శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై ఉన్నది
శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది
శ్రీరాముల కరుణయే లక్ష్మీ కరమై యున్నది
ఘోరమైన పాతకములు గొట్టేనన్నది
మమ్ము జేరకుండ ఆపదలను చెండేనన్నది
దారి తెలియని యమదూతల తరిమేనన్నది
శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది
శ్రీరాముల కరుణయే లక్ష్మీ కరమై యున్నది
ఘోరమైన పాతకములు గొట్టేనన్నది
మమ్ము జేరకుండ ఆపదలను చెండేనన్నది
దారి తెలియని యమదూతల తరిమేనన్నది
శ్రీమన్నారాయణ దాసులకు చెలువైనది
మాయావాదుల పొందు మానుమన్నది
ఈ కాయ మస్థిరమని తలపోయు చున్నది
వదలని దుర్విషయ వాంచ వదలమన్నది
నా మదిలో హరి భజన సంపత్కరమైయున్నది
ముక్తిమార్గమునకిది మూలమన్నది
విరక్తుండు భద్రాచల రామదాసుడన్నది
మాయావాదుల పొందు మానుమన్నది
ఈ కాయ మస్థిరమని తలపోయు చున్నది
వదలని దుర్విషయ వాంచ వదలమన్నది
నా మదిలో హరి భజన సంపత్కరమైయున్నది
ముక్తిమార్గమునకిది మూలమన్నది
విరక్తుండు భద్రాచల రామదాసుడన్నది
No comments:
Post a Comment