గొబ్బెమ్మ పాట
గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో
మన సీతాదేవి వాకిటవేసిన గొబ్బియల్లో ll గొబ్బిll
మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గులమీద మల్లెపూలు గొబ్బియల్లో ll గొబ్బిll
నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గుల మీద మొగలీపూలు గొబ్బియల్లో ll గొబ్బిll
ధాన్యపురాశుల ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గులమీద సంపెంగలు గొబ్బియల్లో ll గొబ్బిll
రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గులమీద మందారాలు గొబ్బియల్లో ll గొబ్బిll
భూదేవంతా ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియల్లో ll గొబ్బిll
లక్ష్మీ రథముల ముగ్గులు వేసి గొబ్బియల్లో
ఆ ముగ్గుల మీద తులసీదళములు గొబ్బియల్లో ll గొబ్బిll
Mana samskritini maarintaga chatiddam.....bhavitaralaku andiddam..
ReplyDeletetappakunda Ramana Jii......naa ashayam kuda adenandi
Deleteగంగిరెద్దులవారు,బుడబుక్కలవారు,కాటికాపర్లు,బుర్రకథకులు ఇలాంటి ఎందరో నిష్కపట కళాకారుల ప్రదర్శనలు తిరిగి పూర్వరూపం సంతరించుకుంటే ఎంత బాగుంటుంది?!
ReplyDelete