక్లిన్నా 
ప. నిత్యక్లిన్నా కరుణానిధి 
అ.ప ముక్తిదాయినీ త్రిపురాదేవీ !! 
చ.1 
కోటి సూర్యప్రభల వెలిగేటి తల్లి 
దివ్యతేజోమయి ప్రభావతీ 
మూలప్రకృతిరూప జ్ఞానస్వరూప 
షోడశదళ నివాసిని నిత్యషోడశీ ॥ 
చ.2 
బృందారకపరివేష్టిత 
సుందర దరహాసిని 
సుజ్ఞాన ప్రతిభా పాండిత్యమీయవే 
మల్లికాసుమగాన సంతోషిణీ ॥

389. నిరుపమా
ప. నిరుపమా గంగాధరాలింగితా 
అ. ప నిరుపమవైభవ ప్రమోదాన్వితా 
చ.1 
కస్తూరికాచర్చితా కామ్యప్రదాన వ్రతా 
వేదాంతాగమ వేద వేద్య చరితా 
మంజీరమేఖలా దామభూషితా 
దివ్యమంగళకర వీక్షణా 
చ.2 
త్రైలోక్యసుమోహన తనుప్రభా 
నియతాచారా నిశ్చలాత్మికా 
వీణానాద నిమీలితార్ధనయనా 
మల్లికాకుసుమగాన ప్రియానిర్మలా॥ 

390. నిర్వాణసుఖదాయినీ
ప. నిర్వాణసుఖదాయినీ మనోన్మణి 
అ.ప. కర్మఫలప్రదాయినీ పరమశాంభవి ॥ 
చ.1
వరశైల రాజసుతా ఘంటస్వన మోహితా 
తుర్యాలయాశ్రితా వేదగానస్థితా 
సర్వశాస్త్రపారగా వేదాంత స్వరూపా 
ఆనందసుఖదామామకాభీష్టదా ।। 
చ. 2 
పూర్ణచంద్రవదనా దివ్యమంగళరూపా 
విలాసహాస చతురా శివానందభరితా 
శీతాంశు శోభితా మోక్షదాన నిపుణా 
మల్లికాసుమగానానంద వలయా ॥

391. నిత్యాషోడశికారూపా
ప. నిత్యాషోడశికారూపా 
అ.ప మహాదేవీ మహాత్రిపురసుందరీ ॥ 
చ.1 
కామేశ్వరీ భగమాలినీ నిత్యక్లిన్నభేరుండ 
వహ్నివాసిని మహావజ్రేశ్వరి 
శివదూతీ త్వరితా `కులసుందరీ 
నిత్యనీలపతాక విజయ సర్వమంగళ 
చ.2 
జ్వాలామాలినీ చిత్ర మహానిత్య 
షోడశకళలతో విరాజిల్లు శ్రీలలితా 
షోడశకళారూపిణి శివశక్తీ 
పరమాత్మస్వరూపిణి పరమేశ్వరీ ||

392. శ్రీకంఠార్గశరీరిణీ 
ప. శ్రీకంఠార్థ శరీరిణీ కళ్యాణీ 
అ.ప పతివ్రతాశిరోమణీ పతిసేవా పరాయణీ ॥ 
చ.1 
అనురాగముతో శివుని మెప్పించి 
అర్ధశరీరము పొందితివి 
సతీమతల్లీ ఉమామహేశ్వరీ 
మహితానురాగభరితా సుజనహిత ॥ 
చ.2 
నీకృపకలుగుచో సకలార్ధములు కలుగు 
నీదయపొందినచో వ్యామోహములు తొలగు 
ధర్మము తప్పని జీవనమునీయవే 
మల్లికాసుమగాన ఆనందభరితా ॥

393. ప్రభావతీ
ప. ప్రభావతీ తేజోమయీ 
అ.ప జ్యోతిష్మతీ జ్యోతిర్మయీ 
చ.1 
ఎంతచక్కనిదమ్మ నీరూపము 
ఎంతమహిమాన్వితము నీనామము 
కోటి చంద్రులకాంతి వేలసూర్యులభ్రాంతి 
దివ్యసముజ్వల లలితాకృతి ॥ 
చ.2 
నవరత్న ఖచితకనక నిర్మితోజ్వలిత కలిత 
భువనసృజనావలంబ మదంబా త్రిపురాంబా॥

394. ప్రభారూపా
ప. ప్రభారూపా కాంతిమయీ 
అ.ప పరమేశ్వర మనోమయీ । 
చ.1 
కోటిసూర్య ప్రకాశినీ చంద్రకోటిశీతలా 
విద్యుత్కోటి సమానాభా అరుణారుణకాంతిప్రభా॥ 
చ.2 
అసమాన తేజసా ఘనతరసౌందర్య 
మహోన్నతపూత పర్వేందువదన 
దివ్యమహిమోజ్వల కళ్యాణనిలయ 
మల్లికాసుమగాన కాంతి స్వరూపా |

395. ప్రసిద్ధా
ప. ప్రసిద్దా సుప్రసిద్దా 
అ.ప. సర్వచైతన్యరూపిణి || 
చ.1 
నిత్యనూతనమయీ అనాదినిధనా 
సద్గుణవయ్యును నిర్గుణమూర్తి 
పరమకృపాకరీ వాత్సల్య నిధీ 
నిత్యసత్యచరిత్ర జయసర్వాత్మా 
చ.2 
ఈజగమంతయు నీసంతానమే 
విశ్వమంతయు నీవే అన్నిటనునీవే 
నాగానములోజీవమునీవే 
మల్లికాసుమగాన జీవనహేలా ॥ 

396. పరమేశ్వరీ
ప. పరమేశ్వరీ శివకామేశ్వరీ 
అ.ప కరుణాఝరీ సృష్టిపాలనకరీ ॥ 
చ.1 
శోభన కరీ మధురబింబాధరీ 
మందస్మితాలో కసిద్ధేశ్వరీ 
పావనకరీ రాజరాజేశ్వరీ 
సంగీతసాహిత్య చిన్మంజరీ 
చ.2 
శ్రీ భ్రామరీ భువనక్షేమంకరీ 
పరమశివోల్లాస హాసాంకురీ 
స్మితచాతురీ మధ్యమావైఖరీ 
మల్లికాసుమగాన శోభాకరీ ॥ 

397. మూలప్రకృతిః 
ప. మూలప్రకృతి వేదమాత 
అ.ప జగన్మాత సరస్వతీ 
చ. 1
విద్యాదాయిని వీణాపాణీ 
సురుచిరఘనవేణీ కళ్యాణీ 
సృష్టిస్థితిలయకారిణీ 
పంచకృత్య పరాయణీ ॥ 
చ.2 
దుర్గవునీవే లక్ష్మివినీవే 
సర్వసంపత్విధాయినివే 
పుత్రపౌత్రాది వృద్ధి ప్రదాయిని 
మల్లికాకుసుమ గాన ప్రదాత్రి

398. అవ్యక్తా
ప. అవ్యక్తా ఆద్యంతరహితా 
అ.ప విశ్వవ్యాప్త మహామాయ ॥ 
చ.1 
జగద్రావస్థలో సుషుప్తిలో 
సాక్షీభూతా సర్వజగన్మయీ 
క్షుత్పిపాసా దయామూర్తీ 
నిత్యనిరంతర కృపాంబు రాశి ॥ 
చ. 2 
నీవె చరాచర జీవకోటికి 
నిత్యముహర్షమునిచ్చుదాతవు 
కన్నులతోనినుకాంచగలేము 
మల్లికాకుసుమగాన నిలయినీ ॥

399. వ్యక్తావ్యక్తస్వరూపిణి 
ప. వ్యక్తావ్యక్తస్వరూపిణీ 
అ.ప దేవీ అవాఙ్మానస గోచరీ ॥ 
చ..1 
సర్వజనవందిత పాదపద్మా 
సత్సంప్రదాయాన్వితా 
విదితాఖిల శాస్త్రసారా 
వాచామగోచరాదీనజనా 
చ.2 
సర్వకామదమైన నీచరితము 
వర్ణించ ఆ కమలవిభునికైనను తరమా 
నవమల్లికాకుసుమ గానపరమానంద 
దివ్యచరితోన్నతీ జగదంబికా ॥

400. వ్యాపినీ 
ప సర్వవ్యాపినీ ఈశ్వరీ 
అ.ప ఉమామహేశుని సంకల్పశక్తి ॥ 
చ.1 
శాంత్యతీత కలాత్మికా నిధి 
హ్రీం, శ్రీం, మూలబీజాశక్తి 
శక్తిజ్ఞాన క్రియా త్రిగుణాత్మిక 
నిత్యనిర్మలా శుద్ధస్వరూపిణీ || 
చ.2 
నీవే స్వాహవు నీవేస్వధవు 
నీవే నీవే సర్వాత్మికవు 
స్వరరాగసుధాసంపదవు 
మల్లికాసుమగాన మూలకారిణీ ॥

401. వివిధాకారా
ప. వివిధాకారా శ్రీ కరా 
అ. ప. సమ్మోహనాకర హ్రీంకారా|| 
చ1 
అఖిల లోకాధార దివ్య మంగళరూప 
సర్వ సురార్చితపాదుకా ప్రాజ్ఞా 
నిరతము మమ్ములను రక్షింప రావే 
లక్ష్మీ సరస్వతి శివంకరీ ॥ 
చ2 
సర్వ శుభంకరి శ్రీధరీ 
నీచరణములు ఏమరకుందుము 
పుత్రపౌత్రాది వృద్ధిప్రదాత్రి 
మల్లికాసుమగాన విధాత్రి ॥

402. విద్యావిద్యా స్వరూపిణీ 
ప. విద్యావిద్యాస్వరూపిణీ కల్యాణగుణనీరధి 
అ. ప. జ్ఞాన ప్రకాశినీ అజ్ఞానాంధకార నాశినీ ॥ 
చ1 
సర్వశక్తి సమాయుక్త 
భువన సుందరీ ఆనందరూప 
అభీష్ట వరదానహస్తా 
ఇందుధరోరువాసిని ॥
చ2 
వందన చందన పూజనావిధుల 
పూజింతుము సతతము నిన్ను 
వేదనాదాలంకృత వాణి 
మల్లికాకుసుమ సంగీత పాణి ॥

403. మహాకామేశనయన కుముదాహ్లాదకౌముదీ 
ప. మహాకామేశుని కలువ కనులకు 
మోదముకలిగించు కౌముదీ కామేశ్వరీ 
చ1 
కాదంబ కాంతార వాసప్రియా 
తాటంకభూషా విశేషాన్వితా 
బాల కురంగలోల నయనా 
శమనాంతక హృదయాంబుజా ॥ 
చ2 
చారు వీణాధరీ పక్వబింబాధరీ 
శివానంద పీయూష రత్నాకరీ 
దివ్యరత్నాంబరీ చంద్రికా శీతలా 
మల్లికాసుమగాన శుభమంగళా||

404. భక్తహార్దతమోభేదభానుమథ్భానుసంతతిః 
ప. భక్తహార్ణతమోభేదభానుమథ్భానుసంతతీ 
అ.ప. వంద్యమాన పదాంబుజా || 
చ1 
అజ్ఞానపు చీకటులను తొలగించవే 
విజ్ఞానపుజ్యోతులను వెలిగించవే 
ఈ పాదదాసిని నీ పాదదాసిని 
కరుణాపాంగి కరుణించవే ॥ 
చ2 
విమలజ్ఞానదీప నిశ్చలహృదయా 
భ్రాంతి కాంత్యాదిరూపిణి 
రాగార్ణవ తారిణీ శుభకామినీ 
మల్లికా సుమగాన ప్రియంకరీ II

405. శివదూతీ
ప. శివవల్లభా శివదూతీ,
అ.ప సర్వవశంకరీ శివంకరీ |
చ.1
వరగర్వితులైన శుంభనిశుంభుల
సంహరించగా శివుని దూతగ పంపి
కాళిరూపివై కౌశికివై
దుష్ట రాక్షసుల సంహరించితివి ॥
చ.2.
కుజనుల మదమణచి సుజనులబ్రోచిన
నీగుణములుపొగడ నాతరమా
పుష్కలక్షేత్రనివాసిని శాంకరీ
మల్లికాకుసుమ గాన జగదంబికా ॥

406. శివారాధ్యా
ప. శివారాధ్యా శివానీ
అ.ప శివారాధనా తత్పరా ॥
చ.1
పరమేశ్వరుడు నినుపూజించి
సర్వసిద్ధులకు ప్రభువైనాడు
నిత్యధ్యానముతో నిను ఆరాధించి
సర్వేశుడై పూజితుడైనాడు ॥
చ.2
లోకాధినాధ గృహిణీ
కేదారనాధుని అర్ధనారీ
శివహృదయార్ణవ రాజహంసీ
మల్లికాసుమగాన సౌందర్యరాశీ ॥

407 శివమూర్తిః
ప. శివమూర్తీ మంగళమూర్తీ
అ.ప దానంద ఘన సదాశివమూర్తీ
చ.1
త్రికోణరూపిణీ శక్తీ
బిందురూప పరశివశక్తీ
నీవే శివుడు శివుడేనీవు
శివశక్తులకు బేధములేదు ॥
చ. 2
పరశివమూర్తివి శివకరీ
సకలశుభకరి శాంకరీ
మంగళప్రదా మంగళగౌరీ
మల్లికాసుమగాన మహేశ్వరీ ॥

408. శివంకరీ
ప. శివంకరీ.... శివశంకరీ
అ.ప సర్వలోక వశంకరీ మధుకరి ॥
చ.1
నీశుభనామ మే నిత్యస్మరణము
నీగుణగానమే సంకటహరణము
నీరూపమే భువనమోహనము
నీపదయుగళమే మాకు శరణము ॥
చ. 2.
పరులనుతింపను నినుమదిమరువను
విన్నపంబు నే విన్నవింతును
నీపదాంబుజము సదాభజింతును
జాలమేలనే హరవిలాసిని ॥

409. శివప్రియా
ప. 
శివప్రియా భక్తజనప్రియా 
అ.ప 
ఇందుకళాధరి అపారకృపానిధీ ॥ 
చ.1 
నీతోడు లేక ఆపరమేశుడు 
ఈజగములను సృష్టింపలేడు 
హరివిధాతలు ఆరాధించే 
నినుపుణ్యాత్ములే పూజించగలరు 
చ.2 
శివుని వలచి తపసును చేసి 
మల్లెల మొల్లల పూజలుచేసి 
మల్లికాకుసుమ గానముచేసి 
పతిగా పొందిన భాగ్యరాశి |

410. శివపరా
ప 
శివపరా శీతనగేంద్ర కుమారి 
అ.ప 
పతివ్రతాంగనా సౌభాగ్యదాయిని ॥ 
చ.1 
నిన్నుకొలువక పురుషార్ధములను 
పొందజాలమే పావనమూర్తి 
నీచరణములు ఏమరకుందుము 
మముమరువకు కమలా మనోహరి ॥ 
చ.2 
మోహనవీక్షణ శివభామినీ 
మరాళవరయాన విరిబోణీ 
సోమశేఖరుని అర్ధశరీరిణీ 
మల్లికాకుసుమ గానసుఖదా॥

411. శిష్టేష్టా
ప 
శిష్టేష్టా సదా చార ప్రియా 
అ.ప 
దివ్య వైభవ కీర్తి భవ్యమూర్తీ ॥ 
చ.1 
కుసుమదామముల పూజచేసెదము 
చందనగంధపు పూతపూసెదము 
నీకు ప్రియమైన విహితకర్మలు 
ఆనందముతో అర్పించెదము ॥ 
చ.2 
సరససాహిత్య భావార్ధ కల్పనల 
మల్లికాకుసుమ గానకీర్తనల 
వీనులవిందుగ కీర్తించెదము 
నిను సేవించెడి వరమునీయవే ॥

412. శిష్ట పూజితా
ప 
కటాక్షమోక్షా శిష్టపూజితా 
అ.ప 
శంకరసహితా భువనైకమోహనా 
చ.1 
ఈజగమంతయు నీసంతానమే 
నీచిద్విలాసమే మాబ్రతుకంతా 
మాఇలవేల్పుగా మావెంటనుండి 
కాపాడగదే శుభకల్పవల్లీ II 
చ.2 
కుజనులనణచే వనదుర్గవు నీవు 
సుజనులపాలిటి చింతామణివి 
పరమకృపానిధి గౌరీమనోహరి 
మల్లికాకుసుమ గాన విభావరి ॥

413. అప్రమేయా 
ప 
అప్రమేయా అగణిత గుణగణా 
అ.ప 
అభినవ సిందూరాభా భైరవీ ॥ 
చ.1 
వీరరసవిలాసిని శ్రీమన్మహాదేవీ 
శివదేవు దేవేరి శ్రీశాంభవీ 
పదునాల్గు భువనాలు పాలించిలాలించు 
ఏకైకమాత ఈశ్వరతోషిణి 
చ. 2 
కామరాజ మనోమోదదాయిని 
పృధ్వీధరాత్మజాత శ్రీ మాతా 
నిత్య సంతోషికా బాల నిర్మలాంగీ 
మల్లికాకుసుమగాన రాజరాజేశ్వరి ॥

414. స్వప్రకాశా
ప 
స్వప్రకాశా అఖండజ్ఞాన స్వరూపిణీ 
అ.ప 
నతజనసులభా దిఙ్మయీ 
చ.1 
కోటి రవికిరణ తేజము 
వేయిచంద్రుల చల్లదనము 
కన్నులందున కరుణారసము 
కృపాలవాలా శ్రితజనలోలా II 
చ.2 
ఘనాఘన వినోద 
కరపాణి శీతమయూఖ శేఖరుని రాణీ 
కమలాపాణీ జయకళ్యాణీ 
మల్లికాకుసుమ గానతోషిణీ II

415. మనోవాచామగోచరా
ప 
మనవాచామగోచరా బలాత్రిపురసుందరీ 
అ.ప 
కళ్యాణి కలవాణి కంబుకంఠి ॥ 
చ.1 
మనసున నిలబడవుకన్నులకు కనబడవు 
వాక్కులకు అందవునిన్నెట్లు గుర్తింతు ॥ 
చ.2 
పత్రపుష్పములు ఫలములు జలములు 
అన్నియును నీసృష్టి చిత్రములే 
నినుకొలువ నాచెంత ఏమున్నదే తల్లీ 
మల్లికాసుమగాన సంకీర్తనా లోలా ॥

416. చిచ్చక్తిః
ప 
చిచ్చక్తి శివరూపి చైతన్యరూపి 
అ.ప సర్వశక్తి సమాయుక్త శివా చిన్మయి ॥ 
చ.1 
అనంతశీర్షా అనంతనయనా 
అనంతచరణా అనంతశక్తి యుత 
భక్తార్తిభంజని ప్రసాదముఖి 
చంద్రఖండ శీర్షిక సర్వజ్ఞ 
చ.2 
అఖిల చిత్రిత భువనోద్భవ మూర్తి 
ప్రళయనివారిణి ప్రాణదాయిని 
శిరము నేలను సోక శరణంటిమి 
మల్లికాకుసుమగాన చిన్మయీ ॥

417. చేతనారూపా 
ప 
చేతనారూపా సృష్టివిధాత్రీ 
అ.ప 
శ్రీమన్మహా చిత్కలా ధృవకళా 
చ.1 
జాగ్రత్ స్వప్న సుషుప్తులందు 
వ్యాపించిన చైతన్య రూపా 
పరాత్పరప్రేమక సృష్టివిలాసిని 
క్షుత్పిపాసా దయారూపిణి 
చ.2 
మోహ తమస్సులు దూరముచేసే 
సకలసురార్చిత భువనేశ్వరీ 
నిత్య సద్గుణ సముదాయమూర్తి 
మల్లికాకుసుమ గానచిత్కలా ||

418. జడశక్తిః
ప. 
జడశక్తీ నిర్వికల్ప నిర్మల శక్తి 
అ.ఫ 
సర్వసృష్టి ప్రేరక బ్రహ్మశక్తి 
చ.1 
ప్రకృతినీవే వికృతినీవే 
జడమునీవే చేతనమునీవే 
సర్వజగతికీ కారణమునీవే 
లయమందించే మోక్షకారిణీ | 
చ.2 
నారదాదిముని స్తుత 
నిష్కలరూప అపరాజిత 
చిదైకరూపానిరామయా 
మల్లికాకుసుమగాననిర్మలా ॥

419. జడాత్మికా
ప. 
జడాత్మికా నామరూపాత్మికా 
అ.ప 
విశ్వసృష్టి విధాయినీ సృష్టి పాలన తత్పరీ॥ 
చ.1 
శరణాగత పరిపాలినీ 
శివమానస మోహినీ 
తరుణారుణ శుభకిరణా 
చూపుము మాపై కరుణా|| 
చ.2 
బ్రహ్మాది పిపీలి కాంతజననీ 
సకలలోక సమ్మోహినీ 
కాత్యాయనీ ఆనందసంధాయినీ 
మల్లికాకుసుమగానానందినీ ॥

420. గాయత్రీ
ప. 
గాయత్రీ సర్వలోకహిత 
అ ప. 
తేజస్వరూపిణి సావిత్రీ ॥ 
చ.1 
ఇరువదినాలుగు అక్షరములతో 
వాక్కురూపమున వేదములందున 
ప్రకాశించు ఛందోరూపిణి 
కాచిరక్షించు త్రిపదా గాయత్రి ॥ 
చ.2 
ముక్తావిద్రుమ హేమనీల ధవళాంగీ 
తత్వార్ధ వర్ణాత్మికా వరదా భయకరీ 
గౌతమ దూర్వాసాది మునిజన వందిత 
మల్లికాసుమగాన మహిమోపేతా ॥

421. వ్యాహృతిః 
ప 
వ్యాహృతీ బ్రహ్మోపాసనా రూపిణి 
అప 
అతి మహిమోపేత వేద మాతా ॥ 
చ1 
దేవదృష్టి వేదదృష్టి ప్రాణదృష్టి తో 
యోగి పుంగవులు ఉపాసింతురే 
ఓంకారనాదలంకృత శ్రీలలితాదా 
సామ్యావసాత్మికా మాతా సకలార్ధదా ॥ 
చ2 
సకలవేద బ్రాహ్మణసన్నుతా 
బ్రహ్మాణీ వేద జననీ మంత్రశోభినీ 
సూర్య మండల నివసినీ సవిత్రీ 
మల్లికాకుసుమ గాన గాయత్రీ ॥

422. సంధ్య
ప 
సంధ్యా భవసంహారిణి 
అప 
అరుణారుణ రాగ రంజనీ నిరంజనీ ॥ 
చ1 
శక్తిత్రయా మూలరూపిణీ గాన లోలినీ 
శక్తి కూటైకధారిణీ సుహాసినీ 
ఆజ్ఞా చక్రస్థాన నిలయినీ పద్మినీ 
సూర్యదేవుని చైతన్య శక్తి !! 
చ2 
సంధ్యావందన కాలరూపిణీ 
వేదబ్రాహ్మణ రక్షానుకారిణి 
తుర్యాతీత స్వరూపా సంధ్యా 
మల్లికాసుమ గాన పరాత్పరీ ॥

423. ద్విజబృంద నిషేవితా 
ప 
ద్విజబృంద నిషేవితా 
అప 
దేవ బ్రాహ్మణ పూజిత | 
చ1 
త్రికాలములలో పరిపరి విధముల 
ద్విజులచేత పూజలందే సంధ్య 
ఉపనయనాది క్రతువులందున 
పూజలందుకునే గాయత్రీ ॥ 
చ2 
భక్తితో వందనములు అర్పించెదము 
శక్తికొలది నిన్నుపూజించెదము 
భక్తదయామృత వర్షిణీ 
మల్లికాకుసుమ గాన వర్షిణీ II

424 తత్వాసనా
ప 
తత్వాసనా బ్రహ్మమయీ 
అ ప 
సర్వ తత్వ విచార జ్ఞానమయీ ॥ 
చ1 
ఆశ్రిత భక్తపాలనకరీ 
మేరుశృంగనిలయా శ్రీమహేశ్వరీ 
శ్రీమత్సింహావరాసనేశ్వరీ 
బ్రహ్మనంద నిలయా బ్రాహ్మణీ || 
చ2 
అష్టమహాభుజ దివ్యనేత్రత్రయా 
ప్రణవమంత్రసంకలిత బ్రహ్మాసనీ 
జపయజ్ఞ తపోధన జ్ఞాన బోధినీ 
మల్లికాకుసుమ గాన భాస్వరీ II

425. తత్
వ 
సకల జీవులయందు బుధ్ధిరూపిణి 
అప 
శూలధ్యాయుధ ధారిణీ గుణమణ 
చ1 
హిమగిరినందిని బ్రమరాంబికా 
అంజలిదే గైకొనుమా 
ఆనందరూపా భువనసుందరీ 
ప్రణతులివేనమ్మ ||
చ2 
మార్తాండనిలయా మాంగల్యదాయినీ 
అభినుతులు అందుకొనుమా 
మల్లికాసుమగాన పరమానంద 
శతకోటి వందనములు ॥

426.త్వం
ప 
సకలకళా కామేశ్వరీ తుభ్యంనమః 
అ ప 
మధుకైటభాది దళనీ తుభ్యం నమః ॥ 
చ1
 కౌశికీనామధేయ నవనీత పాటలాయ 
కువలయ సదృక్షనయన తుభ్యం నమః 
త్రిపురాది చక్రేశ్వరీ కామేశుని అర్ధాంగి 
కారుణ్యవారానిధి తుభ్యం నమః ॥ 
చ2 
వందారు జనవత్సల శివానంద మహేశ్వరి 
శ్రీరాజరాజేశ్వరి తుభ్యం నమః 
ఆనంద సిద్ధేశ్వరి సంగీత రసాహ్లాదినీ 
మల్లికాసుమమోహినీ తుభ్యం నమః

427 అయీ 
ప. జగజ్జననీ
అ ప జ్ఞాన ఙ్ఞాతృ జ్ఞేయరూపిణీ 
చ1 
అమ్మా అని పిలిచినంతనే 
కరుణించికాపాడు కరుణామయీ 
క్షోణీమయీ వ్యోమమయీ 
శివానందమయీ దిఙ్మయీ ॥ 
చ2 
శశిమయీ రవిమయీ ప్రాణమయీ 
మాయామయీ విదృమమయీ 
మనోమయీ ప్రాణమయీ చిన్మయీ 
మల్లికాసుమగాన వాఙ్మయీ ॥

428. పంచకోశాంతరస్థితా 
ప 
పంచకోశాంతరస్థితా శ్రీవిద్యా 
అ.ప 
శాంభవీ మంత్ర పూజితా ॥ 
చ1 
ఆనందమయకొశమందున 
విరాజిల్లుపరమేశ్వరీ 
వ్యాహృత్యాది మంత్రరూపా 
సర్వవేదాంతసంవేద్యా పరా ॥ 
చ2 
సుమదళ శోభితా నిష్కళా 
హ్రీంకారోజ్వల సుప్రకాశినీ 
నిత్య సత్య సాహిత్య కలాపా 
మల్లికాకుసుమ గాన వినోదా ॥

429. నిస్సీమమహిమ 
ప 
నిస్సీమ మహిమా అనంతా సుప్రతిష్ఠ 
అ ప 
పంచకృత్యపరాయణా || 
చ1 
ని మహిమలను తెలియగ తరమా 
నిత్య సత్య చరిత్ర జయసర్వాత్మా 
బ్రహ్మవిద్యాకృతి పరిఢవిల్లు శ్రీనిధీ 
ఆదిమధ్యాంతరహిత పావనా పరంజ్యోతి ॥ 
చ2 
నిత్య కళ్యాణమూర్తి శ్యామలే 
సమస్త దేవగణ నిత్య నియామకా 
శివ మానసలోల హిమాద్రిసుతే 
మల్లికా సుమగాన వరదే శుభప్రదే ॥

430. నిత్యయవ్వన
ప 
లలితా నిత్యయవ్వనా 
అప 
సదా షోడశ వర్షీయ ॥ 
చ1 
నవయవ్వన సంపన్నా 
నితంబ భారాంచితా 
పుష్పమాలికాలంకృతా 
వస్త్రమల్యాభరణ శోభితా ॥ 
చ2 
సింధూర పాటలాంగీ 
నాగేంద్ర కుంభస్తనీ 
పరమేశ్వర ప్రణయరంజనీ 
మల్లికాకుసుమ గాన మోహినీ।।

431. మదశాలినీ
ప 
మదశాలినీ మధుశాలినీ 
అ.ప 
పరమానంద ఘనస్వరూపిణీ।। 
చ.1 
శీతల పీయూష వర్షిణీ 
చంద్రావతంసినీ మధురస్మిత 
అఖిలసురారాధ్య రాజేశ్వరీ 
శివకామేశ్వర మానస లోలినీ ॥ 
చ.2 
నిజరూప దాన రక్షణ చరణా 
కరుణారస సంపూర్ణా అరుణా 
మధుర మధుర సంగీత స్వరార్ణవి 
మల్లికాకుసుమగాన మనోహరి ॥

432. మదఘూర్ణిత రక్తాక్షీ 
ప 
మదఘూర్ణిత రక్తాక్షీ కామాక్షీ 
అ.ప 
జపాకుసుమ సంకాశిని నిత్యయవ్వనీ 
చ.1 
మార్తాండనయనా 
నయనానంద దాయినీ 
సింధూర పాటలాంగీ 
మాణిక్య తరణి నిలయా ॥ 
చ.2 
శ్రీ దండనాయికా ప్రశస్తచరితా 
రాక్షస పశు సంహారక మూర్తీ 
అనితర సౌందర్య రాశీ చింతామణీ 
మల్లికాసుమ గాన అద్భుతమూర్తీ ॥

433. మదపాటల గండభూః 
ష. 
మదపాటల గండభూ 
అ.ప బాలా స్వయంభూ ॥ 
చ.1 
షోడశ వర్షముల నవయవ్వనీ 
కామేశమానస ప్రణయోల్లాసినీ 
నీఅందాల చెక్కిళ్ళు అరుణారుణ కాంతులతో 
సకలజగములు దీప్తివంతములు ॥ 
చ.2 
పుష్టివినీవే సురలకు 
దుష్టివినీవే అసురులకు 
భక్తాగ్ర గణ్యులకు ఇష్టదైవమునీవే 
మల్లికాసుమగాన పుణ్యమునీవే ॥

434. చందనద్రవదిగ్ధాంగీ 
ప. 
చందనవదింగీ ॥ 
అ.ప 
కరుణా పాంగీ శివమోహనాంగీ ॥ 
చ.1 
రక్తచందనములు మంచిగంధములు 
కుంకుమపూలరసము కలిపినగంధము 
జాజి మల్లె మాలతీ సుమధురగంధము 
వెదజల్లేసుందరాంగి జోహారులు ॥ 
చ.2 
కస్తూరి జవ్వాజి కలబోసిన గంధము 
కలువల ఘుమఘుమల పన్నీరు గంధము 
మల్లికాకుసుమముల దివ్యగంధము 
వెదజల్లు శృంగారవల్లికి జోహారుల ॥

435. చాంపేయ కుసుమప్రియా 
ప 
చాంపేయ కుసుమప్రియా 
అ.ప 
నీకు సంపెంగపూలతో కొప్పు ముడుతునే ॥ 
చ.1 
దాడిమీ పూవంటి సుకుమారీనీకు 
దానిమ్మపూవుల హారమేతునే 
మందార పూవంటి మహనీయురాలినీ 
మందారపూలతో పూజింతునే ॥ 
చ.2 
శిరీష కుసుమము వంటి కుసుమకోమలి 
నీకు జాజిపూలపక్కపరచి సేదతీర్తునే 
కాదంబవనవాసి కాత్యాయనీ నీకు 
మల్లికాసుమగాన మందింతునే ॥

436. కుశలా
ప. 
పంచకృత్య పరాయణా కుశలా 
అ.ప 
త్రిభువన భూతకరీ 
చ.1 
చతుష్షష్టి కళలయందు 
వివిధాధ్వర జ్ఞానమందు 
అద్వితీయచతురా అసమానచరితా 
కౌమారీ సకలలోక పాలనాకుశలా ॥ 
చ.2 
హానివృద్ధి వివర్జితా 
సనకాదిమునిధ్యేయా 
శిష్ట రక్షణా నిపుణా 
మల్లికాసుమగాన కౌశలు ॥

437. కోమలాకారా
ప 
సౌందర్యరత్నాకర కోమలాకారా 
అ.ప 
సకలజనమోహినీ కుసుమకోమలీ ॥ 
చ..1 
పర్వతేంద్రకుమారి జయ పార్వతీ 
మాయింటి వేలుపా మాకంటివెలుగా 
మాతోడునీడగా నీవుండవమ్మా 
మాకింక ఏలోటు రానీయకమ్మా!। 
చ.2 
సారంగలోచనా కమలా మనోహరీ 
సుకుమారి గౌరీ కన్యాకుమారీ 
సింగారమొలికించు శృంగారవల్లీ 
మల్లికాసుమగాన నిత్యసంతోషీ ॥

438. కురుకుళ్ళా
ప 
శ్రీ పురవాసినీ కురుకుళ్ళా 
అ.ప 
అహంకార చిత్తమయ ప్రాకారనిలయా ॥ 
చ.1 
కురువిందతరునిలయా శ్యామలాంగీ 
కుంకుమ విలిప్తగాత్రీ వారాహీ పితృరూప 
కాదంబ మాలికాభరణ త్రైలోక్యజననీ 
కురుకుళ్ళా వళిదేవతా నీలకంఠ మనోహరిణి॥ 
చ.2 
ఐహిక వాంఛాప్రదాయిని వరసిద్ధిదాయినీ 
మణి ద్వీపనిలయినీ అమరేశ్వరీ 
లోకత్రయాహ్లాదినీ సుషుమ్ననాడి రూపిణి 
మల్లికాకుసుమ గాన వరదాయిని ॥

439. కులేశ్వరీ
ప 
కులేశ్వరీ కురుకుళ్ళా 
అ.ప 
సుషుమ్న మార్గనిలయా | 
చ.1 
సకలకోటి జీవరాశి సంరక్షణా దక్షా 
దాక్షాయణీ కామేశ్వరీ సకలదేవతారా! 
చ.2 
చందనగంధ సుగంధీ 
శంభుదయితే అఖిలేశ్వరీ 
నిఖిలలోకాధార భూతా 
మల్లికాకుసుమ గానదా ॥

440. కులకుండాలయా 
ప. 
కులకుండాలయా శ్రీ మాతా 
అ. ప 
చిదగ్నికుండసంభూతా ॥ 
చ.1 
నిర్వికార చిన్నాత్రా 
బ్రాహ్మీ ప్రాణ స్వరూపిణీ 
నీపాద యుగమునుండి స్రవించుసుధాధారలు 
అమృత ధారలై మానవాళిని రక్షించును।। 
చ.2 
కులసంకేత పాలినికౌళినీ 
సుందర తాండవలోలినీ 
కులకుండాలయకుహరిణీ 
మల్లికాసుమగానాహ్లాదినీ ॥

441. కౌళమార్గ తత్పరసేవితా 
ప 
కౌళమార్గ తత్పరసేవితా 
అ.ప 
శ్రీ చక్రనిలయినీ శ్రీ విద్యా ॥ 
చ.1 
సమయాచారులు కౌళాచార్యులు 
వంశపారంపర్య పూజలు చేసి 
ధూపదీపనైవేద్యములచే 
కులమార్గమున నిను పూజింతురే ॥ 
చ.2 
కోరినవారికి కోర్కెలు తీర్చి 
శరణన్నవారిని అక్కునచేర్చి 
సాయుజ్య సంపదల నొసగేటితల్లీ 
మల్లికాకుసుమ గానతత్పరీ ॥

442. కుమార గణనాధాంబా 
ప 
కుమారగణనాధాంబా 
అ.ప 
మోక్షకారిణీ లింగాంబా ॥ 
చ.1 
నీపదములను విడజాలా 
బ్రోవభారమా జాగేలా 
సురుచిర సుందర కరుణాలవాలా 
బాలా బలా శ్రితజనలోలా ॥ 
చ.2 
సకలలోకపాలా కాంచనచేలా 
మౌనమేలనే హిమగిరిబాలా 
మల్లికాకుసుమగానవిలోలా 
హారతిగైకొనుము ఈవేళా ||

443. తుష్టి
ప 
యాదేవీ సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థితా 
నమస్తస్యై నమస్తస్యై నమోనమః 
చ.1 
సర్వజీవులయందు తుష్టిరూపమున 
నెలకొనియుండేటి దేవదేవీ 
తుష్టిదాయినీ సంతుష్టి కలిగించి 
శాంతిని ప్రసాదించు కరుణామయీ || 
చ.2 
సంతృప్తిలేనిచో శాంతములేదు 
శాంతము లేనిచో సౌఖ్యములేదు 
నీకృపలేనిచో మనుగడలేదు 
మల్లికాకుసుమ గాన తుష్టిదా ॥

444. పుష్టిః
ప. 
యాదేవీ సర్వభూతేషు పుష్టిరూపేణ సంస్థితా 
నమస్తస్యై నమస్తస్యై నమోనమః 
చ.1 
సర్వజీవులయందు పుష్టి రూపమున 
కొలువుండి కాపాడు శ్రీ మహాదేవీ 
సంతుష్టియే మాకు పుష్టి కలిగించు 
దేవదారు వనవాసినీ దేవీ ॥ 
చ.2 
బలమును స్థైర్యమును కలిగించి 
ఆయురారోగ్యములుయిచ్చేటి తల్లీ 
శతకోటి వందనములు అర్పింతుమమ్మా 
మల్లికాసుమగానములతో కీర్తింతుమమ్మా ॥

445. మతిః
ప 
బుద్దిరూపమున జీవులయందున 
నిలిచియుండుతల్లీ వందనము గౌరీ 
చ.1 
నీయందున భక్తినిలిపి 
శ్రద్ధతో నీపూజసలిపి 
సర్వజనులకు హితముగూర్చే 
మంచి బుద్ధిని కలుగచేయవే II 
చ.2 
మతివినీవే స్మృతివినీవే 
వేదవిజ్ఞానగనివినీవే 
అజ్ఞానము తొలగచేయుము 
మల్లికాకుసుమ గానమస్తకా॥

446. ధృతిః
ప. 
యాదేవీ సర్వభూతేషు ధృతి రూపేణ సంస్థితా 
చ.1 
ధృతిరూపములో ధైర్యముకలిగించి 
ఆత్మవికాసము కలిగించవే 
సర్వకార్యములు నిర్విఘ్నముగా 
ఆచరించే స్థైర్యము నీయవే ॥ 
చ.2 
పిండారకక్షేత్రమున కొలువైనదేవీ 
సుస్థిరభావము కలిగించవే 
జయములనిచ్చే విజయదుర్గా 
మల్లికాసుమ గానవర్ణితా ॥

447. శాంతిః
ప. 
శాంతిస్వరూపిణి శ్రీ గౌరి 
అ.ప 
అగణిత గుణగణ సుందరచరణా॥ 
చ.1 
కామక్రోధమును మదమాత్సర్యము 
నశింపచేయవే శాంతిమతి 
నీనామమును జపించువారికి 
చిత్తశాంతిని కలుగచేయుదువే 
చ.2 
నీసన్నిధికే మమ్ములజేర్చి 
విశ్రాంతి నొసగి శాంతినీయవే 
సాయుజ్యపదవిని అందించవే 
మల్లికాసుమగాన పూజితచరణా ||

448. స్వస్తిమతీ
ప. 
స్వస్తిమతీ అవినాశినీ 
అ.ప 
సకల ప్రపంచ క్షేమకరీ ॥ 
చ1 
నీఉనికియే నిత్యసత్యము 
నీరూపమే సుందరము 
నీనామమే శివము పుణ్యము 
నీగుణగానమే పావనము ॥ 
చ.2 
నీసన్నిధియే శాంతినిలయము 
నీపాదములే మాకుశరణము 
నీవేజగతికి మూలాధారము 
మల్లికాకుసుమ గాన శరణ్యా ॥

449. కాంతిః
ప. భ్రాంతి నాశినీ కాంతిరూపిణీ 
అ.ప నమోభగవతీ కాంతిమతీ 
చ.1 
చరాచరములకు జీవకళవు 
తేజోరూపిణీ విశ్వరూపిణీ 
అంధకారమును తొలగించి 
విజ్ఞానకాంతులు ప్రసరింపవే ॥ 
చ. 2 
చంద్రరూపిణీ చంద్రముఖీ 
జ్ఞాన ధాతుమయీ శశికళాధరీ 
నిత్యనిరంజనీ కళ్యాణ గుణా 
మల్లికాకుసుమ గానగుణా ॥ 

450. నందినీ
ప. నందినీ హిమగిరినందినీ 
అ.ప నటీనటనాయక హృదయ స్పందినీ 
చ.1 
విష్ణు మాయతో నందుని యింట 
జన్మించితివి యోగమాయగా 
జనవందినీ నందితమోదినీ 
విష్ణువిలాసినీ శంకర తోషిణీ ॥ 
చ.2 
గోమాతగా పూజలందుకొను 
కామధేనువు నందినీ 
వశిష్టముని సేవితా 
మల్లికాసుమగాన యోగా ॥

451. విఘ్ననాశినీ
ప విఘ్ననాశినీ విద్యారూపిణీ 
అ.ప విఘ్నహంత్రీ విఘ్నేశ్వరీ ॥ 
చ.1 
ఆటంకములను తొలగించి 
కార్యసిద్ధిని కలుగచేయుము 
అపజయములను కలుగనీయక 
అన్నిటవిజయము చేకూర్చగదే 
చ.2 
ముద్దుగణపతి కన్నతల్లీ 
అశుతోషునికి ముద్దులరాణి 
జయమునీయవే సర్వమంగళా 
మల్లికాసుమ గానమంగళా ॥

452 తేజోవతీ
ప. తేజోవతీ సర్వవిద్యానిధిం 
అ.ప అద్రిజా అపర్ణా తేజోనిధిం ॥ 
చ1 
అచలోద్భవం అకళంకచిత్తం 
ఆదిత్యవర్ణం ఆరాధ్యదైవం 
అభయప్రదాతం అజరామరం 
అణిమాది సిద్దేశ్వరం ఆదిదైవం ॥ 
చ.2 
ఆద్యంతరహితం ఆనందకందం 
అఘహరణరూపం అమిత ప్రతాపం 
అనంతం అమోఘం అగమ్యం అజేయం 
మల్లికాసుమగాన అమితప్రమోదం ॥

453. త్రినయనా
ప. త్రినయనా త్రికాలజ్ఞాన సంపన్నా ॥ 
అ.ప రాజరాజేశ్వరీ త్రిగుణాత్మికా || 
చ.1 
నీదక్షిణనేత్రము సూర్యాత్మకము 
నీవామనేత్రము చంద్రాత్మకము 
బంగారుఛాయతో దీపించు నుదుటి కన్ను 
అగ్నితేజమౌ సంధ్యారూపము ॥ 
చ.2 
భక్తులకు వరములిచ్చి కరుణించు ఒక కన్ను 
పాపులను క్రోధముతో శిక్షించు ఒక కన్ను 
కామేశుని మరులుగొలుపు మరోకన్ను 
మల్లికాకుసుమగాన చంచలనేత్రి ||

