April 26, 2013

ఫాల్గుణ పౌర్ణమి

ఫాల్గుణ పౌర్ణమి....

ఫాల్గుణ పౌర్ణమి రోజున హోలీ పర్వదినము అందరమూ జరుపుకుంటాము.....కాని ఆ రోజున మరో విశేషమైన రోజు కూడా .....అదేమిటంటే సింహాచలము లో వెలసిన శ్రీలక్ష్మివరాహనృసింహ స్వామి యొక్క పెళ్ళిచూపులు జరిగిన రోజు.....ఆ రోజున స్వామి కొండపైనుండి క్రిందికి దిగి వచ్చి........ గ్రామదేవతలైన, పైడితల్లమ్మ, బంగారమ్మ(సోదరిమణులు)ల కుమార్తెలను తనకిచ్చి వివాహము జరిపించవలసినదిగా, పురోహితులను మధ్యవర్తులుగా రాయబారము పంపుతారు. స్వామి దిగువనున్న పుష్కరిణి ఉద్యానవనములో విడిది చేస్తారు. చివరికి పెల్లిమాటలు కుదిరిన తదుపరి ప్రజలు ఆనందంతో ఒకరిపై ఒకరు వసంతాలు జల్లుకుని ఆనంద పరవసులౌతారు. స్వామి కుడా ఆనందంతో పరవసులై గ్రామప్రజలందరికి తన వివాహనిశ్చయ విషయం చెప్పి తన కళ్యాణానికి ఆహ్వానము పలుకుతూ గ్రామ తిరువీధి చేసుకుని మరల కొండపైకి వెళతారు..... స్వామి వివాహము చైత్ర శుద్ధ ఏకాదశి నాడు రాత్రి జరుగును..... స్వామి వివాహానికి అందరూ పెద్దలే, ఆహ్వానితులే........ ఈ ఫోటో హోలీ రోజున  సింహాచలము వెళ్ళి, స్వామిని దర్శించి తీసినది..



ఆంజనేయ దండకం

ఆంజనేయ దండకం:--


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్‍మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‍వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్‍దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్‍జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్‍ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్‍చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః.......





ఆహారశుద్ధి నియమం:-

-:ఆహారశుద్ధి నియమం:-

భోజన సమయములో ఇతరులపైన కోపిగించుకోకూడదు, భయంకర వార్తలువింటూ కాని, దృశ్యాలు చూస్తూ కాని చేయకూడదు, అలా చేస్తే రోగాలపాలు అవుతాము, ఇది నేను చెప్పిన మాట కాదు, మన పెద్దలు చెప్పిన మాట. 
మనస్సు మంచిగా ఉంటే ఎన్ని కష్టాలనైనా ఆనందంగా భరించగలుగుతాము. శారీరకముగా ఎన్ని సుఖములున్నను మనసు చెదిరతే దుఃఖమునే పెంచును.మనసుని ఉపయోగించుట మానవునికి లభించిన గొప్ప వరము. మనం తీసుకొనే ఆహారము యొక్క ప్రభావము, మన మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని అనేక విధాలుగా మనసుని పనిచేయించు ఆహారము కూడా సరిఅయిన రీతిలో సంస్కరించి తీసుకోవలెను. సాత్వికమైన ఆహారము(అనగా శాఖాహారము) ఆరోగ్యరీత్యా మంచిదని మన పూర్వీకులు చెప్పారు, వారు అటువంటి నియమాలు పాటించుటవల్లనే సతాధికులుగా జీవించారు అని చెప్పటంలో సందేహమేమీ లేదు. 


"జంతూనాం నరజన్మ దుర్లభం"--అన్నారు కదా మన పెద్దలు, అంటే మానవులను కూడా జంతువులమని చెప్పారు కదాని ఉత్తమమైన మానవుడు తనకంటే తక్కువగా అంచనా వేయు జంతువులను చంపి తినుట సంస్కారమేనా ? సంస్కరింప బడిన ఆహారము తినగలిగిన మనిషి, చెత్తా-- చెదారము తినేటి జంతువులను చంపి ఆహారముగా తీసుకోవచ్చునా,.. ఒక జంతువుని చంపి తిని తిరిగే జంతువులను క్రూర మ్రుగమందురు. శాఖాహారము తినే జంతువులను చూసి ఎవ్వరం భయపడము, అటువంటి వాటిని ఇంటిలో పెంచుకుంటాము. కనుక నియమము తెలుసుకుని, శాఖాహారములై సమస్త ప్రాణుల శ్రేయస్సును కోరుట మానవుని కనీస ధర్మము. మనమూ అటువంటి ధర్మాన్ని పాటిద్దామా... ....






