తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
ప్రక్క తోడుగా భగవంతుడు తన
చక్రధారియై చెంతనె యుండగ
మ్రుచ్చు సోమకుని మును జంపిన యా
మత్స్యమూర్తి మన పక్షము నుండగ
సురల కొరకు మందర గిరి మోసిన
కూర్మావతారుని కృపమనకుండగ
హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా
పరచిన నరహరి ప్రక్కనే యుండగ
భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ
దశగ్రీవుమును దండించిన యా
దశరథ రాముని దయ మనకుండగ
దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీ
కృష్ణుడు మనపై కృపతో నుండగ
రామదాసునిల రక్షించెదనని
ప్రేమతో పలికిన ప్రభువిటనుండగ
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
ప్రక్క తోడుగా భగవంతుడు తన
చక్రధారియై చెంతనె యుండగ
మ్రుచ్చు సోమకుని మును జంపిన యా
మత్స్యమూర్తి మన పక్షము నుండగ
సురల కొరకు మందర గిరి మోసిన
కూర్మావతారుని కృపమనకుండగ
హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా
పరచిన నరహరి ప్రక్కనే యుండగ
భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ
దశగ్రీవుమును దండించిన యా
దశరథ రాముని దయ మనకుండగ
దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీ
కృష్ణుడు మనపై కృపతో నుండగ
రామదాసునిల రక్షించెదనని
ప్రేమతో పలికిన ప్రభువిటనుండగ
No comments:
Post a Comment