454. లోలాక్షీ 
ప లోలాక్షీ కాశీ విశాలాక్షీ 
అ.ప. కకారాది క్షకారాది వర్ణరూపిణీ | 
చ.1 
సుందరేశ హృదయేశ్వరి మీనాక్షీ 
ఏకామ్రేశ్వరుని రాణి కామాక్షి 
అద్భుత సౌందర్యనిధి చంచలాక్షి 
విఘ్నేశకుమారజననీ కురంగాక్షి || 
చ.2 
కటాక్షవీక్షణీ విశ్వసాక్షి 
శత్రుసంహారకారి రక్తాక్షీ 
మల్లికాసుమ నిమీలితాక్ష్మీ 
రక్షించవేతల్లి కమలాక్షి ||

455. కామరూపిణీ
ప. కామరూపిణీ కామేశ మనోహరీ 
అ.ప. కామదాయిని కామేశ్వరీ || 
చ.1 
వాగీశ్వరి వాచకరీ యోగీశ్వరీ 
పశుమలేశుని రాణి గీర్వాణీ 
తెలియకచేసిన తప్పులు ఎంచుట తగునా 
మానేరములను మన్నింపలేవా ॥ 
చ.2 
వాగ్దేవి కరుణించి యిచ్చినవరము 
మల్లికాకుసుమ గాన పరిమళము 
నీకేయిచ్చి నిను ఆనందింపగచేయ 
ఏనోములు నేను నోచుకుంటినో తల్లీ॥

456. మాలినీ
ప. మాలినీ జ్వాలామాలినీ
అ.ప మాతృకావర్ణధారిణీ ॥ 
చ.1 
అ నుంచి హ వరకు నీమాలలోని పూసలు 
క్ష కారమే కొలికి పూస చిలుకలకొలికీ 
అ క చ ట త పాది వర్ణరూపిణీ 
త్రిపురాది చక్రేశ్వరి జయమాలినీ ॥ 
చ.2 
సకలాగమ పరదేవత శంభు మోహినీ 
త్రయోదశ గణప్రియా కమలాలయా 
అతికోమలాంగీ త్రైలోక్య శుభదా 
మల్లికాసుమగాన కామదా॥

457. హంసినీ
ప హంసినీ పరమయోగినీ 
అ.ప యోగినీ బృంద హృదయ నివాసినీ ॥ 
చ.1 
చిద్రూపదీపము తిమిరాప హరము 
సర్వజనాంతరస్థితము పరమాత్మరూపము 
సంసార తారకము చైతన్యనిలయము 
ఉచ్ఛ్వాసనిశ్వాసల మూలరూపము ॥ 
చ.2 
భక్తజనమానస రాజహంసీ 
బంధూక ప్రసవారుణాంబరధరా 
హ్రీంకార దీర్ఘకా హంసి శ్రీ లలితా 
మల్లికాకుసుమగాన హంసికా ॥

458. మాతా
ప శ్రీమాతాకరుణోపేతా 
అ.ప ఈజన్మకిదిచాలు నీగానము 
చ.1 
సంతోషము యిచ్చేటినీగానము  
సంతాపము తొలగించు ఈగానము 
సుజనులను బ్రోచేటి నీగానము 
ఘోరభవములు బాపు ఈగానము ॥ 
చ.2 
సామవేదసారము నీగానము 
సాయుజ్యమొసగును ఈగానము 
సాటిలేని మేటిదీగానము 
మల్లికామకరంద సుమగానము ॥

459. మలయాచలవాసినీ
ప. మలయాచలవాసినీ భగవతీ 
అ.ప అన్నులమిన్నా అనురాగవల్లీ ॥ 
చ.1 
తెలియకచేసితిమి యెన్నోతప్పులను 
మానేరములను లెక్కింపకమ్మా 
నడిసంద్రములోన అల్లాడు చుంటిమి 
కన్నతల్లీ నీవె మముబ్రోవలేవా ॥ 
చ.2 
నీనామస్మరణమే నడిసంద్రపునావ 
చూపించవేమాకు సరియైనత్రోవ 
కరుణామయివన్న బిరుదునీకేకదా 
మల్లికాసుమగాన కాంచనచేలా ॥

460. సుముఖీ
ప. సుముఖీ సర్వమంగళా 
అ.ప షోడశీ శివరంజనీ ॥ 
చ.1 
నీనామమే మాకు కామధేనువు 
నీవేమాపాలిటి కల్పవృక్షము 
నీవేమాకు కొంగుబంగారము 
నీస్మరణమే కోర్కెతీర్చు చింతామణీ ॥ 
చ.2 
నిన్నేనమ్మితిని ఇకనీచిత్తము 
రాకాచంద్రముఖి ఉమామహేశీ 
భవభయ రంజనీ నిరంజనీ 
మల్లికాసుమగాన రంజనీ ॥

461 నళినీ
ప. నళినీ నళినకాంతి కపోలా 
అ.ప. పద్మనిలయినీ చంద్రముఖీ ॥ 
చ.1 
పంకజనయనీ సుమదళశోభినీ 
దివ్య సరోజ సుగంధలేపినీ 
కమలానగరవిహారిణీ కమలా 
మల్లికాకుసుమ గానవిహారిణీ 
చ2. 
సురమునివందిత చరణాంబురుహా 
రక్తాసనాంబుజ పద్మాసనీ 
కమలభవసన్నుత కమలాలయా 
శివహృదయారవింద భృంగా ॥

462. సుభ్రూ 
ప. సుభ్రూ సుందరవదనారవిందా 
అ.ప మల్లికాసుమగాన బృందా 
చ.1 
నీకనుబొమలు కొంచమువంగి 
మదనారికి మోహముకలిగించు 
మన్మధ బాణమువంటి నేత్రములు 
అంగజవైరికి తాపము కలిగించు ॥ 
చ.2 
నీభృకుటి ముడితో రాక్షసలోకము 
భయముచెంది గడగడ వణుకునే 
నీభృకుటియే సంధ్యాసమయములు 
ఆమన్మధునికి గృహతోరణములు ||

463 శోభనా
ప. శోభనా శృంగారశోభినీ 
అప.. సుందరము అతిసుందరము ॥ 
చ.1 
నీరూపమే చందనమార్దవము 
నీచూపులే అమృతమధురసము 
నీనవ్వులే రసమయగంధము 
నీపాటే ప్రణవోపాసనము 
చ.2 
నీదర్శనమే నయనోజ్వలము 
నీస్పర్శనమే పాపభంజనము 
నీనామ రసాస్వాదనమే అనుభవము 
ఆ అనుభవమే సుమగాన స్పందనము ॥

464 సురనాయికా 
ప. సురనాయికా సుభదా 
అ.ప సకలదేవతాశక్తి సమన్వితా| 
చ.1 
ఘోరదానవమర్దినీ 
గుహ్యమండలవర్తినీ 
చంద్రమండల వాసినీ 
చిద్రోపద్రవభేదినీ  
చ.2 
కుందసుందరహాసినీ 
మల్లికాసుమ భాసినీ 
అప్సరోగణ సేవితా 
శ్రీ శివే జయవైభవే ||

465 కాలకంఠీ
ప. కాలకంఠుని రాణి కాలకంఠీ 
అ.ప కోకిలకూజితవాణీ కలకంఠీ ॥ 
చ.1 
నీపతిగుణములు గానముచేయగ 
మధురమైన నీపలుకులు వినుచు 
వీణాపాణి కలవాణి వాణి 
కచ్చపి వీణను కొంగుతో దాచెనే॥ 
చ. 2 
మృదుమధు వాక్కుల కల్పకవల్లీ 
చిదంబరేశుని హృదయవల్లీ 
మల్లికాకుసుమ మాలికలల్లీ 
నీగుణగానము చేసెదను తల్లీ ॥ 

466 కాంతిమతీ
ప కాంతిమతీ నిర్మలతేజస్వినీ 
అ.ప జ్ఞానకాంతిని వెలిగించవే ॥ 
చ.1 
కోటిసూర్యుల తేజస్సును 
కోటిచంద్రుల శీతలమును 
పావకమూర్తి ఓజస్సును 
నీవదనమున నింపుకొంటివి 
చ.2 
ద్వాదశ కళలకు షోడశకళలకు 
నీవునిలయమై ప్రకాశించెదవు 
సదాశివపురీ శక్తి మహేశ్వరి 
మల్లికాసుమగాన కాంతిమతీ ॥

467 క్షోభిణీ
ప. క్షోభిణీ అంగజారి మనోకామినీ 
అ.ప. పరమేశుని వలచి ఘోరతపముచేసితివి ॥ 
చ.1 
పంచాగ్ని మధ్యమున ప్రచండతపము 
ఘోరవర్షములందు అమితతపము 
శీతసానువులందు మహోగ్ర తపము 
శిలా ప్రదేశములందు అధికతపము ॥ 
చ.2 
నిరాహారివై సలిపితివి అఖండ తపము 
పర్ణములనుభుజించక భూయిష్టతపము 
చేసి ఈశుని చిత్తమే కల్లోల పరచి 
మల్లికాసుగాన ధరుని చేపట్టితివి ||

468. సూక్ష్మరూపిణీ
ప. సూక్ష్మరూపిణీ శ్రీ చక్రసంచారిణీ  
అ.ప శ్రీ మహాత్రిపురేశ్వరీ 
చ.1 
మేరుశృంగనిలయా ఘోరపాపనఖరీ 
శ్రీమన్మహాచిత్కళా కృపావలంబనకరీ 
జగజ్జేగీయమాన ఆనందతేజునిధీ 
శివదేవ దేవేరి శంకరార్ధశరీరిణీ 
చ.2 
మృణాళీ తంతురూపిణీ చిన్మయీ 
కామినీ జనపూజనప్రియా బ్రాహ్మణీ 
విశుద్ధ మానస హంసినీ వాగ్దేవీ 
మల్లికాకుసుమగానప్రియా కళ్యాణీ ||

 469.వజ్రేశ్వరీ 
ప విశుద్ధి చక్రనిలయినీ వజ్రేశ్వరీ 
అ.ప క్షీరోదార్ణవ సంభూతా ॥ 
చ.1 
కుండలినీ కాకినీరూపధారిణీ 
విశ్వంభర కులాంబికా 
అతులిత గుణశీల మహాదేవీ 
త్రిగుణాతీతా దోషవర్జితా| 
చ.2 
వజ్రహారభూషిణీ వజ్రేశీ 
హాకినీ శాకినీ కంకాళీ 
సదాశివ ప్రియా సర్వకామదా 
మల్లికాకుసుమగాన యోగీశ్వరీ ॥

470. వామదేవీ
ప. వామదేవీ భువనేశ్వరీ 
అ.ప వామదేవుని వామాంకనిలయినీ ॥ 
చ.1 
నిత్యనూతన భువనైక మోహనా 
నవనవాద్భుత సుందరచరణా 
పలుకులకందని విశ్వమోహినీ 
త్రిమూర్తి సేవిత అర్ధనారీశ్వరీ 
చ.2 
అనాహత చక్ర నివాసినీ దుర్గా 
మాయా స్వరూపిణీ కామితదాయినీ 
మల్లికాకుసుమరాగమాలికలల్లి 
మధురగీతికల వినిపించెదనే ॥

471. వయోవస్థా వివర్జితా 
ప వయోవస్థా వివర్జితా 
అ.ప కాలాతీతా నిత్యయౌవనా ॥ 
చ.1 
అందము చిందే నీరూపు 
కన్నులముందర కనుపించెనే 
మందహాసములు చిలికించే 
నీనగుమోమే మురిపించెనే ॥ 
చ.2 
స్వర్ణమణి మయ మందిరప్రకాశిని 
కాలరూపిణి ప్రేమామృతవర్షిణి 
భువనైక మోహినీ సునాదవినోదిని 
మల్లికాకుసుమ మాలికాభరణి ॥

 472. సిద్ధేశ్వరీ
ప సిద్ధేశ్వరీ 
అ.ప స్వాధిష్టాన అధిదేవతా ॥ 
చ.1 
నిధివాహన సమారూఢా 
వరదాభయ కరాంబుజా 
పద్మరాగ ప్రతీకాశా 
సర్వకామదా శ్రీ లలితా || 
చ.2 
అణిమాగరిమాది అష్టసిద్ధులను 
వశముచేసే మహిమాన్వితా 
కుర్తాళ పీఠవాసిని సమయేశ్వరీ 
మల్లికాసుమగాన సురమోహినీ

473. సిద్ధవిద్యా 
ప. సిద్ధవిద్యా శ్రీవిద్యా 
అ.ప ఆధారచక్రనివాసినీ ॥ 
చ.1 
కాళీ తారా భైరవీ 
చిన్నమస్తా ధూమావతీ 
సిద్ధవిద్యా కమలాత్మికా 
బగళా మాతంగీ నామాంకితా 
చ.2 
సనకసనందనాది పరమసిద్ధులు 
హయగ్రీవాది పరమయోగులు 
సదాసేవించు అమృతానందమయీ 
మల్లికాసుమగాన ఆనందమయీ ॥

474. సిద్దమాతా
ప సిద్ధమాతా సిద్ధిప్రదా 
అ.ప ఆజ్ఞాచక్రాధిష్టానా వరప్రదా ॥ 
చ.1 
సద్గతిదాయినీ జ్ఞానవికాసినీ 
లోకహితైషిణీ దుర్గతి నాశనీ 
అమృతకర శోభినీ ఆనందవల్లీ 
స్పటికమణిమయీ మాతంగినీ।। 
చ.2 
మారవైరి సహచారిణీ 
సిద్ధవిద్యా ప్రదాయినీ 
నవనాగవల్లి రసమోహినీ 
మల్లికాసుమగానమోహినీ ॥

475. యశస్విని
ప సహస్రదళ పద్మస్తా యశస్వినీ 
అ.ప యోగినీపూజిత శ్రీలలితా || 
చ.1 
సంగీతలోలా హిమగిరిబాలా 
జయజయ హారతి గైకొనుమీవేళా 
కరుణాలవాలా నినువిడజాలా 
సుగుణాలవాలా తెలియము నీలీలా 
చ. 2 
కాంచనచేలా భక్తరక్షణ శీలా 
ననువిడచుటమేలా త్రిభువనలీలా 
నీగుణగానములే కీర్తింతుముబాలా 
మల్లికాసుమగాన ఘనరాగమాలా ॥

476. విశుద్ధిచక్రనిలయా 
ప. విశుద్ధిచక్రనిలయా షోడశదళ పద్మవాసిని 
అ.ప మనోవాగాతీత రాజ రాజేశ్వరి || 
చ.1 
వికసిత శుభ్రసరోరుహాసన గతా 
పీయూష పూరిత క్షీరాబ్ది లహరీ 
లలితాయతలోచన హంసగామినీ 
అమృతవర్షిణీసౌదామినీ ॥ 
చ.2 
అక్షరరూపిణి వైఖరీ వాగ్దేవీ 
త్రికోణ మధ్యగా వజ్రేశ్వరీ 
అఖిలాండనాయకీ జయవాణీ 
మల్లీకాకుసుమగాన మాహేశ్వరీ 

477. ఆరక్తవర్ణా 
ప ఆరక్తవర్ణా అరుణారుణ 
అ.ప జపాకుసుమ సంకాశిని ॥ 
చ.1 
రక్తమాల్యాంబరధరీ 
రక్తచందనధారిణీ 
రక్తకుంకుమోపేతా 
రక్తబీజవధేదేవీ || 
చ.2 
మందారవాటికా వాసిని శ్రీకరీ 
బందూక ప్రసవారుణాంబరధరీ 
తరుణార్క శోణీ రాగార్లవీ 
మల్లికాసుమగాన రాగిణే ॥

478. త్రిలోచనా
ప త్రిలోచనా త్రిలోచనుని రాణి 
అ.ప ప్రకృతీ పురాణీ అవినాశినీ || 
చ.1 
సోమసూర్య పావక నేత్రీ 
ఋగ్ యజు స్సామవేద ధాత్రీ 
పుణ్యచరిత్రీ జగద్ధాత్రీ 
సుమాంగల్యగాత్రీ ధరిత్రీ 
చ.2 
ఘంటస్వన విమోహితా తుర్యాలయా 
చతురంగ బలోపేతా ఫాలవిలోచనీ 
అనాదిశివసహిత శైలసుతా 
మల్లికా సుమగాన మోహితా ॥

479. ఖట్వాంగాదిప్రహరణా 
ప ఖట్వాంగాదిప్రహరణా వజ్రేశ్వరి 
అ.ప త్రిభువనపోషిణీ కాళికా ॥ 
చ.1 
ఖట్వాంగము ఖడ్గము త్రిశూలము 
పాశము అంకుశము ధనుర్బాణము 
నాల్గుచేతులయందు పరగధరించి 
శతృవులను సంహరించు దనుజనిరోషిణి ॥ 
చ.2 
భూతకళానిధి రూపపయోనిధి 
కదంబవనప్రియ వాసవిలాసిని 
శితికంఠ కుటుంబిని విశ్వవినోదిని 
మల్లికాకుసుమ గానానందిని ॥

480. వదనైకసమన్వితా 
ప. వదనైకసమన్వితా సర్వమయీ 
అ.ప తత్వాతీతమయీ శ్రీ మయీ ॥ 
చ.1 
సంగాసంగ వివర్జితా వామాచార పరాయిణీ 
శివముఖవినుతా గురుగుహజననీ 
భావాభావ విభావినీ చిద్రూపిణీ 
చంద్రకళావతంస కలితే సమాహితే ॥ 
చ.2 
ఓంకార నాదాత్మిక సారస్వతోల్లాసిని 
బాలేందు చూడా విద్యుల్లతా విగ్రహా 
శ్రీరాజ రాజార్చితా భగవతీ 
నవమల్లికాకుసుమ గానార్చితా ॥

481. పాయసాన్నప్రియా 
ప పాయసాన్నప్రియా శర్వాణీ 
అ.ప నవ్య దివ్య మణిమయభూషిణీ ॥ 
చ.1 
పాలు బెల్లము బియ్యముతో 
పాయసాన్నమును నీకు పెడుదుము 
వడపప్పు పానకము చెరుకురసములు 
నైవేద్యముగా సమర్పింతుము ॥ 
చ.2 
తమలపాకులు కర్పూరముతో 
తాంబూలమును నీకుఇచ్చెదము 
సంతుష్టాంతరంగిణివై బ్రోవవే 
మల్లికాసుమగాన వరదాయినీ ॥

482. త్వక్ స్థా 
ప త్వక్ స్థా ముదితభర్గా 
అ.ప నవకల్పకవల్లరి || 
చ.1 
మేధోస్తి ధాతవ శక్తిమూలకా 
ప్రాణదాత జీవధాతవ శివమూలకా 
చర్మధాతువునకు పుష్టినిచ్చే 
వజ్రేశ్వరి నవధాతువు రూపిణి 
చ.2 
సౌందర్యధారా సర్వస్విని 
ఏకాప్రాభవశాలిని మాలినీ 
సర్వానవద్యా సర్వకర్రీ 
మల్లికాసుమగాన కల్పనాచాతురీ ॥

483. పశులోకభయంకరీ 
ప పశులోకభయంకరీ శుభకరీ 
అ. ప పశుపతి నాధుని వశంకరీ ॥ 
చ.1 
నిత్యాన్నదానేశ్వరి 
ప్రసన్నవదనా ప్రియంకరీ 
మహిషాసురమర్దినీ కపర్దినీ 
ఆర్యామహాదేవి రాజేశ్వరీ 
చ. 2 
సామవతీ సిరసి సోమవతీ 
భూమవతీ దేవి హైమవతీ 
కారుణ్య కల్లోలిని సదాశివసతీ 
మల్లికాసుమగాన ప్రేమవతీ ॥

484. అమృతాది మహాశక్తి సంవృతా 
ప అమృతాది మహాశక్తి సంవృతా 
అ.ప విద్యుత్కోటి మహాధార సారకాంతి తతా ॥ 
చ.1 
చంద్రకాతి మణికాంతి తుల్యా 
తప్తకాంచన సన్నిభా 
కుసుమగంధ పరిపూరితోజ్వలా 
ధూపధూపిత మహోజ్వలా | 
చ.2 
సుకుమారాంగవల్లరీ కరుణామయీ 
కోటీందు కోటీన కాంతిమయీ 
అంబికా అక్షరశక్తి పరివృతా 
మల్లికాకుసుమ గానామృతా ||

485. ఢాకినీశ్వరీ
ప. ఢాకినీశ్వరీ విశుద్ధిచక్ర యోగినీ 
అ. ప పశుజన భయదా త్రిశూలధారిణీ 
చ.1 
అమృతాది షోడశ శక్తి పరివృతా 
పాయసాన్నప్రియా వీరవంద్యా 
హ్రీంకారానంద కేకినీ 
విశుద్ధిచక్ర నిలయా మహేశ్వర సతీ ॥ 
చ.2 
శుద్ధ స్ఫటిక సంకాశిని శివాశివానీ 
శ్వేతరక్తమిశ్రప్రభ పిండరూపిణీ 
చంద్రఖండ శిఖండినీ అమృతవాహినీ 
మల్లికాకుసుమ గానవిహారిణీ।

486. అనాహతాబ్దనిలయా 
ప అనాహతాబ్దనిలయా వాయుతత్వాత్మికా 
అ.ప ద్వాదశదళనివాశినీ వామదేవీ || 
చ.1 
కదంబమాలికావేణి సంగీతమాతృకా 
సంతప్త కాంచనాభ సంధ్యారుణ చేలా 
శ్రితజన రక్షాధురీణా వాగ్భూషణీ 
సమంద హసితేక్షణా తీక్షణా 
చ.2 
పర్వేందుబింబవదనా కమలాసనస్ధా 
సౌభాగ్యదాయినీ త్రిపురవాసినీ 
ఆలోలనీలవేణీసారసాక్షి 
మల్లికాసుమగాన సుందరచరణ్ ॥

487. శ్యామాభా
ప శ్యామాభా కోమలాంగీ 
అ.ప దహు-కాశ నివాసినీ ॥ 
చ.1 
క్రూరాంధక ధ్వంసినీ వజ్రేసీ 
షడంగదేవీ పరివార గుప్తా 
సర్వామర కాంక్షిత పూరయిత్రీ 
కామప్రదే కామకళావినోదా ॥ 
చ.2 
అనంగదేవీ పరివారపూజితా 
సర్వజ్ఞ విజ్ఞత పదారవిందా 
దేదీప్యమాన శ్యామలాంగీ 
మల్లికాసుమగానసంతోషిణీ ||

488. వదనద్వయా
ప వదనద్వయా వామదేవీ 
అ.ప శ్యామవర్ణా అభిమతఫలదా ॥ 
చ.1 
వికసితసరోజ ద్వివదనా 
దమనులు శిరలు మీఅధీనములు 
అనాహతపద్మ వాసిని హాసినీ 
పిండరూపిణీ ప్రాణదాయినీ 
చ.2 
అష్టాదశగుణా విద్యాపారీణ 
వామదేవుని ప్రియభావనా 
శ్రీ విద్యా దురంధరోపాసితా 
మల్లికాకుసుమగాన ఫలదా॥

489. దంష్టోజ్వలా
పదంష్టోజ్వలా శ్యామలాకారిణీ 
అప శ్రీ దండనాయికా వారాహీ | 
చ.1 
హృదయకమల నివాసినీ 
వాయుతత్వాత్మికా వామదేవీ 
మహాపండితులు జ్ఞానులు 
ఉపాసించే జ్ఞాన స్వరూపిణీ ॥ 
చ. 2 
రాక్షస పశు సంహారకమూర్తి 
వేదవేదాంగ శోభినీ రక్షిణీ 
కరుణచూపుమా కమలేక్షణీ 
మల్లికాసుమగాన సంరక్షిణీ ॥

490. అక్షమాలాది ధరా
ప అక్షమాలాది ధరా సుధాపానమత్తా 
అ. ప తంత్రస్వరూపా శ్రీవామదేవీ 
చ. 1 
అక్షరములను మాలలుగా 
క్ష కారమే కొలికిపూసగా 
శూల కపాల డమరుకములను 
నాలుగుచేతులను ధరియించుతల్లీ 
చ.2 
ఆగమాంత విహారిణీ 
ఛత్ర చామర శోభినీ 
వామాచార పరాయణీ 
మల్లికాకుసుమగానాభరణీ ॥

491. రుధిర సంస్థితా
ప రుధిర సంస్థితా రక్తప్రియా 
అ.ప అనాహత పద్మవాసినీ ॥ 
చ.1 
భూత ప్రేత పిశాచహారిణీ 
కారుణ్యపూరిత హృదయినీ 
ఇందుమండల సంపూజ్యా 
సురాపానమత్తా వారుణీ ॥ 
చ.2 
ధర్మరక్షణ దీక్షాడ్యా 
ఆపన్నార్తి విదారిణీ 
ఈశ్వరీ పరమా శైవీ 
మల్లికాసుమ గానదీక్షా ॥

492, కాళరాత్ర్యాదిశక్త్యాఘవృతా 
ప. కాళరాత్ర్యాదిశఘవృతా 
అ.ప కాళరాత్రి మోహరాత్రి వారుణా| 
చ.1 
నవదుర్గారూపిణీ దుర్గమా 
అక్షరశక్తి పరివేష్టితా వారాహి 
రోష తామ్రాక్ష శోభినీ 
లోకకళ్యాణ శోభనకారిణీ 
చ.2 
షణ్ముఖాది స్తుతా దేవీ ప్రఛండీ 
మన్మధారి సుసేవినీ కాళీ 
మహాబలప్రదాయినీ భవ్యా 
మల్లికాసుమగాన సంధాయినీ ॥

493. స్నిగ్దౌదనప్రియా 
ప. స్నిగ్దౌదనప్రియా శూలపాణి 
అ.ప సుమనసవందితా నీలవేణీ ॥ 
చ.1 
పరమసంకాశినీ శాలినీ 
మోహినీ డాకినీ ప్రేతసంశాయినీ 
యక్షినీ రక్షినీ శ్రీమనోల్లాసినీ 
కాళీ శ్యామలా సురనాయికీ 
చ. 2 
నేతితో తడిసిన పాయసాన్న ప్రియా 
లోకైక విఖ్యాత శ్రీ జగన్మాత 
జగన్నాటక సూత్రవేషధారిణీ 
మల్లికా కుసుమగాన ధారిణీ 

494. మహావీరేంద్ర వరదా 
ప మహావీరేంద్ర వరదా వరదా 
అ.ప విద్రుమ సహచర దేహీ ॥ 
చ.1 
శ్రీవిద్యోపాసన ఫలదాయినీ 
జ్ఞానదాయినీ పరమహంసినీ 
పరమయోగినీ పూజితచరణీ 
వరదాయిని దుర్గా యశస్విని | 
చ.2 
క్షరాక్షరవిహారిణీ త్రినేత్రా 
హరిబ్రహ్మాది సేవితా ద్వివదనా 
యోగసిద్ది ప్రదాయినీ మనస్వినీ 
మల్లికాసుమగాన తాండవ లోలినీ ॥

495. రాకిణ్యంబాస్వరూపిణీ 
ష. రాకిణ్యంబాస్వరూపిణీం 
అ.ప శ్రీలలితం సుఖదం సులభం ॥ 
చ.1 
పరశివహృదయం కమలాప్తతేజం 
సర్వాంగశోభితం అబిమత ఫలదం 
కూటత్రయ రూపిణీం వీరేంద్రవంద్యాం 
ద్వివదన విలసితాం శ్యామవర్ణాం ॥ 
చ.2 
అనాహతాధిష్టాన దేవతారాకినీం 
షట్కోణయుక్తాం రకారవర్ణాం 
సర్వవిద్యామయీం రుద్రస్వరూపిణీం 
మల్లికాసుమగానరాజితం శాంతం ॥

496. మణిపూరాబ్జనిలయా 
ప. మణిపూరాబ్జనిలయా 
అ. ఏ దశదళ శోభినీ ॥ 
చ.1 
జలతత్వాత్మికా భువనార్చితా 
షోడశ వర్షీయ రూపపయోనిధీ 
వృక్షలతాసుమగంధ శోభితా 
మహోజ్వల మణిదీప నివాసినీ 
చ.2 
అనిర్వచనీయశక్తి విలాస 
కరుణామృత పరిపూరిత హృదయా 
మల్లికా కుసుమ గానసుధారస 
దివ్యతరంగిత మృదు మందస్మిత

497. వదనత్రయ సంయుతా
 ప వదనత్రయ సంయుతా పరమ కృపామయీ 
అ.ప. హరిబ్రహ్మాదిసేవితా |॥ 
చ.1 
మూడుముఖముల మూడుశిరసుల 
మూడుతత్వముల భాసిల్లుతల్లీ 
త్రిగుణాత్మికా త్రిగుణాతీతా 
త్రిజగన్మాతా శ్రీ లలితా ॥ 
చ.2 
సర్వసంపత్కరీ కమనీయరాశీ 
ఆపన్నార్తి విదారిణీ ఆనందదాయినీ 
ఉడురాజభూషణా ధనధాన్య వర్దినీ 
మల్లికాసుమగాన వాణీ దుర్గా శ్రీలక్ష్మీ

498. వజ్రాది కాయుధోపేతా 
ప. వజ్రాదికాయుధోపేతా శ్రీలలితా 
అ.ప మణిపూరచక్రనివాసినీ ॥ 
చ.1 
చతుర్భుజశోభినీ సర్వలోకేశ్వరీ 
దేవదేవేశ్వరీ హ్రీంకరీ 
వజ్రము శక్తి దండము ధరించి 
అభయమునిచ్చే ఆదిశక్తీ ॥ 
చ.2 
ఓంకారరూపీ భోగసంధాయిని 
కౌమారీ శృంగారీ వయ్యారీ 
నాపలుకులాలించి ననుబ్రోవరావే 
మల్లికా సుమగాన మనోల్లాసినీ ॥

499, డామర్యాదిభిరావృతా
ప డామర్యాదిభిరావృతా శీతాంశుముఖీ 
అ.ప వయోవస్థావివర్జితా ॥ 
చ.1 
దాక్షాయణి క్షరాక్షరవిహారిణీ 
మణిపూరవాసిని మహేశ్వరీ 
జలక్రీడావినోదినీ ఇందుమండల వాసినీ 
హరి బ్రహ్మాది సేవితా లోకకళ్యాణ కారిణీ | 
చ.2 
వాత్సల్యపూర్ణ హృదయా జగదంబికా 
శుభదాయిని భక్తహృదయాంతరంగా 
మాంగల్యభూషణీ జ్వాలాంబికా 
మల్లికా సుమగాన పరితోషితా॥

500. రక్తవర్ణా
ప. రక్తవర్ణా కస్తూరీ తిలకాంచితా 
అ.ప మల్లికా సుమగానచిత్తా 
చ.1 
ఎర్రమందారములు పూచినయటుల 
మంకెనపూవులు వికసించినటుల 
దానిమ్మపూవులు శోభిల్లునటుల 
అందాలుచిందే శృంగారనాయికా 
చ.2 
ఎర్రని తళుకుల జిగిబిగి నీమేను 
కెంపుల కాంతులు ప్రతిఫలించగా 
ధవళ వర్ణుడు శివుడు అరుణ వర్ణుడై 
శృంగారమూర్తియై కనువిందుచేయునే ॥

501. మాంసనిష్టా 
ప. మాంసనిష్టా వామదేవీ 
అ.ప మాంసధాతు అధిష్ఠాత్రి ॥ 
చ.1 
మాంసనిష్టాయని జపించువారికి 
మాంసపుష్టిని కలుగజేసి 
ఆయురారోగ్యములు ప్రసాదించే 
సర్వరక్షాకరీ రాకినీ ॥ 
చ.2 
మణిపూరనిలయినీ 
పాయసాన్నప్రియా 
దనుజ దండినీ చండినీ 
మల్లికాసుమగాన వాహినీ 

502. గుడాన్నప్రీతమానసా 
ప. గుడాన్న ప్రీతమానసా 
అ.ప భక్తమానస హంసికా ॥ 
చ.1 
భువన క్షేమజననీ 
రుద్రాణి విదృమమయీ 
కలే కాలక్షయే శూలినీ 
విశ్వవ్యాపిని విశ్వేశీ ॥ 
చ.2 
మామిడిఫలములు రంభాఫలములు 
దాడిమీ ఫలము పనస తొనలను 
పాయసాన్నములు నివేదింతుమే 
మల్లికాసుమగాన సంతుష్టినీ ॥ 

503. సమస్తభక్తసుఖదా 
ప. సమస్తభక్తసుఖదా 
అ.ప సకలేష్టదా కామదా 
చ.1 
సర్వాభీష్టప్రదా జయప్రదా 
భక్తశుభప్రదా శాంతిప్రదా 
విద్యాధరబృంద వందితపాదా 
వాగర్ధప్రదా కాంక్షితార్ధదా ॥ 
చ.2 
కారుణ్యవారానిధీ పుణ్యదా 
జగద్వందిత ఆశ్రితవరదా 
మల్లికాకుసుమగాన వినోదా 
హ్రీంకారపరసౌఖ్యదా ॥

504. లాకిన్యంబాస్వరూపిణీ 
ప. లాకిన్యంబాస్వరూపిణీ దంష్టిణీ 
అ.ప దశదళ పద్మ సుఖాసీనా || 
చ.1 
పశుజనభయదా రక్తవర్ణా 
గుడాన్నప్రీతా లాకినీదేవీ 
మణిపూరాధిదేవతా త్రివదనా 
సమస్తసుఖదా విష్ణుస్వరూపిణీ 
చ.2 
సకలసుఖకరీ మహోగ్రా 
శివపద వదాన్య శివనిధీ 
శివైశ్వర్య వపుషీ సౌదామినీ 
మల్లికాకుసుమగాన వినోదినీ ॥

505 స్వాధిష్టానాంబుజగతా 
ప స్వాధిష్టానాంబుజగతా 
అ.ప అగ్నితత్వాత్మికా శ్రీమాతా ॥ 
చ.1 
సిద్ధేశ్వరీ సిద్ధయోగినీ 
బంధిన్యాది శక్తిపూజితా 
ఇచ్చానురూపసంకర్షిణీ 
అతిప్రసన్నా ప్రకృతీ పురాణీ ॥ 
చ.2 
వినయసులభా మునిధ్యేయా 
జ్ఞానానంద రూపవిలాసినీ 
సనత్కుమారాది ఋషిపూజితా 
మల్లికాకుసుమ గానవిదితా ॥

506. చతుర్వక్ర మనోహరా
ప చతుర్వక్త మనోహరా జయగీర్వాణీ 
అ.ప మోహతమః పటలాపహమంగళధాత్రీ 
చ.1 
అఖిలలోకాధారిణీ సౌభాగ్యచింతామణీ 
సంసారార్ణవ తారక శక్తిదాయినీ 
ఏకవీరాది సంసేవినీ యోగినీ 
శ్రీరాజేశ్వరి ఏకప్రాభవశాలినీ  
చ.2 
అఖండచైతన్య అద్వితీయమనోహరీ 
సర్వాంతర్యామినీ లాస్యవిలాసినీ 
దైత్యసంహారిణీ దాక్షాయణీ 
మల్లికాకుసుమగాన నాయకీ 

507. శూలాధ్యాయుధ సంపన్నా 
ప. శూలాద్యాయుధసంపన్నా 
అ.ప సకలాధిష్టాన రూపా | 
చ.1 
హంసమాత్రార్ధ రూపిణీ 
హాలా మదాలసా 
లోకత్రయాహ్లాదినీ 
చతుర్వేద రూపిణీ ॥ 
చ.2 
త్రైలోక్య అఖిలేశ్వరీ 
మత్తమరాళ మందగమనీ 
త్రిశూలాది ఆయుధ ధారిణీ 
మల్లికాకుసుమ గాననిధీ |

508. పీతవర్ణా
ప. పీతవర్ణా హేమవర్ణా 
అ.ప పీతవస్తా సర్వమంగళా ॥ 
చ.1 
హ్రీంకార జప సుప్రీతా 
హరిద్రా కుంకుమార్చితా 
సర్వావ గుణవర్జితా 
హరి బ్రహ్మేంద్ర వందితా || 
చ.2 
హయమేధ సమర్చితా 
సౌమాంగళ్య భూషితా 
నటీ నటరాజమోహితా 
మల్లికాసుమగానార్చిత॥

509 అతిగర్వితా
ప. అతిగర్వితా శుభచరితా 
అ.ప మహాద్భుత సౌందర్య త్రిపురసుందరీ ॥ 
చ.1 
దేవదేవి నిఖిలాశ్రిత రక్షకి 
హిమాచల శిఖరాగ్ర వాసినీ 
పరశివవామాంకనిలయిని 
లావణ్యపూర్ణ పరదేవత రూపిణి ॥ 
చ.2 
కస్తూరికాతిలక శోభితఫాలా 
మందారసుమ సౌరభభరితా 
శింజానమణినూపుర భూషితా 
మల్లికాకుసుమ గాన వందితా ॥

510. మేధోనిష్టా
ప. మేధోనిష్టా జ్ఞానస్వరూపిణి 
అ.ప జ్ఞానప్రసూనాంబ జ్ఞానదాయిని । 
చ.1 
మేధో ధాతు నివాసిని 
సకలశాస్త్ర వేదచారిణి 
రిపుదర్ప వినాశిని 
సమతాదర్సిని త్రిపురేశి || 
చ.2 
భక్తానందకరీ సర్వసిద్ధికరీ 
సారస్వత మంత్రసిద్ధికరీ 
కామ్యరూపదా శత్రుక్షయకరీ 
మల్లికాసుమగాన మహేశ్వరీ ॥

511 మధుప్రీతా
ప. మధుప్రీతా అనంతానందరూపా 
అ.ప. జయజయ చాముండికే మహాభిషణి ॥ 
చ.1 
మణికాంచన దామోజ్వలా 
జ్ఞానక్రియాశక్తి సమాకులా 
మహాసర్పయజ్ఞోపవీతినీ 
నవరత్న దీధిత ప్రకాశినీ | 
చ.2 
షోడశకలా పరివృతోల్లాసిని 
స్థితిసంహారకారిణీ విశ్వేశ్వరి 
కదంబపుష్ప మధుపాన విలాసిని 
మల్లికాకుసుమ గానప్రదాయిని ॥

512. బందిన్యాదిసమన్వితా 
ప. బందిన్యాది సమన్వితా సిద్ధేశ్వరి 
అ.ప. భద్రకాళి యశస్వినీ పరివృతా ॥ 
చ.1 
జాజ్వల్యమాన తేజోవిలసిత 
సర్వభూతముల నిలచినదేవి 
మహామాయ బందినీ సేవిత 
అఖిల జగత్పరిపాలనా దక్షిణీ II 
చ.2 
తుష్టియై పుష్టియై కాంతియై భ్రాంతియై 
హితమును కలిగించు సర్వభూతేశీ 
మధుర మధు మదా త్రిపురసుందరి 
మల్లికాకుసుమ గానమాధురి ॥

513. దధ్యన్నాసక్త హృదయా 
ప. దధ్యన్నాసక్త హృదయా సదయా 
అ.ప. మల్లికాకుసుమగాన నిలయా ॥ 
చ.1 
చంద్రరేఖా విభూషణా 
మయూర వరవాహనా 
అత్యుగ్రా శివా శతనినాదినీ 
నమో నమో అపరాజితాదేవీ ॥ 
చ, 2 
మహేశ్వరివై త్రిశూలముధరించి 
వైష్ణవీ మాయవై చక్రము పట్టి 
కౌమారివై దైత్యులనణచిన 
శక్తీ దుర్గా అతికోపనా ॥ 11

514. కాకినీరూపధారిణీ 
ప. కాకినీ రూపధారిణీ 
అ.ప. మల్లికాకుసుమ గానోపాసినీ | 
చ.1. 
మేధోధాతు ప్రతిష్టా 
పాశకపాల వరాభయహస్తా 
ఉన్మత్త గర్వా బందినీపరివృతా 
కకారార్దా కర్మ ఫలప్రదా॥ 
చ. 2 
సంవర్తాగ్ని రూపమున 
హరుడు లోకములు దహియింపగా 
కరుణకురియు చూపులతో 
లోకాలను రక్షించే కామేశ్వరీ ॥

515 మూలాధారాంబుజారూఢా
ప. మూలాధారాంబుజా రూఢా శ్రీదేవీ 
అ.ప. దేవదేవి సర్వభూత సంహార కారికే 
చ1 
వినీలాకాశము దేవి మకుటము 
రవిచంద్రాగ్నులు దేవికన్నులు 
అంతరిక్షము వక్షస్థలము 
విశ్వమంతయు దేవీ లావణ్య వికాసము ॥ 
చ.2 
ఆదేవి చూపులే భవ భయము తొలగించు 
భగవతీచరణములు సర్వశక్తియుతము 
మహదేవి నామములు మోక్షకారకములు 
మల్లికాసుమగాన భాగ్యసంయుతము ॥

516. పంచవక్రా
ప. పంచవక్రా పంచప్రణవాన్వితా 
అ.ప. నతజనసులభా ॥ 
చ.1 
పంచభూతములు పంచప్రాణములు 
సద్యోజాతాది నీపంచముఖములు 
పంచదశాక్షర మంత్రపూజితా 
జయనిఖిలాధార పరమకృపానిధీ ॥ 
చ.2 
సారంగలోచనా మోహనవీక్షణ 
సింహేంద్ర మధ్యమా కమలాక్షముఖి 
మందార వాటికావాసి సిద్ధేశ్వరి 
మల్లికాసుమగాన మందాకినీ

517. అస్థి సంస్థితా
ప. అస్థి సంస్థితా 
అ.ప. సిద్ధవిద్యాదేవతా | 
చ.1 
అస్థి ధాతువునందు నెలకొనియుండి 
తుష్టిని పుష్టిని కలిగించుదేవీ 
నీనామమే ఆయురారోగ్యములనిచ్చు 
అచింత్యరూప మహిమాశక్తి॥ 
చ. 2 
నవవిద్రుమాభా భువనత్రయీ 
కాకినీ రూపధారిణీ మధుమతీ 
సర్పాకార కుండలినీ కలామాలినీ 
మల్లికాకుసుమ గానామృతవాహినీ ।

518. అంకుశాదిప్రహరణా
ప. అంకుశాది ప్రహరణా నిష్పాపమూర్తీ 
అ.ప. మునిజనమానస రాజహంసీ ॥ 
చ.1 
దైత్యదమనీ సత్సంప్రదయాన్వితా 
కామసంజీవనీ హుతాశన వందితా 
ఇచ్చానురూప సంకర్షిణీ విద్యా 
విద్యాధర ప్రణతి చుంబితచరణా ॥ 
చ.2 
మృగాంకసదృశ ఛాయా మనోహారిణీ 
ఫుల్ల సరోరుహాసనగతా మృడానీ 
దుష్టసంహార రసికా భైరవీ 
మల్లికాకుసుమ గాన సౌరభీ ॥

519 వరదాదినిషేవితా
ష. వరదాది నిషేవితా ఆధారచక్ర నిలయా 
అ.ప. వరదా సరస్వతీ పరివేష్టితా ॥ 
చ.1 
పావనరూపా అమితప్రతాపా 
నాసాభరణ శోభాడ్యా 
ధర్మరూపిణీ కళ్యాణ శోభనా 
సర్వేశ్వరేశ్వరీ అచలోద్భవా ॥ 
చ.2 
క్లీంకారీ సుప్రసన్నవదనీ 
చిత్తసంవేశినీ భక్తమందాకినీ 
శాశ్వతైశ్వర్య సంధాయినీ 
మల్లికాకుసుమగాన శోభినీ ॥

