March 30, 2014

మిత్రులందరికీ శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

మిత్రులందరికీ శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

భారతీయ ఔన్నత్యం - సిస్టర్ నివేదిత

భారతీయ ఔన్నత్యం - సిస్టర్ నివేదిత


వివేకానంద సూక్తి

వివేకానంద సూక్తి


వివేకానంద సూక్తి

వివేకానంద సూక్తి


వివేకానంద సూక్తి

వివేకానంద సూక్తి


వివేకానంద సూక్తి

వివేకానంద సూక్తి


వివేకానంద సూక్తి

వివేకానంద సూక్తి


March 29, 2014

భారతీయ ఔన్నత్యం -- విల్లియం రాబర్ట్

భారతీయ ఔన్నత్యం -- విల్లియం రాబర్ట్


భారతీయ ఔన్నత్యం - హెన్రీ డేవిడ్

భారతీయ ఔన్నత్యం - మన వేదాల విలువను చాటిచెప్పిన హెన్రీ డేవిడ్


March 28, 2014

శవము -- శివము

శవము -- శివము

మానవ శరీరమునందు శవము - శివము అనే రెండునూ కలవు. దేహమూ, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము మొదలైన దృశ్యరూప ఉపాధి జడమయమైనది. కాబట్టి ఇది శవమని చెప్పబడింది. వీటన్నింటిని ప్రకాశింపచేయుచూ సాక్షిరూపమున వెలుగుచున్నట్టి అంతర్జ్యోతిరూపమైన ఆత్మయే శివమని చెప్పబడింది.


శిశుపాలుడు చేసిన 100 తప్పులు

శిశుపాలుడు చేసిన 100 తప్పులు  ఏమిటి ? ఏ విధంగా వధించబడ్డాడు ???

శ్రీకృష్ణుని మేనత్త కొడుకు శిశుపాలుడు. చేది దేశపు రాజు. దగ్గరి చుట్టరికం ఉన్నప్పటికీ కృష్ణుడిమీద ప్రేమాభిమానాలనేవి లేవు. పైగా నిరంతరం కృష్ణుని ద్వేషిస్తూ ఉంటాడు. అవకాశం దొరికితే చాలు అవమానిస్తూ ఉంటాడు. 

 శిశుపాలుని ఆగడాలు చూసీచూసీ విసిగిపోసిన కృష్ణుడు ఒక సందర్భంలో దండించబోయాడు. అప్పుడు శిశుపాలుని తల్లి, కృష్ణుని మేనత్త అడ్డుపడి, "ఆగు కృష్ణా.. నా ముఖం చూసి అయినా శిశుపాలుని క్షమించు..'' అంది. 

కృష్ణుడు కోపాన్ని తమాయించుకుని, ''అత్తా, నువ్వు చెప్పావు కనుక ఆగుతున్నాను.. నీమీది గౌరవంతో నీ కొడుకు తప్పులను నూరుసార్లు సహిస్తాను. ఆపైన మాత్రం సహించేది లేదు.. ఇక అతడు శిక్ష అనుభవించక తప్పదు'' అన్నాడు. అలా జరిగాక అయినా శిశుపాలుని వైఖరిలో మార్పు లేదు. తప్పులు చేస్తూనే ఉన్నాడు. సమయం సందర్భం లేకుండా శ్రీకృష్ణుని అవమానిస్తూనే ఉన్నాడు. 

ధర్మరాజు తలపెట్టిన యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. యజ్ఞశాల ఆకులు, పూవులు, దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకృతమైంది. ఎక్కడ చూసినా తీర్చిదిద్దిన ముగ్గులు, కళాకృతులతో ఉజ్వలంగా వెలిగిపోతోంది. పూవులు, సుగంధ ద్రవ్యాల పరిమళాలతో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. వివిధ వాయిద్యాల సమ్మోహన స్వరాలూ, గాయనీగాయకుల మధుర గానామృతంతో సందడిగా,కోలాహలంగా ఉంది. 

యాగం ముగిసింది కనుక తృప్తిగా దానధర్మాలు చేయాలనుకున్నారు. అంతకంటే ముందు భీష్మ పితామహుడు తొలి తాంబూలం శ్రీకృష్ణునికి ఇవ్వమని యుధిష్ఠిరునికి చెప్పాడు. ధర్మరాజు మనసులో ఉన్నది కూడా అదే ఆలోచన కనుక చిరునవ్వుతో తల పంకించి శ్రీకృష్ణునికి అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి, అగ్రతాంబూలం సమర్పించాడు. అందుకు దేవతలు హర్షించారు. విరుల జల్లు కురిపించారు.

అయితే శ్రీకృష్ణునికి ధర్మజుడు అగ్రతాంబూలం ఇవ్వడం శిశుపాలునికి ఎంతమాత్రం రుచించలేదు. అసూయాద్వేషాలు మానసును దహింపచేయగా ''ఎందరో పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, వృద్దులు, త్యాగశీలురు, ధైర్యపరాక్రమాలకు మారుపేరైన క్షత్రియులు, మరెందరో ఉత్తములు ఉండగా ప్రథమ తాంబూలం ఇవ్వడానికి శ్రీకృష్ణుడే కనిపించాడా? కృష్ణుడు ఒక యాదవుడు, పశువుల కాపరి అని మర్చిపోయారా? ఇంతకంటే తెలివితక్కువ పని ఇంకొకటి ఉంటుందా? అగ్ర తాంబూలం ఇవ్వడానికి ఇంత అయోగ్యుడిని ఎంచుకుంటారా? ఇది తక్కినవారికి ఎంత అవమానం కలిగిస్తుందో అర్ధం చేసుకునేపాటి విచక్షణ కూడా లేదా?'' అంటూ ఆగ్రహావేశంతో చిందులు తొక్కాడు.

ధర్మరాజు శిశుపాలునికి నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ శిశుపాలుడు ఆ మాటలు విని అర్ధం చేసుకునే స్థితిలో లేడు.

''భీష్మాచార్యుడు ముసలితనంతో మతి కోల్పోయాడు. ఆయనకు విచక్షణ నశించింది.. సరే, నీకు ఏమయింది? ఆయన ఔచిత్యం లేని పనికిమాలిన సలహా ఇస్తే.. దాన్ని నువ్వు అనాలోచితంగా పాటిస్తావా? కొంచెమైనా బుద్ధి ఉపయోగించి ఆలోచించవా? ధర్మరాజా నువ్వేదో ప్రశాంతంగా ఉంటావు.. తెలివిగా ఆలోచిస్తావు అనుకున్నాను.. కానీ, నువ్వు కూడా మతి లేకుండా ప్రవర్తిస్తావని ఇప్పుడే స్పష్టమైంది.. సరే, భీష్మాచార్యుడికి, నీకూ కూడా బుద్ధి మందగించింది.. ఏదో, తెలివితక్కువగా కృష్ణునికి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.. కనీసం అనుడుకునేవాడికైనా బుద్ధి ఉండాలా? ఇందరు మహామహులు ఉండగా నేను అగ్ర తాంబూలం అందుకోవడం ఏమిటి? అంతకంటే అనౌచిత్యం ఇంకోటి ఉండదని వారించాలా? తగుదునమ్మా అంటూ పుచ్చుకుంటాడా?!'' అంటూ అందరి సమక్షంలో కురువృద్ధుడైన భీష్మ పితామహుడు, ధర్మరాజు, శ్రీకృష్ణుడు - ముగ్గుర్నీ నోటికొచ్చినట్లు తూలనాడాడు.

