October 4, 2018

ద్వారక యాత్రా విశేషాలు - Dwaraka Tour Details ...Day 1& 2

ద్వారక యాత్రా విశేషాలు - Dwaraka Tour Details 

4 సెప్టెంబర్ 2018న సికింద్రాబాద్ నుండి రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ రైలు బయలుదేరింది. సురేన్ టూర్స్ వారితో యాత్రకి బయలుదేరాము. క్రిందటి సంవత్సరం నవంబర్ లో కాశీ యాత్రకి (9నిద్రలు చెయ్యటానికి) వీరితో మొదటిసారి వెళ్ళాము. ఈ ద్వారకా యాత్ర రెండవసారి. రైలు ఛార్జీ, వసతి, భోజనాలు అన్నీ వారే చూసుకున్నారు. 



యాత్ర నిర్వాహకురాలు శ్రీమతి శారద గారు.(9440734701 -- 7702108471). ఈ యాత్రకి మొత్తం 35 మంది వెళ్ళాము. అందులో నేను, నా స్నేహితులు 10 మంది ఉన్నాము.

Day 1


4/9/18 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ లో రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కాము.

Day 2 



5/9/18 మధ్యాహ్నం 2.30 కి అహ్మదాబాద్ లో రైలు దిగాము. స్టేషన్ నుండి అందరు బయటకి వచ్చి బస్సు ఎక్కేసరికి 3.30 అయ్యింది. అక్కడనుండి డాకోర్ చేరుకునేసరికి మాకు ఇంచుమించుగా 2 గంటల సమయం పట్టింది. అక్కడ మాకు అక్షయ అనే Resort లో బస ఏర్పాటు చేసారు. రూమ్స్ లో స్నానాదికాలు ముగించుకొని దగ్గర్లో ఏమైనా ఆలయాలు ఉంటె చూద్దామనుకున్నాం. కానీ దగ్గర్లో ఏమి లేవని తెలుసుకొని, అల్పాహారాలు ముగించుకొని ప్రయాణబడలిక తగ్గించుకోవటానికై త్వరగా రూమ్స్ కి చేరుకొని పడుకున్నాం. 

No comments:

Post a Comment