జగన్నాధాష్టకం

జగన్నాధాష్టకం:--

రచన: ఆది శంకరాచార్య


కదాచి త్కాళిందీ తటవిపినసంగీతకపరో
ముదా గోపీనారీ వదనకమలాస్వాదమధుపః
రమాశంభుబ్రహ్మా మరపతిగణేశార్చితపదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 

భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే
సదా శ్రీమద్బృందా వనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 

మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
వసన్ప్రాసాదాంత -స్సహజబలభద్రేణ బలినా
సుభద్రామధ్యస్థ స్సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 

కథాపారావారా స్సజలజలదశ్రేణిరుచిరో
రమావాణీసౌమ స్సురదమలపద్మోద్భవముఖైః
సురేంద్రై రారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 

రథారూఢో గచ్ఛ న్పథి మిళఙతభూదేవపటలైః
స్తుతిప్రాదుర్భావం ప్రతిపద ముపాకర్ణ్య సదయః
దయాసింధు ర్భాను స్సకలజగతా సింధుసుతయా
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 

పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ నిహితచరణోనంతశిరసి
రసానందో రాధా సరసవపురాలింగనసుఖో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 

న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకితాం భోగవిభవం
న యాచే2 హం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూం
సదా కాలే కాలే ప్రమథపతినా చీతచరితో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 

హర త్వం సంసారం ద్రుతతర మసారం సురపతే
హర త్వం పాపానాం వితతి మపరాం యాదవపతే
అహో దీనానాథం నిహిత మచలం నిశ్చితపదం
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 

ఇతి జగన్నాథాకష్టకం



నిత్య ప్రార్థనా విధానం:-

నిత్య ప్రార్థనా విధానం

కరుణామూర్తి యగు ఓ సర్వేశ్వరా ! మా చిత్తము సర్వకాల సర్వావస్తలయందు నీ యందే ఉండునట్లు అనుగ్రహించు తండ్రీ. వేదాంతవేద్యా అభయ స్వరూప, మా మనస్సు నందు ఎన్నడును ఎట్టి దుష్ట విషయ సంకల్పము కాని, ఈర్ష్య ద్వేషాలు కాని కలుగకుండునట్లు అనుగ్రహింపుము తండ్రీ... మా వలన ఎవరికిని ఎట్టి అపకారము జరగకుండునట్లు మరియు ఇతర ప్రాణికోటికి ఉపకారము చేయు సద్బుదిని ప్రసాదింపుము తండ్రీ.... మా అజ్ఞానము నశించి, ఈ జన్మమునందే కడతేరి నీ సానిధ్యమునకు ఏతెంచుటకు వలయు భక్తీ--జ్ఞాన --వైరాగ్యములను ప్రసాదించుము.... అన్యధా శరణం నాస్తి......... రక్షమాం రక్షమాం రక్షమాం...... మాకు పవిత్రమైన మానవ జన్మనిచ్చి, కొంతైనా సంస్కారము ఇచ్చినందుకు.... ధన్యవాదములు...... అని ఎవరిస్టమైన దైవాన్ని వారు ఈ విధంగా ప్రార్ధించుకోవాలి ఇది మన పెద్దలు చెప్పిన సాంప్రదాయం...ఈ విధంగానే రాత్రి పడుకునే ముందు & ఉదయము లేచినప్పుడు భగవన్నామ స్మరణ చేసుకోవాలి .....




క్షీరాబ్దికన్య శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించిన రోజు

క్షీరాబ్దికన్య శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించిన రోజు

ఈ రోజు అనగా ఫాల్గుణశుద్ధ పూర్ణిమ నాడు, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో, పాల కడలినుండి క్షీరాబ్దికన్య శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించిన రోజు..... దేవదానవులు క్షీరసాగరమధనం చేసినప్పుడు హాలాహలం, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం, ధన్వంతరి మొదలయినవాటితోపాటు శ్రీమహాలక్ష్మీదేవి కూడా మనలని ఉద్ధరించటానికి ఉద్భవించిన రోజు... అందుకనే ఆ మహాతల్లిని ఒక్కసారి భక్తితో స్మరిద్దామా...........

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ||

నమస్తే‌உస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |
ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||

ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్....



