May 27, 2020

రామ జోగిమందు కొనరే ఓ జనులారా

రామ జోగిమందు కొనరే ఓ జనులారా




రామజోగి మందుమీరు - ప్రేమతో భుజియించరయ్యా కామ క్రోధముల నెల్ల కడకు పారద్రోలే మందు కాటుక కొండలవంటి కర్మములెడబాపే మందు సాటిలేని జగమునందు స్వామి రామజోగి మందు కోటి ధనములిత్తునని కొన్నను దొరకని మందు సాటిలేని భాగవతులు స్మరణ చేసి తలచు మందు వాదుకు చెప్పినగానీ వాని పాపములు గొట్టి ముదముతోనే మోక్షమిచ్చే ముద్దు రామజోగి మందు ముదముతో భద్రాద్రియందు - ముక్తిని పొందించే మందు సదయుడైన రామదాసు - సద్భక్తితో గొలిచే మందు

No comments:

Post a Comment