హరి హరి రామ నన్నరమర చూడకు
హరి హరి రామ నన్నరమర చూడకు
నిరతము నీ నామ స్మరణయే మరను
దశరథ నందన దశముఖ మర్దన
పశుపతి రంజన పాప విమోచన
మణిమయ భూషణ మంజుల భాషణ
రణజయ భీషణ రఘుకుల పోషణ
పతితపావన రామ భద్రశైల ధామ
సతతము శ్రీ రామదాసుడ నేను
దశరథ నందన దశముఖ మర్దన
మణిమయ భూషణ మంజుల భాషణ
No comments:
Post a Comment