                                

గంగా స్తోత్రం

గంగా స్తోత్రం

రచన: ఆది శంకరాచార్య

దేవి! సురేశ్వరి! భగవతి! గంగే త్రిభువనతారిణి తరళతరంగే |
శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే || 

భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః |
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామఙ్ఞానమ్ || 

హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే |
దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారమ్ || 


తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్ |
మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః || 


పతితోద్ధారిణి జాహ్నవి గంగే ఖండిత గిరివరమండిత భంగే |
భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువన ధన్యే || 


కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే |
పారావారవిహారిణి గంగే విముఖయువతి కృతతరలాపాంగే || 


తవ చేన్మాతః స్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః |
నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే || 


పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే |
ఇంద్రముకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే ||


రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపమ్ |
త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే ||


అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే |
తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః || 


వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః |
అథవాశ్వపచో మలినో దీనస్తవ న హి దూరే నృపతికులీనః || 


భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే |
గంగాస్తవమిమమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యమ్ || 


యేషాం హృదయే గంగా భక్తిస్తేషాం భవతి సదా సుఖముక్తిః |
మధురాకంతా పంఝటికాభిః పరమానందకలితలలితాభిః || 


గంగాస్తోత్రమిదం భవసారం వాంఛితఫలదం విమలం సారమ్ |
శంకరసేవక శంకర రచితం పఠతి సుఖీః తవ ఇతి చ సమాప్తః || 




శ్రీ కృష్ణాష్టకం

శ్రీ కృష్ణాష్టకం:

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ||

అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ |
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ||

కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ |
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ||

మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ||

ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ||

రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ |
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ||

గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ |
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ||

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ |
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ||

కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||



సాయంకాలం దీపం వెలిగించేటప్పుడు చదువవలసిన శ్లోకం--

-:సాయంకాలం దీపం వెలిగించేటప్పుడు చదువవలసిన శ్లోకం:-

దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోహం l
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ll

భావం---
దీపం, దాని వెలుగు, రెండు పరబ్రహ్మ స్వరూపములు. చీకటిని తొలగించి , సర్వమును ప్రకాశింపజేయు ఓ సంధ్యాదీపమా ! నీకు నమస్కారం.......    


శ్రీ షిరిడి సాయిబాబా హారతి:

శ్రీ షిరిడి సాయిబాబా హారతి:

జోడూ నియాకరచరణి ఠేవిలామాధా
పరిసావీ వినంతీ మాఝీ పండరీనాధా
అసోనసో భావా‌ఆలో – తూఝియాఠాయా

క్రుపాద్రుష్టిపాహే మజకడే – సద్గురూరాయా
అఖండిత అసావే‌ఇసే – వాటతేపాయీ
తుకాహ్మణే దేవామాఝీ వేడీవాకుడీ
నామే భవపాశ్ హాతి – ఆపుల్యాతోడీ

ఉఠాపాండురంగా అతా ప్రభాత సమయో పాతలా |
వైష్ణవాంచా మేళా గరుడ-పారీ దాటలా ||
గరూడాపారా పాసునీ మహా ద్వారా పర్యంతా |
సురవరాంచీ మాందీ ఉభీ జోడూని హాత్
శుకసనకాదిక నారదతుంబర భక్తాంచ్యాకోటీ
త్రిశూలఢమరూ ఘే‌ఉని ఉభా గిరిజేచాపతీ
కలియుగీచా భక్తానామా ఉభాకీర్తనీ
పాఠీమాగే ఉభీడోలా లావుని‌ఉ‌ఆజనీ

ఉఠా ఉఠా శ్రీసాయినాధగురుచరణకమల దావా
ఆధివ్యాది భవతాప వారునీ తారా జడజీవా
గేలీతుహ్మా సోడు నియాభవ తమర రజనీవిలయా
పరిహీ అఙ్యానాసీ తమచీ భులవియోగమాయా
శక్తిన అహ్మాయత్కించిత్ హీ తి జలాసారాయా
తుహ్మీచ్ తీతేసారుని దావా ముఖజనతారాయా
అఙ్ఞానీ అహ్మీకితి తవ వర్ణావీతవధోరవీ
తీవర్ణితాభా గలే బహువదనిశేష విధకవీ
సక్రుపహో‌ఉని మహిమాతుమచా తుహ్మీచవదవావా
ఆదివ్యాధిభవ తాపవారుని తారాజడజీవా
ఉఠా ఉఠా శ్రీసాయినాధగురుచరణకమల దావా
ఆదివ్యాధిభవ తాపవారుని తారాజడజీవా
భక్తమనిసద్భావ ధరునిజే తుహ్మా‌అనుసరలే
ధ్యాయాస్తవతే దర్శ్నతుమచే ద్వారి ఉబేఠేలే
ధ్యానస్ధా తుహ్మాస పాహునీ మన అముచేఘేలే
ఉఖడునీనేత్రకమలా దీనబంధూరమాకాంతా
పాహిబాక్రుపాద్రుస్టీ బాలకాజసీ మాతా
రంజవీమధురవాణీ హరితాప్ సాయినాధా
అహ్మిచ్ అపులేకరియాస్తవతుజకష్టవితోదేవా
సహనకరిశిలె ఇకువిద్యావీ భేట్ క్రుష్ణదావా
ఉఠా ఉఠా శ్రీసాయినాధగురుచరణకమల దావా

