దిగమర్రు ........ శ్రీ ఉమాసోమేశ్వరస్వామి
పాలకొల్లు మరియు నర్సాపురం ప్రధాన రహదారిలో, పాలకొల్లుకి ఆరు కిలోమీటర్లదూరంలో ఈ ఆలయం ఉంది.
పాలకొల్లు మరియు నర్సాపురం ప్రధాన రహదారిలో, పాలకొల్లుకి ఆరు కిలోమీటర్లదూరంలో ఈ ఆలయం ఉంది.
ఆలయ చరిత్ర
రావణ సంహారం అనంతరం శ్రీరాముడు బ్రహ్మహత్యా దోషం నివారణకుగాను కోటి శివలింగాలని ప్రతిష్టించాలని అనుకున్నాడు. హనుమంతుని సహాయంతో శ్రీరాముడు కోటి శివలింగాల్ని ప్రతిష్టించాడంట. అందులో భాగంగా మొదటి శివలింగాన్ని రామేశ్వరంలో శ్రీరాముడు ప్రతిష్టించాడు. చివర మూడు శివలింగాలని తీసుకువస్తుంటే సూర్యోదయం అయ్యిందని సంధ్యావందనం చేసుకునే ఉద్దేశంతో హనుమంతుని భుజంపై ఉన్న శివలింగాన్ని ఒక ప్రదేశంలో కిందకు పెట్టాడు. ఆ సమయంలో ఈ ప్రాంతమంతా దండకారణ్య ప్రాంతమట. సంధ్య వార్చుకొని తిరిగి వచ్చాక శివలింగాన్ని పైకి తీస్తుంటే ఎంతకీ రాలేదట. ఆ శివలింగం అక్కడే ప్రతిష్టించబడింది. మారుతి వచ్చి ఈ ప్రదేశంలో దిగాడు గనుక ఈ ప్రాంతానికి ''దిగుమారుతి'' అని పిలువబడింది. కాలక్రమేణా ఈ పేరు దిగమర్రుగా మార్పుచెందింది.
చిక్కాలలో ఉన్న శివదేవుడు మొదటి శివలింగంగానూ. రెండవ శివలింగం ఈ దిగమర్రులో ఉన్న శ్రీఉమాసోమేశ్వరస్వామివారి శివలింగంను, మూడవ శివలింగం శివకోడులోనూ ప్రతిష్టించబడ్డాయి. ఈ మూడు శివలింగాలని ఒకేరోజులో దర్శించినా, పూజలు చేయించినా, అభిషేకాలు చేయించినా.....శ్రీరాముడు భారతదేశం మొత్తంలో ప్రతిష్టించిన కోటి శివలింగాలని దర్శించినంత ఫలితం లభిస్తుందట.

No comments:
Post a Comment