శ్రీనివాసుని సంకీర్తనలు....... 05
చినదాని చూపుల్లో కరుకు
చిన్ని కృష్ణయ్యకే సురుకు
కాంత మనసున ఏముందో
కలువ కన్నులవాడికే ఎరుకు
చూపులు కలిసిన శుభవేళ
మనసులు మురిసిన మల్లెలవేళ
మేఘమాయనే నాకాశము
మోహనమాయనే వృందావనం
కొండగాలి ఉరుకులాయే
సెలయేరు సిగ్గుమొగ్గలాయే
రాధామధవులు ఒక్కటాయే
అధరాలు అలల అలజడాయే
పూల పరువాలు పరవశమాయే
తుమ్మెద తేనెమధురిమతో తడిసిపొయే
తనువులు తీరము చేరిపోయే
తీపి జ్ఞాపకాలు తరంగాలాయే......
చినదాని చూపుల్లో కరుకు
చిన్ని కృష్ణయ్యకే సురుకు
కాంత మనసున ఏముందో
కలువ కన్నులవాడికే ఎరుకు
చూపులు కలిసిన శుభవేళ
మనసులు మురిసిన మల్లెలవేళ
మేఘమాయనే నాకాశము
మోహనమాయనే వృందావనం
కొండగాలి ఉరుకులాయే
సెలయేరు సిగ్గుమొగ్గలాయే
రాధామధవులు ఒక్కటాయే
అధరాలు అలల అలజడాయే
పూల పరువాలు పరవశమాయే
తుమ్మెద తేనెమధురిమతో తడిసిపొయే
తనువులు తీరము చేరిపోయే
తీపి జ్ఞాపకాలు తరంగాలాయే......
No comments:
Post a Comment