May 27, 2020

అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి

అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి



అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి

ముదముతో సీత ముదిత లక్ష్మణుడు
కదసి కొలువగా రఘుపతి ఉండెడి
చారు స్వర్ణ ప్రాకార గోపుర
ద్వారములతో సుందరమై యుండెడి

అనుపమానమై అతిసుందరమై
తనరు చక్రమది ధగ ధగ మెరిసెడి

కలియుగమందున నిల వైకుంఠము
అలరుచునున్నది నయముగ మ్రొక్కుడి

శ్రీకరముగ నిల రామదాసుని
ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము

No comments:

Post a Comment