520. ముద్గదనాసక్తచిత్తా 
ప. ముద్గదనాసక్త చిత్తా సిద్ధవిద్యాదేవీ 
అ.ప. కాలఘనపాశ నితాంతబద్ధా॥ 
చ.1 
ముక్తావిభూషణవతీ కామసంజీవనీ 
విశ్వాధికా జయ కృపాసాంద్రా 
రాకా శశివదనా మోహాపహారి 
సర్వకారణభూత నమోనమస్తే ॥ 
చ.2 
కరుణారసపూర్ణాకృతి 
కామేశ్వరాహ్లాదకరీ 
కామేశ్వర గృహేశ్వరీ 
మల్లికాసుమగాన లహరీ ॥

521. సాకిన్యంబాస్వరూపిణీ 
ప. సాకిన్యంబాస్వరూపిణీ 
అ.ప. మూలాధారచక్రనివాసిని ॥ 
చ.1 
ధూమ్రాక్ష సంహారిణీ ధూమ్రవర్ణా 
వజ్రాయుధ ధారిణీ పీతవర్ణా 
ఐరావతగజారూఢ సిద్ధవిద్యా 
భాసుర శంకరాభరణ వేణీ 
చ. 2 
మదఘూర్ణిత లోచనీ మాతంగీ 
గంగాధరాంగసంగీ కాత్యాయనీ 
మకరందపంకిల శోభినీ 
మల్లికాకుసుమగాన శోభినీ ॥ 

522. ఆజ్ఞాచక్రాఙ్ఞనిలయా 
ప. ఆజ్ఞా చక్రాబ్జ నిలయా 
అ.ప. మల్లికాసుమగాన సంచారిణీ ॥ 
చ.1
ఇడా పింగళ సుషుమ్నా 
గంగా యమున సరస్వతీ 
సంగమస్థానము నీనిలయము 
కూటత్రయరూపిణీ త్రిపురా॥ 
చ. 2 
నీయాజ్ఞచే నడచు సూర్యచంద్రులు 
నీఆజ్ఞచే తిరుగు భూచక్రము 
నీఆజ్ఞచే జరుగు జీవనభాగ్యము. 
పరమేశాజ్ఞానుసారిణీ భవతారిణీ ॥

523. శుక్లవర్ణా సిద్ధమాతా
ప శుక్లవర్ణా సిద్ధమాతా 
అ.ప మయూర వరవాహనా ॥ 
చ.1 
యామినీనాధాలంకృత కుంతలా 
సృష్టి పాలనాచతురా షడాననా 
ఇంద్రదేవగణ శక్తిసమూహా 
అఖిలదేవ మహర్షిపూజ్యా ॥ 
చ.2 
కృత్తి వాస ప్రియా షణ్ముఖ రూపిణీ 
సకలశుభకరీ సంగీతప్రియే 
గంధర్వామర దేవప్రియతమా 
మల్లికాసుమగాన వరదాయినీ |

524 షడాననా
ప. షడాననా సిద్ధేశ్వరీ 
అ.ప షట్చక్రనిలయినీ సర్వసిద్ధి 
చ.1 
శ్రీశాది దేవగణపూజితా 
నారదాది మునీంద్ర కీర్తీ 
ఈషణ త్రయ వర్జితా 
హుంకార హతకిల్బిషా ॥ 
చ.2 
షడంగ శ్రుతిపారగా 
షడ్భావరహిత షడక్షరీ 
షడ్గుణ ఐశ్వర్య సంయుతా 
మల్లికాసుమగానసిద్ధీ ॥

525. మజ్ఞాసంస్థా
ప మజ్జాసంస్థా సిద్ధేశ్వరీమాతా 
అ.ప సర్వజనహిత మధురమందస్మితా ॥ 
చ.1 
గుణాశ్రయే గుణమయే నారాయిణీ 
దీనార్త పరిత్రాణ పరాయణా 
మజ్జారూపేణ భక్తజనహితా 
పరిణామ ప్రదాయినీ బ్రాహ్మణీ 
చ.2 
సహస్రనయనోజ్వలా కిరీటినీ 
శివదూతిస్వరూపిణీ సనాతనీ 
లోచనత్రయ భూషితా సౌమ్యా 
మల్లికాకుసుమ గాన అఖిలేశ్వరీ ॥

526. హంసవతీముఖ్యశక్తిసమన్వితా 
ప హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా 
అ.ప ఆజ్ఞాచక్ర కర్ణికస్థితాః॥ 
చ.1 
హంసవతీ క్షమావతీ పరివేష్టితా 
ఉఛ్వాస నిశ్వాస నిర్నేతా మాతా 
భుజాష్టయుక్తా మహిషాసుర మర్దనీ 
రిపుదర్పనాశనీ శర చాప ధారిణీ„ 
చ.2 
మహాసర్ప యజ్ఞోపవీతినీ 
చతుర్దశ భువనైక నాయకీ 
నవరత్న దీధితి ప్రకాశినీ 
మల్లికాసుమగానవశంకరీ ॥

527. హరిద్రాన్నైకరసికా
ప హరిద్రాన్నైకరసికా సిద్ధమాతా 
అ.ప శివా శతనినాదినీ అపరాజితా ॥ 
చ.1 
శరణాగత పరిత్రాణ పరాయణా 
శంఖ చక్ర గదా ఖడ్గ హస్తా ॥ 
చ.2 
కర్ణావతంస కలికా కమలాయ తాక్షీ 
సకలదురిత ప్రక్షాళినీ శంకరీ 
ఆజ్ఞా చక్రస్థితా సకల శుభకరీ 
మల్లికాకుసుమగానమనోహరీ ॥

528. హాకినీరూపధారిణీ 
ప హాకినీ రూపధారిణీ 
అ.ప హరిద్రాన్న ప్రీతిదాయినీ 
చ.1 
శుక్లవర్ణా జ్ఞానముద్రా 
అక్షమాలా కపాలధారిణీ 
త్రినయనలసితా హాకినీయుక్తా 
భక్తగణ సంకీర్తితా షడాననా ॥ 
చ.2 
తపనశశికోటి ద్యుతిధరా 
విద్యున్నిభా పాపమనోదూరా 
నిరతిశయానంద సంధాయకా 
మల్లికాసుమగానసంగీతరసికా ॥

529. సహస్రదళ పద్మస్థా 
ప సహస్రదళ పద్మ బిందురూపిణీ 
అ.ప దివ్యభూషణ దీపికా శ్రీలలితా ॥ 
చ.1 
కాదంబవనమున మణిమంటపమున 
శివుని పర్యంకమున నిలిచియుండెడి దేవి 
నిత్యదరహాసినీ భక్తజన పోషిణీ 
సకల శుభములనొసగు నవదుర్గవె నీవు 
చ.2 
హారకంకణాలంకార విభ్రాజితా 
ముక్తారత్న విచిత్రకాంతి కలితా 
హీరమణి ముక్తావళీ కీలితకంఠా 
మల్లికాకుసుమగాన దీపికా ॥

530. సర్వవర్ణోపశోభితా
ప సర్వవర్ణోపశోభితా మహాదేవీ 
అ.ప సర్వప్రపంచ నిర్మాత్రీ ॥ 
చ.1 
సకారయుక్తా శ్రీవిద్యా నామికా 
సకలసుందర సమత్వగుణా 
విచిత్రవర్ణ శోభితా గుణనుతా 
నిరతిశయ మహిమోపేతా 
చ.2 
అసమానప్రభాభాసుర 
నారీకులైక శిఖామణీ 
నిఖిలనిగమవేద్యా శివకామినీ 
మల్లికాసుమగాన రసవాహినీ ॥

531. సర్వాయుధ ధరా
ప. సర్వాయుధధరా సర్వకామ్యఫలా 
అ.ప సమానాధికవర్జితా కారణ రహితా ॥ 
చ.1 
వేయి చేతులతో వేల శస్త్రముల 
పరగధరించి అసురుల నణచే 
నిఖిలలోక రక్షాకరీ శుభకరీ 
నిరూఢ కరుణాఝరీ భాస్కరీ ॥ 
చ.2 
ఈభువనమండలము నీచేజనించి 
నీచూపుకొనలలో వృద్ధిపొంది 
నీచేతనే జగము రక్షింప బడుచుండు 
మల్లికాసుమగాన లయరూపిణీ

532. శుక్లసంస్థితా
ప. శుక్ల సంస్థితా శ్రీ మహామహేశ్వరీ 
అ.ప. సర్వజీవాధార సర్వధాతు స్వరూప 
చ.1 
మన్మధోపాసిత మనోవాగాధీత 
భక్తగణ కీర్తిత సంపత్కరీ 
సర్వవేదసార ప్రణవవేదికయందు 
సారతరమై యున్న చిన్మంజరీ ॥ 
చ.2 
సహస్రార చంద్రామృత రసప్లుత 
పరమాతృకా ప్రణత పాలినీ 
ఉపాసనా ఫలదాన నిపుణా 
మల్లికాసుమగాన జ్ఞానస్వరూపా

533. సర్వతోముఖీ
ప. సర్వతోముఖీ సదసద్రూపధారిణీ 
అ.ప. సంతాపవిఛ్ఛేదినీ ॥ 
చ.1 
వేయిముఖములతో వేయికన్నులతో 
విశ్వమును రక్షించు పరమేశ్వరీ 
హ్రీంకార నందనోద్యానమున 
కోర్కెలను తీర్చు నవకల్పకవల్లరీ 
చ.2 
నిరతిశయ ప్రేమాస్పదకారిణి 
కామేశోత్సంగ వాసినీ 
సుకవీంద్ర హృదయచరీ 
మల్లికాసుమగానమంజరీ ॥ 

534. సర్వాదనప్రీతచిత్తా
ప. సర్వౌదనప్రీతచిత్తా 
అ.ప. హ్రీంకారాంభోజ భృంగికా ॥ 
చ.1. 
హరిద్రాన్నమునందు క్కీరాన్నమునందు 
మధుర మధురములైన ఆహారమందు 
వివిధరకములైన ఫలముపుష్పములందు 
ప్రీతిచెందియున్న అన్నపూర్ణ 
చ.2 
పూర్ణములు కుడుములు పాయసాన్నమును 
తీయని పెరుగుతో షడ్రసోపేతముగ 
నీకుతృప్తినొసంగ నైవేద్యమొసగెదము 
మల్లికాసుమగాన కీర్తనలు పాడెదము ॥

535. యాకిన్యంబాస్వరూపిణీ
ప. యాకిన్యంబాస్వరూపిణీ సర్వవర్ణాత్మికా ॥ 
అ.ప. సహస్రదళ పద్మశోభినీ II 
చ.1 
శుద్ధ చైతన్యాత్మక జ్ఞానస్వరూప 
విశిష్ట గుణసంపన్నా సగుణబ్రహ్మా 
సర్వాత్మ రూపీ సురగణసేవితా 
సత్య సంకల్ప గుణా సుగుణా 
చ.2 
మహిమాతిశయ సంపన్నా 
హర్షాభి పూరిత ముఖీ 
హ్రీంకార కోశాంతర్వర్తినీ 
మల్లికాకుసుమగానాసక్తినీ ॥

536. స్వాహా
ప. స్వాహా యజ్ఞరూపిణీ 
అ.ప.మహేశ్వర పుర పీఠాధిష్టాన 
చ.1 
అగ్నిదేవుని దాహకశక్తి 
దక్షిణభాగ నిలయిని 
యజ్ఞములందలి హవిస్సులను 
దేవతలకందించు పరాశక్తి ॥ 
చ.2 
గురుకృపాంబు ధారావతి 
మహితరూప శోభావతీ 
పరదేవతా స్వాహాదేవి 
మల్లికాకుసుమ గానప్రభావతి |

537. స్వధా
ప. అపురూప సౌందర్య రాశీ స్వధా' 
అ.ప పితృదేవతారూపిణి ॥ 
చ.1 
పితృదేవతల తర్పణములను 
వారికందించి మము కరుణించే 
కరుణామయీ కార్యకారణమయీ 
అగ్నిదేవుని ఛాయావాసిని॥ 
చ. 2 
చిద్రూపమయీ ఆనందమయీ 
మధుర దరస్మిత వేదమయీ 
సకలహృణ్మయీ జగత్రయమయీ 
సతత సన్మయీ మల్లికాసుమగానమయీ

538 అమతిః
ప. అమతీ విద్యావిద్యా స్వరూపిణి 
అ. ప మముకరుణించవే సన్మతిదాయిని ॥ 
చ.1 
ధనములేదని నేను చింతించుటలేదు. 
ఖలజనుల సేవించు చాపల్యము లేదు 
సంసారభయముతో పరితపించుటలేదు 
నీఉపాసనముతో తరియింపకోరుదును ॥ 
చ. 2. 
అజ్ఞాన తిమిరాంధకారములు తొలగించు 
ఏకాత్మికా పరమ జ్ఞానస్వరూపిణీ 
మల్లికాసుమగాన సమలంకృతా 
చిద్రూపిణి భగవతీ శ్రీమాతా ॥

539. మేధాః 
ప. మేధా సకల శాస్త్ర సారా 
అ.ప. చరాచర విచిన్మయీ వాగ్దేవీ || 
చ.1 
సర్వవేదసార ప్రణవ వేదికయందు 
సారతరమైయున్న చిన్మంజరీ 
త్రిపురవైరి సీమంతిని వైఖరీ 
విపిన వేదికాలంబరీ 
చ.2 
సకల శబ్ద జాతములకు ప్రకృతి 
వాక్స్వరూపిణీ ప్రసాదితము 
మల్లికాసుమగాన వైదుష్యము 
మంజుల మకరంద మాధుర్య భరితము 1

540. శృతిః
ప. జగదానందదాయిని శృతి రూపిణీ 
అ.ప. మహాజ్ఞాన ప్రకాశిని || 
చ.1 
ఋగ్వేద యజుర్వేద సామవేద 
అధర్వణ వేదములే శృతులు 
చిదగ్ని సంభూతా విశ్వనాయకీ 
పరమేశ్వరీ మంత్రవిగ్రహా ॥ 
చ. 2 
నీ ఉఛ్వాస నిశ్వాసములే వేదము 
శృతి స్వర రాగములే వేదము 
మల్లికాసుమగానములేవేదము 
సకలవేదసారమే నీరూపము ॥

541. స్మృతిః
ప. వేదవేదాంగ స్మృతిరూపిణీ 
అ.ప ఉపాసనా ఫలదాన సమర్ధా॥ 
చ.1 
నీకధాశ్రవణమే పరమపావనము 
నీనామమననమే స్మృతిరూపము 
సతతము నీధ్యానమే ఉపాసనము 
నీస్మరణమే మాకు సౌభాగ్యము ॥ 
చ.2 
ఆదిమధ్యంతములు లేని నీరూపము 
వాచామగోచరము అత్యంతసుందరము 
ధ్యాన యోగానుగత అతులిత శక్తి 
మల్లికాసుమగాన మాయాత్మికశక్తి ॥

542. అనుత్తమా
ప. అనుత్తమా సర్వోత్తమోత్తమా 
అ.ప. నీతోసమానమెవరమ్మా ॥ 
చ.1 
నిఖిలాహ్లాద జననీ కామాక్షీ 
పరిఫుల్ల నీల నళిన శ్యామాక్షి 
కారుణ్యామృత వీచికా విహరణ 
నగ రాజ సుతా సురనుతా॥ 
చ.2 
నిఖిల నిగమవేద్య పరశివమయీ 
శశాంక దీప్తిలహరీ 
కనకమణి కలిత భూషా 
మల్లికాకుసుమ గానభాసురా ॥

543 పుణ్యకీర్తీ
ప. పణ్యకీర్తి పుణ్యదాయిని శ్రీకరీ 
అ.ప. శ్రీవిద్యా పరామృత రసప్లుత॥ 
చ.1 
పున్నాగ మాలికాభరణ 
కస్తూరీమకరికాయుత కపోలా 
హ్రీంకారిత్రిపురా పరాపరమయీ 
సంచితకాలోపాసిత కామేశ్వరీ || 
చ. 2 
ఏజన్మ పుణ్యమో ఏకర్మ ఫలమో 
నీపదసేవా భాగ్యము కలిగెనే 
మల్లికాసుమగానగీతముల అర్చించు 
సౌభాగ్యమీయవే పుణ్యాలరాశీ ॥

544. పుణ్యలభ్యా 
ప. పుణ్యచరితులు తపోవంతులు 
పూజించకలిగే పుణ్యలభ్యా | 
అ.ప. చూడాలంకృత శశికళాభ్యాం | 
చ.1
అనితర దేవతా కరుణాసముద్రా 
శివతపః ఫల విభ్రమా 
చిరతరసుచరిత సులభా 
చింతిత ఫల పరిపోషణా ॥ 
చ. 2. అనంతమా ఆదిమసతీ 
సంకల్ప సిద్ధాకృతీ 
నిగమగోచరి శాశ్వతీ 
మల్లికాసుమగాన ఫలధా ॥

545. పుణ్యశ్రవణకీర్తనా 
ప. పుణ్యశ్రవణకీర్తనా నీనామమే 
అ.ప. నీకీర్తనలే నాకవనం | 
చ.1 
నీ చరితములే పుణ్యప్రదం 
నీ పూజనలే శుభకరం ॥ 
చ.2 
వీణాపాణీ సురుచిరవేణీ 
మల్లికాకుసుమగానము చేయగా 
నీవు పొగడిన మధుర వాక్కులకు 
కచ్చపి వీణా మూగబోయెనే ॥ 

పావనం

546. పులోమజార్చిత 
ప. పాహిపాహిశ్రీ పులోమజార్చితే 
అ.ప. పాహిశుభంకరి శ్రీ మహితే ॥ 
చ.1 
హరకుటుంబినీ సారసాక్షి 
కలుషశమనీ త్రిభువన జననీ 
ఆదిపంచదశీవిద్యా రూపిణి 
విమలపటీ కమలకుటీ॥ 
చ. 2 
లబ్ధ విభ్రమా లబ్ధరాగా 
మనోకామనపూరణచతురా 
సంగీత తాళనృత్య లయ గీత 
మల్లికాకుసుమ గాన సమంచిత ॥

547. బంధమోచనీ
వ. బంధమోచనీ భవనాశనీ 
అ.ప. సంసారార్ణవ తరణీ భవానీ ॥ 
చ.1 
చరాచర విధాయినీ ఘన విడంబినీ 
ఘోరపాప సంహారిణీ సాధుపోషిణీ 
వామాక్షీ జనమౌళి భూషణ మణీ 
మారారాతి మనోవిమోహిని ॥  
చ.2 
పంతముచేయగా నేనెంతదాననే 
కంతుసంహరు యింతి దయచూపవే 
సంసార లీలాకరీ శాంకరీ 
మల్లికాసుమగాన హాసాంకురీ॥

548. బంధురాలకా
ప. బంధురాలకా 
అ.ప. మందస్మిత సుందర వదనారవిందా ॥ 
చ.1 
నుదిటిపైన అల్లలాడు ముంగురులు 
తమాలనీలా సుషమములు 
కారుణ్యలీలాగృహములు 
తారానాధ కిశోర లాంఛిత కచా ॥ 
చ.2 
బహువిలాస చతురా బర్బరాలకా 
చిద్గగన కౌముదీ ధారిణీ కళ్యాణీ 
కామకోటి పీఠికాసీనా 
మల్లికాసుమగంధ పూరితవేణీ ||

549. విమర్శరూపిణీ 
ప. విమర్శరూపిణీ విపినవేదికాలంబిని 
అ.ప. సర్వభూతసృష్టికి ఆరణి ॥ 
చ.1 
సర్వచరాచర సవిత్రీ 
కందర్పశతకోటి రూపిణీ 
కుంకుమ ఛాయా విలాసినీ 
చండముండాసుర భంజనీ॥ 
చ. 2. 
ఆత్మజ్ఞాన తత్వనిలయా 
లావణ్యామృత తరంగమాలయా 
అఖిలాగమ పీఠికా వలయా 
మల్లికాసుమగాన చిద్వలయా ॥

550. విద్యా 
ప. విద్యా వేదరూపిణీ 
అ.ప. మోక్షదాయినీ మహేశ్వరి ॥ 
చ.1. 
విధాతముఖమున శారదాంబవై 
విష్ణువక్షస్థలిని మహాలక్ష్మివై 
శివవామాంకమున పార్వతీదేవివై 
పూజలందుకొను మహావిద్యా ॥ 
చ 2 
సర్వవేదాంత సంవేద్యా హృద్యా 
త్రిజగదాశ్రితా శ్రీవిద్యా 
సామగాన వినోదాంతరాత్మికా 
మల్లికాసుమగాన మాతృకా ॥

551. వియదాదిజగత్ప్రసూః 
ప. వియదాది జగత్ప్రసూదిని 
అ.ప. ఓగత్ సృష్టవిధాయినీ  
చ.1 
భువర్లోక వాయుశక్తి 
స్వర్గలోక తేజోనిధి 
మహాలోక మహాసిద్ధి 
తపోలోక తపశ్వినీ || 
చ.2 
హృదయపద్మమందున ప్రాణశక్తీ 
కంఠమందు నివశించే స్వప్ననాయికా 
మూలాధారమునందలి కుండలినీ రూపిణీ 
మల్లికాసుమగాన వాగ్రూపిణీ

552. సర్వవ్యాధిప్రశమనీ 
 ప. సర్వవ్యాధి ప్రశమనీ భవానీ 
అ.ప. స్వర్వరోగహర చక్రనివాసిని ॥ 
చ.1 
అకాలమృత్యుహరిణీ 
త్రిపురసిద్ధి మార్తాండనిభా 
సర్వపీడా నివారిణీ 
భక్తానురక్త పరిపాలినీ ॥ 
చ.2 
సర్వోపద్రవ వారిణీ 
సకలలోక కళ్యాణకారిణీ 
నవకోణ పురవాసినీ శివానీ 
మల్లికాకుసుమగాన కారిణీ ॥

553. సర్వమృత్యునివారిణీ 
ప. సర్వమృత్యునివారిణీ సావిత్రీ 
అ.ప. కామేశ్వర మనోన్మనీ 
చ.1 
సర్వ మంగళ కారిణీ 
అక్షయ ఫలదాయినీ 
భక్తపాలన దీక్షితా 
హరిక్షేత్ర సనాతనీ ॥ 
చ. 2 
పురుషార్ధ ప్రదాయినీ భగవతి 
అపమృత్యు హరిణీ అభిరామి 
జ్ఞానబిక్షా దాయినీ శాంకరి 
మల్లికాకుసుమ గానవశంకరి ॥

554. అగ్రగణ్యా
ప. అగ్రగణ్యా ఆదిదేవీ 
అ.ప. ఆదియునీవే అంతమునీవే 
అనంతరూపిణి జగదంబా 
చ.1 
ఆదియంబా అష్టమూర్తి మయి 
గగనదహన హోత్రమయీ 
నిత్యతరుణీచిద్వపుషా 
హ్రీంకార దుగ్ధాబ్ధి సుధా ॥ 
చ.2 
స్మితద్యుతిమయీ శశాంక దీప్తిలహరి 
సర్వదేవతా పూజితచరణా 
త్వమేవజయా త్వమేవ విజయా 
మల్లికాకుసుమ గాన విధాత్రి ॥

555. అచింత్యరూపా
ప. అచింత్యరూపా నిర్గుణస్వరూపిణి 
అ.ప. అవాఙ్మనసగోచరి మహిమాన్వితమూర్తి ॥ 
చ.1 
పుష్టి పురాతని అవ్యక్తరూపిణి 
స్వేచ్ఛావలంబిత ఐశ్వర్య సమున్నత 
సర్వమనోహర మూర్తి దురధిగమ 
ప్రసూనశరాసన ప్రతిభట మనోహరీ ॥ 
చ.2 
కరధృతకోదండబాణహస్తా 
కారణపరచిద్రూపా శ్రీ మాతా 
అంతర్బహిస్థితా అజితా అపరాజితా 
మల్లికాకుసుమగాన నివేదితా ॥

556. కలికల్మషనాశినీ 
ప. కలికల్మషనాశినీ సూర్యమండల వాసినీ 
అ.ప. కోటీందు కోటీర కాంతిమయీ  
చ.1 
సర్వభూత సృష్టికి ఆరణి 
బహువిలాస చతుర్మయీ 
బహుజన దుర్గతి నాశనీ 
అరిమండల మర్దినీ ॥ 
చ.2 
రత్నకింకిణికా రమ్య 
అర్ధమాతృ మహేశ్వరి 
అణిమాది గుణాధార 
మల్లికాసుమగాన శ్రీ నిధే ॥

557. కాత్యాయనీ
ప. కాత్యాయనీ కమనీయ గుణశాలినీ 
అ.ప. కరుణింపరావమ్మా శ్రీదాయినీ 
చ.1 
సర్వవిఘ్న క్లేశవిధ్వంసినీ 
కింకరీ భూత గీర్వాణీ రాజేశ్వరీ 
సౌగంధిక పరిమళాహ్లాదిని 
పద్మరాగ కిరీటి విశ్వకర్మణీ!॥ 
చ.2 
కాలసంహార కారిణీ కమలాలయా 
చంద్రార్ధ మస్తకా సర్వలోకేశినీ 
సకల శుభములనొసగు నవదుర్గవే 
మల్లికాసుమగాన గీతాలాపినీ ॥

558. కాలహంత్రీ
ప. కాలహంత్రీ కాలవిళంబినీ 
అ.ప.పరిణామ ప్రదాయినీ కాలస్వరూపిణి ॥ 
చ.1 
శాశ్వత సుభగుణ శాలిని 
నిరవధిక మహిమాశాలిని 
సంతత సౌఖ్య ప్రదాయిని 
శ్రీచక్ర సామ్రాజ్యసంచారిణీ ॥ 
చ.2 
చైతన్యామృత ధారారూపిణి 
ఆశ్రిత జనావన పాలిని 
పురవైరి నామ పులకితాంగిని 
మల్లికాకుసుమ గానపరాయణి ॥

559. కమలాక్షనిషేవిత 
ప. కమలాక్షనిషేవితా కాత్యాయనీ 
అ.ష. ఇంద్రనీలమయీ దేవీ || 
చ.1 
ఘనస్తన తటీ జగన్మోహినీ 
హిమగిరి తపః పరిపాకరూపిణీ 
త్రిధామామయీ నిశా హర్మయీ 
విష్ణుసేవితా విమర్శరూపిణీ || 
చ.2 
పూర్వజన్మకృత పాపమోచనీ 
జ్ఞానముక్తి విశ్రాంతి దాయినీ 
హ్రీంకార కోశాంతర వర్తినీ 
మల్లికాసుమగాన వర్ధినీ 

560. తాంబూలపూరితముఖీ
ప. తాంబూలపూరితముఖీ సుముఖీ 
అ.ప. సౌభాగ్యదాయినీభక్తవత్సలా || 
చ.1 
మందస్మిత వదనారవిందా 
పరోపకారనిరతా త్రిపురా 
నిత్యసుందర సర్వాంగా 
శంకరప్రియవల్లభా || 
చ.2 
పద్మకైరవ మందార సుమాలినీ 
సుపద్మ రాగ సంకాశ చరణా 
రజతాచల శృంగాగ్ర నిలయిన్సీ 
మల్లికాసుమగాన పూజితచరణ్ ॥

561. దాడిమీకుసుమప్రభా
ప. దాడిమీకుసుమప్రభా చిత్రమాల్య విభూషితా 
అ.ప, మణిమయభూషిత కర్ణభూషిణీ 
చ.1 
కలిమలహారిణి శాంతిదాయినీ 
పూర్ణచంద్ర నిభాంశుకా సుఖదా 
మహేశ యుక్త నటనా తత్పరా 
పాటలీకుసుమ మోహిని చక్రిణి ॥ 
చ.2 
కదంబకుసుమ మాలాధారిణి 
జపాకుసుమ కాంతి వర్ణినీ 
పాటలీ కుసుమ శోభినీ 
మల్లికాకుసుమ మాలికాభరణీ ॥

562. మృగాక్షీ
ప. మృగాక్షీ 
విశాల ఔదర్య చంచలాక్షి 
చ.1 
విశ్వమును పాలించు విశాలాక్షి 
కామకోటి పీర వాసిని కామాక్షి 
పావన మధురనిలయా మీనాక్షి 
పరమేశ తాండవనటనసాక్షి | 
చ.2 
బ్రహ్మాండములన్ని కుక్షిలోనుంచుకొని 
సాక్షిగణపతి కన్నతల్లి విశ్వసంరక్షిణీ 
అవస్థ త్రయసాక్షి మోక్షప్రదాయిని 
మల్లికాకుసుమ గాన సారనాక్షర సాక్షి ||

563. మోహినీ
ప. మోహినీ జగన్మోహినీ 
అ.ప. సర్వసమ్మోహినీ విష్ణు రూపిణి ॥ 
చ.1 
సమరవిజయకోటీ మృదుగుణమణి పేటీ 
కదంబవన వాటీ పరమశివ వధూటీ 
చ.2 
చంద్రమండలాధిష్ఠాత్రి 
పురవైరిస్పర్శిత పులకితాంగి 
ఇంద్రనీలద్యుతి కోమల శుభాంగి 
మల్లికాకుసుమగాన స్వరమోహినీ ॥

564. ముఖ్యా
ప. పంచకృత్య పరాయణి ముఖ్యజననీ 
అ.ప. అర్కమండల సంస్థితా జగజ్జననీ అంబికా ॥ 
చ.1 
కరధృతవీణావాదిని సదయా 
అష్టదళ పద్మస్థితయా 
ధనుర్బాణ ధర కరయా 
దయాసుధ సాగరయా 
చ.2 
కమలాసనాది పూజితపదయా 
కమలావాణీ సంసేవితయా 
సుధామాధుర్య హృదయా 
మల్లికాకుసుమగాన నిలయా |

565. మృడానీ
ప. మృడానీ కుండలి కుమారీ 
అ.ప. గుహారణి గుహిని గుహ్నే కామారి 
ప్రసూన శరాసన ప్రతిభట మనోహరి ॥ 
చ.1 
సంధ్యారుణ చేల మరకతసౌధ 
కందళితానంద సౌభాగ్యదాయి 
సకలమనోరధ ఫలప్రదాయిని 
శ్యామల కంచుక లసితా శ్యామా ॥ 
చ.2 
మల్లీపున్నాగ మాలికాభరణి 
హంసతూలికా తల్ప విహరణి 
ముల్లోకముల జనని మల్లేశు రాణీ 
మల్లికాకుసుమగీతోన్మేషా ॥

566. మిత్రరూపిణీ
ప. హిరణ్యవర్ణినీ హరిణే
అ.ప. కోటి సూర్యప్రభల వెలుగొందు 
ఈశ్వరీ మమ్ముబ్రోచుటకింత జాలమేలా 
చ.1 
ద్వాదశాదిత్యరూపిణి 
ఆదిత్య మండలాను వర్తినీ 
జ్వాలిని ధారిణీ మరీచిక్షమాది 
ద్వాదశసూర్యకళా సంశోభినీ ॥ 
చ.2 
కులగిరిమణి దీపా స్నేహ రూపిణీ 
కోటీందు కోటీర కాంతి వర్ణిణి 
సర్వభూతసృష్టికి ఆరణి 
మల్లికాసుమగానాభరణి ॥

567. నిత్యతృప్తి
ప. నిత్యతృప్త నిత్యస్వరూపానందా 
అ.ప. ఆత్మానందా బ్రహ్మానందా 
సచ్చిదానందరూపిణీ  
చ.1 
స్మితమండలీ గాఢానంద తరంగితా 
శంకరాంకితదేహ కురువిందగాత్రీ 
కైవల్యానంద సంధాయినీ అజితా 
శీతల శైలసుజాతా శాంతా ॥ 
చ.2 
కాంచీదామ విరాజితా నిత్యానంద 
పరమానంద నందితా భువనేశ్వరి 
నిత్యసత్య సాహిత్యధారామృతా 
మల్లికాసుమగాన మధుకలితా ॥

568. భక్తనిధిః
ప. భక్త దయామృత వర్షిణీ 
అ.ప. శ్రీమాతా ఆశ్రిత పాలనకరీ ॥ 
చ.1 
మేరుశృంగ నిలయా శ్రీ మన్మహాచిత్కలా 
శ్రీ దండనాయికా శ్రితకల్ప వారాహి 
సంసారవారాశిదరిజేర్చు శాంభవీ 
శృంగార రసపూర్ణ తేజోవిలాసినీ ॥ 
చ.2 
శివదేవదేవేరి నిత్యసంతోషిణీ 
పదునాల్గుభువనాలు పాలించి లాలించు 
భక్తజన సేవిత రాజరాజేశ్వరీ 
మల్లికాసుమగా న చిద్విలాసా ॥

 569. నియంత్రీ

ప. నియంత్రీ నియమపాలినీ 
అ.ప. లోకపాలనము చేసెడి తల్లీ ॥ 
చ.1 
బ్రహ్మదేవునకు సృష్టికార్యము 
హరి హరులకు స్థితి లయములు 
కాళీ లక్ష్మీ వాణీ రూపములు 
నియమించిన జగదేకమాతా ॥ 
చ.2 
దిక్పాలకులను గ్రహతారలను 
సకలదేవతా గణములను 
కష్టసుఖములను నియంత్రించే 
మల్లికాకుసుమగాన నియంత్రీ ॥

570. నిఖిలేశ్వరీ

ప. కమనీయసమలోకనిఖిలేశ్వరీ 
అ.ప. దైత్యులపాలిటిమృత్యురూపిణీ ॥ 
చ.1 
పశుపతియందున అనురాగముతో 
సుతులయందున వాత్సల్యముతో 
సేవకభక్తుల స్నేహభావముతో 
కరుణస్యందిని కృపతోబ్రోచును ॥ 
చ.2 
ప్రళయనివారిణి ప్రణవరూపిణి 
భక్తదయామృత వర్షిణి హర్షిణి 
శూలాద్యాయుధధారిణి గుణమణి 
మల్లికాకుసుమ గానశోభినీ || 

571. మైత్రాదివాసనాలభ్యా 

ప. మైత్రాదివాసనాలభ్యా ఉపాసనా సులభా 
అ.ప. ఉదయభాను బింబా నాశికా భరణా॥ 
చ.1. 
స్నేహితులయందు మైత్రీ భావమునుంచి 
దుఃఖితజనులకు కరుణనుచూపి 
పాపాత్ములను క్షమతో అపేక్షించు 
సహృదయమీయవే పరమేశ్వరీ || 
చ.2 
నీపాదకమలముల సేవనేదయచేసి 
నీపూజచేసెడి పుణ్యాత్ములకు మ్రొక్కి 
సర్వభూతములందు కారుణ్యముంచేటి 
మల్లికాసుమగాన సంపదనీయవే ॥

572. మహాప్రళయసాక్షిణి

ప మహాప్రళయసాక్షిణి విశ్వసాక్షిణి 
అ.ప ప్రసూన శరాసన ప్రతిభట మనోహరి ॥ 
చ.1 
కల్పవృక్షపు సోయగములొలుకు పాగములు 
లావణ్య పదములు సౌభాగ్య కరములు 
అందమౌ నీపాదపద్మముల చెంతనే 
షట్పాద భ్రమరమై ఝంకారములు చేతునే॥ 
చ 2 
మహాప్రళయమున కల్పాంతమందున 
శివతాండవము చేయు హరునికి 
ఏకైకసాక్షివి చిత్కళారూపా 
మల్లికాసుమగాన చిద్విలాసా |

573. పరాశక్తి 

ప పరాశక్తి మహిషాసుర మర్దని 
అ. ప ఆదిశక్తి శివతాండవ లోలిని ॥ 
చ.1 
మహాగౌరి మహోదరీ 
మహాప్రళయ కారిణి 
మహావిద్యా మహానేత్ర 
మహైశ్వర్య ప్రదాయిని ॥ 
చ.2 
మహానీల మహాశీలా 
మహామంగళకారిణి 
మహాకళా మహాఫలా 
మల్లికాసుమగాన వర్ధిని ॥

574 పరానిష్టా

ప. పరానిష్టా ఘనసారవలయా ॥ 
అ.ప హ్రీంకార కమలేందిరా 
చ.1 
రెప్పపాటుననైన మనసునిలుపగలేను 
కనురెప్పమాటున నిన్ను కాంచగలేను 
కనుమూసినంతనే కనులలో నిలచేటి 
వరమీయవే మాకు వరదాయినీ ॥ 
చ.2 
క్రూరదైత్యాది బృందమర్దనీ 
జగత్రయ హితైషిణి సుభాషిణి 
తాపత్రయోన్మూలిని లయ కారిణి 
మల్లికాకుసుమగాన పోషిణి ॥

575. ప్రజ్ఞానఘనరూపిణీ

ప ప్రజ్ఞానఘనరూపిణి జ్ఞానప్రసూన 
అ.ప. సౌభాగ్యము లీయవే శ్రీమాతా ॥ 
చ.1 
వైష్ణవినీవే వారాహి నీవే 
మాకోర్కెలను తీర్చు కల్పకమ తల్లివే 
నిన్నుకొలిచెదమమ్మ నిన్ను పిలిచెదమమ్మ 
నిన్ను మామదిలోన నిలిపెదమమ్మా !! 
చ.2 
షోడశేందు కళామయీ త్రిశూలధారిణీ 
సప్తవారాధినేత్రి గణపతికి కన్నతల్లి 
మాకుభాగ్యములిమ్ము జ్ఞానమునిమ్ము 
మల్లికాసుమగాన జ్ఞానకారిణీ |

576 మాధ్వీపానాలసా

ప మాధ్వీపానాలసా మదాలసా 
అ.ప హ్రీంకారాధీన నిత్యప్రసన్నా ॥ 
చ.1 
నిర్వికారమయ నిశ్చేతనామయా 
బ్రహ్మానందమయా చిన్మయా 
సర్వయోగమయ సుజ్ఞాన మయా 
చేతనామయా బ్రహ్మమయా ॥ 
చ.2 
అజ్ఞాన తిమిరాపహారిణి 
తాపత్రయానల విమోహిని 
కామాది శత్రు వినాశిని 
మల్లికాసుమగాన మోహిని ॥

577. మత్తా

ప ద్రాక్షారస పాన మత్తా 
అ. ప నిర్గుణ నిర్వికార తురీయా ॥ 
చ.1 
నిరహంకారీ నిర్మోహీ 
నిరాడంబరీ నిరీశ్వరీ 
నిరాలంబా నిరాసక్తా 
నిరాశ్రయా ఈశ్వరతోషిణీ 
చ. 2 
కారుణ్య పూర్ణ హృదయినీ 
మదమాత్సర్య నిర్మూలినీ 
మదఘూర్ణిత రక్తాక్షి 
మల్లికాకుసుమగానసాక్షీ !