ఈ సంఘటనతో శిశుపాలుని నూరు తప్పులు పూర్తయ్యాయి. ఇది నూట ఒకటో తప్పు. ఇక కృష్ణుడు దయచూపలేదు. ముందే చెప్పినట్లుగాశిశుపాలుని శిక్షించేందుకు సమాయత్తమయ్యాడు. సుదర్శన చక్రంతో శిశుపాలుని తల ఖండించాడు.....


శ్రీ సూర్యభగవానుడు

శ్రీ సూర్యభగవానుడు

ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఏడు గుర్రాల రథంలో గగన వీధిన పయనిస్తాడు. ఏడు గుర్రాలు ఇంద్ర ధనుస్సు లోని ఏడు రంగులకు, వారం లోని ఏడు రోజులకు ప్రతీకలు.  సూర్యుని రథ సారథి అరుణుడు.  సూర్యోదయానికి ముందు వచ్చే అరుణకాంతి భానుని ఆగమనానినికి గుర్తు. అరుణుడు కశ్యప మహర్షి-వినత ల పుత్రుడు. తల్లి తొందరపాటు వలన అర్ధదేహం తో జన్మించాడు. ఊరువులు (తొడలు) లేనివాడు గనుక అరుణుడిని 'అనూరుడు' అని కూడా అంటారు.


ఆదిమ వానరుడు ఋక్ష విరజుడు

ఆదిమ వానరుడు ఋక్ష విరజుడు

రామాయణంలో కనిపించే వాలిసుగ్రీవుల తండ్రి ఋక్షవిరజుడు. బ్రహ్మ తపస్సు చేసుకుంటున్న సమయంలో ఆయన కళ్ళ నుండి రాలిన అశ్రువుల నుంచి జన్మించిన వాడు ఋక్షవిరజుడు. అరణ్యంలో తిరుగుతుండగా కనిపించిన ఒక చెరువులో దిగిన ఋక్షవిరజుడు, ఆ చెరువు నుంచి బయటకు వచ్చేసరికి స్త్రీగా మారిపోతాడు. గతంలో పార్వతి ఆ చెరువులో స్నానం చేయడం వల్ల అలా జరిగిందని బ్రహ్మ అతనికి చెబుతాడు. స్త్రీగా మారిన ఋక్షవిరజుడికి ఇంద్రుని వల్ల వాలిసుగ్రీవులు జన్మిస్తారు. ఆ తర్వాత వానరజాతి విస్తరించిందని మన పురాణాలూ చెప్పిన వివరణ.


సోహం అంటే ఏమిటి ?

సోహం అంటే ఏమిటి ?

భావశూన్య సద్భావ సుస్థితి: |
భావనా బలాద్భక్తిరుత్తమా ||

శూన్య భావనా చింతన కన్నా, సద్భావన (పరమాత్మయే నేను అనే అభేద చింతన) శ్రేష్టము. ఇట్టి భావనతో కూడుకున్న అభేదభక్తి ఉత్తమము.

సోహం భావన

స: అంటే అతడు పరమాత్మ. అహం అంటే నేను. ఆ పరమాత్మతో నేను ఏకమై యున్నాను. ఈ ఐక్యాన్ని సద్విచారణ ద్వారా జ్ఞానంతో తెలుసుకోవాలి. ఇది జ్ఞానంతో పొందదగినదే కానీ, ధ్యానంతో కాదు. సమాజంలో చాలామంది మేము సోహం మెడిటేషన్‌ నేర్చుకున్నాం. రోజూ అరగంట ప్రాక్టీసు చేస్తున్నామని చెబుతుంటారు. సోహం అనేది జ్ఞానపర వాక్యంగా సాధకుడు గ్రహించాలి.
సోహం అని ధ్యానం చేయకూడదాయ? తప్పక చెయ్యవచ్చు. సోహం అంటూ ధ్యానం చేస్తే ఏం కలుగుతుందియ? నేను ఈ సృష్టికర్తయైన పరమాత్మ (హిరణ్యగర్భుని)తో ఏకమై యున్నానని భావిస్తూ సోహం.. సోహం.. సోహం.. అని జపంచేస్తూ ధ్యానం చేయడంవల్ల విశేష పుణ్యం కలిగి, సుఖభోగాలు లభించి హిరణ్యగర్భలోకం సిద్దిస్తుందని ఉపాసనాకాండ వివరిస్తూంది.

తం యథాయథా ఉపాస్తే తదేవ భవతి!
ఈ ఉపాసనలో నేను అనే జీవభావం పూర్తిగా తొలగదు. పరమాత్మ తత్త్వ జ్ఞానం కలగదు. కేవలం నేను పరమాత్ముడనై యున్నానని భావిస్తాడంతే! కావున వీడు జీవుడిగానే వుంటూ మరో లోకాన్ని పొంది, ఉపాసనా బలం వున్నంతకాలం అనుభవిస్తాడు. ఉపాసనా ఫలితం తీరిన తర్వాత మళ్లీ మామూలుగా ‘‘క్షీణ పుణ్య  మర్త్యలోకం విశంతి’’ పుణ్యఫలం తీరిపోతే తిరిగి ఈ భూలోకంలో ఈ దేహాన్ని పొంది ‘‘పునరపి జననం పునరపి మరణం’’ జనన మరణాలలో చిక్కుకుని తిరుగుతుంటాడు.

అందుకే ఈ సోహం అనే పదాన్ని వివేకయుక్తుడై శాస్త్రప్రమాణంతో విచారణ చేస్తే, అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. విచారణలో ఉదయించిన జ్ఞానమే అజ్ఞానాన్ని రూపుమాపుతుంది. అజ్ఞానం నశిస్తే సంసారక్షయం. సంసారక్షయమే మోక్షం.

మాభవగ్రాహ్య భావాత్మ గ్రాహకాత్మాచమాభవ భావనామఖిలం త్యక్త్వా యచ్ఛిష్టం తన్మయోభవ కర్మలు, ఉపాసనలు, వాటివల్ల కలిగే ఫలాలు, వాటిని పొందాలనే భావాలన్నింటిని అధిగమించి, ఏదైతే నిత్యశుద్ద చైతన్యమై అన్నింటికి విలక్షణమై వెలుగొందుతుందో అట్టి తత్త్వరూపమై నీవు వెలుగొందమని భావం. కనుక కర్మ, ఉపాసన కూడా మోక్షాన్ని, శాశ్వతానందాన్ని ఇవ్వలేవు.