ఆదివ్యాధి భవతాపవారుని తారాజడజీవా
ఉఠా ఉఠా పాడురంగా ఆతా – దర్శనద్యాసకళా
ఝూలా అరుణోదయాసరలీ-నిద్రేచెవేళా
సంతసాధూమునీ అవఘే ఝూలేతీగోళా
సోడాశేజే సుఖ్ ఆతా బహుజాముఖకమలా
రంగమండపే మహాద్వారీ ఝూలీసేదాటీ
మన ఉ తావీళరూప పహవయాద్రుష్టీ
రాయిరఖుమాబాయి తుహ్మాయే ఊద్యాదయా
శేజే హాలవునీ జాగే కారాదేవరాయా
గరూడ హనుమంత హుభే పాహాతీవాట్
స్వర్గీచే సురవరఘే ఉని ఆలేభోభాట్
ఝూలే ముక్త ద్వారా లాభ్ ఝూలారోకడా
విష్ణుదాస్ నామ ఉభా ఘే ఉనికాకడ

ఘే‌ఉనియా పంచారతీ కరూబాబాసీ ఆరతీ
ఉఠా‌ఉఠాహో బాంధవ ఓవాళు హరమాధవ
కరూనియా స్ధిరామన పాహుగంభీరాహేధ్యాన
క్రుష్ణనాధా దత్తసాయి జాడొచిత్త తుఝేపాయీ
కాకడ ఆరతీ కరీతో! సాయినాధ దేవా
చిన్మయరూప దాఖవీ ఘే ఉని! బాలకలఘు సేవా

కామక్రోధమదమత్సర ఆటుని కాకడకేలా
వైరాగ్యాచే తూవ్ కాఢునీ మీతో బిజివీలా
సాయినాధగురు భక్తి జ్వలినే తోమీపేటవిలా
తద్ర్వుత్తీజాళునీ గురునే ప్రాకాశపాడిలా
ద్వైతతమానాసునీమిళవీ తత్స్యరూపి జీవా
చిన్మయరూపదాఖవీ ఘే‌ఉనిబాలకలఘు సేవా
కాకడ ఆరతీకరీతో సాయినాధ దేవా

చిన్మయారూపదాఖవీ ఘే ఉని బాలకలఘు సేవా
భూ ఖేచర వ్యాపూనీ అవఘే హ్రుత్కమలీరాహసీ
తోచీ దత్తదేవ శిరిడీ రాహుని పావసీ
రాహునియేధే అన్యస్రధహి తూ భక్తాస్తవధావసీ
నిరసుని యా సంకటాదాసా అనిభవ దావీసీ
నకలేత్వల్లీ లాహీకోణ్యా దేవావా మానవా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకఘుసేవా
కాకడ ఆరతీకరీతో సాయినాధ దేవా

చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకఘుసేవా
త్వదూశ్యదుందుభినేసారే అంబర్ హే కోందలే
సగుణమూర్తీ పాహణ్యా ఆతుర జనశిరిడీ ఆలే!
ప్రాశుని తద్వచనామ్రుత అముచేదేహబాన్ హరఫలే
సోడునియాదురభిమాన మానస త్వచ్చరణి వాహిలే
క్రుపాకరునీ సాయిమావులే దానపదరిఘ్యావా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకఘు సేవా
కాకడ ఆరతీకరీతో సాయినాధ దేవా

చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకఘుసేవా.
భక్తీచియా పోటీబోద్ కాకడ జ్యోతీ
పంచప్రాణజీవే భావే ఓవాళు ఆరతీ
ఓవాళూ ఆరతీమాఝ్యా పండరీనాధా మాఝ్యాసాయినాధా
దోనీ కరజోడునిచరణీ ఠేవిలామాధా
కాయామహిమా వర్ణూ ఆతా సాంగణేకీతీ
కోటిబ్రహ్మ హత్యముఖ పాహతా జాతీ
రాయీరఖుమాబాయీ ఉభ్యా దోఘీదోబాహీ
మాయూరపించ చామరేడాళీతి సాయీంచ ఠాయి
తుకాహ్మణే దీపఘే ఉని ఉన్మనీతశోభా
విఠేవరీ ఉబాదిసే లావణ్యా గాభా
ఉఠాసాదుసంతసాదా ఆపులాలే హితా
జా‌ఈల్ జా‌ఈల్ హనరదేహ మగకైచా భగవంత
ఉఠోనియా పహటేబాబా ఉభా అసేవీటే
చరణతయాంచేగోమటీ అమ్రుత ద్రుష్టీ అవలోకా
ఉఠా‌ఉఠా హోవేగేసీచలా జ‌ఊరా‌ఉళాసీ
జలతిలపాతకాన్ చ్యారాశీ కాకడ ఆరతిదేఖిలియా
జాగేకరారుక్మిణీవరా దేవ అహేనిజసురాన్ త
వేగేలింబలోణ్ కరా-ద్రుష్టి హో ఈల్ తయాసీ
దారీబాజంత్రీ వాజతీ డోలు డమామే గర్జతీ
హోతసేకాకడారతి మాఝ్యా సద్గురు రాయచీ
సింహనాధ శంఖ బేరి ఆనందహోతోమహాద్వారీ
కేశవరాజ విఠేవరీ నామాచరణ వందితో
సాయినాధ గురుమాఝే ఆయీ
మజలా ఠావా ద్యావాపాయీ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై

