June 23, 2013

వీర్రాజు గారి పద్యములు 61 నుండి 70 వరకు

61 వ పద్యము.

ఎక్కడ జూచిన ఘోరము 
లెక్కువగా గోచరించె ఎమిట వింతా 
ప్రక్కనె చేరియు గోతిలో 
చక్కగ త్రోయంగ జూచు చదువరి యయినన్ ll  

62 వ పద్యము. 

పందిని పన్నీరు చిలికి 
అందముగా చేయబూన అవివేకమ్మే 
ఎందరు ఏ విధి జూచిన 
ముందుగ మురికున్న చోట ముదముగ జేరున్ ll 

63 వ పద్యము.

పుచ్చిన వాటిని తినుటకు 
వచ్చెడి వారెవరైనను వసుధను గలరా 
మ్లేచ్చుని చేరగరా రే 
మిచ్చినగానీ చివరకు మెచ్చరు ఎవరున్ ll

64 వ పద్యము.

చోరుడు వ్యభిచారియు మది 
కోరును చీకటినెపుడున్ కోరిక తీరన్ 
కారణము లేవియైనను 
చేరును గమ్యము చివరకు చీకటి యున్నన్ ll 

65 వ పద్యము.

పగతోనే పని చేయగ 
నెగబడకేనాడు నీవు నెవ్వరి తోడన్ 
పగవారెవ్వరు నుండరు 
జగతిని తిలకించవేమి జాలితో నీవున్ ll  

66 వ పద్యము.

కులమేది గోత్రమేదని 
నిలదీసి యడుగు నెపుడు నీతిగ నున్నన్ 
దలచడు ధనవంతుడైన 
కులగోత్రములను విడచియు కోరును చెలిమిన్ ll

67 వ పద్యము.

కలిమే మనిషికి ముఖ్యము 
పిలవరు దరినున్నగాని పేదను ఎవరున్ 
కలకాలము కలిముండదు 
నిలచును చెలిమే ధరిత్రి నిజముగ వినుమా ll

68 వ పద్యము.

లేడే దేవుడటంచును 
నాడెడి మాటలు నిజమని యనుటకు లేదే 
వాడే తలచును దేవుని 
నేడే కాకున్న తుదకు నిక్కము సుమ్మీ ll 

69 వ పద్యము.

నాస్తికుడనే నటంచును 
నాస్తికులదరిన మితముగ నరచునునన్నీ 
స్వస్తియను వారి చరితలు 
వాస్తవమే మనగ యింట పడతియె తెలుపున్ ll

70 వ పద్యము.

నేరుగా గుడిలోపలికే 
చేరినవానిని గనితను చెలిమితో యడుగన్ 
కోరిన సతితో కోవెల 
తీరునుగన వచ్చితినని తెలివిగ జెప్పున్ ll    


No comments:

Post a Comment