578. మాతృకావర్ణరూపిణీ 

ప మాతృకావర్ణరూపిణీ మహాదేవీ 
అ.ప ఇందుధరోరు వాసినీ ॥
చ.1 
ఓంకారాత్మక సూత్రధారిణీ 
చింతామణీ మంటప విహారిణి 
సాక్షరమాలా ధారిణి విద్యున్మాలిని 
పద్మరాగిణీ మహాప్రణయినీ||
చ.2 
మాతృకా వాసినీ బంకార వాసినీ 
శివుని పట్టపురాణీ శోభనకారిణీ 
శంకర కింకరీభూత గీర్వాణీ 
మల్లికాకుసుమ సంగీతాలాపినీ ||

579. మహాకైలాసనిలయా 

ప. మహాకైలాసనిలయా పాలయమాంగౌరీ 
అ.ప భక్తపాలన దీక్షా కరుణారసవీక్షణా!! 
చ.1 
సంపూర్ణామృత వర్షిణీ 
అఖిలాపదామప హారిణి 
తుహినాచల వాసిని 
నిర్భాగ్య తోషిణి 
చ.2 
సర్వసంపత్కరీ మాంగల్యగౌరీ 
పల్లవారుణపాణి సౌందర్యలహరీ 
రజతాచలేశ్వరుని అర్ధాంగినీ 
మల్లికాసుమగాన ఉత్సాహినీ ॥

580. మృణాళమృదుదోర్లతా 

ప మృణాళ మృదుదోర్లతా శ్రీ మాతా 
అ.ప గంధపుష్ప సుపూజితా ॥ 
చ.1 
వరదాభయ కరకమలా 
పాశాంకుశమృదుల హస్తా 
శిరీష కుసుమ పేశలా 
మాతృకా త్రిపురాంబికా ॥ 
చ.2 
సమస్త యోగి సజ్జన నుతా 
సోమశేఖరుని సుందరీమణీ 
పుత్రవత్పాలితాదేవీ 
మల్లికాకుసుమ గీతానందినీ ॥

581. మహనీయా

ప మహనీయా నిత్యప్రసన్నా 
అ.ప ఇంద్రాదిదేవతా ఆరాధనీయా ॥ 
చ.1 
హ్రీంకార వాసినీ వేదాంతర్భూత 
పరమ సంవేత్మికా పరమాతృకా 
మన్మధ జితమూర్తి చాముండికా 
శివ తపః ఫల విభ్రమా ॥ 
చ.2 
ఘనస్తన తటీ జగన్మోహినీ 
శివపద ధ్యానామృతైకరసికా 
మృదుమాధురీ సరస సంగీత 
మల్లికాసుమగాన రసికా ॥

582. దయామూర్తిః

ప. దయామూర్తీ అనాహత పద్మ వాసిని ॥ 
అ.ప ఎంతదయామతివమ్మా శంకరీ ॥ 
చ.1 
అఖిలకోటి బ్రహ్మాండనాయకీ 
కరుణాకరి శ్రీ చక్రేశ్వరీ 
దీనజనావని ఆశ్రిత పోషిణీ 
సర్వానందమయ చక్రవాసిని ॥ 
చ.2 
నా అపరాధములన్నియు మరచి 
హేరంబునివలె ప్రేమతోబ్రోచి 
క్రీగంట చూడవే దయాశాలినీ 
మల్లికాకుసుమ గానవిహారిణి ॥

583 మహాసామ్రాజ్యశాలినీ 

ప. మహాసామ్రాజ్యశాలినీ శ్రీకరీ 
అ.ప చతుర్దశ భువన మండలవిహారిణీ ॥ 
చ.1 
భృంగీ,నందీశులు నినుసేవింప 
నారదాతుంబురులు నిన్నుస్తుతియింప 
కైలాసమందున కంబుకందరు గూడి 
ప్రమధాది గణముల సేవలందే తల్లి ॥ 
చ.2 
ఈజగమంతా నీసంతానమే 
నీకనుసన్నల నిలచును కాదా 
మాఇలవేలుపు నీవనినమ్మితి 
మల్లికాకుసుమ పూజితచరణి ॥

584. ఆత్మవిద్యా

ప. ఆత్మవిద్యా మహావిద్యా 
అ.ప బ్రహ్మవిద్యా స్వరూపిణీ ॥ 
చ.1 
కుటిల కచముల కఠిన కుచముల 
అభిదాకృతీ అచిదాకృతీ 
కార్య కారణ చిద్రూపిణీ 
పరమశివు పుణ్యాలరాశి॥ 
చ.2 
హాటకాభరణోజ్వలా 
హంసవాహనసమారూఢా 
అగస్త్యాదిమునివందితా 
మల్లికాసుమగానసుందరీ ॥

585. మహావిద్యా 

ప. మహావిద్యా తత్వాతీతా 
అ.ప శుద్ధవిద్యా మహేశ్వరి | 
చ.1 
సృష్టికూటమియందు వెలసిన 
బ్రహ్మరూపిణీ విష్ణురూపిణీ 
స్థితికూటమునందు నిలచిన 
పృధ్వీ రూపిణి రుద్రాణి రూపిణి ॥ 
చ.2 
సంహారకూటనిలయిని శ్రీవిద్యా 
మంత్ర యంత్ర  తంత్ర రూపిణి 
త్రిగుణాత్మికా త్రిదశేశ్వరి 
మల్లికాసుమగానసహిత ॥

586. శ్రీవిద్యా

ప. శ్రీవిద్యా పంచభూతమయీ 
అ.ప మల్లికాకుసుమగానమయీ॥ 
చ 1
హాటకాంబరీ విష్ణుసహోదరి 
పరమదయాకరి నిరుపమగౌరీ 
పంచదశీ మహామంత్రార్ధా 
శ్రీచక్రేశ్వరి తత్వాతీతా ॥ 
చ. 2 
మాతోడుగా నీవు నిల్చినంతనే చాలు 
చింతలే తొలగును కలుగును పుణ్యాలు 
సమసిపోవునుకదా ఆజన్మ పాపాలు 
అందుకోవేతల్లి మావిన్నపాలు ॥

587. కామసేవితా

ప కామనేవితా కామేశీ 
అ.ప కాంచీరత్న విభూషణా ॥ 
చ .1 
కృపాకందళీ సంతాప విచ్చేదినీ 
మధుర వచనీ మతంగ గజగామినీ 
శివనేత్రామృత ప్రవాహినీ 
త్రిలోచనా త్రిలోకసుందరీ 
చ.2 
మనసిజ కృపాలీలా 
శిధిలిత తమోలీలా 
ఆగమ విపినమయూరీ 
మల్లికాకుసుమ గానమాధురీ ॥

588. షోడశాక్షరీ విద్యా

ప శ్రీ షోడశాక్షరీ విద్యా కామరాజ మంత్రాన్వితా 
అ.ప శ్రీబీజ సమన్వితా శ్రీవిద్యా ప్రకీర్తితా 
చ.1 
పంచ ప్రణవాధరీ 
మహాషోడశికారూపా 
తంత్ర మంత్ర విశేష 
సూర్యమండలానువర్తినీ 
చ.2 
సకలాధిష్టాన రూపా 
సదాశివ కుటుంబినీ 
సకలోత్తమ సంస్తుతా 
మల్లికాకుసుమ గానస్థితా ॥

589. త్రికూటా 

ప త్రికూటా పరమేశ్వరి 
అ.ప ఇచ్చాజ్ఞాన శక్తి కూటైకరూపిణీ ॥ 
చ.1 
చంద్ర సూర్యాగ్ని మండలత్రయము 
బ్రహ్మ విష్ణు శివ మూర్తి త్రయము 
బీజత్రయములు గుణత్రయములు 
పీఠ త్రయములు నీనిలయములే 
చ.2 
త్రైలోక్య మోహన రూపిణీ 
కామేశ్వర గృహేశ్వరి కామిని 
హ్రీంకారవేద్యా హలా మదాలసా 
మల్లికాకుసుమ గానలాలసా ॥

590. కామకోటికా

ప. కామకోటికా శివసన్నిహితా 
అ.ప అంకిత శంకరదేహా ॥ 
చ.1 
కలకల రణత్కాంచీ 
విభూషణ మాలికా 
సమస్త ఫల దాత్రీ 
ఓంకార పంజరశు॥ 
చ.2 
పరమశివ వధూటీ 
మోహితాజాండ కోటీ 
మునినుత పరిపాటీ 
మల్లికాసుమగానవాటీ ॥ ||

591. కటాక్షకింకరీభూతకమలాకోటి సేవితా 

ప. కటాక్షకింకరీభూతకమలాకోటి సేవితా 
అ.ప ఓఢ్యాః పీఠనిలయా బిందుమండలవాసినీ ॥ 
చ.1 
కోటిశివయోగినీ గణ సేవితా 
శ్రీచక్ర సామ్రాజ్య సంచారిణీ 
కారుణ్య లోలామృత వర్షిణీ 
అద్వితీయ శక్తి ఉపాస్యరూపిణీ II 
చ.2 
త్రిజగదాశ్రిత త్రిశక్తిమయీ 
శృంగారాది నవరసమోహినీ 
హిమగిరి తపః పరిపాక రూపిణీ 
మల్లికాసుమగానమనోహరిణీ॥

592. శిరఃస్థితా

ప. యోగిజన శిరస్థితా 
అ.ప శ్రీచక్రబిందునిలయా ॥ 
చ.1 
చంద్రశేఖరుని రాణి 
కళ్యాణీవినీలవేణి 
పాశాంకుశ వరదపాణి 
అంతరాకాశరూపిణీ ॥ 
చ.2 
ఖేచరీ ఖట్వాంగధారిణీ 
బ్రహ్మరంధ్ర నివాసినీ 
సప్తఋషిమండల చారిణీ 
మల్లికాసుమగాన భూషిణీ ॥

593. చంద్రనిభా

ప చంద్రనిభా షోడశ కళాప్రపూర్ణా 
అ.ప చంద్రకాంత మణికంఠసన్నిభా॥ 
చ.1 
చంద్రచూడా చంద్రికా 
చంద్రమండల మధ్యస్థా 
చంద్రహాసిని చారుధాత్రీ 
చంద్రామృత రసపుతా!! 
చ.2 
నిఖిలాగమాంత రసికా 
చందనాంచిత ఫాలభాగా 
కోటిచంద్రనిభాకృతీ 
మల్లికాసుమకోమలాకృతీ ||


594 ఫాలస్థా

ప హ్రీంకారరూపిణీ ఫాలస్తా 
అ.ప ఆజ్ఞాచక్రనివాసిని భువనేశ్వరి ॥ 
చ.1 
ఐశ్వర్యాత్మకము హ్రీంకారము 
పురుషార్ధసాధకము హ్రీంకారము 
మధుర రసాత్మకము హ్రీంకారము 
మాధుర్యభరితము హ్రీంకారము ॥ 
చ.2 
హ్రీంకార జప సుప్రీతా 
మూలమంత్రాత్మిక హ్రీంబీజ 
హ్రీంకార కోశాంతర్వర్తిని 
మల్లికాసుమగాన హ్రీంకారిణి ॥

595. ఇంద్రధనుఃప్రభా

స్వరకర్త - శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి

ప ఇంద్రధనుః ప్రభా జయప్రభా 
అ.ప శశిధరకలయాంకిత మౌళి ॥ 
చ.1 
సర్వవర్ణే సంధ్యావిద్యే 
సప్తవర్ణ తేజోరాశి సరస్వతీ 
యోగినీహృదయముల సప్తరంగుల 
కాంతులను వెదజల్లు విద్యాధరీ ॥ 
చ.2 
మధురదరస్మిత వదనారవింద 
సర్వయోగిజన వందితబృందా 
శివపదధ్యాన పరమానందా 
మల్లికాసుమగాన బ్రహ్మానందా॥


596, హృదయస్థా

ప. భక్తజన హృదయస్థా 
అ. ప ఋషిదేవ నమస్కృతా 
చ.1 
కురువిందదళాకార 
కుండలీ కుముదాలయా 
గంధర్వ అప్సరోసేవితా 
ఛిద్రోపద్రవ భేదినీ 
చ.2 
పరమేశ్వరహృదయినీ 
భక్త సులభా భ్రామరీ 
హ్రీంకారాంకిత తనూవల్లరీ  
మల్లికాసుమ గానహృదయినీ ॥

597. రవిప్రఖ్యా

ప. రవిప్రఖ్యా త్రిపురసుందరీ 
అ.ప సూర్యమండల మధ్యస్థా ॥ 
చ.1 
పాశాంకుశ ధనుర్బాణ హస్తా 
ఆదిత్య పరిసేవితా ఇష్టదా 
కందర్ప సూతికాపాంగీ 
సర్వపురుషార్ధ ప్రదాయినీ ॥ 
చ.2 
సంవిత్స్వరూపిణీ 
సమస్తక్రియాకారిణీ 
ఈశ్వర ప్రేరణ కరీ 
మల్లికాసుమగాన సుఖకరీ ॥

598. త్రికోణాంతరదీపికా 

ప. త్రికోణాంతరదీపికా 
అ.ప తురీయ పదగామినీ 
చ.1 
త్రికాలజ్ఞాన సంపన్నా 
త్రివళీ త్రిజగద్వంద్యా 
త్రివిష్టపా త్రిలోచనా 
త్రివిక్రమ పదాక్రాంతా 
చ.2 
సూర్య చంద్రాగ్ని మండల మందున 
పూజలందుకొను త్రిదశేశ్వరీ 
త్రిలోచన మనోల్లాసినీ 
మల్లికాకుసుమగాన హర్షిణీ ||

599. దాక్షాయణీ

ప. దాక్షాయణీ భక్తరక్షణీ 
అ.ప దక్షప్రజాపతిసుత వేషధారిణి ॥ 
చ.1 
స్వధర్మ పారీణ సులభా 
ఆపీన పయోధరా 
శ్రేష్ఠ ధర్మాత్మ వందిత 
బ్రహ్మ విష్ణు సంసేవితా ॥ 
చ. 2 
దక్షాధ్వర వినాశిని 
వీరభద్ర జననీ మోహినీ 
కస్తూరీ తిలకోల్లాసిని 
మల్లికాసుమగానాహ్లాదిని ॥

600. దైత్యహంత్రీ

 ప. దైత్య హంత్రీ నవదుర్గారూపిణీ 
అ.ప కాంతారవాసినీ వరవర్ణినీ ॥ 
చ.1 
కుంకుమ శోభిత ఫాలలోచనీ 
సర్వోపద్రవ వారిణీ 
త్రికాల జ్ఞాన సంపూర్ణా 
బ్రహ్మవిష్ణు శివాత్మికా ॥ 
చ.2 
పద్మరాగ మణిమేఖలా వలయిని 
మారవైరి సహచారిణీ తారిణీ 
మధుకైటభ మహిషాసుర మర్దనీ 
మల్లికాసుమగాన వినోదినీ ॥

601. దక్షయజ్ఞ వినాశిని
ప. దక్షయజ్ఞ వినాశిని ఈశతాండవ సాక్షిణీ 
అ.ప. పరమేశ్వర నిత్యానుపాయిని 
చ.1 
ధ్యాననామ సంకీర్తనముల 
పూజా వందన కైంకర్యముల 
జడులకు సైతము జ్ఞానము కలిగించు 
మంగళరూపిణీ సర్వమంగళా ॥ 
చ.2 
వింధ్యా వాసిని దాక్షాయణి 
శంకరదేశిక మాన్యపదా 
అష్టాదశ పీఠ నిలయినీ 
మల్లికాకుసుమ గానలోలినీ ॥

602 దరాందోళిత దీర్ఘాక్షీ
ప. దరాందోళితదీర్ఘాక్షీ అభయప్రదాయినీ 
అ.ప ఆకర్ణాంత విశాలలోచనీ కరుణామృత వీక్షణీ!! 
చ.1 
మన్మధుని బ్రతికించిన కాతరేక్షణి 
గణేశుని లాలించే ఈశ్వరేక్షణి 
కమనీయదరస్మిత హరిణేక్షణీ 
కుంచిత భ్రూ చాపాంచిత విశాలాక్షిణి ॥ 
చ.2 
కామారినేవరించిన కామాక్షీ 
మహిషాసుర మదమణచిన రక్తాక్షీ 
మూగకైన కవితనొసగు కరుణాకటాక్షీ 
మల్లికాసుమగాన చంచలాక్షీ ॥

603. దరహాసోజ్వలన్ముఖీ 
ప. దరహాసోజ్వలన్ముఖీ సుముఖీ 
అ.ప హిమవత్పర్వత వంశభూషణీ ॥ 
చ.1 
నీలారవింద లోచనా 
లోలాలక అలికేక్షణా 
సోమార్ధ ముద్రిత కుంతలా 
కాలకంఠ సహధర్మచారిణీ ॥ 
చ.2 
పరమేశునిమది ఝల్లుఝల్లుమను 
నీచిరునవ్వే అమృతపుజల్లు 
సర్వేశ్వర హృదయస్పందినీ 
మల్లికాకుసుమగానప్రేరణీ ॥

604. గురుమూర్తిః
ప. సుజ్ఞానజ్యోతిని వెలిగించే గురుమూర్తి 
అ.ప అజ్ఞానతిమిరములు తొలగించు గురుమూర్తీ॥ 
చ.1 
అఖండమండలాకారమై 
విశాలవిశ్వమున వ్యాపించిన 
గురువే విష్ణువు గురువే బ్రహ్మా 
గురువే అధికుడు మహేశుడు || 
చ.2 
ఆది గురువులు ఉమామహేశులకు 
అనాదిగురువు దక్షిణామూర్తికి 
హాదిగురువు శంకరాచార్యులకు 
మల్లికాకుసుమ గానాంజలులు ||

605. గుణనిధి
ప. సత్వరజస్తమో గుణనిధి 
అ.ప జ్ఞాన వైరాగ్యాది సద్గుణ నిధి ॥ 
చ.1 
నవవ్యూహాత్మక పరానంద 
పరాశక్తి చిదానంద భైరవి 
నిర్గుణ సగుణ బ్రహ్మోపాసనా 
చింతిత ఫలపరిపోషణా ॥ 
చ. 2 
కారణాచతుర యశోనిధి 
స్వప్రకాశ చైతన్య రూపనిధి 
భక్త జనాశ్రయ కృపాపయోనిధి 
మల్లికాకుసుమ గాన సుధానిధి ॥

606. గోమాత
ప. గోమాత నీకు వందనములమ్మా 
అ.ప మాఇంట వెలసినమహలక్ష్మివమ్మా ॥ 
చ.1 
బ్రహ్మాది దేవతలు నీలోననిలచి 
నాల్గుపాదములతో ధర్మమునునిలుప 
నీక్షీరమే అమృతధారలై కురిసి 
సకలలోకాలకు జీవనము నందించు॥ 
చ.2 
నీపంచగవ్యములు పంచామృతములై 
యాగములలో భాగమై నిలచునే 
నీ పంచితమే గంగతీర్ధమ్ముగా 
పంచపాతకములను హరియించునే ||

607. గుహజన్మభూః 
ప. పంచకోశాంతరస్థితా గుహజన్మభూ 
అ.ప.  భక్త హృదయ నివాసినీ హాసినీ ॥ 
చ.1 
గుహ్యా గురుగుహజననీ 
ఈశ్వరత్వ విధాయినీ 
ఈతిబాధావినాశినీ 
హత్యాది పాపశమనీ 
చ.2 
బ్రహ్మానపాయినీ బ్రాహ్మణీ 
కారణపర చిద్రూపా 
కఠిన స్తనభర నమ్రా 
మల్లికాకుసుమ గానవినమ్రా ॥

608. దేవేశీ
ప. దేవేశీ త్రిపురాధి వాసిని 
అ.ప హరిద్రా కుంకుమ లిప్తాంగీ ॥ 
చ.1 
ఇంద్రాదిదేవతలు దాసభావముతో 
నీచరణ యుగమును ఆశ్రయింతురే 
సర్వాంగ సుందర నిత్యయౌవ్వనా 
హస్తి కృత్తి ప్రియాంగనా ॥ 
చ.2 
నీపాదోద్భవ పరాగములు 
మాజీవితములను రక్షచేయునే 
లాక్షా రసాలంకార పాదపద్మయుగళా 
మల్లికాసుమగాన సంకీర్తితా ||

609 దండనీతిస్థా 
ప. దండనీతి నీతిశాస్త్ర విశారదా 
అ.ప సకలశాస్త్ర విజ్ఞాన నైపుణీ ॥ 
చ.1 
విజ్ఞాన బోధకమైన విద్యలను 
ధర్మార్ధ విచక్షణలను 
అర్ధానర్ధ బోధకములను 
భక్తులకు బోధించు శుకపాణి వాణి ॥ 
చ.2 
దుర్మార్గులను దండనచేసి 
సన్మార్గులను రక్షణ చేసే 
చిరతర సుచరిత కలభా 
మల్లికాకుసుమ గానసులభా ॥

610. దహరాకాశరూపిణీ
ప. హృదయకమల విహారిణీ దహరాకాశ రూపిణీ 
అ.ప యోగాతీత హృదయా శ్రీకరీ ॥ 
చ.1 
నాదబిందు కళాత్మికా 
బ్రహ్మ విష్ణు శివాత్మికా 
సూర్యతేజ చంద్రశీతల 
చిదంబర శరీరిణీ 
చ.2 
యోగినీహృదయ పంకజవాసిని 
అణురేణుతృణకాష్ట స్వరూపిణీ 
మందహాస మనోజ్ఞసుందరీ 
మల్లికాకుసుమ గానవైభవీ ॥

611. ప్రతిపన్ముఖ్యరాకాంత తిధిమండల పూజితా 
ప ప్రతిపన్ముఖ్యరాకాంత తిధిమండల పూజితా 
అ.ప షోడశ కళారూపిణి బాలాత్రిపురసుందరీ ॥ 
చ.1 
పాడ్యమినందు పూజలందుకొను కామేశ్వరి 
విదియ తదియలందు భగమాలిని నిత్యక్లిన్నా 
చవితియందుభేరుండ పంచమిన వహ్నివాశిని 
షష్టి యందు వజ్రేశ్వరి సప్తమితిధి శివదూతి॥ 
చ. 2 
అష్టమి నవమినందు త్వరితకులసుందరి 
దశమినందు నిత్య ఏకాదశి నీలపతాక 
ద్వాదశివిజయత్రయోదశిసర్వమంగళ 
చతుర్దశి జ్వాలామాలిని పూర్ణిమ చిత్రారూపిణి ॥

612. కలాత్మిక
ప. సర్వకలామయీ కలాత్మికా 
అ.ప కనకరుచిశీలా శ్రీకళా 
చ.1 
చంద్రకళలు అగ్ని కళలు 
సూర్యకళల స్వరూపిణీ 
నాదబిందుకళాధరీ 
కలమంజుల భాషిణీ ॥ 
చ.2 
రవిచంద్రాగ్ని లోచనీ 
కందర్ప శతకోటిరూపిణీ 
కంబుకందరు సహచారిణీ 
మల్లికాకుసుమగానకారిణీ ॥

613. కలానాధ
ప. చంద్రకళాధరి కలానాధా 
అ.ప చంద్రమండల వాశిని ॥ 
చ.1 
చంద్రభాసమాన చంద్రచూడా 
చంద్రావతంస సహధర్మ చారిణీ 
ఆదిమపురుష నయనపీయూష 
మధురదనుషా చిద్వపుషా ॥ 
చ.2 
కామేశ్వరీ భగమాలినీ యనుచు 
పదహారు కళలతో విలసిల్లు దేవీ 
షోడశ తిధులందు పూజలందుకొను 
మల్లికాసుమగాన మంగళచరణీ ॥

614. కావ్యాలాప వినోదినీ
ప. కావ్యాలాప వినోదినీ కామేశ్వరీ 
అ.ప సంగీత సాహిత్య సరసవినోదిని 
చ.1 
నీగానములే మాకు పానము 
నీనామములే మాకు ప్రాణము 
వెతికి వెతికి నే వేసారితినే 
మమ్ము కావగా జాలమేలనే 
చ.2 
శృతి రాగ లయ విన్యాసినీ 
వీణాగాన వినోదమోహినీ 
సత్కవీ హృదయనివాశినీ 
మల్లికాసుమగానాలాపినీ 

615. సచామరరమావాణీ సవ్యదక్షిణ సేవితా 
ప. సచామరరమావాణీ సవ్యదక్షిణ సేవితా 
అ.ప. కాదంబవనవిహారిణి సర్వమంగళకారిణీ ॥ 
చ.1 
స్వర్ణమణిమయ కంకణములు 
హారములు కానుకలనిచ్చి 
కురులుదువ్వి పూలు ముడిచి 
లక్ష్మి సేవలు చేయునే 
చ.2 
పసుపు పూసి గంధమలది 
నుదుట కుంకుమ రేఖ దిద్ది 
మల్లికాసుమగానములతో 
వాణి హారతులిచ్చునే ॥

616. ఆదిశక్తి
ప ఆదిశక్తి శరణు శరణు 
అ.ప మహాశక్తి శరణు శరణు 
చ.1 
భువనమోహిని సింహవాహిని 
త్రిపురాధి వాశీని శరణు శరణు 
ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి 
క్రియాశక్తి శరణు శరణు || 
చ.2 
నిర్వికారిణి సాధు' పోషిణి 
ఆర్త రక్షణి శరణు శరణు 
మల్లికాసుమ గానవిలసిత 
శివశివానీ శరణు శరణు ॥

617. అమేయాత్మా 
ప. అమేయాత్మా విశ్వాత్మా 
అ.ప సృష్టిస్థితిలయ కారణా ॥ 
చ.1 
అణువుకన్నా చిన్ననైనది 
జగములన్నీ నిండియున్నది 
ఆది మధ్య అంతములేనిది 
సత్యమైనది నిత్యమైనది ॥ 
చ. 2 
జ్ఞానమయమై విశుద్ధమై 
ఆనందమయమై అనంతమై 
బ్రహ్మమై పరబ్రహ్మమై 
మల్లికాసుమగానమైనది ॥

618. పరమా
ప. పరమా ప్రేమామృత సాగరీ 
అ.ప నిత్యసనాతనీ పరమపూజ్యా ॥ 
చ. 1 
పరాశక్తి పరమాత్మికా 
పరాన్ముఖమేలనే పరాత్పరీ 
చిదగ్ని సముద్భవా 
పరతంత్రా త్రిపురేశ్వరి ॥ 
చ.2 
నిఖిల వాగ్విభూతి 
అఖిలతంత్ర రూపిణివి 
పరానంద సంధాయిని 
మల్లికాసుమగాన హృదయా॥

619. పావనాకృతి
ప. విశ్వవికృతిమయీ పావనాకృతీ 
అ.ప గంగాధర పరతంత్రీ ॥ 
చ.1 
కళ్యాణీ సంకల్పసిద్ధాకృతీ 
కంబుకంధరు రాణి సులభాకృతీ 
అరవిందాసనీ కృతప్రకృతీ 
కనకమణికలిత శృంగారాకృతి | 
చ. 2 
విద్రుమశూలినీ సూక్ష్మాకృతీ 
సిందూర రంజితా స్థూలాకృతీ 
నిత్యప్రసన్నా హ్రీంకారాకృతీ 
మల్లికాకుసుమ సంగీతాకృతీ ॥

620 అనేకకోటి బ్రహ్మాండజననీ 
ప అనేకకోటి బ్రహ్మాండజననీ 
అ.ప పరశివ వామాంక నిలయినీ ॥ 
చ.1 
విద్రుమశాలినీ సురజన పాలినీ 
బ్రహ్మాండ భాండోదరీ మహేశచాలినీ 
సమరోద్దండ విపక్ష కాలినీ 
భైరవ మండలినీ నాట్యవిలోలినీ ॥ 
చ. 2 
కైవల్యానందా శుభగుణ శాలినీ 
ఫణిరాజభూషణి దనుజదలినీ 
మల్లికాసుమగాన రసాహ్లాదిని 
కామేశ్వర హృత్కేళినీ శూలినీ ॥

621 దివ్యవిగ్రహా
ప. దివ్యవిగ్రహా హైమవతీ 
అ.ప బహుశోభమానా దాక్షాయణీ 
చ.1 
కరుణామృతము చిలుకు నీకటాక్షములు 
శివుని హృదయమున రాగబంధమును 
మునుల హృదయమున వైరాగ్యబంధమును 
కలిగించునే త్రిపురతాపన పత్నీ ॥ 
చ.2 
ఒక్కక్షణము నీచూపుసోకినచాలు 
ఆజన్మ కురూపి మన్మాధాకారుడౌను 
పుట్టుమూగకు కవితలబ్బును 
మల్లికాకుసుమగాన సంచారియగునే ॥

622 క్లీంకారీ
ప. సదాశివమయీ క్లీంకారీ 
అ.ప పరశివమయ పుష్ప పర్యంకా॥ 
చ.1 
ఏకవీర సంసేవ్యా 
సర్వాతిశయ ప్రభాభాసురా 
ఏకాతపత్ర సామ్రాజ్యప్రద 
కలానాధముఖీ కామేశీ ॥ 
చ.2 
కామితార్ధమునిచ్చు కామేశ్వరీ 
క్లీంకార రూపిణీ రాజేశ్వరీ 
హ్రీంకారలక్షణా త్రిపురేశ్వరీ 
మల్లికాకుసుమగాన పీఠేశ్వరీ||

623 కేవలా
ప. కరుణాలవాలా కేవలా 
అ.ప కలావినోదినీ కైవల్య ॥ 
చ.1 
హ్రీంకారనందనారామా 
నవకల్పకవల్లరీ 
నిత్యకల్యాణశీల 
సర్వాంగసుందరీ 
చ.2 
శివానంద సంధాత్రీ 
జగదేక జనయిత్రీ 
సర్వజన వందితా 
మల్లికాసుమగానకేవలా॥

624 గుహ్యా
ప. రహస్య మంత్రార్ధ రూపిణీ గుహ్యా 
అ.ప షోడశీ మంత్రార్ధ రహస్య శ్రీవిద్య ॥ 
చ.1 
మాతృకా బీజ రూపిణీ 
బ్రహ్మవిద్యా ప్రదాయినీ 
మృణాళీ తంతురూపిణీ 
సర్వ మంత్ర ఫలప్రదాయినీ ॥ 
చ. 2 
ఈషణ త్రయనిర్ముక్తా 
ఈంకారమంత్రాత్మికా 
రజతాచలవాసినీ 
మల్లికాకుసుమగాన హంసికా ॥

625 కైవల్యపదదాయినీ
ప కైలాస నివాసినీ కైవల్య పదదాయిని 
అ.ప శరణాగత దీనార్ధ పరిత్రాణ పరాయణీ ॥ 
చ.1 
ఆదిమధ్యాంత రహిత షోడశీ 
తాపత్రయ విమోచనీ వైష్ణవీ 
సంసార విషనాశని శాంకరీ 
ఉత్తమపద ప్రదాయినీ శ్రీకరీ ॥ 
చ. 2 
ద్యుతిమతీ ధీమతీ 
శశిశేఖర ప్రియసతీ 
రజతాచలవాసినీ అందుకొనుము మావినతీ 
మల్లికాసుమగాన సన్నుతీ ॥

626 త్రిపురా
ప త్రిలోకవాసినీ దేవీత్రిపురా 
అ.ప త్రిపురాసుర సంహారిణి ॥ 
చ.1 
త్రైలోక్య మోహనాంగి 
త్రిలోకపావనీ 
సంహార త్రయ కారిణీ 
త్రికాల జ్ఞానదాయినీ 
చ.2 
ఏకభక్తి మదర్చితా 
మైథిలీవరసేవితా 
సమానాధిక వర్జితా 
మల్లికాసుమగాన సంస్తుతా ॥

627 త్రిజగద్వంద్యా
ప. త్రిజగద్వంద్యా మంగళ చరితా 
అ.ప నటితనటీ నటరాజమోహినీ ॥ 
చ.1 
నీపదయుగళము నెన్నుదిటితో తాకి 
శతకోటి వందనములను చేతుమే 
నానుదిటి పైనున్న దురదృష్టరేఖలను 
నీపాదరజముతో తొలగింపవే ॥ 
చ.2 
పాపముల కడతేర్చి కోరికలు ఈడేర్చి 
ఈతిబాధలు తీర్చి కరుణతో దరిజేర్చవే 
శర్వాణి రుద్రాణి కళ్యాణ కారిణీ 
మల్లికాసుమగాన మంగళదాయినీ ॥

628 త్రిమూర్తిః
ప. దివ్యరూప కన్యకామణి త్రిమూర్తి 
అ.ప లక్ష్మీ వాణీ నిషేవితా సుందరమూర్తి॥ 
చ.1 
సుందర మహనీయ చిద్విలాస మూర్తి 
సిందూరారుణ శాలిని మంగళమూర్తి 
నీలకంఠ ప్రియాంగనా శృంగారమూర్తి 
రిపుమర్దిని సురపాలిని ధర్మమూర్తి ॥ 
చ.2 
యోగీంద్రజనమానస యోగమూర్తి 
ఓంకారనాదప్రియ ఓంకారమూర్తి 
బ్రహ్మజ్ఞాన త్రిగుణాత్మికా పావన మూర్తి 
మల్లికాసుమగాన మోహన మూర్తి ॥

629 త్రిదశేశ్వరీ
ప. సృష్టి స్థితి లయ త్రిదశేశ్వరి 
అ.ప నిత్యయౌవ్వనా రాజేశ్వరీ॥ 
చ.1 
త్రిగుణాతీత త్రిజగన్మాత 
త్రిమూర్తి రూపా త్రిజగద్వంద్యా 
త్రిలోకమోహన త్రిమూర్తి పూజితా 
త్రికోణార్చితా త్రిపురమాలినీ ॥ 
చ.2 
త్రివర్గాత్మిక త్రివర్ణాత్మిక 
త్రిపధ గామినీ త్రిస్వర త్రిపురా 
బ్రహ్మవిద్యా శివతత్వరూపిణి 
మల్లికాకుసుమగాన త్రినేత్రీ ॥

630 త్ర్యక్షరీ
ప శుద్ధ విద్యా కుమారీ త్ర్యక్షరీ 
అ.ప త్రివర్ణ మంత్ర స్వరూపిణీ ॥ 
చ.1 
వాగ్భవ బీజ వాగీశ్వరీ 
వైభవ మోక్షరూపిణీ 
కామబీజాత్మక కామేశీ 
క్రియాశక్తివి కామరూపిణీ ॥ 
చ. 2 
శక్తిబీజాత్మిక పరాశక్తి 
ఇచ్ఛాశక్తివి శివరూపిణి 
అక్షరత్రయ విభాగరూపిణి 
మల్లికాకుసుమగాన దాయినీ ॥

631 దివ్యగంధాడ్యా
రాగం - ఆనందభైరవి

ప. శృంగారవేషాఢ్యా దివ్యగంధాఢ్యా 
అ.ప మరకతమణిమయ అలంకారప్రియా ॥ 
చ.1 
ఘనసార హారవలయా 
సుందరతర పరదేవతయా
కరుణారస కింకరయా  
సూర్యప్రభావిరాజితయా 
చ. 2 
కామేశాలింగన పులకాంకితయా 
నిరుపమానంద కందళితహృదయా 
హ్రీంకారనందనోద్యాన నిలయా 
మల్లికాకుసుమగాన పరిమళయా |॥

632 సిందూరతిలకాంచితా 
రాగం - కాపీ

ప. సిందూరతిలకాంచితా 
అ.ప మల్లికాకుసుమసంశోభితా 
చ.1 
నీఫాలమున రక్తకుంకుమై మెరవనా 
నీకంటిపాపనై నివసింపనా 
రత్నాల హారమై నీకంఠసీమలో 
అందాలు చిందింపనా॥ 
చ.2 
తాంబూలరసముతో తడిసిన అధరాల 
మందస్మితమునై హరుగెలవనా 
మణిమేఖలైనేను శోభించనా 
అందెనైనీపాదమున రంజిల్లనా॥

633 ఉమా
రాగం - కానడ

ప. ధరాధరేంద్ర నందినీ ఉమా 
అ.ప సింధువనదేవతాప్రణవస్వరూపిణీ ॥ 
చ.1 
హిమవంతుని గారాల పట్టివై పుట్టి 
శివుని భర్తగా వరించి తపసుచేయ పోవగా 
ఓయమ్మా వద్దనివారించెనుమేనక 
ఉమా అన్న నామమే సార్ధకమై నిలచెను ॥ 
చ. 2 
అ.. ఉ.. మకారములు ఓంకారము 
ఉమానామమే దేవీప్రణవము 
పంచభూతాత్మికము త్రిమూర్త్యాత్మకము 
మల్లికాకుసుమగాన శక్త్యాత్మకము

634 శైలేంద్ర తనయా
రాగం - వలజి

ప 
శైలేంద్ర తనయా సదయ హృదయ      
కైలాసగిరి నిలయా కరుణాలయా||           
1. 
పార్వతీ కాత్యాయని గౌరీ ఉమా 
మేనకా హిమవంతుల పూజాఫలమా 
చంద్రాభరణా పుర హరజాయా  
అద్రిసుతా అపర్ణా శంకర నయనామృతా         
2. 
లబ్దపతీ స్వానురాగ శరదిందు చంద్రికా              
శివపాద పూజితా శివనిధీ విభాసిని        
శీతాలోచనపాతా శాశ్వతీ మాతా      
మల్లికా కుసుమగాన పల్లవితా

635. గౌరీ
ప. జయ జయ గౌరీ శ్రీ గౌరీ 
అ.ప జయనగరాజకుమారీ ॥ 
చ.1 
మంగళ దాయిని మంగళగౌరీ 
షోడశకళలతో వెలిగేదేవీ 
షోడశ పూజలు చేసెదమమ్మా 
గౌరాంగసతీ వరమీయవమ్మా ॥ 
చ.2 
అష్టసంపదలనిచ్చు సంపదగౌరీ 
సౌభాగ్యమునిచ్చు షోడశగౌరీ 
కేదారేశ్వరి కేదారగౌరీ 
మల్లికాసుమగాన నిరుపమగౌరీ ॥

636. గంధర్వ సేవితా 
రాగం - కేదారగౌళ 

ప. గంధర్వ సేవితా సుమధురచరితా 
అ.ప దివ్యహార ప్రలంబితా ॥ 
చ.1 
పంచక్రోశ పరీతపూత 
దక్షిణాచారవందితా 
సంతత సదాశివార్చితా 
కామేశాలింగనా పులకితా ॥ 
చ.2 
వీణావేణు మృదంగ వాద్యముల 
మల్లికాకుసుమ సంకీర్తనముల 
గంధర్వ యక్ష కిన్నెర ప్రమధుల 
సేవలనందే రాజరాజేశ్వరి ॥

637. విశ్వగర్భా 

ప. మాయాస్వరూపిణి విశ్వగర్భా 
అ.ప. విశ్వవినోదిని విశ్వకారిణీ ॥ 
చ.1 
జలరూపమున భూమిరూపమున 
అగ్నిరూపమున వాయురూపమున 
ఆకాశములో మాయారూపమున 
విశ్వమంతయూ గర్భములోదాచు 
చ. 2 
పంచభూతముల శాసించు దేవీ 
పంచాగ్నుల మించినతేజమునీదీ 
మల్లికాకుసుమగాన మర్పింతుమమ్మా 
అవనికి శుభమును కల్పించుమమ్మా ॥

638 స్వర్ణగర్భా
శ్రీరాగం - రాగం 

ప. స్వర్ణగర్భా రత్నగర్భా ధరాధరనందినీ 
అ.ప స్వర్ణ మణిమయ సింహాసినీ ॥ 
చ.1 
మణిద్వీపనివాసినీ స్వర్ణగౌరీ 
శుభానన్దగుణార్ణవీ ఆర్యా 
చారుచంద్ర కళాధరీ తేజోమయీ 
పరమేష్టి పరబ్రహ్మరూపాధికా ॥ 
చ.2 
అష్టాదశ పీఠవాసిని అపర్ణా 
విద్యాధిదేవతా హిరణ్యవర్ణా 
సర్వపాపభంజనా సువర్ణా 
మల్లికాకుసుమగాన సవర్ణా ॥

639. అవరదా
స్వరకర్త - శ్రీమతి భారతీదేవి 
రాగం - శివరంజని 

ప పరాకేలనే అవరదా ! పరాత్పరీ 
అ.ప వరాలొసగవే బిరాన మముగని ॥ 
చ.1 
నిరాదరించుట నీకుతగునా 
చరాచరాత్మిక పురాతనీ 
నేరములెంచక సరగున బ్రోవుము 
సారసలోచని శాంతదయాపరా ॥ 
చ.2 
అష్టదిక్పాలికా వందిత 
అష్టాదశపీఠ పూజితచరణీ 
క్రూరదానవమదసంహారిణి 
మల్లికాకుసుమగాన వరదా ॥

640 వాగధీశ్వరీ
స్వరకర్త - కొమ్మూరి రాజేశ్వరి
రాగం - మోహన 

ప. వాగధీశ్వరీ వాగేశ్వరి 
అ.ప భారతి వాణీ సరస్వతీ ॥ 
చ.1 
పరాపశ్యంతి వైఖరి మధ్యమా 
పరదేవత వాగ్దేవతాస్వరూపిణి 
సర్వశ్రేయప్రదా 'మేధాప్రదా 
నవనవాద్భుత రమణీయగానప్రద |॥ 
చ.2 
కనకవల్లకీ ధారిణి బ్రాహ్మణి 
సంగీతానంద శుభదాయిని 
సాహిత్యామృత సారసలోచని 
మల్లికాసుమ గానాస్వాదీని ॥

641 ధ్యానగమ్యా
ప ధ్యానగమ్యా అగమ్యా
అ.వ అనంతా అవ్యయా అలుప్తా సర్వజ్ఞా ॥
చ.1 
హ్రీంకారబోధితా వేదశాస్త్ర సన్నుతా
ధ్యాన యోగాత్మికా చరాచర విధాయినీ
సహజసుఖస్వరూపా కుతూహల విభ్రమా
కైవల్యానంద కంద సగుణబ్రహ్మ ॥
చ.2 
నిర్గుణా నిరాకారానిత్యానందదాయినీ
షడ్భావ వికార రహితస్వరూపిణీ
అఖండశాశ్వత పరమానందా
మల్లికాకుసుమగానయోగినీ 

642 అపరిచ్ఛేద్యా
ప. అపరిచ్ఛేద్య అనంతమయా
అ.ప సత్యజ్ఞానానంతమయా ॥
చ.1 
అణువణువులోనా నీరూపమే
ప్రతిజీవిలోన నీకాంతులే
నినుకొలుచువారలకు ఉన్నతిని కల్పించి
దివ్యమహిమలనిచ్చు వనదుర్గా ॥
చ.2 
నీకరుణ లేశముచూపి దురితములను బాపి
దుఃఖములు వారించి సంతోషమును నిలిపి
పరమార్ధమును కూర్చవేముక్తిప్రదా
మల్లికాకుసుమగానశుభదా ॥

643 జ్ఞానదా
ప. బుద్ధిదాయిని మోక్షదాయిని జ్ఞానదా
అ. ప తుష్టిదాయినిపుష్టిదాయినిశర్మదా ॥
చ.1 
ప్రకటయోగిని గుప్తయోగిని
జ్ఞానయోగిని మోక్షదా
విశ్వమోహిని విశ్వసాక్షిణి
విశ్వవ్యాప్తిని విశ్వదా ॥
చ.2 
జ్ఞానప్రద ముక్తిప్రద విజయప్రద ద్వివిధా
సూక్ష్మరూపసూక్ష్మతరసూక్ష్మతమ కామదా
జ్ఞానశక్తి కామశక్తి క్రియాశక్తి శక్తిదా
మల్లికాకుసుమగానదా ఘనదా ॥

644 జ్ఞానవిగ్రహా
ప జ్ఞానానందిని జ్ఞానవిగ్రహా
అ.ప పరమ శాంభవీ చిదానంద ఘనవిగ్రహా ॥
చ.1 
సకలజ్ఞాన పరమార్ధ ప్రబోధకా
అకలంకహృదయ మోహార్ణవ తారకా
మంత్రాక్షర సంకేత మాలికా
త్రిపురసుందరి పరాభట్టారికా ॥
చ.2 
జరామృత్యురోగ విమోచక
విద్వజ్జన సాధనారేచకా
అవ్యయ నిర్మల చిదాత్మ వాచకా
మల్లికాకుసుమగాన ప్రేరకా॥

645 సర్వవేదాంతవేద్యా
ప. సర్వవేదాంతవేద్యా ఉపనిషత్ సారా
అ. ప యమనియమాది అష్టాంగయోగినీ ॥
చ.1 
చతురాశ్రమధర్మములు
వేదవిహిత ఆచారములు
యజ్ఞ యాగాది క్రతువులు
నియమించే కులవర్ధని ॥
చ.2 
అసదృశ సౌందర్య రాశి
వసియింపుము నాహృదయమరసి
పరశివ ప్రేమాభిలాషి ||
మల్లికాసుమగాన సరసి

646. సత్యానంద స్వరూపిణీ
ప. సత్యానంద స్వరూపిణీ సర్వజగద్రక్షకీ
అ. ప అగణితబ్రహ్మానందసద్గురుపరమానంద ॥
చ.1 
సర్వాంతర్యామిని
సకలలోక కళ్యాణకారిణి
సామాది చతుర్వేద సమ్మత
సదతుల తైజసాత్మికా ॥
చ.2 
రవి శశి వహ్ని కిరణ సుశోభిత
సుషుమ్నాది శక్తిరూప
సుధాసారాభి వర్షితా
మల్లికాకుసుమగాన విహ్వలా ॥

647 లోపాముద్రార్చితా
ప. శ్రీవిద్యా లోపాముద్రార్చితా
అ.ప పంచదశిమహామంత్రపూజితా ॥
చ.1 
సకలయోగి వినుతచరణా
విశ్వత్రాణ పుషే
సురభి బాణజుఫా
పరంజ్యోతిషే చిద్వపుషే ॥
చ.2 
మణికలితభూషే మధురధనుషే
కారుణ్య విభ్రమ జుషే
శివ ఐశ్వర్య వపుషే
మల్లికాసుమగాన విదుషే ॥

648 లీలాక్లప్తబ్రహ్మాండమండలా
ప. లీలాక్లప్త బ్రహ్మాండమండలా కపాలకుండలా
అ.ప లీలానాటక సూత్రధారిణీ ॥
చ.1 
సృష్టి చేసెదవు లయము చేసెదవు
పాలనచేతువు లాలనచేతువు
నీవుకోపింతువు మముకరుణింతువు
నీలీలను తెలియగతరమా ॥
చ.2 
ప్రపంచమంతా కందుకముచేసి
ఆజాండబంతులాడుచుండెదవు
లీలామానుష విగ్రహరూపిణి
మల్లికాకుసుమగాన సారిణి ॥

649 అదృశ్యా
ప. ఎందుంటివే తల్లీ అదృశ్యా
అ. ప చూపులకందని నీవెవరే ॥
చ.1 
ఎవ్వరివో నీవు ఊహించలేను
ఏపేరుననిను నే పిలువగలను
నాహృదయములో నిండియుంటివే
అక్షయసౌఖ్యములొసగవె వశ్యా ॥
చ.2 
తపమల్పముచేసి ఫలమధికముకోరి
అత్యాశగానిన్ను వేడుకొందుమే
కనుపాపవలెమము కాపాడుము
మల్లికాకుసుమగానవిశుద్ధా ॥

650 దృశ్యరహితా
ప. ఎందని నినునేవెదకుదునే దృశ్యరహితా
అ.ప వెదకి వెదకి వేసారితినే ॥
చ. 1 
అండములోనా పిండములోనా
బ్రహ్మాండములోనా అణువణువులోనా
వెలుగులోనా చీకటిలోనా
హృదయములోని శూన్యములోనా॥
చ.2 
పలుకులకందవు పిలుపులకందవు
చూపులకందవు తలపులకందవు
మల్లికాకుసుమ గానమునందున
ఉందువు నీవని నమ్ముకొంటినే ॥

651 విజ్ఞాత్రీ
ప. సుజ్ఞానరూపిణీ వి జ్ఞాత్రీ
అ.ప సర్వప్రపంచ సాక్షీభూతా !
చ.1. 
సర్వేశ్వరుడన నీపతియే
కుమారుడనగా నీతనయుడే
ఆదిపూజితుడు నీసుతుడే
ఆది అనాదియు నీకుటుంబమే ॥
చ.2 
సురుచిర శుభకర మంత్ర స్వరూపిణి
వందన చందనమందుకొనగదే
మల్లికాసుమరాగ భావమాలికల
నిన్నుకొలుచుటే నాభాగ్యముగా ॥