దేవుడు ఉన్నాడని చెప్పటానికి ఇదే నిదర్శనం

దేవుడు ఉన్నాడని చెప్పటానికి ఇదే నిదర్శనం

దేవుడు ఉన్నాడా అని చాలా మందికి సందేహం ఉంటుంది. అది సహజం. కానీ అతను అంతా వ్యాపించి ఉన్నాడు.... అన్నిటా ఉన్నాడు అని చెప్పటానికి నిదర్శనమే ఈ ఫోటో.

మా నాన్నగారు...ప్రతీ సంవత్సరం  ఆషాడమాసం పౌర్ణమి రోజున... గురు పౌర్ణమి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. అదే విధంగా క్రిందటి సంవత్సరం జరిపిన ఉత్సవాలలో....సౌభాగ్యలక్ష్మీ యంతం వేసి, హొమాలు జరిపారు..... వాళ్ళు చేసిన పూజలకి భగవంతుడు (కృష్ణుడు)  సంతోషించి ఆనందంతో నృత్యం చేస్తూ , హొమగుండంలో ఈ విధంగా ప్రత్యక్షమయ్యాడు. అందరు చూసి ఎంతో ఆనందించారు....ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ లభించని దైవ దర్శనం అక్కడ ఉన్న అందరికీ లభించింది. ఇది సత్యం.



దశ వాయువులు - పంచ ప్రాణాలు

దశ వాయువులు - పంచ ప్రాణాలు

పంచ ప్రాణాలు
ప్రాణ వాయువు: శ్వాస ద్వారా హృదయానికి తర్వాత అన్ని కణాలకు చేరే వాయువు

అపాన : ఊపిరితిత్తులు, విసర్జన అవయవాలద్వారా వ్యర్ధ పదార్దములు పంపే వాయువు

వ్యాన:  శరీరం యొక్క సంకోచ వ్యాకోచాలకు కారణం

ఉదాన: వాక్కు రూపంలో ఉండేవాయువు

సమాన:  జీర్ణమవటానికి ఉపయోగించే వాయువు

ఉప ప్రాణాలు

నాగ : త్రేన్పు గా వచ్చే గాలి

కూర్మ : రెప్పవేయటానికి కారణమైన గాలి

కృకల :  తుమ్ము

ధనంజయ :హృదయ నాడులను మూస్తూ తెరుస్తూ ఉండే వాయువు.

దేవదత్తం: ఆవులింత లోని గాలి
అనే దశ వాయువులు శరీరంలో ఉంటాయని అంటారు.

ప్రాణ వాయువు (శ్వాస) లేనప్పుడు చనిపోయినట్లు గుర్తిస్తారు.

ధనంజయ వాయువు చనిపోయిన తర్వాత కూడా ఉండి శరీరం ఉబ్బటానికి కారణం అవుతుంది.

పంచ ప్రాణాలు ఐదు +  ఉప ప్రాణాలు ఐదు..... ఈ పదింటిని కలిపి దశ వాయువులు అని అంటారు.


నవ విధభక్తి

నవ విధభక్తి

భగవతుడిని  భక్తి మార్గం లో ఆరాదించటానికి తొమ్మిది రకాలైన విధానాలు ఉన్నాయి. వీటిల్లో అన్నీ లేక కొన్ని పాటించి భగవంతుని అనుగ్రహం పొందవచ్చు. ఏ విధంగా చేసినా మన పూజలు భగవంతునికి అందటం ముఖ్యం.

1)శ్రవణం - దేవుని గురించి వినుట

2)కీర్తనం - అన్నమయ్య వలె , త్యాగయ్య వలె దేవుని కీర్తిస్తూ  పాడుట

3)దైవ స్మరణ - నారదుని వలె నిరంతరం భగవన్నామం స్మరించుట

4)పాద సేవ - గరుడుని వలె స్వామి సేవ చేయటం

5)అర్చన - ఆవాహనము , ఆసనం, అర్ఘ్యం, పాద్యము , స్నానము, వస్త్రము, అలంకారం, పూజ, ధూపం, దీపం, నైవేద్యము, నీరాజనం వంటి పద హారు చర్యలతో అర్చించటం.

6)వందనం- త్రికరణ (మనసు, వాక్కు , శరీరం) శుద్ది గా నమస్కరించటం .

7)దాస్యం - హనుమంతుని వలె దాస్యం చేయటం

8)సఖ్యం - గోపికల వలె అర్జునిని వలె దేవుని తమ సఖుని గా భావించి తనపై భారం వేయటం.

9)ఆత్మ నివేదనం - ఆత్మ (తనను తాను) భగవంతుని కి అర్పించి స్వామి సంకల్పం పై కర్మలు చేయటం.


మహా పాపినైనా -- మహాత్ముణ్ణి చేస్తాడు మాధవుడు

మహా పాపినైనా ...... మహాత్ముణ్ణి చేస్తాడు మాధవుడు

అపిచేత్ సుదురాచారో భజతే మాఅనన్యభాక్ l
సాధురేవ సమంతవ్యః సమ్యగ్వ్యవసితో హిసః ll

చాలామందికి దేవుని గురించి తెలియక "మీ దేవుడే పాపులను శిక్షిస్తాడు, మా దేవుడైతే పాపులను రక్షిస్తాడు" అని అంటూ ఉంటారు. ఒకనాడు పతనమైన ఎందఱో పాపులు కూడా భగవంతుని పట్ల కాస్త అనుకూల బుద్ధిని కలిగించుకుని, తిరిగి పావనులుగా, పవిత్రమూర్తులుగా, ఎదిగిన సన్నివేశాలు, మన గ్రంథాలలో కనిపిస్తాయి. ఉదాll విప్రనారాయణుడు, భక్త పుండరీకుడు మొదలగువారు. కావున ఒకవేళ మనలో దోషాలో ఉండవచ్చును. అలా అని మనం భగవంతుని చేరటానికి వెనుకంజ వెయ్యక్కరలెద్దు. శ్రీకృష్ణుని పాదాల్ని సేవిద్దాం. మనలో దాగి ఉన్న మంచి సంస్కారములు పెంచుకుందాం.


అక్షయ తృతీయ (చందనయాత్ర)

అక్షయ తృతీయ (చందనయాత్ర)

చందనం తీసిన తరవాత స్వామివారి నిజరూప దర్శనం 
అక్షయ తృతీయనే "చందనయాత్ర"  అంటాము. వైశాఖ బహుళ తదియ రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. 

సింహద్రి అప్పన్న నిజరూప దర్శనం కోటి జన్మల తపః ఫలం ....నర మృగ శరీరాలతో పక్కన చేతి కింద నమ్ముకున్న గరుడాళ్వార్ తో ఏడాది పొడుగున దివ్య చందనం లో లింగా కారంలో కనిపించే స్వామి ఆనాఢు పురూరవునికిచ్చిన మాట ప్రకారం వరహా నరసింహునిగా నిజరూపంతో కనిపించే దివ్యమైన రోజే అక్షయతృతీయ. 

