April 22, 2013

భోజనము చేసే ముందు --తరువాత.. చదువవలసిన శ్లోకం:--

భోజనము చేసే ముందు చదువవలసిన శ్లోకం:--

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ-మాశ్రితః |
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||

భావం:--
అర్జునా ! సర్వేశ్వరుడనైన నేను ప్రాణులయొక్క శరీరములందు జటరాగ్నిగాచేరి ప్రాణ, అపానవాయువులతో కూడి, జీవులు భుజించిన, భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములను జీర్ణింపచేయుచున్నాను.... 

భోజనం అయిన తరువాత చదువవలసిన శ్లోకం:--

అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ |
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ ||


భావం:--
వాతాపియను రక్కసుని జీర్ణించుకొన్న అగస్త్యుని, గొప్ప జీర్ణ శక్తిగల కుంభకర్ణుని లోన అగ్నిగల జమ్మిని, సముద్రజలమును శోషింపజేయు బడబాగ్నిని, అంగుష్ఠ ప్రమాణమైన జటరాగ్నిగల భీమసేనుని జీర్ణశక్తిని వృద్ధిపరచుటకై స్మరించుచున్నాను...





No comments:

Post a Comment