November 19, 2014

ఈ అయిదు.. ఆ మూడు రోజుల కోసం

ఈ అయిదు.. ఆ మూడు రోజుల కోసం



పిరియడ్స్ సమయంలో విపరీతమైన చికాకు, నీరసం, కడుపునొప్పి, తలనొప్పి వంటివి సాధారణం. అయితే మనం తీసుకునే ఆహారంలో కొన్నిటిని చేర్చడం ద్వారా ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చుట. అవి ఏంటంటే....

1. నీరు బాగా తాగాలి
శరీరం ఫ్లూయిడ్స్‌ని కోల్పోతుంది కాబట్టి తగినంత నీరు శరీరానికి అందేలా చూసుకోవాలి. కాబట్టి మిగతా రోజుల కన్నా పిరియడ్స్ రోజులలో మంచినీరు కాస్త ఎక్కువగా తగాలి. కాఫీ, టీలని దూరంగా పెట్టడం మంచిది.

2.  ఆకు కూరలు
ఆకు కూరలలో కావలసినంత ఐరన్ వుంటుంది. పిరియడ్స్ సమయంలో శరీరానికి అందాల్సిన పోషకాలని ఈ ఆకుకూరలు అందిస్తాయి. కాబట్టి ఆకు కూరలను ఆ మూడు రోజులూ తప్పనిసరంగా ఆహారంలో చేర్చండి.

3. అరటి పండు
పిరియడ్స్ రోజులలో మూడు స్వింగ్స్ ఉంటాయన్న విషయం తెలిసిందేగా. వాటి నుంచి బయటపడటానికి అరటి పండు మంచి ఔషధం. పొటాషియం, బి6 విటమిన్‌తోపాటు అరటిపండులో వుండే ఇతర విటమిన్లు రక్తంలోని గ్లూకోజ్‌పై ప్రభావాన్ని చూపిస్తాయి. దాని వలన మూడ్ స్వింగ్స్ తగ్గి హుషారుగా వుంటారు.

4. లెగ్యూమ్స్ (గింజధాన్యాలు)
చిక్కుడు కుటుంబానికి చెందిన బీన్స్ వంటి గింజ ధాన్యాలలో ఐరన్ శాతం ఎక్కువ. వాటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శారీరక సమతౌల్యం త్వరగా పొందచ్చు.

5. డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్‌లో వుండే మెగ్నీషియం వుండటమే కాకుండా, ఫీల్‌గుడ్ కెమికల్ అయిన సెరిటోటిని కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి పిరియడ్స్ సమయంలో ఓ చిన్న డార్క్ చాక్లెట్ తింటే చికాకు పోయి హాయిగా అనిపిస్తుంది.

మొత్తానికి పిరియడ్స్ రోజులలో మెగ్నీషియం, ఐరన్, ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అంటే ఆకుకూరలు, చేపలు, నట్స్, బీన్స్, పప్పు ధాన్యాలు, పండ్లు వంటివి ఆహారంలో చేర్చడం ద్వారా ఆరోగ్యంగా వుండచ్చు. ముఖ్యంగా చదువుకునే పిల్లల ఆహారం విషయంలో అమ్మలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

By~~~~~~ రమ 

http://www.teluguone.com/vanitha/content/ladies-menstrual-pain-944-31157.html#.VGxE2zSUdQA



No comments:

Post a Comment