October 4, 2018

ద్వారక యాత్రా విశేషాలు - Dwaraka Tour Details Day 5

Day 5 

8/9/18 ఉదయాన్నే 5 గంటలకి త్రివేణీ సంగమంలో స్నానం చేసుకొని, సోమనాథుని నిజస్వరూపాన్ని(ఏ అలంకరణా లేకుండా ఉన్న శివలింగాన్ని)  దర్శించి, హారతి చూసుకొని 7 గంటలకి మా బసకి చేరుకున్నాము.
                           (ఈ ఫోటో గూగుల్ నుండి సేకరణ) 




8.45 కి అందరు ఫలహారాలు ముగించుకొని బస్సులో కూర్చున్నాము. అప్పుడు మా ప్రయాణం ద్వారక చేరుకోవటానికి ప్రారంభమయ్యింది.



దారిలో మధ్యాహ్నం 12గంటలకి పోరుబందరులో ఉన్న శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడైన సుధాముడు(కుచేలుడు) కలుసుకునే చోటే  "సుధామాపురి" చూసాము. ఎక్కడైనా ఆలయాలు అంటే భగవంతునికే ఉంటాయి. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ(భగవంతుని)కి భక్తుడైన సుధామునికి ఆలయం ఉండటం విశేషం.  


సుధామా ఇల్లు ఉన్న ప్రదేశంలో ఇప్పుడు ఉన్న ఈ శ్రీకృష్ణ మందిరం నిర్మించారు అని చెప్పారు.  




తరవాత పోరుబందరులో ఉన్న మన జాతిపిత మహాత్మాగాంధీ జన్మస్థలం చూసాము. గాంధీగారి భవనం అంతా వీడియోతీసాను. ఈ క్రింది వీడియో చుడండి.   





ఈ స్వస్తిక్ గుర్తు ఉన్న ప్రదేశంలో గాంధీగారు జన్మించారు.  
గాంధీగారు వాడిన చరఖా 
స్నేహితులతో 

అన్నీ చూసాక సాయంత్రం 6 గంటలకి ద్వారకకి చేరుకున్నాము. రూమ్స్ లో సామాను ఉంచి కొంచెం ఫ్రెష్ అయ్యి కృష్ణయ్యని(ద్వారకాధీశుడిని) చూడటానికి అందరం బయలుదేరాం. 

కృష్ణయ్య దర్శనం చేసుకొని, రాత్రి హారతి చూసుకొని 9 గంటలకి బసకి చేరుకున్నాము.

No comments:

Post a Comment