652 వేద్యవర్జితా
ప. వేద్యవర్జితా ఈడితా
అ. ప ఈశ్వరార్ధాంగశరీరా ఈప్సితా||
చ.1 
తాదృశ చైతన్యస్వరూపిణి
ఈశానాది బ్రహ్మమయీ
దివ్యతపోమార్గదర్శినీ
తత్వార్ధరూపాత్మికా ॥
చ. 2 
నీకటాక్షమహిమాతిశయమున
కవితామృతములు జాలువారునే
దభరిత రసవంతమై నిలచు
॥ శ్రీ మల్లికాసుమగాన కవితలీయగదే॥

653 యోగినీ
ప. యోగినీ కులయోగినీ
అయోగినీ గణ సేవితా ॥
చ.1 
శివసందర్శనా కుతూహల యోగిని
పరమానంద సుఖానుభవ యోగిని
కామ క్రోధ వివర్జితాయోగిని
మహాప్రత్యంగిరాదేవతాయోగిని ॥
చ.2 
పురాణాగమ రూపయోగినీ
లీలామానుష విగ్రహ యోగినీ
బ్రహ్మజ్ఞానైకసాధనా యోగినీ
మల్లికాకుసుమగాన యోగినీ ॥

654 యోగదా
ప ఓం నమోభగవతీ యోగదా
అ.ప సుజనరక్షా దీక్షితా శుభప్రదా॥
చ.1 
భక్త శ్రేణికి ఆరాధ్యదేవతవు
ఆడంబరులకు ఆత్మదుర్లభవు
ఆశ్రితురాలను ఆనందవల్లీ
నిను సేవించేభాగ్యమునిమ్మా॥
చ.2 
బాహ్యమునందున వెలుగువునీవై
అంతరమందున జ్ఞానదీపమై
పరమార్ధమునిచ్చు యోగదీపమై
మల్లికాసుమగాన జ్యోతివినీవు।

655 యోగ్యా
ప. యోగిజన సేవ్యా యోగ్యా
అ.స మేరుశృంగాగ్రమున నివసించు దేవీ ॥
చ.1 
త్రిజగద్వంద్య పదారవిందా
నీరూపమును మేమువర్ణింపలేము
నీదయకల్గుచో సకలార్ధములు కలుగు
భవబంధములుబాపు నీపదము సేవింతు
చ.2 
నిన్నుపూజించినా నీపేరుతలచినా
మరుజన్మమేలేదు సురరాజ పూజితా
ధర్మము తప్పని జీవనమునీయవే
మల్లికాకుసుమగాన నవరాగ మాలినీ ॥

656 యోగానందా
ప శివశివాత్మికా యోగానందా
అ.ప అధర్మదండినీ కళ్యాణీ!!
చ.1 
రాగభోగాతీత సకలలోకారాధ్య
నవకోటి యోగినీ గణసేవితా
సంసార విషవృక్షనిర్మూలనా
అఖండమోక్షానంద యోగినీ ॥
చ.2 
దీనావనోల్లాస నిత్యదయాశీలా
పునర్జన్మ రహిత ముక్తిప్రదాయినీ
అష్టాంగమార్గ యోగానందా
మల్లికాకుసుమ గానానందా ॥

657 యుగంధరా
ప. కాలస్వరూపిణి యుగంధరా
అ. ప సాంప్రదాయస్థితా సమరసా॥
చ.1
ధర్మరక్ష బహురూపములుదాల్చి
జగములను పాలించు భువనేశ్వరీ
యుగములకు జగములకు సాక్షిగా నిలచిన
నిత్యదయశీల హరిణేక్షణా |
చ.2 
దుష్టులను శిక్షించు ధీరసమర్చితా
శిష్టులను రక్షించు ధర్మాత్మికా
దుష్టకలి దోషములువర్ణించి బ్రోవుమా 
మల్లికాసుమగాన సంతుష్టినీ ||

658 ఇచ్ఛాశక్తిజ్ఞాన శక్తి క్రియాశక్తిస్వరూపిణీ
ప. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియా శక్తి స్వరూపిణీ
అ.ప రమా వాణీ కళ్యాణీ ॥
చ.1 
జ్ఞానమునొసగే శరదిందు శుభ్రా
సంపదలొసగే నవవిద్రుమాభా
రాక్షస సంహారి తమాలనీలా
త్రిలోకజననీ తవపాదశరణం ॥
చ.2 
ఓఢ్యాణ పీఠేశ్వరి గిరిజాకుమారి
కొల్హాపురేశ్వరి శ్రీ మహాలక్ష్మి
కాశ్మీరమందున శ్రీ శారదాంబా
మల్లికాసుమగాన సుమనోహరీ ॥

659 సర్వాధారా
ప. జగదాధారా సర్వాధారా
అ.ప జననీ స్మితమంజరీ
చ.1
కల్మషక్లేశా మోచనకరీ ...
మమతారూపిణిగిరాదేవీ
సుజననయనా నందజననీ
త్రిభువన క్షేమంకరీ సుధామయీ ॥
చ.2
సమస్త వర్ణాత్మిక నాదరూపిణి
కవులపాలిటి భాగ్యసీమా
శమితదురితా కారుణ్యసీమా
మల్లికాకుసుమగానసుషమా॥

660 సుప్రతిష్ఠా
ప. సుప్రతిష్ఠా ప్రతిభా ప్రదాత్రీ
అ. ప సకలదేవతా అధినాయికా
చ.1 
హిమగిరి భాగ్యమా స్మితకౌముదీ
కుటిలబోధసంహారిణి
చంచలీకృత త్రిపురశాసనా
పురమధన సామ్రాజ్య విహరిణి|
చ.2 
నిగమమకుటోత్తంస కలికా
ప్రజ్ఞానామృత వరదాయినీ
నిత్యాలంకార అభిషేక ప్రియ
మల్లికాకుసుమగానామృత వర్షిణి |

661. సదసద్రూపధారిణీ
ప సదసద్రూపధారిణీ శ్రీకరీ
అ.ప కృపాతిశయకింకరీ శాంకరీ
చ.1 
కందర్పప్రియసహచరీ అనఘా
మరకతప్రభానీల కమలతరళాక్షీ
తరుణాదిత్యకిరణచరణా
కారుణ్యామృత వీచికా విహరణా ||
చ.2 
పరమసంవేదికాత్మికా సద్రూపిణి
పశ్యంతీ మధ్యమా వైఖరి వాగ్రూపిణి
మహితరూప శోభావతి తీక్షణి
మల్లికాకుసుమగాన వీక్షణి ||

662 అష్టమూర్తి
ప అష్టమూర్తి రూపిణీ శ్రీలలితా
అ.ప గుణభేదాత్మ మూర్తీ ॥
చ.1 
లక్ష్మీమేధాధరపుష్టి
గౌరీ తుష్టి ప్రభాధృతి
శుద్ధాత్మ భూతాత్మ
అష్టాత్మ రూపిణీ
చ.2 
భవుడు రుద్రుడు ఈశానుడు
కాదిహాది భూమావిద్యలు
అష్టదా పరికీర్తితా
మల్లికాసుమగాన కీర్తితా ॥

663 అజా
ప. సుజనసేవ్యా అజాద్రిజా
అ.ప కరుణ లేశము చూపవే ॥
చ.1 
దురితములను బాపవే
శత్రువర్గము నణచవే
నీధ్యానమును కలిగించవే
ముక్తిసంపద నీయవే ॥
చ. 2 
సర్వశుభములు కలుగచేసే
నిన్ను భక్తితో కొలుతుమే
భవాంబోధిని దాటించవే
మల్లికా సుమగాన సుందరీ ॥

664 జై త్రీ
ప. పర్వతరాజపుత్రీ జైత్రీ
అ.ప లలితలావణ్యమూర్తి ॥
చ.1 
భండాసురభంజనీ మహిషాసుర మర్దనీ
మోహాంధకారమున కన్నుగానకయున్న
లోకకంటకులైనరాక్షసులఖండించి
సాధులను రక్షించు ధీరగుణరమ్మా ॥
చ.2 
నవరాత్రిరోజులలో విజయదశమియందు
పూజలందుకొనే రాజరాజేశ్వరీ
అజ్ఞానమునుబాపు అధ్యాత్మ
మల్లికాసుమగాన లావణ్యశేవధీ||

665 లోకయాత్రావిధాయినీ
ష. లోకయాత్రావిధాయినీ సర్వేశ్వరీ
అ.ప త్రిలోక్యమోహన చక్రేశ్వరీ
చ.1 
జగత్పరిపాలనకు బ్రహ్మనే సృష్టించి
లోకరక్షణకు విష్ణువును సృజియించి
లయముగావించుటకు రుద్రుని నియమించి
చంద్రసూర్యాగ్నుల వెలుగుకే వెలుగైన II
చ.2 
గిరిసార్వభౌమ తనయా
మృదులస్మిత ద్యుతిమయీ
మతంగమహాముని మనోనటీ
మల్లికాకుసుమగానోల్లాసినీ |॥

666 ఏకాకినీ
ప. ఏకాకినీ పరబ్రహ్మ స్వరూపిణీ
అ.ప కళ్యాణ సందోహినీ ॥
చ.1 
జ్ఞానాంబోనిధి వీచికా
సంసారతాపహర సూచికా
ఏకానంద చిదాకృతీ
ఏకానేక అక్షరాకృతీ !!
చ.2 
అఖండైక చైతన్యరూపా
ఏకప్రాభవశాలినీ
ఏకాతపత్ర సామ్రాజ్యా
మల్లికాసుమగాన ఏకాక్షరీ ||

667 భూమరూపా
ప. సర్వాధారాస్వరూప భూమరూపా
అ.ప నిత్యసత్య అమృతస్వరూపా ॥
చ.1 
రత్నతాటంక కర్ణవిభూషిణీ
శంకరదేశిక పూజితకామినీ
అఘోరమంత్రిత పదభామినీ
లోకాధినాథ గృహిణీ శిఖరిణీ II
చ.2 
పర్వతనందినీ సురవరవందినీ
భూమానందకరీ ప్రియజన పోషిణీ
సప్తస్వరరాగ గానవివర్ధినీ
మల్లికాకుసుమ గానవర్ధినీ 

668 నిర్వైతా
ప. శుద్ధ సత్వరూపిణీ నిర్వైతా
అ.ప సర్వలోకవశంకరీ చతురంగబలేశ్వరీ ||
చ.1 
సూర్యగమనము నిరోధించిన
రాక్షసులను సంహరించిన
సృష్టికారణశక్తి సవిత్రీదేవీ
సవితృమండల తేజోశక్తి ॥
చ.2 
తప్తకాంచనవర్ణా బ్రహ్మతేజసా
భక్తానుగ్రహవిగ్రహా వహ్నిశుద్ధా
వేదశాస్త్రస్వరూపిణీ గాయత్రీ రూపిణీ
మల్లికాసుమగాన భూషిణీ II

669 ద్వైతవర్ణితా
ప ద్వైతవర్ణితా భూతాంతరంగప్రభా
అ.ప మనోవాగాతీతా సమరప్రభా ॥
చ.1 
కలవునీవని నేను మదినమ్మియుంటిని
కలనైన నిను నేను చూడలేకుంటిని
ఆత్మవైననునీవె పరమాత్మయూ నీవె
నీకన్ననాకింక ఆధారమెవరే II
చ.2 
నీపదధ్యానమే మనసులో నిలిపితిని
నీస్మితవదనమే మరువలేకుంటిని
నీనామస్మరణమే నాకుగతియనుకొంటి
మల్లికాసుమగానమందుకోమంటి ॥

670 అన్నదా
ప. వాత్సల్యపూరితా అన్నదా
అ.ప మాతా అన్నపూర్ణేశ్వరీ!!
చ.1 
అతిదుర్లభమైన మానవజన్మమిచ్చి
దోషరహితమగు ధనమును మాకిచ్చి
అన్నపానములు సమకూర్చెదవే
కాశీపురాధీశ్వరీ విశ్వేశ్వరీ ||
చ.2 
విశ్వేశ్వరుడే కపాలపాత్రతో
నీముందరనిలచి యాచించునట
సకలజీవులకు ఆకలితీర్చే
మల్లికాకుసుమగానవిపంచినీ ॥

671. వసుధా
ప వసుధా సుధామయి
అ.ప శుభఫల వర్షిణి హర్షిణీ ||
చ.1 
కర్మఫలరూపమున పుట్టుకను యిచ్చి
పుణ్యఫలముపండి బహుసుఖములిచ్చి
ధనధాన్యములనిచ్చి పాడిపంటలనిచ్చి
మోక్షమునుఇచ్చేటి అన్నదా వసుధా ॥
చ.2 
నీవంటి దైవము వసుధలోకలదా
వాత్సల్యరూపిణీ వసుమతీ భగవతీ '
నీదయామృతలహరి ఓలలాడెదమమ్మా
మల్లికాసుమగాన మకరందపంకిలా ॥

672 వృద్ధా
ప. విశ్వరూపా వృద్ధా
అ.ప సర్వజ్యేష్టా పురాతనీ II
చ.1 
బ్రహ్మాది త్రిమూర్తుల సృజనకారిణీ
రమావాణీ కారణరూపిణీ
ముక్తినీయగల మంత్రమూర్తీ
సర్వచరాచర మూలభామినీ ॥
చ.2 
ఆదిశంకరీ ఆదిమజననీ
మధురస్మితా మరధునీ
విలాసవీక్షణ కలాపురంధ్రీ
మల్లికాకుసుమ గానపావనీ ॥

673 బ్రహ్మాత్మైకస్వరూపిణీ
ప. బ్రహ్మాత్మైకస్వరూపిణీ
అ.ప ఏషణారహితాధృతా ॥
చ.1 
ఇహపరసుఖములనిచ్చునది
ఆత్మవేదనను తొలగించునది
ఆనందమొసగే ఆహ్లాద చంద్రిక
నీరూపమేకదా రాజరాజేశ్వరి ||
చ.2 
పరమయోగులకు బ్రహ్మానందము
కలుగచేసేడి ఆనందరూపము
లలిత లలిత లావణ్యస్వరూపము
మల్లికాకుసుమ గాననిలయము ॥

674 బృహతీ
ప. జగదీశ్వరీ బృహతీ
అ.ప సుగుణగుణవిశేషిణీ ॥
చ.1 
ప్రణతార్త జనరంజనీ
ప్రణవాక్షరామృత బ్రహ్మమయీ
చతుర్దశభువన మండలవిహారిణీ
జయజననీ కేయూర హారావళీ
చ.2 
నిరాలంబా లంబోదర జననీ
సకలభువన ఆధారనిలయినీ
అక్షయ అవ్యయ త్రిలోకస్వామినీ
మల్లికాసుమగాన ఆహ్లాదినీ ॥

675 బ్రాహ్మణీ
ప. మునిమానస సంచారిణి బ్రాహ్మణీ
అ.ప సత్యాన్వేషణ బ్రహ్మజ్ఞానీ॥
చ.1 
భక్తచింతామణీ శివమానస లోలినీ
సమరవిజిత సంతోషిణి రాక్షస సంహారిణీ
మధురదరస్మిత వదనీ భువనమోహినీ
శ్రీచక్రసంచారిణి సుమంగళీ బ్రాహ్మణీ ॥
చ.2 
వాగర్ధ విభూతినిచ్చు ఆదిశక్తి స్వరూపిణీ
సహస్రార చక్రమందు ప్రకాశించు చిన్మయీ
బాలగ లలితాంబగ పూజలందుకొను దేవీ
మల్లికాసుమగానము అందుకొనవె ఈశ్వరీ ॥

676 బ్రాహ్మీ
ప. సప్తమాతృకా బ్రాహ్మీ
అ.ప విజ్ఞానరూపిణీ సరస్వతీ
చ.1 
శుంభ నిశుంభుల నిర్మూలనకై
పరమేశ్వరికి అండగానిలచి
దుర్మార్గులను అంతముచేసిన
సర్వశక్తిమయీ జయవాణీ ॥
చ.2 
శుభ్ర వస్త్రాన్వితా హంసవాహినీ
శ్వేత పద్మాసనా సర్వకళాధరీ
భారతీ భార్గవీ వీణాలోలినీ
మల్లికాసుమగాన సంగీత శాలినీ ॥

677 బ్రహ్మానందా
ప. నిరతిశయ ఆనందా బ్రహ్మానందా
అ.ప ఆనందకందళిత హృదయారవింద ॥
చ.1 
ఆనందమయ కోశమందున
బ్రహ్మానందమును అనుభవించే
యోగిజన బృందహిత సానందరూప
అతిశయ సౌందర్య పరశివానందా ॥
చ.2 
వేయి రేకుల మహాపద్మ మందిరమందు
అణిమాది సిద్ధిగణ సేవ్యమై వెలుగొందు
సదానంద సుధాపయోనిధీ
మల్లికాసుమగాన గుణనిధీ ॥

678. బలిప్రియా
ప. బలిప్రియా కలిదోష నివారిణీ
అ.ప త్రివళీ విలసిత లలాట ఫలకా॥
చ.1 
యజ్ఞయాగాది క్రతువుల ప్రీతి కారిణీ
కూష్మాండము నారికేళము
ఇక్షుదండము శ్రీఫలమును
బలిసమర్పణచేతుమే ||
చ.2 
యోగులను ధర్మపరులను
జ్ఞానులను ఆరాధ్యులను
సంతతము దయచూచుసదయా
మల్లికాసుమగాన హృదయా ॥

679 భాషారూపా
ప భాషారూపా మాతృకావర్ణరూపిణీ
అ.ప వర్ణమయ అక్షరమాలాధారిణి ॥
చ.1 
సౌందర్యలహరిలో ఉప్పొంగిన
నీకటాక్షములే భాష
మూగవానికి మాటలొచ్చి
నిన్నుపొగడినదే భాష ||
చ.2 
కాళిదాసును కరుణించి
వాగర్ధమిచ్చినదే భాష
నీదయామృత ధార కురిసిన
మల్లికాసుమగానమే భాష ॥

680 బృహత్సేనా
ప. బృహత్సేనా విజయదుర్గా
అ.ప అనంతసేనా సమూహా ॥
చ.1 
దేవతలందరు నీకు సేనలై
నీసేవలకై వేచియుందురే
శ్యామలా వారాహి బాలా
నీఆజ్ఞలకై ఎదురు చూతురే II
చ. 2 
అవిధేయులకు భయంకరివి
శరణాగతులకు క్షేమం కరివీ
చతురంగబల సేనాసమన్వితా
మల్లికాసుమగాన చరితా !

681 భావాభావవివర్జితా
ప భావాభావవివర్జితా
అ.ప ప్రియాప్రియ గుణవర్జితా ||
చ.1 
గుణకర్మ విశేష భావములు
అనురాగములు ద్వేషభావములు
నిన్ను అంటవు నీకు చెందవు
విశ్వసాక్షిణీ శుభహేతురీశ్వరీ ॥
చ.2 
అవ్యాకృత ప్రపంచకరణా
పరిపూర్ణచంద్రవదనా
మృదుహాసపూర సుషుమా
మల్లికాసుమగాన సుమనా ॥

682 సుఖారాధ్యా
ప. సుఖారాధ్యా రమ్యా శోభనా
అ.ప భక్తజన చింతామణి ॥
చ.1 
మదిలో తలచిన పాపముతొలగించి
శీఘ్రముగ వరములను ఇచ్చేటి తల్లీ
పత్రమో పుష్పమొ ఫలమొ జలమో చాలు
పూజించినంతనే కనికరముచూపెదవు ॥
చ.2 
స్మరణమాత్రముచేత తుష్టిచెందెదవు
నిన్నుస్తుతియించిన పొంగిపోయెదవు
నీసన్నిధానమే పరమశుభంకరము
మల్లికాసుమగాన సంతోషిణీ ॥

683 శుభకరీ
ప. దీవింపవే శుభకరీ
అ.ప శివోల్లాస హాసాంకురీ ॥
చ.1 
పంకజనాభ సోదరీ
కర్పూరద్యుతి చాతురీ
హాసప్రకాశాంకురీ
సౌభాగ్యమాహేశ్వరీ ||
చ.2 
నీవు ఎవరియెడ ప్రీతిపూనువుదువో
వారిదే ధనము వారిదేయశము
జయములనీయవే శ్రీచక్రేశ్వరి
మల్లికాసుమగాన శుభంకరీ ॥

684 శోభనాసులభాగతిః
ప శోభనా సులభాగతీ
అ.ప సర్వశుభంకరీ శోభనా సుభగా॥
చ.1 
మానవులు సురలు యోగులూ భోగులూ
నిరతముపూజించు మంగళ ప్రదాయిని
నిత్యాలంకార అభిషేకన ప్రియా
సులభముగ కరణించు సులభాగతీ ॥
చ. 2 
రాయని పిలచిన ఓ యని పలికి
అడిగిన కోర్కెల నిచ్చేతల్లి
భాగ్యములిచ్చెడి సౌభాగ్యేశ్వరి
మల్లికాకుసుమగాన శోభనా ॥

685 రాజరాజేశ్వరీ
ప రాజీవలోచని రాజరాజేశ్వరి
అ.ప రక్షింపరావమ్మ త్రిగుణాత్మిక ॥
చ.1 
నీపాదసేవయే సకల సౌభాగ్యాలు
నీపూజలేనిత్యసంకీర్తనాలు
నీధ్యానమే మాకు ముక్తిసోపానాలు
నీదివ్యచరణాలు మాకు శరణాలు 1
చ.2 
అన్నిలోకాలకు తల్లినీవేనమ్మ
విశ్వేశ్వరునికి సిరిమల్లివమ్మ
భక్తజనకోటికి కల్పవల్లివమ్మ
రావమ్మమమ్మేలు బంగారు బొమ్మ ॥

686 రాజ్యదాయినీ
ప.. రాజ్యదాయినీ సామ్రాజ్యదాయినీ
అ.ప. సకలలోక శుభదాయిని శ్రీదాయినీ ॥
చ1. 
సృష్టి ఆరంభము త్రిమూర్తులను సృష్టించి
సృష్టి స్థితి లయ కారకులను చేసి
లోకాధిపతిగా విధాతనే నియమించి
విష్ణువునేవైకుంఠ పతినిచేసితివి ||
చ.2 
ఇంద్రాదిదేవతల రారాజులను చేయు
పంచదశీ మంత్ర వైభవశాలినీ
హేమాంబురాశి శంకర మానసరాజ్జీ
మల్లికాకుసుమ గాన సంచారిణీ

687 రాజ్యవల్లభా
వ. రాజ్యవల్లభా శ్రీచక్ర రాజ నిలయా
అ.ప. ముక్తారత్న విచిత్ర కాంతి కలితా ॥
చ.1 
కాదంబ వనవాటికా వల్లభా
చింతామణి గృహ మంటపవాసిని
శివుని పర్యంకమున రాజాధిరాజుగా
కామేశరాజ్ఞియై కనువిందు కలిగించు ||
చ.2 
మధుర మనోహర మధురస్వరముల
కచ్చపి వీణానాదము వినుచు
మల్లికాకుసుమగాన మధురిమల
దివ్య పరిమళము నాస్వాదించుము ॥

688 రాజత్కృపా
ప. రాజత్కృపా కృపాంబురాశీ
అ.ప. ఆశ్రితురాలను దయచూపవే ॥
చ.1 
నీదయాదృష్టియే నాకుచాలును
సిరిసంపదలను అపేక్షించను
నీవరదాభయకరము చాలునే
కరకంకణములు నేనుకోరను ॥
చ.2 
నీపదధూళియె సుంతచాలును
రత్నహారములునేనాశించను
అతులితభోగములేవీ అడగను
మల్లికాకుసుమ గానముచాలును ॥

689 రాజపీఠనివేశితనిజాశ్రితా
ప రాజపీఠ నివేశితనిజాశ్రితా
అ.ప ఆశ్రితజనపాలిని ధీరసమర్చితా ॥
చ.1 
జ్ఞానవిహీనుని కాళిదాసుని'
మహాకవిగా అనుగ్రహించితివి
మాటలేరాని మూగవానికి
కవితాశక్తిని ప్రసాదించితివి ॥
చ.2 
నిన్నుకొలిచెడి భక్తజనులకు
దివ్యమహిమలను సిద్దింపజేతువు
వాగర్ధముల సంపదనీయవె
మల్లికాకుసుమ గానబోధితా ॥

690 రాజ్యలక్ష్మీ
ప. నవనిధిదాయిని రాజ్యలక్ష్మీ
అ.ప. సదాశివ మనోరాజ్యలక్ష్మీ ॥
చ.1 
చతురాననునకు బ్రహ్మాధిపత్యము
మహేంద్రునకు స్వర్గాధిపత్యము
కుబేరునకు ధనాధిపత్యము
అనుగ్రహించిన ధర్మాధిదేవతా
చ.2 
కైలాసనాధుని అర్ధాంగ లక్ష్మీ
భక్తులపాలిటి అదృష్టలక్ష్మీ
మల్లికాకుసుమ గానమునిచ్చే
హిమాచలేశుని సంతానలక్ష్మీ ॥

691 కోశనాధా
ప. ధనాధినాధా కోశనాధా
అ.ప. సిరిసంపద ప్రసాదిని ॥
చ.1 
లోకములోని ధనమంతటికీ
అధికారిణివి నీవేనమ్మా
చింతలు తీర్చే చింతామణీ
ధనరాసులిచ్చే నవరత్ననిధి
చ.2 
భక్తులపాలిటి భక్తనిధి
పరమయోగులకు మోక్షనిధి
నీసన్నిధియే మాకుపెన్నిధి
మల్లికాకుసుమ గాననిధి ॥

692 చతురంగబలేశ్వరీ
ప. చతురంగబలేశ్వరీ
అ.ప. సర్వసైన్యాధిపతీ మహాత్రిపురేశ్వరీ ||
చ.1 
రధ గజ తురగ పదాతిదళములకు
వాయుసేనలకు నౌకాసేనలకు
అధిపతియై అలరారుచుండెడి
అరివీరభయంకరి రణరంగ చాతురీ ॥
చ.2 
నాల్గువేదములకు అధికారిణిపై
సకలధర్మముల సంరక్షించుచు
అధర్మపరులను అణచివేసెదవు
మల్లికాకుసుమ గాననిలయినీ ॥

693 సామ్రాజ్యదాయినీ
ప.. సామ్రాజ్యదాయినీ
అ.ప. మహామహేశ్వరీ II
చ.1 
బ్రహ్మవిద్యలనిచ్చు బ్రాహ్మీ మహేశ్వరీ
ఆత్మవిద్యలనిచ్చు ఆత్మసామ్రాజ్జీ
ముక్తిమార్గము చూపు మోక్ష సామ్రాజ్ఞి
నీలకంఠేశ్వరుని మనోసామ్రాజ్ఞి ||
చ.2 
అఖండ సామ్రాజ్యమిచ్చి
అతులితసంపదలనిచ్చి
భక్తిసామ్రాజ్యమునిచ్చు
మల్లికాసుమగానరాజ్ఞి II

694 సత్యసంధా
ప. సత్యసంధా శ్రీవిద్యా
అ.ప. సత్యాన్వేషణ నిజరూపా ॥
చ.1 
నిత్యమైనది సత్యమైనది.
నామములేనిది రూపములేనిది.
నాశములేనిది శాశ్వతమైనది
శుద్ధ సాత్విక బ్రహ్మరూపము
చ.2 
సత్యమును దాటరానిది
సత్యమునే బోధించునది
సత్యమందున ప్రజ్ఞకలది
మల్లికాసుమగానరూపము ॥

695 సాగరమేఖలా
ప. సాగరమేఖలా విరాట్ స్వరూపిణీ
అ.ప.సర్వచరాచర జగత్కారిణి ॥
చ.1 
సత్యలోకమేనీశిరము
సూర్యచంద్రులే నీనేత్రములు
సప్తసంద్రములే స్వర్ణ మేఖల
నీవాలుచూపులేసృష్టివిలాసము ॥
చ.2 
హిమవంతునిభాగ్యమా
మహదేవకుటుంబినీ
సేవకజన పాలినీ శాలినీ
మల్లికాసుమగాన రంజనీ ॥

696 దీక్షితా
వ. కరుణాంతరంగా
అ.ప. సద్గురురూపా మంత్రారాధితా ॥
చ.1 
మంత్రదీక్షనుయిచ్చి పాపక్షయముచేసి
జ్ఞానమును అందించి అజ్ఞానమును బావీ
స్పర్శదీక్షతో గురురూపమున
శిష్యుని శ్రేయము కోరే మంత్రదీక్షితా ||
చ.2 
గురువేవిష్ణువు గురువే బ్రహ్మ
గురువే పరమేశ్వరరూపుడు
శ్రీవిద్యార్చిత పూర్ణ దీక్షితా
మల్లికాసుమగాన మంత్రదీక్షితా !!

697 దైత్యశమనీ
ప. దైత్యశమనీ అధర్మ నాశనీ
అ.ప. దురితభంజనీ మహిషాసుర మర్దనీ ॥
చ.1 
సంద్రమునుచిలుకువేళల
అమృతకలశము వుద్భవించగా
విష్ణురూపమున మోహినియై
దైత్యకులమును శిక్షచేసితివి ॥
చ.2 
విష్ణుమాయయై అసురులనణచి
దేవతలకు ఆనందముకూర్చిన
ధర్మసంవర్ధినీ అధర్మదండినీ
మల్లికాకుసుమ గానమోహినీ ॥

698. సర్వలోకవశంకరీ
ప. సర్వలోకవశంకరీ త్రిభువనాధిష్ఠాత్రి
అ.ప మమతామూర్తి సమతాదర్శనీ
చ.1 
మంచినడకలు నేర్పుతల్లివేనీవు
జరామరణము బాపు వైద్యుడేనీవు
అష్టసిద్దులనొసగు దాతవేనీపు
దుఖఃసంద్రమునడచు దైవమేనీవు ॥
చ.2 
ఇంద్రాదిదేవతలు నీపదములను పట్టి
సామ్రాజ్యపదవులను అందుకొనలేదా
సర్వవశంకరీ త్రిలోక్యమోహినీ
మల్లికాసుమగాన మకరందభ్రామరీ ॥

699 సర్వార్ధదాత్రీ
ష. సర్వార్దధాత్రీ గిరినాధపుత్రీ
అ.ప. హిమవంతునిభాగ్యమా కనక శలాకమా
చ.1 
నీకు ఉగ్గును పెట్టి జోలలను పాడిన
తల్లిమేనక ఎంత పరవశించేనో
నీముద్దుపలుకులను చెవులార వినిన
హిమగిరి రాజెంత పుణ్యాత్ముడో
చ.2 
నీనడకలకు భూదేవి మైమరచెనో
నిను చూసి హిమమెంత కరిగిపోయేనో
నీఆటలకు నెమలి పురివిప్పి ఆడెనో
మల్లికా కుసుమములు విరిసి పాడేనో ॥

700 సావిత్రీ
ప. వేదపూజితా సావిత్రీ
అ.ప భావశుద్ధిస్వరూపా క్లీంకారీ ॥
చ.1 
గౌరీదేవిగా పూజలందుకొని
సౌభాగ్యములను ప్రసాదింతువే
శృతి ఆగమాది వేదజననీ
వరగాయత్రీ బ్రాహ్మణ పూజితా ॥
చ.2 
సూర్యరూపమున ప్రజ్వరిల్లుచూ
గాయత్రిగ త్రిసంధ్యలందున
వందనములందుకొను సవితారూపణీ
మల్లికాకుసుమగాన సవిత్రీ ॥

701 సచ్చిదానంద రూపిణీ 

ప. సచ్చిదానందరూపిణీ పరబ్రహ్మస్వరూపిణీ 
అ.ప సదానంద చిదానంద సత్యానంద రూపిణీ ॥ 
చ.1 
బలవంతుడైనను దుర్బలుడైన 
మూఢుడైననూ మహాప్రౌఢుడైన 
గుణహీనుడైనను మహాకులజుడైన 
నీమనసులో వారందరూ ఒకటే ॥ 
చ.2 
రమ్యగుణాలంకృత నిర్మలాకృతా 
భుక్తిముక్తి ఫలదాయిని చిత్తరంజనీ 
ఏకాత్మ స్వరూపిణి మదనశ్రియా
మల్లికాకుసుమగానానందా ॥

702 దేశకాలాపరిచ్ఛిన్న

ప. దేశకాలాపరిచ్చిన్న సుమనసా 
అ.ప బుధార్చితపదాబ్జా భక్త చింతామణీ ॥ 
చ.1 
దేశకాలములకతీతమైనది 
యుగములు మారినా జగములు మారినా 
ఆకాశమువలే సర్వవ్యాపియై 
శాశ్వతమైనది సత్యమైనది ॥ 
చ.2 
ఆర్తిని తొలగించి కోర్కెలుతీర్చి 
విశ్వశ్రేయము కూర్చు వైభవశాలి 
పరమానంద సుధాపయోనిధి 
మల్లికాకుసుమ గానసుధానిధి ॥

703 సర్వగా

ప. లీలాకల్పిత సర్వలోక సర్వగా 
అ.ప సర్వరూపిణీ సర్వవ్యాపినీ ॥ 
చ1 
సర్వమునీవై కార్యకారణమయీ 
చరాచరవిశ్వము సృజియించు శక్తివి 
నీ మహత్యములు ఎన్నగాతరమౌనా 
నీసాన్నిధ్యము నొసగుమా శుభగా ॥ 
చ.2 
బాలేందునిటలా హృద్యత్తరకలా 
ఘనాఘన వినోదకరవేణీ 
గ్రహరాబ్జనిలయినీ అఖిలలోకాంబా
మల్లికాకుసుమగాన సర్వగా ॥

704 సర్వమోహినీ

ప. సర్వమోహినీ పద్మాసనా 
అ.ప స్తవనీయోత్తమా శృతివేద్యా ! 
చ.1 
సురుచిరాంగ సత్కళా విశారద 
శాశ్వతకైవల్య వితరణపరా 
భక్త హృత్సరసనిలయాసదయా 
సర్వేశగేహినీ కేదారనిలయా ॥ 
చ.2 
గణగణఘంటారవములతో 
వీణామృదంగ స్వరతాళముతో 
శంఖనాదముల సునాదముతో 
మల్లికాకుసుమగానవినోదినీ ॥

705. సరస్వతి

ప. మాంపాహి సరస్వతీ విద్యాధరీ 
అ.ప శ్రీవ్యాసపూజిత వాల్మీకివందిత ॥ 
చ.1 
వీణాపాణీ వేదచారిణి 
వాగీశ్వరీ నిగమాగమరూపిణీ 
బాసరలో వెలసి బాసటగా నిలచి 
భక్తులబ్రోచేటి గానవిలోలినీ 
చ. 2 
పద్మనివాసినీ పద్మనయనీ 
పద్మసంభవు రాణి పరమపావనీ 
కామిత దాయినీ సురుచిరవేణీ 
మల్లికాకుసుమ గానవిహారిణి

706. శాస్త్రమయీ

ప ఓంకారబీజాక్షరీ భారతీ శాస్త్రమయీ 
అ.ప జయములనీయవేదయగలతల్లీ ॥
చ.1 
కోటి విద్యలనొసగే బాసరవాణి 
మేటిసంపదలనిచ్చు నలువరాణి 
సుమధుర సుస్వరములతో కొలిచెదమమ్మా 
విజ్ఞానతరంగిణి హంసవాహిని 
చ. 2 
చదువులరాణిగా వాసికెక్కిన తల్లి 
మృదుమధువాక్కుల కల్పకవల్లీ 
మల్లికాపుష్పముల మాలికలను అల్లి 
అర్పింతునోయమ్మకరుణాలవల్లి 

707. గుహాంబా

ప. గుహాంబా గురుగుహజననీ. 
అ.ప బాలగ్రహ విధ్వంశిని భవానీ ॥ 
చ.1 
హృదయ కుహరమున నెలకొనియుందువు 
పంచకోశాంతరస్తితాఆశ్రితరక్షా 
విపులమంగళ దానశీలా సుశీలా 
ధ్యానించు హృదయముల వికసింపజేయవే ॥ 
చ.2 
మనసునందలి మదమాత్సర్యముల 
మోహలోభముల త్రుంచివేయవే 
శరణార్ధిని నను రక్షణచేయవే 
మల్లికాకుసుమగాన శరణ్యా ॥

708. గుహ్యరూపిణీ 

ప. పరకృపానిధి గుహ్యరూపిణీ 
అ.ప రహస్యజ్ఞాన స్వరూపిణీ ॥ 
చ.1 
గురుమూర్తిధరా రహస్య యోగినీ 
గుహనివాసినీ దహరాకాశ రూపిణీ 
సర్వోపనిషత్ సారా జననీ 
గుహ్యోపనిషత్ ప్రబోధినీ  
చ.2 
నాల్గువేదముల సకలశాస్త్రముల 
అన్నిమంత్రముల గోప్యముగానుండు 
భక్త మనోరధ పూరణచతురా 
మల్లికాకుసుమ గానరహస్యా ॥

709. సర్వోపాధి వినిర్ముక్తా 

ప. సర్వోపాధి వినిర్ముక్తా అద్వైతమూర్తీ 
అ.ప ఆకారమేలేని చిన్మయస్వరూపా ॥ 
చ.1 
ఆత్మవు నీవే జీవాత్మవునీవే 
మేము కనుగొనలేని రూపమే మనసా 
వెలుగునీడలు నీవె కర్మఫలములు నీకే 
పరబ్రహ్మ రూపమే మనసా ॥ 
చ.2 
రంగు రూపములేని స్పటికవంటిది ఆత్మ 
పాపపుణ్యములేవి అంటవే మనసా 
మనసులోనీ పరాత్మనే తెలుసుకో 
మల్లికాసుమగాన ఫలితమే మనసా ॥

710. సదాశివపతివ్రతా 

ప. సదాశివపతివ్రతా సుచరితా 
అ.ప. పరశివ ముఖావలోకనానందకరీ ॥ 
చ.1 
వేద విజ్ఞానులందరూ సరస్వతీపతులే 
లక్ష్మీకటాక్షులు లక్ష్మీవల్లభులే 
నీకృపాకటాక్షము ఆపరమశివునికే 
గౌరీవల్లభుడు మహదేవుడొకడే ॥ 
చ. 2 
నీపాతివ్రత్యము లోకోత్తరము 
శివశక్తుల కలయికయే అపూర్వము 
నీపతిభక్తి అనన్య సామాన్యము 
మల్లికాకుసుమగాన పరిమళా ॥

711. సంప్రదాయేశ్వరీ

ప. సంప్రదాయేశ్వరీ రాజరాజేశ్వరీ 
అ.ప. శ్రీ విద్యా సంప్రదాయ స్వరూపిణి ॥ 
చ.1 
పాపములను తొలగించును 
అజ్ఞానమును బాపజాలును 
జ్ఞానదీపమును వెలిగించి 
మంచిమార్గమును చూపును గురువు ॥ 
చ.2 
గురురూపమున సంప్రదాయమును 
సౌశీల్యమును రక్షణచేయును 
పరమగురువే పరమేశ్వర రూపము 
మల్లికాకుసుమ గానస్వరూపము ॥

712. సాధ్వీ

ప. సాధ్వీ----సాధ్వీ నీచరణములే శరణము 
అ.ప. నీవే జగతికి మూలకారణము 
చ1. 
నినుచేపట్టిన గరళకంఠుడు 
మంగళకరుడై లోకపూజితుడై 
త్రిలోకవంద్యుడై అర్ధనారీశుడై 
శరణాగతరక్షకుడై కరుణామయుడాయె।। 
చ. 2 
పాతకములను దరిజేరనీయక 
మము బ్రోవు మమ్మా గిరిజాకుమారి 
మగువలపాలిటి మంగళ గౌరి 
పరమపతివ్రత సాధ్వీమతల్లీ॥

713. గురుమండలరూపిణి

ప. గురుమండలరూపిణీ శ్రీచక్రేశ్వరీ 
అ.ప పరమేష్టి పరమగురు దేవతా 
చ.1 
అవాఙ్మనస గోచరీ 
దక్షిణామూర్తి రూపిణీ 
త్రిలోకార్చితా శ్రీ విద్యా 
వశిన్యాది వాగ్దేవతా మధ్యమా ॥ 
చ.2 
ఆదిదంపతులు ఆదిగురువులు 
దత్తప్రభువులు దేశికులు 
వందే వందే గురుపద ద్వంద్వాం 
మల్లికాసుమగా గురుపాదుకాం ॥

714. కులోత్తీర్ణా

ప. కులోత్తీర్ణా అతీంద్రియా 
అ.ప యోగసిద్ధిప్రదా అవ్యయా॥ 
చ.1 
వేదాంగాయా అప్రమేయా 
అమేయాత్మా అనుత్తమా 
గురురూపాయ గురుతమాయ 
గుప్తయోగినీ సర్వోన్మాదినీ ॥ 
చ.2 
సనకసనందనాదిమునిధ్యేయా 
లబ్దాహంకార దుర్గమా దుర్గా 
దేవగణాశ్రిత పాదయుగా 
మల్లికాకుసుమగాన ప్రభా॥

715. భగారాధ్యా

వ. భగారాధ్యా పరమేశ్వరి 
అ.ప అణిమా గరిమాది సిద్దిపూజితా 
చ.1 
సిద్ధమాతా సూర్యారాధిత 
జ్ఞానవైరాగ్యదాయినీ 
ప్రభారూపా జగన్మోహినీ 
కమలాసనార్చితపదా ॥ 
చ.2 
సూర్యమండల మధ్యస్థా 
ఆశ్రితరక్షకపోషజననీ 
దివ్యశక్తిప్రదా శ్రీవిద్యా 
మల్లికాకుసుమగాన ప్రదా॥

716. మాయా

ప. మాయా విచిత్రకార్యకరణా 
అ.ప చింతితఫలప్రదా మాయావతీ ॥ 
చ.1 
ఒకసారి సకలము నీవుగాతలచి 
అంత మా ప్రజ్ఞయేననుచుఇంకొకసారి 
విర్రవీగుటె గాని నిక్కమ్ము నెరుగము 
ఇదియంత నీమాయ అనిఎరుగలేము ॥ 
చ.2 
నీటిగుంటలలోన నాచువంటిది మాయ 
నిద్రలోకలవలె మనసునేమరపించు 
నీనామగానమే భ్రమలను తొలగించు 
మల్లికాసుమగాన సుజ్ఞానదీపికా ॥

717. మధుమతీ

ప. మధుమతీ సావిత్రీ 
అ.ప సవితా దేవతాశక్తీ యోగధాత్రీ 
చ.1 
నిశ్చలభక్తితో పరమనిష్టతో 
బ్రహ్మైకస్థితి పొందుయోగులకు 
మధురానుభూతులను కలిగించి 
ఆత్మానందము నందించుదేవి | 
చ.2 
యమ నియమ సమాధి సంపదతో 
యోగమాతగా పేరుగాంచితివి 
యోగానుభవములు మాకీయవమ్మా 
మల్లికాకుసుమగాన యోగినీ ॥

