చక్కని చేతిరాత - భవిష్యత్తుకు బంగారు బాట
పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు మునుపటి కంటే ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి వస్తోంది. పోటీ అవనీయండి, పెరుగుతున్న సిలబస్ అవనీయండి పిల్లలతోపాటు తల్లిదండ్రులకూ పరీక్ష పెడుతున్నాయి. అందుకే పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా వుండాలి? ఎంతవరకు వుండాలి? వంటి విషయాలు ఈమధ్యకాలంలో ఎంతో చర్చనీయాంశాలుగా మారాయి. మన పరిధి దాటిన సమస్యల పరిష్కారానికి మనం ఆయా రంగంలోని నిపుణుల సలహాల కోసం చూస్తుంటాం. అలా పిల్లల చదువులు, తల్లిదండ్రుల పాత్ర అన్న విషయంపై ఈమధ్య అమెరికాలోని వాండర్ బిల్డ్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు కొన్ని స్కూల్స్‌లో ఓ ఏడాదిపాటు వివిధ అధ్యయనాలు చేశారు. అందులో వారు కనుక్కొన్న విషయం ఏమిటంటే, చక్కటి దస్తూరి కలిగి వుండటం అనేది కేవలం ఓ ప్రత్యేక నైపుణ్యం మాత్రమే కాదు, అభ్యసన ప్రక్రియలో అదెంతో కీలకమైనదని కూడా గుర్తించారు.
మంచి చేతిరాత కలిగి వుండటం ఎంతో ముఖ్యం. పిల్లలకు మంచి చేతిరాత నేర్పించడమంటే దానర్థం అభ్యసన ప్రక్రియను, భావ వ్యక్తీకరణను సమర్థవంతంగా నేర్పించడమే అంటున్నారు వాండర్ బిల్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. చేతిరాత చక్కగా నేర్చుకునే క్రమంలో పిల్లలు తాము రాసే అక్షరాలపై ఎంతో శ్రద్ధ పెడతారుట. చిన్నతనంలో ఇలా అక్షరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాయడం అలవాటైన పిల్లలు ఆ తరువాత కూడా అదే శ్రద్ధ, ఏకాగ్రత కనపరుస్తారట తమ చదువు విషయంలో. అలాగే మొదటిసారి అక్షరాలు నేర్చుకున్నప్పుడే పిల్లల దస్తూరి విషయంలో కొద్దిపాటి శ్రద్ధ పెట్టేలా ప్రోత్సహిస్తే అది వారికి అలవాటుగా కూడా మారుతుందని అంటున్నారు పరిశోధకులు.
ఈమధ్యకాలంలో ‘గ్రాఫాలజీ’ ఎంతో ఆదరణ పొందటం మనం చూస్తున్నాం. చేతిరాత బట్టి పిల్లల మానసిక స్థితి, వారి ఏకాగ్రత వంటివి అంచనా వేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. అలాగే చేతిరాతని కుదురుగా వుండేలా రాయడం నేర్చుకున్నాక పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగటం కూడా గమనించామని అంటున్నారు పరిశోధకులు. అలాగే అక్షరాలని గుర్తించడంలో దస్తూరి బాగున్న పిల్లలు పొరపాట్లు పడటం తక్కువని కూడా గుర్తించారు వీరు. ఒక్కమాటలో చెప్పాలంటే మంచి చేతిరాత కలిగివుండటం అంటే పిల్లల్లో తగినంత శ్రద్ధ, ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం కలిగి వున్నట్టు అర్థమని అంటున్నారు పరిశోధకులు.
కాపీరైటింగ్ అంటూ చిన్నప్పుడు పిల్లలతో రాయిం చి ఆ తరువాత తరువాత వారి చదువు, మార్కులపై శ్రద్ధ పెట్టి చేతిరాత విషయంలో అంత శ్రద్ధపెట్టరు తల్లిదండ్రులు. కానీ, ఎప్పటికప్పుడు పిల్లల చేతిరాత కుదురుగా వుండేలా ప్రోత్సహిస్తూ, ఆ విషయంగా తనకి కావలసిన సహాయం చేయడం ఎంతో ముఖ్యమని చెబుతున్న పరిశోధకులు మనకు చేస్తున్న సూచన ఒకటే... పిల్లల చక్కని మార్కులకు, వారి వ్యక్తిత్వ వికాసానికి, మానసిక ఆరోగ్యానికి చక్కటి చేతిరాత ఎంతో ముఖ్యం.
By~~~~~-రమ
http://www.teluguone.com/vanitha/content/-child-handwriting-tips-handwriting-skills-76-30690.html#.VGw0qzSUdQB

No comments:
Post a Comment