సింహాచలంలో భగవానుడు మనకు సంవత్సరము అంతా గుమ్మడిపండు రూపంలో దర్సనమిస్తాడు. విదియనాటి రాత్రి స్వామి కి అభిషేకాదులు చేసి అర్చకులు....  స్వామి మేను నుండి చందనము తొలగిస్తారు. తిరిగి తదియనాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగధార నుండి మట్టి కలశలతో నీరు తెచ్చి అప్పన్నకి సహస్ర కలశాభిషేకం చేస్తారు. సహస్ర కలశాభిషేకం జరుగుటకు మన పెద్దలు చెప్పిన కొన్ని విశేషాలు మనం చెప్పుకుందాము. 

హిరాణ్యాక్షుని సంహరించిన పిదప, నరసింహస్వామి ప్రహ్లాదునుని, నీకేమివరము కావాలో కోరుకో అని అడుగగా..... అంతట ప్రహ్లాదుడు స్వామితో ఇట్లనెను "స్వామీ మా తండ్రి, పెడతండ్రులను సంహరించిన వాడివైనందున నీ రెండు అవతారాలను కలిపి ఒకే రూపంలో దర్శించే భాగ్యము నాకు కల్పించు తండ్రీ" అని అడగగా స్వామి అట్లే అనుగ్రహించి, ప్రహ్లాదుని కోరికని మన్నించెను. అందువలననే ఇచట వెలసిన స్వామిని "శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి" అని అంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామి రూపం మనకు మరెక్కడా కనిపించదు.             

ప్రహ్లాద వంశీయుడైన పురూరవ చక్రవర్తి, ఊర్వశితో గగనమార్గాన విహరిస్తున్న సమయంలో సింహగిరి సమీపమునకు రాగానే వారి పుష్పకవిమానము ముందుకు కదలక అచ్చటే నిలిచిపోయేనట. ఆ చక్రవర్తి భగవదాజ్ఞగా భావించి, కొంత సమయము విశ్రాంతి తీసుకోదలచి వాహనమును సింహగిరి పైకి దించి, ఒక చెట్టు క్రింద విస్రమించెను. అంతట అతనికి స్వప్నమందు అప్పన్న సాక్షాత్కరించి, "నేను ఇచటనే వెలసియున్నను, నాకు ఆరాధన చేయు" అని పలికెను. వెంటనే పురూరవుడు.....స్వామి చెప్పిన గురుతుల ప్రకారము, ఆ కొండ ప్రాంతమంతా భటులచే వెతికించి, ఒక చోట స్వామి ఉన్నట్లు తెలుసుకొని, స్వామి పై ఉన్న పుట్టమన్నుని తొలగించి దర్శించెనట.  అంత స్వామి ఇంతకాలము తనపై ఉన్నమట్టివలన తాపములేదని, ఎంత మన్నుని తనపైనుండి తీసారో అంతే  పరిమాణంలో తనపై శ్రీ చందనం పూతగా వేయవలెనని చెప్పెనట, సంవత్సరములో ఈ ఒక్కరోజునే స్వామి యొక్క నిజరూప దర్శనభాగ్యం మనకు లభిస్తోంది.  పుట్టను తవ్వి తీసిన మట్టి 12 మణుగులు ఉన్న కారణంగా, ఇప్పుడు అంతే పరిమాణంగల చందనమును 4 విడతలుగా వేస్తున్నారు. ఆ నాలుగు విడతలు----

1) అక్షయ తృతీయ నాడు, 2) వైశాఖ పూర్ణమి నాడు, 3) జ్యేష్ట పూర్ణిమ & ఆషాడపూర్ణిమ. ప్రతీ విడతకు 3 మణుగుల చొప్పున చందనమును స్వామిపై వేస్తారు. అందుకే ఈ స్వామిని చందన స్వామి అనికూడా అంటారు.


చందనం అరగతీయటం
చందనయాత్ర రోజున నాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగధారవద్ద స్నానమాచరించి, మట్టికలశలతో గంగధార నీటిని తీసుకొని వచ్చి, స్వామికి అభిషేకిస్తారు. అభిషేకం అనంతరం స్వామిని చల్లబరచటానికి - తృప్తిపరచటానికి పంచదారతో పానకం చేసి ఆరగింపు చేస్తారు. ఆ పానకమే ఆనాటి స్వామి ప్రసాదన్నమాట. అనంతరం స్వామికి విశేష పూజలు చేసి, మళ్ళీ చందనంతో స్వామికి పూత పూస్తారు.


దుష్ట శిక్షణ శిష్ట రక్షణ లక్ష్యంగా సింహద్రి అప్పడు చందన రూపం ధరించినది ఈ రోజే
పతిత పావని గంగమ్మ ఉధ్భవించినది ఈ రోజే
పితృవాక్యపాలకుడు పరశురాముడు జన్మించినది నేడే
చార్ ధామ్ యాత్ర మొదలయ్యేది నేడే
కుచేలుడు కృష్ణుడికి అటుకులిచ్చి అక్షయ సంపదలు ఫొందింది నేడే
అరణ్యవాసానికి పోతూ అన్న కృష్ణుడిని ఆర్తితో ప్రార్థించిన ద్రౌపది అక్షయపాత్ర పొందింది నేఢే
అటువంటి పవిత్ర అక్షయ తృతీయ నాడు అప్పన్న నిజరూప దర్శనం శాశ్వత వైకుంఠ నివాసాన్ని ఇస్తుంది
సింహచల వరహ లక్ష్మీ నృసింహ స్వామి నిజరూప దర్శనం సకల పాప నాశనం సర్వసౌభాగ్యదాయకం
ఏడాదికి ఒక్కసారి లభించే ఈస్వామి దర్శనం చాలా పుణ్యం చేసుకుంటేగానీ లభించదు. శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించండి ...... పాపాలను తొలగించుకొని పుణ్యలోకాలకి మార్గం సుగమం చేసుకోండి.   