718. మహీ  

ప. భూదేవతారూపా మయామహీ 
అ.ప. మమతామయీ మహితామహీ 
చ.1 
భూదేవివై భూభారమునుమోసి 
జగమంతయు ఫలపుష్ప భరితముగ 
జనులందరికి అన్నదాతవైనిలచేవు 
ఓర్పుతో అదితిగా పూజలందేవు ॥ 
చ. 2 
వేదమాతా సర్వ కళ్యాణ శీలా 
మహిమాన్వితా సదాస్తూయమానా 
మహామహీ భువనాంబికా 
మల్లికాకుసుమగాన మహీ ॥

719. గణాంబా

ప. ప్రమాధాది గణపూజితా గణాంబా 
అ.ప. నందికేశ్వర వందితా 
చ.1 
నగాధీశపుత్రీ రాజీవనేత్రి 
మహాదైత్య జైత్రీ భక్తమందారవల్లీ 
పరమేశ్వరాలోక ఆనందవల్లీ 
బొజ్జగణపతితల్లి అనురాగవల్లీ ॥ 
చ.2 
నందీశు భృంగీశు సేవలను గైకొని 
వీరభద్రుని ప్రణతులందుకొంటావు 
ప్రమధాదిగణనాయకుని మోహినీ 
మల్లికాసుమగాన సందర్శినీ I॥

720. గుహ్యకారాధ్యా

ప. గుహ్యకారాధ్యా శరవణ పూజితా 
అ.ప. నవనిధులను కాపాడు మణిభద్రార్చితా
చ.1 
పంచకోశాంతరస్థితా శ్రీలలితా 
లలితా సహస్ర త్రిశతి నామముల 
గోప్యముగానుండి హయగ్రీవునిచేత 
ఆరాధించబడు గుహ్యగోపిణీ  
చ.2 
యంత్రములందు మంత్రములందు 
రహస్యమంత్రార్ధ స్వరూపిణీ 
లోపాముద్రాగస్త్య పూజిత చరణీ 
మల్లికాకుసుమసంకీర్తనానంద॥

721. కోమలాంగీ

ప. కోమలాంగీ సుమశోభితా 
అ.ప. హిమవంతుని భాగ్యమా మరాళ గామినీ 
చ.1 
నీమందస్మిత వదనారవిందము 
పరితాపములను దూరముచేయునే 
వయ్యారపునీకులుకుల హెుయలు 
రాజహంసలకు నడకలు నేర్పునే ॥ 
చ.2 
తేనెలొలుకు నీమధుర వాక్కులకు 
శారద వీణా సిగ్గులొలుకునే 
అనురాగభరితమౌ నీచూపులకు 
మల్లికాసుమగానామృతముచిందునే ॥

722. గురుప్రియా

ప. గురుప్రియా శ్రీవిద్యా గురుపూజితా 
అ.ప. పరసాధనాకలిత దక్షిణామూర్తిరూపా 
చ1 
ముదితవదనా జ్ఞానానందమయీ 
త్రిభువన గురుచరణా చిన్ముద్ర మూర్తీ 
సారస్వత పురుషాకార సామ్రాజ్జీ 
వ్యాసాంబరీష శౌనక హృదివాసినీ ॥ 
చ.2 
అఖిలాగమ మంత్రగురవే 
మహావ్యామోహ సంహారిణే 
రాగద్వేష దూషితమానసే 
మల్లికాకుసుమ గానకౌతుకే ॥ 

723. స్వతంత్రా

ప. స్వతంత్రా పరాకృత పరాయణా 
అ.ప. శ్రీవిద్యాతంత్ర స్వతంత్ర తంత్రా 
చ.1 
నిన్నుమించిన అధికులెవరే 
బ్రహ్మాదిదేవతలు నీఅనుయాయులే 
మహిమాన్వితమైన నీశుభచరితము 
వర్ణింపగ మేమెంతవారమే 
చ.2 
క్షణముసేపు నీచూపు సోకిన చాలు 
బహు జన్మాంతరజ్ఞానము సిద్దించు 
పరమేశుడే నీఆజ్ఞలుపాలించు 
మల్లికాసుమగాన సర్వస్వతంత్రా ॥

724. సర్వతంత్రేశీ

ప. సర్వతంత్రేశీ సర్వమంత్రాత్మికా 
అ.ప భక్తుల కోర్కెలనుతీర్చు సర్వేశ్వరీ 
చ.1 
సర్వయంత్ర స్వరూపాయ 
ముక్తిబీజాయ కళ్యాణదా 
నవశక్తిదాయినీ అమృతస్వరూప 
ముక్తినీయగల మంత్రమూర్తివి || 
చ.2 
మతంగకులనాయికామాతంగినీ 
బీజాక్షర శ్రీ చక్ర మంత్రేశ్వరి 
రసవంతమై ఆమోద భరితమౌ 
మల్లికాసుమగాన కవితలను ఈయవే ॥

725. దక్షిణామూర్తిరూపిణీ 

ప. దక్షిణామూర్తిరూపిణీ సుప్రసన్నా 
అ.ప సోమసూర్యాగ్నిలోచనీ మహాదేవీ
చ.1 
పద్మాసనీ చిన్మయముద్రాలంకృత 
శుద్ధస్పటిక సంకాశినీ సరస్వతీ 
జ్ఞానముద్రాక్షమాలా యోగపట్టాభిరామ 
దక్షిణామూర్తి రూపిణీ శరణం ప్రపద్యే ॥ 
చ.2 
శశిశకలధారిణీ భువనక్షేమ జననీ 
కైలాసవిహారరసికే భవరోగమహౌషధీ 
కటాక్షమహిమాతిశయ విలోకనామహీ 
మల్లికాకుసుమగాన శివనిధీ ॥

726. సనకాది సమారాధ్యా 

ప. సనకాది సమారాధ్యా కార్యకారణ రూపిణీ 
అ.ప. సనత్కుమారాది యోగగణపూజితా 
చ.1 
మృత్యుముఖములో నేనున్నపుడు 
నీధ్యానమునేచేయగలేను 
నీనామమునే సదాస్మరించే 
వరమునీయవే సురసేవ్యా ॥ 
చ.2 
అన్నిజన్మలలోన ఏజీవిగానున్న 
నీనామజపమునే చేసేటి వరమివ్వు 
సర్వదేవతా యోగిజనవంద్యా 
మల్లికాసుమగాన దాయినీ శివానీ ॥ 

727. శివజ్ఞాన ప్రదాయినీ 

ప. జ్ఞానస్వరూపిణీ 
అ.ప శివతత్త్వ ప్రకాశినీ శివకామినీ 
చ.1 
నీవేశివుడు శివుడేనీవు 
వాగర్దముల కలయిక మీరు 
శివజ్ఞానమును భక్తులకిచ్చి 
మోక్షజ్ఞానము కలుగచేతువే ॥ 
చ. 2. 
నీపూజనమే శివపూజనము 
నిను అర్చించుటే శివపదార్చనము 
శివసాయుజ్యమునందజేయుమా 
మల్లికాకుసుమగాన ప్రకాశినీ ॥

728. చిత్కలా

ప. అద్వైతానందాచిత్కలా
అ.ప పరమేశ్వర రూప షోడశీకలా 
చ.1 
సకల జీవులను నీ సంతానముగా 
ప్రేమ భావముతో రక్షించే తల్లీ 
నీ నామములను పలికిన చాలు 
సకల సుఖములను కలిగించుదేవీ ॥ 
చ.2 
అవ్యాజకరుణతో సాలోక్యమును ఇచ్చు 
అనురాగమును పంచి సామీప్యమిచ్చు 
జననమరణములేనిసాయుజ్యము ఇచ్చు 
మల్లికాకుసుమగాన వరదాయినీ ॥ 

729. ఆనందకలికా

ప. ఆనందకలికా మహేశ్వరి 
అ.ప అద్వైతానంద సంతోషిణీ 
చ.1 
అతులిత భోగముల భాగ్యానందము 
వాసనానందము బ్రహ్మానందము 
నీనామజపములో అఖండానందము 
నీసన్నిధిలోనే శాశ్వతానందము ॥ 
చ.2 
నీనామసంకీర్తనే అద్భుతానందము 
నీపూజనమే అతులితానందము 
నీపాద సంసేవయే చిదానందము 
మల్లికా సుమగానమే సదానందము ॥

730. ప్రేమరూపా

ప. ప్రేమరూపా వాత్సల్యరూపిణీ 
అ.ప సర్వప్రియంకరీ శ్రీకరీ 
చ.1 
సకలజగములను ప్రేమతో లాలించి 
నీభక్తులకు భోగభాగ్యములిచ్చి 
దుష్ట మార్గులగు పిల్లలను దండించి 
సన్మార్గులను కరుణతో చూడు ॥ 
చ.2 
నీప్రేమయే మమ్ము కాపాడు కవచము 
భవసాగరము దాటు నావ నీప్రేమయే 
కన్నతల్లివినీవు కాఠిన్యమేలనే 
మల్లికాసుమగానకీర్తనానందా ।

731. ప్రియంకరీ

ప. ప్రియంకరీ అభయంకరీ 
అ.ప హరసహచరీ భువనేశ్వరీ 
చ.1 
నామీద నీకింత కోపమా 
ననుబ్రోవగా ఇంతపంతమా 
నీ వారము మేము కాలేమా 
కరుణ చూపగ రావే హే ఉమా ॥ 
చ.2 
దాసులమై కొలువలేమా 
కామమోహముల దాసులమా 
నీసంతానముకామా 
మల్లికాసుమగానఘనమా ॥

732. నామపారాయణ ప్రీతా 

ప. నామపారాయణ ప్రీతా శ్రీ మాతా 
అ.ప సర్వజనమనోహరిణీ మాతంగేశ్వరీ  
చ.1 
భవబంధములు బాపు నామపారాయణం 
సిరిసంపదలనిచ్చు నామపారాయణం 
లలితాసహస్రముల నామపారాయణం 
దివ్యమహిమోపేత మధురకలితం  
చ.2 
పంచదశీ మంత్ర త్రిశతీపారాయణ 
అష్టాక్షరీమంత్రనామ సంతోషిణీ 
పంచప్రణవాసనీ గానవినోదిని 
మల్లికాసుమగాన సంగీతప్రీతా ॥

733. నందివిద్యా 

ప. నందివిద్యా శ్రీవిద్యా స్వరూపిణీ 
అ.ప నందికేశ్వర విద్యాంబా 
చ.1 
శివుని సన్నిధిలోన నిరతరము నివసించి 
శివుని సేవలు చేసి శివుని ప్రేమను పొంది 
శివుని వీపున మోయు నందికేశ్వరుడు 
ఎంతపుణ్యాత్ముడో ఎంతధన్యాత్ముడో  
చ.2 
నీనామపారాయణాఫలితమేకదా 
శివుని సామీప్యమున ముక్తిసాధించే 
నీపాదసేవయే మోక్షసాధనము 
మల్లికాసుమగానభక్తి ముక్తిప్రదము ॥

734. నటేశ్వరీ

ప. నటేశ్వరీ శివతాండవలోలినీ 
అ.ప మూలాధారచక్రనిలయినీ 
చ.1 
గానసరస్వతి వీణమీటగా 
శ్రీహరి మృదంగ తాళమువేయగా 
నవరస తాండవ కేళీలోలుడు 
నృత్యము సలిపెను నాట్యసుందరితో ॥ 
చ.2 
లాస్యవిలాస అభినయములతో 
నాట్యము చేతువే మహాభైరవీ మీ 
ఆదిదంపతుల నాట్యవిలాసము 
మల్లికాకుసుమగాన శోభితము ॥

735. మిధ్యాజగదధిష్ఠానా

ప. మిధ్యా జగదధిష్టానా శంకరీ. 
అ.స మాయాజగతికి ఆధారభూతా 
చ.1 
మట్టిబొమ్మలుచేసి ప్రాణములుపోసి 
జీవితపు భ్రమలలో కప్పివేస్తావు 
పూర్వకర్మము ఇచట అనుభవించాలని 
నడిసంద్రములోన ముంచివేస్తావు ॥ 
చ. 2 
ఈజగమునిత్యమని సుఖముశాశ్వతమని 
ఆశలనుకల్పించి మాయచేస్తావు 
సంసార సంద్రమును దాటించు నావ 
మల్లికాసుమగానపుణ్యమేత్రోవ ॥

736. ముక్తిదా

ప. ముక్తిదా పరసౌఖ్యదా 
అ.ప సర్వభూతాంతరాత్మా  
చ.1 
శాస్త్రపాండిత్యాల యజ్ఞయాగాలతో 
వేదాలు వల్లించ ముక్తిపొందగలేము 
నీనామకీర్తనతో నీధ్యానముతో 
భవబంధవిముక్తి కలుగునేతల్లీ॥ 
చ.2 
మూగజీవులకు ముక్తినిచ్చెను శివుడు 
మూఢభక్తియెచాలు మంత్రతంత్రములేల 
నీపదధ్యానమే ముక్తిసోపానము 
మల్లికాసుమగానమేపావనము ॥

737. ముక్తిరూపిణీ

ప. ముక్తిరూపిణీ మోక్షస్వరూపిణీ 
అ.ప ఆశ్రిత భవబంధ నిర్మూలినీ  
చ.1 
ధర్మశాస్త్రములు ఎన్నిచదివినను 
ఉత్తమవంశ సంజాతులైనను 
నిను సేవించని నిను అర్చించని 
వారి జన్మమే నిష్ప్రయోజనము 
చ. 2 
నీపదధ్యానము చేసినచాలును 
వారిజన్మలే ధన్యములగును 
నీపదములే మోక్షప్రదములు 
మల్లికాకుసుమపరాగ గానములు

738. లాస్యప్రియా

ప లాస్యప్రియా నటనప్రియా 
అ.ప. శృంగార రస ప్రియా 
చ.1 
ప్రదోషకాలమున శంకరుడడుగో 
తకధిమి తకధిమి నాట్యము చేయుచు 
వీరము రౌద్రము తాండవించగా 
పేరిణీ నృత్య తాండవ లోలుడు ॥ 
చ.2 
లలిత లలిత పదఝుణుంఝుణులతో 
మల్లికాకుసుమ గానమాధురితో 
పరమేశుని క్రీగంటచూచుచు 
లాస్యనృత్యమును చేతువు సమయా ॥

739. లయకరీ

ప. లయకరీ సకలశుభంకరీ 
అ.ప. సలలిత సుగుణాసాగరీ  
చ.1 
సకలశుభములనుఒసగెడిదేవీ 
నిను నమ్మినవారికినాశములేదే 
నీకుసాటి లోకాన ఎవరే 
నతవరదాయకి లయస్వరూపిణీ ॥ 
చ. 2 
కాయజ వైరీప్రణయలోలినీ 
ప్రమధ గణార్చిత హ్రీంకారీ 
రాగ తాళ లయస్వరూపిణి 
మల్లికాకుసుమ గానలయకరీ ॥

740. లజ్జా

ప. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా 
అ.ప. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః 
చ.1 
నిరహంకారా లజ్జారూపా సౌమ్యా 
మందస్మిత సరళా సర్వమంగళా 
ముగ్ధమోహన సౌందర్యరూపిణీ 
శృంగార రస భర లీలా విలాసిని ॥ 
చ.2 
లావణ్యామృత లసితా హసితా 
సురగణసేవిత శుభ చరితా 
శ్రీవిద్యా సారధి కల్పవల్లీ 
మల్లికాకుసుమ గానవల్లీ ॥

741. రంభాదివందితా

ప. రంభాదివందితా హ్రీంకార వాసితా
అ.ప. యతిజన హృదయ నివాసితా ॥
చ.1 
రంభా ఊర్వశి మేనకా తిలోత్తమ
అప్పరాంగనలు నృత్యగీతాదుల
దివ్యగానములతో సేవించుచుందురే
అభయవరదానైక రసికా హంసికా ॥
చ.2 
సర్వార్ధసాధకా శ్రీ చక్రనిలయా
అనుపమాన సౌందర్య తేజస్వినీ
మదనాంతకురాణి హిమగిరినందినీ
మల్లికాకుసుమగాన సౌగంధినీ ॥

742. భవదావసుధావృష్టిః

ప. భవదావసుధావృష్టి
అ.ప. మముదయగనవే నిర్మల దృష్టి ॥
చ. 1 
భవార్తి భయ నాశనీ భవానీ
అభవుని రాణీభావనాగమ్యా
మాతా మంగళగుణజాలా
కల్పకవల్లీమతల్లి హిమబాలా ॥
చ. 2 
దుష్ప్రభావముల మనముననుంచక
సద్భక్తి నీయవే శరణ్యావరేణ్యా
వామాచరణీ గాన విహారిణీ
మల్లికాకుసుమ గానావలోకినీ ॥

743. పాపారణ్యదవానలా

ప. పాపారణ్యదవానలా శ్యామలా
అ.ప.సుహేశ హృదయ వాసినీ
చ.1 
సంచితకర్మములను దహించి
స్వయంకృత అపరాధములు మన్నించి
నీసుందర చరణానందమునీయవె
శుంభవిదారిణి సుగుణమనోహరి ॥
చ.2 
అజ్ఞాన నాశిని విజ్ఞాన దాయిని
వాగీశ్వరి జగదీశ్వరిజయజయ
పన్నగవేజీ నగేంద్ర నందినీ
మల్లికాకుసుమగాన స్పందినీ।

744. దౌర్భాగ్యతూల వాతూలా

ప. దౌర్భాగ్యతూల వాతూలా శక్తిశాలినీ
అ.ప రమ్యగుణాలంకృతా రాజేశ్వరీ ॥
చ.1 
ప్రచండ మారుతము వంటి నీశక్తికి
నగములుకూడా కదలిపోవునే
ఋణము యాచనము జరారోగమను
దౌర్భాగ్యములను దూరముచేయనే
చ.2 
ఇంద్రాదిదేవతలు నీకు దాసోహమన
నిన్నుకొలువని వారు సృష్టిలో ఎవరే
మనోజ్ఞసుమనామందస్మిత సరళా
మల్లికాసుమగాన సుఖదాయినీ ॥

745. జరాధ్యంత రవిప్రభా

ప. జరాధ్వంత రవిప్రభా
అ.ప కృపను చూపవే సకలార్ధ చంద్రికా
చ.1 
పరులధనమును ఆశించుట లేదు.
ఖలజనులను సేవించుటలేదు.
చపలభావమును పొందుటలేదు
జరాభయముతో పరితపించితిమి ॥
చ2. 
కనులు కనపడక వీనులు వినపడక
వృద్ధాప్యముతో కృంగుజీవులను
రక్షణ చేయవే కృపాంబురాశీ
మల్లికా కుసుమగానసుధామ

746. భాగ్యాబ్ధిచంద్రికా

ప. భాగ్యాళి చంద్రికా
అ.ప. భాగ్యము నీయవే సర్వమంగళా
చ.1 
నీపదసేవయే పరమావధిగా
నిరతము తలచే భాగ్యమునీయవే
పరమ లోభులగు జనులను పొగడక
నిన్ను స్తుతించే భాగ్యము నీయవే ॥
చ.2 
నీభక్తులను భక్తితో పూజించి
నీగాధలనే సతతము వినుచూ
నీనామ ధ్యానమే మననముచేసెడి
మల్లికాసుమగాన భాగ్యము నీయవే

747. భక్తచిత్తకేకి ఘనా ఘనా

ప. భక్తచిత్తకేకి ఘనా ఘనా
అ.ప ఊహాతీత ప్రభావశాలినీ
చ.1 
పరిపరివిధముల నిను వేడుకొన్నను
దయచూపవేలనే మంత్రప్రియంకరీ
రక్షణభారము సర్వమునీరే
సర్వదా భవదీయ చరణములేశరణము ॥
చ.2 
ఎన్నిమారులు నిన్ను ఎలుగెత్తి పిలిచినా
కనులముందర నిలచి ఆదుకోవేమి?
భక్తాసురక్తా సంగనాశనకరీ
మల్లికాసుచుగాన ప్రియ మోహినీ

748. రోగపర్వతదంభోళి:

ష రోగపర్వత దంభోళీ
అ.ప నరక క్లేశ శమనీ 
చ1. 
అపార సంసార సాగరమును
దాటించు పెనునౌక నీవేగడా
మానసిక రోగములు దీర్ఘ రోగములు
సంతాపములు బాపు సర్వరోగహరిణీ ॥
చ.2 
సర్వసత్వగుణ విశేషణా
జీవనోపాయ రూపిణీ దయాధికా
పర్వతనందినీ మంగళదాయినీ
మల్లికాకుసుమగాన మంగళా ||

749 మృత్యుదారుకుఠారికా

ప, మృత్యుదారుకుఠారికా,
అ.ప. ఇంద్రాక్షి ఇంద్రరూపిణీ 
చ.1 
సదాసమ్మోహినీ దేవీ
సుందరీ భువనేశ్వరీ
అపమృత్యు భయము బాపవె
స్థూల సూక్ష్మ ప్రవర్తినీ ॥
చ.2 
అరివర్గము నడగింపుము
లోకహితము చేకూర్చుము
దురితములను హరియింపుము
మల్లికాకుసుమగాన సుభాషిణి ॥

750. మహేశ్వరీ

ప. శ్రీ మంగళగౌరీ మహేశ్వరి
అ.ప. అంగనలపాలిటి శుభకల్పవల్లి ॥
చ.1 
పంచవర్షమ్ముల నియమమ్ముతో
పూజించుచుందుమే ప్రతి శ్రావణమున
నీమహిమలెంచగా మాతరమౌనా
రాజరాజేశ్వరీ రక్షింపవమ్మా!
చ.2 
బ్రహ్మేంద్రాది సకలదేవతలు
మనమున నిన్నే ధ్యానించుచుందురే
సౌభాగ్యములనిచ్చి కాపాడుతల్లీ
శ్రీమాత శ్రీలలిత విశ్వేశురాణి॥

751. మహాకాళీ

ప. మహాకాళీ సర్వాంగభూషా వృతా
అ.ప. మధుకైటభసంహారీ రుద్రశక్తి '
చ.1 
ఇంద్రనీలద్యుతీ చతుర్భుజా
ఘోరదంష్ట్రా దరహాసముఖీ
ముండమాలాధరీ శవారూఢా
స్మశాననిలయా మహా భీమా ॥
చ.2 
మహాకాళేశ్వరుని రాణీ
కాలచక్ర నియమాను సారిణి
చరాచర జగన్మయీ దక్షిణకాళికే
మల్లికా కుసుమగంధ పంకాంకితే ॥

752 మహాగ్రాసా

ప. మహాగ్రాసా మహాదేవి
అ.ప మాతా అన్నపూర్ణేశ్వరీ 
చ.1 
అన్నపూర్ణపై అన్నిజీవులకు
ఆహారమును అందించుదేవీ
కాశీపురాధీశ్వరివై
జనులను కృపజూచు తల్లీ 
చ.2 
ఆదిభిక్షువే నీబిక్షకొరి
నీ ఇంటి ముందు నిలుచుండుకాదా
భక్తి బిక్షను మాకు దయచేయవే
మల్లికాకుసుమగానభిక్ష ప్రదాయినీ ॥

753. మహాశనా

ప. మహాశనా మహా మహితాత్మ
అ.ప. మాయాతీతస్వరూపిణీ
చ.1 
ఈచరాచర జగతి యంతా నీరూపమే
ప్రతి జీవి ఇంకొక జీవికాహారమే
ఇది అంతా నీలీలా నాటకమే
అనంతకోటి బ్రహ్మాండములు నీఅశనమే ॥
చ.2 
నీగొప్పతనమును వర్ణించలేము
నీ మహిమలను మేము తెలియంగము
నీ పదసేవా భాగ్యానురక్తులము
మల్లికాసుమగాన సంశోభితా ॥

754 అపర్ణా

ప. అపర్ణా మేనకా హిమవంతుల పుణ్యమా
అ.ప. కైలాసవాసుని కళత్రమా
చ.1 
పర్వత రాజుకు పుత్రికవై
లోకేశ్వరుని వలచినావు
ఆకులనైనా భుజించననుచు
మృష్టాన్నములను వీడినావు
చ.2 
తాపసోత్తములు విస్మయము చెందగా
నియమనిష్టలతో కఠోరతపసుతో
కామేశ్వరునే మెప్పించినావు
మల్లికాకుసుమ గాన పెన్నిధీ ॥

755. చండికా

ప. చండికా సప్తవర్ష ప్రాయ బాలికా
అ.ప. అగ్ని వాయు సర్వతత్వా ॥
చ.1 
మధుకైటభ ప్రశమనీ
మహిషోన్మూలినీ దుర్గా
చండముండ దమనీ
ధూమ్రాక్ష సంహారిణీ ॥
చ.2 
శుంభ నిశుంభాది దైత్య దమనీ
ధూమ్రలోచన వధే విశ్వేశ్వరీ
శుంభ ధ్వంసినీ సింహవాహినీ
మల్లికాకుసుమగానాంబికే ॥

756. చండముండాసురనిషూదినీ

ప. చండముండాసురనిషూదినీ
అ.ప చాముండేశ్వరీ దుర్గాంబికే ॥
చ.1 
దానధర్మములు ఎన్నిచేసినా
యజ్ఞయాగాదులు ఒనర్చినా
నీపూజచేయక నిన్నుకొలువక
నిష్ప్రయోజనములే సౌభాగ్యమానినీ
చ.2 
మహిషాసుర ప్రాణాపహారీ
సర్వాసుర భంజనకారీ
మల్లికాకుసుమ గాన విహారీ ॥

757. క్షరాక్షరాత్మికా

ప. క్షరాక్షరాత్మికా మునిధ్యేయా
అ.ప అక్షర మాలారూపిణీ
చ.1 
సమస్త జీవనాధార వేద సంచారా
పరతత్వవిహార విచారదూరా
నాజన్మము ధన్యము చేయవే
సాక్షరతా కుసుమములనీయవే ॥
చ.2 
జలజదళాక్షి ముఖ్యసుర సన్నుత
అప్రతిభా కల్పనాశక్తి సమన్విత
బ్రహ్మజ్ఞాన విశారదా సమస్వభావ
"మల్లికా కుసుమగానానురక్త ॥

758. సర్వలోకేశీ

ప. సర్వలోకేశీ ఈశా మహేశీ
అ.ప. సర్వదేవతా పూజ్యా వహ్నిమండల వాసీ ॥
చ.1 
సర్వలోకప్రియా వజ్రేశ్వరీ
సర్వకర్మవివర్జితా సర్వలోకారాధ్యా
సర్వగర్వవిమర్దినీ ప్రకటయోగినీ
సర్వజ్ఞానప్రదా మహామహేశ్వరీ ||
చ.2 
రహస్యయోగినీ సర్వేశ్వరీ
సర్వవశంకరీ సౌభాగ్య దాయినీ
సర్వాంగసుందరీ త్రిపురేశ్వరీ
మల్లికాకుసుమగాన నివాసినీ ||

759. విశ్వధారిణీ

ప. విశ్వధారిణీ విశ్వమోహినీ
అ.ప. సకలజగతికీ కారణభూతా ॥
చ.1 
పదునాలుగులోకాలు జయహారతులు పట్ట
బ్రహ్మాదిదేవతలు భృత్యులై సేవింప
విశ్వమంతయునీవె విశ్వమందుననీవె
లీలాకల్పిత సర్వలోక సురమౌళీ ॥
చ.2 
విశ్వమంతనిండియుండి కనపడవేలనే
వేయివిధముల వేడుకున్నను వినవదేలనే
మావంటివారిని విడనాడగాతగునే
మల్లికాసుమగాన విశ్వంభరీ ॥

760. త్రివర్గధాత్రీ

ప. త్రివర్గధాత్రీ త్రిలోచనీ
అ.ప ధర్మార్ధ కామదా త్రిదశాలయా ॥
చ.1 
సిరిసంపదలను ప్రసాదించును
సౌభాగ్యములను వెదజల్లును
కల్పవృక్షపు పూలగుత్తివలె
అందము చిందును నీపదకమలము ॥
చ.2 
ఆరుపాదముల తుమ్మెదనేనై
నీపాదములచెంత విహరింతునే
సద్భక్ష పాలినీ శ్రీ భ్రామరీ
మల్లికాకుసుమగాన వైఖరీ ॥

761 సుభగా

ప. సుభగా జయమంగళా
అ.ప. సౌభాగ్యదాయినీ శోభాయమానా ॥
చ.1 
నీచరణ సారసము మదినమ్మియుంటి
నాపాపములెల్ల పరిమార్చమంటి
నీవుకాక మరేది శాశ్వతము కాదంటి
వేవేల ప్రణతులను గైకొన రమ్మంటి ॥
చ.2 
నీనామస్మరణమే నేసలుపుచుంటి
నిరుపమ నిర్గుణా నను మరువకంటి
నీదివ్యపాదములె శరణుశరణంటి
మల్లికాసుమగాన నుతులు వినమంటి ॥

762. త్ర్యంబకా

ప. త్ర్యంబకా త్రైలోక్యజననీ
అ.ప. మృత్యుంజయ స్వరూపిణి ॥
చ.1 
మూడు మూర్తులకు ముఖ్యమై నిలచిన
దివ్యమోహనరమ్యమూర్తి
శ్రీచక్ర సింహాసనా చక్రవర్తి
త్ర్యంబకేశ్వరుని హృదయానువర్తి ॥
చ.2 
అఖిలాండనాయకి నవశక్తిదాయినీ
లీలాతరంగిత కటాక్ష రుచిరమ్యా
జ్యోతిర్మండల మధ్యగా శివాత్మికా
మల్లికాసుమగాన రసబంధురా॥

763. త్రిగుణాత్మికా

ప. త్రిగుణాత్మికా శృంగార విభ్రమా
అ.ప. ఇచ్ఛా జ్ఞాన శక్తియుతా సమరోద్దండా ॥
చ.1 
వీణా గాన వినోద సంభరిత
సమ్మోహనకారిణి సరస్వతి
క్షీరసాగర పుత్రీ విష్ణువక్షస్థలీ
నవనిధిదాయిని శ్రీమహాలక్ష్మీ ॥
చ.2 
సౌభాగ్యములనిచ్చు కల్పకమతల్లీ
గిరిరాజతనయా మంగళగౌరీ
ముగ్గురమ్మలకు మూలపుటమ్మా
మల్లికాసుమగానామృతవర్షిణి |

764. స్వర్గాపవర్గదా

ప. స్వర్గాపవర్గదా పాటల వర్ణా
అ.ప ఉపాసనా ఫలదాన సమర్థా ॥
చ.1 
సిరిసంపదలు భోగభాగ్యములు
ఇచ్చే తల్లీ నారీవశంకరీ
సర్వానందమయీ సిద్ధిదాయినీ
జప ధ్యాన పూజా ఫలదాయినీ ॥
చ.2 
సకలాధిష్టాన రూపా కళ్యాణకారిణీ
శారదా పరివీజిత చామరహస్తా
లబ్దాతిశయ రూపా మోక్షప్రదాయినీ
మల్లికాసుమగాన వీణా వినోదినీ 

765. శుద్ధా

శుద్ధా శృతి పూజితా
అ.ప మర్మభేదినీ సర్వజ్ఞవల్లభా॥
చ.1 
బ్రహ్మజ్ఞాన విశారదా శారదా
శుద్ధ సత్వ స్వరూపిణీ నిరంజనీ
సంసార పాశా భేదినీ మోదినీ
శాశ్వత గుణానురంజనీ విశుద్ధా॥
చ. 2 
నీపాదములే నమ్మియుంటిని
అసహాయుల బ్రోవ జాగేలనే
నీచరణములే శరణము శరణము
మల్లికాకుసుమ గాన మాతృకా ॥

766. జపాపుష్ప నిభాకృతి

ప. జపాపుష్ప నిభాకృతీ
అ.ప. మందారపూవంటి సౌందర్య రాశీ
చ.1 
సిందూర తిలకముతో నీఫాలమే ఎరుపు
తాంబూలరసముతో అధరములు ఎరుపు
అందాలనీ చుబుకము పగడాల ఎరుపు
కుంకుమ రసముతో స్తనభరము ఎరుపు ॥
చ.2 
పద్మరాగ మణిభూషణములు ఎరుపు
ప్రపదము ముద్దాడు చీనాంబరములెరువు
లత్తుక పారాణితో నీపాదములే ఎరుపు
మల్లికా సుమగానానంద రక్తాక్షీ ॥

767. ఓజోవతీ

ప. ఓజోవతీ పరతేజ ప్రకాశినీ
అ.ప ఆదిత్య పధ గామినీ సర్వ వ్యాపికా ॥
చ.1 
అతులిత బలముతో అసురశక్తుల నణచి
అనుపమ కాంతితో అంధకారము బాపి
అపూర్వతేజముతో భక్తి భావమునింపు
భక్తానుగ్రహ అద్భుత విగ్రహా ॥
చ.2 
ప్రళయాంబుధి సన్నిభా
తేజోగుణ సమన్వితా
అమలయశోవిమలాంచితా
మల్లికాసుమగాన ఫలితా ॥

768. ద్యుతిధరా

ప. ద్యుతిధరా జగజ్జననీ
అ.ప. తప్తకాంచన సన్నిభా
చ.1. 
అత్యద్భుత సుందర రవితేజా
బహురత్న మనోహర కాంతియుతా
అతిరమ్యతరా చిరశాంతియుతా
పరమార్ధ విచార వివేకనిధీ ॥
చ.2. 
రాక్షస సంహర పరాక్రమతేజా
జగదోద్భవ పాలన నాశకరీ
తాపస మునిజన హృదయవిహారీ
మల్లికాకుసుమ గాన సహచరీ ॥

769. యజ్ఞరూపా

ప విష్ణురూపిణీ
అ.ప అంతర్యాగ బహిర్యాగ రూపిణీ ॥
చ.1 
చిదగ్ని కుండ సంభూతా
అఖిలాపద హారి
నయనత్రయ భూషితా
ఘృణిమంత్ర మయీ భర్గా ॥
చ.2 
యజ్ఞఫలదాయిని యజ్ఞేశ్వరి
అగస్త్యాది ముని గణ పూజిత
చండీయాగకుండ నిలయినీ
మల్లికాకుసుమగాన శక్తిమయీ ||

770. ప్రియప్రకా

ప. శివశక్తిమయీ
అ. సదాశివ ప్రియవ్రతా ॥
చ.1 
భాగ్యములిచ్చే లక్ష్మీ వ్రతములు
సౌభాగ్యములిచ్చు గౌరీవ్రతములు
సకలదేవతల సంపదవ్రతములు
భక్తి ప్రపత్తులు ఆచరింతుము ॥
చ. 2 
అన్నిప్రతములకు ఆదిదైవము
పతివ్రతాంగనా ఇష్టదైవము
సన్మంగళముల నిచ్చు దైవము
మల్లికాకుసుమగాన దైవము ॥

771. దురారాధ్యా

ప. దురారాధ్యా శ్రీవిద్యేశ్వరీ
అ.ప సాధకజన మానస విహారీ ॥
చ.1 
ఇంద్రియలోలుర బుద్ధికి అందనిదీ
మందబుద్ధులకు వశ్యముకానిది
చపలచిత్తులు పూజించలేనిది
వేదదూరులకు దూరమైనదీ ॥
చ.2 
స్థిర భావనతో నమ్మినవారికి
హృదయకుహరమున నివసించునదీ
శివారాధ్యులకే కనిపించునదీ
మల్లికా కుసుమగానారాధ్యా ॥

772. దురాదర్షా

ప. దురాదర్షా మహిమాన్వితా
అ.ప ఊహాతీత ప్రభావశాలిని ॥
చ.1 
సమస్త విశ్వసమ్మోహినీ
పాలనసేయవేదయామయీ
కరుణారస ప్రవాహమాధురీ
సకలకలాకదంబ మంజరీ
చ. 2 
నీవేలేవని అందురుకొందరు
నేను వాడి అని అహంకరింతురు
రాగాది దోషరహితముచేయవే
మల్లికా కుసుమరాగ రాగిణీ ॥

773 పాటలీ కుసుమప్రియా

ప. పాటలీ కుసుమప్రియా సౌభాగ్యమాలినీ
అ.ప మన్మధారి ప్రియంకరీ ॥
చ.1 
అందాల పెన్నిధీ సోయగాలవారానిధి
నీచరణమందారము ఎదలోన నిలిపితి
నిరవశేషముగా ఆపదలను బాపవే
నవరాత్రిపూజితా దరహాసవదనా ॥
చ.2 
హారనూపుర శోభినీ శేఖరీ పరమాత్మికా
పంచరత్న పద పీఠికా పాటలాక్షీ
నైమిశారణ్య వాసినీ ప్రణవ రూపిణీ
మల్లికాకుసుమగాన వివేకినీ ॥

774. మహతీ

ప: మహతీ మహనీయ గుణా
అ.ప మల్లికా సురభి గానసౌరభా॥
చ:1 
కళాకదంబ మంజరీ
విశ్వగానవినోదినీ
నారదవీణానినాదినీ
భువనగానమయీ ॥
2. 
నీమనోహరగానమునకు
పూలవానలు కురియగా
పరవశించెను ప్రకృతీ
పులకరించెను శివహృదీ॥

775, మేరునిలయా

ప: మేరునిలయా ఢమరుకప్రియా
అ.ప. పంచదశీమంత్రనిలయా
చ1. 
నవార్ణవమంత్రప్రియా
మహాత్రిపురసుందరీ
కామేశ్వరప్రాణనాడీ
హంసమంత్రార్దరూపిణీ II
చ2. 
నీకృపారసము చిలకరించవే
నాపాపములను పరిహరించవే
మారుత వేగినీ కావగరావే
మల్లికా కుసుమ గాన కళాధరీ ॥

776. మందార కుసుమప్రియా

ఫ: మందార కుసుమప్రియా త్రిపురాంబికా
అప. హేమభూషణ భూషితా ॥
చ1. 
సంగీతాలంకృతా సాహిత్యమోదితా
సామగాన వినోదితా పరమేశసుకృతా
వ్రతదానఫలితా కుంకుమ విలేపితా
జపాకుసుమ మోహితా సువాసినీ వందితా ॥
చ2. 
మందార పూవులు మంకెన పూవులు
దాసాని పూవులు రక్తచందనము
రక్త వస్త్రములు ప్రీతికారకమైన
మల్లికా కుసుమ వేణి శోభితా ॥

777. వీరారాధ్యా

ప: వీరారాధ్యా శంభుప్రియా
అ.ప: పరమమహేశ్వర ఆరాధ్యా ||
చ:1 
ఆత్మానందము అనుభవించెడివారు
జ్ఞానానందము పొందినవారు
ద్వైత భావములు లేనట్టివారు
నిను ఆరాధించు పుణ్యాత్ములు||
చ2. 
మహావీరేంద్రవర దా శర్మదా
వీరభద్ర గణపూజితా మహితా
ప్రమధనాధ హృదయరంజితా
మల్లికాకుసుమ గాన మోహితా ॥

778. విరాడ్రూపా

ప. విరాడ్రూపా విశ్వహితరూపా
అ.ప సర్వదేవతా విగ్రహరూపా ||
చ.1 
నీరూపమే బ్రహ్మాండాకారము
సూర్య బింబమే రజతఛత్రము
దేవతలందరూ నీకు సేవకులు
భూవలయమంతయు నీపాదపీఠము ॥
చ. 2 
చంద్రకాంతివై సూర్యతేజమై
పావకభ్రాంతిపై అష్టదిగ్ధంతిపై
షోడశభువనాలు కుక్షినుంచుకొను
మల్లికాకుసుమగాన విశ్వంభరీ ॥

779. విరజా

ప. విరజా తేజస్వినీ
అ.ప బ్రహ్మప్రతిష్ఠా విరజా మాతా ॥
చ.1 
సత్వగుణాలయ త్రిగుణా తీతా
నిరహంకార నిర్వికారిణీ
పాపరహితా పావనచరితా
అమోఘస్వరూపా శ్రీ మాతా |
చ.2 
కవిజనకల్పక కలుష దమనీ
తాంబూలారుణపల్లవాధర
పంచకోశాత్మికా నీలీ నీలాంబరీ
మల్లికాకుసుమగాన మంజరి ॥

780. విశ్వతోముఖీ

ప. విశ్వతోముఖీ విశ్వాత్మికా
అ.ప విశ్వగమ్యా గణనీయచరితా ॥
చ.1 
దివ్యమంగళా జగదానందా
విశ్వ భర్తా విశ్వవిధానా
మృష్టాన్నప్రీతా హిమాద్రిజాతా
పుళిందినీశ్వరీ పర్వతవాసినీ ॥
చ.2 
విశ్వవ్యాపినీ మాయాప్రభంజనీ
విశ్వకారిణీ విశ్వేశ్వరీ
అష్టాంగయోగినీ వేదగోచరీ
మల్లికాకుసుమగాన సాక్షిణీ ||

781. ప్రత్యగ్రూపా

ప. ప్రత్యగ్రూపా అంతర్ముఖా
అ.ప మూలకారణా నిశ్చలాత్మా ||
చ.1 
సుప్రసాదినీ ప్రసన్నాత్మా
భూతభావనా విశుద్ధాత్మా
అనంతరూపా విజితాత్మ
అనేకమూర్తీ విధేయాత్మా ॥
చ.2 
అప్రమేయా ప్రమేయాత్మా
అనామయా అఖిలాత్మా
అధిష్టానా అమేయాత్మా
మల్లికాకుసుమగానాత్మా ॥

782 పరాకాశా

ప. పరాకాశా స్వప్రకాశా
అ.ప సర్వవ్యాపిని సర్వాత్మికా ॥
చ.1 
సత్వగుణాన్విత విబుధ ప్రియ
రత్నభూషణా సదా షోడశీ
లోకచూడామణీ రమ్యరసనిధి
షడ్గుణ ఐశ్వర్య విరజా వినయా |
చ.2 
నక్షత్ర మాలినీ వ్యోమకేశీ
రుద్రరూపిణీ శత్రుహారిణీ
సృష్టి కారిణీ పరంజ్యోతీ
మల్లికాకుసుమ గానదీపా ॥

783. ప్రాణదా

ప. ప్రాణదా శుభకామదా
అ.ప సుజన రక్షా దీక్షితా ||
చ.1 
పంచభూతములయందున నిలచి
పాంచభౌతికదేహములందున
పంచప్రాణముల దీపమునిలిపే
ప్రాణదాయినీ శుభకామినీ ॥
చ.2 
సర్వ జనులకు ఆహారమును
నియమబద్ధముగ ఏర్పరచినావు
అన్నదాతవు ప్రాణదాతవు
మల్లికాకుసుమగాన ప్రాణదా ॥

784. ప్రాణ రూపిణీ

ప. ప్రాణరూపిణీ భక్త హృదయ నివాసి
అ.ప మార్తాండ భైరవ పూజితా ॥
చ.1 
పంచభూతముల పంచప్రాణముల
పంచశక్తుల ప్రణవరూపిణీ
జీవులయందున ప్రాణరూపముగ
నిలచియుండే గుప్తరూపిణీ |
చ.2 
నీవులేనిదే జీవములేదు
జీవములేక జీవియుండదు
జీవితచక్రము నడిపే శక్తి
మల్లికాకుసుమగాన ప్రేరణా॥

785. మార్తాండ భైరవారాధ్యా

ప. మార్తాండ భైరవారాధ్యా
అ.ప. ఆదిత్య మండలాంతర్వర్తి ॥
చ.1 
మార్తాండ భైరవుడు నిను ఆరాధించి
సూర్యతేజమును పొందకలిగెను
ప్రాణశక్తిని ప్రసాదించే పావనీ
అష్టభైరవ వందితా శ్రీశాంకరీ ॥
చ. 2 
జలము తేజము నింగియు నీవే
వాయువు నీవే పృధ్వీ నీవే
పంచభూతముల ప్రాణశక్తివి
మల్లికాకుసుమగాన ప్రాణహిత ||