దత్తరాజ గురుమాఝే ఆయీ
మజలా ఠావా ద్యావాపాయీ
సాయినాధ గురుమాఝే ఆయీ
మజలా ఠావా ద్యావాపాయీ
ప్రభాత సమయీనభా శుభ రవీ ప్రభాపాకలీ
స్మరే గురు సదా అశాసమయీత్యాఛళే నాకలీ
హ్మణోనికరజోడునీకరు అతాగురూ ప్రార్ధనా
సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా
తమా నిరసి భానుహగురుహి నాసి అఙ్ఞానతా
పరంతుగురు చీకరీ నరవిహీకదీ సామ్యతా
పున్ హాతిమిర జన్మఘే గురుక్రుపేని అఙ్ఞననా
సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా
రవి ప్రగటహో ఉని త్వరితఘాల వీ ఆలసా
తసాగురుహిసోడవీ సకల దుష్క్రుతీ లాలసా
హరోని అభిమానహీ జడవి తత్పదీభావనా
సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా
గురూసి ఉపమాదిసేవిధి హరీ హరాంచీ‌ఉణీ
కుఠోని మగ్ ఏ‌ఇతీ కవని యా ఉగీపాహూణి
తుఝీచ ఉపమాతులాబరవిశోభతే సజ్జనా
సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా
సమాధి ఉతరోనియా గురుచలామశీదీకడే
త్వదీయ వచనోక్తితీ మధుర వారితీసోకడే
అజాతరిపు సద్గురో అఖిల పాతక భంజనా
సమర్ధ గురుసాయినాధపుర వీ మనోవాసనా
అహాసుసమయాసియా గురు ఉఠోనియా బైసలే
విలోకుని పదాశ్రితా తదియ ఆపదే నాసిలే
ఆసాసుత కారియా జగతికోణీహీ అన్యనా
అసేబహుతశాహణా పరినజ్యాగురూచీక్రుపా
నతత్ర్వహిత త్యాకళేకరితసే రికామ్యా గపా
జరీగురుపదాధరనీసుద్రుడ భక్తినేతోమనా
సమర్ధ గురుసాయినాధపుర వీ మనోవాసనా
గురోవినతి మీకరీ హ్రుదయ మందిరీ యాబసా
సమస్త జగ్ హే గురుస్వరూపచి ఠసోమానసా
గడోసతత సత్కృ‌అతీయతిహిదే జగత్పావనా
సమర్ధ గురుసాయినాధపుర వీ మనోవాసనా

ప్రమేయా అష్టకాశీఫడుని గురువరా ప్రార్ధితీజేప్రభాతి
త్యాంచేచిత్తాసిదేతో అఖిలహరునియా భ్రాంతిమినిత్యశాంతి
ఐసే హేసాయినాధేకధునీ సుచవిలే జేవియాబాలకాశీ
తేవిత్యాక్రుష్ణపాయీ నముని సవినయే అర్పితో అష్టకాశీ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై

సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
జానాతుమనే జగత్ప్రసారా సబహీఝూట్ జమానా
జానాతుమనే జగత్ప్రసారా సబహీఝూట్ జమానా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
మై అంధాహూబందా ఆపకాముఝుసే ప్రభుదిఖలానా
మై అంధాహూబందా ఆపకాముఝుసే ప్రభుదిఖలానా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
దాసగణూకహే అబ్ క్యాబోలూ ధక్ గయీ మేరీ రసనా
దాసగణూకహే అబ్ క్యాబోలూ ధక్ గయీ మేరీ రసనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
రాం నజర్ కరో , అబ్ మోరేసాయీ
తుమబీన నహీముఝే మాబాప్ భాయీ – రాం నజర్ కరో
మై అంధాహూ బందా తుమ్హారా – మై అంధాహూ బందా తుమ్హారా
మైనాజానూ,మైనాజానూ – మైనాజానూ – అల్లా‌ఇలాహి
రాం నజర్ కరో రాం నజర్ కరో , అబ్ మోరేసాయీ
తుమబీన నహీముఝే మాబాప్ భాయీ – రాం నజర్ కరో
రాం నజర్ కరో రాం నజర్ కరో