🙏🙏🙏అప్పన్న నిజరూప దర్శనం 🙏🙏🙏

పరమాత్మను చేరుకోవటం ఎలా

పరమాత్మను చేరుకోవటం ఎలా

మన పూర్వులు, ఋషులు అంతా మనకి కలిగే అనుమానాలు తీర్చటానికి ఎంతో శ్రమించారు. సర్వజగత్తుకు నాయకుడైన ఆ శ్రీమన్నారాయణుని చేత ఆడబడేటటువంటి జగన్నాటకంలో లోకాలన్నీ ఎలా సృష్టించబడుతున్నాయి, ఎలా పాలించబడుతున్నాయి, చివరకు మరలా ఎలా అతనిలో లీనమవుతున్నాయి. ఎన్నో కోట్ల జీవులను ఆయన సృష్టిస్తున్నాడు కదా, అందులో ముఖ్యంగా మానవుడు చేయవలసిన పనులేమిటి, ఎట్లు ఈ జన్మ లభిస్తోంది, మరలా జన్మించకుండా ఉండాలంటే ఏ ఏ పనులను ఆచరించాలి, వీటన్నింటికి సంబంధించిన జ్ఞానమంతా మనకి వేదాలలో చెప్పబడింది. అందరూ ఈ వేద విజ్ఞానాన్ని పొందలేరు కాబట్టి వారందరి కోసం ఏదైనా చెయ్యాలని ఆలోచించి, ఆ వేదాల సారాన్నంతా పురాణ -- ఇతిహాసాల రూపంగా మనకి అందించారు. అందులో మనకి పైకి రాజుల చరిత్రలు, ఏవేవో చక్కని కథలు చూపిస్తున్నా, లోలోపల భావం మాత్రం మనిషి మనిషిగా బ్రతికితే లోకం చేత ఎలా కీర్తింపబడతాడు. జేవితంలో తనకు ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తూ భగవంతుడిని చేరే మార్గంలో ఎలా పయనించాలి. మనం పాటించవలసిన ధర్మాలు ఏమిటి, వీటి గురించి జ్ఞానం మనకు అందించటమే వారి లక్ష్యం. ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మికత పెంపొందించటమే వారి రచనలయొక్క ఆశయం. కాబట్టి మనం ఆ పరమాత్మను చేరాలి అంటే ఎంతో కష్టమేమో అని అనుమానాలు పెట్టుకుని, కంగారు పడవలసిన అవసరం లేదు. అసలంటూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే మనల్ని అవతలి ఒడ్డుకు చేర్చడానికి ఎన్నో సాధనాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవటానికి ఎన్నెన్నో ఉపాయాలు మనకు కనబడతాయి. వీటన్నిటి సహాయంతో నెమ్మదిగా ఈ సాగరాన్ని ఈదుకుంటూ అవతలి ఒడ్డున ఉన్న పరమాత్మ స్థానాన్ని మనం చేరుకుందామా.


తెనాలిరామలింగ కథ

తెనాలిరామలింగ కథ

నల్లకుక్కను కర్రిఆవుగా చేయుట---

తెనలిరామలింగ కవి అంటే తెలియనివారు ఎవరూ ఉండరు కదా ? అతని కథలు మనకు హాస్యాన్ని తెప్పిస్తాయి, ఆలోచింపచేస్తాయి కూడా. అటువంటి కథలలో ఒకటి మనం ఈ రోజు చెప్పుకుందాము.    

శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానములో చాలాకాలం నుండి విశ్వాసపాత్రుడు, పనిలో నైపుణ్యం కలవాడు అయిన ఒక మంగలివాడు ఉండేవాడు. ఆ మంగలివాడు ఎప్పుడూ దైవభక్తి కలిగి సదాచారపరాయణుడై కాలం గడుపుతూ ఉండేవాడు. అతని విశ్వాసము చూసి రాయలువారికి ముచ్చటవేసి "ఒరేయ్ అబ్బీ ! నీకేమి కావాలో కోరుకో" అని అన్నారు. అప్పుడామంగలి "మహాప్రభో ! నేను చిన్నప్పటినుండి నిష్టాగరిష్టుడనై భక్తిశ్రద్ధలతో ఎన్నో పూజలూ, నోములు చేశాను. నన్ను ఎలాగైనా బ్రాహ్మణునిగా మార్చండి" అని రాయలవారిని బ్రతిమాలాడు. రాయలువారు సరేయని రాజపురోహితులను పిలచి ఇతనిని బ్రాహ్మణునిగా మార్చండి అని ఆజ్ఞాపించెను.

రాజపురోహితులు తెల్లబోయి, అడ్డుచేబితే రాజు ఎక్కడ దండనవిధిస్తాడో అని భయపడి, ఆ మంగలిని ప్రతీరోజు నది ఒడ్డుకు తీసుకువెళ్ళి, హొమాదిజపములు చేయిస్తూ, మంత్రోచ్ఛారణ చేస్తూ కాలం గడుపుతున్నారు. ఈ సంగతి ఒకరోజు తెనలిరమలింగనికి తెలిసింది. ఒక రోజు అతడు కూడా ఒక నల్లకుక్కను వెంటబెట్టుకుని నదిఒడ్డుకి వెళ్ళి, కుక్కను నీటిలో ముంచుతూ, కొన్ని బీజాక్షరాలను చదువుతూ ఉన్నాడు.

మంగలిని బ్రాహ్మణునిగా ఎంతవరకు మార్చారో తెలుసుకుందాము అని రాయలవారు ఒకరోజు నదిఒడ్డుకి వచ్చారు.  నది ఒడ్డున---- ఒకపక్క రాజపురోహితులు మంగలిని, మరోపక్క రామలింగడు కుక్కని నీటిలో ముంచుతూ మంత్రాలూ చదవటం చూసారు. ఆ రెండు దృశ్యాలు చూసి, రామకృష్ణుని అవస్థ చూసి రాయలు వారు పకపక నవ్వి రామలింగడిని ఇలా ప్రశ్నించారు, " ఓయీ రామకృష్ణా ! నేకేమైన పిచ్చిపట్టినదా, కుక్క-- కుక్కే గానీ--- కర్రిఆవు ఎలా అవుతుందీ" అని. అంతట  రామకృష్ణుడు రాయలవారిని " పిచ్చి నాకు కాదు మీకే, లేకపోతే మంగలి బ్రాహ్మణుడు ఐతే, కుక్క గోవుగా ఎందుకు మారకూడదు ?"... అని ఎదురుప్రశ్న వేసెను.

ఆమాటకు రాయలవారికి జ్ఞానోదయం అయ్యి, తనతప్పు తెలుసుకొని, తనకి బుద్ధి తెప్పించటానికే రామలింగడు ఇలా చేసాడని తలచి బ్రాహ్మణులు చేసే పనిని ఆపివేయించెను.



టిట్టిభ పక్షులు

టిట్టిభ పక్షులు

(టిట్టిభ పక్షుల యొక్క పట్టుదలను తప్పుగా అంచనా వేసిన సముద్రుడు వాటితో, వైరానికి దిగి, పరాభవం పాలయ్యినట్టు, శత్రువు యొక్క తెలివితేటలని సరిగ్గా తెలుసుకోనివాడు ఓడిపోతాడు.)   

ఒకానొక కాలములో సముద్రం దగ్గర రెండు టిట్టిభ పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ రెండు పక్షులు ఎంతో సంతోషంగా ఉండేవి. ఆడపక్షి గుడ్లుపెట్టే సమయము వచ్చింది. ఆ పక్షి దంపతులు ఎక్కువ గుడ్లు పెట్టాలన్న విషయం మీద వాదులాడుకోసాగాయి. మగపక్షి ఆ సముద్రపు ఒడ్డునే ఇసకలో గుడ్లు పెట్టమని చెప్పింది. కానీ ఆడ పక్షి సముద్రపు అలలలో గుడ్లు కొట్టుకు పోతాయేమోనని భయపడసాగింది. కానీ మగపక్షి.....ఆడపక్షి  మాట వినలేదు......సముద్రుని వల్లే కాదు ఎవరివల్లా ఏ భయము ఉండదని నొక్కి చెప్పింది. ఆ మాటలని విని సముద్రుడు నవ్వుకున్నాడు. 

