చిక్కాల శివదేవుడు
పాలకొల్లుకి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో చిక్కాల శివాలయం ఉంది. కోవెల ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంది. ఈ శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. దేవాలయములోని లింగము మూడున్నర అడుగుల పొడవు, అడుగు వ్యాసార్ధము కలిగి తలభాగమునుండి చీల్చబడినట్లుగా చీలికతో ఉంటుందట.
ఆలయ చరిత్ర
రావణ సంహారం అనంతరం శ్రీరాముడు బ్రహ్మహత్యా దోషం నివారణకుగాను కోటి శివలింగాలని ప్రతిష్టించాలని అనుకున్నాడు. హనుమంతుని సహాయంతో శ్రీరాముడు కోటి శివలింగాల్ని ప్రతిష్టించాడంట. అందులో భాగంగా మొదటి శివలింగాన్ని రామేశ్వరంలో శ్రీరాముడు ప్రతిష్టించాడు. చివర మూడు శివలింగాలని తీసుకువస్తుంటే సూర్యోదయం అయ్యిందని సంధ్యావందనం చేసుకునే ఉద్దేశంతో హనుమంతుని చేతిలో ఉన్న ఒక శివలింగాన్ని దట్టమైన పొదవలె ఉన్న ప్రదేశంలో కిందకు పెట్టాడు. ఆ సమయంలో ఈ ప్రాంతమంతా దండకారణ్య ప్రాంతమట. సంధ్య వార్చుకొని తిరిగి వచ్చాక శివలింగాన్ని పైకి తీస్తుంటే ఎంతకీ రాలేదట. ఆ శివలింగం అక్కడే ప్రతిష్టించబడింది. పొదల మధ్య చిక్కుకొని ఉండిపోవటం వలన ఇక్కడ శివదేవుణ్ణి చిక్కాల శివదేవుడు అని అంటున్నారు.
ఇది మొదటి శివలింగం. రెండవ శివలింగం దిగమర్రులోనూ, మూడవ శివలింగం శివకోడులోనూ ప్రతిష్టించబడ్డాయి. ఈ మూడు శివలింగాలని ఒకేరోజులో దర్శించినా, పూజలు చేయించినా, అభిషేకాలు చేయించినా.....శ్రీరాముడు భారతదేశం మొత్తంలో ప్రతిష్టించిన కోటి శివలింగాలని దర్శించినంత ఫలితం లభిస్తుందట.
కొన్నివందల సంవత్సరాల క్రితం ఈ అడవి ప్రదేశాన్ని రైతులు వారి పొలాలకి అనువైన ప్రదేశమని తలచి, ఆ ప్రాంతాన్ని బాగుచేద్దామనే ఉద్దేశంతో గడ్డపార భూమిలో దించగానే, ఎర్రగా మరుగుతున్న రక్తం పైకి చిమ్మిందట. అది చూసి రైతులు భయపడి, ఆ విషయాన్ని ఆ ప్రాంతానికి రాజైన మొగల్తూరు రాజావారికి తెలియచేసారు. వెంటనే ఆ రాజావారు వచ్చి, శివలింగాన్ని బయటకు తీయించే ప్రయత్నం చేసారు. కూలీలు ఎంత లోతు తవ్వినా ఆ శివలింగం యొక్క మొదలు కానరాలేదు. అది శివుని మహిమే అని రాజావారు తలచి ఆ శివలింగాన్ని అక్కడే ఉంచి పూజలు, అభిషేకాలు చేసారంట. నేటికీ శివరాత్రినాడు, కార్తీకమాసంలోనూ, శివదేవునికి ప్రత్యేక ఉత్సవాలు జరుపుతూ ఉంటున్నారు.

ఆలయంలోకి వెళ్లేముందు నరనారాయణుల నిలువెత్తు విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చును.
ఆలయ ముఖద్వారం
ఆలయ ప్రాంగణం
ఆలయ చరిత్ర
ఇంకా పూజారులు దేవాలయం తలుపులు తియ్యలేదు. కానీ మా అదృష్టం దేవాలయం చెక్కతలుపులు వెయ్యకుండా గ్రిల్స్ వేసి తాళాలు వేశారు. పూజారి లేకపోయినా మేము శివయ్యని దర్శించుకోవటానికి ఏ ఆటకం లేదు.
శివాలయానికి ఎడమవైపున పార్వతి అమ్మవారి ఆలయం ఉంది.
క్షేత్రపాలకుడు విష్ణుమూర్తి ఆలయం శివాలయానికి కుడివైపున ఉంది.
లక్ష్మీసమేత శ్రీమన్నారాయణుడు
No comments:
Post a Comment