April 26, 2013

ఫాల్గుణ పౌర్ణమి

ఫాల్గుణ పౌర్ణమి....

ఫాల్గుణ పౌర్ణమి రోజున హోలీ పర్వదినము అందరమూ జరుపుకుంటాము.....కాని ఆ రోజున మరో విశేషమైన రోజు కూడా .....అదేమిటంటే సింహాచలము లో వెలసిన శ్రీలక్ష్మివరాహనృసింహ స్వామి యొక్క పెళ్ళిచూపులు జరిగిన రోజు.....ఆ రోజున స్వామి కొండపైనుండి క్రిందికి దిగి వచ్చి........ గ్రామదేవతలైన, పైడితల్లమ్మ, బంగారమ్మ(సోదరిమణులు)ల కుమార్తెలను తనకిచ్చి వివాహము జరిపించవలసినదిగా, పురోహితులను మధ్యవర్తులుగా రాయబారము పంపుతారు. స్వామి దిగువనున్న పుష్కరిణి ఉద్యానవనములో విడిది చేస్తారు. చివరికి పెల్లిమాటలు కుదిరిన తదుపరి ప్రజలు ఆనందంతో ఒకరిపై ఒకరు వసంతాలు జల్లుకుని ఆనంద పరవసులౌతారు. స్వామి కుడా ఆనందంతో పరవసులై గ్రామప్రజలందరికి తన వివాహనిశ్చయ విషయం చెప్పి తన కళ్యాణానికి ఆహ్వానము పలుకుతూ గ్రామ తిరువీధి చేసుకుని మరల కొండపైకి వెళతారు..... స్వామి వివాహము చైత్ర శుద్ధ ఏకాదశి నాడు రాత్రి జరుగును..... స్వామి వివాహానికి అందరూ పెద్దలే, ఆహ్వానితులే........ ఈ ఫోటో హోలీ రోజున  సింహాచలము వెళ్ళి, స్వామిని దర్శించి తీసినది..



No comments:

Post a Comment