June 11, 2013

వీర్రాజు గారి "సూక్తి సుమమాల" 1 నుండి 10 వరకు పద్యాలు.

శ్రీ గుల్లల వీర్రాజు గారి "సూక్తి సుమమాల"
అనే నీతి పద్యములు నుండి 1 వ పద్యము....

1 వ పద్యము
శ్రీకారము ముఖ్య మరియు
ప్రాకారమ్ము వలె నుండు ప్రారంభములో
శ్రీకారముతో మొదలిడి
నేక బిగిని సాగగల దదే పనియైనన్ ll

2 వ పద్యము.
తల్లిని తండ్రిని గురువును
ఎల్లప్పుడూ తలచుకొనుచు ఎదలో నయినన్
కల్లని ఎపుడును దలచకు
కొల్లలు శుభముల్ నిజముగ కల్గును నీకున్ ll 

3 వ పద్యం
అక్కల చెల్లెల తమ్ముల
నెక్కువగా గౌరవించు నెవ్వరు గానీ
పెక్కురు నున్నగ లందును
చక్కని వారిని సతతము సరియని గొప్పన్ ll

4 వ పద్యము.
సత్యము చెప్పుట మంచిది
నిత్యము నీవాచరించు నీతిని వీడకన్
అత్యధిక సంఖ్య నయినను
ముత్యము వలె మెరయచుండు ముదముగ నీవున్ ll

5 వ పద్యము.
తప్పులు చేయకు మెపుడును
జెప్పిన మాటలు వినినను జెరుపని రాదే
ఎప్పుడు గొప్పలు చెప్పకు
ముప్పే వాటిల్లు నీకు ముఖ్యంబిదియున్ ll

6 వ పద్యము.
బెల్లంబుండిన చీమలు
కొల్లలుగా చేరునటకు కోరిక తోడన్
కొల్లలుగ ధనంబుండిన
ఎల్లరు నిను చేరుచుంద్రు ఎప్పుడు వీడకన్ ll

7 వ పద్యము.
కలిమియు కల్గిన నీకున్
చెలిమిని చేయగ పరుగిడి చెంతకు చేరున్
కలిమిని గోల్పోయిన తరి
చెలిమిని విడనాడి ఎవరు చేరరు పిదపన్ ll

8 వ పద్యము.
ధనమును సంపాదించియు
తినకన్ తనవారికీక తిరుగుచు నుండున్
కనినన్ చోరుడు దోచును
కునుకైనను రాక తుదకు కూలును నిలువన్ ll


9 వ పద్యము.
తనకున్ తినగా నిడుకొని
తినకుండిన వారికినిడి తినెదరు బ్రీతిన్
అనయును నిను కొనియాడుచు
వినయముతో దిరుగు చుండ్రు వినుడీ నిజమున్ ll

10 వ పద్యము.
పదవులకోసము పరిపరి
విధములుగా నడచు చుండు వినయము తోడన్
పదవిన్ బొందిన తదుపరి
విధముగా జూడనేంచు వెరువక ఎపుడున్ ll

No comments:

Post a Comment