ఖాలీ జమానా మైనే గమాయా మైనే గమాయా
సాధీ‌అఖిర్ కా సాధీ‌అఖిర్ ఆ – సాధీ‌అఖిర్ కా కీయానకోయీ
రాం నజర్ కరో రాం నజర్ కరో , అబ్ మోరేసాయీ
తుమబీన నహీముఝే మాబాప్ భాయీ
రాం నజర్ కరో రాం నజర్ కరో
అప్ నేమస్ జిద్ కా జాడూగనూహై
అప్ నేమస్ జిద్ కా జాడూగనూహై
మాలిక్ హమారే మాలిక్ హమారే
మాలిక్ హమారే – తుం బాబాసాయీ
రాం నజర్ కరో రాం నజర్ కరో , అబ్ మోరేసాయీ
రాం నజర్ కరో రాం నజర్ కరో

తుజకాయదే‌ఉ సావళ్య మీభాయాతరియో
తుజకాయదే‌ఉ సావళ్య మీభాయాతరియో
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ
ఉచ్చిష్ట తులాదేణేహి గోష్ట నాబరి యో
ఉచ్చిష్ట తులాదేణేహి గోష్ట నాబరి
తూ జగన్నాధ్ తుజచే కశీరేభాకరి
తూ జగన్నాధ్ తుజచే కశీరేభాకరి
నకో అంతమదీయా పాహూ సఖ్యాభగవంతా శ్రీకాంతా
మధ్యాహ్నరాత్రి ఉలటోనిగే లిహి ఆతా అణచిత్తా
జహో ఈల్ తుఝూరేకాకడా కిరా ఉళతరియో
జహో ఈల్ తుఝూరేకాకడా కిరా ఉళతరి
అణతీల్ భక్త నైవేద్యహి నానాపరి – అణతీల్ భక్త నైవేద్యహి నానాపరీ
తుజకాయదే‌ఉ మిభాయా తరియో
యుజకాయదే‌ఉ సద్గురు మీభాయా తరీ
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ.
శ్రీసద్గురు బాబాసాయీ హో – శ్రీసద్గురు బాబాసాయీ
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ – తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
మీ పాపిపతితధీమంతా – మీ పాపిపతితధీమంతా
తారణేమలా గురునాధా ఝుడకరీ – తారణేమలా సాయినాధా ఝుడకరీ
తూశాంతిక్షమేచామేరూ – తూశాంతిక్షమేచామేరూ
తుమి భవార్ణ విచేతారూ గురువరా
తుమి భవార్ణ విచేతారూ గురువరా
గురువరామజసి పామరా అతా ఉద్దరా
త్వరితలవలాహీ త్వరిత లలాహీ
మీబుడతో భవ భయ డోహీ ఉద్దరా
శ్రీ సద్గురు బాబాసాయీ హో – శ్రీ సద్గురు బాబాసాయీ హో
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై
రాజాధిరాజయోగిరాజ పరబ్రహ్మ సాయినాధ్ మహరాజ్
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై........




April 23, 2013

శ్రీ ఋణవిమోచన లక్ష్మి నృసింహ స్తోత్రం ....... భావసహితం.

శ్రీ ఋణవిమోచన లక్ష్మి నృసింహ స్తోత్రం ....... భావసహితం.  

దేవతాకార్య సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే 

దేవతలను అనుగ్రహించి, రాక్షస సంహారం చేయటం కోసం, స్తంభం నుండి అవతరించిన నృసింహస్వామీ నీకు నమస్సులు.   

లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

వామభాగాన లక్ష్మీదేవిచే ఆలింగనం చేయబడి, భక్తులు కోరిన వరాలు ప్రసాదించే కల్పతరువైన లక్ష్మీవల్లభా నీకు నమస్సులు.    

ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

శత్రువైన హిరణ్యకశిపుడి సంహారనంతరం అతని పేగులనే మాలగా ధరించి, శంఖు, చక్రం మొదలగు వివిధ ఆయుధాలను ధరించిన నృసింహస్వామి! నన్ను ఈ అప్పుల నుండి కాపాడమని నిన్ను ప్రార్థిస్తున్నా.       

స్మరణాత్సర్వపాపఘ్నం కద్రూజ విషనాశనం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

కేవలం నీ  నామస్మరణతోనే అన్ని పాపాలను తరిమికొట్టే ఓ నృసింహస్వామి! నీకు నమస్సులు.  

