March 28, 2014

నిత్య పూజా విధానం

నిత్య పూజా విధానం:

యాంత్రికజీవన విధానములో దేవుని పూజకి కేటాయించే సమయం కూడా విలువైనదిగానే కనిపిస్తుంది. కాని కాలమెంత విలువైనదైనా ఇంత విలువైన మానవజన్మ ఇచ్చిన ఆ దైవానికి 24 గంటల సమయంలో, 24 నిమిషాలైనా అవకాశం కల్పించుకుని, భక్తిగా భగవంతుడిని తలచుకున్నా, పూజ చేసుకున్నా, మనజన్మకు సార్థకత లభిస్తుంది అన్న ఆశతో ఈ పూజా విధానమును మీకు తెలియచేస్తున్నాను. 
                        
ఉదయముననే శుచిగా స్నానమాచరించి, నుదుటన కుంకుమబొట్టు దిద్దుకుని, దేవుని దగ్గర కూర్చుని, దీపాలని వెలిగించి, పుష్పాలతో దైవాన్ని అలంకరించుకుని, ఇప్పుడు ఒక పాత్రలో నీరు తీసుకుని, తులసిదళం వేసి, లోపలకు 3 సార్లు తీసుకోవాలి. తరువాత మీ ఇష్టమైన దైవాన్ని స్మరిస్తూ, అష్టోత్తర శత నామాలతో అర్చించుకుని, మనం తినే ఆహారాన్ని దైవానికి నివేదన చెయ్యాలి. 

ఎందుకంటే అతని అనుగ్రహ ప్రభావం వల్లనే కదా మనం ఈమాత్రం సంపాదించుకొని సుఖంగా జీవనం గడుపుతున్నాం. నైవేద్యం పెట్టి ఏది తిన్నా అది దైవ ప్రసాదంతో సమానం. నైవేద్యం పెట్టకుండా తింటే అది దొంగతనం చేసి సంపాదించిన సొమ్ముతో వండిన ఆహారం అన్నమాట. ఆ దైవానుగ్రహం వలన సంపాదించినదా లేక వేరే విధంగా సంపాదించినదా అనేది మనం గ్రహించాలి. మనం తినే ఆ ఆహారపదార్థమైన ఆ దేవదేవునికి సమర్పించాల్సిందే (ఈ విషయం మనం భక్తకన్నప్ప నుండి నేర్చుకోవాలి).

చివరిగా హారతి ఇచ్చి దైవానికి కృతజ్ఞత తెలుపుకుని మన దైనందిక చర్యలు ప్రారంభం చేసుకోవచ్చును. అతని కృప వల్లనే అని అతనికి thanks చెప్పటంలో తప్పేమి లేదు నష్టం అంతకంటే లేదు కదా! thanks చెప్పినందుకు ఆ దైవం బాగా సంతోషించి మనం చేసే పనులు అన్నీ కూడా అనుకూలంగా జరిగే విధంగా చూస్తాడు. ఈ మాత్రమైనా చేసుకున్నట్లయితే మనం ధన్యులమేగా. 


No comments:

Post a Comment