ఆడపక్షి సముద్రతీరాన్నే గూడుకట్టి గుడ్లు పెట్టింది. ఆ పక్షులు ఆహారము కోసం వెళ్ళినప్పుడు సముద్రుడు తన అలలతో ఆ గూటిని గుడ్లను నీటిలోకి లాక్కునిపోయాడు. 

గూడు గుడ్లతో సహా మాయమయ్యినందుకు పక్షులు చాలా బాధపడ్డాయి. సముద్రుని మీద కోపించి నీటిని తొడివేసి ఆ సముద్రున్ని ఎండగట్టాలని నిశ్చయించుకొన్నారు. తమ ముక్కులతో నీటిని తోడి, దూరంగా పోయసాగాయి. అంతులేని మహాసాగరాన్ని తమ చిన్న-- చిన్న ముక్కులతో ఎందకట్టటం సాధ్యమయ్యే పనేనా?అయినా ఆ పక్షులు అలా పట్టువదలకుండా అసాధ్యమయినా ఆ పనిని చేస్తూనే ఉన్నాయి 

వాటి పట్టుదలను చూసి. పక్షులరాజైన గరుక్మంతుడు జాలిపడ్డాడు. సముద్రుని మీదకు యుద్దానికి వచ్చాడు . సముద్రుడు భయపడి వాటి గుడ్లను తిరిగి ఇచ్చాయి. ఆ పక్షులు సుఖంగా జీవించాయి. 

నీతి:---పట్టువదలకుండా పనిచేసేవాడికి అన్ని సానుకూలమవుతాయి.


ఏకలవ్యుడు

ఏకలవ్యుడు

మన పురాణాలలో చెప్పుకోదగిన మహానుభావులు ఎందరో ఉన్నారు. అందులో ఏకలవ్యుడు ఒక మహానుభావుడు. ఈ రోజు ఏకాలవ్యుడుని గురించి తెలుసుకుందాము.

హిరణ్యధనువనే ఒక బోయరాజు ఉండేవాడు. అతనికి ఏకలవ్యుడనే ఒక కుమారుడున్నాడు. ఏకలవ్యుడు చాలా చురుకుదనం, పట్టుదల కలవాడు. అతడు విలువిద్య నేర్చుకోవాలని అనుకున్నాడు. ఆ కాలంలో ద్రోణాచార్యుడు పాండవులకు, కౌరవులకు ధనుర్విద్య నేర్పించేవాడు. అందుచేత ఏకలవ్యుడు ద్రోనచార్యులవారి దగ్గరకు వెళ్ళి, తనకు విలువిద్య నేర్పమని ప్రార్ధించాడు. కానీ ద్రోణాచార్యుడు అతన్ని తన శిష్యునిగా అంగీకరించలేదు.

ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వద్ద సెలవు తీసుకుని తానున్న అడవికి వెళ్ళిపోయాడు. గురువు దొరకలేదని అతడు నీరుగారిపోలేదు. అతడి పట్టుదల మరింత పెరిగింది. అడవిలోనే ఒక గుడిసె నిర్మించుకుని, ఏకలవ్యుడు స్వయంగా మట్టితో ద్రోనాచారుల విగ్రహాన్ని చేసుకుని, అతనినే గురువుగా స్వీకరించాడు. ప్రతీరోజూ భక్తితో ఆ విగ్రహాన్ని ప్రదక్షిణ నమస్కారములు చేసి, బాణాలు వేయడాన్ని నేర్చుకొనసాగాడు. తనంతట తానుగా, ఒంటరిగా, గంటల తరబడి సాధన చేయసాగాడు. రోజంతా ధనుర్విద్య గురించే ఆలోచించేవాడు, కలలుకనేవాడు. విలువిద్యను గురించిన ఆలోచనలతో అతని మనస్సంతా నిండిపోయింది. దానితో అతని మనస్సే అతనికి గురువై, ధనుర్విద్యలోని మెలకువలను, గొప్పగొప్ప రహస్యాలని తెలియచేసింది. క్రమంగా తన గొప్ప సంకల్పశక్తి వల్ల, గురువుమీద ఉన్న అఖండమైన భక్తి వల్ల, విలువిద్యలో ఏకలవ్యుడు గొప్ప ప్రావీణ్యతను సంపాదించాడు. దాని ఫలితంగా అతడు ధనుర్విద్యలో అందరినీ, చివరకు తన గురువును కూడా మించిపోయాడు.

ఏదైనా సరే నేర్చుకోవాలనే బలమైన కోరిక(ఆకాంక్ష)ఉన్నవానికి అతని మనస్సే గురువై అన్నీ నేర్పిస్తుందని మనకు ఏకలవ్యుని చరిత్ర ద్వారా తెలుస్తుంది.

 
           

కలవారికోడలు కలికి కామాక్షి

కలవారికోడలు కలికి కామాక్షి

(కొత్తగా పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళిన చెల్లెల్ని పుట్టింటికి తీసుకురావటానికి, ఆమె పెద్దఅన్నయ్య చెల్లెలి యొక్క ఇంటికి వెళ్ళగా, చెల్లెల్ని పుట్టింటికి తీసుకువచ్చేటప్పుడు పాటించే సంప్రదాయము గురించి ఈ పాట మనకు తెలియజేస్తుంది.)

కలవారి కోడలు -- కలికి కామాక్షి
కడుగుతున్నది పప్పు -- కడవలోపోసి

అప్పుడే వచ్చెను --ఆమె పెద్దన్న
కాళ్ళకూ నీళ్ళిచ్చి -- కన్నీరు నింపే

ఏడవకు ఓ చెల్లి --ఏడవకు నా తల్లి
తుడుచుకో కన్నీరు -- ముడుచుకో కురులు

పుట్టింటికే నిన్ను --- తీసుకెళతాను
నీ అత్తమామలను -- అడిగిరావమ్మ

పట్టె మంచము మీద --- పడుకున్న ఓ మామ
మా అన్న వచ్చాడు -- నను పంపుతారా

నేనెరుగ నేనెరుగ --- నీ అత్తనడుగు

పెద్దపీట మీద కూర్చున్న --- ఓ అత్తా
మా అన్న వచ్చాడు -- నను పంపుతారా

నేనెరుగ నేనెరుగ --- మీబావనడుగు

భారతం చదేవేటి --- ఓ బావగారు
మా అన్న వచ్చాడు -- నను పంపుతారా

నేనెరుగ నేనెరుగ --- మీ అక్కనడుగు

వంటలు చేసేటి --- ఓ అక్కగారు
మా అన్న వచ్చాడు -- నను పంపుతారా

నేనెరుగ నేనెరుగ --- నీ భర్తనడుగు

రచ్చలో కూర్చున్న --- రాజేంద్ర భోగి
మా అన్న వచ్చాడు -- నను పంపుతారా

కట్టుకో బట్టలు --- పెట్టుకో నగలు
పుట్టినింటికి వేగ --- పోయి రావచ్చు.