సింహనాదేన మహతా దిగ్దంతి భయనాశనం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

శత్రు సంహారానంతరం నరసింహస్వామి చేసిన వీర ఘర్జన, భక్తులలో అన్ని దిక్కులలో ఉన్న భయాలను తొలగించేటట్టుగా ఉన్నది. అట్టి స్వామి! నీకు నమస్సులు.   

ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

ప్రహ్లాదునిపై కరుణావర్షం కురిపించి, హిరణ్యకశిపుని సంహరించిన ఆ లక్ష్మీనరసింహస్వామికి ప్రణామములు.   

క్రూరగ్రహైః పీడితానాం భక్తానా మభయప్రదం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

దుష్టగ్రహ బాధల నుండి తక్షణ విముక్తి ప్రసాదించి, భక్తులకి అభయాన్ని ప్రసాదించే స్వామికి వందనములు.   

వేదవేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాది వందితం
శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

వేదాలకు సారమైన స్వామి, అన్ని యజ్ఞయాగాదులకు ఈశ్వరుడై ఉండి బ్రహ్మరుద్రాదులచే సదా కీర్తించబడుతున్న నృసింహస్వామి, ఆర్ధిక ఇబ్బందులనుండి మమ్ములను ముక్తులుగా చేయమని నిన్ను ప్రార్థిస్తున్నా.      

య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితం
అనృణీ జాయతే సద్యో ధనం శీఘ్రమవాప్నుయాత్

ఈ శ్లోకాన్ని ప్రతీరోజు ఎవరైతే నిత్యమూ మూడు పూటలా త్రికరణశుద్ధిగా చదువుతారో, వారు తమకున్న అన్ని ఋణబాధలనుండి విముక్తి లభించటమే కాక తమకు న్యాయంగా రావలసిన సొమ్ము కూడా త్వరగా తిరిగి లభిస్తుంది. 

ఇతి ఋణవిమోచన నృసింహస్తోత్రం సమాప్తం. 

(ఈ స్తోత్రాన్ని అన్ని అరిష్టాలు, దోషాలు, ఆర్ధిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు సాయం సమయంలో ఒకసారి స్మరిస్తే మంచి ఫలితం లభిస్తుంది.)    




April 22, 2013

-: ఏకశ్లోకీ రామాయణం :-

-: ఏకశ్లోకీ రామాయణం :-


అదౌ రామ తపోవనానుగమనమ్ హత్వా మృగం కాంచనం 
వైదెహీ హరణం జటాయుమరణం సుగ్రీవసంభాషణం ll 
వాలేహ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం 
పశ్చాద్రావణ కుంభకర్ణహననం చైతద్ధి రామాయణం ll 



-:ఏకశ్లోకీ భగవద్గీత:-

-:ఏకశ్లోకీ భగవద్గీత:-

అదౌ కౌరవపాండవాజి గమనం శంఖస్వనోజ్జ్రుంభణ 
మధ్యేసైన్య రథార్పణం సుతసుహ్రుద్బంధు ప్రజా దర్శనం ll 
గాండీవఛ్యుతి యుద్ధ సంవిరమణం తత్త్వోపదేశాత్ పరం 
కార్యేకర్మణియోజనంచ భగవద్గీతామృతం చింతితమ్ ll 

భగవద్గీతని చదవలేనివారు ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే.....భగవద్గీతని మొత్తం చదివిన ఫలితం వస్తుంది...



దేవాలయమునకు వెళ్ళేటప్పుడు చేయకూడని పనులు

దేవాలయానికి వెళ్ళేటప్పుడు చేయకూడని పనులు:---


మనం పుణ్యం కోసం, పుణ్యక్షేత్రాలని దర్శిస్తూ ఉంటాము. ఆలయ సందర్శనం ద్వారా పుణ్యం సంపాదించటం మాట అటుంచితే, పాపం పొందకుండా ఉంటే అంతే చాలును. ఇదేదో వింతగా ఉంది అని అనుకుంటున్నారా ! ఇది పరమసత్యమని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆలయానికి వచ్చినవారు తమకి తెలియకుండానే కొన్ని దోషాలు చేస్తుంటారట...అవేవో మనం కూడా కొన్నిటిని తెలుసుకుందాము....

ఆలయ సమీపమువరకు వాహనము పై రాకూడదు......

చెప్పులు దూరంగా వదిలి, కాలినడకనే రావలెను

పెద్దలకి & భగవంతునికి ఒంటి చేతితో నమస్కరించకూడదు 

అలాగే కొంతమంది ఆత్మ ప్రదక్షిణ అని చెప్పి, భగవంతుని ఎదుటే ప్రదక్షిణ చేస్తారు....కాని అలా చేయకూడదు.... ఆలయం చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేయవలెను.... 

చాలామంది దర్శనానంతరము భగవంతుని ఎదురుగా, కాళ్ళుచాపి కూర్చుంటారు... అట్లు కూర్చొనుట మహాపాపము....