786. మంత్రిణీ స్వస్థరాజ్యధూః 

ప. మంత్రిణీన్యస్త రాజ్యధూ
అ.ప. మంత్రిణీ పరివార పూజితా ॥
చ.1 
శ్యామరూపిణీ శ్యామలాదేవీ
గేయచక్రరూఢ మంత్రిణీదేవీ
అమితశక్తి సైన్య వారాహిదేవీ
షోడశమంత్రిణీ పరిసేవితా
చ.2 
లోకపాలనచే విశ్వశ్రేయము కూర్చి
సంకల్పసిద్ధిని కలిగించు మంత్రిణీ
పరివారసేవితా రాజరాజేశ్వరి
మల్లికాకుసుమగాన సంతోషిణీ

787. త్రిపురేశీ

ప. త్రిపురేశీ అమేయకృపాన్విత
అ.ప. సర్వలోకహిత మునిజనసన్నుత
దివ్యకళామయ రూపశోభిత ॥
చ1. 
షోడశదళనివాసినీ షోడశాక్షరీ
సర్వాంశాపరిపూరక చక్రవాసినీ
వాంచితార్ధ ప్రదాయిని కామిని
మల్లికాకుసుమ గంధ సురుచిరవేణీ ॥
చ2. 
నవరాత్రిసంచారిణి నవయవ్వన శాలినీ
నవావరణ పూజిత నవనిధి సంధాయినీ
శరశ్చంద్ర నిభాననా త్రిపురేశీవజ్రనీ
యంత్రమంత్రస్వరూపిణి భవసాగరతారిణీ

788. జయత్సేనా

ప. జయత్సేనా జయమునీయవే
అ.ప అనంతశక్తి సేనాసమన్వితా ॥
చ.1 
అసురులను సంహరించు శక్తి సేనలతో
విజయమును సాధించు మంత్రిణీగణముతో
నిరతము సేవించుయోగిణీ గణముతో
తేజోవిలాసినీ విజయాంబికే ॥
చ. 2. 
సప్తకోటి మహామంత్రములు
సర్వదేవతలూ నీఆధీనమే
నిన్నునమ్మినచో అన్నిజయములే
మల్లికాకుసుమ గాన యోగినీ ॥

789. నిమ్రోగుణ్యా

ప. నిమ్రోగుణ్యా లీలావినోదినీ
అ.ప సప్తకోటి మహామంత్రా॥
చ.1 
ప్రణవాది అక్షరాత్మికా
సుధాంశు బింబవదనా
నిర్గుణ చరితా శ్రీలలితా
సర్వ జయకరీ జయ జయ గౌరీ ॥
చ.2 
ఖడ్గభేటకధారిణీ
ఘోరాసుర ధ్వంసినీ
మధురాలాప సంతోషిణీ
మల్లికాసుమగాన వర్ధినీ ॥

790. పరాపరా

ప, పరాపరా యోగవిద్యా పరా
అ.ప. విశ్వవ్యాప్త ఆత్మతత్వా
చ.1 
జ్యోతిష్యాది అపరా విద్యలు
జపతపాది పరావిద్యలు
భోగమోక్షపర సాధనలు
ముక్తిజ్ఞాన సోపాన హేతువులు ॥
చ.2 
సమస్త విశ్వము నీఆధీనము
హృదయాంతరాళముల సత్యదర్శనము
నీపూజనమే శాశ్వతానందము
మల్లికాకుసుమగాన సత్యము ॥

791. సత్యజ్ఞానానందరూపా

ప. సత్యజ్ఞానానందరూపా
అ.ప. సర్వలోకాఁ ధ్య నిత్య సౌభాగ్యా ॥
చ.1 
వృద్ధిక్షయములేని నిత్యమై సత్యమై
సంకల్ప వికల్పములేని ఏకాకియై
కాలాతీతమై స్వప్రకాశమై
సర్వజీవులకు సాక్షీభూతము
చ.2 
శాశ్వతానందము కైవల్యము
సాయుజ్యమార్గము మోక్షదాయకము
అనిర్వచనీయ అనుభవానందము
మల్లికాసుమగాన చైతన్యము నీ రూపము ॥

792. సామరస్య పరాయణా

ప. సామరస్య పరాయణా సమరస భావనా
అ.ప. శివశక్తిసమ్మేళనా ||
చ.1 
ఆదిపురుషుడతడు ఆదిపరాశక్తి నీవు
మీ ఇద్దరి జంట మాకన్నుల పంట
పశుమలేశుడతడు పాశవిమోచనినీవు
మీకలయికే విశ్వశాంతికి కారణము ॥
చ.2
 కాలకంఠుడు అతడు కలకంఠి కాళి నీవు
మీ ఇద్దరి అనురాగము లోకాలకు ఆదర్శము
మంగళరూపుడు అతడు మంగళగౌరివి నీవు
మీ ఇద్దరి రూపము మంగళ ప్రదము ॥

793. కపర్దినీ

ప. కపర్దినీ శైలరాజసుతా
అ.ప కపర్దినీ విద్యారూపిణీ ॥
చ.1. 
సకలభూతప్రేత నాశినీ దుర్లభా
అష్టత్రింశతి రూప కైవల్య రేఖా
శివశక్త్యాత్మికే త్రికోణ మధ్యమా
మహిషమర్దనీ రమ్యకపర్దినీ ॥
చ. 2. 
సింహేద్ర వాహనా శాశ్వత శరణ్యా
నిత్యనిరహంకార శివవల్లభా
శశిఖండ మండిత జటాజూటా
మల్లికాకుసుమగా స్మిత శోభితా।

794. కలామాలా

ప. లావణ్య శోభినీ కలామాలా
అ.ప చతుష్షష్ట్యాది కలారూపిణీం ॥
చ.1 
పంకేరుహ చరణం
సకలకలా భరణం
కుంకుమ పంకిల వదనం
మణిమయ సదనం ॥
చ.2. 
ఇంద్రాది సన్నుతం
హరిద్రాన్నభక్షణం
కదంబవన వాసినం
మల్లికాసుమ గాన మోహం ॥

795. కామధుక్

ప. కామధుక్ కామేశ్వరి
అ.ప. కొర్కెలను తీర్చేటి కామధేను స్వరూపా ॥
చ.1. 
భక్త మనోరధ పూరణ చతురా
హేమమణిమయ సుందర హారా
తాంబూలారుణ పల్లవాధరా
సర్వగుణాశ్రయ ముని మనోహరా ॥
చ. 2 
దివ్యదరహాస భాసురా
నిరంతరానంద ప్రదాయకా
వాగమృతానంద తరంగితా
మల్లికాకుసుమగానహితా ॥

796. కామరూపిణీ

ప. కామరూపిణీ కామేశ మనోహరీ
అ.ప. కామదాయిని కామేశ్వరీ ||
చ.1 
వాగీశ్వరి వాచకరీ యోగీశ్వరీ
పశుమలేశుని' రాణి గీర్వాణీ
తెలియకచేసిన తప్పులు ఎంచుట తగునా
నేరములను మన్నింపలేవా ॥
చ. 2 
వాగ్దేవి కరుణించి యిచ్చినవరము
మల్లికాకుసుమ గాన పరిమళము
నీకేయిచ్చి నిను ఆనందింపగచేయ
ఏనోములు నేను నోచుకుంటినో తల్లీ॥

797. కలానిధీ

ప. సకల కలానిధి కామేశీ
అ.ప. షోడశ కళానిలయినీ
చ.1 
చంద్ర కళాధరి శ్రీ నిధి
మధుర సంగీత కళానిధి
సులలిత కవిత్వ వారధి
చిరునవ్వుల శాంతిసుధా నిధి ॥
చ. 2. 
మాపాలిటి సాహిత్య పెన్నిధి
కోరుకొందు నిత్యము నీసన్నిధి
శ్రీ లలితా సౌభాగ్య విద్యానిధి
మల్లికాకుసుమగాన దీక్షానిధి ॥

798. కావ్యకలా

ప. చతుషష్టి కళామయీ కావ్యకలా
అ.ప. మృతసంజీవనీ విద్యాకళారూపిణీ
చ.1 
చైతన్యకలా బ్రహ్మకలా విలాసిని
సాహిత్య సంగీత వికాసిని
వాగర్ధముల విభూతి ప్రసాదము
సారస్వత విజ్ఞానము నొసగవే ॥
చ.2 
వేదవ్యాస వాల్మీకి కాళిదాసాది
కవిజన కావ్యరస ప్రవాహినీ
సరస శృంగార కావ్య కళామయీ
మల్లికాకుసుమగాన ప్రసాదిని ॥

799. రసజ్ఞా

వ. రసజ్ఞ శివుని శృంగారమా
అ.ప. భక్తుల పాలిటి శాంతమా ॥
చ.1 
అసుర గణములను త్రుంచు వీరమా
కుజనులను శిక్షించు రౌద్రమా
గిరీశు చరితవిని విస్మయమా
హరుమేని సర్పముగని చిరుభయమా ||
చ. 2. 
సఖురాండ్ర యందు దరహాసమా
రక్తబీజు సంహార భీభత్సమా
ఈదీనురాలిపై కరుణ చూపుమా
మల్లికాసుమగాన భక్తి మకరందమా॥

800. రసశేవధిః

ప. బ్రహ్మమృత రసశేవధీ
అ.ప.బ్రహ్మానంద రసనిధీ II
చ.1 
శృంగార రసశేవధీ
నవరసానంద రధసారధీ
సరససంగీతామృత వారధీ
సకల కళాకావ్యనిధీ ॥
చ. 2. 
సకలాగమ స్థితా సమరసా
స్వప్రకాశ చైతన్య రసా
ముగ్ధమోహన లావణ్య రసా
మల్లికాకుసుమ దివ్యగాన రసా ॥

801. పుష్టా

ప. సకల కలా రూపిణీ పుష్టా
అ.ప సకలతత్వ రూపిణీ ॥
చ.1 
బ్రహ్మానంద శేవధీ
సకలాగమ పరమావధి
సంగీత స్వర గాన నిపుణా
అఖండైక చైతన్య రూపా ||
చ.2 
మనః పధదవీయసీ
మహాగుణ గరీయసీ
సలలిత లావణ్య రాశీ
మల్లికాసుమ గానవానీ ॥

802 పురాతనా

ప. ఆదిదేవీపురాతనా
అ.ప నిరాకారానిర్గుణా ||
చ.1 
ఆద్యంతరహితా ఆదిశక్తి
ఏకార రూపా ఏకరసా
ఏలాసుగంధి చికురా
కాలస్వరూపా శాశ్వతా ||
చ.2 
నవనాదమయీ శక్తిమయీ
దనుజదండినీ తంత్రమయీ
ఆధ్యాత్మ తేజోవిలాసిని
మల్లికాకుసుమ గానమయీ||

803. పూజ్యా

ప. సకల దేవతా పూజ్యా
అ. ప యక్షకిన్నెరపూజా యోగ్యా ॥
చ.1 
సకలఋషివరులు కొలువగా
సద్గుణ కీర్తుల నాలపించగా
కమలజాదిసురలు నుతింపగా
మణిమంటపమున కొలువుతీరెను
చ. 2 
మోహనాంగులౌసురలు ఆడగా
నారదాది మునిముఖ్యులు పాడగా
మేనుమరచినది చిరునవ్వులతో
మల్లికాకుసుమగానాహ్లాదిని ||

804 పుష్కరా

ప. సర్వవ్యాపిని పుష్కరా
అ.ప యోగకాలస్వరూపిణీ II
చ.1 
నాపాలి భాగ్యమా నాకంటి వెలుగా
మాఇంటి దీపమా గతజన్మ ఫలమా
మాపైనదయచూపి మాపూజకొనుమా
నీదివ్యదర్శనము మాకుదుర్లభమా॥
చ.2 
నీదరహాసపు మొలకలలో '
స్నానమాడింపవే విశ్వసాక్షిణీ
సర్వమును పోషించు సారసాక్షి
మల్లికాకుసుమగాన సుందరీ ॥

805. పుష్కరేక్షణా

ప. మనోహర పుష్కరేక్షణా
అ.ప కరుణా కటాక్షీ పద్మాక్షీ ॥
చ.1 
బ్రహ్మాది దేవతలు భృత్యులై సేవింప
పద్నాలులో కాలు జయహారతులు పలుకు
శుభఫల వర్షిణీ కరుణామృతవల్లీ
కామేశమానస ప్రియతమభామినీ
చ.2. 
అనాద్యంతా ఆత్మరూపిణీ
విశ్వవిధాత్రీ హరాధీనా
కవులవాక్కుల కల్పవల్లీ
మల్లికాసుమగాన కమలాక్షీ ॥

806 పరంజ్యోతి

ప. పరంజ్యోతి పరాత్పరీ
అ.ప మదనశాసన ప్రేయసీ ॥
చ. 1 
గహరాబ్జ గేహినీ
జ్వాలాంబికే శ్రీ జగదంబికే
రూపలావణ్య విగ్రహా॥
చ.2 
ఖండేందుమౌళి మానస విహారిణి
మహాభాగిని మహాభోగినీ
గీర్వాణ సంసేవిని లోకపాలినీ
మల్లికా కుసుమగాన పాలినీ ॥

807. పరంధామా

ప. పరంధానూ ప్రకీర్తితా
అ.ప న ప్రసాదా పుష్టివర్ధని II
చ.1 
రజనీశ కలారమ్యా
షడాధారా షడాశ్రయా
సకలాగమ పారగాయ
మనోరధ ఫలప్రదా ॥
చ.2 
తురీయపద గామిని
పరాశక్తి గౌరి మహేశ్వరి
ఋణత్రయ విమోచనీ
మల్లికాకుసుమగాన ధారిణీ ॥

808. పరమాణు:

ప. అడోరణీయ పరమాణు
అ.ప బ్రహ్మాండాకారిణి శ్రీలలితా ॥
చ.1 
లోకోత్తర గుణాన్వితా
భవతాప ప్రశమనీ
యాతనారహితా వరిష్టా
జగదానంద జననీ
చ.2 
అణిమాది గుణాగ్రణీ
మంజుమంజీర పదాబ్జ
కీరాలాపవినోదినీ
మల్లికా సుమగానాగ్రణీ ॥

809. పరాత్పరా

వ. పరాత్పరా శ్రీమయీ
అ.ప గురుస్వరూప విభవా॥
చ.1 
విద్యుల్లతా విగ్రహా
శ్రీదానవిద్యామయీ
కళ్యాణ కాంచీరవా
కామ్య ప్రదాన వ్రతా ॥
చ. 2 
కౌమారీ గురురూపిణీ
గౌరీ కారుణ్య కల్లోలినీ
యాతనారహితాధృతివర్ధనీ
మల్లికాకుసుమగాన వర్ధనీ ॥

810. పాశహస్తా

ప. రాగే స్వరూప పాశహస్తా
అ.ప సర్వాయుధ ధారిణీ ॥
చ.1 
జన జాడ్యాపహారిణీ
గీర్వాణ సంసేవినీ
షట్కోణమధ్య నిలయా
ఇంద్రభోగ ఫలప్రదా॥
చ.2 
నిర్మలాత్మక నిశ్చలాత్మకా
రాగాది దోషవర్ణికా శ్రీ మాతా
కామారి కామా కనక ప్రభాసా
మల్లికాకుసుమగాన కీర్తిదా॥

811. పాశహంత్రీ

వ. పాశహంత్రీ సనాతనీ
అ.ప భవపాశవిమోచనీ జయభవానీ ॥
చ. 1 
పశుపాశము భవపాశము
బంధపాశము మోహపాశము
దుఖః పాశము ఆశాపాశాది
పాశములను తొలగచేయుము॥
చ.2 
కామేశుని వలపుసీమలను
ఏలు ప్రియతమ భామినీ
మనోరధములుతీర్చుతల్లీ
మల్లికాసుమగానవల్లీ ॥

812. పరమంత్రవిభేదినీ

ప పరమంత్రవిభేదినీ కపర్దినీ
అ.ప భండాసుర వినాశినీ ॥
చ.1 
పంచదశీ మహామంత్రోపాసినీ
శివపద రాజీవ మధుపమా
విభుదాశ్రయా భాగ్యవర్ధినీ
రసభావక హసితాననా ॥
చ.2 
ఏణాంకధరీ ఉత్సవప్రియా
పాశాంకుశధారిణీ మదంబా
పరమేశ్వరీ అమితతేజసా
మల్లికాసుమగానమానసా ॥

813.మూర్తా

ప. మూర్తాస్థూలరూపిణీ
అ.ప నామరూపాత్మక దివ్యమూర్తి ॥
చ.1 
అన్ని భాషలు అన్నిభావములు
కళలు కాంతులు వింతలు వంతలు
అందచందములు దశలు దిశలు
నీ అధీనమై అలరుచున్నవి ॥
చ.2 
స్వప్న సుషుప్తుల సాక్షీభూతా
సర్వలోకహిత శివసన్నుత
కైమోడ్పులివే శ్రీపురవాసిని
మల్లికకుసుమగాన నివాసిని ॥

814. అమూర్తా

ప. అనిర్వచనీయా అమూర్తా
అ.ప భక్తహృదయారవిందా నిరాకారమూర్తీ ॥
చ. 1 
భవబంధ మోచనా వేదస్వరూపా
ఉపనిషత్సారా ధృవకలారూపా
కార్యకారణ నిర్ముక్తా నిరాధారా
కంటికి
కనపడని అమృతంగమా ॥
చ.2
యోగులమనమున హంసరూపము
మెరుపుకాంతివలె అగ్నిజ్వాలవు
చిదాకాశమువాయువునీపు
5 మల్లికాకుసుమగానపూరితా॥

815. నిత్యతృప్తా 

ప. నిత్యతృప్తా  శివంకరీ
అ.ప తృప్తిరూపిణీ అప్రమేయా॥
చ.1 
ధ్యానావహనాది షోడశపూజలతో
స్నానము పానము గంధాక్షలతో
చతుష్షష్టి ఉపచారములతో
నిత్యాలంకారా నిత్యతృప్తా ॥
చ. 2 
తాంబూలపూరిత వదన ప్రియా
యజ్ఞయాగ ఫల దానప్రియా
అరవిందాసనా అర్చన ప్రియా
మల్లికాకుసుమ గానప్రియా॥

816. మునిమానసహంసికా

ప మునిమానసహంసికా
అ.ప. హ్రీంకారదీర్ఘకాహంసీ ॥
చ.1 
యోగిజన హృదయకమల మకరంద రసిక
మునిమానససరోవర పరమహంసికా
నిటలనేత్ర హృదిరంజని గురుపాదుకా
హ్రీంకారవాచ్యా హ్రీంకారపూజ్యా ॥
చ.2 
సకలశుభకరీ వైష్ణవీజ్వాలా
మన్మధ హేలా కరధృతిశీలా
బ్రహ్మానందామృత సాగరహేలా
మల్లికా కుసుమగాన హంసికా ॥

817. సత్యవ్రతా

ప సత్యవ్రతా పరమేశ్వరి
అ.ప నిత్య సత్య సాహిత్య రూపిణీ ॥
చ.1 
సర్వమంగళ కారిణీ
పుణ్యరూపిణి పురాణీ
కలాత్మికా ఇంద్రరూపిణీ
హేమభూషిణి సత్యస్వరూప ॥
చ.2 
సత్యశోధిని సత్యవాదిని
సత్యమోహిని సత్యవాహినీ
సత్యోపాసనా ఫలదాయిని
మల్లికా కుసుమగానవ్రతా॥

818. సత్యరూపా

ప. సత్యరూపా సత్యవతీ
అ.ప త్రికాలజ్ఞా సర్వాంతర్యామీ ॥
చ.1 
సత్యపాలన చక్రవర్తీ
ధర్మపాలన సత్యమూర్తీ
నిత్యనిర్మల బ్రహ్మమూర్తీ
కామేశహృదయానువర్తి ॥
చ.2 
సధర్మదీక్షతో సత్కర్మలు చేసి
దేవతలను గురువులను ఆదరించెడి
సత్యసంకల్పమును మాకీయవే
మల్లికాసుమగాన సత్యరూపా ॥

819. సర్వాంతర్యామినీ

ప. సర్వాంతర్యామినీ శ్రీ లలితా
అ.ప పరమేశ్వర ప్రకృతి శబళ బ్రహ్మా ॥
చ.1 
అన్ని మంత్రముల రూపము జ్ఞానము
అన్నిశాస్త్రముల సారము పారము
భక్తుల పాలిటి ఇహ పర దైవము
కలదన్నవారికి కనుపించుదైవము ॥
చ. 2 
పాహి పాహి యని ఎంతపిలిచినా
మనసుకరుగదా మాపాలిదైవమా
యోగసదాశివ మానస విహారిణీ
మల్లికాకుసుమగాన భృంగికా ॥

820. సతీ

ప సదాశివ సతీ సర్వాంతర్యామి నీసతీ
అ.ప సతతము చేసెద సన్నుతీ ॥
చ.1 
నీకనుసన్నల మెలిగెడివారికి
దుఃఖములేవీ లేవని తెలిసి
నీపూజలనే మరిమరి సలిపెద
జాగుచేయకే మమ్ముకావవే ॥
చ. 2 
దాక్షాయణిపై భవునిసతివై
చిదగ్నిలోనే ఆహుతియై
అష్టాదశ పీఠముల వెలసిన
మల్లికా కుసుమ గాన శాశ్వతీ || 

821. బ్రహ్మాణీ

ప. మానస సంచరిణీ బ్రహ్మాణీ
అ.ప చతుర్దశ భువనాధారిణీ ॥
చ.1 
అంతట తానై శ్రీకరమై
ఆనందమయకోశ నిధియై
అలడుచున్నది బ్రహ్మమై
బ్రాహ్మణీ మనోన్మణీ ॥
చ. 2 
బ్రహ్మపద మార్గదర్శిని
సత్కవులు రసచింతామణి
పంచభూతాంతర్యామిని
మల్లికాసుమగాన కర్మణీ ॥

822. బ్రహ్మజననీ

ప, బ్రహ్మజననీ హ్రీంచూడామణీ
అ.ప హ్రీం మధ్యా లకులేశ్వరీ ॥
చ.1 
సకల జననీ హంసవాహినీ
వినయసులభా వేదగులికా
వ్యోమాకారా పరానందా
తరుణార్కశోడీ రాగార్థవీ 
చ.2 
విశ్వస్వరూపిణి సనాతని
సచ్చిదానంద బ్రహ్మమయీ
ఈశ్వరానుగ్రహాత్మికా
మల్లికాసుమగాన వీచికా॥

823. బహురూపా

వ. ఉమాదేవీ బహురూపా
అ.ప ఉమా మహేశ్వరి మంగళరూపా ||
చ.1 
శక్తిస్వరూపిణీ మహేశ్వరీ
నామరూపాత్మిక సృష్టి కారిణీ
సర్వవిద్యాదాయినీ శివయువతీ
పుణ్యజనపూజిత పదా ॥
చ.2 
సత్కవులెల్లరు నిన్నుపొగడంగ
హిమగంగతో నీపాదాలు కడుగంగ
వాగ్దేవి మహలక్ష్మి నినుకొలువంగ
మల్లికాకుసుమాల నిను సేవింతునే ॥

824. బుధార్చితా

ప. బుధార్చితా శ్రీ లలితా
అ.ప విబుధాశ్రయా సుచరితా ॥
చ.1 
దేవతలు మునులు యోగినులు
పుణ్యచరితులు నినుపూజింతురే
ఐహిక సుఖములనిచ్చు శాంకరీ
సాయుజ్య మిచ్చేటి శాంతిదాయినీ ॥
చ.2 
బాల పంచదశీ సౌభాగ్య విద్యా
షోడశీ శుద్ధ మహావిద్యా
వారాహి బగళా నీరూపములే
మల్లికాకుసుమ గానార్చితా ॥

825. ప్రసవిత్రీ

ప. ప్రసవిత్రీ సవితాదేవీ
అ.ప సకలజగతి సృష్టికారిణీ ॥
చ.1 
సూక్ష్మము నుంచి బ్రహ్మము వరకు
అండము మొదలు బ్రహ్మాండము వరకు
పదునాలుగు లోకముల సృష్టికారిణీ
సర్వభూతహిత కారణభూతా ॥
చ.2 
దానవ విద్రావినీ దేవలోకవిహారిణీ
కలిదోషహరా క్షీర పాయినీ
కాళిదాసాది కవివర పూజితా
మల్లికాకుసుమ గాన సమావృతా ॥

826. ప్రచండాజ్ఞా

ప. ప్రచండాజ్ఞా సర్వజ్ఞా
అ.ప హూంకారాలయ నాయికా ॥
చ.1 
లిప్తచందన పంకిలా
షట్కార పీఠ నిలయా
స్వాహాకార స్వరూపిణీ
స్వకృతాఖిల వైభవా ॥
చ.2 
నిశాచరకుల ధ్వంసీ
దుర్మదా దురితాపహా
నవరాత్రి దినారాధ్యా
మల్లికాసుమగాన దేవతా ॥

827. ప్రతిష్ఠా

ప. ప్రతిష్ఠా పరమేశ్వరీ
అ.ప నీతిశాస్త్ర స్వరూపిణీ ॥
చ.1 
స్వాదిష్టానాంబుజారూఢా శోభనా
లలితాక్షర మంత్రస్థా విజయప్రదా
ఫలదాన ప్రదాయనీ ఫలాశినీ
హ్రీంకారాలయ నాయికా గిరిసుతా॥
చ.2 
కుంకుమారుణ కంధరా సురపాలినీ
శంఖతాటంక శోభినీజనమోహినీ
శిష్టాచార పరాయణీ మృదుహాసినీ
మల్లికాకుసుమగాన సువాసినీ ॥

828. ప్రకటాకృతీ

ప శ్రీకరీ ప్రకటాకృతీ
అ.ప పార్వతీ పావనకృతీ ॥
చ.1 
కాళీ హైమవతీ కపాల ధారిణీ
శృంగార సామ్రాజ్య పట్టాభిషేకినీ
హిరణ్మయ పురాంతస్ధా బీజరూపిణి
త్రైలోక్యమోహన చక్రవాసినీ ॥
చ.2
ప్రకటిత మోహన రూపిణీ
నిరంతర సుఖ ప్రదాయినీ
సంగీతానంద సంతోషిణీ
రీధరు మల్లికాకుసుమగాన తోషిణీ ॥

829. ప్రాణేశ్వరీ

ప. చంద్రశేఖరుని ప్రాణేశ్వరి
అ.ప జయజయ శ్రీరాజరాజేశ్వరి
చ. 1 చిత్కళామయ చిదానంద ఘన
మాయాతత్వ ప్రాణస్వరూపిణీ
రాగ కాలం నియతి కలా విద్యా
పంచకంచుకా కళ్యాణీ 
చ.2 
సర్వరూపా సర్వప్రాణాధారా
సర్వయుక్తా సర్వజీవాధారా
బారూపైకరసికా రసాత్మికా
మల్లికాకుసుమగాననాయికా ॥

830. ప్రాణదాత్రీ

ప. ప్రాణదాత్రీ ఫలదాత్రీ
అ.ప అనంగాంకుశాది పరివారసేవితా|
చ.1 
చంద్రకళాధర కాంతికాంతా
ప్రాణి జనకా ప్రాణదాయిని
గూఢరూపీ అమంగళహంత్రీ
బ్రహ్మేశ్వరీ షడూర్మిహంత్రీ ॥
చ. 2 
మృత్యుంజయ ప్రాణేశ్వరీ
హ్రీంకార తరుమంజరీ
అకాలమృత్యుహరిణీ హ్రీంకారీ
మల్లికాసుమగాన ప్రాణధాత్రీ ॥

831. పంచాశత్పీర రూపిణీ

ప. పంచాశత్పీరరూపిణీ శ్రీమహారాజ్ఞి
అ.ప. ఆదిక్షాంతమూర్తీ కామరూపనివాసినీ ॥
చ.1 
దాక్షాయణివై సతివై చిదగ్నియందులీనమై
మాతృకాపీఠములలో పూజలందుకొను తల్లీ
శాంకరీ చాముండీ దుర్గా మాంగళ్య గౌరీ
వైష్ణవీ మాణిక్యాంబా శృంఖలా పురుహూతికా||
చ.2 
విశాలాక్ష్మీ కామాక్షీ జోగులాంబా భ్రామరీ
మహాకాళీ మహాలక్ష్మీ మాధవేశ్వరీ పార్వతీ
వింధ్యావాసినీ అన్నపూర్ణా జ్వాలాంబా జాలంధరీ
మల్లికాసుమగానమానస అనఘా భువనేశ్వరీ।

832. విశృంఖలా

ప. విశృంఖలా సర్వస్వతంత్రా
అ.ప సంసారశృంఖలములను త్రెంచవే ॥
చ.1 
తత్వప్రకాశముగశబ్దబంధురముగా
భక్తజన సేవ్యముగ మృదుమధురముగా
శుభాంచితముగ జనరంజకముగా
నీదివ్యకీర్తనలు మేముపాడెదమే ||
చ. 2 
అరమోడ్పు కనుగవతో నీవు ఆలకింపగా
నాగాన మాధురికి ప్రకృతి పులకింపగా
గేయరసాస్వాదనమున మేనుపరవశింపగా
మల్లికాసుమగాన గీతమాలపించెదనే ॥

833. వివిక్తస్థా

ప. వివిక్తస్థా స్వైరవిహారిణీ
అ.ప విశృంఖలా తపశ్శాలినీ ॥
చ.1 
నీవెక్కడ ఉంటివో తెలుపుమమ్మా
పంచభూతముల మధ్యన గలవో
నిర్జన దేశ ప్రదేశములందునో
జనులులేని పవిత్ర దేశములనుంటివో ॥
చ.2 
ఆకారములు ఉన్నవో నిరాకారివో
నామములున్నవో నామరహితవో
జడవదార్దమో ఆపదుద్దరవో
మల్లికాకుసుమగాననిలయవో॥

834. వీరమాతా

ప. వీరమాతా దిక్పాలకుల తల్లి.
అ.ప బ్రహ్మాది మూర్తులకు కన్నతల్లీ॥
చ.1 
గణాధిపతికి సేనాపతికి
శ్రీ విద్యాశ్రిత దీక్షాపరులకు
సర్వసేనలకు ఇంద్రాది వీరులకు
కన్నతల్లివై సాకెడి వీరాంబా
చ.2 
దేహి దేహియన వరమిచ్చెదవు
పాహి పాహి యన పోషించెదవు
త్రాహి త్రాహి యన కరుణించెదవు
మల్లికాసుమగాన స్వర మాలకించెదవు ॥

835. వియత్ప్రసూః

ప. వియత్ప్రసూ ఆకాశప్రసవినీ
అ.ప ఆదినిలయినీ ఆదిశక్తీ ॥
చ.1 
అండ పిండ నిలయినీ
బ్రహ్మాండ తేజోరూపిణి
ఆదివిద్యా నగరవాసినీ
సర్వలోకాధిపా పరా 
చ. 2 
పంచవింశతితత్వ
దూర్వాసముని పూజితా
అనాహత చక్ర సంస్థితా
మల్లికాసుమగాన స్థితా ॥

836. ముకుందా

ప. ముకుందా ముక్తినిలయినీ
అ.ప జ్ఞాన దాయినీ యోగీశ్వరీ ॥
చ.1 
యశోద గర్భాన నందగోపుని ఇంట
కృష్ణునిగా జన్మించి కారణ జన్మవై
శుంభ నిశుంభులను సంహరించిన
వింధ్యాచలవాసినీ లలితాంబికా ॥
చ.2 
నామరూపాత్మికా సృష్టిస్వరూపిణీ
ఆమందానంద నిలయా ముకుందా
బృందారక హితబృందా వనస్థితా
మల్లికాకుసుమగానముకుందా ॥

837. ముక్తినిలయా

ప్ర. ముక్తినిలయా పరమేశ్వరీ
అ.ప మోక్షప్రదాయిని రాజేశ్వరీ ||
చ.1 
స్వార్షిముక్తిదాయినీ మణిపూరనివాసినీ
సాలోక్యముక్తిదా అనాహతాబ్ద్బనిలయా
సామీప్య ముక్తిప్రద విశుద్ధచక్రస్థితా
సారూప్యముక్తినొసగు ఆజ్ఞాచక్రాబ్జా ॥
చ.2 
జన్మరాహిత్యమిచ్చి నీలోనజేర్చి
సాయుజ్యమొసగవే చక్రరాజనిలయా
కైలాసగిరినిలయుని వామాంబికా
మల్లికాసుమగాన స్వరదీపికా ॥

838, మూలవిగ్రహరూపిణీ

ప. మూలవిగ్రహరూపిణీ బాలాబగళా
అ.ప ప్రపంచనిర్మాత్రీ సారసనేత్రీ ॥ .
చ.1 
కాళీ హైమవతీ రమా శారదా
వింధ్యవాసినీ వైష్ణవీ జ్వాలా
సర్వదేవతా సర్వమంత్రస్థితా
సృష్టి స్థితి లయ మూలకారిణీ ॥
చ.2 
విశ్వమూలకారిణీ విశ్వసంభవీ
నారాయణీ సకల దేవతారూపిణీ
కామేశ్వరాహ్లాదకరీ శ్రీవిద్యా
మల్లికాసుమగాన కాంక్షితార్ధదా॥

839. భావజ్జా

ప. భావజ్ఞా విశ్వభావనామయీ
అ.ప ఆత్మస్వరూపా చేతనామయీ ||
చ.1 
భావములోనా మననములోనా
బాహ్యములోనా భాష్యములోనా
విశ్వమందునా సూక్ష్మమందునా
లలితరూపమే నిండియుండుకదా ॥
చ.2 
జగములంతటా నిండియున్ననూ.
కనులకు సత్యము కనబడకున్నదీ
జ్ఞానహీనులము సుజ్ఞానమునీయవే
మల్లికాకుసుమగాన సుధామయీ ॥

840. భవరోగఘ్నీ

ప. భవబంధ నిర్మూలినీ
అ.ప బంధనముల త్రుంచి మమ్ముకాపాడగదే ॥
చ.1 
నాదినాదనుకున్నదీ నాదికాకవేదనలా
నీవేనేనన్ననిజము తెలియలేకబాధలా
నిన్నుచేరుమార్గమేదో ఎరుగలేక చింతలా
సంసారము నీదలేని భవరోగపువంతలా ॥
చ. 2 
మందస్మిత శ్రీసుధా మధ్యాంతరా దీపికా
నాపైనీదయచూపవే భవసాగర తారిణీ
మల్లికాసుమ గాన కీర్తనలను పాడి
నీపదములు పూజింతునే పావనీ భవానీ ॥

841. భవచక్రప్రవర్తినీ

ప. భవచక్రప్రవర్తినీ శ్రీ రాజరాజేశ్వరి
అ. పరశివ ఆజ్ఞానువర్తినీ
చ.1 
దురాశల వీడగలనా
నీలీలలు నేపొగడగలనా
ప్రపంచముఖములు విష మనితలచి
పంచేంద్రియములనణచగలనా ॥
చ.2 
నీ సేవలనే మరి మరి చేసి
భవసాగరమును దాటగలనా
నీనిజభక్తుల నిరతము కొలిచే
మల్లికా సుమగానము చేయగలనా ॥

842. ఛందస్సారా

ప ఛందస్పారా మంత్రరూపిణీ
అ.వ వైఖరీరూపిణీ ఉపనిషత్సారా ॥
చ.1 
గాయత్రీ మంత్రసారాంశా
ఛందోబద్ద వేదసారాంశా
నియమబద్ధ మంత్రసారాంశా
రహస్య నామకీర్తనా సారాంశా ॥
చ. 2 
అగణితములైన శిల్పాది కర్మలు
నీప్రసాదములే శ్రీమహారాజ్జీ
అసదృశ మహాశక్తి ప్రశంశా
మల్లికాకుసుమ గాన సారాంశా ॥

843. శాస్త్రసారా

ప. శాస్త్రసారా సరగున బ్రోవవే
అ.ప విశ్వవాఙ్మయ మూలసారా ॥
చ.1 
న్యాయ శాస్త్ర ధర్మ శిక్షానిరుక్తము
యోగజ్ఞానముసాంఖ్య తర్కాది
శాస్త్రములన్నీ నీకల్పితములే
భక్తిభావము పెంచుప్రీతివర్ధనీ ॥
చ.2 
శాస్త్ర శోభలయందు వెలుగొందు
ద్యుతిధరా శివరమ్య దివ్యజ్యోతి
ఊహలకందని మహామహితాత్మా
మల్లికాసుమగాన సంతోషమానసా ||

844. మంత్రసారా

ప. మంత్రసారా బీజాశక్తి
అ.ప వైదికమంత్ర స్వరూపిణీ ॥
చ.1 
జ్ఞాన ప్రద వైదికమంత్రములు
కామ్యప్రద తాంత్రికమంత్రములు
బీజమంత్రములు మూలమంత్రములు
అన్ని మంత్రములసారమునీవే ॥
చ.2 
బీజాక్షర ఉపాసనామంత్రములు
పురుషమంత్రములు - మంత్రములు
నీరూపములే అన్నిటనీవే
మల్లికాకుసుమగానమంత్రితా ॥

845. తలోదరీ

ప, విరాడ్రూపిణీ తలోదరీ
అ.ప బ్రహ్మాండభాండోదరీ ||
చ.1 
హ్రీంకారాసన గర్భితా మౌనదా
చతుర్దశభువన పాలినీ
నీగుణములనే మరి మరి తలచి
ముక్తిగానములు అల్లెదనమ్మా ॥
చ.2 
హృత్సరోజమున నిన్నే నిలిపి
సతతము నీపద ధ్యానము చేసి
మల్లికాకుసుమగానమాలికతో
నీనామ సంకీర్తనలు చేతునమ్మా ॥

846. ఉదారకీర్తీ

ష ఉదారకీర్తి మహిమాన్విత కీర్తీ
అ.ప శాశ్వతకీర్తి దాయినీ ఆశ్రిత జనావనీ ॥
చ.1 
సంవిత్కళాకలిత
కావ్యరస భారతీ
కుందేందు స్మితసహిత
సుందరసుధాస్రవంతీ ॥
చ.2 
సౌభాగ్యధాత్రి యశోవిదాత్రీ
సుకవితావిధాన శక్తి దాత్రీ
విద్యావిజ్ఞాన సుఖశాంతి ధాత్రీ
మల్లీ కాసుమగాన శాశ్వత కీర్తీ ॥

847. ఉద్దామవైభవా

ప. ఉద్దామవైభవా మహదైశ్వర్యా
అ.ప. స్తవజన సమ్మిళితే శ్రీలలితే ॥
చ.1 
తలచినంతనే దురితములను త్రుంచి
ప్రాపు నీవే గాన పాప కర్మలు బాపి
కనికరముచూపకున్న ఓర్వజాలనే
జగములన్నీ నిండియున్న పల్లవపాణీ ॥
చ.2 
బాలచంద్ర కపోలలో రా
నీలవినీల వేజీలోలా
కామేశ్వర మాననలోలా
మల్లికాకునుము గాన విలోలా

848. వర్ణరూపిణీ

ప. వర్ణరూపిణీ వాగ్దేవీ
అ.ప బ్రాహ్మీ వైష్ణవి కౌమారీ ॥
చ.1 
నామరూపాత్మక సృష్టి ఆరంభమున
గుణకర్మ విభాగ గణసమూహముల
బ్రహ్మదర్శన కొరకు రక్షణకొరకు
వర్ణములనేర్పరచిన పరమేశ్వరీ ॥
చ.2 
అక్షరరూపిణీ క్షరాక్షరాత్మికా
అక్షరదోషములను రాగహీనమును
దయతోక్షమింపవే విస్ఫులింగినీ
మల్లికాకుసుమరాగ మంచీ

849. జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ

ప. జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ |
అ.ప భక్తజనతతి సులభా అకళంక తేజస్వినీ
చ.1 
రోగార్తులు జరాదుఃఖ పీడితులు
నీసంకీర్తనతో విముక్తులగుదురు
అన్యచింతలులేని భక్తాళికెల్లరలకు
స్మరణమాత్రముచేత చేకూరుపుణ్యములు ॥
చ.2 
తలచినంతనే దురితములను తుంచు
సత్వగుణసంపదాసహిత సాత్విక వర్తీ
సుగతి నిర్వాణసుఖ విశ్రాంతిదాయినీ
మల్లికాసుమగాన శక్తి నమోస్తుతే ॥

850. సర్వోపనిషదుద్ఘుష్టా

ప. సర్వోపనిషదుద్ఘుష్టా
అ.ప ఆదిమధ్యాంతరహితా ॥
చ.1 
త్రిగుణాతీతవై త్రికాలజ్ఞవై
పూజలందుకొను త్రిభువన పాలినీ
కావుమమ్మా కోపమేలా
కనికరము చూపవేలా ॥
చ.2 
సర్వ ఉపనిషత్ సారణీ
శృతమయీ కవితారస సారణీ
మంజీరహార భూషణీ
మల్లికాసుమగాన రసమణీ ॥

851. శాంత్యతీత కలాత్మికా 

వ. శాంత్యతీత కలాత్మికా భువనేశ్వరీ
అ.ప ద్వైత నిర్వాణానందబోధదా ॥
చ.1 
నాసల్లాపమే నీకు జపమై
హస్తన్యాసమే నీకుముద్రలై
స్వేచ్ఛా గమనమే నీప్రదక్షణమై
నాచేష్టావిలాసమంత నీపూజనమే ॥
చ.2 
నావర్తనలే నీకుసపర్యలు
నాసుఖమెల్లను ఆత్మార్పణము
తృప్తినిపొంది శాంతిప్రదాయిని
మల్లికాకుసుమగానము వినుమా ॥

852. గంభీరా

ప. గంభీరా మహాహ్రదా
అ.ప జ్ఞానైశ్వర్య బలవీర్యా ॥
చ.1 
తుషారహారవిలసితా గభీరాత్మా
మణికంకణగణాంచితా మోహనాంగీ
తాళీదళ కర్ణపత్ర మణిహారలసితా
సుదుకూల వసనప్రియా హిరణ్మయీ ॥
చ.2 
శతకోటిమండలాకారిణీ
తామసహారిణీ మృదుభాషిణీ
త్రిభువన భూతకరీ అనంతరూపిణీ
మల్లికాకుసుమ గానభోగదా॥

853. గగనాంతస్థా

ప. గగనాంతస్థా దహరాకాశస్థితా
అ.ప పంచభూతస్ధా పరమేశ్వరీ ॥
చ.1 
శతకోటి మండలాకారిణీ శివానీ
శీతాంశుమౌళిరాణి జయశర్వాణీ
మాతాస్వరూపిణీ దోషాపహారిణీ
లలితపల్లవపాణి ఘనసుభాషిణీ ॥
చ2 
మహాయోగి హృదయాకాశభాసినీ
జ్యోతిర్మండలద్యుతీ జ్యోత్స్నా
చారునయనారుణీ నారీశిరోమణీ
మల్లికాసుమగాన విదుషీమణీ॥

854. గర్వితా

ప. గర్వితా పీతవర్ణితా
అ.ప హృదయస్థా అతిగర్వితా ॥
చ.1 
నేరములెంచకనామొర వినవే
సుగుణాలజాల కరుణాలవాల
కాదంబవనమున స్థిరముగనెలకొన్న
ఆగమశాస్త్రార్ధ మంత్రాత్మికా ॥
చ.2 
సావధానముతోడ మముసాకుమమ్మా
లోకైకరక్షావతీ శాంతిమతీ
ముల్లోకములకు ఊర్జిత శాశనీ
మల్లికాకుసుమగానగర్వితా|