సీతారాముల దాంపత్యం.....మనకు కావాలి ఆదర్శం

సీతారాముల దాంపత్యం.....మనకు కావాలి ఆదర్శం

పతిసేవలోనే సతికి మోక్షమని తెలియచేసే రమణీయమైన కథ రామాయణ గాథ. అన్నమాట జవదాటని తమ్మునిగా లక్ష్మణుడు పాటించిన నియమాలు, మానవులమైన మనలో ఎంతమంది తమ్ముళ్ళు ---- అన్నమాటని పాటిస్తున్నారు.

తండ్రిమాట జవదాటని తనయునిగా శ్రీరామచంద్రుడు.... మానవజన్మనెత్తి, కష్టాలకోర్చి, సమస్యలను ఎలా అధిగమించాలో.... తాను కష్టాలను  అనుభవిస్తూ.... మనలను కూడా కష్టాలువస్తే భయపడకుండా ధైర్యం వహించి, ఎలా నిలబడాలో తెలుపుతూ, అతనికి దైవశక్తి ఉన్నప్పటికీ ఉపయోగించుకోకుండా కేవలం మానవ మాత్రునివలె నడుచుకుంటూ, అతని మార్గంలో మనలని కూడా నడవమన్న ఆదర్శపురుషుడు.....మన శ్రీరామచంద్రమూర్తి. 

అయోనిజగా అవనిపైకి వచ్చి, ఎన్ని కష్టాలువచ్చిన, పతినొదిలిపెట్టి, సతి ఉండకూడదనే నగ్నసత్యాన్ని స్త్రీలకు చాటిచెప్పిన పతివ్రతాశిరోమణి మన సీతమ్మ.                 

అన్నను వదిలిపెట్టి ఉండలేక---అన్న కోసం, కన్న తల్లిదండ్రులనీ, భార్యనీ కూడా వదిలి,  అడవులకేగిన లక్ష్మణుడు మనకందరకు ఆదర్శ పురుషుడు.

శ్రీరాముడు తాను పరమాత్మ ఐనప్పటికీ, మహిమలున్నప్పటికి, ఏనాడూ, ఎవ్వరికి ఆ విషయం ఎవ్వరికి తెలియచేయలేదు.

అటువంటి ఆదర్శవ్యక్తుల యొక్క జీవితచరిత్రలను ఎంతచెప్పుకున్నా తనివితీరదు. అటువంటివారి గురించి విన్నా, తలచినా ఎంతో పుణ్యము, ధన్యులము.


జీవితచక్రం

జీవితచక్రం

పరమాత్మ మనకి జన్మనిచ్చినది మొదలు

మళ్ళీ మన ఆత్మ పరమాత్మలో కలిసే వరకు గల మన జీవితచక్రం.


తులసితల్లికి నమస్కరిస్తూ పాట

తులసితల్లికి నమస్కరిస్తూ పాట

శ్రీ తులసితల్లీ జయమంగళం
శుభముల నొసగి మా కభయ మోసంగుమమ్మా

శ్రీహరికే నీవు ప్రియమాలికవైనావు
భక్తులెల్లరిని పరిపాలించు ఓ జననీ

ఇహపరాలకు నీవు ఏలికవైనావు  
కల్పతల్లివి మమ్ము కరుణించు పావనీ

శ్రీతులసీ మహాలక్ష్మీ నెలవైన లోగిళ్ళు
సిరిసంపదలతో తులతూగు వెయ్యేళ్ళు


మంచిపనులు

మంచిపనులు

పితృవాక్య పరిపాలన వల్ల శ్రీరాముడు కీర్తి వహించెను.

మాతృవాక్య పరిపాలన వల్ల గరుడుడు యశము పొందెను.

సత్యవ్రతముచేత హరిశ్చంద్రుడు ఖ్యాతి పొందెను.

దానము చేత బలిచక్రవర్తి ఘనతకెక్కెను.

ఓర్పు చేత ధర్మరాజు పూజ్యత నొందెను.

పెద్దలు తలపెట్టిన పని నెరవేర్చి, భగీరథుడు ప్రఖ్యాతి గాంచెను.

కావున ఇటువంటి మంచి కార్యములు మానవ మాత్రులు ఎవరైనా చేసిన యెడల, వారు కూడా చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతారు.


ఆధ్యాత్మిక విషయాలు

ఆధ్యాత్మిక విషయాలు

మానవజీవితం ఆనందనందనవనం కావాలనే జగత్కల్యాణ కాంక్షతో జ్ఞానులైన మహర్షులు ఆధ్యాత్మిక విద్యను లోకానికి అనుగ్రహించారు. ఆ ఆధ్యాత్మిక విషయాలని కొన్నిటిని నేను మీకు అందిస్తున్నాను.

మన చేజేతులా మన అదృష్టాన్ని (జీవితాన్ని) ఎలా పాడుచేసుకుంటున్నామో తెలియచేసే కొన్ని విషయాలు, ఇప్పుడు చెప్పుకుందాము. 

ఎన్నో జన్మల పుణ్యఫలం మనకు లభించినటువంటి మానవజన్మ, ఏదైనా ఒక విలువైన వస్తువుని చిన్న పిల్లవానికి ఇస్తే దాని విలువ తెలియక దానితో ఆడి ఆ వస్తువుని పాడుచేసుకుని, కొంత వయసు వచ్చిన తరవాత చిన్ననాడు తాను ఆటలాడి పాడుచేసిన వస్తువు యొక్క విలువ తెలుసుకుని అయ్యో ఆరోజు ఇంట విలువైన వస్తువు నా చేతికి వస్తే చేజేతులా ఎందుకూ పనికిరాకుండా చేసుకున్నా, కానీ ఈరోజు మళ్ళీ అంతగొప్ప వస్తువుని పొందటానికి, సంపాదించటానికి నాదగ్గర శక్తి లేదే, దానిని సాధించటానికి తగిన పరిస్థితులు లేవే అని ఎలాగైతే బాధపడుతూ ఉంటాడో, అదే విధంగా భగవంతుడు ఎంతో విలువైన మానవజన్మను మనకు ప్రసాదిస్తే దానిని సద్వినియోగపరచుకోక, ఏదో డబ్బు సంపాదించుకోవటానికో శారీరక సుఖాలను అనుభవించటానికో మన కంటికి కనిపించేవే మనం అనుభవిస్తూనే శాశ్వత ఆనందాన్ని ఇచ్చేవని భావిస్తూ కాలాన్ని గడిపి వేస్తున్నాము. 

కాని దాని విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా, ఇన్నాళ్ళు అంతా నావాళ్ళు అని వారికోసం ఎంతో శ్రమపడి, అవసరమైతే ఎదుటవారిని మోసం చేసి కూడా లక్షలు ఆర్జించిపెట్టి, భోగాలను అనుభవిస్తూ పెచ్చు మీరిన శారీరిక సౌఖ్యాలతో శరీరమంతా వివిధమైన రోగాలతో నిండిపోయి అసలు సహకరించని స్థితికి వచ్చాక ఇన్నాళ్ళు నావాళ్ళు అని భావించినవారంతా వీనిని భారంగా భావిస్తూ ఇంత ముద్ద పడేసి, తిడుతూ ఉంటే, పిచ్చివాడిలా పడి తిరుగుతూ, చిట్టచివరికి మనఃశాంతి కోల్పోయినప్పుడు తెలుస్తుంది. 

