కురుక్షేత్రయుద్దం నాటి జనాభ........
కురుక్షేత్రకాలంలో మనకు తెలిసి జనాభా లెక్కలు వెయ్యలేదు. కనుక నాటి జనాభా వివరాలు ఎవ్వరికీ తెలియవు. నిజానికి మొగలాయిల కాలంలో 4కోట్ల జనాభా అని మన విశ్లేషకులు చెప్పే మాటలకు కూడా ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఒక వేళ వున్నా మొగలాయిల కాలం కన్నా భారతయుద్ధకాలం పాతది కనుక జనాభా ఇంకా తక్కువుండాలన్నదే వీరి వాదన. అసలు వీరు అందరూ అనుకునే విధంగా మొగలాయిల కాలం కంటే తక్కువ జనాభా ఎందుకుండాలి? భారతం జరిగింది ద్వాపర యుగంలో! ఆ యుగంలో ఎందరొ చనిపోగా మిగిలిన అతితక్కువ జనాభాతో కొత్తయుగం (కలియుగం) మొదలయ్యింది అనుకోవచ్చుగా? అదే కదా మన భారతం చెప్పేది కూడా!!? అప్పుడు మహాభారత కాలం కంటే మొగలాయిల కాలంలోనే తక్కువమందే వుంటారు
కురుక్షేత్రయుద్దం నాటి సైన్యం
మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నదని మన పురాణాలు తెలియచేస్తున్నాయి. అయితే అక్షౌహిని అంటే ఎంత అన్న ప్రశ్నకు నన్నయ్య మహాభారత ఆది పర్వంలోని ప్రధమాశ్వాసంలొ 80వ పద్యంలో దాని స్వరూపాన్ని ఈ క్రింది విధంగా వివరించాడు.
ఒక రధము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు కలసిన సైన్యానికి "పత్తి" అని పేరు. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని"సేనాముఖము" అంటారు. సేనముఖానికి మూడు రేట్లను "గుల్మము" అంటారు.ఇందులో 9 రధాలు, 9 ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు "గణము". ఇందులో 27 రధాలు, 27 ఏనుగులు,81 గుర్రాలు,135 మంది కాలిబంట్లుంటారు.గణానికి మూడు రెట్లు "వాహిని". ఇందులో 81 రధాలు,81 ఏనుగులు,243 గుర్రాలు,405 మంది కాలిబంట్లుంటారు.
వాహినికి మూడు రెట్లు "పృతన" ఇందులో 243 రధాలు,243 ఏనుగులు,729 గుర్రాలు,1215 మంది కాలిబంట్లుంటారు. పృతనకు మూడు రెట్లు"చమువు" ఇందులో 729 రధాలు,729 ఏనుగులు,2187 గుర్రాలు,3645 మంది కాలిబంట్లుంటారు.
చమువుకు మూడు రెట్లు "అనీకిని" ఇందులో 2187 రధాలు,2187 ఏనుగులు,6561 గుర్రాలు,10935 మంది కాలిబంట్లుంటారు.అనీకినికి పది రెట్లయితే "అక్షౌహిని" అవుతుంది. అంటే అక్షౌహినిలో 21870 రధాలు, 21870 ఏనుగులు, 65610 గుర్రాలు, 109350 మంది కాల్బలము వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్త్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రధాలు, 3,93,660 ఏనుగులు, 11,80,980 గుర్రాలు, 19,88,300 కాల్బలము అన్నమాట. ఇక్కడ మరో విషయమేమిటంటే ఒక్కొక్క రధం మీద ఒక యుద్ద వీరునితో పాటు ఒక సారధి కూడా ఉంటాడు. కాబట్టి సారధులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రధబలం 7,87,329 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క యుద్ద వీరునితో పాటుగా ఒక మావటి వాడు కూడా ఉంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నిటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పల్గోనట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణులలో పాండవ బలం ఏడు అక్షౌహిణులు మాత్రమే. 8 అక్షౌహిణులు ఒక "ఏకము", ఎనిమిది ఎకములు ఒక "కోటి",(ఈ కోటి వేరు). ఎనిమిది కోట్లు ఒక "శంఖము", ఎనిమిది శంఖములు ఒక "కుముదము",ఎనిమిది కుముదములు ఒక "పద్మము", ఎనిమిది పద్మములు ఒక "నాడి",ఎనిమిది నాడులు ఒక "సముద్రము",ఎనిమిది సముద్రాలు ఒక "వెల్లువ".
అంటే 366917139200 మంది గల సైన్యానికి వెల్లువ అని పేరు. ఇటువంటి 70 వెల్లువల సైన్యం సుగ్రీవుని వద్ద ఉన్నట్లుగ కంబ రామాయణం చెబుతుంది.అంటె సుగ్రీవుని వద్ద 256842399744000 మంది వానర వీరులున్నారన్నమాట. వీరిలొ 67 కొట్ల మంది సైన్యాదిపతులు. వీరికి"నీలుడు" అధిపతి.
Courtesy By +venkatasumakavya hamsakerini

No comments:
Post a Comment