July 25, 2014

శ్రీనివాసుని సంకీర్తనలు.......27

శ్రీనివాసుని సంకీర్తనలు.......27

సిరిలచ్చుమమ్మో జర్ర జాగరతనమ్మొ 
సీనమ్మై వచ్చి వగలాడుతునాడమ్మో 

సీర సుట్టినాది, సింగారించినాది 
కాటుక దిద్డినాది , కుంకమ నద్దినాది

ముక్కర మెరిసినాది,లోలాకులు లాడించినాది
ముడి వేసినాది, మల్లెలు ముడిచినాది

గాజులేసీనాది, పట్టీలు పేర్చినాది
బుట్టబట్టినాది, తంబురా తట్టినాది

కుందనపు బొమ్మ కదిలినాది
కొండ దిగినాది కులుకులాడినాది

సోయగాల బొమ్మ సిరి లచ్చుమమ్మ
సోది చెపతానమ్మనని సరసమాడినాది

జరిగి,జరిగే,జరగబోయేది జెపతానమ్మ
గోరి వచ్చేనాధుడి వివరాలు విన్నవిస్తానమ్మ

మనసులోనున్నవాడు మాణీక్యమమ్మా
మనువాడేవాడు మూడులోకాలేలేవాడునమ్మా

సూర్యచంద్రులు సేతిన ధరించినోడమ్మా
సింహమంటి సిన్నోడు సెయ్యబడతాడమ్మ

ఏడుకొండలు దిగివస్తాడమ్మా, వెదుకుకొంటూ వస్తాడమ్మా
మూడు ముళ్ళు వేస్తాడమ్మా, ఏడుఅడుగులు వేస్తాడమ్మా
ఆంటూ
వయ్యారాల వరలచ్చుమమ్మ నీతో వగాలాడినాడమ్మా!
సోయగాల సిరీలచ్చుమమ్మ నీతో సరసాలాడినాడమ్మా!



No comments:

Post a Comment