భగవంతుని ఎదుట ఎత్తైన ఆసనములపై కూర్చొనుట మహాపాపము.... 

ఆలయములో నిద్రించకూడదు & భోజనం చేయకూడదు....

భగవంతుని ఎదుట మన కస్టాలు చెప్పుకుని కంటనీరు పెట్టకూడదు.... 

ఆలయంలో ఉన్న సమయంలో ఎవరిమీద కోపగించకూడదు......

ఎవరైనా మనల్ని సాయమడిగితే... నేనున్నానని చెప్పి..కాపాడేవారి వలే అభయమివ్వకూడదు...ఎందుకంటే అందరిని కాపాడేది ఆ భగవంతుడే కదా....

కోర్కెలు సిద్ధించుట కొరకు పూజలు చెయ్యకూడదు..... 

ఏ కాలంలో వచ్చే పండ్లని ఆ కాలంలో భగవంతునికి సమర్పించకుండా ఉండకూడదు...... 

భగవంతునికి వెనుదిరిగి కూర్చోనకూడదు

భగవంతుని ఎదుట ఇతరులకు నమస్కరించకూడదు & ఇతర దేవతలని నిందించకూడదు. 

వీటిలో ఇంతవరకు మనం కొన్నింటినైన చేసి ఉంటాము.... కనుక ఇప్పటికైనా తెలుసుకున్నాము కాబట్టి ఇటువంటి దోషాలు చెయ్యకుండా భగవంతుని పరిపూర్ణంగా దర్శించుదాము... ఇకమీదనైన మనం జాగ్రత్తపడదామా !!!



రామ రక్షాస్తోత్రం

రామ రక్షాస్తోత్రం

బుధ కౌశిక ఋషి
ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః

శ్రీ సీతారామ చంద్రోదేవతా
అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః
శ్రీమాన్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగఃll 

ధ్యానమ్
ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం

పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్ ll 


స్తోత్రమ్
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్

ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ ll 

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్
జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్ ll 

సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్
స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుమ్ ll 

రామరక్షాం పఠేత్ప్రాఙ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్
శిరో మే రాఘవః పాతుఫాలం దశరథాత్మజః ll 

కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్ర ప్రియః శృతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ll 

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరత వందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ll 

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః ll 

సుగ్రీవేశః కటీపాతు సక్థినీ హనుమత్-ప్రభుః
ఊరూ రఘూత్తమః పాతు రక్షకుల వినాశకృత్ ll 

జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః
పాదౌవిభీషణ శ్రీదఃపాతు రామో‌உఖిలం వపుః ll 

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ll 

పాతాళ భూతల వ్యోమ చారిణశ్-చద్మ చారిణః
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః ll 

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరన్
నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి ll 

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః ll 

వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాఙ్ఞః సర్వత్ర లభతే జయ మంగళమ్ ll 

ఆదిష్టవాన్ యథాస్వప్నే రామ రక్షా మిమాం హరః
తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః ll 

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్
అభిరామ స్త్రిలోకానాం రామః శ్రీమాన్సనః ప్రభుః ll 

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణా జినాంబరౌ ll 

ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ll 

శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్టా సర్వ ధనుష్మతాం
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ll 

ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ
రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథిసదైవ గచ్ఛతాం ll 

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః ll 

రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ll 

వేదాంత వేద్యో యఙ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః ll 

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేథాధికం పుణ్యం సంప్రాప్నోతి నసంశయః ll 

రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతావాససం
స్తువంతి నాభిర్-దివ్యైర్-నతే సంసారిణో నరాః ll 

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందేలోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్ ll 

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ll 

శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ ll 

శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే ll 

మాతారామో మత్-పితా రామచంద్రః
స్వామీ రామో మత్-సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ న జానే ll 

దక్షిణేలక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
పురతోమారుతిర్-యస్య తం వందే రఘువందనమ్ ll 

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథం
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే ll 

మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ll 

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ll 

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం ll 

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదాం
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ ll 

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర ll 

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ll 
ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణం ll

(ఈ రామరక్షాస్తోత్రాన్ని ఉగాది మొదలుకుని----శ్రీరామనవమి వరకు, అనగా వసంత నవరాత్రులలో, ప్రతీరోజు 11 సార్లు చదివితే, కోరిన కోర్కెలు నెరవేరుతాయి. అలా చేయలేని వారు 9, 7, 5, 3, అదీ కూడా చేయలేనివారు కనీసం రోజుకి ఒక్కసారి ఐనా చదవవచ్చును.... పుణ్యము వస్తుంది, మన కోర్కెలు తీరుతాయి.)