అప్పటికి జ్ఞానోదయం కలిగి భగవంతుడా ఎంత పాపాత్ముడవయ్యా ! ఇన్నాళ్ళు అజ్ఞానంతో ఇదే సుఖమైన జీవితం అని, ఇవే జీవిత లక్ష్యాలని, నీవు నాకు ఈ శరీరాన్ని ఇచ్చింది ఇవన్నీ అనుభవించి ఆనందించడానికని భావించి ఇవన్నీ క్షణికమైనవని తెలుసుకోలేక అసలు ఆనందం అంటే ఏమిటో తెలియక పరమానంద స్వరూపుడైన నిన్ను సేవించక, నిజమైన ఆనందాన్ని పొందలేక, ఇప్పుడు బాధపడుతున్నానయ్యా. అయ్యో నన్ను నీవు ఈ శరీరంలోంచి తీసుకువెళ్ళిపోయే సమయం వచ్చేస్తోందే మరి నేను చేసిన పాపకర్మల ఫలితంగా నాకు ఏ తుచ్చమైన నీచమైన జన్మను ప్రసాదిస్తావో, ఇక ఈ అంతిమ సమయంలో నేను ఎప్పుడు నిన్ను గూర్చి పరిపూర్ణంగా తెలుసుకోగలను. ఎన్నడు నిన్ను సేవించగలను. ఎన్నడు పూజించగలను. ఎన్నడు కీర్తించగలను. ఎన్నడు నిన్ను చేరగలను. నేను ఈ జననమరణాల కాలచక్రంలో పడి నలగవలసిందేనా, జన్మ తరించే మార్గమే లేదా అని గుండెలు బాదుకుని ప్రయోజనం ఏమున్నది. మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలో కొంచెం ఆలోచించండి.  


శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారి కళ్యాణము

శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారి కళ్యాణము 

స్వామివారి కళ్యాణము చూతము రారండి. చైత్రశుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. అందరమూ వెళ్ళి చూద్దాము రండి.  
   

ఉత్తరాంధ్రలో  పేరొందిన పుణ్య క్షేత్రం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారు వెలసిన సింహాచలం. ఇది విశాఖపట్టణానికి దగ్గరలో ఉన్నది. కొండ దిగువ గ్రామాన్ని అడివివరం అంటారు.  ఇక్కడే వరాహ పుష్కరిణి ఉన్నది.  యాత్రికులు ఇందులో స్నానమాచరించి, నూరువరాల పూమాలలు మెడలో వేసుకుని, తోలిపావంచ(మెట్ల మొదట) వద్ద కొబ్బరికాయ కొట్టి, మెట్ల మార్గంలో కొండ ఎక్కుతారు. కొండమీదకి బస్సు సౌకర్యము కూడా కలదు. మెట్ల మార్గం మధ్యలో ఆంజనేయ స్వామి కోవెల ఉంది. దారి పొడుగునా 12 జలధారలు ఉన్నాయి. కొండమీద గంగధార ఉన్నాది. ఈ ధార ఎక్కడ నుండి వచ్చిందో ఇంతవరకు ఎవరికీ అంతుబట్టలేదు. ఈ ధార కొండమీద ఉన్న చెట్ల వేర్లు తగిలి రావడంతో, ఔషధగుణాలు కలిగి ఉంటుంది. అందువల్ల ఈ గంగధార నీరు సేవించటం వల్ల సకల రోగాలు పోతాయని ప్రతీతి. 


భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించి, గంగధారలో స్నానమాచరించి, స్వామి దర్శనం చేసుకుంటారు. గర్భగుడి పక్కన, "కప్పస్థంభం"(కోర్కెలు తీర్చే కల్పవల్లి) ఉన్నది. దీనికి తగిన రుసుము చెల్లించి, కౌగలించుకొనిన తమ కోర్కెలు తీరునని వాడుకలో ఉన్నది. 

సింహాచలం అనగానే ముందుగా గుర్తుకువచ్చేవి "సంపెంగపూలు". ఈ కొండ అంతా సంపెంగ, జీడి, పనస & అనాస తోటలతో నిండి ఉంటుంది. 


ఈ కొండమీద శిల్పకళా సౌందర్యం చూడాలేగానీ, వర్ణించతరము కాదు. ప్రతీ శిల్పం అపురూపం. 



తిరుమలలో అన్నమయ్య వలె, సింహాచలంలో శ్రీ కృష్ణమాచార్యులు వారు పేరొందిన కవి. ఇతను పుట్టుకతో అంధుడు. స్వామిని కీర్తించుటవల్ల, స్వామి కృపచే ఇతనికి చూపు వచ్చింది. చతుర్వేద, అష్టాదశ పురాణాది, సమస్త రహస్యాలు తెలుసుకుని, ఆ స్వామిని తన సంకీర్తనలతో అర్చించారు. రాగిరేకులపై గ్రంధాలు రాసే పద్దతి, ఈయన నుండే తాళ్ళపాక వారికి వచ్చిందని అంటారు. ఈయన ప్రథమ వచన, సంకీర్తన, కవితాచార్యునిగా ప్రసిద్ధి. ఈయన పాడుతూ ఉంటే, సింహాద్రినాథుడు బాలరూపంలో ఎదుటనిలిచి నాట్యమాడేవాడట. 


హిరణ్యకశిపుని వధించిన పిమ్మట, బ్రహ్మ గారు, ఇంద్రాదిదేవతలతో, సింహగిరికి వచ్చి, నృసింహవారికి  చైత్రశుద్ధ ఏకాదశి నాడు 5 రోజులు కళ్యాణము జరిపించినట్లు, క్షేత్రమహత్యం తెలియచేస్తోంది. అదే విధంగా నేటికీ యధావిధిగా 5 రోజుల కళ్యాణం జరుగుతుంది. శ్రీ మహాలక్ష్మీ సాగరకన్య కాబట్టి, రధోత్సవంలో విశాఖ జాలర్లు కొబ్బరికాయ కొట్టి రథం లాగుతారు, జాలరి నాయకుడు రథసారథిగా ఉంటాడు. కల్యాణంలో భాగంగా, ఎదురు సన్నాహం, రథయాత్ర, కళ్యాణం, నాగవల్లి, సదస్యం, దొంగలదోపు, ఉంగరపుసేవ, పుష్పాంజలి వంటి వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకలలో భాగమైన ఉంగరపు సేవ ఎంతో వినోదంగా జరుగుతుంది. 7 మేలుముసుగులతో స్వామి గాలోగోపురం ఎదుట, కొలువుతీరి ఈ వినోదాన్ని తిలకిస్తాడు. 





శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి కళ్యాణము చూచిన, విన్నా జన్మధన్యమవుతుంది. స్వామికళ్యాణము చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేగాని లభించదు.                        


సర్వేజనా సుఖినోభవంతు