October 10, 2014

వివిధ రకములైన కాలమానములు

కాలమానములు (1)
60 రెప్పపాటులు (లేక) 60 విలిప్తలు  = 1 లిప్త
2 ½ లిప్తలు = 1 సెకను
24 సెకనులు = 1 విఘడియ
2 ½  విఘడియలు (లేక) 60 సెకనులు = 1 నిమిషము
60 విఘడియలు (లేక) 24 నిముషాలు = 1 ఘడియ
2 ½ ఘడియలు (లేక) 60 నిముషాలు = 1 గంట
2 ఘడియలు (లేక) 48 నిమిషములు = 1 ముహూర్తం
7 ½ ఘడియలు (లేక) 3 ¾ ముహూర్తములు = 1 పగలుభాగము
8 జాములు (లేక) ౩౦ ముహూర్తములు = 1 అహోరాత్రము (లేక) 1 రోజు రాత్రిపగలు 24 గంటలు 

కాలమానములు (2)
6 ప్రాణములు = 1 ఫలము (లేక) విఘటిక
60 విఘటికలు = 1 ఘటిక
21,600 ప్రాణములు (లేక) 60 ఘటికలు = 1 దినము
7 దినములు = 1 వారము
15 దినములు = 1 పక్షము
2 పక్షములు = 1 మాసము
2 మాసములు = 1 ఋతువు
3 ఋతువులు = 1 ఆయనము
2 ఆయనములు = 1 సంవత్సరము
365 దినములు, 6 గంటలు, 12 నిమిషములు ౩౦ సెకనులు = 1 సంవత్సరము.

కాలమానములు (3)
సృష్టిమానము
౩౦ దినములు = 1 మనుష్య మాసం & పితృదినము
12 మాసములు = 1 మానవ సంవత్సరం
1 మానవ సంవత్సరం = 1 దేవదినము

యుగములు ప్రమాణములు
17,28,౦౦౦ సంవత్సరములు = కృతయుగము
12,96,౦౦౦ సంవత్సరములు = త్రేతాయుగము
8,64,౦౦౦ సంవత్సరములు= ద్వాపరయుగము
4,32,౦౦౦ సంవత్సరములు= కలియుగము
4 యుగాల మొత్తం 43, 20,౦౦౦  సంవత్సరములు = 1 మహాయుగము
ఇటువంటి 71 మహాయుగాలు = 1 మనువు
14 మనువులు = 1 అవాంతర ప్రళయం
7 వ మనువు వైవశ్వత మనువు ప్రస్తుతం నడుస్తున్న కాలం. 
24 మహాయుగం త్రేతాయుగంలో శ్రీరాముని జననం జరిగింది. & 28మహాయుగం ద్వాపర యుగంలో శ్రీకృష్ణ జననం జరిగింది.        
43, 20,౦౦౦  సంవత్సరములు = 1 మహాయుగము
71 మహాయుగాలు = మన్వంతరం
14 మన్వంతరములు = బ్రహ్మకు పగలు భాగము
1000 మహాయుగాలు = 1 కల్పము (లేక) బ్రహ్మకు పగలు భాగం మాత్రమే.
అనగా  43, 20,00,00,౦౦౦    మానవ సంవత్సరములు.
2 కల్పములు = బ్రహ్మకు 1 దినము అనగా 8,64,00,00,౦౦౦ మానవ సంవత్సరములు.
ఈవిధంగా బ్రహ్మయొక్క ఆయుర్ధాయము 100 సంవత్సరములు.  

బ్రహ్మ యొక్క ఆయుర్థాయము
8,64,00,00,౦౦౦ * ౩౦ దినములు * 12 మాసములు * 100 సంవత్సరములు = బ్రహ్మకు ఒక నెలకు,
8,64,00,00,౦౦౦ *౩౦ = 2,59,20,00,00.౦౦౦ మానవ సంవత్సరములు బ్రహ్మకు ఒక సంవత్సరమునకు,
2,59,20,00,00,౦౦౦ *12= 31,10,40,00,00,౦౦౦ మానవ సంవత్సరములు. బ్రహ్మనూరు సంవత్సరముల ఆయుర్ధాయనకు మానవ సంవత్సరములు.
31,10,40,00,00,౦౦౦ *100 =31,10,40,00,00,00,౦౦౦ మానవ సంవత్సరములు.

విష్ణువు యొక్క ఆయుర్థాయము

ఇట్టి  బ్రహ్మ యొక్క ఆయుర్ధాయము విష్ణువునకు 1 దినము
ఈ విష్ణువు 100 సంవత్సరముల ఆయుర్ధాయము అనగా బ్రహ్మఆయుర్ధాయము *౩౦*12*100 విష్ణువు ఆయుర్ధాయము.
31,10,40.00.00,00,౦౦౦*౩౦= 9,32,12,00,00,00,౦౦౦ మానవ సంవత్సరములు.
విష్ణువు యొక్క సంవత్సరమునకు మానవ సంవత్సరములు
9,౩౩.12.00,00,00,00,౦౦౦*12 = 11197440000000000 మానవ సంవత్సరములు. విష్ణువు యొక్క ఆయుర్ధాయము రుద్రునకు ఒక దినము.

రుద్రుని యొక్క ఆయుర్ధాయము

విష్ణువు యొక్క ఆయుర్తయము*౩౦*12*100 మానవ సంవత్సరములు
రుద్రుని యొక్క ఒక్క మాసమునకు 111000000000000000*౩౦ మానవ సంవత్సరములు. = ౩౩592320000000000000000 మానవ సంవత్సరములు.    
రుద్రుని యొక్క ఒక్క సంవత్సరమునకు ౩౩592320000000000000000*12 మానవ సంవత్సరములు =4031078400000000000000 మానవ సంవత్సరములు .
రుద్రుని యొక్క వంద సంవత్సరములకు మానవ సంవత్సరములు 
 4031078400000000000000*100 మానవ సంవత్సరములు  403107840000000000000000 మానవ సంవత్సరములు.

బ్రహ్మ ప్రళయము = 1 కల్పము
విష్ణు ప్రళయము = 1 మహా కల్పము
రుద్ర ప్రళయము = 1 ఆది కల్పము
ఇట్టి కాలములకు అతీతుడై,  స్థిరుడై, అవినాశుడై, నిత్యుడై, ఆనంద్యుడై, జనన మరణాతీతుడై, ఆత్మరూపుడైన పరమాత్మ (లేక) పరబ్రహ్మము ఉన్నాడు. అతడే జన్నాటకసూత్రధారుడు.   


No comments:

Post a Comment