July 25, 2014

శ్రీనివాసుని సంకీర్తనలు.......30

శ్రీనివాసుని సంకీర్తనలు.......30

సింగమై దుమికినాడు శివమెత్తి నాడినాడు 
శంఖము మోగించకనే సమరము సాగించినాడు 

ఎరుపెక్కిన కళ్ళతో ఎర్రబారెనెవాడు
భారమైన హృదయంతో బరువయెనెవాడు

చిరుమందహాసుడు శివాలెత్తి శివమెత్తినాడు
చల్లనిచంద్రుడు భగభగమండే సూరీడైనాడు

వేచిచూసేవాడు విసుగై విసురుడైనాడే
వెన్నమనసున్నవాడు వేటాడే సింగమైనాడే

నిలువెత్తు నిండుకొండనైన నారాయుణుడు
మహోగ్రజ్వాలాప్రద్యుమ్నుడై మరిగినాడే

ఉడుకెత్తు ఉచ్వాసనిశ్వాసాలతో ఉూగినాడే
అదిరించు బెదిరించు రక్కించు రుద్రనేత్రుడై

మెరుపులను మెరిపించి ఉరుముల్ని ఉరికించి
పీడిగుల్నీ పుట్టించి ప్రళయమును సృస్టించి
నింగినేలపెక్కుటిల్లేల ప్రళయభయంకర రూపుడై

ఎలుగెత్తి పిలివగనే యముడల్లే కదిలి
స్తంభమున సమరమును మోగించి

తొడనెట్టి తీరుతెన్నెలు లేక చీరి
తాపమును తాళలేక తన్దనాలాడే
తిరువెంకట నరసింహుడు ......



No comments:

Post a Comment