రామ దైవశిఖామణి సురరాజ మనోజ్వల భూమణి కీర్తన
రామ దైవశిఖామణి సురరాజ మనోజ్వల భూమణి
తామరసాక్ష సుధీమణీ భవ్యతారక భక్తచింతామణి
నాడే మిము వేడుకొంటిగా శరణాగతి బిరుదని వింటిగా
వేడుక మిము పొడగంటిగా నన్ను దిగవిడనాడ వద్దంటిగా
చింతసేయగ నేమిలేదుగా ముందు చేసిన గతి తప్పబోదుగా
ఇంతకు మిక్కిలి రాదుగా నేనితరుల కొలిచేది లేదుగా
తమ్ముడు నీవొక కంటను రామదాసుని రక్షించుకుంటను
సమ్మితినుండు మా ఇంటను భద్రాచలవాస నీబంటు బంటను

No comments:
Post a Comment