855, గానలోలుపా

ప. గానలోలుపా సంగీత రసికా
అ.ప సరస సంగీత సమరసా॥
చ.1 
సంగీత సాహిత్యాలంకృతా
మోహనమురళీ జ్ఞానఖనీ
వీణానాదాను సంధాయినీ
శృతి లయ తాళ గాన సుధా ॥
చ.2 
సంగీత మార్గ స్వరగాన నిపుణా
సామగానవినోదినీ నాదమయీ
నారద తుంబుర గాన సంసేవితా
మల్లికాసుమగాన మకరందభ్రామరీ ॥

856. కల్పనారహితా

ప. కల్పనారహితా అప్రమేయా
అ.ప అనితర కళా కల్పనా చాతురీ ॥
చ.1 
మంత్ర తంత్రములు ఎన్నినేర్చినా "
భాగవతాది పురాణములను విన్న
ఆవగింజంతైనా శంకలు తీరవు
సుస్థిర జ్ఞానపు మార్గము చూపవే ॥
చ.2 
సంకల్ప వికల్ప గుణములు ఉండవు
-రూపభావనా కల్పములు ఉండవు
కల్పాంతమున హితము చేసెదవు
మల్లికాసుమగాన కల్పనా చాతురీ॥

857. కాష్టా

ప. కాష్టా కాలరూపిణీ
అ.ప ముక్తిమార్గ మోక్షగమ్యా ॥
చ.1 
పరిణామ ప్రదాయినీ
వ్యోమాత్మక భీమదేవ
పరమేశ్వర మనోహారిణీ
విదితపావన చరిత ॥
చ.2 
మహామహితాత్మా దారుస్వరూపిణీ
శ్రీమాతా వేదవాక్య నిరూపిణీ
సువాసినీ అర్చనప్రీతా నారాయణీ
మల్లికాకుసుమగాన స్వరూపిణి |

858. అకాంతా
|
ప. అకాంతా దుఃఖనాశినీ
అ.ప భక్తజన సంతాపహారిణీ
చ.1 
అనితరమగు భక్తిప్రపత్తుల
దేవీస్తవమును ఎవరుచేసెదరో
ఆపదతొలగును ఆపన్నులకు
దుఃఖరహితులై సుఖము కాంచెదరు॥
చ.2 
రోగులు రోగ విముక్తులగుదురు
వీరులు జగతిలో కీర్తికాంచెదరు
మల్లికాసుమగాన సంకీర్తనలచే
జయమును కలిగించు మంగళమూర్తి॥

859. కాంతార్ధవిగ్రహా

ప. కాంతార్ధవిగ్రహా ఉమామహేశ్వరీ
అ.ప రజతాద్రి వాసినీ అర్ధాంగినీ ॥
చ.1 
కాదంబమాలికల కొప్పు ఒకప్రక్కన
గంగాజటాజూటము ఒకప్రక్కన
కఠినమౌ పాలిండ్ల సొంపులు ఒకవైపు
రుద్రాక్షపేరుల ఉరము ఇంకొకవైపు ||
చ.2 
చందనగంధములు విభూతి పూతలు
పీతాంబరములు వ్యాఘ్రచర్మములు
కన్నులకే విందుచేయు మోహనరూపము
మల్లీకాసుమగాన శోభాయమానము ॥

860. కార్యకారణనిర్ముక్తా

ప. కార్యకారణ నిర్ముక్తా శ్రీవిద్యా
అ.ప నిర్వికార చైతన్యస్వరూపా ॥
చ.1 
సర్వమునకు తానే కార్యకారణము
రాగద్వేష చింతాశోకములు
దూరము చేసెడి ప్రత్యక్ష దైవము
దివ్యలక్షణశోభ దీపించు సుశ్రీ ॥
చ.2 
దుష్టులదానవుల దునిమెడి దుర్గ
దిక్పతుల శాసించు దేవదేవేరి
ఖలులకు భయమును కలిగించుకాళి
మల్లికాసుమగానదా పుణ్యదా ॥

861. కామకేళితరంగితా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీనందిగామరవిశంకర్
రాగం - సురటి 

ప. కామకేళితరంగితా శ్రీలలితా
అ.ప కామేశ్వర క్రీడావిలాసా ॥
చ.1 
జగత్ సృష్టి సంకల్ప స్వరూపా
పరమేశ్వరుని భావనాసంకల్పా
పంచకృత్యపరాయణా ప్రవీణా
పాశాంకుశ పుష్పబాణలసితా ॥
చ. 2 
భక్తులపాలిటి ఇహపరదైవమా
కామేశ్వర గృహేశ్వరీ కావ్యలో లా
హ్రీంకార శృంగార కపోతికా
మల్లికాకుసుమగాన మనఃప్రియా||

862. కనత్కనక తాటంకా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - ముదిగొండ నాగలక్ష్మి 
రాగం - చక్రవాకం

ప. కనత్కనక తాటంకా
అ.ప కనకతాటంకా కర్ణాభరణా విశేషా ॥
చ.1 
సూర్యచంద్రులే కర్ణాభరణము
నవరత్నకిరీటి వయ్యారీ
శింజన్మణి నూపురాంచితపదా
మంజీరహార శోభితా ॥
చ.2 
గంభీరసునాభికా కటితటా
కిసలయారుణచరణపాపహరణా
కాంచనాంగినా
పైకరుణ చూపరావే
మల్లికాకుసుమగాన పూర్ణకళా ||

863, లీలావిగ్రహ దారిణీ

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీనందిగామరవిశంకర్
రాగం - సావేరి రాగం 

ప. లీలావిగ్రహ ధారిణీ శ్రీలలితా
ఆ స అనాయాస అవతారవిశేషా ॥
చ.1 
సృష్టి చేయునపుడు విధాతవే నీవు
సకల కార్యనిర్వహణా శ్రీపతివి
లయము చేయు వేళ కాలరుద్రునివి
కైవల్యము నిచ్చు ఈశ్వరుని రూపిణి ॥ .
చ. 2 
దుష్టశిక్షణ చేయ దుర్గరూపివై
శిష్టరక్షణ చేయ శ్రీలలితమై
కలదన్నవారికి కనుపించుదైవమా
మల్లికాసుమగాన మధురామృతా ॥

864 అజా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి వల్లూరి రాజేశ్వరి
రాగం - ముఖారి రాగం 

ప. సుజనసేవ్యా అజాద్రిజా
అ.ప కరుణలేశముచూపవే ॥
చ.1 
దురితములను బాపవే
శత్రువర్గమునణచవే
నీధ్యానమును కలిగించవే
ముక్తిసంపద నీయవే ॥
సర్వశుభములు కలుగచేసే
చ.2. 
సర్వ శుభములు కలుగచేసే 
నిన్ను భక్తితోకొలుతుమే
భవాంభోధిని దాటించవే
మల్లికా కుసుమగానసుందరీ ॥

865. క్షయవినిర్ముక్తా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీనందిగామరవిశంకర్
రాగం - శుద్ధ సన్యాసి రాగం   

ప. క్షయవినిర్ముక్తా శ్రీకరీ
అ.ప నిరూఢకరుణాఝరీ ॥
చ.1 
నిత్యమునిన్ను భజించుభక్తులకు
ఎన్నడుకలుగనీయవు పరాభవము
ప్రాణమై పోషించి ఘనవిభూతులు కల్గి
సాటియేలేనట్టి మేటి అతులాత్మా ॥
చ.2 
నిత్యసత్యమై శాశ్వతముగానిలిచి
నిత్యమునిన్నేఉపాసించుజనులకు
అంతర్యామియై ప్రత్యక్షదైవమైన
మల్లికా కుసుమగాన సౌందర్యమా॥

866. ముగ్ధా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి వల్లూరి సరస్వతి
రాగం -  ఖరహరప్రియ రాగం  

ప. ముగ్ధ సౌందర్యవతీ
అ.ప మంగళము జయమంగళము ||
చ.1
 లాస్యముచేసే హాస్యవదనకు
సదాషోడశ వర్ష విలసితకు
నారదాదిముని సంసేవితకు
పంచదశాక్షర నామమంత్రితకు॥
చ.2
 పాలితజన శృంగార మూర్తికి
నిత్యయవ్వనికి కలిమిజవ్వనికి
చంద్రశేఖరుని ప్రాణేశ్వరికి
మల్లికా కుసుమగానారా

867. క్షిప్రప్రసాదినీ

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీ నందిగామ రవిశంకర్
రాగం -  సింధుభైరవి రాగం 
 
ప. సుప్రసన్నా క్షిప్రప్రసాదినీ
అ.ప. క్షిప్రానదీతీరవాసినీ ||
చ.1 
పసుపు కుంకుమతో పచ్చనక్షతలతో
సువాసనాభరిత కుందమల్లికలతో
నిత్యార్చనలు చేతుమమ్మా
జగములన్నీ నిండియున్న పల్లవపాణీ||
చ.2 
అడిగినంతనే వరములిత్తువని నమ్మితిని
వంచనచేయకు వాంఛితఫలప్రదా
శ్రీచక్రపురవాసి చిదానందకందా
మల్లికాకుసుమగాన వీణాపాణీ ॥

868. అంతర్ముఖసమారాధ్యా 

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి ఆచంట శ్రీదేవి
రాగం -  మాధ్యమావతి రాగం  

ప. అంతర్ముఖసమారాధ్యా రాజరాజేశ్వరీ
అ.ప రాజోపచారములతో పూజింతుమమ్మా ॥
చ.1 
అర్ఘ్యము పాద్యము సింహాసనమిచ్చి
గంగాజలముతో స్నానమును చేయించి
ఆభరణములనిచ్చి చందనముపూసి
బంతిచామంతులతో పూజింతుమమ్మా !॥
చ.2' 
పసుపుకుంకుమలతో ధూప దీపములతో
షడ్రసోపేతమైన నైవేద్యములతో
షోడశపూజలను భక్తితో చేసెదము
.... మల్లికాసుమగాన గీతములు పాడెదము 

869. బహిర్ముఖసుదుర్లభా.

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి చింతలపాటి రమామహేశ్వరి
రాగం -  హంసానందిని రాగం  

ప. బహిర్ముఖసుదుర్లభా మాతా
అ.ప నీనామమే కడుపావనము ॥
చ.1 
పుణ్యాత్ములకే దొరుకునది
పాపకర్ములకు లభించనిది
పలికినవారికి పరమపదము
పండిత పామర హృదయరంజకము॥
చ.2 
పారాయణచేసిన పరమపుణ్యము
ఆలకించినచాలు అమితవైభవము
పాడినవారికి నిరతానందము
మల్లికాకుసుమ గానసులభము ॥

870. త్రయీ

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి వేమూరు విజయభారతి
స్వరకర్త - శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి 
రాగం -  చక్రవాక రాగం  

ప. త్రయీ త్రయీవిద్యారూపిణీ
అ.ప పరాశక్తీ పురాతనీ॥
చ.1 
ఐం వాగ్బీజస్వరూపిణీ
అకారాది సామరుక్ వేదము
ఇకారాది యజుర్వేదము
మూడువేదముల స్వరూప త్రయీ॥
చ.2 
శాస్త్రవాదములందు వేద పఠనములందు
వాక్ పటుత్వమునిచ్చి వేదవిద్యలనిచ్చి
భక్తులను బ్రోచేటి కరుణారసార్ణవా
మల్లికాసుమగాన పూర్ణామృతా ॥

871. త్రివర్గనిలయా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి రాకా జ్యోత్స్నా 
స్వరకర్త - శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి 
రాగం -  ఆరభి రాగం 

ప, "త్రివర్గనిలయా హ్రీంకారాత్మికా
అ.ప దివ్యలక్షణశోభ దీపించు శేఖరీ ॥
చ.1 
పరహితముకొరకుసలుపు
సత్కార్యములకధిపతి
జగద్వర్తనకారణా చతుర
ధర్మార్ధ కామనిలయా॥
చ.2 
తానె భోజనము అన్నాదులు తానెభోక్త
అన్నమైపోషించు ప్రాణమిడుజీవులకు
తానొకతె తల్లియై లోకమున భాసించు
మల్లికాసుమగాన సౌందర్య భాసినీ ॥

872. త్రిస్థా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి ముదిగొండ నాగలక్ష్మీ 
రాగం -   రాగం 

ప. త్రైలోక్యసంచారిణీ త్రిస్థా
అ.ప త్రైలోక్య రసవాహినీ II
చ.1 
త్రిమూర్తులు త్రిగుణములు త్రిలోకాలు
త్రివేదములు త్రికాలములు త్రివర్గములు
జ్యోతిశ్రయము అవస్థా త్రయము
ఆశ్రమత్రయము నీదురూపములు
చ.2 
కంచికామాక్షి మధురమీనాక్షి
కాశీవిశాలాక్షివే శుభంకరీ
వాణీ లక్ష్మీ త్రిపుర సుందరీ
మల్లికాకుసుమ గానవిలక్షిణీ ॥

873. త్రిపురమాలినీ

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి గొట్టుముక్కుల లీల 
స్వరకర్త - శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి 
రాగం -   సింధుభైరవి రాగం 

ప. శ్రీచక్రాంకిత వాసినీ దూర్వాసార్చిత గుప్తయోగినీ
అ.ప చంద్రసహోదరి రాశిస్వరూపిణి 
సుందరవదనీ కమలానిలయినీ॥
చ.1 
కామకళాధరి పంచదశాక్షరి
సర్వరక్షాకరి శివంకరీ
సర్వవిద్యామయి ఐశ్వర్యమయీ
సర్వశక్తిమయీ త్రిపురమాలిని||
చ.2 
దశకోణార్చిత క్రోధినిరౌద్రిని
రత్నసింహాసినీ రాక్షసదమనీ
శక్తి యుక్తిగుణ కర్మ విధాయిని
అణిమాగరిమాది సిద్ధి దాయిని ||

874. నిరామయా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి చల్లపల్లి సుభద్ర  
స్వరకర్త - శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి 
రాగం -   శివరంజని రాగం

ప. నిరామయా నిరంజనీ
అ.ప నిరాసక్తా నిరాశ్రయా॥
చ.1 
సంసారతీర్ధాంఘిపోతా మాతా
కుందాబ్జ తుషార హార లసితా
విశ్వవాఙ్మయ సౌందర్యరాశీ
సరసకావ్యరస మాధురీ ॥
చ.2 
త్రికాలైకరూపా యోగీంద్రపూజ్యా
అనాద్యా ముక్తిమార్గప్రదాత్రీ
పుణ్యజనపూజితా మహాదేవీ
మల్లికాసుమగాన పరిసేవితా !

875. నిరాలంబా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి నందివాడ అన్నపూర్ణ 
స్వరకర్త - శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి
రాగం -   అఠాణ రాగం

ప. నిరాలంబాజగదంబా
అ.ప నిరాధారా సకలలోకాధారా ॥
చ.1 
నిత్యమునిను భజించు భక్తులకు
ఎన్నడుకలుగదు పరాజయము
అనితరమగు భక్తితోకొలిచిన
మెండుగకలుగును శుభపరంపరలు ॥
చ.2 
మాణిక్య రాజిత రాజమకుటా
జాగేలనమ్మా పాద సేవకురాలను
సారసలోచని అభిన్నాత్మికా
మల్లికాసుమగాన ఏకాత్మికా ॥

876. స్వాత్మా రామా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి వల్లూరి సరస్వతి  
రాగం -   కాపీ రాగం

ప. స్వాత్మా రామా సర్వస్వతంత్రా
అ.ప సర్వజీవాత్మ విహారిణీ ॥
చ.1
బ్రహ్మాది దేవతలు నిన్ను ఆరాధింప
శ్రీలక్ష్మి శారదా వింజామరలు వీవ
నారదాదిమునులు గీతాగానముచేయ
భక్తజన హృదయ విస్తృత విహారిణి ॥
చ. 2 
ఓంకారదీపికా సాకార ప్రణవా
హ్రీంకారలక్షణా హ్రీంపదారాధ్యా
మాణిక్యహారాభిరామా సురామా
మల్లికాసుమగాన మకరందమత్తా ॥

877. సుధాసృతిః

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి గొట్టుముక్కుల లీల 
స్వరకర్త - శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి
రాగం -   శహన రాగం

ప. సుధాసృతీ అమృతస్వరూపిణీ
అ.ప సౌభాగ్య రమామనోజ్జా ॥
చ.1 
వారుణీ రస పానోల్లాసినీ
ధ్యానసంకీర్తన పూజార్చనలతో
సర్వవిధములైన కైంకర్యములతో
సంతృప్తిచెందేటి ఆనందసంధాత్రి ॥
చ. 2 
మాయలుడిగినకదా మరిదొరకు శాంతి
శాంతిమార్గముచూపు ఆత్మజ్ఞానేష్టి
రసమయానంద మానస హ్రీంశీలా
మల్లికాసుమగాన లక్షణాగమ్య॥

878. సంసారపంకనిర్మగ్నసముద్ధరణ పండితా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి రాకా జ్యోత్స్నా 
స్వరకర్త - శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి  
రాగం -   సారంగ రాగం

ప. సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా
అ.ప. లలాటనయనార్చితా సముదారకరుణామృతా 
చ.1 
సంసార సాగరము దాటించునావు
సకలసంపదలిచ్చు చింతామణీ
జ్ఞానమును కలిగించు విజ్ఞాన దీపము 
నీపాద పంకజముల ధూళిరేణువే ॥
చ.2 
అసదృశభక్తితో స్తుతిచేయుపుణ్యులకు
ఇష్టకామ్యములనిచ్చు ఇష్టకామేశ్వరి
అఖిలాండకోటి అధిష్టాన సమాకృతీ
మల్లికాసుమగాన అనితరసాధ్యా ॥

879. యజ్ఞప్రియా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి తరణి స్వాతి 
రాగం -   యాగప్రియ రాగం

ప. యజ్ఞప్రియా విష్ణుస్వరూపా
అ.ప జగదేక వంద్యా రాజరాజేశ్వరీ ॥
చ.1 
నిత్యముచేసే కర్మల యందు
దేవపితృ యాగములందు
చండీ రుద్ర యాగములందు
ప్రీతికలిగియుండు కామసంజీవనీ ॥
చ.2 
విష్ణువిలాసినీ జిష్ణుసహోదరీ
జగద్వ్యాపినీ యజ్ఞకర్మణీ
హ్రీంకార కుండాగ్ని శిఖా
మల్లికాసుమగాన హ్రీంకారిణీ ॥

880. యజ్ఞకర్త్రీ 

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీ నందిగామ రవిశంకర్  
రాగం -   జగన్మోహిని రాగం

ప. యజ్ఞకర్త్రీ  శక్తిస్వరూపిణీ
అ.ప హ్రీం శిఖామణీ జ్యోత్స్నా రూపిణీ II
చ.1 
యజ్ఞపురుషుడునీవే
యజ్ఞముచేయునది నీవే
సోమయాజివి నీవే శ్రీధరీ
సోమిదేవివి నీవే శ్రీపతీ
చ.2 
యజ్ఞఫలధాత్రివి నీవే
యజ్ఞఫలమును నీవే
యాగక్రమారాధ్య శివసతీ
మల్లికాసుమగానయజ్ఞా నిధీ ॥

881. యజమానస్వరూపిణీ

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి ఆచంట శ్రీదేవి  
రాగం - ద్విజావంతి రాగం

ప. యజమానస్వరూపిణీ పరమేశ్వరీ
అ.ప పరమేశ్వర స్వరూపదీక్షితా ॥
చ.1 
యజ్ఞయజమానిపై ప్రజ్ఞానివై
బ్రాహ్మణ స్వరూపమై బ్రాహ్మణిపై
యజ్ఞదీక్షితుడైన సోమయాజివై
యాజ్ఞివైన రాజీ యజ్ఞకంకణధారీ ॥
చ.2 
ఉగ్రప్రభువని పండితులు అందురు
ఈశానుడవని దీక్షితులందురు
అష్టమూర్తి రూపి దీక్షాదక్షిణీ
మల్లికాసుమగాన దీక్షితా ॥

882. ధర్మాధారా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి ముదిగొండ నాగలక్ష్మీ   
రాగం -    రాగం

ప. ధర్మాధారా శ్రుతిసమ్మతా
అ.ప వేదశాస్త్ర నిర్మితా సకలశాస్త్ర నుతా ॥
చ.1 
దేశకాలముననుసరించి
నీతినియమములు ఏర్పరచి
దేశహితమును కూర్చువిధముగ
ధర్మమును నెలకొల్పు బ్రహ్మీ ||
చ. 2 
ధర్మసంస్థాపనము చేయగ
అవతరింతువు ప్రతియుగమున
ధర్మ సంవర్ధనీధర్మనందినీ
మల్లికాసుమగాన ధార్మికా॥

883. ధనాధ్యక్షా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీ నందిగామ రవిశంకర్  
రాగం -  షణ్ముఖప్రియ రాగం

ప. ధనాధ్యక్షా ధనలక్ష్మీ
అ.ప కుబేరస్వరూపా ధననిధీ॥
చ.1 
పంచదశీమంత్రము
జపియించిన కుబేరుడు
నవనిధులకు అధికారియై
ధనాధిపతియై తరించెను ॥
చ.2 
కనకధారాస్తోత్రముచేసి
అష్టలక్ష్మియైన నినుధ్యానించి
కనకవర్షమును కురిపించె శంకరులు
మల్లికాకుసుమగాన సంపదలక్ష్మీ॥

884. ధనధాన్యవివర్ధినీ

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి కొటికలపూడి వాణి   
రాగం -  భాగ్యశ్రీ రాగం

ప. ధనధాన్యవివర్దినీ ధర్మిణీ
అ.ప నవనిధిసంధాయిని ధారుణీ ॥
చ.1 
యజ్ఞఫలరూపిణీ దక్షిణా దేవి
ధనధాన్యవివర్ధినీ సంపదలక్ష్మీ
ధనలక్ష్మీ ధాన్యలక్ష్మీ
అష్టలక్ష్మీరూపిణీ శ్రీమాతా ॥
చ.2 
భూదేవిస్వరూపిణివై
సకలజీవుల కడుపునింపే
సకలసంపదకారిణీ
మల్లికాసుమగానవర్ధినీ ॥

885. విప్రప్రియా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి వల్లూరి సరస్వతి   
రాగం -  శంకరాభరణ రాగం

ప. విప్రప్రియా వేదధారిణీ
అ.ప వేదజననీ వేదచారిణీ॥
చ.1 
వేద పఠనాసక్త యోగీంద్ర పుణ్య
''...ద్విజ బ్రాహ్మణప్రియా విద్యాధరీ
సర్వసారస్వతపదా హిరణ్మయీ
శ్రోత్రీయపూజితా కృపామతీ॥
చ.2 
బ్రహ్మరూపిణీ(బ్రాహ్మణీ
నీఅడుగులకు మ్రొక్కి కొలిచెదము
శంభులోక నిలయా శర్వప్రియా
మల్లికాకుసుమగాన ధారిణీ ॥

886. విప్రరూపా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీ నందిగామ రవిశంకర్  
రాగం - అమృతవర్షిణి రాగం

ప విప్రరూపా వేదవేత్తా
అ.ప జ్ఞానాంబోనిధి వీచికా॥
చ.1 
ఆగమాంత అవగత ప్రబోధ
వేద విప్రజనానురాగ గాయత్రీ
సకలోకవిధాత్రీ భవ్యగాత్రీ
దివ్యమహోన్నత పూతచరిత్రీ॥
చ.2 
పరమయోగులను మురిపించుమాతృకా
యోగఋషి పూజితా బ్రహ్మవిద్యా
సు కవిజనావన పాలినీ వాగీశ్వరీ
మల్లికాకుసుమగాన సుగాత్రీ ॥

887. విశ్వభ్రమణకారిణీ

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి వల్లూరి సరస్వతి  
రాగం - బహుదారి రాగం

ప. విశ్వభ్రమణకారిణీవిశ్వమయీ
అ.ప నిత్య కర్మానుష్టానకారిణీ II
చ.1 
త్రిభువనోన్నత గుణగణచరితా
మహనీయ దివ్య కరుణోదధి
భువనసృజనావలంబా మదంబా
సంధ్యాదీధితిరంజితా విశ్వహితా ॥
చ.2 
చరాచరములకు నిత్యము హర్షము
ఇచ్చెడిదాతవు సదయ కరుణా హృదయా
విశ్వమనోహరి ఆజాండేశ్వరీ
మల్లికాకుసుమమధుర గానమయీ ॥

888. విశ్వగ్రాసా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి ఆచంట శ్రీదేవి   
రాగం - కాఫీ రాగం

ప. విశ్వగ్రాసా విశ్వజనపాలినీ
అ.ప విశ్వమాతృకావిశ్వేశీ
చ.1 
ఈజగమంతా నీవిలాసమే
విశ్వమంతయు నీస్వరూపమే
ప్రపంచమంతయు నీభ్రమణమే
లోకమంతయు నీప్రకాశమే॥
చ.2 
చరాచరములన్నీ నీకు అశనమే
ప్రళయకాలమున నీవేగ్రహించి
లయమును చేసే ప్రళయకారిణీ
మల్లికాకుసుమగాన నిలయా ॥

889. విద్రుమాభా

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి వల్లూరి సరస్వతి  
రాగం -  చక్రవాక రాగం

ప. విద్రుమాభా జ్ఞానప్రకాశినీ.
అ.ప మాణిక్య విరాజమాన మకుటా ॥
చ.1 
పాటలీసుమపుచాయ పగడంపుచాయ
దానిమ్మపూచాయ కెందమ్మి చాయ
సందెవెలుగులు చాయ మంకెనపూ చాయ
వామాక్షీ జనమౌళిభూషణమణీ ॥
చ.2 
మానికదివ్య వైభవ సమంచిత
నిత్యము భక్తులబ్రోచు శ్యామాభా
తేజోమయ విగ్రహా..
మల్లికాకుసుమగాన వల్లభా॥

890. వైష్ణవీ

రచన - శ్రీమతి ముదిగొండ మల్లీశ్వరి 
గానం - శ్రీమతి గరిమెళ్ళ కళ్యాణి   
రాగం -  ఆనందభైరవి రాగం

ష. వైష్ణవీ నీకిచ్చేమమ్మా నక్షత్ర హారతీ
మల్లికా కుసుమగానహారతీ
అ.ప అశ్వని భరణి కృత్తికలిచ్చే నీలాలహారతీ ||
చ.1 
రోహిణి మృగశిర ఆరుద్ర లిచ్చే ముత్యాల హారతీ
పునర్వసు పుష్యమి ఆశ్లేషల పగడపుహారతీ
మఘ పుబ్బ ఉత్తర తెచ్చిన వైఢూర్య హారతీ
హస్తా చిత్తా స్వాతి విశాఖల గోమేధిక హారతీ॥
చ. 2 
అనూరాధా జ్యేష్టా మూలల మరకత హారతీ
ఉత్తర పూర్వాషాఢలు ఇచ్చిన కెంపులహారతీ
శ్రవణ ధనిష్ట శతభిష మిచ్చే పచ్చలహారతీ
పూర్వఉత్తరాభాద్ర రేవతుల పుష్యరాగాలహారతీ ॥

891. విష్ణురూపిణీ

ష. విష్ణురూపిణీ నారాయణీ
అ.ప విశ్వవినోదినీ శివమోహినీ।।
చ1 
ముగ్ద దరహాస సుధాశ్రవంతి
నవచక్ర షడాధార సురానీక వంద్యా
విష్ణురూపమున విశ్వరక్షణచేయు
భక్తజనావనరక్షా బద్ద కంకణీ ||
చ.2 
పవనమై అనలమై పానీయమై
ఆత్మయై రవియై అంబరమై
మహీవలయమై అష్టమూర్తివైన
మల్లికాసుమగాన శ్రీవైష్ణవీ ॥

892 అయోనిః 

ష. . అయోనీ జగత్ సృష్టి కారిణీ
అ.ప సకలచరాచర సృష్టి విధాయినీ ॥
చ.1 
జననములేదు జన్మస్థానములేదు
తల్లిదండ్రులు లేరు రూపమేలేదు.
అన్నిజగములయందు నీవేయుందువు
అన్నికాలములందు నిలిచియుందువు ||
చ.2 
సూర్యచంద్రులు తారకలు
ధరణియు సప్తసముద్రములు
సర్వజగములు నీవశమే
మల్లికాకుసుమ గానవశంకరీ || 

893. యోనినిలయా

ప. యోని నిలయా త్రికోణరూపిణీ
అ.ప సర్వసిద్ధిప్రద చక్రస్వామినీ ॥
చ.1 
బిందురూపిణీ పరశివకామినీ
సమస్త జగతికి మూలధారిణీ
త్రిజగతీ కళ్యాణ సంధాయినీ
పరివారదేవతా వందితచరణీ॥
చ.2 
శ్రీచక్రపురవాసి చిన్మయ రూపిణీ
రసమయానందమానసా శ్రీలలితా
త్రిభువనభూతకరీ శివకరీ
మల్లికాకుసుమగానతత్పరీ॥

894 కూటస్ధా

ఆచంట శ్రీదేవి 
వరాళి రాగం 

ప. కూటస్ధా భక్త హృదయవిహారిణీ
అ.ప శ్రీచక్రేశ్వరీ శ్రీమాతా||
చ.1 
వాగ్భవకూటమినందు వాణీవిధాతలై
కామరాజకూటమి నందున లక్ష్మీనారాయణులై
శక్తికూటమునందు శివశక్తులరూపమైన
మేరుపర్వతనిలయినీ రాజరాజేశ్వరీ॥
చ.2 
గతిగమకగీతైకనిపుణా
కర్పూరకుంకుమాలంకృత స్తనీ
విద్యా కవితావితానలహరీ
మల్లికాకుసుమ గాన ప్రవల్లికా ॥

895. కులరూపిణీ

వల్లూరి సరస్వతి 
మాయామాళవగౌళ రాగం 

ప. కులరూపిణీ కౌళమార్గపూజితా
అ.ప సాంప్రదాయ ప్రవర్తినీ ॥
చ.1 
కుండలినీ శక్తిరూపిణీ
ముఖ్యప్రాణస్వరూపిణీ
సుషుమ్నా నాడి విహారిణీ
కులసంకేత పాలినీ కౌళినీ ॥
చ.2 
అకాలమృత్యునివారిణీ
సర్వజ్వరార్తి శమనీ
దీర్ఘాయుష్యప్రదాయిని
మల్లికాసుమగాన వర్ధనీ॥

896. వీరగోష్ఠిప్రియా

వల్లూరి సరస్వతి 
దుర్గ రాగం 

ప. వీరగోష్ఠి ప్రియా జయ జయ దుర్గా
అ.ప దైత్యసంహారిణీ వీరమాతా ॥
చ.1 
భండాసురులను సంహరించి
శుంభ నిశుంభుల మదమునణచి
మహిషాసురమర్దనిపై విహరించి
అసురులదునిమిన మహాకాళీ ॥
చ.2 
శ్రీవిద్యావిశారదులు భక్తితత్పరులు
అరిషడ్వర్గములు జయించినవారు
నీధ్యానముతో పరవసించెదరు
మల్లికాకుసుమగాన ప్రియా ॥

897. వీరా

మండా విజయకుమారి 
రాగం - 

ప. వీరలక్ష్మీ
అ.ప వీరధీరగణపూజితా ॥
చ.1 
ధర్మపరులను వీరులను
రక్షించేలోకనాయకి శంకరీ
శ్రీగణేశుని కార్తికేయుని
కన్నతల్లివి వీరమాతా॥
చ.2 
సమస్త జగద్వంద్య పాదారవిందా
మావంటివారిని విడనాడదగునా
పాపసంచయము పరిహరించవే.
మల్లికాకుసుమ గాన వందితా ॥

898. నైష్కర్మ్యా

గానం - కొప్పర్తి ఇందిరా 
రాగం - 

ప. నైష్కర్మ్యా కృపాంబురాశీ
అ.ప ఉర్వారుక ఫలాననా బింబాననా॥
చ.1 
నిన్నునమ్మినవారికి ఎన్నడు
లోటులేదని నమ్మితినమ్మా
భక్తులకభీష్టపరంపరలిచ్చు
నీకుజాగేలనే నన్నుబ్రోవగా ॥
చ.2 
ప్రాపుకు జేరితిని ఆదరించవే
నీకృపారసము చిలకరించవే
కన్నతల్లివలె కావగరావే
మల్లికాసుమగాన కీర్తి రూపిణీ ॥

899. నాదరూపిణీ

గానం - శ్రీమతి చింతలపాటి రమామహేశ్వరి 
రాగం - 

ప. నాదరూపిణీ కారుణ్యనేత్రీ
అ.ప క్రీగంటచూడుమా ఒక్కసారి
చ.1 
తత్వప్రకాశముగ శోభాంచితముగా
భక్తజన సేవ్యముగా నీమనసు రంజిల్ల
ఎండిన శబ్దబంధురముగా వీనులవిందుగా
నీనామకీర్తనాగీతములు వినిపింతు
చ.2 
ఆజన్మ సహజమౌ మల్లికాసుమగాన
కృతులతోపూజింప నిత్యకృత్యమునాకు
జగములన్నీ నిండియున్న పల్లవపాణి
కృపచూడుమా నీపాదదాసినిగానః॥

900. విజ్ఞానకలనా

గానం - శ్రీమతి వల్లూరి సరస్వతి 
రాగం - ధర్మవతి రాగం 

ప. - విజ్ఞానకలనా జ్ఞానబోధినీ
అ.ప జ్ఞానాందరూపిణీ||
చ.1 
ఈఘోరసంసారము నిస్సారమనితలచి
తమజన్మసఫలతకు అఖండభక్తితో
యతీంద్రులందరూ నిన్నుప్రార్ధింతురే
ఆదిత్యమార్గ సంచార కర్రీ భక్తానురక్తా॥
చ.2 
మెరుపుతీగలవంటి నీసౌందర్య తేజమును
నీవిలాసభాగ్యములను తనివితీరగ చూచి
ఆనందడోలికల ఊగులాడెదరు జ్ఞానులు
మల్లికాసుమగాన జ్ఞానమకరందా ॥


901. వేమూరు విజయభారతి 
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి 
మాధ్యమావతి రాగం 

902. కొప్పర్తి ఇందిర
రాగం - అభేరీ

903. ఆచంటశ్రీదేవి 
బిందుమాలినీ రాగం 

904  కొప్పర్తి ఇందిర
నాదనామక్రియ రాగం 

905. వల్లూరి సరస్వతి
హిందోళ రాగం 

906 రాకా జ్యోత్స్న
సహన రాగం 

907 గరిమెళ్ళ కళ్యాణి 
యమన్ కళ్యాణి రాగం 

908,నాగలక్ష్మి
శివరంజని రాగం 

909 ఆచంటశ్రీదేవి
హిందోళ రాగం 

910,వల్లూరిసరస్వతి
సహన రాగం 

911 సి,విజయ
మోహన రాగం 

912 కొప్పర్తి ఇందిర
ఖమాస్ రాగం

913.గరిమెళ్ళ కళ్యాణి 
మోహన రాగం 

914,ఆచంటశ్రీదేవి
శంకరాభరణం రాగం 

915 కొప్పర్తి ఇందిర
దర్బార్ కానడ రాగం 

916. వల్లూరి సరస్వతి
కానడ రాగం

917, వేమూరు విజయభారతి
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
సింధుభైరవి రాగం 

918, రాకా జ్యోత్స్న
హంసధ్వని రాగం 

919 కొప్పర్తి ఇందిర
సామరాగం

920 గరిమెళ్ళ కళ్యాణి 
అఠాణ రాగం 

921,రమామహేశ్వరి
నాట రాగం 

922, ఆచంటశ్రీదేవి
కాంభోజి రాగం 

923. వల్లూరి సరస్వతి
ఖరహరప్రియ రాగం 

924  ఆచంటశ్రీదేవి
నటభైరవి రాగం 

925, కొప్పర్తి ఇందిర
బౌళి రాగం 

926, అవసరాల అంజని గాయత్రి

927, వేమూరు విజయభారతి
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
లలిత రాగం 

928. గాయత్రీ లక్కరాజు
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
హిందోళ రాగం 

929. ముదిగొండ నాగలక్ష్మి.
రేవతీ రాగం,

930, వల్లూరి సరస్వతి
శ్రీరాగం 

931. చింతలపూడి రమామహేశ్వరి
బహుదారి రాగం

932 ఆచంట శ్రీదేవి
చక్రవాకం రాగం 

933 డా. ప్రత్తిపాటి ఉమాసుందరి
మధ్యమావతి రాగం

934

935,నందివాడ అన్నపూర్ణ
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
అభేరి రాగం 

936,రుక్మిణీకృష్ణ
సామరాగం 

937,వల్లూరిసరస్వతి
కాపీ రాగం 

938.చల్లపల్లి సుభద్ర
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
శివరంజని రాగం 

939. కొప్పర్తిఇందిర
బేహాగ్ రాగం

940. రుక్మిణీకృష్ణ
బిళహరి రాగం 

941. వల్లూరిసరస్వతి
కాపీ రాగం 

942. చింతలపాటి రమామహేశ్వరి
మోహన రాగం 

943. వేమూరు విజయభారతి
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
హంసధ్వని రాగం

944 గొట్టుముక్కుల లీల 
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
వసంత రాగం

945,వల్లూరి సరస్వతి
సెంఝురిటి రాగం 

946, లక్కరాజు గాయత్రీ
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
రేవతి రాగం 

947, వల్లూరి సరస్వతి
హమీర్ కళ్యాణి రాగం 

948. హరిప్రియ
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
అమృతవర్షిణి  రాగం

949, Ch. రమామహేశ్వరి
చారుకేశి రాగం 

950. గరిమెళ్ళ కళ్యాణి 
లలిత రాగం 

951. వల్లూరి సరస్వతి
అభేరి రాగం 

952, వేమూరు విజయభారతి
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
మాధ్యమావతి రాగం 

953. గరిమెళ్ళ కళ్యాణి 
హమీర్ కళ్యాణి రాగం 

954, రుక్మిణీకృష్ణ
హంస రాగం 

955, ఆచంట శ్రీదేవి
ధన్యాసి రాగం 

956. చల్లపల్లి సుభద్ర
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
సింధుభైరవి రాగం

957, తరణి స్వాతి
ధన్యాసి రాగం 

958 

959. వల్లూరి సరస్వతి
కీరవాణి రాగం 

960. రుక్మిణీ శ్రీకృష్ణ
ధర్మావతి రాగం 

961. కొప్పర్తిఇందిర


962, వల్లూరి సరస్వతి
అభోగి రాగం 

963. వల్లూరి సరస్వతి
భైరవి రాగం 

964, రాకా జ్యోత్స్న
స్వరకర్త - కొమ్మూరు రాజేశ్వరి
రేవగుప్తి రాగం 

965 

966, గరిమెళ్ళ కళ్యాణి 
సింధుభైరవి రాగం 

967. రుక్మిణీకృష్ణ
(సుమంగళి) లలితా రాగం 

968. ఆచంట శ్రీదేవి
లలితా రాగం

969, వల్లూరి సరస్వతి
రేవతి రాగం 

970. వల్లూరి సరస్వతి
చక్రవాక రాగం 

971. ఆచంటశ్రీదేవి
హంసానంది 

972, రుక్మిణీశ్రీకృష్ణ
బృందావన శారంగా రాగం 

973. వల్లూరిసరస్వతి
సెంఝురిటి రాగం 

974, రుక్మిణీ శ్రీకృష్ణ
తనజీ రాగం 

975, వల్లూరిసరస్వతి
శంఖరాభరణం రాగం  

976. ముదిగొండ మల్లీశ్వరి 
రాగం,వరాళి

977, ఇందిర కొప్పర్తి
చక్రవాక రాగం

978. 

979. గరిమెళ్ళ కళ్యాణి
శ్రీరాగం  

980, వల్లూరి సరస్వతి
సింధుభైరవి రాగం 

981,వల్లూరిసరస్వతి
రంజని రాగం 

982మండావిజయకుమారి

983,తాడేపల్లిరుక్మిణీకృష్ణ
భాగేశ్వరి or భాగేశ్రీ

984,వల్లూరిసరస్వతి
ఆరభి రాగం 

985.ఆచంటసరస్వతి
బాహుదారి 

986.లక్కరాజు గాయత్రి

987,వల్లూరి సరస్వతి
కీరవాణి రాగం 

988, వల్లూరి సరస్వతి
భైరవి రాగం 

989.గరిమెళ్ళకల్యాణి
భాగేశ్వరి or భాగేశ్రీ రాగం 

990. ఇందిరకొప్పర్తి
కాంభోజిరాగం

991 వల్లూరి సరస్వతి
రేవతి రాగం 

992,తాడేపల్లిరుక్మిణీకృష్ణ
సహాన రాగం

993.ఆచంటశ్రీదేవి
దీపకం రాగం 

994.గరిమెళ్ళకల్యాణి
బిళహరి రాగం 

995,వల్లూరిసరస్వతి
హంసానంది రాగం 

996, ముదిగొండ మల్లీశ్వరి.
హిందోళ రాగం 

998గరిమెళ్ళకల్యాణి
తిల్లాంగ్ రాగం

999,కొప్పర్తి ఇందిర

1000,కొప్పర్తి ఇందిర








 






965 బాలరావే 

బాల రావే గిరి బాల రావే                 
మురిపించు మురిపాలవెల్లి రావే ||
1. 
లాలిపోసి కురులు దువ్వి జాజిపూల దండపెట్టి 
నిన్ను చూసి మురిసిపోదు చిరునవ్వుల కల్పవల్లీ  
తల్లి రావే జాబిల్లి రావే||
2. 
కంటికి కాటుక పెట్టి నుదుటున తిలకము దిద్ది 
బుగ్గన చాచ్చుక్క పెట్టి ఎత్తుకొని లాలింతును 
మల్లి రావే సిరిమల్లి రావే ||                      
3. 
ఘల్లుఘల్లు గజ్జలతో రతనాల అందెలతో 
కలహంస నడకలతో మా ఉల్లము పల్లవింప      
అమ్మ రావే బంగరు బొమ్మ రావే ||            
4. 
బంగారు తొట్టెలో 
మల్లికా కుసుమములను అందముగా పరిచి 
నీకు జోల పాడెదము 
పాప రావే నా కనుపాప రావే ||

1000 లలితాంబికా 
ప. శ్రీ లలితాంబికే విమలాత్మికే 
     శ్రీ చక్రశోభితే పరదేవతే 
1. 
సర్వ యంత్రాత్మకే సర్వమంత్ర శోభితే 
సర్వదేవ సంస్తుతే సర్వ తంత్ర రూపే 
నవావరణ పూజితే మణిమంటప సదనే 
స కుంకుమ విలేపితే సర్వసౌభాగ్యదే     
2. 
వామాoబుజ పీఠికే రమణీయ గుణార్ణవే 
కామేశ్వరాంకస్థే  స్వాధీన వల్లభే 
ధనుర్భాణధర కరే పరశివాలింగితే 
భాగ్యాబ్ది చంద్రికే నిర్వాణ సుఖదే   ||     
3. 
కర్పూర వీటికే కాదంబ వాటికే 
శరణాగత వత్సలే హృత్కమల వాసితే 
సర్వానందమయే షోడశికా రూపే  
నవ మల్లికా కుసుమ పూజిత చరణే ||

No comments:

Post a Comment