పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయె పిలచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి
ఇరవుగ ఇసుకలోన పొరలిన యుడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి
రాతి నాతిగ జేసి భూతల మందు
ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి
ఎంత వేడిన గాని సుంతైన దయరాదు
పంతము సేయ నేనెంతటి వాడనయ్యా
శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగావా
కరుణించు భద్రాచల వర రామదాస పోష
No comments:
Post a Comment